అక్టోబర్, 2009ను భద్రపఱచు

ఆరోప్రాణం

ఆరోప్రాణం – నా మూడో కథ. జులైలో కౌముదిలో వచ్చిన గడియారం నేను రాసిన మొదటి కథ. మరి రెండో కథ ఏమయ్యిందంటారా? ఎక్కడో పూడుకుపోయింది. తవ్వకాలు జరిపి బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలోగా ఈ మూడో కథ చదివి మీ అభిప్రాయం చెబితే ఆనందిస్తాను.

చదవబోయే ముందు నాలుగు ముక్కలు. నేను పెద్దగా ప్రతిభావంతుడినైన కథకుడిని కాను. కథా రచన నాకు కూసు విద్య కాదు. వ్యాసంగమూ, వ్యాపకమూ సైతం కాదు. సాహితీ సేవ కోసం నేను కథలు రాయటం లేదు. మరెందుకు రాస్తున్నాను? రాసేవాడికి చదివేవాడు లోకువన్న ఉద్దేశంతోనైతే మాత్రం కాదు. నేను కథలు రాయటం మొదలు పెట్టిన కారణం ఆ మధ్యెప్పుడో టెల్గూ స్టోరీ పేరుతో తెలుగు కథల్లో లోపించిన వైవిధ్యమ్మీద నే రువ్విన విమర్శ. దానికి కొనసాగింపుగా పర్ణశాలలో జరిగిన చర్చలో ‘ఎప్పుడూ జీవితానుభవాల్లోనుండి మాత్రమే కథలు రాయటం కాకుండా పూర్తిగా కల్పనాధారిత కథలూ రాయొచ్చుగా’ అని నేననటం, దానికి ఒకరిద్దరు వ్యాఖ్యాతలు ‘అనుభవాల్లోనుండి కాకుండా ఊహల్లోనుండీ, గాల్లోనుండీ కథలెలా ఊడిపడతాయండీ’ అంటూ సంశయం వ్యక్తం చెయ్యటం, దానికి బదులుగా నేను ‘ఐతే నేనే అలాంటిదొకటి రాసి చూపిస్తానుండండి’ అనటం .. ఇలా సరదా సవాళ్లు నడిచాయి. నా మొదటి కథ ‘గడియారం’, త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న రెండో కథ, మరియూ ఈ ‘ఆరోప్రాణం’ మూడూ ఓ రకంగా ఆ నా సవాల్‌లోనుండి పుట్టుకొచ్చిన ప్యూర్ ఫిక్షన్ కథలే. ఇవి తెలుగు కథల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్థాయి రచనలనో, మరోటనో అనుకునేంత అమాయకుడిని కాను. విభిన్నత లేదంటూ ఊకదంపుడు విమర్శలతో సరిపెట్టకుండా నేను కోరుకునే తరహా విభిన్నత ఎలా ఉంటుందో నలుగురికీ తెలియజెప్పటానికి నాకు చేతనైన రీతిలో చేస్తున్న చిరు ప్రయత్నాలివి. అంతే.

చివరగా – ఈ ఆరోప్రాణం, ముందే చెప్పినట్లు పూర్తిగా ఊహాత్మక కథనం. సున్నితమైన భావావేశాలూ, సందేశాలూ, సెంటిమెంట్లూ, గుండె చెమర్చే ఫీలింగ్ .. ఇలాంటివేమీ ఉండవు. ఉంటేగింటే, వాటికి వ్యతిరేకంగానే ఉండొచ్చు. దానికి సిద్ధపడితేనే ఇది చదవండి.

కథ పిడిఎఫ్ ఫైల్ కోసం ఇక్కడ నొక్కండి.

Note: Please do not read the comments before reading the story


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 300,487

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.