ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 8

ఎనిమిదో అబద్ధం:

హైదరాబాదు మాది .. మాదే.

ఇదీ నిజం:

నా పెరట్లో బావి తవ్వాను. నీళ్లు పడితే మంచిదే. ఆ బావీ నాదే, ఆ నీళ్లూ నావే. అదే పెట్రోల్ పడితే? అప్పుడా బావి దేశమ్మొత్తానిదీ. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అది జాతీయ సంపద. నేను కొనుక్కున్న స్థలంలో ఉన్నంత మాత్రాన అది నా ఒక్కడిదేననే హక్కు నాకెలా లేదో, తమ తాత ముత్తాతలు నివాసమున్నంత మాత్రాన మన దేశ రాజధానినైనా, రాష్ట్ర రాజధానినైనా, ఆ మాటకొస్తే ఏ ఒక్క ఊరినైనా తమది మాత్రమే అనే హక్కు ఎవరికీ లేదు. హైదరాబాదుకైనా, బొంబాయికైనా, బెంగుళూరుకైనా, న్యూఢిల్లీకైనా ఇది నిజం .. ఇదే నిజం.

ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చర్చా చివరికొచ్చి పడేది హైదరాబాదు దగ్గరికే. దేశంలో ఇంతకు ముందూ చిన్న రాష్ట్రాలెన్నో ఏర్పడ్డాయి. మరి కొన్నింటి కోసం ఇప్పుడూ ఉద్యమాలు నడుస్తున్నాయి. కానీ వాటిలో ఎక్కడా లేని విశేషం మన దగ్గరుంది. అది – రాష్ట్ర రాజధాని నగరం కొలువై ఉన్న ప్రాంతమే విడిపోతానని గొడవ చెయ్యటం. ఆ మధ్యెవరో పాత్రికేయుడన్నాడు: ‘ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణవాదులు చేస్తున్న ప్రత్యేకాంధ్ర ఉద్యమం’. ఎంత నిజం! పేరుకి వేర్పాటువాదులు ‘మేం విడిపోతాం’ అంటున్నా, నిజానికి వాళ్లనేది ‘మీరు విడిపోండి’ అనే. ‘మీ రాజధానిని మీరు వెదుక్కోండి, మీ చావు మీరు చావండి’ అనే. అదేమంటే ‘ఠాఠ్. హైదరాబాదు మాది. మీరెవరు ఇక్కడికి రావటానికి’ అనే హుంకరింపులు.

దేశంలో ఏ ప్రధాన నగరాన్ని తీసుకున్నా దాని అభివృద్ధిలో స్థానికులకన్నా స్థానికేతరుల పాత్రే ఎక్కువుందన్నది కాదనలేని సత్యం. తెలుగువారి రాజధాని తెలంగాణవారిది మాత్రమే అని ప్రభుత్వాలూ, పారిశ్రామికులూ మడికట్టుకునో, గిరిగీసుకునో కూర్చుని ఉంటే హైదరాబాదు ఇప్పుడిలా ఉండేదీ కాదు, దాని గురించి ఇంత రచ్చ జరిగేదీ కాదు. ఈ మహానగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని హోదాలో స్వదేశీ, విదేశీ వ్యాపారాల్నీ, పరిశ్రమల్నీ, లెక్కలేనన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్నీ, నిధుల్నీ, విద్యాలయాల్నీ, మరెన్నో సదుపాయాలనీ సముపార్జించుకుందే తప్ప ఒకానొక తెలంగాణ నగరంగా కాదు. ‘మనం’గా సమకూర్చుకున్న హంగులవన్నీ. ఇప్పుడవన్నీ ‘మావే’ అనటం దారుణం. ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం నయవంచన. తెప్పతో పాటు దాన్లోని సహ ప్రయాణీకుల్నీ తగలెట్టబూనటం వేర్పాటువాదుల నయావంచన.

‘హైదరాబాదు అభివృద్ధిలో మాకు మాత్రం భాగం లేదా’ అనడిగితే వచ్చే రొటీన్ రొడ్డకొట్టుడు సమాధానం, ‘ఏంటి మీరు చేసిన బోడి అభివృద్ధి. అప్పుడూ ఇప్పుడూ హైదరాబాదు స్థానం ఐదే’. ఈ ఐదో నంబరు ఏమిటో, ఏ విషయంలోనో అడిగేవాడు లేడు, చెప్పేవాడూ లేడు. నాకు తెలిసి – ఒకప్పుడూ, ఇప్పుడూ జనాభా పరంగా హైదరాబాద్ దేశంలో ఆరో పెద్ద నగరం. ఆ నంబరుకీ, అభివృద్ధికీ లంకె పెట్టేవాడు అమాయకుడు. అలాంటోళ్లని పట్టించుకోనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించాక – ముఖ్యంగా గత ఇరవయ్యేళ్లలో – హైదరాబాదు వృద్ధిపధంలో దూసుకుపోలేదనేవాళ్లు అబద్ధాలకోర్లు (‘ఆ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా లభించాయా’, ‘అభివృద్ధి పేరుతో నగరం కాలుష్య కాసారంగా మారలేదా’, వగైరా ఈ చర్చకి సంబంధం లేని ప్రశ్నలు. అవి హైదరాబాదుకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ నగరానికైనా వర్తించేవి). ఇలాంటోళ్లు నడిపే ఉద్యమాలు పిచ్చోళ్ల చేతుల్లో రాళ్లు. హైదరాబాదు గురించి వీళ్లో అరిగిపోయిన రికార్డేస్తుంటారు: ‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి హైదరాబాదు రాజ్యం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం’. వీళ్ల అన్ని మాటల్లా ఇందులోనూ నిజం అరకొరే. అసలు నిజమేమిటంటే, 1948 నాటికి హైదరాబాదు నవాబు ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడు. దానర్ధం హైదరాబాదు రాజ్యంలో ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగేవారని కాదు. అదే నిజమైతే 1956లో ‘తెలంగాణ వెనకబాటుదనం’ ప్రాతిపదికగా పెద్దమనుషుల ఒప్పందం ఎందుకు? సరే, అది వేరే చర్చ. వదిలేద్దాం. నాటి నవాబుల వైభవానికి నేటి కోస్తా, సీమ జిల్లాలెలా సమిధలయ్యాయో చూద్దాం.

ఒరిస్సాలోని గజపతి, గంజాం జిల్లాలతో కలిపి, శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం జిల్లా దాకా విస్తరించిన కోస్తా ప్రాంతం పదిహేనో శతాబ్దంలో బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది. చరిత్ర క్రమంలో అది చేతులు మారుతూ పదహారో శతాబ్దం నాటికి (హైదరాబాదు నగర నిర్మాణం మొదలవటానికి ఇరవయ్యొక్కేళ్ల ముందు) గోల్కొండనేలిన కుతుబ్‌షాహీ వంశం అధీనంలోకొచ్చింది. గోల్కొండ సామ్రాజ్యం పదిహేడో శతాబ్దంలో ఔరంగజేబ్ పాలనలోకెళ్లి, అట్నుండి పద్దెనిమిదో శతాబ్దంలో (క్రీ.శ. 1724) మొదటి నిజాం నవాబు అధీనంలోకొచ్చింది. అనంతర కాలంలో నిజాముల రాజకీయ అవసరాల కోసం ఏవేవో ఒప్పందాల పేరుతో పైన చెప్పిన కోస్తా జిల్లాలు మొదటగా ఫ్రెంచి వారికీ, ఆ తర్వాత బ్రిటిష్ వారికీ తాకట్టు పెట్టబడ్డాయి. వాటినే ఉత్తరాది సర్కార్ జిల్లాలన్నారు. ప్రతిఫలంగా ఈ జిల్లాలపై బ్రిటిష్ వారినుండి నిజాం నవాబు ఏటేటా భారీ మొత్తంలో రొక్కం పొందేవాడు. క్రీ.శ. 1788లో సర్కారు జిల్లాలను బ్రిటిష్ వారు పూర్తిగా సొంతం చేసుకునేదాకా ఈ చెల్లింపులు కొనసాగాయి.

మరో పక్క – నాలుగో మైసూరు యుద్ధంలో ఫ్రెంచి వారితో జతగట్టిన టిప్పు సుల్తానుని ఓడించటానికి ఆంగ్లేయులతో చెయ్యి కలిపినందుకు టిప్పు ఓటమి అనంతరం నాటి మైసూరు రాజ్యంలోని దక్కను భాగం నిజాం నవాబుకు ఈనాముగా లభించింది. అందులో చాలా భాగాన్ని తర్వాత కాలంలో నిజాం రెండవ అసఫ్ ఝా ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు. ఎందుకు? హైదరాబాద్  రాజ్యంపై ఫ్రెంచ్, మరాఠా దాడుల్ని కాచుకోటానికి ఆంగ్లేయుల సైన్య సహకారం అవసరమై, అందు నిమిత్తం ఓ ఒప్పందం కుదుర్చుకోవటం మూలాన. అలా ఇచ్చేసినవే తెలుగులో దత్త మండలాలుగానూ, ఆంగ్లంలో సీడెడ్ డిస్ట్రిక్ట్స్‌గానూ పేరొందిన నేటి రాయలసీమ జిల్లాలు. ఇది క్రీ.శ. 1800 నాటి మాట.

అదీ చరిత్ర. అటు సర్కారు జిల్లాలు (కోస్తాంధ్ర), ఇటు సీడెడ్ జిల్లాలు (రాయలసీమ) రెండూ హైదరాబాదు పాలకుల రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగపడ్డాయి. పై ఒప్పందాలేవీ లేని హైదరాబాదు రాజ్యం భౌగోళిక స్వరూపం మరోలా ఉండేది. దాని చరిత్ర సైతం వేరేలా ఉండేది. ఆ చరిత్రలో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ అన్న మాటలే ఉండేవి కావు. ఈ ఉద్యమాలూ ఉండేవి కావు. కాబట్టి తెలంగాణ చరిత్ర నుండి కోస్తా, సీమలని విడదీసి చూడటం అసమంజసం. నాటి హైదరాబాదు సౌభాగ్యం కోసం పణంగా పెట్టబడ్డ ఈ రెండు ప్రాంతాలకి హైదరాబాదు నగరంతో ఏ సంబంధమూ లేదనటం అన్యాయం. అందులోనూ కోస్తా ప్రాంతం (సర్కార్ జిల్లాలు) 1788 దాకా ఏదో ఓ రూపంలో గోల్కొండ/హైదరాబాద్ పాలకులకి ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంది. ఆ రకంగా – హైదరాబాదు నగరాభివృద్ధిలో తొలి రెండొందలేళ్లలోనూ కోస్తాంధ్ర భాగస్వామ్యం ఉంది.

అంతే కాదు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దరిమిలా మొదటి ఐదేళ్ల వరకూ (1961 దాకా) రాజధాని నగరానికి అవసరమైన హంగులకయ్యే ఖర్చు మొత్తమూ ఆంధ్ర, సీమ ప్రాంతాల పద్దులోనే వెయ్యబడింది. దానిక్కారణం – అప్పటికే హైదరాబాదులో అందుబాటులో ఉన్న భవనాలు, ఇతర సదుపాయాలన్నీ తెలంగాణ సమకూర్చినట్లు ప్రభుత్వం భావించటం, కొత్తగా అవసరమైన వాటికయ్యే ఖర్చు తెలంగాణేతర ప్రాంతాల ఖాతాలో వెయ్యటమే న్యాయమని అనుకోవటం. 1961 తర్వాత నుండీ ఈ ఖర్చుని కోస్తా/సీమ, తెలంగాణ ప్రాంతాలు 2:1 నిష్పత్తిలో పంచుకోవటం జరుగుతుంది. ఏతావాతా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేసిన ఖర్చులో అధిక శాతం తెలంగాణేతర ప్రాంతాలే భరించాయి. అప్పుడు వాళ్లెవరూ నోరెత్తి ఇదేమనలేదు. ఎందుకు? ‘హైదరాబాదు మనందరిది’ అనుకోబట్టి. ప్రభుత్వపరమైన వృద్ధి సంగతి అటుంచి ప్రైవేటు రంగంకేసి దృష్టి సారించినా, ఈ యాభయ్యేళ్లలోనూ హైదరాబాదు సాధించిన విజయాల్లో తెలంగాణవారి పాత్రెంతో తెలంగాణేతరుల పాత్రా అంతే – కొండొకచో అంతకన్నా ఎక్కువే (‘తెలంగాణేతరులు’ అంటే కేవలం ఇతర తెలుగు ప్రాంతాల వారు కాదు, భారతీయులందరూ). అందుకే హైదరాబాదు జాతీయ సంపద. ‘ఇది నాది, నాదే’ అనే హక్కు ఏ ఒకరికీ లేదుగాక లేదు.

(సశేషం)

63 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 8”


 1. 1 డల్లాస్ నాగేశ్వరరావు 7:40 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  అబ్రకదబ్రా,
  శభాషొ… ఎంతసేపూ 1956 వరకే వచ్చి ఆగిపోయే వాదనలు వినీ వినీ విసుగెత్తింది. మీ వివరణ చాలా బాగుంది. “ఆత్మగౌరవం,స్వపరిపాలన” కాకుండా, ఏమైనా విశ్లేషణాత్మక వివరాలు చెబుతారేమో చూద్దాం.

  Once again, marvelous job.

 2. 2 raman 8:50 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  great job Wah!!!
  beautiful analysis
  i was always wondering what this “ceded” districts means. it is mostly used by film distributors.
  thanks sir, my doubt was cleared
  Hope some common sense will prevail in T-students and understand these facts.

 3. 3 chandu 8:54 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  మీ “ఒక ఉద్యమం, పది అబద్ధాలు” సిరీస్ ను మొదటి నుంచి చదువుతున్నాను. చాలా చక్కగా వివరించారు.
  ఇంత వివరంగా చెప్పినా కూడా కొంతమంది వేర్పాటువాదులకి అర్ధం కాదు.
  ఇంతకు ముందు కొందరు చెప్పినట్టు ఈ సిరీస్ ని ఇంగ్లీషు లొ తర్జుమా చేసి కమిటీ వారికి పంపించండి.

 4. 4 Varunudu 9:41 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  మనకి తెలియని మన చరిత్ర చదూతున్నట్టనిపించింది. చాలా చాలా చాలా చక్కగా వివరించారు. మీకు అభ్యంతరం లేక పొతే మీ భ్లాగ్ లోని ఈ వ్యాసాలు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయ్యేలా చూసేదా..? బయట ఎక్కడా భూతద్దం పెట్టి వెతికినా దొరకని కొన్ని నిష్ఠుర నిజాలు ఉన్నాయి మీ వ్యాసం లో. అవి బ్లాగులు చదివే అతి కొద్ది మందికే పరిమితమవ్వకూడదు. మొత్తం ఆంధ్ర ప్రజానీకమంతా( ఐ మీన్ .. ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకమంతా.. యేం ఖర్మ వచ్చింది చూడండి. ఆంధ్ర ప్రజానీకం అంటే మొన్న నవంబర్ ముందు దాకా, మొత్తం అందరినీ కలిపి చెప్పే విషయం.. ఇప్పుడు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ అని రాస్తే తప్ప అందరికీ సంబంధించింది అని కాదు.. అలా వ్రాయక పోతే, యేం తెలంగాణ వాళ్ళకు సంబంధించింది కాదా..అని అడుగుతారు)మీ ఈ వ్యాసాల సంపుటి చదవాలి. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. రోజూ పేపర్ లో వచ్చే ఏర్పాటు చేస్తాను.

  మరో సారి అదరగొట్టారు. అభినందనలు

  • 5 అబ్రకదబ్ర 11:19 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

   మీ ఆసక్తికి ధన్యవాదాలు. మరింతమందికి చేరేస్తానంటే అభ్యంతరమెందుకు? మహదానందంగా సరేనంటాను. అలాగే కానీండి.

   • 6 ramajogarao 2:27 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2010

    అసలైన నిజాలను నిష్పక్షపాతంగా వివరిస్తున్నారు. అన్నివిధాల ఒక్దిపోయిన కేసిఆర్ అన్నెంపున్నెం ఎరుగని కొందరు విద్యార్ధులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం, ఉద్యమాన్ని సృష్టించాడు.విదిపోవడం వాళ్ళ బహుకోద్దిమందికి,కొన్నిపప్రాంతాలకు లాభం వచ్చిన ,తెలంగాణా మాత్రం అభివ్రిద్ది జరగదు ఉద్యోగాలు రావు.చదువులు బాగుపడవు.
    మీ వ్యాశాలను శ్రీకృష్ణ కమితీముండు తప్పక సమర్పించాలి. నిజాలను దేశప్రజలకు ,తెలియజేపాలి. రాష్ట్ర విభజన వాళ్ళ రెండు ప్రాంతాలకే కాక మొత్తం దేశానికే నష్టం వాటిలుతుంది. దేశప్రజలు, ఎం.పి.లు విభజనను వ్యతిరేకించాలి. మీ వ్యాసాలు దేసప్రజలందరో జాగృతి కలిగించాలని కోరుతున్నాము.

 5. 7 chitra 10:35 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  చాలా బాగుంది. చరిత్ర చెరిపెస్తే చెరిగిపోదు అని నిరూపించారు

 6. 8 zulu 11:24 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  @Varunudu gaaru,

  Please do the needful. If possible, publish with some more truths. If you wan we all will help you in getting the truths.

 7. 9 శ్రీవాసుకి 11:32 సా. వద్ద ఫిబ్రవరి 17, 2010

  మీ వివరణ బాగుంది. ఇప్పుడు అందరి బాధ హైదరాబాద్ గురించే. హైదరాబాద్ అభివృద్ది అందరి సమిష్టి కృషి ఫలం. పొమ్మనడానికి అది ఏ ఒక్కరి సొత్తు కాదు. బుద్ధిలేని ప్రభుత్వాలు అభివృద్ది అంతటిని హైదరాబాద్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలకే పరిమితం చేశాయి. సీమాంధ్ర కి బొచ్చు మిగిలింది. వదిలేయమంటే ఎలా కుదురుతుంది. మీరన్నట్టు హైదరాబాద్ జాతీయ సంపదే. సీమాంధ్ర వాళ్ళని పొమ్మంటున్న ప్రత్యేకవాదులు ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసుకొని బ్రతకటలేదా. మరి వాళ్ళు కూడా అక్కడి వాళ్ళ ఉద్యోగాలకి ఎసరు పెట్టడం లేదా. దోరగా ముగ్గిన జామ పండులాంటి హైదరాబాద్ ని తేరగా కొట్టేయాలని ఆశ. నూతక్కి రాఘవేంధ్రరావు గారు వారి బ్లాగ్ లో దీని గురించే వ్రాసారు. ఒకసారి చూడండి.

 8. 10 కత్తి మహేష్ కుమార్ 12:19 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  ఎవరు ఎవర్ని పొమ్మన్నారు హైదరాబాద్ నుంచీ?

 9. 11 Cv 12:20 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  ‘మేం విడిపోతాం’ అంటున్నా, నిజానికి వాళ్లనేది ‘మీరు విడిపోండి’ అనే. ‘మీ రాజధానిని మీరు వెదుక్కోండి, మీ చావు మీరు చావండి’ అనే.

  —well said

 10. 12 chaitanya 12:46 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  naa last prathyutharaaniki samadhanamivvani mee samskaraniki namaskaramulatho..
  antha baagane undandi..mari hyderabad ni meme abhivruddi chesam ane valluu unnaru kada e samaikhyandhra lo..vallaki oka chempa pettu lantidi e post..
  1)andhra pradesh erpaddaka, hyderabad loni nizam bhumalani takkuva dharalaku(KAVALSINA vallaki appanamga) isthene kada e factories, industries vachaii anna sangathi telsukore??appatiki abhivruddi chendina nagaram aithene ga ikkada pettubadulu pettadaniki vacharu ani alochinchare??
  2)hyderabad nagaram erpadadiniki,adi abhivruddi chendataniki,university lu pettadaniki,drainage system erpatu cheyadaniki.. raktanni pannulu ga malachina, telangana sodarulu kanipinchare??in fact andhra prajalanunchi entha sommu ikkada daara poosaro lekkalu unnayemo mee deggara naku telidu..kani kachitamga ikkadi pannula thone,ikkadi bhumalathone hyderabad nagara nirmaanamu,abhivruddi jarigayi ani matram nissandehamee ga evarikaina..andhra praantha prajala dabbu ikkadi abhivruddi ki upayoginchara leka avi khajanalaku mallinchara???e lekkalu mee deggara unte, chupisthe inka baaguntundi!!!
  3)kurnool lo gudaarallo “capital city” erpatu chesukunna vallaki anni saukaryalu ichina hyderabad appatike developed ani telsukore?? kurnool ni capital city ga erpatu cheyadaniki avasaramayye karchu bharinchadaniki kuda arthikam ga antha sthomatha leni andhra prantham,hyderabad ni aa taruvata hangulatho develop chesindi ani ela cheppukuntamu ani artham chesukore??mari kurnool ki pettalsina karchu migilinchindi hyderabad ani gurtupettukore??
  4)hyderabad nunchi evarini evaru pommannaro mari meeke teliyali..ikkada andaru(bharatiyulu) vyapaaraalu cheesthene kada telangana ki athi pedda aadayam(separate aithe..ayyaniche la leru lendi).mari ela vellamantaaru??kaabatti bhayapadakandi..evaru evarini analedu vellamani..last time e cheppanu..vellamanaleru ani kuda..ooha kalpanalaku joharlu..ila aithe 10 enti 100 ainaa vastaii abaddalu..rayadaniki.. carry on!!! 🙂

  chaitanya.

  • 13 dkc 10:10 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

   @chaitanya

   అభ్రకదబ్ర గారు రాసింది అబదమే అనుకుంటే మొన్న సంక్రాంతికి ముందు హైదరాబాద్ highway ల మీద గోడలుకట్టింది ఎవరు ? తెలంగాణ ఇవ్వకుంటే సంక్రాతికి ఇళ్ళకి పోయినోల్లని తిరిగి రానివ్వం అని కూసింది ఎవరు చైతన్య గారు ?ఒకరిని ఎత్తి చుపేటప్పుడు మన వైపు నుండి ఏమి జరిగిందో కూడా తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం …….!హైదరాబాద్ ని రాజదానిగా ఎంచుకోవడానికి అది బాగా బలిసి వుంది అని కాదు అప్పటివరకు నిజామ్ పాలనలో అది రాజదానిగా ఉండటమే.ఒక కొత్త ప్రాంతాన్ని తీసుకొని దాన్ని అభివ్రుది చేయడం కంటే ముందుగా వున్నా ప్రాంతాన్ని ఎంచుకొని పాలించట తేలిక అన్న విషయం చదువు’కొన్న’ వాళ్ళకి కూడా తెలియక పోవడం నిజంగా మన దురద్రుష్టం.ఇక్కడ ఎవరు హైదరాబాద్ ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాత్రమే అభివృధి చేసారు అని అనలేదు.దాని అభివృధి లో మాకు బాగం వుంది అని మాత్రమే అన్నారు.మన మీడియా అనుకుంటే దానికంటే ఎక్కువగా కొందరు మాటలను, భావాలను వక్రీకరించడం నిజంగా శోచనీయం !

   • 14 శ్రీవాసుకి 11:00 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

    బాగా చెప్పారు. తప్పులెంచు వారు తమ తప్పులెరగరు అని సామెత.

   • 15 chaitanya 2:20 ఉద. వద్ద ఫిబ్రవరి 19, 2010

    @dkc
    media meda ki baagane tosesaru…udhyamalalo evari pantha valladi..andhra ki,telangana ki madyalo goda kattaru..ademaina sahswatamaina addukatta?? othiDi thedaniki vallu enchukunna margam ade..ade tappainaa, valla udheshyanni matram pranshinchalem anukunta..
    “ika sankranthi ki velladam” meda nenu already cheppanu..ade paatha replies lo untundi..miss aithe chudandi..
    mundhuga “abhivruddi chendina pranthanni ennukovatam”..nenu cheppedi kuda ade andi..ala ennukunna sangathi gurtupettukunte…arthikam ga appatiki sthiram ga leni pranthaniki hyderabad migilinchina sommuni kuda gurtupettukovali..manam hyderabad meda pettina karchuni cheppukoni egire mundu ani cheppanu..tappu anukunte ade mee istham!!!i dont care..
    abhivruddi lo bhaagam andariki undi..untundi..danni evaru kadantledu..ika mottam andhra pradesh ki hakku untundi ante..naa dabbu tho nadiche kendra abhivruddi panula meda naaku unnantha adhikaram untundi!! ade entha??
    ika hyderabad okkate andhra pradesh dabbulatho nadustaledu..vizag development huda bhumulu ammithe jarigindi..ichestara vizag??bhaagam undi ga telangana vallaki..
    vizag steel plant 1400 crore loss lo unappudu..akkadiki taralinchina bail out dabbu mottam AP meda veyaleda??ichesatara ade??
    nizam sugar factory muutha padataniki karanam..akkadi nidhulu andhra pranthamlo factories ki taranlinchadam valla jarigindi..ichestara ave?? projects anni ranga reddy,hyderabad bhuumulu ammithe vachina dabbu tho kadutunnaru..ichestara ave??
    abhivruddi lo bhaagam andariki untundi…hakku akkada nivasinche vallaki untundi..unna pranthaaniki untadi…hakku ante..pranthaaniki chendutundi ani..migata annitlonu andariki bhagaswaymamu untundi ani kottaga telangana vallaki evaru cheppalsina avasaram ledu ani naa manavi!!!

    chaitanya.

 11. 16 Raj 12:50 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  మీడియా కి ఎందుకింత వివక్ష::

  ఈ రోజు శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సిటీలో “సమైఖ్యాంధ్ర విద్యార్ధి సదస్సు”ను ఒక్క టివీ చానెల్ కూడా కవర్ చెయ్యకుండా అర్థం పర్థంలేని న్యూస్ ను చూపించటం ఎంతవరకు సమజసం..
  1)అన్ని టివి న్యూస్ చానెల్స్ లో ఢిళ్ళీ తెలంగాణా ఎంపీ ల లైవు , అసెంబ్లీ లైవు , హైకోర్టు లైవు , చివరాఖరికి దానం మరియు నాయని లైవు కూడా ఇస్తూ ..అత్యంత ముఖ్యమైన విద్యార్ధి సదస్సును ఎందుకు చూపించటంలేదు…

 12. 17 ravi 12:55 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  బాబూ చైతన్యా ,
  ఆనాడు రాజధానిని కర్నూల్ నుండి హైదరాబదుకి మార్చడం వల్ల ఆదాయిన డబ్బు “ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అయిన ఖర్చులో ఒకటో వంతుకూడా ఉండదని మనవి…

 13. 18 తెలంగాణా యోధుడు 2:30 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  తెలుగోడా, నీవి అసలైన అబద్ధాలు.

  …కానీ వాటిలో ఎక్కడా లేని విశేషం మన దగ్గరుంది. అది – రాష్ట్ర రాజధాని నగరం కొలువై ఉన్న ప్రాంతమే విడిపోతానని గొడవ చెయ్యటం…

  ఇది మొదటి అబద్ధం. బొంబాయి రాజధానిగా వున్నా మహారాష్ట్రీయులు ప్రత్యెక మహారాష్ట్ర కొరుకున్నరు. సాధించు కున్నరు, ముంబాయి తో సహా.

  అబ్రకదబ్ర: మంచి రంధ్రాన్వేషణా యత్నమే 😀

  మీ ‘బాసుల’ అబద్ధాల పరంపరలో ఇది మరో శుద్ధాబద్ధం. బొంబాయితో పోలిక పెట్టి హైదరాబాదులో పబ్బం గడుపుకోవాలనే యత్నం. దానికోసం అవాస్తవాల ప్రచారం. మీలాంటివారేమో అవన్నీ నమ్మేసి నాలాంటివారి మీద పడిపోతారు. నిజాలివిగో వినండి. నమ్మలేకపోతే ఏ చరిత్ర పుస్తకాన్నైనా అడగండి.

  నేటి గుజరాత్ ప్రాంతంలో అధికభాగం నాటి బొంబాయి రాష్ట్రంతో కలపబడింది 1956లో. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దరిమిలా, ఆంధ్రాలో కలపకుండా మిగిల్చిన హైదరాబాద్ రాష్ట్ర (తెలంగాణ) జిల్లాలని, మధ్యప్రదేశ్‌లో కొన్ని భాగాలని, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలనీ బొంబాయి రాష్ట్రంలో కలిపేశారు. (తూర్పు గుజరాత్ ప్రాంతం 1947 నుండే బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉంది. 1956లో సౌరాష్ట్ర, కచ్ అదనంగా వచ్చి చేరాయి). ఈ కలయిక అటు గుజరాతీయులకి, ఇటు మరాఠీలకి ఇద్దరికీ ఇష్టం లేదు. దానితో రెండు వర్గాలూ అదే ఏడాది విడి విడి రాష్ట్రాల కోసం ఆందోళన మొదలు పెట్టాయి. బొంబాయి తమకే కావాలని ఇరు వర్గాలూ పట్టు పట్టిన మాట నిజమే. అయితే, అన్నదమ్ములిద్దరూ విడిపోదల్చుకున్నాక ఆస్తుల పంపకం దగ్గర వచ్చే గొడవలాంటిదది. అదెలాగో సర్దుబాటై 1960 మే నెలలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆవిర్భవించాయి. బొంబాయి కోసమే మరాఠీలు బలవంతాన గుజరాతీలని వెళ్లగొట్టి మహారాష్ట్ర సృష్టించుకోలేదక్కడ. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నది పూర్తిగా వేరే కథ. దానికీ దీనికీ పోలిక పెట్టటం మోకాలికీ బోడిగుండుకీ ముడెయ్యబోవటమే. తెలంగాణతో పాటుగా కోస్తా/సీమ కూడా విడిపోతామని గొడవ చేస్తూ హైదరాబాద్ గురించి ఇరు పక్షాలూ తన్నుకుంటుంటే – అప్పుడు మీరు బొంబాయితో పోలిక పెట్టాలి. ఇప్పుడు కాదు.

  …1961 తర్వాత నుండీ ఈ ఖర్చుని కోస్తా/సీమ, తెలంగాణ ప్రాంతాలు 2:1 నిష్పత్తిలో పంచుకోవటం జరుగుతుంది….

  జర గీ లెక్కలు ఎక్కడ దొరికినయో చెప్పితే బాగుండేది. గట్లనే హైదరాబాదు ల అమ్మిన భూముల పైసా లెక్కడ పోయినయో చూడ రాదె!

  అబ్రకదబ్ర: I’m tired of proving everything. For a change, why don’t you disprove me this time? గట్లనే, హైదరాబాదు భూములమ్మిన పైసల్లెక్కల్ భీ జర నువ్వే జెప్పరాదె? 😉 (యాస సరదాకే, ఎగతాళికి కాదు. అపార్ధం వద్దు)

  …అందుకే హైదరాబాదు జాతీయ సంపద. ‘ఇది నాది, నాదే’ అనే హక్కు ఏ ఒకరికీ లేదుగాక లేదు…

  లెస్స పలికినవ్ బిడ్డ! హైదరాబాదు, విజయవాడ, విశాఖ, ముంబాయి, బెంగుళూరు… అన్ని ఈ దేశానివే. గట్లని ఇండియాల ఉన్న సిటీలన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుద్దామా చెప్పా రాదె. నగరం ఏ భౌగోళిక ప్రాంతంల ఉంటె గా ప్రాంతానికే అది చెందుతది అన్న ఇంగితం ఎక్కడికి పొయిందన్న నీకు?

  అబ్రకదబ్ర: హైదరాబాద్ ఏ ప్రాంతానికి చెందుతుందనే విషయం గురించి కాదు నేనింత పెద్ద వ్యాసం రాసింది. దాని నిర్మాణం, ఉత్థానం వెనక ఎందరెందరి శ్రమశక్తులో దాగున్నాయి – కేవలం ఆ ప్రాంతీయులవే కావు అన్న విషయం నేనిక్కడ చెప్పింది. ‘ఇది మాదే’ అనబోయే ముందు అది మీదేననాలనిపించే స్థాయికి రావటంలో తోడ్పడ్డ వారందరి కృషినీ గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా ఓ ముక్క పడేస్తే ఒకలా ఉంటుంది; ‘మీరొరగబెట్టిందేంటి, కొత్తగా ఊడబొడిచిందేంటి’ అంటే మరోలా ఉంటుంది. పదే పదే ఆ మరోలా అంటే వచ్చే స్పందన ఇలాగే ఉంటుంది: ‘ఇది మాదే అనే హక్కెవరికీ లేదు’.

  గంతెందుకు? మీరు 1953 ల ప్రత్యేకాంధ్ర కొరకు కొట్లాడినరు. గప్పుడు మద్రాసు కొరకు కొట్లాడి పొట్టి శ్రీరాములు నే పోగొట్టు కున్నరు. గప్పుడు గీ ఇంగిత జ్ఞాన మెక్కడికి పోయిందే? మద్రాసు మాది, ఆంధ్రా మాది… ఓ అమాయక తమిళ ప్రజలూ, మీ రాజధాని మీరు కట్టుకొని చావండి అనే కదా మీరు చెప్పింది. గది అప్పుడే యాది మరిచినరా? గప్పుడు మీరు వేర్పాటు వాదులు కారు, మరి గిప్పుడు తెలంగాణా వాళ్ళు వేర్పాటు వాదులు ఎత్లయినారో చెప్ప రాదె?

  అబ్రకదబ్ర: పదే పదే ఇంగితం అంటున్నారు. Please do not do that again. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రా చీలటం తప్పని ఒప్పుకుంటే వెంటనే మీ తెలంగాణ పాట ఆపేస్తారా? ఆపరు కదా. మరి అనవసరమైన పోలికలెందుకు? ఆంధ్రా చీలిక మీద అభ్యంతరాలుంటే వెళ్లి ఆ ఉద్యమ నాయకుల్నడగండి – వాళ్లింకా బతికుంటే. నన్నడిగితే లాభమేంటి?

  అబద్ధాలు, అబద్ధాలు అని ఒకటే రాస్తున్నవు, ముందు నిజం మాట్లాడడం నేర్చుకో అన్న, అన్ని కండ్లకు కట్టినట్టు కాన పడతయి.

  • 19 to Telangana Yodhudu 10:13 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

   Mundu unna charitraki samadhanam cheppu…….

   ఇలాంటోళ్లు నడిపే ఉద్యమాలు పిచ్చోళ్ల చేతుల్లో రాళ్లు. హైదరాబాదు గురించి వీళ్లో అరిగిపోయిన రికార్డేస్తుంటారు: ‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి హైదరాబాదు రాజ్యం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం’. వీళ్ల అన్ని మాటల్లా ఇందులోనూ నిజం అరకొరే. అసలు నిజమేమిటంటే, 1948 నాటికి హైదరాబాదు నవాబు ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడు. దానర్ధం హైదరాబాదు రాజ్యంలో ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగేవారని కాదు. అదే నిజమైతే 1956లో ‘తెలంగాణ వెనకబాటుదనం’ ప్రాతిపదికగా పెద్దమనుషుల ఒప్పందం ఎందుకు?

   deeniki samadhanam cheppu….yodhudu antunnavu kada??

 14. 20 chaitanya 5:49 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  @ravi

  mottam airport oka prantham dabbula nunchi kattinchara??meme develop chesamu annadaniki samadhanam ade kani..daanni deenitho enduku compare chestunnaro meeke teliyali!!!
  babu..ika nenu cheppalanukunnadi evari bhaaram evaru mostunnaru ani kaadu..asalu hyderabad vishayam vachedi..memu abhivruddi chesamu ani chankalu guddukune pichi prelapanala valla..appudu kachitamga hyderabad charitra tavvalsi vastadi evarikaina…
  hyderabad abhivruddi telugu valla abhivruddi kaani..oka pranthinidi kaadu ani telsukunte manchidi..
  hyderabad development valla edo nashtapoyamu ani anukunevallu antha ka mundu hyderabad valla pondina labhaalu telsukovali ani chesina prayathnam matrame!!!

  chaitanya.

  • 21 Giridhar 5:27 సా. వద్ద ఫిబ్రవరి 27, 2010

   @Chaitanya

   Meeru cheppedi naaku ardham kaavatam ledu, mottam Andra pradesh dabbulu eccharu kosta raayalaseema vallu okkale kaadu antaru, adi praanta abhivruddi kaadu telugu valla abhivruddi antaru. Kaani ekkado hyderabad loo airport kadite rayalaseema lo bhoomi retu peragalede. Aa airport ni base chesukoni chuttu pakkala illu ralede (aa business kooda andhra vaale modalu pettaru boomulu kabja chesaru antaremo meeru) Andhra lo unna manishi atani inti kaada nunchi ne pani cheyatam lede (What I ment is he has to COME to hyderabad for living).

   2/3 dabbulu Airport kadataaniki koosta rayalaseema la nunchi vaste 1/3 telangana nunchi vacchai anukundam, ayipoyina taruvaata memu kooda dabbulu iccham pondahe antunatte kada? Ayina inni maatalu enduku sir ee vyaasam first lone baavi example undi kada.

   Nenu cheppina vishayam okka aiport kokka daanike kaadu Hyderabad rajadaani aani annukonna taruvaata jarigina prati abhivruddi paniki aapadinchavacchu.

 15. 22 pillakaaki 6:25 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  మీ ఈ టపా కోసం చాల రోజులు ఎదురు చూసేటట్టూ చేసారె?
  అయితే ఏమిటి లెండి నిరీక్షణ కి తగ్గ ఫలం !!!
  చాలా బాగా , హత్తుకునెటట్టు చెప్పారు. అంతే కాకుండా ఈ సారి మీ శైలి కూడా అదిరింది. ఒక్క మాట కూడా హెచ్చు లేక తగ్గు లేక వుంది. చాలా రోజులుకి ( ఒక 10 రోజులు అవ్వట్లా మీ టపా వచ్చి?) మంచి టపా చదివాను.
  ఇన్ని విషయాలు ఎక్కడ నుండి తెలిసాయండి?

 16. 23 Ramakrishna 8:04 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  మీ పరిశోధనకి తప్పకుండ ఒక డాక్టరేట్ ఇవ్వాలి. నిజ చరిత్ర కోసం మీరు పడ్డ శ్రమ వృధా కాదు. థాంక్స్

 17. 24 bondalapati 9:04 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  కత్తి మహేష్ కుమార్ గారూ,
  “ఎవరు ఎవర్ని పొమ్మన్నారు హైదరాబాద్ నుంచీ?”

  నిజమే! హైదరాబాదు ని ఆంధ్ర కి కాపిటల్ చెసిన తరువాత, తెలంగాణా వాళ్ళను పొమ్మనం. వళ్ళు అక్కడే ఉద్యోగాలూ గట్రా చేసుకోవచ్చు.ఎవరు ఎవర్ని పొమ్మన్నారు హైదరాబాద్ నుంచీ? 🙂 🙂

 18. 25 vasu.B 9:57 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  మీ విశ్లేషణ చాల బాగుంది. మీరు తప్పక ఈ బ్లాగ్ లో వ్రాసిన విషయాలన్నీ ఇంగ్లీష్ లో తర్జుమా చేసి శ్రీకృష్ణ కమిటీ వారికి నివేదిస్తే దరిద్రపు గొట్టు పాతికమంది శాసనసబ్యులు చేయలేని ఒక మంచి పని చేసినవారు అవుతారు.
  బాబూ తెలంగాణా యోధుడు గారు…
  మీరు ఒకమారు మానసిక వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం వుంది. బుర్ర తక్కువ తెరాస హరీష్ లాగ అడ్డంగా వాదిస్తున్నావ్? మీకు చేతనయితే హైదరాబాద్ లేకుండా తెలంగాణా అడిగి చూడండి!!! పాచి పట్టిన పాత తెలంగాణా ఉద్యమం గురించి విని విని విసుగొస్తుంది.
  ఎం.జి.వి.లక్ష్మణ్ గారు తమరు తెలుగులో ఏడిస్తే బాగుంటుంది. ఓ మీకు తెలుగులో ఏడిస్తే నామోషి అనుకుంటా !!
  ఎవరు సిగ్గు లేకుండా ఇక్కడ వ్రేలాడుతూ ఆంధ్ర వాళ్ళు వుండటం లేదు. మీ తెలంగాణా ప్రాంతం కంటే మా ఆంధ్ర సౌభాగ్యముతో వుంది. సమస్య ఏమిటంటే ప్రతిఒక్క భారతీయుడికి దేశములో ఎక్కడ అయినా జీవించే హక్కు వుంది అని గుర్తించండి. మీకు దయిర్యం వుంటే సిగ్గు వుంటే మమ్మల్ని అన్నట్లే మీ సహా తెలంగాణా వారినందరినీ మా ఆంధ్ర నుండి అలాగే మిగతా దేశము నుండి, విదేశాలనుండి కూడా వెనక్కి వచ్చి తెలంగాణా లోనే ఉండమని డిమాండ్ చేయండి చూద్దాం !!!

  మైక్రోసాఫ్ట్ , ఒరాకిల్,విప్రో,ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా దోచుకుంటున్నారు కదా మీ బహు గొప్ప తెలంగాణా సంపదని వాళ్ళని కూడా పనిలో పనిగా వాళ్ళని కూడా తరిమేసేదానికి పిలుపు నివ్వండి అప్పుడు తెలుస్తుంది నొప్పి.

  మీరు చెబుతునట్లు తెలంగాణా వారికి అంత ఆత్మాభిమానం వుంటే మన మాజీ ప్రధానమంత్రికి ఏ ఒక్కరయినా తెలంగాణలో మద్దతు ఎందుకు ఇవ్వలేదు ??? ప్రతిపక్షములో వున్నా నందమూరి రామారావు గారు నంద్యాల లో ఆయనకు వ్యతిరేకముగా తమ అభ్యర్దిని నిలబెట్టకుండా ఒక తెలుగు వాడు ప్రదాన మంత్రి అయినందుకు మనం ఆయనను గౌరవిన్చుకోవాలన్న గొప్ప వ్యక్తి ఒక ఆంధ్ర వాడు. ఆ ప్రాంతం ఆంధ్ర గమనించాలి !!!

  సైకిల్ తొక్కుకుంటూ తిరిగిన ఇద్దరు స్నేహితులు రామోజీ రావు(గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించిన స్టూడియో,భారత దేశములో అత్యధిక అమ్మకాలతో నాలుగు రాష్త్రముల నుండి ప్రచురింపబడుతున్న ఈనాడు పత్రిక( వారి ఆన్ లైన్ ఎడిషన్ రాంక్ : 1732)ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రియ పచ్చడి లాంటి ఎన్నో సంస్థలని స్థాపించి వేలాది మంది ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చి ( కేవలం ఆంధ్ర వాళ్ళకే గాదు తెలంగాణా మిగత ప్రాంతాల వారికి గూడ ) ) మరియు వేటూరి గార్లు( జాతీయ అవార్డ్ విజేత) ఈ సరస్వతి పుత్రుడి గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు.ఒక దాసరి,ఒక రామానాయుడు,ఒక బాలసుబ్రమణ్యం,( అందరూ గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించిన గొప్పవారే ). అంత ఎందుకు ఢిల్లీ ఆంధ్ర భవన్ కి వెళ్లి చూడు ఎంత మంది ఇతర ప్రాంతాల వారు వచ్చి ఆంధ్ర భోజనం చేసి వెళతారో !!! మిగత రాష్ట్రాలవారి భవన్ లు ఎలా ఉంటాయో . మీకు చేతనయితే మీ తెలంగాణా భవన్ అని ఒక హోటల్ విజయవాడ నది భోడ్డున నడపండి… మీ గొప్ప భోజనాలు రుచిగా వుంటే ఆంధ్ర వాళ్ళు చక్కగా ఆదరిస్తారు.సందేహం వద్దు. మీ గొప్ప నటుడి సినిమా ఈ మద్యన ఆంధ్రలో రిలీజ్ అయ్యింది ఏ సమస్య లేకుండా !!! పరాయి బాష ఇంగ్లీష్ మీద లేనిది ఆంధ్ర వారి బాష మీద మీకు ఎందుకు అంత ద్వేషం???
  మీ వరంగల్ బిడ్డ వైజాగ్ లో ప్రఖ్యాతి గాంచిన ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్స్టిట్యూట్ నడుపు తున్నారు… మరి మా ఆంధ్ర వాళ్ళు చక్కగా ఆడరించుతున్నారు!!! తెలంగాణా నుండి వచ్చి దోచుకు పొతున్నాడు అని ఎవ్వరు వ్యతిరేకిన్చాలేదే !?

  ఖాళీగ ఉన్న కెసీఆర్,దేవెందర్ గౌడ్ లాంటి రాజకీయ నిరుద్యోగులు, సినిమాలు లేక ఖాళీగ ఉన్న ఎంకౌంటర్ శంకర్ లాంటి దర్షకులు,గుర్తింపులేని కవులు,(దేసిపతి స్రీనివాస్) పెద్దగ పని లేని సొమరి సామజిక వుద్యమ కారులు( హరగొపల్),అంధ్ర వారి వూరిలొ అంద్రవారి రెసిదెన్సియల్ స్కూలులొ తన కొడుకుని చదివిస్తూ జై తెలంగాన అంటూ ప్రతి దానికి అర్దం లెని పాటలు ? పాడుతున్న గద్దర్ లానంటి వాల్లు , యూనివర్షిటీలకి ఎందుకు వెళుతున్నమొ తెలియని గొర్రెలు, డబ్బులకోసం విలువలు లేని టీవి చానల్లు,పత్రికలు పెంచి పొషించిన పురాతన కాలం నాటి అవసరం లేని వుద్యమాలకు మీరందరు ఆత్మహత్యలకు,విద్వంసాలకి పాల్పడటం నిజంగ దౌర్భాగ్యం. గత నెల 28 వుదయం 11 గంటల 2 నిమిషాలకి తెలంగాణ చానల్ ప్రారంభం అని ప్రకటించి ఇప్పటికి మొదలు పెట్టాలేని దద్దమ్మ తెలంగణలొ అందరికి అరచేతిలొ స్వర్గం చూపిస్తానంటే కొంతమంది ఇప్పటికి నమ్ముతున్నారు. ఆ చానల్ కి సాంకేతిక సహకారం అంత అంద్రావారి చానల్ టీవి 5 వారే అందిస్తున్నారు(ఇది పచ్హి నిజం) ముస్లిం లకి నాలుగు శాతం రిజర్వేసన్లు కోర్ట్ కొట్టి వేస్తె రేపు తెలంగాణా వస్తే ??? 12% ఇస్తాననే అడ్డగోలు మభ్యపెట్టే హామీలని ప్రకేటించే కే సి ఆర్ ని మీరు నమ్మతమే పెద్దజోక్.
  ————————————————-
  ఓ తెలంగాణా పౌరుడా ముందు ఏదో ఒక బాష నేర్చుకో ;(
  చదవటానికి చాలా చండాలంగా వుంది. సిగ్గు సిగ్గు)
  ఆంధ్ర వాళ్ళు తెలుగు అంటారు
  ముస్లింలు తమ మాతృ బాష ఉర్దూ అంటారు
  తెలంగాణా వాళ్ళు ఏమంటారు ???
  ————————————————

  మంచిబాష,సంస్క్రుతి,వంటలు,సినిమాలు,బట్టలు,పుస్తకాలు మొదలుగునవి ,ఇక్కడివి అయిన పరాయివి అయిన ఆదరించటం నెర్చుకోనండి ముందు !!! అంద్రా వారి మీద పడి అసూయతొ ఏడవటం కాదు.

  ముందు అందరితో పోటీ పడటం నేర్చుకొనండి
  నీచమయిన “రాజకీయ నిరుద్యోగులు” లేవనెత్తే పాచి పట్టిన ఉద్యమాల గురించి సమయాన్ని,ప్రాణాలని,భవిష్యత్తుని నాశనం చేసికోవద్దు.

  ఒకసారి మీ ఒక్క ఉద్యమాన్నే చెప్పుకునే ముందు ఒక బాష సంసృతి ఉండి విడిపోయిన జర్మనీ (ప్రపంచ యుద్ధం కారణంగా అమెరిక,రష్యా ల కుట్రవలన కాని ఆంధ్రుల వలన కాదని తెలంగాణా సహోదరులు గమనించగలరు!!! ) కలిసి పొయ్యాయి, ఎంతో శత్రుత్వం వున్నా 32 యూరోప్ దేశాలు ఒకే జెండా,కరెన్సీ,రాజ్యాంగం, వ్రాసుకొని తమ హద్దులు చెరిపేసుకుని ఒకే దేశీయులుగా బ్రతుకుతూ అమెరిక డాలరుని దెబ్బతీసి యూరోప్ ని అభివృద్ధి పథములో నడిపెదానికి కష్టపడుతూ వుంటే సాటి తెలుగు వారిని పరాయి భాషలో భాగో అంటారా !!! సిగ్గు సిగ్గు

  ఒక్క హైదరాబాద్ కాదు తెలంగాణా కూడా మాదే,తమిళనాడు,గుజరాత్,అస్సాం,కాశ్మీర్ తో సహా భారత దేశములోని ప్రతి అంగుళం మాదే ఏంటంట !!!!!!!!!!

  అనిల్ రాయల్ గారు మీకు మరొక్క సారి అభినందనలు!!!

  మీ బ్లాగులో చాల స్థలం (!?) ఆక్రమించినందుకు క్షమించాలి.
  మీకులాగే ఓ తెలుగోడి భాద !!!

  • 26 అబ్రకదబ్ర 12:51 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

   @వాసు:

   మీరు రాసిన కొన్ని వాక్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒకరినొకరు రెచ్చగొట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు. దయచేసి అటువంటివి రాయొద్దు.

   • 27 శ్రీవాసుకి 11:21 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

    అబ్రకదబ్ర గారు,

    వాసు గారు వ్రాసినది ఫర్వాలేదు. ఆ మాత్రం ఘాటు ఉండాలి. నేనది కోపమని అనుకోవటం లేదు ఆవేదనగా భావిస్తున్నా. ఎంత చెప్పిన, ఎంత వ్రాసిన వాళ్ళకి అర్థం కావటం లేదు మరి. ఎంత కొట్టుకు చచ్చిన వాళ్ళు మనం ఒక్కటే. ఎంత కాదనుకున్నా అన్నదమ్ములం. ఏదో ఒకరోజు నిజం వాళ్ళకే తెలుస్తుంది.

  • 28 కన్నగాడు 6:57 ఉద. వద్ద ఫిబ్రవరి 19, 2010

   @వాసు,
   “ఓ తెలంగాణా పౌరుడా ముందు ఏదో ఒక బాష నేర్చుకో ;(
   చదవటానికి చాలా చండాలంగా వుంది. సిగ్గు సిగ్గు)
   ఆంధ్ర వాళ్ళు తెలుగు అంటారు
   ముస్లింలు తమ మాతృ బాష ఉర్దూ అంటారు
   తెలంగాణా వాళ్ళు ఏమంటారు ???”

   ఒకరు మాట్లాడే యాసని కించపరిచే అధికారం ఎవరికి లేదు, మీరు మాట్లాడే భాష మీద మీకెంత మమకారం ఉంటే మేము మాట్లాడే భాష మీద మాకూ అంతే మమకారం ఉంటుంది, ఒకరి యాసని చూసి సిగ్గు సిగ్గు అనడం మీ విచక్షణకే వదిలేస్తున్నా!
   తెలంగాణా వాళ్ళు కూడా తెలుగు అనే అంటారు, భాషకి యాసకి తేడా గమనించండి. మీరు(నేను కూడా) మాట్లాడే తెలుగులో ఎన్ని ఆంగ్ల పదాలు దొర్లుతాయొ ఒక సారి గమనించి, మేము మాట్లాడే తెలుగులో ఉర్దూ పదాలు దొర్లితే నేరమేంటో వివరించండి.

 19. 31 Sridhar 11:25 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2010

  Excellent and stunning example of what an open mind is capable of achieving and depths it can investigate. Your passion is superlative.

  The separatists on the other hand are constrained to see the larger picture because they have limited themselves to a narrow goal of liberating Telangana. The problem is that they justify their ‘noble’ cause on lies and false accusations.

 20. 32 తెలంగాణా యోధుడు 12:06 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

  @వాసు

  …మంచిబాష,సంస్క్రుతి,వంటలు,సినిమాలు,బట్టలు,పుస్తకాలు మొదలుగునవి…

  మంచి భాష అంటే ఏంది? ఓ, నిన్న N టీవీల జగదాంబ థియేటర్ ఓనరుకి, ఒక అమ్మాయికి మధ్య జరిగి నటువంటిదా. గా మాటలు మాకు రావన్న.

  ఇంక గదేంది? ఓ, సంస్కృతా? నాకు అర్థం గాలేదులే, చాల బాగ రాసినవ్ గద! గదేందో మీదగ్గరే ఉంచుకోన్రి. కొలుములల్ల పిల్లల గాల్చుడు, గట్లాటి సంస్కృతి మాకొద్దన్న. మా సంస్కృతి మాకుంది, గది చాలు.

  వంటలు, యాక్… గయి మీరే దినున్రి, మా వంటలు మాకు చాలు.

  తెలుగు సినిమాలా? పచ్చి బూతులతో నింపినవ్ గదన్న. ఆకార పుష్టి, నైవేద్య నష్టి అన్నట్లు ఎన్ని అవార్డులు సున్నా, బూతులకు మిన్న, మీరు గయ్యే చూస్తరు, గయ్యే తీస్తరు.

  దయ చేసి బట్టలు, పుస్తకాల గురించి నాకు చెప్పకన్నా, బాగుండదు.

  బుర్రా? గదేంది? మా తెలంగాణా భాషల బుర్ర అంటే ఖాళి డొల్ల అని అర్థం. మాకు బుర్రే కాదన్న, దాని లోపల మెదడు కూడా ఉన్నది. మీతోటి సంబంధం ఒద్దు మొర్రో అంటే వెంట బడుతున్నారే, ఉన్మాదుల లాగ, మీరు చూపించు కొండి, మా ఎర్రగడ్డ దావఖానల.

  నా భాష నాకు తెలుసు, ముందు నువ్వు ఏ వూరి వాడివో ఆ భాష నేర్చుకో, చేతనైతే.

  అన్నా, తెలువక అడుగుత. అంధ్రాల శ్రీకాకుళం నించి, చిత్తూరు దాంక ఒక్క లాగ మాట్లాడుతున్నారా? జర చెప్ప రాదు? నేను మాట్లాడేది తెలుగు భాష. తెలంగాణా మాండలికం. నా భాషల తెలుగు పదాలే ఉంటయి, లేక పొతే హిందుస్తానీ పదాలు ఉంటయి. మీ లాగ పరాయి దేశపు పదాలు కాదు. నా భాష మంచేందో, చేడేందో నాకు తెలుసు. నీ దేవ లోకపు భాష నువ్వే మాట్లాడు.

  నా భాష గురించి కాదన్న, చేత నైతే నేను చెప్పిన దాని గురిచి మాట్లాడు.

  • 33 dkc 10:29 సా. వద్ద ఫిబ్రవరి 18, 2010

   @తెలంగాణా యోధుడు

   అవ్ అల అంటావేమి అన్న మన తెలంగాణ కంటే గ్రేట్ ఆ ఆంధ్ర వాళ్ళు?
   వాళ్ళ దాన్లో ఒక చిన్న పోరినే కొలిమిలో పెట్టి కాల్చిండ్రు గదా?అదే మన దాన్లో గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో బాంబులు పెట్టి 100 మందిని చంపితిమి గాదె……..?

   మన పొరల్లు పనికి రారు అంతవ అన్న? మన సైడ్ అసలు లేడీస్ తో ఇలా మాట్లాడరు అంటవ?
   ఇంకా వంటలంటావా అన్న ఎక్కడ చూచిన ఈ ఆంధ్ర కర్రీస్ అని పెట్టి మన సైడ్, వాళ్ళ వంటలు ఎందుకు చేస్తున్నారు అన్న ?అవి యాక్ అనా ?

   సినిమా అంటవ ఇప్పటికి రెండు సైదుల కలిపి ఒకరే తీస్తునారు కాబట్టి మనమేమి అనలేము……..!

   అదేంది అన్న ఆలానావ్?వాళ్ళ సైడ్ బుర్ర అంటే మెదడు అని,మన సైడ్ కాళీ అని.కాబట్టి వాళ్ళ తలలో మెదడు వుంటే మన తలలో కాళీ వుంది.ఎమంటవే అన్న?

   ఇంకా కొత్తగా వూరి బాష ఏంటి అన్న?అందరిది తెలుగు, ప్రాంతం ని బట్టి యాస మారుది.అది మర్చిపోయినవ ఏంటీ?

   పుస్తకాలూ బట్టలు గురించి వద్దు అన్నావ్ కాబట్టి చెప్పట్లేదు.అది నువ్వు చెప్పినావు కాబట్టి.

   ఇంకేమంటవే అన్న?

 21. 34 chaitanya 5:00 ఉద. వద్ద ఫిబ్రవరి 19, 2010

  @vaasu..

  కలిసుంటె కష్టాలు తీరవు అని ఒకరు.. కాదు కలిసుందాం అని ఒకరు..
  కలిసుందాం అనేవాళ్ళు,కలిసుండి ఇలా కష్టాలను తీర్చుకోవచు అని చెప్పాలి కదా.. మరి అదెంటో…ఎవరు చెప్పరు???
  ఒకరేమొ కష్టాలు ఉంటె ఉన్నై..కలిసే ఉందం అంటారు!!ఒకరేమొ కష్టాలు లెవు..అన్ని అబద్ధపు కష్టాలు అంటరు..
  కలిసుంటె ఎలా కష్టాలు తీరుతాయూ చెప్పండి చాలు.అప్పుడు discussion ఎ ఉండదు కద??GO lu,agreements,formulae all tried out..so come out with something new..

  ఇక వాసు గారు..తెలంగాణ యొధుడి బాష ఎల ఉన్న..మీరు,మేము అనె మీ బాష ఇంకా super,ultimate..మీరు సమైఖ్య ఆంధ్ర కొరుకుంటున్నాను అని చెప్పకండి..మన తెలుగు తల్లి బాధ పడుతది….
  వారు హ్య్దెరబద్,విజగ్ అన్నితిని కేంద్ర ప్రాంతాలుగా చెస్తార అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండ ఎదొ మట్లాడితె ఎల?? వారి point logical ఏ గ??

  “బుర్ర తక్కువ హరిష్ రావు”
  ప్రత్యేక తెలంగాణ వస్తే ఎలా కష్టాలు తేరుస్తారో చెప్పిన ఎకైక తెలంగాణ లేదెర్..నాకు తెలిసి..అందుకేనా బుర్ర తక్కువ??మీరు చెప్పండి మరి అలా కకుండా ఎలానొ??
  ఇక మిగతా నాయకులు,వ్యక్తుల మీద మస్తు మాత్లాడారు..భాషే సక్కగ లేనప్పుడు ఇక మీ వాఖ్యలు కూడా ఎవడైనా పట్టించుకుటడా??
  మీ బాషలొనే మిగతావి చెబుతాను..అప్పుడు correct గ అర్థం అవుతుంది ..

  ఆంధ్ర భవన్ మీ డబ్బులతో కట్టించినావ??లేక ఆంధ్ర ప్రాంథ దబ్బులతో కట్టించినావ?? అది AP భవన్ దొరా..అంటే మాది కుడ…ఇంక కొత్తగా తెలంగాణ భవన్ నువ్వు కట్టిస్తె కట్టించు..తప్పకుండా తెలంగాణ వాళ్ళు ఆదరిస్తారు…అలవాటెగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరినీ ఆదరించడం!!!
  భాష,సంస్కృతి..ఏం అహంకారమో ఏందో??ఏం చుసుకొనో మాత్రం తెల్వదు!!!నీ భాష లొ ఉర్దు లెదు అనుకుంటున్నావ?? తారీఖు??ఖైది??హైరాన??ఉర్దు కాద ఇది??తెలంగాణ లొ ఉర్దు మాటలు వస్తై..వస్తే??కాలక్రమెణా జరిగిన మార్పులు అవి..ఐతె..నీకెంటి బాధ??
  తెలంగాణ వాల్లు చెప్పుకొడానికి తెలుగు ఉన్నది..తెలంగాణ అంటెనె తెలుగువాల్లు ఉండె ప్రాంతం అని.. ఇప్పుడు అలొచించుకొండి మీది ఎం బాష అని చెప్పుకొవాలొ..తెలుగు అని చెప్పుకున్న అభ్యంతరం చెప్పదు నా తెలంగాణ..
  నువ్వు ఇలా అడిగినాక కూడా తెలంగాణ నీది అంకుంటున్నావ?? దాంట్లొ గడ్డి పోచు కుడ నీది కాదు..తెలంగాణ దాన్ని ఆరాధించెవాళ్ళది..ఏ ప్రంతం ఐనా..ఏ రాష్ట్రం ఐనా..
  ఇక సంస్కృతి…మీ పై కోపం ఉన్నా, మర్యాదగ మట్లాడటానికి ప్రయత్నిస్తున్నా చూడండి.. అది తెలంగాణ సంస్కృతి..మొత్తం తెలంగాణని అన్నారు చూడండి..అది ఎం సంస్కృతో నాకు తెలిదు మరి??

  ఇక సమైఖ్యంధ్ర ఉధ్యమం అంటె క్చ్ర్ ని తిట్టుకోవడమే ఆయె..తెలంగాణ ఉధ్యమం లొ కూడ అంత తల్చుకొని ఉండరు..ఎంతైనా he is just part of the movement and not the movement itself కద..

  ఎవరితో పోటి పడి ఏం నేర్చుకోవాలి..దోచుకొవడమ?? అస్సిగ్నెద్ భుములు కబ్జ చేయడమ??(అలా చెస్తేనె మీరు చెప్పిన ఋFఛ్ తయరు ఐంది)..20% క్రిష్న నది పారుతుంటె 80% నీళ్ళు తీసుకొవడమ?? యేర్ కి 2,3 పంటలు వెసుకుంటు,దానివళ్ళ, నీళ్ళు రాక మిగతా చోట్ల రైతులు అథ్మహత్యలు చెసుకున్న కూడ పట్టించుకొకపొవదమ??పలమురు కి రవల్సిన నెళ్ళని..పైపులు పలగొట్టి పొలలకు మరలించుకొవడమ?? ఎం నెర్చుకొవలి??ఎంతి మీ నుంచి నెర్చుకునెది??పోటి పడగలిగే ప్రతి దాంట్లొ వెనుకంజ వేయరు తెలంగాణ వాళ్ళు..ఇక్కడి educational infrastructure నాశనం చేయబడి,దాని వల్ల economicalగ దెబ్బతిన్నవాళ్ళు కాబట్టె వెనకబడ్డారు..educational infrastructure మీద already చెప్పాను..కావలంటె చూసుకొండి..
  నేర్చుకొవల్సింది మీ లాంటి వాళ్ళు..ఇంతగా అందరిని ఆధరిస్తున్న తెలంగాణలోని రెసౌర్చెస్ ని నశనం చెస్తుంటె, పట్టించుకొవాలి అని,తెలంగాణ కష్తాలను అర్థం చెసుకొవాలి అని,తెలంగాణ నాయకులను ద్వేషించడం కాదు,తెలంగాణ ప్రజలను ప్రెమించాలి అని!!అది నేర్చుకొండి ముందు..తరువాత చెబుదురు ఎమైనా ఉంటె!!!

  అయ్యా..కలిసుందాం అనుకుంటే..కలిసుండి కష్టాలు ఎలా తీర్చుకోవాలో తెలిస్తే చెప్పండి..లెకుంటె ఊరుకొండి..పర్లేదు..అంథె కాని రష్ట్రం విదిపొకముందీ తెలుగువాళ్ళని విడగొట్టకండి..అర్థం పర్థం లేని వాదనలతొ!!!

  lastly..”పాచి పట్టిన తెలంగాణ ఉద్యమం”…
  తెలంగాణ చరిత్ర తెల్సుకొండి ముందు..ఆ తరువతా మీకు ఉద్యమం గురించి మట్లాడె హక్కు ఐనా కొంచెం ఉంటుంది..ఏ హక్కుతో అన్నావు ఆ మాటలని?? కడుపు మంటతొ వచిన ఉద్యమం తప్ప..ప్రజా ప్రతినిధులు రాజినామ చెసేంత వరకు గుర్తుకు రాని ఉద్యమం కాదిది…
  వలసలు,రోగాలు,వివక్ష చూసి వచ్చిన ఉద్యమంగా అందుకె పాచి పట్టీంది..భుములు,ఆస్థులు,hyderabad తప్ప మిగతా తెలంగాణ ఏమైన పర్వాలెదు.. అనుకొలేదు కదా,అందుకు పాచి పట్టింది..ఇక్కడే ఉంటు,తెలంగాణ మీద ఆదరపడి బతుకులీడుస్తు, ఈ ప్రంతాన్ని,ఇక్కడి ప్రజలని ఇన్ని మాటలు అనె అంతమంది నయవంచకులని ఆధరిస్తుందిగ.. అందుకు పాచి పట్టింది..
  మరి ఆ పాచి కే భయపడి పోతున్నరు ఎందుకు అండి?? ny hidden reasons??

  chaitanya!!!

 22. 35 vasu.B 1:15 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

  * ఏమిటో… పీ.వి.నరసింహ రావు గారికి తెలంగాణలో ఒక్కరైన తమ సీట్ ఖాళీ చేసి అయన ఎంపీ అయ్యేదానికి సహకరించలేదు ? ఎందుకు ? అంటే ఏ ఒక్కరు సమాధానం ఇవ్వరు !
  * ఆంధ్ర వారిలాగే ఇతర ప్రాంతాలవారు కూడా ” భాగో ” అని ఎందుకు పిలుపులివ్వరు అంటే సమాదానం లేదు !!
  * ఒక భాష,సంస్కృతీ ఉన్న రెండు దేశాల వారు ( జర్మనీ ) కలిసిపోయిన ఉదంతాన్ని ఎవరూ ప్రస్తావించరు !!!
  ఎందుకు తెలంగాణా టీవీ చానెల్ కి టీవి ౫ ( ఆంధ్రా వారిడి ) వారి సాంకేతిక సహకారం తీసికున్తున్నారు… కేవలం తెలంగాణా వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు …. సమాదానం ఏది ????
  * సాటి తెలుగు వారిని( భారతీయులని ) తమ స్వంత రాష్ట్రములో తమ రాజధానిలో వుంటే వలసవాదులు, ఇక్కడే చూరు పట్టుకు వ్రేలాడే వాళ్ళు అంటూ కించపరుస్తూ ఉన్న ఏ ఒక్కరూ ఖండించరు !!!!
  ***ఒక ఎమ్యే చదువుకుని శాసన సబ్యుడిగా, కేంద్ర మంత్రిగా,ఉప సభాపతిగా ఉండి మాట్లాడిన, ఇంకా మాట్లాడుతున్న బాషకి + ఒక మామూలు యువతి తనకు జరిగిన అన్యాయాన్ని( !?? ) చెత్త చానల్స్లో మాట్లాడిన చెత్త బాషకి ఒకే స్థానమిస్తున్నారా లేక ఇద్దరూ ఒకే స్థాయి వ్యక్తులుగా గుర్తిస్తున్నారా !!!!!
  * నేనెక్కడ తెలంగాణా వారిని కించపరచటం లేదు 🙂 సహోదరులు అనే పిలుస్తున్నాను !!!!!!
  * గుండెల మీద చేతులు వేసుకుని ఆత్మ సాక్షిగా చెప్పండి, దామోదర్ రెడ్డి అనే గొప్ప తెలంగాణా వాది ( ఇతను మన తెలుగు చలన చిత్రరంగానికి రాకపోవడం నిజ్జంగా మన దురదృష్టం… ప్చ్ .. గొప్ప నటుడిని కోల్పోయాం ) రెండు నెలల క్రితం వరకు ఎప్పుడయినా తెలంగాణా అని అన్నారా ! మీరు విన్నారా !!!!!!!
  * శ్రీమాన్ జాన రెడ్డి గారు తన పదవీ కాలములో ఎప్పుడయినా తెలంగాణా అని గానం చేసారా !!!!!!!!
  * ఇక మహా రాజశ్రీ జీవన్ రెడ్డి గారు తన పదవిఏ కాలములో తెలంగానని వ్యతిరేకించి … ఇపుడు ఖాళీగా ఉన్నందునే జై తెలంగాణా అనటం నిజం కాదా !!!!!!!!!
  * ఇక మా చిట్టి చెల్లి కవితమ్మ గురించి ౨౦౦౯ కి ముందు ఎవరికయినా తెలుసా !!!!!!!!!!!
  * మహా నటి విజయ శాంతి గారు ఇంకా దిలీప్ గారు,ప్రకాష్ గారు, రామ్నాయక్ గారు ఇంకా బోలెడు మంది తెరాస పార్టి కేసీఆర్ కుటుంబ వ్యవహారం గా మారింది, తెలంగానని…ఉద్యమాన్ని తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటునారు అని ఆరోపించి బయటకు వెళ్ళింది నిజామా కాదా !!!!!!!!!!!!!
  * ఏ ఒక్క సంపన్న కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తీ లేదా ఒక విద్యార్ది అయిన తన మనస్పూర్తిగా అలోచించి తను చనిపోయే ముందు ఈ బహు గొప్ప తెలంగాణా వాదులని నిలదీసి మీరు తెలంగాణా నీళ్ళ కోసం,నిధుల కోసం,వసతుల కోసం ఎందుకు పోరాడరు కేవలం రాజకీయ లబ్ది చేకూర్చే తెలంగాణా రాష్ట్రం కోసమే ఎందుకు అని ప్రశించారా …. ఒక్కరయినా …..!!!!!!!!!!!!!!
  * ఎందుకు గద్దర్ గారు తన పిల్లలని మోహన్ బాబు గారి శ్రీ విద్య నికేతన్ ( వలసవాదుల తిరుపతి…ఆంధ్రలో !? ) లాంటి ఖరీదయిన కళాశాలలో చదివించారంటే జవాబు లేదు ???????
  * ఎందుకు తెలంగాణా లో షూటింగ్ లని ఆపటం…సెట్లు తగల బెట్టడం… శుబ్రంగా తెలంగాణా నటులని,సాంకేతిక నిపుణులని ఆంధ్ర వారి సినిమాలకి పనిచేయవద్దు,నటించవద్దు,ఆంధ్ర వారి సినిమాలు చూడవద్దు అని ఒక ఫత్వా జారీచేయ మనవచ్చు కదా…శ్రీమాన్ హరీష్ రావు మరియు బృందాన్ని !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  * రాజకీయాలకు కొత్త అయిన శ్రీ జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి విష్ణు ఒక చక్కని మాట చెప్పారు. కేసీఆర్ మాటి మాటికి రాజీనామాలు చేస్తాడు కదా…మాటి మాటికి నిరాహార దీక్షలు ఎందుకు చేయడు.ఇప్పుడు ఆస్పత్రిలో కాకుండా బయట ఎందుకు నిరాహార దీక్షకి కూర్చోడు… ఈ ప్రశ్న ఒక తెలంగాణా అబ్బాయిది 🙂 నిజం అవునా కాదా !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  * ఏమిటో …శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారు చనిపొతే కొన్ని వందల మంది !!??? చనిపోయారు (గుండెపోట్లు,ఆత్మహత్యలు వగైరా)..అలాగా ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, శాసన సబ్యుడు కాని చనిపోలేదు 😦 ఇక్కడ తెలంగాణలో ఒక్క శాసన సబ్యుడు కాని, వారి పిల్లలు కాని..కనీసం ఒక్క ధనికుడి పిల్లవాడు అయిన ఆత్మహత్య చేసుకున్నాడా… కేవలం పేద,వెనుక బడిన తరగతికి చెందిన వారే ఎందుకు బలి అవుతున్నారు. !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  * కేసీఆర్ గారు తెలంగాణా వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము అనిచెప్పి తీరా జై తెలంగాణా ఉద్యమానికి తన వంతుగా ఒక సభలో మాట్లాడుతుంటే కోడిగుడ్లు,టామోటాలతో మందకృష్ణ మాదిగ గారిమీద, దేశిపతి శ్రీనివాస్ గారిమీద దాడి చేయించటం ఇది ఆంధ్ర వారి ఆరోపణ కాదు, సాటి తెలంగాణా వాది ఆరోపణ… ఇది ఎందుకు జరిగింది ఏ తెలంగాణా వాది అయిన ప్రశినించారా…ఈ దాడి ఇతరులెవ్వరు ఎదగ కూడదు కేవలం తన కొడుకు,కూతురు,మేనల్లుడుమాత్రమే తెలంగాణా వాదులా. !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  * కెనడా దేశములో ఉన్న క్యూబెక్ ప్రావిన్సులో అధిక సంఖ్యలో ఉన్న ఫ్రెంచ్ వారు మాకు ప్రత్యెక దేశము కావాలని ఉద్యమం చేసి రెఫరెండం కోసం వోప్పుకున్నట్లుగా( ఆకరికి ఫ్రెంచివారి కోరిక రెండు శాతం వోట్ల తేడాతో వీగిపోయింది 😉 ప్రజాసామ్యయుతంగా మీరు కూడా ఎందుకు రేఫెరెండం కోసం అడగరు… మీరిప్పుడు అడిగినట్లుగానే భవిష్యత్తులో తెలంగాణలో ఒకటో రెండో జిల్లాల వారు తమకు ప్రత్యేక రాత్రం కావాలంటే ఒప్పుకుంటారా !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  * మా తెలంగాణా కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి మాదే గొప్ప ఉద్యమం అనేవాదానే గొప్పదయితే, మరి కాశ్మీరులో కొంతమంది దారితప్పిన మన దేశ యువతతో పాటు పాకిస్తాన్,ఆఫ్గనిస్తాన్,బంగ్లాదేశ్ ఇంక మరికొన్ని దేశాల వారు తము చస్తూ ( దానికి జీహాద్ అనే గొప్ప ముసుగు ) కొంతమందిని చంపుతూ ౧౯౪౭ నుండి ఉద్యమం చేస్తున్నారు మరి వారికి ప్రత్యేక దేశానికి వోప్పుకుందామా ??????????????????????????????
  * ఎందుకు రాజకీయ నాయకుల రాజీనామాలనే అడుగుతారు ??? కోదండ రామ్ ( రెడ్డి ) గారి రాజీనామా అడగరు తెలంగాణా వాదులు ??????????????????????????? !!!!!!!!!!!!!!!!!!!!!!!
  * మీడియా వారు కేవలం తెలంగాణా ఉద్యమానికే ఎందుకు ఇంత ప్రాచుర్యం కల్పిస్తారో తెలుసా.. డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి, తెలంగాణా రౌడీల సమితి వారి… మన్నించాలి తెలంగాణా రాష్ట్ర సమితి వారి తెరవెనుక రాయబేరాలు,బెదిరింపులు కాదా !!??!!??!! కొంతమంది స్వార్ధ పూరిత కారణాలతో కూడా అని నేను ఆరోపించటం లేదు… పచ్చి వాస్తవం..నిజం… నా సమక్షం లోనే ఎన్నో సంఘటనలు చూసాను విన్నాను ( నా దురదృష్టం కొద్ది నేను మీడియాలో పనిచేస్తున్నాను ) 😦 😦 😦 ఇది నిజం కాదు అని తెలంగాణా వాద మిత్రులు మనస్పూర్తిగా ఖండించాగలరా ???????????????????????????????????????????????? 😦
  * ఎక్కడో దూరాన ఉన్న గుజరాత్ వాళ్ళు,అంబాని సోదరులు మన పెట్రోలియం దర్జాగా గొట్టాల ద్వారా తరలించుకుని పోతుంటే లేని బాధ సాటి ఆంధ్రులు తమ కష్టార్జితంతో,తెలివితో ఒక రెడ్డి లాబ్స్,ఒక సత్యం,ఈనాడు,రామోజీ ఫిలిం సిటీ,అమృతాంజనం,ఆంధ్రజ్యోతి,ఆంధ్రబాంక్,స్టూడియో ఏన్, అన్నపూర్ణ,పద్మాలయ,రామానాయుడు స్టూడియో,మా టీవీ,ఈ టీవీ,ఐ మాక్ష్,ప్రసాద్ లాబ్స్ లాంటి అన్ని ఆంధ్ర వారివే.. దేవుడా ఇక్కడి సంపదనంత దోచుకుంటున్నారు అని అసూయతో కాక విద్వేషముతో కాక నిజంగానే ఈ వాదనలో పసలేదు అని ఎవరైయిన తెలంగాణా వాద మిత్రులు ఖండించారా !?????
  * అసలు ఈ ఉద్యమములో ఎందుకు అందరు “రెడ్లు”, ” వెలమలు” మాత్రమే నాయకులుగా వెలుగుతున్నారో ఎపుడయిన ఎవరయినా ప్రశ్నించారా !!! ఆలోచించారా ?????
  * తెలంగాణా ఉద్యమ కర్త గా కాళ్ళకు దండాలు పెట్టె కేసీఆర్ గారు శంకర్ గారిని( మన్నించాలి కీసీఆర్ గారిలాగే నేను కూడా అయన పూర్తిపేరు మరిచిపోయాను ) ఎప్పుడు ఎందుకు మూలాన పెట్టారు 😉 కోదండ రామ్ ( రెడ్డి ) గారికి ఎందుకు అరిచే పెత్తనం కట్టబెట్టారు.. ఎందుకు ? ఏమిటి??? ఎవరూ బదులివ్వారే ????????????????? 😉
  * ఆలూలేదు చూలు లేదు … ఎన్నికలలో పోటీ చేసేదానికి ముస్లిమ్లకి కనీసం తన పార్టీ టికెట్ ఇవ్వని ఈ పెద్దమనిషి, 4 % రెజర్వేషన్లు కోర్ట్ కొట్టి వేస్తె 12 % ఇస్తాను అని పిచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసింది ఎవరూ ఖండించారెందుకు తెలంగాణా వాద మిత్రులారా ??? సమాధానం ????
  * రాష్ట్రం విడిపోతే తమస్వార్డమే కాని రాజధాని కోల్పోయిన రాయలసీమ వాసులగురించి, ఇతర సీమాంధ్రుల గురించి ఎవరయినా సానుభూతి చూపించారెందుకు ??? అది మా సమస్య కాదు మాకు మా తెలంగాణా హైదరాబాద్ తో కలిపి కావాలంతే అని అడ్డగోలుగా వాదించే తెలంగాణా వాదులు స్వార్దాపూరితులు కాక మరేమవుతారు ??????????
  * ఆంధ్రా వారి ఉత్పత్తులు,సేవలు బహిష్కరిస్తాం అని బెదిరించే బహుగోప్ప తెలంగాణా వాద నాయకులని ఎందుకు టామోటాలతో , కుళ్ళిన కోడిగుడ్లతో కొట్టరు తెలంగాణా మిత్రులారా ?! వీరా రేపు తెలంగాణా వచ్చిన తరువాత ఆంధ్రులకి రక్షణ కలిపిస్తాం అని హామీలిచేది ???????
  * చెప్పాలంటే ఇలాగె బోలెడు విషయాలు వున్నాయి కాని ఇది నా బ్లాగ్ కాదు !!!!
  చరిత్ర ని తవ్వకండి ! వర్తమానములో వుండండి..ఆలోచించండి..అందమయిన చక్కటి భవిష్యత్తు కోసం కష్టపడదాము.

  ఇంత ఓపికతో రాత్రి 12-45 వరకు వ్రాసి ఒకటికి నాలుగు మార్లు చదివి పోస్ట్ చేయడానికి కారణం ఓ తెలంగాణా మిత్రులారా మిమ్మలనందర్నీ సాటి తెలుగు వారిగా ఆంధ్రావారిగా అభిమానించటం,
  ( నా మేనకోడలికి ఈ మద్యన్నే ఒక తెలంగాణా డాక్టర్కి ఇచ్చి పెల్లిచేసాం…) నా మిత్రులు ముగ్గురు తెలంగాణా వాళ్ళు … నాకు ఉద్యోగానికి రేకంమేండ్ చేసింది ఓ తెలంగాణా మిత్రుడు( అతను సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నాడు ) నాకు కేవలం కోపమంతా స్వార్ధ రాజకీయులమీద మాత్రమే..
  కలసి వుంటే కలదు సుఖం… కలసి వుండాలని కోరుకోవటం పాజిటివ్ థింకింగ్ 😉 విడిపోవాలనటం నేగాటీవ్ థింకింగ్ ;(
  ఆఖరుగా ఎవరయినా తెలంగాణా సహోదరులకి మనస్తాపం కలిగించి వుంటే మన్నించండి ************** 😉
  >>> కాని నేను లేవనెత్తిన ప్రశ్నలకి కొన్ని అయిన జవాబు లివ్వండి 😉
  వాసు.బి

  • 36 అబ్రకదబ్ర 1:30 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

   మంచి సందేహాలు. సమాధానాలు రావులెండి. మహా ఐతే ఎదురు ప్రశ్నలొస్తాయేమో 🙂

   ఓపికగా రాసినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నలకి సమాధానాలు రాకపోయినా, వేర్పాటువాదులు నాటిన విషబీజాలు పాదుకున్న కొందర్లోనన్నా అవి ఆలోచన రేకెత్తిస్తాయి.

   మీకున్నట్లే, నాక్కూడా రాష్ట్రం ముక్కలవకూడదని కోరుకునే తెలంగాణ మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వ్యాఖ్యలు రాసేవారు, మౌన పాఠకుల్లోనూ కూడా అటువంటివారు చాలామందే ఉన్నారు. వాళ్లలో కొందరు ఈ వ్యాసాల కోసం విలువైన సమాచారాన్నీ, సలహాలనీ సైతం అందిస్తున్నారు.

 23. 38 అబ్రకదబ్ర 2:08 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

  @యోధుడు:

  మీ కామెంట్ మధ్యలో దూరి రాయటం అనేది అభ్యంతరకరం ఎందుకయిందో వివరిస్తారా? మీ ప్రతి ప్రశ్నకీ వివరంగా సమాధానాలు ఇవ్వాలంటే అలా inline comments చెయ్యటమే సరైనదని, గందరగోళం లేకుండా ఉంటుందని ఆ పద్ధతి ఎంచుకోవటం జరిగింది. పైగా నాకెదురయ్యే ప్రతి ప్రశ్నకీ విడివిడిగా సమాధానాలిచ్చుకుంటూ పోతే, నా టపాలకి నే రాసే కామెంట్ల సంఖ్యే ఎక్కువైపోతుందన్న కారణమూ దాని వెనకుంది. అందులో తప్పు పట్టాల్సిందేముంది? మీ కామెంట్‌లో ఒక్క అక్షరమన్నా నేను మార్చినా, తొలగించినా మీరు అభ్యంతర పెడితే అర్ధముంటుంది. నేనా పని చెయ్యలేదే.

  ఇక మహారాష్ట్ర/గుజరాత్ రాష్ట్రాల చరిత్రకి వికీపీడియాలో చదివిన వ్యాసాలు ఆధారంగా ఉటంకిస్తున్నారా!?! వికీలు ఎలా పని చేస్తాయో మీకు తెలీదా?

  ‘తోక ముడవటం’: ఆధారాల్లేకుండా గాల్లోంచి సృష్టించిన వార్తలు నేను రాయను. మీకు లేకపోయినా, నా బ్లాగు చదివేవారిలో అత్యధికులకి నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. ప్రతిదానికీ ఆల్రెడీ ఉన్న ఆన్లైన్ లింకులు ఇవ్వాలంటే కుదిరే పని కాదు కాబట్టి నేను మీకివ్వలేను. మీకోసం నేను ప్రత్యేకంగా నా దగ్గరున్న గజెట్స్/పుస్తకాల స్కాన్స్ తీయించి పెట్టాల్సుంటుంది.

  ‘ఇంగితం’: వ్యంగ్యం అనేది ఓ ప్రత్యేకమైన రచనా పద్ధతి. అది నా టపాల్లో వెల్లువెత్తితే తప్పు పట్టాల్సిన విషయం కాదు. రాజకీయాల విషయంలో ఈ శైలి వాడటం నాతోనే మొదలు కాలేదు. నా టపాల్లో ఎలాంటి భాష వాడినా – నేను మీతోనూ, మీలాంటి మరికొందరు తెలంగాణ ఉద్యమ మద్దతుదారులతోనూ కామెంట్లలో వాడే భాష ఎలా ఉంటుంది? మీనుండి నేనూ అదే ఆశించటం అత్యాశ కాదనుకుంటా.

  ‘తప్పని ఒప్పుకో’: నాకేమిటి ఆ అవసరం? అవి నే నడిపిన ఉద్యమాలా? అవి జరిగినప్పుడు నేను లేను. ఉంటే అప్పుడే వాటినే వ్యతిరేకించేవాడినేమో.అయినా అడిగారు కాబట్టి చెబుతున్నా. అప్పుడు ఆంధ్రావాళ్లెంత అరిచి గీపెట్టినా మద్రాసు రాలేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్లకీ అదే జరగాలి కదా మరి. అప్పుడు వాళ్లలా చేశారు కాబట్టే ఇప్పుడు మేమిలా చేస్తున్నాం అంటే, అప్పుడు వాళ్లకి జరిగిందే ఇప్పుడు మీకూ జరగాలి. గతజల సేతు బంధనాలెందుకు? ఇలాంటివన్నీ చొప్పదంటు ప్రశ్నలు. చర్చని దారి మళ్లించే ప్రయత్నాలు.

  ‘ఇడుపులపాయ’: హైదరాబాద్ భూములమ్ముకున్న సొమ్ము నా జేబులో చేరిందని మీ అనుమానమా, లేక నమ్మకమా? ఇడుపులపాయ భూములైనా, ‘సొమ్ములు పోనాయండి’ అని ఓ మంత్రిగారన్నా, అవన్నీ ఆయా నాయకుల అవినీతికి తార్కాణాలే తప్ప ఆంధ్రోళ్ల దోపిడీకి కాదు. ఆ సొమ్ములన్నీ ఏ ఒకరిద్దరు నాయకుల అకౌంట్లలోకో పోయాయి. వాటితో ఆంధ్రా/సీమల్లో వెల్లివిరిసిన అభివృద్ధేమీ లేదు. తెలంగాణ మంత్రుల్లో, నాయకుల్లో మాత్రం దొంగల్లేరా? రాజకీయం దగ్గరికొస్తే అందరూ దొంగలే – ఏ ప్రాంతం వారనే దానితో సంబంధం లేకుండా. మనలో మనం తన్నుకునేలా చేసి వాళ్లు ఊళ్లు పంచుకు తింటున్నారు. ఈ ఉద్యమాల మాయలో పడకుండా, ఆ ఆవేశం అందరం కలిసి దొంగ నాయకుల మీద చూపిద్దాం. మీరు గమనించారో లేదో, ఈ ఎనిమిది టపాల్లోనూ నేనెక్కడా ‘సమైక్యాంధ్ర ఉద్యమం’ అనేదాని ప్రస్తావన తేలేదు, అది నడిపేవారిని వెనకేసుకూ రాలేదు. ఎందుకంటే, అది నడిపేవారికి వాళ్ల ప్రయోజనాలు వాళ్లకున్నాయన్న అవగాహన నాకుంది కాబట్టి. అదే అవగాహన తెలంగాణ ఉద్యమం మీద మీలాంటి వారికీ కలిగించటం నా టపాల పరమార్ధం.

  • 39 తెలంగాణా యోధుడు 2:49 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

   @అబ్రకదబ్ర

   ప్రత్యేక మహారాష్ట్ర ఉద్యమం దరిమిలా మహారాష్ట్ర ఏర్పడిందా లేదా? అది చెప్పండి. ఊక దంపుడు ఎందుకు?

   వ్యంగ్యం: చెప్తున్న కద, మొదటి నుంచి అంతే, మీరు రాస్తే వ్యాకరణం, మేము రాస్తే బూతులు. మీరు మినహాయింపేమీ కాదు.

   తీరా ప్రశ్న అడిగే సరికి సమైఖ్యాంధ్రని బలపరచ లేదు అంటరు. వాళ్ళ అబద్ధాలు మీకు కనబడ లేదా? తెలంగాణా వాదుల అబద్ధాలే కన పడ్డయా? అవి ఎందుకు రాయరు? మీ నైజం ఇక్కడనే బయట పడలేదా?

   ఎంత గీపెట్టినా మీకు మద్రాసు రాలేదు. ఎందుకు? అది తమిళ నాడుల అంతర్భాగం కాబట్టి. అట్లనే ఎంత గీ పెట్టినా గుజరాతీయులకు ముంబాయి రాలేదు, ఎందుకు? అది మహారాష్ట్రల అంతర్భాగం కాబట్టి. ఆ విధంగనే మీరు ఎంత గీ పెట్టినా, గోల పెట్టిన హైదరాబాదు మీకు రాదు, ఎందుకంటే అది తెలంగాణాల అంతర్భాగం కాబట్టి.

   ఇప్పుడు పాయింటు కొచ్చినారు. రాజకీయ నాయకులంత ఒక్కటే. సొంత ప్రయోజనాలు ఆశించే స్వార్థ పరులే. మాటి మాటికి ‘మీ నాయకులు, మీ నాయకులు’ అని మీరు ఎందుకు దెప్పి పొడుస్తరు? మేం కోరుకునేది నాలుగు కోట్ల జనాభా కలిగిన జాతి స్థానిక స్వపరిపాలన. ఏ జాతీ తన సోదర జాతి స్వపరిపాలన కై పోరాడు తున్నప్పుడు వ్యతిరేక పోరు జరుప లేదు. తమిళులతో సహా. ఆ ఘనత మీకే దక్కింది.

   • 40 అబ్రకదబ్ర 3:28 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

    >> “ప్రత్యేక మహారాష్ట్ర ఉద్యమం దరిమిలా మహారాష్ట్ర ఏర్పడిందా లేదా? అది చెప్పండి. ఊక దంపుడు ఎందుకు?”

    ఊకదంపుడెందుకు? ఏకదంపుడే. ‘లేదు’. చరిత్ర రాశాను, వివరంగా .. నా మొదటి రెస్పాన్స్‌లో. వెళ్లి చదూకోండి. లేదూ, వికీపీడియాలు చెప్పేదే చరిత్రనుకుంటే అదే నమ్ముకోండి. భాషా ప్రయుక్త గుజరాతీ, మరాఠీ రాష్ట్రాల కోసం నడిచిన రెండు ఉద్యమాల ఫలితం ఆ రాష్ట్రాల ఆవిర్భావం. ‘మహా గుజరాత్ మూవ్‌మెంట్’ అనే పేరు విన్నారా? కాబట్టి, మీ ప్రశ్న ‘ప్రత్యేక మహారాష్ట్ర, ప్రత్యేక గుజరాత్ ఉద్యమాల ఫలితంగా ఆ రెండు రాష్ట్రాలేర్పడ్డాయా లేవా?’ అంటే నా సమాధానం ‘అవును’ అయ్యుండేది.

    >> “మీరు మినహాయింపేమీ కాదు”

    సంతోషం.

    >> “ఎంత గీపెట్టినా మీకు మద్రాసు రాలేదు”

    మంచిది. ఇప్పుడు నేను ‘మాకు హైదరాబాదు కావాలి’ అని గీపెట్టటంలేదు. గీపెట్టేదెవరో తెలుసు.

    >> “సమైఖ్యాంధ్రని బలపరచ లేదు అంటరు”

    ఆ మాట నేననలా. ఆ పేరుతో జరుగుతున్న ఉద్యమం వెనకున్న రాజకీయ నాయకుల్నీ, వాళ్ల ప్రయోజనాల్నీ బలపరచలా అంటున్నా. అర్ధం కాకపోతే అది మీ సమస్య.

    >> “స్వపరిపాలన”

    ఆఖరికి ఇక్కడ తేలారు – మిగతాయన్నీ తేలిపోయాయని. గ్రేట్. మొట్టమొదటి కామెంట్‌లో డల్లాస్ నాగేశ్వరావు గారు అననే అన్నారు.

    • 41 శ్రీవాసుకి 1:32 ఉద. వద్ద ఫిబ్రవరి 20, 2010

     @అబ్రకదబ్ర గారు

     మీరు వ్రాసిన టపాకంటే ఈ వివరణలే ఎక్కువైపోయాయి. ఏమైతేనే చర్చ రంజుగా సాగుతోంది. టి.వి.9 వాళ్ళు కూడా అసూయ పడేలా వుంది మన చర్చ. సాగినంత సాగనివ్వండి చూద్దాం.

     వాసు.బి గారు బాగానే ప్రశ్నిస్తున్నారు.

    • 42 తెలంగాణా యోధుడు 9:56 ఉద. వద్ద ఫిబ్రవరి 20, 2010

     @అబ్రకదబ్ర

     అబద్ధాలు అనే శీర్షిక మీద వ్యాసం ఎత్తుకున్నరు. అది నిరుపిస్తానికి మరిన్ని అబద్ధాలకు దిగుతున్నరు. ఎట్లనో చూద్దాం.

     …కానీ వాటిలో ఎక్కడా లేని విశేషం మన దగ్గరుంది. అది – రాష్ట్ర రాజధాని నగరం కొలువై ఉన్న ప్రాంతమే విడిపోతానని గొడవ చెయ్యటం…

     అని అన్నరా లేదా? గిది చూడండి.

     The second phase in the battle for Bombay city (18 November 1955 to 5 February 1956) was marked by a completed breakdown in the bargaining process and the ecipse of the Samyukta Maharastra Parishad followed by an unprecedented eruption of violence in the absence of effective leadership to channelise the people’s discontent. Before the Paliament concluded its discussion on the SRC report, the Bombay Municipal Corporation passed a resolution moved by opposition corporators demanding the inclusion of Bombay in Samyukta Maharashtra (22 December 1955)

     గిది నేను అబద్ధపు రాతలు రాసి వికీపీడియాల పెట్టిన నంట రేమొ! ఇది భారత ప్రభుత్వ సంస్థ Central Institute of Indian Languages ఆర్కైవ్స్ ల చూడొచ్చు.

     దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంది? ‘రాజధాని కొలువై ఉన్న’ ప్రాంతం విడి పోవ్వాలె నని కోరింది. విడి పొయ్యింది. ముంబాయిని సాధించింది. గిది చాలు గద మీరు చెప్పింది అబద్ధమని చెప్పేటందుకు?

     …చరిత్ర రాశాను, వివరంగా .. నా మొదటి రెస్పాన్స్‌లో. వెళ్లి చదూకోండి…

     మనం రాసింది చరిత్ర, లోకం చెప్పేవి మాత్రం అబద్ధాలు అనుకోవడాన్ని చిత్త భ్రాంతి అంటరు.

     హైదరాబాదు కోసం మేం ‘గీ’ పెట్ట నవసరం లేదు. అది తెలంగాణల అంతర్భాగం. తెలంగాణా ఏర్పడినంక గూడ తెలంగాణలనే ఉంటది. ఒక వేళ హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతమో మరొకటో చేస్తె సమైక్య వాదుల నోళ్ళు మూసు కుంటయి అని నేను చెప్పే అవసరం లేదు. అది బహిరంగ రహస్యం.

     అవును, మేము స్వపరిపాలననే కోరు కుంటున్నం. మిగతా సమస్యలకు అన్నింటికి అదే పరిష్కారం కాబట్టి. ముఖ్యంగ మీ అబద్ధాలు వినే బాధ తప్పుతది!

     • 43 అబ్రకదబ్ర 12:23 సా. వద్ద ఫిబ్రవరి 20, 2010

      చాలా తెలివిగా రాశాననుకుంటున్నారా? బొంబాయి రాష్ట్ర విభజన కోసం రెండు ప్రాంతాలూ ఉద్యమాలు నడపటం చరిత్ర. ఆ క్రమంలో బొంబాయి నగరం ఎవరికి దక్కాలనేదాని కోసం గొడవలు జరగటమూ చరిత్రే. ఆ విషయమూ నా మొదటి inline response లో ప్రస్తావించాను. మీరు ఉటంకించేది ఆ గొడవల సంగతి. మహా గుజరాత్ ఉద్యమం గురించి ఆల్రెడీ చెప్పాను కదా. అదీ నేను పుట్టించిన అబద్ధమేనంటారా? ఆ ఉద్యమంలో ప్రధాన పాత్రలు పోషించిన ఇందూభాయ్ యాగ్నిక్, సత్యం పటేల్ .. వీళ్లందరూ నేను సృష్టించిన పాత్రలంటారా?

      పదే పదే అసలు నేపధ్యం వదిలేసి చరిత్ర క్రమంలో జరిగిన ఒకట్రెండు సంఘటనల్ని మాత్రమే పట్టుకుని, వాటికి మీకిష్టమైన ఇంటర్‌ప్రెటేషన్ ఇచ్చుకుని అదే వేదమనుకుంటే అనుకోండి.

      హైదరాబాద్ గురించి నే రాసిన అంత పెద్ద టపాలో అసలు విషయం వదిలేసి కొసరు విషయమ్మీద టపాని మించిన పొడవైన కామెంట్లతో చర్చని ఇప్పటికే పక్కదారి పట్టించేశారు. ఈ విషయంలో నేను మీకిచ్చే ఆఖరి ప్రత్యుత్తరం ఇది.

      • 44 తెలంగాణా యోధుడు 12:23 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2010

       నేను మామూలుగనే రాసిన. తెలివిగ రాసిన నని మీకనిపిస్తే సంతోషమే.

       చరిత్ర మస్తుగ ఉంటది. ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకో వచ్చు. మీ కొడుకు రేపు ఇదే విషయంల టపా రాసుకుంట జై తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలు 2010 ల వచ్చినయని రాయొచ్చు. ఇప్పుడు ప్రత్యెక ఆంధ్ర ఉద్యమ కమిటి కూడా ఉండనే ఉన్నది. చలసాని శ్రీనివాస్ వగైరాలు ఎవ్వరూ సృష్టించ కుండానే రడీగ ఉంటారు, చెప్పే టందుకు. ఏ ఉద్యమం ప్రభావం వలన విడి పోవలిసి వచ్చింది అనేది ప్రధానం. ఎన్ని ఉద్యమాలు రంగంల ఉన్నయి అని కాదు.

       అయినా మీరన్నది ఏమిటి? రాజధాని ఉన్న ప్రాంతం ఉద్యమాలు చేయలేదు అని. చేసినరు అని నిరూపిత మయ్యింది అని మీరే ఒప్పుకున్నరు. అంటె మీరు చెప్పింది అబద్ధం అన్న మాట నిజం.

       నేనన్నది ఏమిటి? నిజాలను అబద్దాలుగా మారుస్తందుకు అబద్ధాలు చెప్పకండి అని.

       మీరు కష్ట పడి రాసిన అంత పెద్ద టపాల హైదరాబాదు తెలంగాణాకు చెందదు అని ఎక్కడ లేదు. అందుకని అనవసరంగా ఏమి రాయ దలుచు కోలేదు. మీ టపా మొత్తానికి సమాధానం చెప్పుతందుకు ఒక్క మాట చాలు. ‘బ్రిటిష్ వాడు భారత దేశం అభివృద్ధిల పాలు పంచుకున్నాడని చెప్పి భారత దేశంల భాగస్వామి కాలేడు, గట్లనే హైదేరబాదుల అభివృద్ధి (?) చేసినమని చెప్పి ఎవ్వడూ హైదరాబాదుని తెలంగాణా నుండి వేరు చెయ్య లేడు’. ఇదే ఈ టపాల మీకు నా ఆఖరి సమాధానం.

       తరువాత టపాల అయినా అబద్ధాల పేరు చెప్పుకుంట అబద్ధాలు రాయరని ఆశిస్తున్న.

 24. 45 dkc 2:09 సా. వద్ద ఫిబ్రవరి 19, 2010

  @తెలంగాణా యోధుడు
  “గియ్యన్ని మాట్లాడు కుంట గూడ నీలాంటి వాళ్ళు తెలంగాణాల ఉండ గలుగుతరు. (నువ్వు ఉన్నవో లేవో తెలువదు). గదే తెలంగాణా ప్రజల గొప్ప ‘ధనం’.”
  ఇది తెలంగాణ ప్రజల గొప్ప ధనం అయితే సినిమా హాల్ల పై దాడి నీచ బుద్ధి అవుతుందా?మన గొప్ప చెప్పు కొనేటప్పుడు మన చెడు కూడా చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం….!ఇలా మాట్లాడిన వాళ్ళని వుంచుతున్నారో లేదో నాకు తెలియదు కాని, పొట్ట చేతపట్టుకొని వచ్చిన అమాయకులని వెళ్ళిపొండి అని తరుముతునారు.ఇది గొప్ప ధనం లేక గొప్ప ‘బుద్ధి ‘ మీకుతెలియాలి.

  “నువ్వు తోక ముడిచిన వని అర్థమై పోయింది. అంటె గిది కూడ అబద్ధమే నన్న మాట!”

  ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాదానం కంటే ఆలోచన ముఖ్యం అని నా ఉద్దేశం .మీ లెక్క ప్రకారం హైదరాబాద్ కంటే మిగతా ఆంధ్ర ప్రాంతాలు ఎక్కువ అభివృద్ధి చెంది వుండాలి.కాని అలా జరగలేదు .అంటే అన్ని ప్రాంతాల దగ్గర నుండి వచ్చిన డబ్బు ఏమవుతుంది ? రాష్ట్ర అభివృద్ధి కి ఖర్చు అవుతుంది (కొంచెం),మిగతాది రాజకీయ నాయకుల చేతికి వెళుతుంది(ఇది తెలియక పోతే నేను ఏమి చేయలేను).ఒక బ్లాగ్ లో కామెంట్ పెటారంటే చదువు’కొన్న’ వాళ్ళం అని అర్థం అవుతుంది.మరి చదువుకున్న వాళ్ళం అయివుండి చిన్న చిన్న విషయాలు ఆలోచించక రాజకీయ నాయకుల మాటలు నమ్ముతున్నాం అంటే నిజం గ మనం చదువు’కొన్న’ముర్కులమే…………!

 25. 46 chaitanya 2:27 ఉద. వద్ద ఫిబ్రవరి 20, 2010

  @vasu.b
  మీరు అడిగిన ప్రశ్నలకు,ఉద్యమానికి సంబంధం లేక పోయినా…నాకు తెలిసినవి మీకు చెబుతున్నను…వేటికి సమాధానం చెప్పలేరు తెలంగాణ వాళ్ళు అన్న మీ పొగరు కి తాళలేక…
  అన్స్ 1) పీ.వి.నరసింహ రావు గారి పై పోటికి నిలబెట్టని Ntr గారు ఎ ప్రాంతానికి చెందిన వ్యక్తో.. ముల్కి నిబందనలపై supreme court rulingని అమలు చేయబోయిన PVని దింపెసిన వ్యక్తులు అదె ప్రాంతనికి చెందిన వాళ్ళు..అది తెలంగాణ దురదృష్టం..అప్పటి రాజకీయ అవసరాల కొసం PV నంద్యాల ఎంచుకున్నరు..రాష్ట్రం లోనె కాదు,మహరాష్ట్ర లో కూడ పొటికి దిగమని కోరిన నాయకులు ఉన్నారు..పొటి చెసింది నంద్యాల నుంచి..అంతె…communists రావు గారిపై పొటికి పెడితె…610 GO ఇచిన Ntrని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గౌరవించారు…దాన్ని అడ్డుకున్న,అమలు చేయ కోరని రాజకీయ నాయకులను వ్యతిరెకించారు..వాళ్ళు ఎ ప్రాంతమైన!!!

  2)భాగొ అన్నది ఆంధ్ర ప్రాంతం వాళ్ళని కాదు..కబ్జాదారులను మాత్రమె అని కె సి ఆరే చెప్పారు..ఐనా నేను నాణెం ఒక వయిపె చుస్తను అని అదె పాట మళ్ళి అందుకుంటా అంటె ఎవరు ఎం చేయలెరు!!!

  3) కలిసి ఉండాలని అక్కడ కొరుకున్నది రెండు ప్రాంతాల వారు కబట్టి..ఇక్కడ అలా లేదు కబట్టి..అలాంటి పరిస్థితి ఉంటె సమైఖ్య ఆంధ్ర ఝాఛ్ మొత్తం రాష్ట్రం లొ ఉండాలి కద??రెండు ప్రాంతాలకే ఎందుకు పరిమితమైంది??ప్రత్యెక తెలంగాణ కి మద్దతు తెలిపె వారు ఆంధ్ర లొ ఉనట్టు,తెలంగణ లొ సమైఖ్య ఆంధ్ర కి మద్దతు తెలిపె వారు ఉన్నరు..అది తప్పెం కాదు కద??కాని చాల తక్కువ..వాళ్ళే గనుక ఎక్కువ ఉంటె అసలు ఉధ్యమమె లేదు గ???! తెలంగాణా లొ ప్రత్యెక తెలంగాణ కొరుకోని వాళ్ళు ఐనా,కొరుకున్న వాళ్ళు ఐనా కవలనుకునెది తెలంగాణ అభివ్రుద్దె(కొద్ది మంది తెలంగాణ లొ ఉంటు తెలంగాణ నె అవమానించె వాళ్ళూ తప్ప..మీ మాటలు పోయిన సారి అలాగె ఉన్నై అన్నది మీకూ తెలుసు అనుకుంట)

  4)ఆంధ్ర వారి నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటె తప్పెంటో చెప్పండి?? కె సి ఆర్ ఫామిలీ దాచ్తొర్ ఒక ఆంధ్ర వ్యక్తి..మా చుట్టాలు ఆంధ్ర వాళ్ళు…అంత మాత్రాన తెలంగాణ గోదు వినిపించె హక్కు ఉండద??ఈరొజు సాంకేతిక పరిఞానం కొసం ఎ చన్నెల్ తలుపు తట్టిన అది ఆంధ్ర వాళ్ళదె అవుతుంది మరి..నాకు తెలంగాణ పాటలు కవలంటె దవ్న్లోద్ చెసింది ఒక ఆంధ్ర స్నెహితుదు(చెయించె అప్పుడు నాకు అనిపించలె..మీకు చెబుతుంటె గుర్తుకువచింది…దీన్నె అనవసర వాదనతొ విభజన అంటారు)..అతనికి చేసే వీలు ఉండింది..చెయించుకున్నాను..నెను ఎం అనుకోలేదు..అతను ఎం అనుకోలేదు మరి..ఎందుకు??మీ ప్రకారం అలా తప్పేమొగా??

  5)వలసవాదులు అన్నది ఎవరిని?? భూములను కబ్జ చెసిన రాజగొపల్,కావురి,రామొజి రఒ,మురళి మోహన్ etc etc వీల్లను..అన్నది వీల్లనె!!!అందరిని ఎవరు అనలేదు..అనలేరు కూడ..
  6)మిగతాది అంతా రాజకెయ నాయకుల మీదనె మీ బాధ..మంచిదె..రజకీయ నయకులు ఇక్కడె కాదు అంది ఎక్కడైన అంతె..ఎ ఎండకి ఆ గొడుగు..
  వై ఎస్,చంద్రబాబు,చిరంజీవి జై తెలంగాణ అన్నప్పుదు లగడపటి,దెవినేని,ఎర్రం నాయుడు..ఎక్కదికి వెల్లరు?? ముసుగు కప్పి తొంగున్నార?? ఈ ప్రశ్న కుద మీరు అదిగి ఉంతె బాగుండెది..అందరు జై తెలంగాణ అన్నప్పుడు ఆంధ్ర లొ ఉద్యమాలు ఎందుకు జరగలేదు?? రాజకీయ నయకులు వేసె ప్రతి అడుగు కు తెలంగాణ వాళ్ళు ఎల బహిరంగంగా వ్యతిరెకించాలి అని మీరు భావిస్తున్నారో..ఆ విధంగ చుసుకుంటె 2004,2009 ఎన్నికల ముందు ఆంధ్ర లొ ఉద్యమం ఎందుకు జరగలెదు..ఖందించాల్సిన సమైఖ్య ఆంధ్ర వాదులు ఎమైనట్టు…ఖాంగ్రెసు పార్టీ కి 2004 లొ ఎందుకు ఓటు వెసినట్టు??అప్పుడు తెలంగాణ ని సమర్థించినట్ట??
  అప్పుడు సమైఖ్య ఆంధ్ర కొరుకున్న వాళ్ళు లెరని కాదు…ఉన్నరు..కాని రాజకీయ నాయకుల మళ్ళె ప్రతి దానికి టి వి లొ కనిపించి ఖందించలేరు గ..కబట్టి ఎదైనా అంతె..మీరు అడిగిన చాల ప్రశ్నలకు ఇది సమాధనం ఇస్తుంది అనుకుంటగా??

  7))దేశం మొత్తం తెలంగాణ ఉద్యమం గురించి తెల్సుకొవలంటె మీడియా ఒక్కటె మార్గం..కాని మీడియా ప్రవర్తించిన తీరు సరి కాదు..అగ్నికి అజ్యం పొసింది అన్నది ఒప్పుకొవలసిన నిజం..
  మీరు మీడియా లొ ఉన్నాను అన్నారు..మరి మీడియా అమ్ముడు పొతుంటె ఎం చేశారు??ఇప్పుడు అవసరం వచ్చింది అని బయటపెట్టడం తప్పితె?? పెట్టుంటె మీ ఉద్యొగం ఉండేద??కాని సమాజానికి చేటు చెశారు కద??జానా రెడ్డి ఐనా,దామొదర్ రెడ్డి ఐనా,జీవన్ రెడ్డి ఐనా ఎవ్వడైనా అప్పటి స్వార్థం అప్పటిది,ఇప్పటి స్వార్థం ఇప్పటిది..వ్యతిరెకిస్తె మంత్రి పదువులు పొతై,అసమత్తి వాదం అంటగడుటారు,టికెట్టు ఇవ్వరు…స్వార్థం..మీరు వ్యతిరెకించలెదు చుడంది మీ కళ్ళ ముందు జరుగుతున్నది అలాగె ఇదీ కుడ..మీ తప్పు ఉంది అనట్లెదు..పరిస్థితి అంతె…
  8)కోదండ రాం గారు ప్రొఫెస్సరు కద..దెనికి రాజీనామ చెయాలి??జయశంకర్ గారు టి ఆర్ ఎస్ పార్తి సభ్యులు..ఝాఛ్ ని లేద్ చేసె వాడు రాజకీయాలకు అతీతం గ ఉండాలి అన్న ఉదెష్యం థొ కోదండ రాం గారిని పెట్టవలసి వచింది..అలొచిస్తె తెలిసె పొఇంత్ ఇదె..ద్వెషం తొ నిండినది కద..అలొచన తట్టదు లెండి..పర్లెదు..
  జయశంకర్ గారిని ఎవరు మరిచిపొయినా..తన జీవితం అంతా తెలంగాణ కొసం పాటు పడుతున్న వారిని ,తెలంగాణ మరిచిపొదు.. స్వార్థం తొ పని చెసె రాజకీయ నాయకులు కనిపించె మీకు అదేంటొ నిస్వార్థం తొ పనిచెసె ఇలంటి prof.జయశంకర్ గారు,prof.కొదండరాం గారు,లక్ష్మను గారు,ఇంక చాల మంది, కనిపించరెందుకనో?????

  9)ఆఖరున కులం ప్రస్థావన తెచ్చారు..అయ్య..ఎ కుల రాజకీయలు తెలియనిది నా తెలంగాణ..దానికి కులాన్ని అనవసరంగా అంటగట్టకండి..కులాల కొసం పార్టీలు,పార్టీల కొసం కులాలు ఎక్కడ ఉంటాయొ అందరికి తెలుసు..మీకు తెలిసె ఉంటుందిగ??వాటితో సంబంధం లెకపొయినా కూడా ,ఎ ప్రాంతాలు ఎక్కువగా నష్టపొతున్నవి కుద తెలుసు..కావలసింది తెలంగాణ అభివృద్ది..అది చేసేది రెడ్డి ఐనా,వెలమ ఐనా,బ్రాహ్మనుడు ఐనా,ఎక్కడి వాడు ఐనా(ఆంధ్ర ఐనా)పర్లెదు..ఒక్క రోజులొ దీక్ష విరమించ చూసిన కె సి ఆర్ ని మెడలు ఒంగొబెట్టి మరీ దీక్షకు కుర్చొపెట్టిన వాళ్ళు తెలంగాణవాదులు..కుల రాజకీయం చెయగోరిన,ఎమార్చి మొసం చెయబొయినా తిరగబడె సత్తా ఉన్నది ఇక్కడ..కావలసింది ఇప్పుడులా ఈ ప్రాంత రాజకీయ నయకులు ప్రతి దానికి పక్క వాళ్ళ మీదకు నెపం నెట్టి వేయని పరిస్థితి..అది ప్రత్యేక తెలంగాణ లోనె సాధ్యం అని భావించడం చేత, అదే కొరుతున్నారు!!!(మరి పనులు చెయడానికి కుడ ఉద్యమాలు ఎందుకు చెయరు అని అడుగుతార??.అందుకు కుడా పోరాడారు..agreements,GOs,formulae అలా వచినవె..అవి నిరుపయోగం (కారణం ఎదైనా) అని అర్థం చెసుకున్నారు)
  కాదు అలా కాకుండా సమైఖ్య ఆంధ్ర లొ కుడా కష్టాలు తీరుతై అని చెప్పండి..ఎలా తీరుతాయొ కుడ చెప్పండి..ఉద్యమాన్ని,వాదనలని పక్కన పెట్టెద్దం…
  అప్పటి వరకు జై తెలంగాణ..జై ఆంధ్ర ప్రదేశ్..జై హింద్..
  దీనికి ముందు చెప్పినది కుడా అర్థం చేసుకొని..ఎమైన చెప్పలనుకుంటె చెప్పండి..లెకుంటె మీ అభిప్రయం మీది..తప్పు లేదు..కాని అడ్డ దిడ్డ వాదనలు చెసి తెలుగువాళ్ళని మీకు తెలికుండానె విడగొట్టకండి!!!

  chaitanya!!!

 26. 47 Shiv 1:40 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2010

  Abrakadabra, Hats off to you.
  Telangana Yodhudu, Pls. don’t go in circles.

  – Shiv.

 27. 48 sree.b 10:45 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2010

  నిన్న నా స్నేహితుడికి ఒక పీడకల వచ్చిందంట… అదేంటంటే తెలంగాణా వచ్చినట్లు…కేసీఆర్ గారు నేపాల్ దేశములో లాగ మావోయిస్టులతో కలసి ఉమ్మడి ప్రభుత్వం తను ముక్యమంత్రిగా ఏర్పరచినట్లు అందులో కొంత మంది కాబినెట్ మంత్రులుగా కొన్ని పేర్లు చెప్పాడు.ఇంకా కొన్ని పదవులు పంచలేదట.. ఎలా వుందో కాబినెట్ రూపు మీ అభిప్రాయాలు చెప్పగలరు

  1.శ్రీ హరీష్ రావు : ఆర్ధిక మరియు రెవిన్యూ
  2.శ్రీ కే.రామారావు (కేసీఆర్ తనయుడు): హోం మరియు సాదారణ పరిపాలన
  3.శ్రీమతి.కవిత(కేసీఆర్ కూతురు): స్రీ,శిశు సంక్షేమ శాఖ
  4.శ్రీ.గద్దర్ : సినిమాటోగ్రఫి,కళలు మరియు నక్సలైట్లు సంక్షేమం
  5.ప్రొఫెసర్ కోదండ రామ్ రెడ్డి : విద్య
  6.శ్రీ.సుమన్(ఉస్మానియా జెఎసి నాయకుడు):ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మరియు నాన్బోర్దెర్స్ సంక్షేమం
  7.శ్రీ.ఈటెల రాజేందర్ : భారీ నీటిపారుదల
  8.శ్రీ.కర్నే ప్రభాకర్ : సమాచార శాఖ
  9.శ్రీ జయ శంకర్ : ప్రభుత్వ సలహాదారు

 28. 49 ప్రతాప్ 11:56 సా. వద్ద ఫిబ్రవరి 21, 2010

  అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి అన్నదే నా అభిలాష, కానీ చెన్నై గురించి కొందరి అభిప్రాయాలని విన్నాక నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని అనుకొన్నాను. మాది నెల్లూరు, నా చిన్నప్పుడు మా నానమ్మ నాకు కొన్ని విషయాలు చెప్పేది, వాటిలో వేంకటగిరి రాజా వారి విషయాలు (ఏదో వేలువిడిచిన చుట్టరికం ఉండటం వల్ల). వాటిలో ఒకటి, ఒకప్పటి చెన్నపట్టణం అనబడే నేటి చెన్నై గురించి. వేంకటగిరి రాజా వారు తన దగ్గర పనిచేసే ‘చెన్నడు’ అనే నమ్మకమైన సేవకుని సేవలు మెచ్చి ఒక ఊరిని ఈనాముగా రాసిచ్చారు. అదే కాలక్రమేనా అతని పేరుమీద ‘చెన్నపట్టణం’గా రూపాంతరం చెందిందిఅని . అందుకనే, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు మన తెలుగువారు చెన్నపట్టణం తమకే దక్కాలని పట్టుపట్టినారు. తరువాత చరిత్ర గురించి కొందరికి తెలిసిందే (అందరికీ తెలియదని నా ఉద్దేశం).

  అబ్రకదబ్ర గారు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, అలానే చెన్నపట్టణం గురించి కొద్దిగా పరిశోధన చేసి ఒక టపా రాయగలరని మనవి.

 29. 50 dkc 8:11 ఉద. వద్ద ఫిబ్రవరి 22, 2010

  @chaitanya

  “ఇక సంస్కృతి…మీ పై కోపం ఉన్నా, మర్యాదగ మట్లాడటానికి ప్రయత్నిస్తున్నా చూడండి.. అది తెలంగాణ సంస్కృతి..మొత్తం తెలంగాణని అన్నారు చూడండి..అది ఎం సంస్కృతో నాకు తెలిదు మరి??”

  “మీరు అడిగిన ప్రశ్నలకు,ఉద్యమానికి సంబంధం లేక పోయినా…నాకు తెలిసినవి మీకు చెబుతున్నను…వేటికి సమాధానం చెప్పలేరు తెలంగాణ వాళ్ళు అన్న మీ పొగరు కి తాళలేక…”

  పైన చెప్పిన రెండు మాటలు మీవేనని అనుకుంట?ఇప్పుడు మాట్లాడండి సంస్కృతి, సంప్రదాయం మరియు తోటకూర కట్ట వగైరాలగురించి ………
  ఒక సమాధానానికి మరి ఇంకో సమాధానానికి సంబంధం లేకుండా (చెప్పిన వాటిమీద నిలబడకుండా ) చెప్తున్నారు….
  మహా అయితే దీనికి తెలంగాణ వాళ్ళను అనడం వాళ్ళ కోపం వచ్చి అన్నాను అంటారు లేక పోతే ఎవరేమనుకున i dont care అంటారు……..అంతేనా

  ఇక్కడ జరుగుతుంది వాదోపవాదాలు కాదు అని నేను అనుకుంటునాను.ఒకరి భావాలూ మాత్రమే. దీన్లో ఎందుకు పక్క వాళ్ళని మర్యాదలేకుండా మాట్లాడుతునారో అర్థం కావటం లేదు.ఇది మీ ఒక్కరికి మాత్రమే కాదు మిగత వారికీకూడా…..
  చదువు’కొన్న’ వాళ్ళం కొంచం పద్ధతి పాటిదాం….
  చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులు వుంటే అవి మాత్రం చూపండి లేని పోనివి వద్దు .

  అయినా నాది ఒక ప్రశ్న ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని దోచుకున్టునారు అని మీకు మీ తాగుబోతూ కెసిఆర్ చెప్తే గుర్తోచిందా.ఇప్పటివరకు తెలియలేద?రాజకీయ నాయకుల మాటలు నమ్మి మన లాంటి వాళ్ళు వాదించుకోవటం ఏమిటో?కెసిఆర్ ఆ మాట అనకపోతే అతని రాజకీయ జీవితం ఆగిపోయీ వుండేది.అందుకే ఈ మీ తెలంగానం ఎత్తుకున్నాడు.ఇది తెలియక పోతే ఏమి చేయలేను క్షమించండి……..!

  “అయ్యా..కలిసుందాం అనుకుంటే..కలిసుండి కష్టాలు ఎలా తీర్చుకోవాలో తెలిస్తే చెప్పండి..”

  ఇదే అందరిని నేను కోరేది.విడిపోదాం అనడం కంటే ఎలా అభివృధి చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం .తెలంగాణ వచ్చిన తరువాత ఏమి చేయాలో ఆలోచించటం కంటే తెలంగానని ఎలా అభివృద్ధి చేయాలో మీ నాయకులను ఆలోచిన్చామనండి.
  అయినా అబ్రకదబ్ర గారు ముందే ఒక టపాలో రాసారు “గుక్కెడు మంచినీళ్ళు కావాలి అని మాత్రం అడగరు అని”…….
  (కెసిఆర్ గారిని మర్యాద లేకుండా సంబోదిచినందుకు క్షమించండి.నాకు కుటిల రాజకీయ నాయకులూ నచారు.నేను వాళ్ళని గౌరవించను )

  • 51 chaitanya 1:55 సా. వద్ద ఫిబ్రవరి 23, 2010

   @dkc
   rendava vaakhyam lo nenu anna tappento,meeru cheppalanukunnadi entoo artham kaaledu!!! pogaruku taalaleka..”manchi samadhanalu raavu me prashnalaku,vishleshanaku” annadi pogaru kaada?? alochinchalera telangana vallu??rendu replies ni puurthiga chadavandi..ekkada pogaru anipistundoo meeke telustundi..baashani(yaasani),samskruthini anatam pogaru kakunda emiti??naku telsina telugu lo maatram adi pogare..inkedaina unte cheppandi??nerchukuntanu tappakunda..
   danike nenu cheppalanukunnadi cheppanu..meru ekkadi daanno deniki link cheyalanukunte nenem cheyalenu..rendu vakhyallone kaadu ekkada kuda nenu tappuga,okarini kaani,baashani kaani,samskruthini kani,abhirpraayalanu kaani,praanthanni kaani aakhariki nayakulani kani kinchaparichi matladaledu ani meku kuda telsu anukunta..adi “telangana samskruthi” naku neerpindi ani nenu garvamga cheppukuntunna..
   mottam rasina danni vadilesi denne enduku pattukunnaroo mari??

   @vasu.b
   miru ippatiki ade matladutunnaru..rajakeeyanayakulanu pakkana petti,saamanya janala gurinchi alochinchandi..vaallani samadhanaparichevi evaina unte cheppandi..
   mee modati reply chadavandi..vidagottela matladaledu ani meku anipisthe i take back my words ..fine??
   miru chaala vatiki samadhanam ivvaledu ani bhaavistunnanu..karanam edaina..samayam leka povadam valle anukuntunnanu mari..nyways malli chebutunnanu..telangana udhyamam edaina undanindi(naa drushtilo kadupu mandi..kondari drushtilo tinnadi aragaka)..ikkada kashtaalu unna maata vastavam e ga??avi srushtinchabadda kashtalu kaani,eppati nundo unnavi kuda kaadu??solution unte ummadi raashtram lo cheppandi..tappakunda nenu mimmalni samardinchevallalo modati vyakthinavutanu..inka aalochinche stage lo unnamu manamu anakandi..aalochinche stage lo undi kalisundaamu ani analememo kada??

   chaitanya!!!

 30. 52 Surya 9:55 ఉద. వద్ద ఫిబ్రవరి 22, 2010

  Your labor seems to be bearing fruit.

  Lagadapati Rajgopal seems to be reading this series. I saw him in TV9 mentioning that పెద్దమనుషుల ఒప్పందం has elapsed in 5 years after 1956, effectively in 1969. It is for the first time that I saw someone mentioning this fact in TV.

  Congrats!!!!!

 31. 53 vasu.B 12:25 సా. వద్ద ఫిబ్రవరి 23, 2010

  @ చైతన్య గారు
  నేను అడ్డ దిద్ద వాదనలు చేసి తెలుగు వారిని విడగోడుతున్నానా !
  నా కామెంట్ మరొక్క సారి చదివండి మిత్రమా. నేను కలిసుందాము కలదు సుఖము అని ప్రపంచములో ఎక్కడెక్కడో జరిగిన ఒకే బాష,సంస్కృతీ కలిగిన జర్మనీ కలయిక , 32 దేశాల యూరోపియన్ యూనియన్ గురించి చెప్పింది, కెనడా దేశములో జరిగిన ప్లెబిసైట్ గురించి చెప్పింది విదిపోదామనా అర్థం ??

  > తెలంగాణా వాదులు ప్రశ్నిస్తే ఉద్యమం, ఆంధ్ర వాళ్ళు ప్రశ్నిస్తే పొగరు… చాల గొప్ప వాదన !!!
  > సూటిగా చెప్పండి … రాజకీయులలాగా ప్రతిదానికి సమర్దనలోద్దు, మీరే చెప్పారు మహారాష్ట్ర వాళ్ళు కూడా ఆహ్వానించారని…17 మంది తెలంగాణా లోకుసభ సబ్యులు ఒక్కరయినా శ్రీ.పీ.వి గారికి తమ స్థానాన్ని ఎందుకు త్యాగం చేయలేక పొయ్యారు… కారణం ప్రజలలో ఆంధ్ర తెలంగాణాలు అనే భేదాలు లేవు … దిక్కుమాలిన విలువలులేని వార్తా చానల్లు లేవు. అప్పటికింకా కేసీఆర్ గారికి జ్ఞాన్ దంతం రాలేదు 🙂

  > ఆంధ్రా వారి సాంకేతిక సహకారం తీసుకుంటే తప్పేంటి ? మంచి ప్రశ్ననాది కూడా అదే ప్రశ్న,సమాధానం కూడా…కాని అతి ప్రదాన మయిన ప్రశ్న తెలంగాణా చానెల్లో కేవలం తెలంగాణా వారికే ఉద్యోగాలు ఇస్తున్నారు ఎందుకు???

  ఎందుకు ఆంధ్ర వారి మీద అంత ద్వేషం? ఆంధ్రా వారి పెట్టుబడులు కావాలి…ఆంధ్రా వారు వద్దు..ఆంధ్రా వారి సహకారం కావాలి ఆంధ్రా వారు వద్దు…మీరు కీసీఆర్ మాటలు నమ్మటమే మేమంతా ఆచర్యంగా చూస్తుంటే ఇంకా మమ్మల్ని కూడా నమ్మమంటున్నారు.

  > తెలంగాణా వాదం వ్యతిరేకించే వారి ఆస్తులు లెక్క కడతాం… ఆంధ్ర వ్యాపారస్తుల వారి ఉత్పత్తులు భహిష్కరిస్తాం !?

  అభినవ గాంధీ శ్రీ శ్రీ ప్రొఫెసర్ కోదండ రామి(రెడ్డి ) గారి హెచ్చరిక !!! దీన్నేమంటారు బెదిరింపు కాదా ? దీనికి గాంధీ గారి పిలుపులతో పోలిక. నవ్వు వస్తుంది ఇతని మాట తీరుకి…చెరువు మీద అలిగి ఎవడో — — లేదంట !!!

  > నిజంగా మీరు చెప్పినట్లు కబ్జాదారులయిన రామోజీ,రాజగోపాల్,మురళీమోహన్ లమీద కేసులేందుకు పెట్ట లేదు? మానవ హక్కుల సంఘం వారికి,లోకాయుక్త వారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? ధర్నాలకి,ముట్టడులకు అర్ధరాత్రి కోర్టుల చుట్టూ ఓపికగా తిరుగుతారు. పాపం కొంత మంది న్యాయవాదులు (!?) ఢిల్లీ వరకు వెళ్లి వీధి నాటకాలు వేస్తారు కాని ఒక్క కేసు కూడా ఆంధ్ర కబ్జా దారుల మీద పెట్టరు ???

  > చిన్న రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి…గోవా రాష్ట్రములో ఒక్క శాసన సభ్యుడు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలి పోతుంది… పరిపాలన మీదకంటే తన ప్రభుత్వం కూలిపోకుండా ముఖ్యమంత్రి ఏమయినాచేస్తాడు… మన ఘనత వహించిన కేసీఆర్ లాగ 😦
  > ఢిల్లీ లోవున్న ఆంధ్ర భవన్ మీ ఆంధ్రా వాళ్ళ సొంత డబ్బులతో కట్టించలేదు అది ఆంధ్ర ప్రదేశ్ లోవున్న అందరి డబ్బులతో కట్టించింది.. నాకు చాల సంతోషం కలిగించిన మాట ఇది, అవును మా ఒక్కరి సొత్తు కాదు అలాగే హైదరాబాద్ కూడా ఏ ఒక్కరి సొత్తు కాదు…చూసారా మీకు తెలీకుండానే నిజం ఒప్పుకుంటున్నారు 🙂

  > అభివృద్ధి ఎవరు చేసినా కూడా మేము ఆహ్వానిస్తాము…ఆంధ్రా వారు అయిన కూడా…కాని అధికారం మాత్రం తెలంగాణా వారికి ( ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగులకి వారి కుటుంబాలకి ).. ఇది ఎలా వుందంటే పాపం చీమలు కస్టపడి పుట్టని నిర్మిస్తే పాము వచ్చి ఆక్రమించుకున్నట్లు ( కాని చలి చీమల చేత చిక్కి … అనే సుమతీ శతకం పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి…)

  > విదిపోఏదానికి మహామ్మదాలి జిన్నా చెప్పిన దానికి కేసీఆర్ చెప్పేదానికి నాకయితే పెద్ద తేడాలు ఏమి కనిపించటం లేదు…ఎన్ని లక్షల కుటుంబాలు చిద్రం..ఎన్ని ప్రాణాలు పోయ్యయో…ఎంత ఆర్ధిక నష్టం…చివరికి సాధించింది ఏమిటి… పాకిస్తాన్( పవిత్ర భూమి) …ఎవరికీ ప్రపంచ తీవ్రవాదులకి …

  ఒక పెద్ద దేశంగా వుండి మన దేశం సాధించింది ఏమిటో మీకు ఇప్పుడు…ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదనుకుంట !

  > ఆంధ్రా రాజకీయ నాయకులు,పార్టీ నాయకులు తెలంగాణాకు మద్దతుగా మానిఫెస్టోలో ప్రకటించినప్పుడు, తెలంగాణాకు మద్దతుగా ఉత్తరం వ్రాసినప్పుడు సమైక్య వాదులు ఎందుకు ఉద్యమించలేదు ??? మంచి ప్రశ్న !!!
  మేమందరం రాజకీయ నాయకుల మాటలు నమ్మడం లేదు కనుక, విలువ ఇవ్వలేదు కనుక…మీకు మెచ్చే ప్రకటన చేసిన చిదంబరం రోశయ్య గారి సమక్షములో కాకుండా అర్ధరాత్రి …పార్లమెంట్ జరుగు తున్నప్పుడు అధికారికంగా పార్లమెంట్లో కాకుండా కుట్రపూరితంగా ఒక్కడే ప్రకటించడం… దానికి మిత్ర పక్షాల మద్దతు లేకపోవటం…

  >సమస్య ఏమిటంటే తెలంగాణా ఉద్యమానికి ప్రజల సంపూర్ణ మద్దతు కాకుండా నాయకుల వ్యక్తిగత,పార్టీల అవసరాలు కావటం

  * కేసీఆర్కి : తను తెలంగాణకి ముఖ్యమంత్రి కావచ్చు…కొడుకుని కూడా ముక్యమంత్రిని చేయొచ్చు…కూతురిని కూడా మంత్రిని చేయొచ్చు…ఇంకా బోలెడు డబ్బులు సంపాదిన్చొచ్చు…గొప్ప నాయాకుడిగా చరిత్రలో మిగిలి పోవచ్చు …తనకు రెండవ మారు పదవి ఇవ్వని చంద్రబాబు మీద పగ తీర్చుకోవచ్చు…ఏమిలేని ఉద్యమం పేరుచెప్పి కొన్ని కోట్ల ప్రజలని మోసపుచ్చాగాలిగాననే గొప్ప ఆత్మ సంతృప్తి…తను మాట్లాడితే రక్తం ఎరులాయి పారుతుంది అని చెప్పి అందరిని భయపెట్టి తను ఏమయినా చేయగలను అని అందరికి చూపించుకోవచ్చు..” కత్తి కంటే కలం గొప్పది కాదు తన తిక్క నాలికే గొప్పది” అని నిరూపించ్చ వచ్చు…

  * సోనియాకి …తన కొడుకుని ప్రదాన మంత్రిని చేయటానికి బలమయిన ప్రతిపక్ష నాయకుడు ఎవరూ వుండకూడదు…ముక్యంగా చంద్రబాబు నాయుడు లాగ…ఎదగ కూడదు…౪౨ సీట్లతో పెద్ద రాష్ట్రం వుంటే తమకు గెలవటం కష్తం…విభజించి పాలించు బ్రిటిష్ వారి సూత్రం…యూరప్ వనితా కదా…అవే తెలివితేటలూ…ఇంకా బీజీపీ వారు ౩ రాష్ట్రాలు ఏర్పరచినట్లు చెప్పు కుంటున్నట్లు…తనకూ తెలంగాణా ఏర్పరచిన ఖ్యాతి రావచ్చు అనే వెర్రి ఆశ …పందికేమి తెలుసు పన్నీరు వాసన అన్నట్లు ఇటాలియను ఆమెకేమి తెలుసు ఆంధ్ర వారి సెంటిమెంట్లు ( పోలిక బాగాలేదు కదా, ఆమె మౌనం లాగే )

  కాంగ్రెస్స్ పార్టీ వారికి : ప్రదాన ప్రతిపక్షమయిన తెలుగు దేశం పార్టీని + బలమయిన రాజకీయుదయినా చంద్రబాబు నాయిడుని దెబ్బతీయవచ్చు…బీజీపీ వారిలాగా కాంగ్రెస్ కూడా కొత్త రాష్ట్రం ఏర్పరచిన ఖ్యాతి గడించి భవిష్యత్తు ఎన్నికలలో డబ్బా కొట్టుకొని గెలవచ్చు …వేరే రాష్ట్రాలని కూడా మోసం చేయవచ్చు.తెలంగాణా ఉదాహరణ చూపించి, ఇప్పుడు బీజీపీ వారు చేస్తున్నది అదేకదా ! ( కాని బీజీపీ వాళ్ళు ఎన్డీయే కూటమి అధికారములో వున్నప్పుడు అద్వాని మహాశయులు సెపరేటు తెలంగాణా ఎందుకు ? హైదరాబాద్ తెలంగాణాలోనే కదా వుంది అనే పాత పాడిన విషయం చాలామంది కన్వీనియన్టుగా మరిచిపోతుంటారు..అప్పుడు కేసీఆర్ కరవ లేదు,కోదండం అరవలేదు,గద్దర్ పాడలేదు,విజగాశాంటి ఆడలేదు,మధు యాష్కి లాజిక్కు పీకలేదు,ఉస్మానియా విద్యార్దులు ముట్టడులు చేయలేదు.టీవి ౯ వారు వారు రచ్చ రచ్చ చర్చలు పెట్టలేదు ??? తెలంగాణా వాద మిత్రులారా మిమ్మల్నే !!! )

  * చిదంబరానికి : దక్షిణ బారత దేశములో తమ తమిళనాడు బలంగా వుండాలి ఎదగాలి … తమ చెన్నై కి హైదరాబాద్ పోటీ అవకూడదు మన రాష్ట్రాన్ని దేబ్బతీయాలి… భవిష్యత్తులో తను ప్రధాని అవ్వాలంటే చంద్రబాబు లాంటి బలమయిన నాయకుడు వుండకూడదు…అందుకే తెలంగాణాకి,విదర్భ రాష్ట్రాలకి అనుకూలంగా పత్రికలలో వ్యాసాలూ వ్రాస్సాడు…

  * వీరప్ప మొయిలీకి : సోనియా గాంధి మెప్పు పొందే అజెందాని అమలుపరచి తమ నాయకురాలి మెప్పు పొందటం + తమ బెంగళూరు పట్టణానికి పోటీ అయిన హైదరాబాద్ని దెబ్బతీసి తమ రాష్ట్ర ప్రయోజనాలు పెంచుకోవటం + ఆంధ్ర,తెలంగాణా ప్రాంతాల నాయకులని తన చుట్టూ తిప్పుకుంటూ తన నాయకత్వాన్ని పదిలపరచుకోవటం + బోలెడు డబ్బు

  * బీజేపీ వారికి : స్వంతంగా ప్రజలకు నచ్చే విదానాలతో ఎలాగు గెలవలేము… తమ హిందుత్వ ఎజండాని చిన్న చిన్న రాష్ట్రాలలో అమలు పరచి అధికారములోనికి రావచ్చు !!

  * చంద్రబాబుకి : తన నాయకత్వములోని తెలుగు దేశము బలహీనపడకూడదు,మరల తను ముఖ్యమంత్రి అవ్వాలంటే కాడరుని నిలబెట్టుకోవాలంటే తెలంగాణలో అందరి పాటే పాడాలనే స్వార్ధం + నిస్సహాయత+అదికార దాహం

  *చిరంజీవికి : ఎవరికీ అర్ధం కాని సామాజిక తెలంగాణా అని చెప్పి ముఖ్యమంత్రి కావాలనుకోవటం

  *రాజకీయ నాయకులకి : ఏ ఎండకి ఆ గొడుగు పట్టి పబ్బం గడుపుకోవటం

  *ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులకి : రాజకీయ నాయకుల డబ్బులు,పదవులు,నాయకులుగా ఎదగాలనే తాపత్రయం,టీవీలలో కనిపించాలనే దుగ్ద,తెలంగాణా ఉద్యమములో హీరోలుగా వెలిగిపోవాలనే వుబలాటం ….యూనివర్సిటికి ఎందుకు వేలుతున్నామో తెలుసుకోనండి సోదరులార … టీవీలు చూడకందండి…మేల్కొనండి…

  *న్యూస్ చానల్స్ వారికి : పైడ్ న్యూస్ డబ్బు,తమ టీఆర్పీ రేటింగులు పెంచుకోవటానికి ఓ మంచి అవకాశం, ప్రకటనల డబ్బు …

  ————————————————
  *** నా స్వార్ధం : ఆంధ్ర వారు వేరు కాదు + అందరం సహోదరులం అనే భావన+అభిమానం+కలసి వుంటే మనము మరింత అభివృద్ధి చెంది గుజరాత్ రాష్ట్రాన్ని మించి పోగాలం అనే కోరిక 🙂
  ————————————————

  ఈ వ్యాపార ప్రపంచములో ప్రతిదీ అమ్ముకోవచ్చు…డబ్బు,అధికారం,డబ్బు,విలువలు,డబ్బు,ఉద్యమాలు,డబ్బు… ఏదయినా…………………………………………….. 😦

  వాసు.బి

 32. 55 Anuradha 5:35 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2010

  యోధుడు గారు, ఇది అంతా కాదు కాని మీరు చెప్పండి. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో? 50 సంవత్సరాల నుండి చేస్తున్నాము అనే కారణం కాకుండ ఇంకా ఏదైనా వుంటే చెప్పండి. అది నిజం అయితే మేము కూడా ఆలోచిస్తాము కదా.

  • 56 suresh 2:08 ఉద. వద్ద ఫిబ్రవరి 25, 2010

   I wont say it is a old of 50 years so that give me Telangna .I wont ask anybody give me Telangana. We are saying Separating from AP.Nobody will give Telangana , telangna people has to take telangana including Hyderabad.Don’t be emotional by saying one language one state.
   One Imagination thing I have in my mind, some how Telnagana separated from AP.Then what will happen to the other part of AP?
   where the capital will come up? whether it is in Seema or Coastal Andhra? why Iam putting this question is don’t bluff yourself by saying we are fighting for united AP.
   Say that we are fear of loosing capital and benefits allied with capital.For saying the truth in blog also if you are frightened how a politician can say his view publicly. Politician wants max no of votes.

 33. 57 suresh 1:55 ఉద. వద్ద ఫిబ్రవరి 25, 2010

  constitution is a man made document. You can change anytime. Its not a divine article.Revolution is not a wrong thing.If you don’t have revolutions world may not be like this today. still may be we are working 16 hrs in a workplace and no holiday on Sunday and Saturday.we are in a mindset revolution means a road block for development.

  saying things with example will mislead the actual content of issue.To prove my above statement I need again an example.Example will simplify to understand the content of actual situation. Example and actual situation or problem or issue will have similarities in one area or one parameter or one phase. Don’t try to extrapolate to the other phases of our real actual situation or problem or issue.

  You will have two different examples one as a pro and one another one as con(opposite) for the same actual issue.
  The selection of example will depend on which way you want to bend in actual situation.
  In my opinion using an example for a big issues to get solution is not really reliable.Your examples should match all parameters of your actual situation. Generally you will not get same problems in all times.Like every human is unique the problem also will be unique.try find unique for unique problem.

 34. 58 Dada 6:25 ఉద. వద్ద ఫిబ్రవరి 27, 2010

  Request you to send your articles to SriKrishna commission’s email id.

 35. 59 vk 8:36 సా. వద్ద ఫిబ్రవరి 27, 2010

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే హైదరాబాదు అందులొ అంతర్భాగమే. ఇందులొ ఎలాంటి సందేహమూ లేదు. కొన్ని సంవత్సరాలు ఆంథ్ర రాష్ట్ర రాజథానిగా కూడ హైదరాబాదుని అడగవచ్చు. కాకపొతే హైదరాబాదుకు నేడు వచ్చిన గుర్తింపుకు అన్ని ప్రాంతాలవారి సహకారం వుంది. రాష్ట్రం కలసి వుంటేనే అందరికి మంచిదని నా అభిప్రాయం

 36. 60 pillakaaki 12:38 ఉద. వద్ద ఫిబ్రవరి 28, 2010

  అబ్రకదబ్ర గారు!
  చిన్న వినతి. నా బ్లాగు లో తరువాయి టపా కి “ఒక వుద్యమం,దాని వెనక క్రైము సస్పెన్స్ థ్రిల్లర్ కధ” అని టైటిల్ పెడదామని అనుకుంటున్నాను. మీ అనుమతి కావాలి. అలాగే నా టపా లో కూడా ఇది మీ “ఒక వుద్యమం” సిరీస్ లోనిది కాదని గమనిక పెడతాను, పాఠకులు ఎవరు కంఫ్యూజ్ కాకుండా! మీ జవాబు వచ్చినాకే నేను ఈ విషయం లో ముందుకు వెళతాను..

 37. 63 Dada 7:12 ఉద. వద్ద మార్చి 1, 2010

  Yodha:

  0. Gujarat & Maharashtra fought for separate states.
  1. Two separatists fought to break a single state into two pieces
  2. both separatists claimed the cherry (mumbai) in their piece
  3. one separatist got it finally.

  Now qn: in your T movement, you are the only separatist. How can you compare your nuisance movement with Maharashtra/Gujarat dispute?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: