ఆగస్ట్, 2010ను భద్రపఱచు

కల్కి – 2

‘కల్కి’ మొదటి భాగం ఇక్కడ, మరియు రెండవ భాగం ఇక్కడ . ఇది చదవబోయే ముందు చిన్న మాట. మొదటి భాగంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల (అవేమిటో మీ బుర్రుపయోగించి కనుక్కోండి) నేను రాసిన వాక్యాల్లో కొన్నిటిని సాక్షి సంపాదకులు మార్చటం జరిగింది. వాటి వల్ల కథనంలో పెద్దగా గందరగోళం ఏర్పడకపోయినప్పటికీ, ప్రతి వాక్యాన్నీ పరీక్షగా గమనించేవారికి అక్కడా వాక్యాలు అనవసరంగా, కథని పొడిగించటానికి మాత్రమే ఉన్నాయని అనిపించే అవకాశముంది. అటువంటి పాఠకుల కోసం ఆ మార్పులేంటో ఇక్కడ రాస్తున్నాను.

మార్పులు జరిగింది ప్రధానంగా మూడు తేదీల విషయంలో. కథానాయకుడు క్రయోజెనిక్ నిద్రలోకేళ్లిన గత మూడు సందర్భాల తేదీలూ – నేను రాసినవి ‘1984 అక్టోబర్, 1991 మే, మరియు 2012 డిసెంబర్ 23’ కాగా, పత్రికలో అవి ‘1981, 1991 మరియు 2010 డిసెంబర్ 23’గా పడ్డాయి. వీటిలో మొదటి రెండు మార్పులూ నేను పైన చెప్పిన సాంకేతిక కారణాల వల్ల కాగా, మూడవది అప్పుతచ్చు.

వీటిని మినహాయిస్తే, నేను రాసిన కథ అక్షరం పొల్లుపోకుండా, ఎక్కడా ఎడిట్ చేయకుండా యధాతధంగా ప్రచురించబడింది. ముఖ్యంగా – ఇంత పొడుగాటి కథని తమకి అనువుగా తెగ్గోయమని అడగకుండా, రొటీన్‌కి భిన్నంగా రెండు వారాల పాటు ప్రచురించిన  సాక్షి ఫన్‌డే సంపాదకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఇక ఆలస్యమెందుకు …. చదవండి, చెప్పండి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.