మార్చి, 2009ను భద్రపఱచు

నిద్రాయనమః

నిద్ర సుఖమెరుగదన్నది నానుడి. రైళ్లూ బస్సుల్లో ప్రయాణాలప్పుడు – కిటికీలోనుండి పిల్లగాలి తెమ్మెర పలకరిస్తుంటే బాదరబందీలూ బాధలూ మరిపిస్తూ ఓ పక్క ముంచుకొస్తున్న నిద్రా దేవి, మరో పక్క పక్క కుదరక పాట్లు – అందరికీ ఏదో సందర్భంలో అనుభవమయ్యే సంగతే. కాసేపటికి మన ప్రమేయం లేకుండానే పక్క సీట్లో అపరిచిత ప్రయాణీకమ్మన్యుడి భుజమ్మీద తల వాలటం, అతగాడేమో చిరాగ్గా దాన్నవతలికి నెట్టటం, మనమూ తగ్గకుండా గజనీ మహమ్మదులా అయ్యదు భుజానికే గురిపెట్టి దండయాత్రలు చెయ్యటం .. మన తిప్పలెలా ఉన్నా, అవి చూసే మూడో వ్యక్తికి మాత్రం నవ్వాగకపోవటం తధ్యం.

కింది వీడియోలో బుడతడిది ఓ రకంగా అదే పరిస్థితి. అయితే పక్కన అపరిచిత ప్రయాణీకుడి బదులు సొంత సోదరుడే ఉండటం గుడ్డిలో మెల్ల. ఈ మధ్య కాలంలో ఇంత ముద్దొచ్చే వీడియో మరోటి చూడలేదు నేను (ఆల్రెడీ చూసేసినోళ్లు మళ్లీ చూడొచ్చు. తప్పు లేదు). అయ్యస్పీ అడ్మిన్ మార్తాండుడి మోములో సైతం అరనవ్వులు విరబూయించగల దృశ్యమిదని నాదీ హామీ. మరెందుకాలస్యం?

 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.