కెప్టెన్ కేసీయార్

చాలా రోజుల విరామం తర్వాత కేసీయారు దొరవారు తమకే సొంతమైన రీతిలో కొన్ని సంధి ప్రేలాపనలు చేశారు. ఈ మధ్య ఈయన ఏమైపోయాడనుకుంటున్నవారికి గమనిక: దొరవారు కొద్దికాలంగా సైనిక శిక్షణ పొందటానికి సరిహద్దులకెళ్లారు. తిరిగొస్తూ వస్తూ, తెలంగాణా కల సాకారమయ్యాక రాష్ట్రాన్ని ముందడుగేయించే చిట్కాలు కొన్నిటిని పీడిత తాడిత ప్రజలకోసం జేబులో నింపుకుని చక్కా వచ్చారు. ఆ చిట్కాలని, పన్లోపనిగా మరికొన్ని ఆసక్తికర విశేషాలని విలేకర్లకి వెల్లడించారు. మచ్చుకి కొన్ని విశేషాలు, వాటికి కర్ణపిశాచి తాత్పర్యాలు – మీకోసం.

>> “రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మూడు నెలల పాటు సైనిక పాలన విధిస్తాం”.

ఏ కారణంతో విధిస్తారో విలేకర్లడగలేదు, వారు చెప్పలేదు. వారి తర్వాతి ప్రేలాపనననుసరించి తెలంగాణా వెనుకబాటుతనం బూచిగా చూపి సైనిక పాలన విధిస్తారని మనం ఊహించుకోవాలి. ఇటువంటి కారణాలతో ఓ రాష్ట్రంలో సైన్యం జోక్యం చేసుకోవటం మనదేశంలో ఇందాకా జరగని విషయం. బహుశా కేసీయారువారు దానికోసం మొదట రాజ్యాంగాన్ని మార్పిస్తారు కాబోలు. ఆ వంకతో మరో ఉద్యమం, మరి కొన్నేళ్ల జాతర. ఏతావాతా, రాష్ట్రమొచ్చినా జనాలకొరిగేది సున్నా అని వీరి మాటల్లో గూఢార్ధం – గ్రహించనివాడి ఖర్మం.

>> “లక్షమంది సైనికులతో జనాభా, విద్య, పేదరికంపై సర్వే చేయిస్తాం”

అది సైన్యమా లేక సిఎన్నెనా? సర్వే చెయ్యటానికే లక్ష మందా!?! భారత దేశానికి ఉన్న సైనికులెందరు, వారిలో సర్వేలు చేసే నైపుణ్యం ఉన్నవారెందరు? అసలు ఒక రాష్ట్రమ్మీదకి లక్షమంది సైనికులని తోలటానికి అదేమన్నా శత్రు దేశమా? ఆ మధ్య నిజాం భజన, ఇప్పుడు సైన్యం ప్రస్తావన. చూడబోతే తెలంగాణా జాగీరుకి నవ నవాబయ్యే ధ్యేయమేదో శరాబీబాబుకి ఉన్నట్లుంది! ఇంతకీ .. ట్యాంకులు, యుద్ధవిమానాలు వగైరాలెన్ని తరలించబోతున్నారో చెప్పలేదేం చెప్మా. ముందే ఓ మాటనుకుంటే బాగుంటుంది కదా. చివరాఖర్నిమిషంలో అవో పదివేలు, ఇవో పాతిక వేలు కావాలంటే కేంద్రానికి కష్టమైపోదూ? అసలే, ఉన్న రెండొందల సెకండ్ హ్యాండ్ మిగ్గుల్లో వారానికోటి రాలిపోతే మిగిలింది పాతికో పరకో. అప్పటికప్పుడు వేలకొద్దీ విమానాలడిగితే ఎక్కడ్నుంచొస్తాయి? మళ్లీ అప్పుడు ‘అడిగినయ్యివ్వలేదు. ఇది తెలంగాణాపై వివక్షే. మాకు ప్రత్యేక దేశం కావాలి’ అంటూ కొత్త పాటందుకునే దూరపు దురాలోచనేమన్నా దాగుందా ఇందులో?

>> “ప్రతి మండలంలోనూ స్టేట్ పబ్లిక్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నిర్బంధంగా కేజీ నుండి పీజీ దాకా చదువు చెప్పిస్తాం”

ఆహా. ఇదంతా మూడే మూడు నెలల్లో! సరిహద్దుల్లో అద్భుత దీపమేదన్నా దొరికిందేమో అయ్యవారికి. ఏమైతేనేం, ఒక్కదెబ్బకి రెండు పిట్టలు. అటు తెలంగాణావోళ్లకి కేజీలకొద్దీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇటు ఆంధ్రా దోపిడీ కార్పొరేట్ కాలేజీలోళ్ల నోళ్లలో ఎర్రెర్ర మట్టి. కేసీయార్ దెబ్బంటే ఆంధ్రావాళ్లు అబ్బా అనాలి, ఏటనుకున్నారో.

>> “చంద్రబాబు తొమ్మిదేళ్లలో తింటే నేను నాలుగేళ్లలో తినొద్దా అని వైఎస్సార్ పోటీ పడుతున్నారు”

అంతా వాళ్లిద్దరే తినేస్తే తనకేమీ మిగలదేమోనని ఈయన భయం, బాధ.

>> “కార్యకర్తలూ, తెలంగాణాని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో కిలోమీటర్ లోపు బొంద పెట్టండి”

ఎక్కడి నుండి కిలోమీటర్ లోపో చెప్పకపోతే ఎలా కేసీయారూ? తెలంగాణా నుండా, కరీం నగర్ నుండా, నీ ఇంటినుండా? పోయిన సారీ ఇలాగే వివరం చెప్పకుండా గందరగోళంగా మాట్లాడితే ఓటర్లు కన్‌ఫ్యూజ్ ఐపోయి నీ పార్టీనే బొంద పెట్టేశారు. ఇప్పుడూ అదే తప్పు చేస్తే ఎలాగమ్మా.

>> “తెలంగాణా ప్రజలు వచ్చే ఎన్నికల్లో చేసే యుద్ధమే చివరిది”.

తెలంగాణా ప్రజలకి తానే ఏకైక ప్రతినిధిని అనుకుంటాడు కాబట్టి ఈ వాక్యం వెనక ఆయన అసలుద్దేశం ఇది: “కేసీయార్ వచ్చే ఎన్నికల్లో చేసే యుద్ధమే చివరిది”.

అటులనే; తధాస్తు.

17 స్పందనలు to “కెప్టెన్ కేసీయార్”


 1. 1 laxmi 9:42 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  hahaha 🙂 adiripoindandi tapa. motaniki KCR manchi entertainment channel aipoyadu

 2. 2 సుజాత 10:13 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  అప్పుడెప్పుడో తాడేపల్లి గారి బ్లాగులో ఒకాయన కెసీఅర్ భావజాలం అర్థం కావాలంటే చాలా “క్నాలెడ్జ్” ఉండాలనీ, ఆంధ్రోళ్లకి అది లేదనీ బాధ పడ్డారు. ఆయన భావ జాలమే కాక, “భాషాజాలం” కూడా మనకర్థం కాదని నాకర్థమైందని మీకర్థమైందనుకుంటాను.

  ఈ యుద్ధం చివరిది అని ఆయనే ఒప్పేసుకుంటుంటే ఇక మనకభ్యంతరమేమున్నది?

  ఎంతైనా మీకసలు కెసి ఆరంటే పడదు సుమా!ఆయన మాట్లాడిన ప్రతి మాటకీ ఇన్నిన్ని విమర్శలా?

  ఈ టపాని వెంటనే కెసీఅర్ కి forward చేస్తానుండండి!
  అంతే కాదు, ఈ టపాని వంశీ కిరణ్ రెడ్డి అని బ్లాగర్ చూస్తే బాగుండు అనిపిస్తోంది.

  మొత్తానికి భలే రాశారు.

 3. 4 కె.మహేష్ కుమార్ 10:42 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  హాస్యంగా ఉన్నా,సెటైర్ బాగా పండింది. కేసీఆర్ ది కొంత అతిశయోక్తైతే మరికొంత అవగాహనా రాహిత్యం. నాయకులే ఇలా ఏడిస్తే, తెలంగాణా వచ్చినా తెలంగాణా ప్రజల్ని వీళ్ళనుంచీ ఎవరు కాపాడుతారో!

 4. 5 lachhimi 10:59 సా. వద్ద సెప్టెంబర్ 23, 2008

  “ముక్కోడు” (కేసీఆర్ కి మా ఇంట్లో వాళ్ళందరూ పెట్టిన నిక్ నేమ్ ) కి ప్రగల్భాలు పలకడమే తప్పించి ఏమీ రాదు
  ఇంకా ఎక్కువ మాట్లాడితే “కారు” కి ఎప్పుడో ఆక్సిడెంట్ అవుతుంది
  ఆయన్ని పరామర్శించడానికి అందరూ “గులాబీ” బట్టలేసుకుని “గులాబీ” దండలతో వెళ్తారు :):):)

  నైస్ పోస్ట్ 🙂

 5. 6 Chaitu 2:01 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  అదిరింది…..సటైర్ భలె పండింది

 6. 7 చదువరి 4:40 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  కేసీయారుది అవగాహనారాహిత్యం కాదేమో! ఓ రకమైన భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టి తన పట్ల, తెలంగాణా ఉద్యమం పట్లా సానుకూలతను తేవడం ఆయన చేస్తూంటాడు. గతంలో కూడా ఇలా మాట్లాడే రెచ్చగొట్టేవాడు. మంత్రయ్యాక ఇక ప్రజల వోట్లు అవసరం లేదు కాబట్టి ఢిల్లీలో ఉండి మందంగా మన్ను తిన్న పాములా పడిఉండేవాడు. ఎన్నికలొచ్చేవేళకు మళ్ళీ బుసలుకొట్టి విషం గక్కేవాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు సరిగ్గా నడుమ్మీద కొట్టారు. ఆ దెబ్బ నుంచి తేరుకునేలోగా కొత్తగొంతులు లేచాయి. పాత గళాలు కొత్త రాగాలెత్తుకోబోతున్నాయి. కొత్త రాజకీయులూ, కొత్త నటులూ, రాజకీయ నటులూ, నట రాజకీయులూ.. ఈ హోరులో తన గొంతుక వినిపించకుండా పోకూడదంటే ఇల్లాటి షాక్ మాటలు మాట్టాడాలని ఆయన భావన కాబోలు!

 7. 8 వేణూ శ్రీకాంత్ 5:46 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  హ హ 🙂 ఆయన మాటలకి సరైన భాష్యం చెప్పారండి… టపా అదిరింది.

 8. 9 ఉమాశంకర్ 6:10 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  మహేష్ గారు,

  ఇక్కడ “కొంత” లేవీ లేవు, అన్నీ “ఫుల్లు” లే. ఈయన ఆ స్టేజి ఎప్పుడో దాటిపొయారు.

  నాకు ఈయన్లో బాగా నచ్చెది ఆ డెడ్ లైన్లు. ఇప్పుడు తగ్గాయి గాని, ఒకటా రెండా?

 9. 11 ప్రవీణ్ గార్లపాటి 10:19 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  ఆహా! ఏమి మన ముక్కు సుందరుని ప్రేలాపనలు.. కేక.

 10. 12 krishna 10:59 ఉద. వద్ద సెప్టెంబర్ 24, 2008

  కొన్నాళ్లు బంగారమ్మను తెలంగాణా దేవత అన్నాడు, తరువాత తెలంగాణా తల్లి అంటూ కొత్త తల్లిని తయారుచేయించాడు.
  ప్రస్తుతానికి క్రొత్త తల్లి, క్రొత్త దేవతలు దొరక్క సైన్యం మీద పడ్డటున్నాడు. జనాలు గొర్రెలు ప్రతిసారి అవ్వరేమో అన్న అనుమానం ఈ ముక్కోడికి, ఇంకా రాకపోవటం లో ఆశ్చర్యంలేదు. కాని ఇప్పటికి ఈ ముక్కోడికి సపోర్ట్ చేసే వాళ్లు బాగానే ఉండటమే బాధాకరం.

 11. 15 ఆలపాటి రమేష్ బాబు 7:44 ఉద. వద్ద అక్టోబర్ 12, 2008

  YES WHAT U R SEND IN BLOG THAT IS ALL CORRECT. KCR IS BASE LESS FELLOW. YOUR POST IS NOT SETIRE IT IS REAL. IF KCR CAN SEE U R POST HE MAY NOT BE ASHEMED BECAUSE HE IS WISE CHEATER


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: