జూన్, 2013ను భద్రపఱచు

శిక్ష

సైన్స్ ఫిక్షన్ కథల మధ్యలో చిన్న విరామం తీసుకుని ఆటవిడుపుగా నేను రాసిన కథ ‘శిక్ష’. నిన్న ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితమయింది. ఆ కథ పీడీఎఫ్ ఇక్కడ లభిస్తుంది.

ఇది ‘రీబూట్‘ తర్వాత  రాసిన కథ. జూన్ నెలలో అయితే సమయోచితంగా ఉంటుందని ఇప్పటివరకూ ప్రచురించకుండా ఆపటం జరిగింది. అందువల్లే దీని తర్వాత రాసిన ‘రహస్యం‘ దీనికన్నా ముందే అచ్చైపోయింది.

నా కథలన్నిట్లోనూ అతి తక్కువ నిడివున్నది ఇదే. కానీ దాన్ని కూడా ప్రచురణకి అనువుగా కొంత తగ్గించాల్సొచ్చింది. అలాగే ప్రచురణకర్తలకుండే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కథలో ఒకట్రెండు చోట్ల మార్పులు చేయాల్సొచ్చింది. ఇలాంటివి సాధారణమే, కానీ నేను రాసింది రాసినట్లు వెలుగు చూడలేదన్న అసంతృప్తి లోలోపలెక్కడో. ఆసక్తి కలవారికి, ఈ కథ పూర్తి ప్రతి ఇక్కడ లభిస్తుంది.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.