జూన్, 2010ను భద్రపఱచు

మరో ప్రపంచం

ఏడెనిమిది నెలల కిందటి మాట. నాగరికథ మీద పనిచేస్తుండగా వచ్చిన చిన్న ఐడియాని విస్తరించి అధివాస్తవికత, సైన్స్, కొంత వేదాంతం కలగలిపి చిట్టి కథొకటి రాశాను. దానికి ‘మరో ప్రపంచం’ అని పేరు పెట్టాను. అది పూర్తయేలోపు నాగరికథ అచ్చవటం, హిట్టవటం జరిగిపోయాయి. విజయం విశ్వాసాన్నిస్తుందంటారు. నాకు మాత్రం అనుమానం తెచ్చిపెట్టింది – మరో ప్రపంచం మీద. రాసినప్పుడు బాగానే అనిపించినా, ఆ తర్వాత ఎక్కడో ఏదో లోపించిందన్న అనుమానం (వేరేవీ ఉన్నాయి. అవేంటో తర్వాతెప్పుడన్నా తీరిగ్గా రాస్తాను). హడావిడిగా ఈ కథని ప్రచురింపజేసుకుని వచ్చిన కాస్తో కూస్తో పేరు చెడగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో దాన్ని అవతల పారేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకి ఓ స్నేహితుడి బలవంతమ్మీద తటపటాయిస్తూనే దాన్ని వంగూరి ఫౌండేషన్ వారి పోటీకి పంపటం, అది ఊహాతీతంగా అందులో నెగ్గటం తాజా కబురు. ఆ ఫౌండేషన్ వారి కథల పోటీల్లో గెలుపొందిన రచనలు కౌముదిలో లేదా రచనలో ప్రచురించే సంప్రదాయం ఉందట. అలా మరో ప్రపంచం దానంతటదే ప్రచురణకర్తల్ని వెదుక్కుంది, పుట్టిన ఆరు నెలలకి వెలుగు చూసింది – ఈ నెల కౌముదిలో.

అదీ – నా గురించీ, నా కథ గురించీ స్వాతిశయ సొంత డబ్బా. ఇంత గప్పా చదివాకా ఆసక్తి (అనగా ధైర్యం) కలవారు ఇక్కడ నొక్కితే కథ చదవొచ్చు. ఒరిజినల్ డ్రాఫ్ట్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది (రెండిటికీ తేడా శూన్యం. ఏ రాయైనా ఒకటే)

Note: Please do not read the comments before reading the story


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.