రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని నానుడి. వర్తమాన రాజకీయాల్లో ఆ వైనానికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబునాయుడు. నిన్నా మొన్నటివరకూ అధికశాతం తెలుగువారి దృష్టిలో ఆయనో విజనరీ ముఖ్యమంత్రి. రాజకీయాల్లో అపర చాణక్యుడు. సాక్షాత్తూ ఎన్టీయార్‌కే పొగబెట్టగలిగిన సమర్ధుడు, సాహసికుడు. మరో చాణక్యుడు, ఒకనాటి తన సావాసగాడు వైఎస్ ముప్పేట దాడిని ఐదేళ్లు తట్టుకుని పార్టీని కాపాడుకున్న ఘటికుడు. ఏడాది కిందటివరకూ – అధికారం కోల్పోవటానికైనా సిద్ధపడతాడే తప్ప, ఆంధ్ర ప్రదేశ్ సమైక్యత విషయంలో మడమ తిప్పడని మన్ననలందుకున్నవాడు. సమైక్యాంధ్ర నినాదంతో 2004 ఎన్నికల్లో ఓడిపోయినా, ఆ తర్వాత పలువురు ముఖ్య నేతలను పార్టీకి దూరం చేసుకున్నా తన విధానానికే కట్టుబడ్డ మొండివాడు. మరి ఇప్పుడో – చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుందామనుకుని ఆచి తూచి తీసుకున్న ఒకే ఒక తప్పుడు నిర్ణయం తెలుగుదేశం భవిష్యత్తుని గాల్లో దీపంలా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప మరేమీ చేయలేని అశక్తుడు, చేష్టలుడిగి చేతులెత్తేసిన దైన్యుడు. తెదేపా పరిస్థితిప్పుడు రెంటికీ చెడ్డ రేవడి. కొందరి ఒత్తిడికి లొంగిపోయి విధానాలు మార్చుకున్నందుకు జరిగిన శాస్తిది.
పదేళ్లపాటు తమపై పోగుపడ్డ వ్యతిరేకతకి ప్రతిపక్షాలు ఏకమవటం, విద్యుత్ వివాదం, నాలుగేళ్ల క్షామం, ఇంకా ఇతరత్రా కారణాలు జతపడి 2004 ఎన్నికల్లో కుదేలైనా, ఆ ఎన్నికల్లో సమైక్యవాదంతో తాము తెలంగాణలో గెలిచిన స్థానాలు కోస్తా, సీమల్లో ఉమ్మడిగా సాధించిన స్థానాలకన్నా ఎక్కువ అని మర్చిపోయి 2009 ఎన్నికల్లో అప్పటికే కొనఊపిరితో కొట్టుకుంటున్న తెరాసతో జట్టు కట్టటం బహుశా చంద్రబాబు ముప్పయ్యేళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తెరాసకన్నా గోడమీది పిల్లివాటం ప్రదర్శించిన తెదేపా, కాంగ్రెస్‌లే ఎక్కువ స్కోరు చెయ్యటం గమనించాకైనా లెంపలేసుకుని మళ్లీ సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానేసుకోకపోవటం తప్పు మీద తప్పు. మనసులో సమైక్యతా మంత్రమే పఠిస్తున్నా, ఆ సంగతి బయటికి చెప్పకుండా ‘కాంగ్రెస్ ఎటూ తెలంగాణ ఇవ్వదుగా, మనమూ నంగనాచి కబుర్లే చెబితే పోలా’ అనుకోటం ఇన్ని తిప్పలు తెచ్చి పెడుతుందని చంద్రబాబు కలలో సైతం ఊహించి ఉండకపోవచ్చు. చరిత్రని మలుపు తిప్పినవన్నీ ఊహాతీత సంఘటనలేనని అంతటి అనుభవజ్ఞుడూ మరచిపోవటం వింతల్లో వింత! కాంగ్రెస్ నైజం తెలిసీ, ఎదుటి పక్షాన్ని దెబ్బతీయటానికి ఎంతకైనా తెగిస్తుందనీ, ఎన్ని మాటలైనా మారుస్తుందనీ ఎరిగీ ఏమరుపాటుగా ఉండటం ఆత్మహత్యా సదృశం. ఇప్పుడనుభవిస్తున్నది దాని ఫలితం.
అటు కాంగ్రెస్ పార్టీకి సైతం ‘అర్ధరాత్రి కేక్ కటింగ్’ ప్రయోగం అనుకోని విధంగా వికటించి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోనూ పార్టీ ఉసురు తీసేసే పరిస్థితే. ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు వెనకడుగు వేస్తే తెలంగాణలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవటం తధ్యం. అలా కాక, రాష్ట్రం చీలికకే కట్టుబడ్డా ఆ క్రెడిట్ తెరాసకే పోవటం, రాబోయే కొన్నేళ్ల పాటు తెలంగాణలో కనీసం సగం జిల్లాల్లో తెరాస హవా నడవటం ఖాయం. ప్రస్తుతం ఉనికే లేని తెలంగాణ జిల్లాల్లో సైతం తెరాస ప్రాబల్యం ఎంతో కొంత పెరగటమూ ఖాయమే. మొత్తమ్మీద – రెండు వారాల కిందటివరకూ చచ్చిన పాములా పడున్న కేసీయార్‌కీ, తెరాసకీ లేనిపోని అత్యుత్సాహంతో అనవసర ప్రయోగాలకి పోయి నూతన జవసత్వాలు తొడిగిన ఘనత మాత్రం కాంగ్రెస్‌దే. ఇటు కోస్తా/సీమల్లోనూ కాంగ్రెస్‌పై వెల్లువెత్తిన ఏహ్యభావం ఇప్పుడిప్పుడే ఉపశమించే సూచనలు లేవు. ఆ వారా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం మార్చుకున్నా, మార్చుకోక పోయినా ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి బోడిగుండే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ని భూస్థాపితం చెయ్యటానికి ఇంతకన్నా పెద్ద అవకాశం చంద్రబాబుకి మరోటి వచ్చుండేది కాదు – ఆయన కొంత తెలివిగా వ్యవహరించి రెండు మూడు నెలల కిందటే ఏం జరిగితే అదే జరుగుతుందనుకుని ‘మా పార్టీ విధానం సమైక్యాంధ్రే’ అని తెగేసి చెప్పుంటే. ఆయనే ఆ పని చేసుంటే నేడు కోస్తా, సీమల్లోనూ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ, హైదరాబాదులోనూ తెదేపాకి ఎదురే ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ నుండి సైతం తెదేపాకి వలసలు వెల్లువెత్తేవి. కేడర్ కూడా కరువై కాంగ్రెస్ మట్టి కరిచేది.
అయితే, చరిత్రలో ‘ఐతే’లకీ, ‘కానీ’లకీ స్థానం లేదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడనుకుని లాభం లేదు. ఇప్పటికి మాత్రం తెదేపా పరిస్థితి అగమ్య గోచరం. జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైనా తట్టుకోగల శక్తి దానికుంది. ఓ ప్రాంతీయ పార్టీగా తెదేపాకి ఆ వెసులుబాటేదీ? గోడ మీది పిల్లి వాటం ప్రదర్శించినందుకూ, వరసవెంబడి పిల్లి మొగ్గలేసినందుకూ, ఆ వేసినవి కూడా సరైన సమయంలో వెయ్యనందుకూ, వెయ్యాల్సిన మొగ్గొకటి ఇంకా బాకీ పడ్డందుకూ చంద్రబాబు చెల్లించబోతున్న మూల్యం ఇది. వంద రోజుల క్రితమే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ శకం ఊహించని విధంగా ముగిసింది. ఇప్పుడు చంద్రబాబు శకమూ అలాగే ముగియనుందా? ఒకనాడు రాజకీయ టెండూల్కర్‌గా పేరుబడ్డ బాబు ఫామ్ పూర్తిగా కోల్పోయాడా? లేక అనూహ్యమైన ఎత్తేదైనా వేసి ప్రత్యర్ధులని చిత్తు చేస్తాడా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఆ అవకాశాలు కనిపించటం లేదు. ప్రస్తుతానికి చంద్ర గ్రహణం తప్పేలా లేదు. అదెన్నాళ్లుంటుందో కాలమే చెప్పాలి.
ఇవ్వాళ్ళ రేపు చంద్రబాబు నాయుడు ని గాని కాంగ్రెస్ పార్టీ ని గాని AP లో ఎవ్వరు నమ్మరు. State విడిపొఇన పోక పోఇన తెలంగాణా జిల్లా లో TRS హవా నడుస్తుంది. మిగిలిన State మొత్తం లో ఎవ్వరితే United AP అంటారో వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు చిరంజీవి కావొచ్చు లేదా జగన్ నాయకత్వం లో కొత్త పార్టీ YSR Congress కావొచ్చు.
టి అర్ ఎస్ హవా నడిచినా వాళ్ళు సెంట్రల్ కాంగ్రెస్స్ కే సపొర్ట్ ఇస్తారు.. (కృతజ్ఞత ???) .. కొస్తా రాయలసీమ లొ మళ్ళి చిరంజీవి వొట్లు చీలిస్తే కాంగ్రెస్స్ ఎన్నొకొన్ని సీట్లు పట్టుకుపొదామని వాళ్ళ ప్లాన్ కావచ్చు.. కొస్తా ప్రజలకి కొంతాయినా సిగ్గువుంటే ఈ సారి కాంగ్రెస్స్ కి నుంచొవడానికి అబ్యర్దులు దొరకకూడదు.
ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకంగా పొరాడుతున్న సమయంలో తమిళోడు ఎనౌన్స్ చేసాడని మరో ప్రాంతీయ విభేదం సృష్టికర్త మన చంద్రబాబు. దానికి ప్రజల(తెలుగుదేశం వాళ్ళు) అమోదం కూడా వచ్చేసింది.
మంచుపల్లకీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీనామా చేసారు. సమైకాంధ్ర కోసం పొరాడుతున్న లగడపాటి కాంగ్రెస్సే.
అసలు రాజకీయం ముందుంది.
చిరంజీవి బతికి ఉండి ఆయన “ఎదో రాజ్యం” పార్టీ కాంగ్రెస్ పంచన పాలె “కాపు” గా ఉన్నంత కాలం కొస్తా ప్రాంతం లొ, కాంగ్రెస్ కు మాత్రం ఎదురుండదు 🙂 తెలంగాణా ఇచ్చినా, ఇవ్వకున్నా, అది కాంగ్రెస్ లెక్క.
అసలీ లగడపాటిని కాంగీనే ఎగదోసిందా అన్న అనుమానం కూడా వస్తుంది, క్రెడిట్ వెరె పార్టీ లకు వెళ్ళకుండా!!
రాష్ట్రంలో కాంగ్రెస్ మట్టిగొట్టుకుపోవడం ఖాయం! మరి మనకున్న ప్రత్యామ్నాయం తెలుగుదేశమేగా! ప్రస్తుతం బాబు మళ్ళీ సమైక్య రాగం ఆలపిస్తున్నాడు కాబట్టి (తెలంగాణా జిల్లాల్లో వదిలేసినా) వాళ్ళదే అధికారం! సీమాంధ్ర నుంచి ఇంత వ్యతిరేకత ఊహించలేదని ఒప్పుకున్నాడు. ఇంత వ్యతిరేకత నిజంగానే ఎవరూ ఊహించనిదే!
కృష్ణ గారి డౌట్ బాగానే ఉంది!
కానీ లగడపాటి ఓవారాక్షన్ తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇలాంటి అతి గాళ్లవల్లే ఉద్యమాలు నీరు గారి నవ్వులపాలయ్యేది.
సుజాత గారూ! ఇంత జరిగినా ఇంకా చంద్ర బాబు ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని అంటున్నాడు కానీ, అందు వల్ల మా పార్టీ సమైక్య వాదాన్నే సమర్థిస్తుందని చెప్పలేదు కదా. ప్రజలు చంద్రబాబును నమ్ముతారంటారా?
@Krishna : కాంగ్రెస్ వాళ్ల లెక్కలు చెబుతున్నావంటే, ఆ జాతేనా?
రవిచంద్రగారు కెసిఆర్ లాంటి మాయల మరాటీ ని నమ్మిన ప్రజలు చంద్ర బాబు ని నమ్మరా. మీరు ఎన్ని అయినా చెప్పండి …. ఎన్నికల ముందు నలభై ఎనిమిది గంటల్లో పంచిన డబ్బు సార ప్రధాన భూమిక వహిస్తున్నప్పుడు ….. ప్రజల నమ్మకాలతో పనేంటిఅసలు
Chandrababu koodaA avunu annAdanE, telangana ki okay annadi. yedemainA CBN telangana ki chEyavalsina mElu chesAdu, ippudu Andhra vAllu Ayana first priority kAbatti vAllaki support chestunnadu.
ayina YSR ila urgent ga pothadani CBN anukoledu kada…aayane undi unte CBN kooda manchivadayyevadu 🙂
@రవి చంద్ర
bhalEvarE , enduku nammaru?? annipartilu ippudu chepthunnadi okate…vallandarni nammithE, CBN nu kooda nammi teerali …telangana vallu nammaka poyina CBN ki ippudu poyedem vundi ..aayana avasaram unte vAllE vastAru 🙂
@ A2Z : సంతొష్ కుమార్ గారు రాసింది చూడండి..
http://kovela.blogspot.com/2009/12/blog-post_16.html
ఓ పక్క రాష్ట్రం రగిలిపోతుంటే మరో పక్క ‘తెలంగాణ తెలుగుదేశం’ ఏర్పాటు పేరుతో కామెడీ ప్రహసనాలు సాగుతున్నాయి. అలా ఏర్పాటు చేస్తే, అధికారికంగానే అక్కడో రకంగా, ఇక్కడో రకంగా వాదించి ప్రజల్ని మరింత బాగా వెర్రోళ్లని చెయ్యొచ్చని పార్టీలో తల పండిన తింగరోడెవరో సెలవిచ్చాట్ట! పన్లో పనిగా జిల్లాకో తెదేపా పార్టీ ఏర్పాటు చేస్తే ఇంకా పసందుగా ఉంటుంది. అప్పుడు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు జిల్లాకో రకంగా విచ్చలవిడిగా వాగేసుకుంటూ ప్రజలకి కరువు తీరా వినోదం అందించొచ్చు. ఈవెన్ బెటర్, పార్టీలో రెండు పోటా పోటీ వర్గాలున్న జిల్లాల్లో రెండేసి తెదేపా పార్టీలు ఏర్పాటు చేసేసి ఒక్కో దానికీ ఒక్కో వర్గం నాయకుడ్ని అధినేతగా ప్రకటించేస్తే వర్గ విభేదాలూ ఒక్క దెబ్బకి అదుపులోకొస్తాయి.
తెదేపా విన్యాసాలు అలాగుంటే, ఇటు కాంగ్రెసోళ్ల మల్లగుల్లాలూ తక్కువేం లేవు. తరచి చూస్తే తెదేపాకన్నా కాంగ్రెస్‌కే ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దెబ్బ తగిలేట్లుంది. కోస్తా/సీమల్లో తెదేపా మరీ ఎక్కువగా నష్టపోక పోవచ్చు. ఎవరికి చెక్ పెట్టటానికి చేశారో కానీ, మొత్తమ్మీద కాంగ్రెస్ పరిస్థితి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. ఈ విషయంలో యూపీయే భాగస్వామ్య పక్షాలు సైతం కాంగ్రెస్‌ని నిలదీశాయని నేటి వార్త. తెలంగాణ తీర్మానమ్మీద వెనక్కి తగ్గే సూచనలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. అయితే అది కర్ర విరక్కుండా, పాము చావకుండా ఉండే ఏదో ఓ ప్రకటన రూపంలో ఉండొచ్చు.
ఏతావాతా, ఈ దుందుడుకు చర్యతో జరిగిన మేలొకటుంది. మొన్నటిదాకా ‘తెలంగాణ వచ్చే సూచనలుంటే అప్పుడు చూసుకుందాంలే’ అనుకుంటూ చోద్యం చూసిన సమైక్యవాదుల బలం ఈ రోజు వెల్లడయింది. ఎదురు చెప్పేవాడు లేడని ఇన్నాళ్లూ వీరంగమేసిన వేర్పాటువాదులు ఈ దెబ్బతో దిమ్మెరపోయుంటారు. ఇప్పుడు గనక ప్రత్యేకవాదం మట్టికరిచిందంటే మళ్లీ దాన్ని నెత్తినేసుకునే ధైర్యం భవిష్యత్తులో ఏ రాజకీయ నిరుద్యోగీ చేయకపోవచ్చు.
ఇదే ఊపులో ప్రత్యేకవాదానికి గోరీ కట్టాలి. పరిస్థితులు సద్దుమణిగాక, రాబోయే కాలంలో అభివృద్ధి మొత్తం హైదరాబాదులో కుప్ప పోయకుండా ఆంధ్రా/సీమలకూ మళ్లించాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వెనకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చెయ్యాలి. ప్రతి చోటా ప్రభుత్వోద్యోగాలు సగం స్థానికులకీ, సగం స్థానికేతరులకీ కేటాయించాలి. వినటానికి వింతగా ఉన్నా, దీని వల్ల ఒకట్రెండు దశాబ్దాల తర్వాత అన్ని ప్రాంతాల నుండీ మిగతా ప్రాంతాలకి వలసలు పెరిగి ఒకరిపై ఒకరికి అనవసర అపోహలు తగ్గుతాయి.
>>
ఏతావాతా, ఈ దుందుడుకు చర్యతో జరిగిన మేలొకటుంది. మొన్నటిదాకా ‘తెలంగాణ వచ్చే సూచనలుంటే అప్పుడు చూసుకుందాంలే’ అనుకుంటూ చోద్యం చూసిన సమైక్యవాదుల బలం ఈ రోజు వెల్లడయింది. ఎదురు చెప్పేవాడు లేడని ఇన్నాళ్లూ వీరంగమేసిన వేర్పాటువాదులు ఈ దెబ్బతో దిమ్మెరపోయుంటారు. ఇప్పుడు గనక ప్రత్యేకవాదం మట్టికరిచిందంటే మళ్లీ దాన్ని నెత్తినేసుకునే ధైర్యం భవిష్యత్తులో ఏ రాజకీయ నిరుద్యోగీ చేయకపోవచ్చు.
ఇదే ఊపులో ప్రత్యేకవాదానికి గోరీ కట్టాలి. పరిస్థితులు సద్దుమణిగాక, రాబోయే కాలంలో అభివృద్ధి మొత్తం హైదరాబాదులో కుప్ప పోయకుండా ఆంధ్రా/సీమలకూ మళ్లించాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వెనకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చెయ్యాలి. ప్రతి చోటా ప్రభుత్వోద్యోగాలు సగం స్థానికులకీ, సగం స్థానికేతరులకీ కేటాయించాలి. వినటానికి వింతగా ఉన్నా, దీని వల్ల ఒకట్రెండు దశాబ్దాల తర్వాత అన్ని ప్రాంతాల నుండీ మిగతా ప్రాంతాలకి వలసలు పెరిగి ఒకరిపై ఒకరికి అనవసర అపోహలు తగ్గుతాయి.
<<
this part is WELL SAID
పవర్ పాయింటు ప్రెజంటేషన్ లకు కాలం చెల్లింది. ఇప్పుడు కావలిసింది ప్రజాదరణ.
ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామా. రాష్ట్రం లో జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి,అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఇలా ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న తే.దే.పా. ను చీల్చడానికి పన్నిన ప్లాను ఇది. దీనివల్ల పాపం ప్రజలలో ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు.జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సొంత పార్టీ లో MLAలు ఎంత గోల చేసినా అందరిని అణచివేసిన సోనియా కే.సి.యార్. కు లొంగుతుందా. అయితే ఈ ఎత్తు కు చంద్రబాబు షాక్ తిన్నాడు.పార్టీ వాళ్లు రెండుగా విడిపోతున్నారు.తెలంగాణ పై వెనక్కు తగ్గితే మేము కూడా రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆలస్యంగానైనా తేరుకున్న బాబు కోస్తా,సీమ ఎం.ఎల్.ఎ. లను రాజీనామాలు ఆమోదించాలంటూ స్పీకరుని డిమాండ్ చేయిస్తున్నాడు, తెలంగాణా ఏం.ఎల్.ఎ లను కూడా ఉద్యమాలు చేయాలని చెప్తున్నాడు.ఈ విదంగా ముందుకు పోవడం వల్ల కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లను డిఫెన్స్ లో పదేయ్యోచ్చునని బాబు గారి ఆలోచన కాబోలు. ఏది ఏమైనా ఏది ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్సు చూస్తున్నట్టుగా ఉంది. మరి ముగిపు ఎలా,ఎప్పుడు ఉండబోతుందో నాకు అర్ధం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.
అన్న Dan Brown (సరిగ్గా చెప్పాలంటే Ban Frown) చేతికీ కథిస్తే ఓ అరవెయ్యి పేజీల్లో ఇరవైనాలుగు గంటల్లో ముగిసే నవల రాసుకుంటాడు.
చంద్ర గ్రహణం ! 🙂 టైటిల్ కత్తిలా పెట్టారు.మీ విశ్లేషణ బాగుంది చంద్రుడి గురించి ! 🙂
అందరికీ గ్రహణమే పట్టింది, ఒక్క చంద్రుడికి మాత్రమేనా ?
>>కాంగ్రెస్ నైజం తెలిసీ, ఎదుటి పక్షాన్ని దెబ్బతీయటానికి ఎంతకైనా తెగిస్తుందనీ, ఎన్ని మాటలైనా మారుస్తుందనీ ఎరిగీ ఏమరుపాటుగా ఉండటం ఆత్మహత్యా సదృశం.
ఇది ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలకి వర్తిస్తున్దేమోనండీ ! 😦 ఒక్క బీ జీ పీ తక్క, అది పెట్టిన కుంపటి ఫలితమేగా ఈ విభజన సంత.
OMG, please save my Andhra Pradesh(Jai Ho United Andhra.)
telugu vadi athma gouvaravam malli delhi ki vellindhi…mana gouvaravam thakattu pettina rajakiya sannasulaki…rajakiya sanyasam ne bahumathi ga ivvatam thappa telugu vadu cheyagaligindhi emi ledhu inka..
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని నానుడి. నిజమే గురువా! కాని చితినుంచైనా బతికి బట్టకట్టకల నేర్పు రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన విద్య! ఆలోచించి చూడంది! ఆంధ్రప్రదేశ్ భవిస్యత్తు పూర్తిగా కాంగిరేసు దయాదాక్షిన్యాలపై ఆధారపద్దప్పుడు బాబు మాత్రం ఏమి చేయగలడు.