సత్యం వధ

‘ఇన్నేళ్లుగా చూస్తున్నాను. సత్యం కన్సల్టెంట్లు నాకెక్కడా తగల్లేదు. నిజంగానే ఇది పైకి చెప్పుకునేంత పెద్ద సంస్థేనా’. రెండేళ్ల క్రితం ఇద్దరు ముగ్గురు స్నేహితుల్ని నేనడిగిన ప్రశ్నిది. ఐటీ  సంస్థల్లో మేనేజర్లుగా పనిచేసేవాళ్లే వీళ్లంతా. వాళ్లు తమకు తోచిన సమాధానాలేవో  ఇచ్చారు కానీ నాకు మాత్రం ఇంకా ఎక్కడో అనుమానం. నా రంగంలో ఇండియాలోని రకరకాల కంప్యూటర్ కన్సల్టెన్సీ సంస్థల ఉద్యోగులు తరచూ తగులుతుంటారు. బే ఏరియాలో ఎక్కడికెళ్లినా కుప్పలు తెప్పలుగా టిసిఎస్ కన్సల్టెంట్లు కనపడేవారు నాకు. ఇండియాలో నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ సత్యం ఉద్యోగులు మాత్రం ఇక్కడెప్పుడూ కనపడలేదు (అసలు లేరని కాదు, నాకు కనపడలేదంతే).  అరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పుకునే సంస్థకి సిలికాన్ వ్యాలీ కన్సల్టింగ్ సెక్టార్లో చెప్పుకోదగ్గ స్థానం లేకపోవటం నన్నాశ్చర్యపరచిన విషయం. అది నిజంగా అంత పెద్ద సంస్థేనా అన్న నా అనుమానానికి అంతకన్నా పెద్ద కారణమేదీ లేదు. చెప్పాలంటే – అది చాలా చాలా సిల్లీ కారణం కూడా. ఈ రోజు వార్తలు చూస్తే దురదృష్టవశాత్తూ నిజమైన నా అనుమానం. ఈమాత్రానికే నేనేదో కాలజ్ఞానినైపోయానన్న భ్రమలేవీ లేవు. సెబీలాంటి డేగ కళ్ల సంస్థలకి నాకొచ్చినపాటి సిల్లీ అనుమానాలూ రావా అన్నది నన్ను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న.

సరే. రామలింగరాజు గారేవో కొన్ని నిజాలొప్పుకుంటూ ప్రకటన చేశారు. బాగుంది. ఉన్న నిజాలన్నీ పూర్తిగా వచ్చేశాయా, ఇంకేవైనా మిగిలున్నాయా? ఇప్పటికీ వార్తాపత్రికల్లో ‘నాలుగో అతి పెద్ద ఐటీ సంస్థ’, ‘యాభై మూడు వేల మంది ఉద్యోగులున్నారు’,  ‘ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 180 వరకూ సత్యం క్లయింట్లే’, ‘అరవయ్యారు దేశాల్లో సంస్థ ఉద్యోగులు పనిచేస్తున్నారు’ లాంటి వాక్యాలు కనిపిస్తున్నాయి. అవన్నీ నిజమని ఎలా నమ్మటం? అవి నిజంగానే నిజమైతే సత్యం ఇప్పుడు ఈ చిక్కుల్లో ఉండకపోయేది కదా. లేని క్లయింట్లనీ, లేని ప్రాజెక్టుల్నీ ఉన్నట్లు చూపితేనే కదా లేని లాభాలు ఉన్నట్లూ, ఉన్న నష్టాలు లేనట్లూ చూపాల్సొచ్చేది. ఐతే, ‘ఉన్న నిజాలు అన్నీ బయటికొచ్చేశాయా’ అని నేననేది వీటి గురించి కాదు. వాటిని మించిన ప్రశ్నలున్నాయి.

‘నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఒక్క రూపాయి కూడా రాలేదు’ అన్నారు రాజుగారు. ఏ లాభమూ లేకుండానే తిమ్మిని బమ్మిని చేసి వేల కోట్ల రూపాయల స్కాములు నడిపారంటే నమ్మేదెలా? అసలు – సత్యంలో ఏదో జరుగుతుందని లోకమ్మొత్తానికీ అనుమానమొచ్చి రెండు వారాలైనా, ఇందాకా ఆర్ధిక మంత్రిత్వ శాఖ, సెబి, ఇతర ప్రభుత్వ సంస్థలు కళ్లు మూసుకుని ఎందుకు కూర్చున్నాయి? సంస్థ దివాలా తీయటానికి రాజు గారు చెబుతున్న కారణాలని మించిన అసలు కారణాలు వేరే ఉన్నాయన్న వార్తలిప్పటికే గుప్పుమంటున్నాయి. దొంగ లెక్కలు చూపామన్నది దొంగేడుపేనని, నిజానికి నిధులని దారి మళ్లించేసి ఉంటారన్న అనుమానాలు కొందరివి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోని పెద్ద తలకాయలకు సంబంధం లేకుండా ఇంత భారీ కుంభకోణాలు జరిగే అవకాశముందా? సత్యం, మేటాస్ సంస్థల ప్రమోటర్లకి సాక్షి పత్రికలో వాటాలున్నట్లు, వీళ్ల ‘చందాల’ తోనే దాన్ని కిలో రెండు రూపాయల లెక్కన అమ్మగలుగుతున్నట్లూ గుసగుసలు. ప్రతిగా రాజుగారి తనయుల సంస్థలకి అనుభవంతో పనిలేకుండా వేల కోట్ల రూపాయల హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టుని దయచేసినట్లూ, రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి చోట్ల స్థలాలు కారుచవక ధరలకి అప్పజెప్పినట్లు కూడా వార్తలు. ఇటువంటి ‘బిజినెస్ డీల్స్’కి, సత్యం నేటి స్థితికి సంబంధముందా? సత్యం దెబ్బకి కుదేలయిన మదుపుదార్ల సంగతేమిటి? ఆ సంస్థ ఉద్యోగుల భవిష్యత్తేమిటి? ఎన్నో ప్రశ్నలు. సమాధానాలు పాతవే, మనందరికీ తెలిసినవే. మన ఘన స్వతంత్ర భారత్‌లో ఇటువంటి విషయాల్లో సత్యానిదెప్పుడూ వధే.

 

 

32 స్పందనలు to “సత్యం వధ”


 1. 1 Niranjan Pulipati 9:50 సా. వద్ద జనవరి 7, 2009

  53 వేల మంది ఉద్యోగులు , 180 ఫార్చ్యూన్ క్లైంట్లు, ఇలాంటివన్నీ నిజాలే.. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇంకా బే ఏరియాలో సత్యం కన్సల్టెంట్లు కనిపించలేదు. మీకు కనిపించకపోవచ్చు కానీ, అక్కడ 1500 పైన ఉన్నారు. మొత్తం అమెరికాలో 3000 పైన ఉన్నారు. ఇవన్నీ నిజాలే. ఇవన్నీ నిజాలైనంత మాత్రాన చిక్కులలో పడకూడదని ఏమీ లేదు అనుకుంటా.

 2. 2 కె.మహేష్ కుమార్ 10:05 సా. వద్ద జనవరి 7, 2009

  ఈ విషయంలో మనకు పెద్ద జ్ఞానం లేదుగానీ…మన కార్పొరేట్ చరిత్రలుకూడా మోసపూరితాలే అయితే “ఆధునిక భారతానికి role models ఎక్కడ్నుంచీవస్తాయా!” అనిపిస్తోంది.

 3. 3 సుజాత 10:27 సా. వద్ద జనవరి 7, 2009

  పోయిన డబ్బు సంగతి అలా ఉంచి, అసలు ఇలాంటి పని చేసింది రామ లింగ రాజా అనే దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడం కష్టంగా ఉంది. రాజంటే నిజంగా రాజుగారిలాగానే ఉండే రాజు, రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసిన రాజు, ఇలా చేశారంటే నమ్మలేకపోయాను.

 4. 4 sri 10:31 సా. వద్ద జనవరి 7, 2009

  ఒక మనిషి యొక్క జీవితములొ అధ్యత్మికత మరియు భౌతికత సమపాళ్ళలో వున్నపుడె, ఆ మనిషి యెదైనను సాధించగలడు(దు), సాధించిన దానిని నిలబెట్టుకొ గలడు, మరియు ఎటువంతి పరిస్థితులనైన తట్టుకోగలడు.

  అందుకె, స్వామి వివేకానందుల వారు ఈ రెండు సమపాళ్ళలొ వుండవలెనని యెప్పుడో చెప్పినారు. ఇది పెడ చెవిన పెట్టిన వారు, మాయను తప్పించుకొనళెరు మరియు తప్పులు చెయకుండ వుండలేరు. అది రామలింగ రాజు గారైన సరె, ఇంకెవరైన సరె. నెనైతె అధ్యత్మికతనె ఇంకొంచెము ఎక్కువగా పట్టుకుంటాను.

 5. 5 అబ్రకదబ్ర 10:31 సా. వద్ద జనవరి 7, 2009

  @నిరంజన్:

  నాకు తెలిసినవే నిజాలనటం లేదు. అందుకే దాన్ని ‘సిల్లీ కారణం’ అన్నది. ‘అసలు లేరని కాదు, నాకు కనపడలేదు’ అని ఒత్తి చెప్పా కూడా. నా పాయింట్ – నియంత్రణ సంస్థలకి నా మాత్రం తెలివితేటలూ లేవా అన్నది. నా మీద నేనేసుకున్న జోకది.

 6. 6 sri 10:42 సా. వద్ద జనవరి 7, 2009

  PriceWaterCoopers కంపెని సత్యం కు ఆడిటర్. మరి అది కల్లు ముసుకుందో ఎమొ. బ్యాంకు ఖాతా లొ 7000 వేల కోట్లకు బదులు 350 కోట్లు వుంటె, మరి ఫ్వ్ఛ్ యెందుకు పట్టుకోలేదో. This is very basic question in auditing work. No idea why one of the top auditing company PWC missed on this one.

 7. 7 Ajay 10:47 సా. వద్ద జనవరి 7, 2009

  అందుకేనేమో జగన్ గారు రేపటి నుంచి పేపర్ రేట్ పెంచేశారు . ఇంతకు ముందు అందరు పేపర్ రేట్ తగ్గించాలని చేసిన వుద్యమం ముల్లు లా గుచ్చుతుంటే , ఇప్పటి పెంపు ని సమర్ధించుకోటానికి పెద్ద సంపాదకీయమే రాసారు

 8. 8 వేణూ శ్రీకాంత్ 12:00 ఉద. వద్ద జనవరి 8, 2009

  మీరన్నట్లు ఈ కుంభకోణం లో ఇంకా వెలుగు చూడవలసిన సత్యాలు, జవాబివ్వాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఎప్పటికి బయట పడతాయో !!

 9. 9 చిలమకూరు విజయమోహన్ 1:48 ఉద. వద్ద జనవరి 8, 2009

  వ్యాపారవేత్తలు రాజకీయనాయకులతో కలిసి అంటకాగితే నాయకులు కంపెనీలను ముంచుతారు తద్వారా ప్రజల్ను ముంచుతారు.వాళ్ళేమో డబ్బుల్ని వెనకేసుకుంటారు.

 10. 10 Madhu Janjur 4:32 ఉద. వద్ద జనవరి 8, 2009

  Ika Edee bayatapadvu…Andaru dakkalsina vaata dakkesindigaa. Andrau Kanchi vellaru…Satyam employees inkoka udyogame vetukkontaaru…Ante…Emantaaru ??!@#

 11. 11 కన్నగాడు 6:20 ఉద. వద్ద జనవరి 8, 2009

  ఈ సత్యం కొంత దిగ్బ్రాంతి కలిగించినప్పటికి, నా నమ్మకం ప్రకారం రాజు గారికొక్కరికే కాకుండా ఇంకా చాలా మందికి ఇందులో ప్రమేయం ఉండి ఉంటుంది కాకపోతే రాజు గారు బలిపశువు.
  ఇలాంటి దొంగలెక్కలు చూపడం ఒక్క సత్యానికే పరిమితం కాదు, నాకు తెలిసినంతవరకు డా. రెడ్డీస్ కూడా రెండు సంవత్సరాల క్రితం దొంగలెక్కలు చూపింది. ఇప్పటి సంగతి నాకు తెలియదు.

 12. 13 Kumar 10:38 ఉద. వద్ద జనవరి 8, 2009

  కన్నగాడు గారూ,
  నాకు ఇక్కడ చాలా బ్లాగుల్లో వ్యక్తి పూజ విపరీతంగా కనిపిస్తోంది. “రామలింగ రాజు” బలి పశువా? ఆహా ఏం సెలవిచ్చారు సార్. మీకు దణ్ణం పెట్టుకోవాలని ఉంది.

  అబ్రకదబ్ర,

  నాకు నిజంగా సత్యం ఎంత పెద్ద కంపెనీయో తెలీదు, ఇప్పుడు ఈ కవరేజీ అంతా చూస్తూంటే, ఓహో ఆంధ్రాలో దీనికి చాలా పెద్ద బిల్డప్పే ఇచ్చారని తెలుస్తోంది. నేను మీలాగే అనుకునేవాణ్ణి, ఎప్పుడూ తగలరే ఈ జనాలూ అని, కానీ నాకు విప్రో వాళ్ళూ, ఇంఫోసిస్ వాళ్ళు కూడా అంత తగల్లేదు, టి సి ఎస్ వాళ్ళు కనబడినంతగా. ఎప్పుడో డెట్రాయిట్ లో పని చేసేప్పుడు, మా కన్నా ముందు సత్యం వాళ్ళు $12/గంట కు రాసిన కొన్ని ప్రోగ్రాంస్ చూసి అనుకున్నా..ధరకు తగిన పని అని.

  What I see now is classic frame-by-frame replay of Enron/Anderson.

  If PWC is the auditor..They should be banned first..just like the way Anderson went down in history.

 13. 14 అబ్రకదబ్ర 11:34 ఉద. వద్ద జనవరి 8, 2009

  @కుమార్:

  ఈ కంపెనీలు ఎక్కువగా ఒక మేనేజర్, ఇద్దరు ముగ్గురు ఆన్ సైట్ డెవలపర్స్‌తో ఇక్కడ బండి నడిపిస్తూ, అసలు డెవలప్‌మెంట్ అనధికారంగా ఇండియాలో జరుపుతుంటాయి. అందుకే వాళ్లంత తక్కువ బిల్లింగ్ కోట్ చెయ్యగలుగుతారు. ఇదంతా క్లయింటుకి చెప్పి చేస్తే సరే, చెప్పకుండా చేసేవాటితోనే సమస్య. ఇలాంటి యవ్వారమేదో బయటపడితేనే వారం క్రితం ప్రపంచ బ్యాంకు సత్యాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. ఇలాంటి పనులవల్ల ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలకి వస్తున్న చెడ్డపేరు అంతా ఇంతా కాదు.

 14. 15 Kumar 11:51 ఉద. వద్ద జనవరి 8, 2009

  “IT-BPO union Unites Professionals general secretary Karthik Shekhar said, “In case of any lay off at Satyam, we may take legal action.” ”

  సారీ పైన కోట్ ఈ టపాకి అప్రస్తుతమేమో కానీ, ఇప్పుడే టైంస్ ఆఫ్ ఇండియా లో అది చదివి చాలా ఆశ్చర్యమేసింది.

