హోటల్ కాలిఫోర్నియా

‘హోటల్ కాలిఫోర్నియా’ – 1977లో అమెరికా స్వతంత్రం పొంది 200 వసంతాలైన సందర్భంగా (1776 – 1976) నాటి ప్రఖ్యాత రాక్ బ్యాండ్ ‘ఈగిల్స్’ విడుదల చేసిన పాట. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట వినని రాక్ సంగీతాభిమానులు ఉండరనటం అతిశయోక్తి కాదు. విడుదలై ముప్పై రెండేళ్లు దాటిపోయినా నేటికీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూనే ఉందీ గీతం. అమ్మకాల పరంగా ఈ పాట సృష్టించిన ప్రభంజనం ఒకెత్తైతే, దాని సాహిత్యం రేకెత్తించిన వివాదాలు మరొకెత్తు. పైకి – దక్షిణ కాలిఫోర్నియాలో ఒకానొక హోటల్ వాతావరణాన్ని వర్ణించే పంక్తుల్లా కనపడ్డా, ఆ పదాల వెనకున్న నిగూఢార్ధాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా తోచటం ఈ పాటలో విశేషం. హోటల్ కాలిఫోర్నియా గీత సాహిత్యం గురించి విశ్వవిద్యాలయాలకు పరిశోధనా పత్రాలు సమర్పించిన ఘనులూ ఉన్నారు! ఆ వివరాల జోలికి ఇప్పుడు మనమెళ్లొద్దు.

చిన్నప్పుడు పాశ్చాత్య సంగీతమంటే అర్ధం కాని అరుపులు, కేకలేననే అపోహే ఉండేది నాకు. దాన్ని మార్చిన పాట హోటల్ కాలిఫోర్నియా. అనుకోకుండా ఓ సారి ఈ పాట విన్నాను. అప్పుడు దాని సాహిత్యం పెద్దగా అర్ధం కాలేదు, ఏదో హోటల్ గురించిన గొడవ అనుకున్నాను. పాట మాత్రం నచ్చింది. మళ్లీ విన్నాను. ఈ సారి నేపధ్యంలో వాడిన గిటార్ బిట్స్ మరింత నచ్చాయి. అంత అద్భుతమైన గిటార్ వాడకం ఎప్పుడూ వినలేదనిపించింది. ఆ గిటార్ కోసమే మళ్లీ మళ్లీ విన్నాను. తర్వాతి కాలంలో హోటల్ కాలిఫోర్నియా నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటిగా మారిపోయింది. బహుశా ఆ పాట ప్రభావంతోనే – అప్పటికింకా  చూడనప్పటికీ –  కాలిఫోర్నియా రాష్ట్రం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతమైపోయింది. ఆ పాట నిజానికి కాలిఫోర్నియా గురించి కాదని తర్వాత తెలిసిందనుకోండి, అది వేరే విషయం. అసలు విషయం – పాశ్చాత్య సంగీతమ్మీద నాకు ఆసక్తీ, ఇష్టమూ పెరిగేలా చేసిందా పాట. ఆ పాటని మీతో పంచుకునే ప్రయత్నం ఈ టపా.

కింది యూట్యూబ్ వీడియో – 1980లో విడిపోయిన ఈగిల్స్ బృందం 1994లో మళ్లీ కలిసిన సందర్భంగా ఇచ్చిన తొలి ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారపు రికార్డింగ్. మీలో ఎక్కువమంది దీన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చూసేసుంటారనుకోండి. అయినా కొన్నిట్ని మళ్లీ మళ్లీ చూడొచ్చు కాబట్టి చూసెయ్యండి. ముఖ్యంగా – మొదటి రెండు నిమిషాల ఇరవై క్షణాలు, చివరి ఒక నిమిషం ముప్పై ఐదు క్షణాలూ సాగే గిటార్ సంగీతాన్ని గమనించండి.

(పాట సాహిత్యం కోసం ఇక్కడ నొక్కండి)

7 స్పందనలు to “హోటల్ కాలిఫోర్నియా”


 1. 1 భాస్కర్ రామరాజు 3:00 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  ఈ పాట మొట్టమొదట మా అన్న దగ్గర విన్నా 2003 లో. ఎంటనే పంఖా అయిపొయ్యా. ఇదోటి, papa was a rolling stone ఒకటి.
  సక్కని పాట అందించారు. తెలుగులో అర్ధంకూడా ఇవరించి ఉంటే బాగుండేది.

  నమస్తే

 2. 2 Malakpet Rowdy 3:24 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  “We are all just prisoners here
  Of our own device

  In their masters chambers .. they gather for the feast
  Stab it with their steeley knives
  But they just cant kill the beast!”

  By the way the Hotel California Guitar Prelude is my Phone Ringtone!

 3. 3 gaddeswarup 3:39 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  I started listening to western popular music and Indian classical music around the same time in 1968 in England. I was abroad for the first time and was lonely. Then Ravi Shankar and Alla Rakha came to Liverpool and gave wonderful performance; that was my introduction to Indian classicel music. Around the same time Joe Coker’s version of “With a little help from my friends” used to appear regularly in ‘Top of the Pops” and bowled me over. Then in 69-70 I saw “Woodstock’ in New Haven and heard Ritchie Havens ‘Sometimes I feel like motherless child’. Wonderful music from so many sources and it is not always clear how and why one is touched by these; place, time, mood or whatever. Or possibly some intrinsic universal structures that appeal to all.

 4. 4 కొత్తపాళీ 3:55 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  “Or possibly some intrinsic universal structures that appeal to all.”
  absolutely.

 5. 5 gaddeswarup 3:58 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  There are a number of books on the appeal of music by Oliver Sachs and others. I read only one; ‘The singing Neanderthals’ by Steven Mithen. I recently bought a book by a researcher Daniel Levitin “This is your brain on music” which discusses western pop music among other things but I have not red it yet. If you read it before I do, please let us know your views.

 6. 6 బృహఃస్పతి 9:01 సా. వద్ద ఆగస్ట్ 4, 2009

  I love this song. This live concert is better than the original version.

 7. 7 saipraveen 9:11 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2009

  Welcome to the Hotel California
  Such a lovely place, such a lovely face
  ఈ పంక్తులు నాకు చాలా ఇష్టం. దాన్ని వాళ్లు పాడే రీతి నన్ను కట్టిపడేసాయి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: