సెప్టెంబర్, 2008ను భద్రపఱచు

కలాపోసన – 2

ఇది నా యాభయ్యో టపా .. (నిశ్శబ్దం)

ఇద్దీ, నా యాభయ్యో ఠఫా …. (.. చప్పట్లు)

థ్యాంక్యూ, థ్యాంక్యూ. ఈ సందర్భంగా ఎప్పుడూ ఉండే గోడులకి సెలవిచ్చి, మరొక్కసారి మదీయ కలాపోసన జనాలక్కూసింత రుచి చూపిద్దామనుకుంటున్నాను – రొటీన్‌కి కుంచెం భిన్నంగా. (మొదటి కలాపోసన ఇక్కడ)

బంధుమిత్రపరివారంలో పెయింటింగు రంగడిగా నాక్కాస్త పేరుంది. అయితే మొదలెట్టిన దేన్నీ పూర్తి చేయకపోవటం నా విశిష్టత. ఒకటి తొంభై శాతం పూర్తయ్యేసరికి మన దృష్టి మరోదాని మీద పడుతుంది. ఈ విషయంలో పెద్దాయన లియొనార్డో డావించీ నాకు స్ఫూర్తి – ఆయన్లా సర్వంబొచ్చు అనిపించుకోవాలనే కోరికతో రకరకాల రంగాల్లో వేళ్లు పెట్టి తరిస్తుండటం నా ప్రవృత్తి. అంచాత ఇన్నేళ్లలో నేను గీసింది కొన్ని పదుల కళాఖండాలు మాత్రమే. కిందవన్నీ జమానా కాలంలో – అంటే కనీసం పదేళ్ల క్రితం – నేను గిలికిన గీతలు. చూసినోళ్లకి వాటిలో మనుషుల ఆకారాలు కనపడ్డాయట, సరే ఇదేదో బాగానే ఉంది అని దాచి పెట్టుకున్నా. ఈ మధ్య తీసి చూస్తే అవన్నీ దుమ్ము కొట్టుకుని, వెలిసిపోయి ఆకారాలు కనిపించకుండా పోయాయి. ఈ కాలపు టెకణాళజీ వాడి వాటిని కంప్యూటరుకెక్కించి దుమ్ము, ధూళి, బూజు దులిపితే మళ్లీ ఓ ఆకారానికొచ్చాయి. ఈ దులుపుడు ప్రక్రియని స్టైలుగా రిస్టోరేషన్ అంటారట. దాన్నేమంటేనేం, బొమ్మలు తిరిగి గుర్తుపట్టేలా తయారయ్యాయిగానీ పూర్వస్థితికైతే రాలేదు. వాటిలో నాలుగు బ్లాగ్మిత్రుల దర్శనార్ధం ఇక్కడ పెట్టా. మొదటి మూడూ పెన్సిలు గీతలు, చివరాఖరిది పెన్నుతో చుక్కలు పెడుతూ వేసింది. (ఈ చుక్కలు పొడిచే పద్ధతిని pointillism అంటారని ఈ మధ్యనే తెలిసింది. అద్తెల్వకముందు నేనే ఈ టెక్కునిక్కుకాద్యుడ్నంటూ ఎగస్ట్రా పాత్రలు వేస్తుండేవాడ్ని)

ఉపోద్ఘాతమనబడే సోది, సొంతడబ్బా ఐపోయాయి. ఇక చిత్రాలు చూసెయ్యండి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.