జూన్, 2009ను భద్రపఱచు

గడియారం

కథలు చదవటమే తప్ప రాయటం నాకలవాటు లేదు. మొన్నీ మధ్యనే మొదటిసారిగా ఓ కథ రాయాలనే కోరిక పుట్టింది (దీన్నే కొందరు దురద అంటారు. అరచేతుల్లో పుట్టిందిది, అంత తేలిగ్గా వదిలేనా?) ఏం రాయాలో అప్పటికైతే తెలీదు. అనుకున్నాక ఆలోచిస్తే చిన్న కథాంశం తట్టింది – wafer thin storyline అంటారే, అలాంటిదన్నమాట. కట్టె, కొట్టె, తెచ్చె అంటే ఒకే పేజీకి సరిపోయే అంశం. చిలవలు పలవలు చేర్చి కొన్ని సన్నివేశాలు, పిసరంత సస్పెన్స్ కలిపి చూసుకుంటే పదిహేను పేజీలకి సాగిపోయింది. అనవసరమనుకున్న పేరాలు, వాక్యాలకి అడ్డ కత్తెరేస్తే చివరాఖరికి పది పేజీల చిల్లర మిగిలింది. పూర్తి చేసి ‘కౌముది’ సంపాదకులకి పంపితే వారికది నచ్చింది, తాజా (జులై) సంచికలో వెలువడింది. గడియారం – నా తొలి కధ. పెద్ద గ్రౌండ్‌బ్రేకింగ్ కథేమీ కాదు, కానీ మీకు విసుగెత్తించదని నాదీ హామీ. చదివి చెప్పండి ఎలా ఉందో, ఇంకెలా ఉంటే బాగుండేదో.

కథ కోసం ఇక్కడ నొక్కండి.

 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,834

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.