నిద్ర సుఖమెరుగదన్నది నానుడి. రైళ్లూ బస్సుల్లో ప్రయాణాలప్పుడు – కిటికీలోనుండి పిల్లగాలి తెమ్మెర పలకరిస్తుంటే బాదరబందీలూ బాధలూ మరిపిస్తూ ఓ పక్క ముంచుకొస్తున్న నిద్రా దేవి, మరో పక్క పక్క కుదరక పాట్లు – అందరికీ ఏదో సందర్భంలో అనుభవమయ్యే సంగతే. కాసేపటికి మన ప్రమేయం లేకుండానే పక్క సీట్లో అపరిచిత ప్రయాణీకమ్మన్యుడి భుజమ్మీద తల వాలటం, అతగాడేమో చిరాగ్గా దాన్నవతలికి నెట్టటం, మనమూ తగ్గకుండా గజనీ మహమ్మదులా అయ్యదు భుజానికే గురిపెట్టి దండయాత్రలు చెయ్యటం .. మన తిప్పలెలా ఉన్నా, అవి చూసే మూడో వ్యక్తికి మాత్రం నవ్వాగకపోవటం తధ్యం.
కింది వీడియోలో బుడతడిది ఓ రకంగా అదే పరిస్థితి. అయితే పక్కన అపరిచిత ప్రయాణీకుడి బదులు సొంత సోదరుడే ఉండటం గుడ్డిలో మెల్ల. ఈ మధ్య కాలంలో ఇంత ముద్దొచ్చే వీడియో మరోటి చూడలేదు నేను (ఆల్రెడీ చూసేసినోళ్లు మళ్లీ చూడొచ్చు. తప్పు లేదు). అయ్యస్పీ అడ్మిన్ మార్తాండుడి మోములో సైతం అరనవ్వులు విరబూయించగల దృశ్యమిదని నాదీ హామీ. మరెందుకాలస్యం?
ఇంతకు ముందు చూశాను గానీ మీరన్నట్లు ఎన్నిసార్లయినా చూడొచ్చు 🙂
Baby videos are my all-time favorites!
Hehehehe thats cute …
By the way .. this inspires me to post another video
బాగుంది.
బాగుంది బాగుంది.
ఆ వీడియో ఇదేనా రౌడీ గారు? http://www.youtube.com/watch?v=2T_2C9jSit0
యూట్యూబులో బ్లూపర్లు, ఫన్నీ వీడియోలు జూడని జనుల్ గలరే దివినన్ 🙂
బుడతడు ఎప్పుడు పడిపోతాడో అని టెన్షన్ తో చచ్చేను.పోన్లెండి.ఎక్కడాపడలేదు. సుఖీప్రాణి !!
“నిద్ర సుఖమెరుగదు – ఆకలి రుచెరగదు”
బుడతడు భలేవున్నాడు.