  ఐటి సెక్టార్ లో కూడా ఈ యునియన్లు దాపురించాయా? ఖర్మ!

 15. 16 KRISHNA RAI JALLIPALLI 12:24 సా. వద్ద జనవరి 8, 2009

  నాకు ఇక్కడ చాలా బ్లాగుల్లో వ్యక్తి పూజ విపరీతంగా కనిపిస్తోంది… మీరు అన్నది ముమ్మాటికి నిజం. అసలు నష్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదో రామలింగ రాజు బద్నాం అయ్యాడని తెగ ఫీల్ అయి పోతున్నారు చాలా మంది.
  శ్రీ గారు… మేరు చెప్పిన ప్రకారం ఆద్యాత్మిక వలన రామలింగ రాజుకి ఉపయోగం ఉండవచ్చేమో గాని డబ్బులు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి ఉపయోగపడదు ఈ ఆద్యాత్మిక .

 16. 17 sri 2:02 సా. వద్ద జనవరి 8, 2009

  క్రిష్న రాయ్ గారు,
  మీరు ఒక విషయము విస్మరించుచున్నారు ఇక్కడ. ఆది యెమిటంటె,రాజు గారు తప్పు చెయ్యకుండ వుంటె, సత్యం సంస్థ వుద్యొగులు మరియు మదుపు దారులు కూడ మంచిగ వుండెవారు. అంటె, అధ్యత్మికత వున్నపుడే రాజుగారు మరియు వారితూ పాటు, వారిని నమ్ముకున్న వారు కూడ మంచిగ వుండే వారు. ఆలొచించండి.

 17. 18 కన్నగాడు 5:57 సా. వద్ద జనవరి 8, 2009

  నేనేమి వ్యక్తి పూజ చేయట్లేదు కుమార్ గారు, నేననేది రాజు గారొక్కరికే కాదు ఈ విషయంతో సంబంధం ఉన్న మిగతా వారు రాజు గారిని చూపించి తప్పించుకోవద్దన్నది.

 18. 19 నేనుసైతం 9:13 సా. వద్ద జనవరి 8, 2009

  సత్యం సంస్థని కుటుంబ ఆస్థిలా వాడుకున్నారు రాజు గారు. ఆయన వాటా 8 శాతమే అయినా, తన కొడుకు కోసం మొత్త్తం సంస్థని ముంచేసారు.రామలింగ రాజు గారి కొడుకు తేజా రాజు అర్హత లేకున్నా, ఆకాశానికి నిచ్హెనలు వేసి రాజు గారిని, సత్యం ని ముంచేశాడు.అవినీతి శేఖరుడు తన ముడుపులు కోసం సత్యం ని, రాజు గారిని పావులా వాడుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా రామోజి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని విశ్వప్రయత్నాలు చేసినా వీలుగాని రౌఢీ శేఖరుడు,ధుర్యోధనుడిని, కౌరవ సామ్రాజ్యాన్ని ముంచేసిన శకుని వలే,తేజా రాజుని, సత్యం ని ముంచేచాడు.కొడుకు అత్యాశకి ద్రుతరాష్టుడిలా సత్యం సామ్రాజ్యాన్ని బలిపెట్టారు రామలింగరాజు.నాగార్జునా ఫీనాన్సు లో డ్యెరెక్టురుగా వున్న నిమేష్ కంపాని ని అరెష్టు చేయటానికి ఆఘమేఘాల మీద హడావిడి పడిన శేఖర్ దాదా (కేవలం రామోజి సంస్థ లో 1200 కోట్లు పెటుబడి పెట్టిన నేరానికి….),ఇప్పుడు రాజు నేరం ఒప్పుకున్నా గాని అరెష్టు చెయ్యటానికి ముందుకు రాని వెనుక ఎన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము వుందో ఈ ప్రభుత్వ పెద్దలవద్ద.

 19. 20 కె.మహేష్ కుమార్ 12:07 ఉద. వద్ద జనవరి 9, 2009

  @కుమార్: ఎందుకు మీకు యూనియన్లంటే కినుక?
  లాభాల్లో వుంటే ప్రభుత్వం జోక్యం అవసరం లేదనీ, నష్టాల్లో ఉంటే bail out కావాలనే కార్పొరేట్ల double standards లో ఈ anti-unionism ఒకటి. అధినేతలకు కావాల్సిన security ఉద్యోగులకు వద్దంటారా?

 20. 21 అబ్రకదబ్ర 12:14 ఉద. వద్ద జనవరి 9, 2009

  @మహేష్:

  ఆసక్తికరమైన చర్చకి దారి తీసే ప్రశ్న. యూనియన్ల వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మీ బ్లాగులో వివరంగా ఓ టపా రాస్తే బాగుంటుందేమో.

 21. 22 సత్య 12:55 ఉద. వద్ద జనవరి 9, 2009

  ఇది కొంచెం వాస్తవం గానే ఉంది, కనీసం ఇప్పటివరకు బయటకి వచ్చిన వివరాల ప్రకారం చూస్తే. ఒకవేళ అధిక లాభాలని చూపటం ద్వారా రామలింగరాజు లాభపడినట్లే అయితే, ఆ లాభాలలో ఉద్యోగస్తులకి, అంతకు ముందే షేర్లు అమ్ముకున్న ముదుపుదార్లకి లాభం చేకూరినట్లే కదా. నష్టం జరిగింది చివర వరకు నమ్ముకున్న వారికే. అలా ఉన్న వారిలో రాజు కూడా ఒకడు. లాభాలు, నగద నిల్వలు చూపటానికి తన సొంత డబ్బు దాదాపు 1200 కోట్ల రూపాయలు సమకూర్చా అని చెప్పాడు. అయితే దీనికి మించి భారతీయ కార్పోరేట్ విశ్వసనీయతకి ఎక్కువ నష్టం జరిగింది. బహుశా సత్యం నష్టాలని పూడ్చటానికి మేటాస్ అక్రమాలకి పాల్పడి ఉండచ్చు. ఇందుకు ప్రభుత్వ పెద్దలు సహకిరించారేమో. ఇతివృత్తం తెలియకపోయినా కేవలం కాంట్రాక్టులలో అధిక కమీషన్లకి ఆశపడైనా వాళ్ళకి వేలకోట్ల ప్రాజెక్టులు ఇచ్చారేమో.

  @కుమార్,
  వ్యక్తి పూజ ని వ్యతిరేకించిన మీరు ధర కి తగిన పని అంటూ 53000 మంది ఉద్యోగులని అవమానించారు. కంపెనీ బట్టీ వ్యక్తుల సామర్ధ్యం కొంత మేర అంచనా వెయ్యవచ్చు గానీ నాకు ఎదురైన అనుభవాలని బట్టీ అది పూర్తిగా ప్రామాణికం కాదు.

 22. 23 సత్య 12:56 ఉద. వద్ద జనవరి 9, 2009

  missed this statement at the starting in my above comment

  ‘నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఒక్క రూపాయి కూడా రాలేదు’ అన్నారు రాజుగారు’

 23. 24 Kumar 1:31 ఉద. వద్ద జనవరి 9, 2009

  సత్య గారూ,
  53,000 మందిని టోకున జనరలైజ్ చేసే అర్ధం దాంట్లో మీకెలా కనబడిందో నాకర్ధం కాలేదు. మీరా ఇంఫరెన్స్ డ్రా చేస్తే దానికి మీరే భాధ్యులు, నేను కాదు. నేనన్నది, ఆ పర్టిక్యులర్ క్లయింట్ దగ్గర, ఆ పర్టిక్యులర్ ప్రొగ్రాంస్ గురించి మాత్రమే అన్నది దాన్ని చదివితే ఎవరికైనా అర్ధం అవుతుంది. మీరన్నట్లుగా తీసుకుంటే, సత్యం $12/గంట కే 53,000 మందికి బిల్ చేస్తున్నట్లు, కాని అది నిజం కాదు కదా…మరి ఎందుకీ లేని అర్ధాలు తీసి కయ్యానికి కాలు దువ్వటం!

 24. 25 Kumar 1:40 ఉద. వద్ద జనవరి 9, 2009

  Mahesh,

  1. I am not opposed to all Unions, I oppose counter-productive/hate-filled unions

  2. I also know(not believe, ‘know’) that a responsible Management with a responsible Union is the perfect combination, and it takes the firm a long way. Trust me, I worked with one in India.
  There are genuine and responsible unions in India who share win-win attitude.

  3. I like every group that subscribes to win-win philosophy/working together.

  3. That said, my experience in India has revealed to me that, vast majority of unions are completely corrupt to the core, irresponsible, hate-filled, mind-less and sense-less. I better stop here.

  4. I also have worked with Communist Unions. I grew up with them. And I don’t mince words when it comes to that evil philosophy. Every cell in my body hates communism. You are not going to change my mind on that, I grew up breathing their philosophy and I know too many things about them to change my mind now.

  As Abarakadabra said, you can write a post on your blog. Try to quote some examples on each side, if you can. That will increase the value of that post.

  Thanks
  Kumar

 25. 26 Kumar 1:43 ఉద. వద్ద జనవరి 9, 2009

  Forgot another thing Mahesh..

  Having said all that, I don’t believe that IT sector in India needs these unions. ‘Coz IT sector in India is following free-market philosophy and they are doing pretty good. If any employee doesn’t like it, he has more than ample opportunities to move around.

 26. 27 Dreamer 3:36 ఉద. వద్ద జనవరి 9, 2009

  @ Kumar

  “If any employee doesn’t like it, he has more than ample opportunities to move around”

  Not any more 😦

 27. 28 సత్య 4:37 ఉద. వద్ద జనవరి 9, 2009

  మా కన్నా ముందు “సత్యం వాళ్ళు” $12/గంట కు రాసిన కొన్ని ప్రోగ్రాంస్ చూసి అనుకున్నా..
  “ధరకు తగిన పని అని.”

  దీని భావమేమిటి? “సత్యం వాళ్ళు ” 12$ అంత తక్కువ బిల్లింగ్ కి పనిచేస్తారు కాబట్టి ఆ పని లో క్వాలిటీ తక్కువ ఉంటుంది అనేగా. కంపెనీ బిల్లింగ్ తో వ్యక్తిగత నిపుణత పూర్తిగా అంచనా వెయ్యలేము అని మాత్రమే చెప్పా. మీరు డెట్రాయిట్ లోని ఒక ప్రాజెక్ట్ ని ‘ఉదాహరణ ‘ గా చూపి, ధర కి తగ్గ పని అని వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని అన్నారా? is it not inferring/implying the quality of work from satyam? atleast, ఆ వ్యాఖ్య ఉద్దేశ్యం ‘నాకు మాత్రం’ అలానే తోచింది. కయ్యానికి కాలుదువ్వే తొందరపాటు, సమయం లేవు. కానీ నా వ్యాఖ్య లో మీరు 12$ కి 53000 మంది పనిచేస్తున్నరన్న అర్ధం గ్రహించారు. నెనర్లు. 🙂

 28. 29 rayraj 11:28 ఉద. వద్ద జనవరి 9, 2009

  1.సాఫ్ట్ వేర్ రంగంలో యూనియన్స్ మీద ప్లీజ్ ఒక బ్లాగ్ రాయండి.

  2.లేదామేనేజ్మెంట్ కి ఒక చెక్ పాయింట్ చెప్పండి.

  3.ప్లీజ్ నోట్ : ఇవ్వాళ్ళ సత్యంకి వచ్చింది రేపు మరే కంపెనీకైనా
  రావచ్చు.అమెరికాలో కంపెనీలకీ వచ్చాయి.మనకీ వస్తాయి.అప్పుడు ఏం చేయాలి.ఎవడి ఖర్మ వారిని వదిలేద్దామా! తన దాకా వస్తే కానీ తెలీదు.కదా!

  4. బానిసల్లాగా నిద్రాహారాలు మానేసి, పెళ్ళాం/మొగుడు, బిడ్డల్ని వదిలేసి పని చేయించే వర్క్ కల్చర్ అమానుషం కాదా! . నా ఉద్దేశ్యంలో ప్రాజెక్టు మ్యానేజర్లూ దీనికి కొంత వరకు బాధ్యులను కోండి.భార్యాభర్తల్లో ఒకళ్ళూ ఐటి లోనూ, మరొకరు వేరే రంగంలోనూ ఉన్నవాళ్ళకి నే చెప్పేది ఇంకా బాగా అర్ధమవుతుంది.

  5.ఐటి రంగంలీ వారికి వాళ్ళ ప్యాకేజీలు కూడా సరిగా తెలీదు.ఎందుకంటే ఇంతవరకు వేరియబల్ పే లో, కేవలం అబొవ్ ది ప్రామిస్డ్ చూసేరు కాబట్టి.నష్టాల బాటాలో పిల్లలు పెద్దవుతున్నప్పుడు, శరీరం సహకరించడం తగ్గినప్పుడు, మీకై మీరు చేసుకున్న ఇన్వెస్టుమెంట్లు సత్యంలాగా కరిగి పోతే,యూనియన్లతో ప్రభుత్వరంగలో మీ నాన్నగారే బాగా ఉన్నారనిపిస్తుందేమో! పరికించుకోండి.

  నేను ఏ యూనియన్లతోనూ పని చేయలేదు.

 29. 30 Kumar 8:40 సా. వద్ద జనవరి 9, 2009

  Jesus Christ!!!
  If IT guys believe that, unions are the answer for their woes, God save them!.

  అబ్రకదబ్ర ఇంతకుముందెప్పుడో రాసింది గుర్తొస్తోంది. This is how liberty dies..అంటా..with pathetic display of character అనో….

  This is how socities die, begging to become slaves..అనో అనుకోవాలి.

  ఈ టపా ఉద్దేశం వేరూ, నేను అనవసరంగా ఏదో చూసిన ఆవేశంలో అదిక్కడ పోస్ట్ చేసి, చర్చ ని వేరు దారి పట్టించటం ఇష్టంలేదు. అందుకని ఇది నా చివరి రెస్పాన్స్ ఈ టాపిక్ మీద.

 30. 31 Marthanda 6:39 ఉద. వద్ద జనవరి 12, 2009

  సత్యం కంపెనీని నెత్తికి ఎక్కించుకున్న రాజకీయ నాయకుల తప్పు గురించి కూడా మరిచిపోలేము.
  http://nitawriter.wordpress.com/2009/01/09/the-culpability-of-satyams-auditors/

  ఐ.టి. రంగానికి గొప్ప మార్కెట్ ఉందన్నారు. ఐ.టి. కి మనం అనుకున్నంత మార్కెట్ లేదు కాబట్టి సత్యం కంపెనీ దివాలా తీసింది. బ్యాంకు అకౌంట్లని ఫోర్జరీ చెయ్యడం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మోసమే. కనుక రామలింగ రాజు పచ్చి అబద్దాలకోరు అని స్పష్టమవుతోంది.


 1. 1 పొద్దు » Blog Archive » జనవరి బ్లాగావరణం 11:18 సా. వద్ద ఫిబ్రవరి 14, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: