మన సినిమా – 1/2

ఇతర బ్లాగుల్లో జరిగే చర్చలు హైజాక్ చెయ్యటం నా పద్ధతి కాదు. మొదటిసారిగా, ఇప్పుడు చెయ్యాల్సొచ్చింది. ఎన్నాళ్లుగానో మన సినిమాలపై వ్యాసమొకటి రాయాలనుకుంటుండగా మహేష్, రేరాజ్ దాదాపు అవే అంశాలపై సాగిస్తున్న ఆసక్తికరమైన చర్చ గమనించాక నా వ్యాసానికి ఇదే సరైన సమయమనిపించింది. అక్కడి చర్చతో పరిచయం లేనివారి కోసం చిన్నపాటి ఉపోద్ఘాతం. ‘హాలీవుడ్ సినిమాల స్థాయికి వెళ్లటం అన్న ఆలోచనే అనవసరం. మనదైన స్థాయి ఒకటి తయారు చేసుకోవాలి’ అన్నది మహేష్, రేరాజ్ తేల్చిన మాట. ‘ముందు హాలీవుడ్‌ని కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి. సొంత క్రియేటివిటీ సంగతి తర్వాత ఆలోచించొచ్చు’ అన్నది దానికి నా వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకి వివరణ ఈ టపా.

నా దృష్టిలో –  ప్రపంచంలో ఏ ఇతర సినీ రంగమైనా హాలీవుడ్‌తో పోటీ పడాల్సింది రెండు విషయాల్లో: విభిన్న కథాంశాలు, సాంకేతిక హంగులు. పై రెండు విషయాల్లో హాలీవుడ్ సినిమాలు మిగతావాటికన్నాఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నది కాదనలేని సత్యం. హాలీవుడేతర సినిమాల్లో మంచివి, గొప్పవి రావటం లేదా – అంటే వస్తున్నాయి (కాన్వర్స్: హాలీవుడ్ చెత్త సినిమాలు తీయటం లేదా? మహరాజులా తీస్తుంది. ఐతే ఏ విషయంలోనైనా పోలికలెప్పుడూ మెరుగైన విషయాల గురించే ఉండటం ఎదుగుదలకి ముఖ్యం). ఇరాన్ కూడా మంచి సినిమాలు తీస్తుంది. కానీ వాటిలో వైవిధ్యం ఏది? ఇరాన్‌ది చిన్న పరిశ్రమ. వాళ్లకుండే పరిమితులెక్కువ. అక్కడ ఎక్కువ వైవిధ్యం ఆశించటం అనవసరం. మనవాళ్లకేమయింది? సంఖ్యలో మనవాళ్లు ఏటా జనాల మీదకొదిలే సినిమాలు – కేవలం తెలుగు, తమిళ రంగాలనే లెక్కలోకి తీసుకున్నా – హాలీవుడ్ మేజర్ స్టూడియోలన్నీ కలిపి తీసే సినిమాలకన్నా ఎక్కువ. వాటిలో ఎన్ని వైవిధ్యభరితమైన కథాంశాలతో వస్తాయంటే వేళ్ల మీద కూడా లెక్కించటానికుండదు. తొంభై శాతం అవే రొడ్డకొట్టుడు కథలు. కుర్ర హీరోలకైతే ప్రేమ కథలు, ముదురు హీరోలకైతే ప్రతీకారం కథలు. హిందీవాళ్లు ఎంతో కొంత మెరుగీ విషయంలో.

సాంకేతిక హంగులు – హాలీవుడ్ ఈ విషయంలో చేసినన్ని ప్రయోగాలు మనమెప్పటికన్నా చెయ్యగలమా? బర్బాంక్ స్టూడియోలు అవసరాన్ని బట్టి కొత్త రకం కెమెరాల నుండి యానిమేషన్ సాఫ్ట్‌వేర్ దాకా సృష్టించుకోగలిగుతాయి. స్టెడీకామ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, త్రీ-డీ టెక్నాలజీ .. ఒకటేమిటి, సినిమాల్లో వచ్చిన, వస్తున్న సాంకేతిక ప్రగతి మొత్తం హాలీవుడ్ సృష్టే కదా. మనవాళ్లు ఆ రకంగా చెయ్యగలుగుతారా ఎప్పటికైనా? లేరు. ఎందుకు? బడ్జెట్ పరిమితులు. అంత డబ్బు ఖర్చు పెట్టటం మనకి వర్కవుట్ కాదు. నిజంగా కాదా అంటే నిజానికి అవుతుంది. కానీ ఇప్పుడు మన సినీరంగం నడపబడుతున్న పరిస్థితుల్లో కాదు. మరెలా అవుతుంది? తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే వేరేవాళ్ల ఇన్నోవేషన్లు అందిపుచ్చుకోటమే మనం చెయ్యగలిగేది. అయితే ఆ అందిపుచ్చుకోవటం ఎప్పటికి? హాలీవుడ్లో ఒక టెక్నాలజీ వచ్చిన ఐదారేళ్లకి. ఆలోగా ఆ టెక్నాలజీని ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చెయ్యాలో అన్నిరకాలుగానూ హాలీవుడ్ దర్శకులు చేసేస్తారు. ఐదేళ్ల తర్వాత మనవాళ్లు అలాంటి షాట్లు ఎన్ని తీసినా అవన్నీ ఎప్పుడో ఎక్కడో చూసేసినట్లే ఉంటాయి. అయితే సమస్య అది కాదు. మనవాళ్లు ఆ పనీ సరిగా చెయ్యలేకపోవటమే అసలు సమస్య. అందుకే అన్నాను – ముందు కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి, తర్వాత సొంత క్రియేటివిటీ సంగతి చూడొచ్చు అని.

‘అనుకరించటమన్నా సరిగా చెయ్యటం నేర్చుకోమనండి’ అనటానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ విడమర్చనవసరం లేదు. మచ్చుకొక్క ఉదాహరణ చాలు. ‘మాట్రిక్స్’ సినిమా విడుదలై పదేళ్లయింది. ఈ పదేళ్లలో, మన వివిధ ‘వుడ్’లలో మాట్రిక్స్ తరహా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటానికి ప్రయత్నించిన దర్శకులు డజన్లలో ఉన్నారు. ఒక్కరూ అందులో విజయం సాధించలేకపోయారు. హాలీవుడ్‌లో వచ్చిన కొత్త తరహా ఎఫెక్ట్స్ వచ్చినట్లు కాపీ కొట్టేసే దక్షిణాది ‘క్రియేటివ్ జీనియస్’ శంకర్ ఆరేడేళ్ల క్రితం ‘బాయ్స్’ సినిమాలో ఓ పాటలో ఆ ప్రయోగం చేసి దారుణంగా విఫలమయ్యాడు (అది దర్శకుల చేతకానితనం కాదు – కెమెరా మరియు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ల చేతకానితనం అన్నాడో మితృడు. ఆయా నిపుణులతో అవసరమైనట్లు పని చేయించుకోలేకపోవటం మాత్రం దర్శకుడి చేతగానితనమే కదా). ‘బాయ్స్’ విడుదలకన్నా ముందే ఔత్సాహిక మూవీ బఫ్స్ కొందరు కేవలం నాలుగైదు సాధారణ వీడియో కెమెరాలు వాడి శంకర్‌కన్నా మెరుగ్గా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటం నేను గమనించాను (ఇంటర్నెట్‌లో వెదికితే అలాంటివి బోలెడు దొరుకుతాయి). షూ-స్ట్రింగ్ బడ్జెట్‌తో ఆ కుర్రాళ్లు సాధించిన ఫలితాలు మన దర్శకనిర్మాతలు కోట్లకు కోట్లు వెచ్చించి సైతం సాధించలేకపోవటం నాకెప్పుడూ అర్ధం కాదు. లోపం ఎక్కడ?

ఇక గ్రాఫిక్స్ విషయం. అవసరం లేకున్నా విచ్చలవిడి గ్రాఫిక్స్ వాడకం ఈ మధ్య విరివిగా దర్శనమిస్తుంది మన సినిమాల్లో – ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. సినిమా పేరు తెరమీద కనపడ్డప్పుడు ఆ బాంబు పేలుళ్లు, టైటిల్ బద్దలై అందులోంచి గొడ్డళ్లూ విచ్చుకత్తులూ దూసుకురావటం – ఇంత హంగామా ఎందుకు? పోనీ అవన్నా నవ్యంగా ఉంటాయా అంటే అదీ లేదు. అన్నీ ఒకే రకం. సినిమా అనేది టైటిల్స్ దగ్గర్నుండే ప్రేక్షకుడ్ని కథలోకి లాక్కెళ్లాలి. మన దగ్గర మాత్రం (ముఖ్యంగా డీవీడిలో చూసేటప్పుడు) శుభ్రంగా టైటిల్స్ స్కిప్ చేసేసి చూసెయ్యొచ్చు. సరే. టైటిల్స్ గొడవొదిలేసి మళ్లీ గ్రాఫిక్స్ దగ్గరికొద్దాం.

మనవాళ్ల గ్రాఫిక్స్ ఎంత ఘోరంగా అఘోరిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం లేకున్నా ఏవో ఫైట్ సీన్లలోనో, పాటల్లోనో గ్రాఫిక్స్ కుమ్మేస్తారు. (‘అరుంధతి’ లాంటి ఒకట్రెండు సినిమాల్లో అవసరం మేరా వాడుకున్నారనుకోండి, కానీ అలాంటి సినిమాలెన్ని? అలాంటి నిర్మాతలెందరు?) అవసరముందా లేదా అనేది అవతలుంచితే, ఆ తీసేదేదో సరిగా తీయటమూ ఉండదు. కోట్లు ఖర్చు పెట్టాం అని డబ్బాలు కొట్టుకోటమే కానీ, ఆ కోట్లకి వాళ్లు రాబట్టిన ఫలితం తెరపై చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కొందరనొచ్చు, ‘మనకున్న మార్కెట్‌కీ, మనం గ్రాఫిక్స్‌కి ఖర్చు పెట్టేదానికీ అంతకన్నా గొప్పగా చెయ్యటం కుదరదు’ అని. నేనొప్పుకోను. అంతకన్నా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఎఫెక్ట్ సాధించొచ్చు. ఊరికే నా మాట నమ్మనవసరం లేదు. తిరుగులేని ఉదాహరణొకటిస్తాను. కింది మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూడండి.

ఇద్దరు ఔత్సాహికులు కలిసి కేవలం నూట యాభై డాలర్ల ఖర్చుతో ఒక సాధారణ వీడియో కెమెరా, ల్యాప్‌టాప్, లైట్‌వేవ్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్, మూడు నెలల శ్రమశక్తితో రూపొందించినదీ బుల్లి సినిమా. ఆ ఖాళీ ఫ్రీవే, విమానం, గ్రాండ్ చెరోకీ జీప్ ఏవీ నిజం కావు – కంప్యూటర్ గ్రాఫిక్స్. వాళ్లు పెట్టిన ఖర్చుకి వందల రెట్లు తుది ఫలితంలో కనిపించటంలేదూ? ఇప్పుడు చెప్పండి. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్‌కోసం పెట్టామని దర్శక నిర్మాతలు చెప్పుకునే ఖర్చుకీ, వాళ్లు సాధించే ఎఫెక్ట్‌కీ ఏమన్నా పొంతనుందా! ఆలోచిస్తే మళ్లీ అదే ప్రశ్న – లోపం ఎక్కడ?

(మిగతా రెండో భాగంలో)

15 స్పందనలు to “మన సినిమా – 1/2”


 1. 2 bhaavana 5:26 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  బాగుందండి ఎనాలిసిస్…. బాగా తీసేరు ఆ అబ్బాయిలిద్దరు (బ్రూస్ అండ్ జెర్మీ)

 2. 3 a2zdreams 5:41 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  @‘ముందు హాలీవుడ్‌ని కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి. సొంత క్రియేటివిటీ సంగతి తర్వాత ఆలోచించొచ్చు’ అన్నది దానికి నా వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకి వివరణ ఈ టపా.

  పై పాయింట్ కు జస్టిఫికేషన్ కనిపించలేదు.

 3. 4 raman 8:53 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  The short film is really good
  I do not agree with any part of your analysis
  1. The Iranian cinema has so much restriction that you cannot imagine. No other cinema industry in the world has that much controls. They have script, budget, technology, costume as well as location restrictions. Script is strictly scrutenized by islamiic guidence council under ministry of education and cultute..to the last diolauge. Still their directors are well known over the world and their movies have ready audience in every part of the world and no film festival is complete without an iranian film.
  2. As you said there aren’t many varieties of stories in hollywood.
  Basically there are only few story lines, only they are adopted differently keeping the audience in the mind, be it hollywood, Iranian, japan, East europe or south america. Many of the countries had seen independent movements, civil wars and ethnic violence. They are gold mines for stories for them. We could not adopt or create many stories from our struggle or even partition.
  3. Technology is only part of the movie, Graphics doesn’t make a movie success all the time. you have only few examples. They leave only passing impression on the audience and would not last long.
  4. What kind of graphics did Krish used in “Gamyam”
  5. If you want to enjoy the graphics 1080 P HDTV, PS3,wth ATI graphic card and expensive sound card.

  Writing articles, crticizing and reviewing movies or books is an art. You need to know more about the thing you are reviewing or atleast should have some knowledge.

  also you have to be clear in what you want to tell the readers.

  You have to keep the producers who gamble crores of rupees in mind
  hope your next post makes some sense.

  • 5 అబ్రకదబ్ర 7:59 సా. వద్ద ఆగస్ట్ 13, 2009

   >> “I do not agree with any part of your analysis”

   You have every right not to. But I never said it’s an analysis. As it turns out, these are merely a few of my observations 😉 so let’s keep them that way.

   >> “1. The Iranian cinema ….”

   What took you a lengthy paragraph to explain .. I told the same in two words: “వాళ్లకుండే పరిమితులెక్కువ”. Apparently, in your eagerness to oppose me, buddy, you didn’t even read my lines carefully. I said Iranian films are good in general, but complained they lack variety, and also gave the reason for that. Did I not?

   >> “2. . As you said ….”

   I am not exactly a Telugu industry insider (I guess you are) but I know more about it than you thought; and based on your comments on H’wood story lines, I certainly know more about H’wood than you do. There is more to it than just war flicks. With a snap of my fingers, I can list out at least 25 genres just like that 🙂

   >> “3. Technology is only part ….”

   Excatly .. my point too. Where did I say our movies must be loaded with effects? Read these lines again: “అవసరం లేకున్నా విచ్చలవిడి గ్రాఫిక్స్ వాడకం ఈ మధ్య విరివిగా దర్శనమిస్తుంది మన సినిమాల్లో – ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. సినిమా పేరు తెరమీద కనపడ్డప్పుడు ఆ బాంబు పేలుళ్లు, టైటిల్ బద్దలై అందులోంచి గొడ్డళ్లూ విచ్చుకత్తులూ దూసుకురావటం – ఇంత హంగామా ఎందుకు?”

   All I said was, if our directors can’t resist doing graphics, then they should do it right. My examples show how cheaply CGI can be done these days (btw, the ‘405’ movie was made in 2000 – nine years ago) with a bit of planning. For all the boasting they do about spending millions of rupees on graphics, what our folks end up with is cheesy graphics. Can you deny that?

   Btw, technology doesn’t mean just CGI – I think you know it. How many of our directors know when to use zoom and when not? Haven’t we all seen in countless Telugu films .. the extent of zoom misuse, and shaky camera work – giving all viewers motion sickness?

   >> “5. If you want to enjoy …”

   I didn’t get what you wanted to say here. If you meant ‘get a 1080P HD TV and other expensive gear to enjoy graphics’, thank you, I already got all those and more.

   >> “Writing articles, crticizing and reviewing movies or books is an art. You need to know more about the thing you are reviewing or atleast should have some knowledge”

   Thank you for the advice. I think I do have some knowledge.

   >> “you have to be clear in what you want to tell the readers”

   I am .. and the rest of the readers got what I’m telling them just fine 😉

   >> “You have to keep the producers who gamble crores of rupees in mind”

   My dear friend, this is the reason why our movies are what they are. If the producers give up the ‘it’s all a big gamble’ attitude and start believing that movie making is pure genuine business, our movies would’ve been much better. This is what my next part talks about.

   >> “hope your next post makes some sense”

   If you are wondering why my response is somewhat rude, please read your line above and it all makes much sense now.

   So let’s cut the fight now and agree to disagree more politely. Peace 🙂

 4. 6 కత్తి మహేష్ కుమార్ 10:30 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  మీరు మా చర్చల్లో ఉన్న మూలభావాన్ని మిస్ చేశారేమో అనిపిస్తోంది.

  సినిమా పుట్టిందే హాలీవుడ్లో గలన, వారికున్న ఆర్థిక వనరుల దృష్ట్యా టెక్నాలజీలో వాళ్ళు ముందుండటం ఒక సమస్య కాదు. సమస్య “మన సినిమాలలో ‘మనం’ ఎక్కడున్నాం?” అనేది. అంటే ముఖ్యంగా కథలకు, కథాంశాలకూ, కథనరీతులకూ సంబంధించిన ప్రశ్న.Don’t we have OUR stories to tell through cinema? మీరు దాన్ని వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోయారనిపిస్తోంది.

  బహుశా తరువాత భాగంలో ఏమైనా చెబుతారేమో. ఎదురుచూస్తాను.

 5. 7 నాగప్రసాద్ 10:46 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  వీడియో బాగుంది కాని, మన దగ్గర ప్రస్తుతానికి నిపుణుల కొరత కూడా ఉంది కదా. అదీగాక మనవాళ్ళు సినిమా తొందరగా వందరోజుల్లోనే తీయాలంటారు. ఏదో అరుంధతి, మగధీర సినిమాలు కూసింత ఎక్కువ టైం తీసుకున్నాయి కాబట్టి, వాటిల్లోని గ్రాఫిక్స్ కూడా చూడబుల్‌గా ఉన్నాయి. ఒకసారి ఈ లింకులోని వ్యాసాన్ని చదవండి. http://www.eenadu.net/archives/archive-11-8-2009/ncineshow.asp?qry=cinefront1 మనవాళ్ళు సినిమాల కోసం ఏం చేస్తున్నారో అర్థమవుతుంది.

 6. 8 sri 2:47 ఉద. వద్ద ఆగస్ట్ 13, 2009

  నేను రామన్ గారి తో ఏకిభవిస్తున్నాను అండి … మీరు పెట్టిన వీడియో బాగుంది. కాని ఈ గ్రాఫిక్స్ అవి కొంత వరకు మనకు ఈ టెక్నాలజీ రాక ముందే కెమెరా తో ఇలాంట్వి చేసిన గొప్ప వాళ్ళు ఉన్నారు .. VSR స్వామి , మార్కస్ బార్ట్లీ లాంటి వాళ్ళని మరిచారా. మనవాళ్ళకి చెప్పడానికి బోలెడు కథలు ఉన్నాయ్… ముందర మన నిర్మాతా దర్శకులకి ఉండలిసిన చిత్త సుద్ది లేదు. వాళ్ళకి ఎంతాసేపు ఎంత తొందరగా డబ్బులు చేసుకుందామా అన్న యావ తప్ప …

  • 9 అబ్రకదబ్ర 11:02 ఉద. వద్ద ఆగస్ట్ 14, 2009

   గ్రాఫిక్స్ గురించి రామన్ గారు చెప్పింది నిజమే. నిజానికి, నేను చెప్పేదీ అదే. కాకపోతే – గ్రాఫిక్స్ వాడి తీరాల్సిందే అని మనవాళ్లకి అంత తట్టుకోలేని కోరికగా ఉంటే, ఆ చేసేదేదో సరిగా చెయ్యొచ్చుగా అంటున్నాను. నా వ్యాసంలో అధికభాగం, ‘కోట్లు ఖర్చు పెట్టి మనవాళ్లు సాధించే చిన్నపాటి ఫలితంకన్నా మెరుగైనది అంతకన్నా తక్కువ ఖర్చులోనే సాధించొచ్చు’ అన్నదాని గురించి.

 7. 10 rayraj 5:09 ఉద. వద్ద ఆగస్ట్ 13, 2009

  దీన్ని హైజాక్ చెయ్యడం అనరండీ! బ్లాగుల్లో చర్చించడం అంటారు. పోనీ, నేనలా అనుకుంటాను. అసలు నాక్కావాల్సిందే అదని చెప్తునే ఉన్నాను కదా!

  పైగా బాగా చెప్పేవాళ్ళతో చెప్పిస్తేనే విషయం మరింత బాగా ఎక్కుతుంది కూడానూ!

  మీరు చెప్పేదంతా విని,అప్పుడు చెప్తాను. ఇప్పటికే చెప్పిందే చెప్తున్నానేమో కదా!. పైగా, చిన్ని కామెంట్లౌతాయా! మ్..హు! మళ్ళీ నేనూ పోస్టేవేస్తాను కదా! 🙂

 8. 11 కన్నగాడు 7:31 ఉద. వద్ద ఆగస్ట్ 13, 2009

  ఇది కూడా తెలంగాణా అంశం లాంటిదే, అందదు చర్చిస్తారు కాని ఎప్పటికీ పరిష్కారం వైపు పయనం సాగదు. మా స్నేహితుల మధ్య కూడా ఇది ఎవర్ గ్రీన్ టాపిక్. కథ, కథనం ముహూర్తపు షాట్ కంటే ముందు తయారు చేస్తే సినిమా బాగుంటుందని యాభై శాతం నమ్మొచ్చు.

 9. 12 కొత్తపాళీ 2:54 సా. వద్ద ఆగస్ట్ 14, 2009

  శెబాష్!!!
  ఎవరన్నా ఈ టపానూ, ఈ కామెంట్లూ కాపీలు తెలుగు సినిమా నిర్మతలకీ దర్శకులకీ పంపిస్తే బాగుండు!!!

 10. 13 a2zdreams 2:42 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

  కొత్తపాళీ గారు, LOL 🙂

  మీ కొత్తరకమైన పొగడ్త బాగుంది.


 1. 1 నా దృష్టిలో క్రియేటివిటీ అంటే « a2z డ్రీమ్స్ 7:51 ఉద. వద్ద ఆగస్ట్ 13, 2009 పై ట్రాక్ బ్యాకు
 2. 2 మన సినిమా – 2/2 « తెలు-గోడు 1:13 సా. వద్ద ఆగస్ట్ 19, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: