‘దేవుడిని నమ్ముతావా?’ అని ఎవరడిగినా నే చెప్పే మాట ‘నేనాస్తికుడిని’. ఎవరికి కావలసిన అర్ధం వాళ్లు తీసుకోగలిగే వెసులుబాటున్న గొప్ప పదమిది. విన్నవారి దృక్కోణాన్ని బట్టి దానర్ధం ‘నే నాస్తికుడిని’ కావచ్చు, ‘నేను ఆస్తికుడిని’ అనీ కావచ్చు. ఇంతకీ ఎవరు నేను?
దీనికి సమాధానం నాకూ తెలీదు. నాదో ప్రత్యేకమైన ఫిలాసఫీ. దేవుడనేవాడు లేకుంటే మనం ఎన్ని కోరికలు కోరినా ప్రయోజనమేముంది? ఒకవేళ దేవుడుంటే గింటే – మతాలన్నీ చెప్పేలా ఆయన విశ్వాంతర్యామే అయితే, ‘అంతా ఈశ్వరేఛ్చ’ టైపులో లోకంలోని చీమలన్నీ ఆయన ఆజ్ఞ ప్రకారమే కుడుతుంటే – ఎవరికి ఎప్పుడు ఏం కావాలో తెలిసిన పెద్దాయనకి నాకు ఫలానాది కావాలి అని అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరమేముంది? కాబట్టి, దేవుడున్నా లేకున్నా ఆయనకి పూజలు చేయాల్సిన పనిలేదు. పూజలతో పని లేనప్పుడు ఏ దేవుడు, ఏ మతస్తుడు లాంటి ప్రశ్నలూ రావు. ఏతా వాతా, అసలు దేవుడున్నాడా లేదా అన్న సందేహమే నాకు లేదు. నావరకూ ఆయనున్నా లేకున్నా తేడా లేదు.
దేవుడితో పని లేదన్నంత మాత్రాన నేను నాస్తికుడిని కాను. అలాగని ఆస్తికుడినీ కాను. నాలా అటూ ఇటూ కాని వాళ్లనేమంటారో తెలీదు. ఏ మతాన్నీ ఆచరించను కానీ అన్ని మతాలూ గొప్పవేననే నమ్మకం నాది. అదే సమయంలో మతాల పేరిట దేవుడిని ఆర్గనైజ్ చెయ్యటం తప్పనే అభిప్రాయమూ నాదే. ఈ భూమ్మీది మతాలూ, వాటినేలే సంస్థలూ మాఫియా కన్నా భయంకరమైనవని నేననుకుంటాను. కానీ అటువంటి సంస్థలే వివిధ సమాజాల వృద్ధికీ పాటు పడ్డాయన్న తెలివిడి కూడా నాకుంది. బైబిల్, గీత, ఖురాన్ అన్నీ చదివా. గుళ్లూ గోపురాలూ, దర్గాలూ మసీదులూ, చర్చ్లూ చాపెళ్లూ, గురుద్వారాలూ సినగోగులూ…. కనబడ్డ ఆరాధనా స్థలాలన్నిట్లోనూ అడుగు పెడతా – అయినా ఏ దేవుడికీ మొక్కను. గుడికెళ్లటం ఆస్తికత్వమా, భక్తి నాస్తి అయితే నాస్తికత్వమా? ఆస్తికులకీ, నాస్తికులకీ ఉన్నట్లు నాలాంటి అయోమయపు జగన్నాధాలకీ సంఘాలేవైనా ఉన్నాయా?
‘సైన్సే సత్యం. దేవుడు మిధ్య. ఎక్కడున్నాడో చూపించు’ అని శాస్త్రీయ సవాళ్లు చేసే హేతువాదులూ, ‘ఆకలి దప్పికల్ని చూపించగలవా? అవి ఉన్నట్లే దేవుడూ ఉన్నాడు’ అనే వేదాంతభరిత వితండవాదులూ ఇద్దరూ శాస్త్రానికి కొనసాగింపే వేదాంతం అన్న చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో నాకెప్పుడూ అంతుపట్టదు. వేదాంతం స్థూలంగా చెప్పే విశ్వ రహస్యాల్నే సైన్స్ సూక్ష స్థాయిలో వివరిస్తుందనీ, అవి రెండూ ఒకే నాణానికి రెండు వైపులని వీళ్లెందుకు గ్రహించరు? ఇలా మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాకెదురయిన ప్రశ్న ఒకటే: ‘ఇంతకీ నువ్వు దేవుడిని నమ్ముతావా, లేదా’. దీనికి నా సమాధానం మీకు తెలిసిందే.
ఆ మధ్య ఒకానొక సాహితీ సదస్సులో ఓ మహానుభావుడు పరిచయమయ్యాడు. తనను తానో కరడుగట్టిన హేతువాదిగా అభివర్ణించుకున్న ఈ పెద్దమనిషి పోకడ నాకు చాలా సిల్లీగా అనిపించింది. సభాకార్యక్రమాలు ప్రారంభం కావటానికి ఇంకా సమయముండటంతో మేమిద్దరం వెనక వరసలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ సభలో ఆయనది కూడా హేతువాదమ్మీద ఓ లెక్చరుందట. అప్పటి దాకా నా పక్కన కూర్చుని బాతాఖానీ వేస్తున్న హేతువాదిగారు ‘ఇప్పుడు ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుబ్బాయమ్మ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు’ అన్న ప్రకటన వినపడగానే చివ్వున లేచి ఏదో పనున్నట్లు హడావిడిగా బయటికెళ్లిపోయారు. ప్ర.ర.శ్రీ.సుబ్బాయమ్మగారు దీపమంటించిన ఐదు నిమిషాలకి గానీ ఆయన మళ్లీ లోపలకి అడుగుపెట్టలేదు. మళ్లీ నాతో బాతాఖానీ షురూ. కార్యక్రమాల వరసలో మూడోది ‘వేద పఠనం’. ఇది మొదలవబోయే ప్రకటన వినగానే హేతువాదిగారు మళ్లీ బయటికి లగెత్తారు. వేద పఠనం అయిపోయాక తిరిగొచ్చారు. ఈ తంతు చూసి విస్తుపోతూ నేను ‘అదేమిటండీ’ అంటే ఆయన ‘ఇలాంటివి నేను ఛస్తే చూడనండీ’ అంటూ ఓ పోజిచ్చారు. ఇదో రకం చాదస్తం. హేతువాదమంటే పిడివాదమనుకునే ఇలాంటివాళ్ల వల్ల దానికి వస్తున్న చెడ్డపేరు అంతాఇంతా కాదు. ఆ సంగతి ఆయనకి సున్నితంగా చెప్పబోతే చిరాగ్గా చూసి నన్నో ప్రశ్న అడిగాడాయన. ఆ ప్రశ్నా, దానికి నా సమాధానమూ రెండూ మీకాల్రెడీ తెలుసు.
నా కున్న అవగాహనలో మీమ్ముల్ని Agnostic అనో Rationalist అనో అంటారు. అయిన బావుంది మీ తంతు.
ఏ మానవుడైనా సత్యం గురించే ఆలోచించాలి… సత్యాచరణే చేయాలి. భగవంతుడైనా ‘నియతి ’ కి వ్యతిరేకంగా ఏమీ చేయడు.. చేయలేడు.
“నావరకు దేవుడున్నా లేకున్నా తేడా లేదు”… ఈ మీ ధోరణి మంచిదే… మంచిది మాత్రమే కాదు, ఎక్కువ మందికి అసలుండవలసిన ధోరణి అదే. అప్పుడే మనం సూటిగా మన పనేదో మనం చేసుకుపోతాము.దేవుని గురించి ఆలోచిస్తుంటే ఎక్కువ సందర్భాలలో ఎంతకూ తెగని వాదోపవాదాలు బయలుదేరతాయి… అర్థంలేని కంఫ్యూజన్, ఆవేశాలు జనిస్తాయి.
దైవభక్తి,పాపభీతి ఒక్కోసారి మనిషిని బలహీనుడిగా,మూర్ఖునిగా మారుస్తాయి.
ఇక పోతే దేవుని ఉనికిని లోకుల వ్యాఖ్యల ఆధారంగానో లేక వారి అభిప్రాయాల ఆధారంగానో ప్రశ్నిస్తే పరిస్థితి మరింత గందరగోళమవటమే తప్ప మనకొరిగేదేమీ ఉండదు. అది ఎవరికి వారు అంతరంగంలో దర్శించుకోవలసిన విషయం. ఒక వేళ అలా దర్శించలేక పోయినా మునిగిపోయేదేమీ లేదు. ఎందుకంటే మనిషికి దేవుడికన్నా ‘సత్యం ’ ప్రధానం.
ఏం సార్. చాలా రోజులు దర్శనమే లేకుండా పోయారు? Your absence is felt in blog world!.
మీరు చెప్పినవన్నీAgnosticism కి దగ్గరగా ఉన్నాయి. అయినా ఈ ఇరుకు లేబుళ్ళ గొడవ ఎందుకు లెండి. “మనిషి” వాదం అనుకుంటేపోలా..ఎవరో అన్నట్లు, భగవంతుడికీ, రాక్షసుడికీ మధ్యలో ఉండేవాణ్ణే మానవుడు అంటారుట.
Yes, మీరు Agnostic అని ఒప్పుకుంటే, మీ సంఘంలో చాలా పెద్ద, పెద్ద వాళ్ళే ఉన్నారండీ. Russel దగ్గర్నుంచీ మొదలెడితే ఈనాటి Larry King దాకా. కొంతకాలం కిందట Larry King, Stephen Hawking ని ఇంటర్వూ చేయగా చూశా, దాంట్లోనే అనుకుంటా తనని తాను Agnostic అని చెప్పుకున్నాడతను.
అలాగే Science and Sprituality are two different ways of decoding the universe అని కూడా ఎవరో అన్నారు. I don’t think they two are mutually exclusive and opposite to each other though.
Quantum Physics & theory of relativity వచ్చిన తరవాత, హిందూ వేదాల సారాంశానికి ప్రపంచ వీధుల్లో huge boost వచ్చిందన్నది బాగానే కనబడుతుంది. (ఓ పేద్ద controversial statement pass చేసేశానా, చంపేస్తారిప్పుడు నన్ను :-).
కాని నా మటుకు నాకు, science, spirituality ఏ మార్గం ద్వారా వెళ్ళినా ఒకే దగ్గర ఆగుతున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతానికి.. అలాంటప్పుడు సైన్స్, ఆధ్యాత్మికత లో ఉండే మూల సూత్రాలని validate చేసి confirm చేయడమే మంచి పరిణామం. ఒకవేళ ఇంకేదో కనుక్కున్నా మరీ మంచిది. ఆ ‘అదేదో’ తెలుస్తుంది కదా.
మిగతా వాదన అంతా ఎలా ఉన్నా, చివరి హేతువాది ఎపిసోడు సూపరు. మనకున్నది ఇలాంటి హేతువాదులే. ఒకసారి ఆంధ్ర దేశంలో ఒక ప్రముఖ రచయితతో ఒక సాయంత్రం గడిపి ఇంకో స్నేహితుడి ఇంటికి బయల్దేరాను. ఈ రచయిత నన్ను అక్కడ దింపుతానని నాతో కూడా వచ్చారు. మా స్నేహితుడి ఇంట్లోకి కూడా వచ్చి కూర్చున్నారు. ఇంతలో స్నేహితుడి నాన్నగారు బయటికొచ్చి మమ్మల్ని పలకరించి, రుద్రాభిషేకం ఇప్పుడే పూర్తయింది. మహానైవేద్యం పెట్టబోతున్నాం. ఇంకో పది నిమిషాలుంటే తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు అన్నారు. అంతే, నా రచయిత మిత్రుడు గబుక్కును లేచి పరుగోపరుగు! నా ఇంకో హేతువాద మిత్రుడికి, దయ్యం కాన్సెప్టుతో తీసిన సిక్స్తు సెన్స్ సినిమా అర్ధం కాలేదు .. దయ్యాల్ని నమ్మడు గనక!
అయ్యా .. అదీ మన ప్రపంచం తీరు. 🙂
ఇప్పుడే మా ఆఫీసులో ఒకమ్మాయి కొన్ని అక్షతలు తెచ్చి తలపైన వేసుకొమ్మంది. ఎందుకు ఏమిటి అని అడక్కుండా తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదం కోసం లాబ్ కి వెళుతున్నాను. నా బ్లాగు ఉపశీర్షిక చూడండి. నేనూ ఎగ్నోస్తికుండనే. 🙂
నేనూ డిటోయే…అయితే, ఒక్కోసారి, ఆశ్చర్యం, బాధ కలుగుతాయి…బాధల్లో ఉండే వాళ్ళను చూసి, సహాయం చేయటం అటుంచి, కనీసం వాళ్ళ దిక్కు కూడా చూడకుండా దేవుడి దర్శనం కోసం పరుగులు తీస్తుంటారు.
కేరళ “గురువాయూర్” అన్న గుడి కెళ్ళాం ఓ సారి. అక్కడ గుళ్ళో ఎవరైనా చంటి పిల్లలను తీస్కెళ్ళి, ఆ చంటాళ్ళు అవసరమై లఘుశంక కానిస్తే, “దేవుడు” అపవిత్రమవుతాడట, తిరిగి ఆ ఇంటాయనే పుణ్యాహవచనం చేయించాలట. అక్కడ గుడిలో బోర్డ్ కూడా పెట్టారు దీన్ని. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల మీద ఆశ్చర్యం, కొండొకచో సానుభూతి కూడా కలుగుతాయి.
నా గురించి ఇంత బాగా నేను కూడా చెప్పుకోలేనేమో…
దాదాపు నా ఆలోచనలన్నీ మీవి సాగినట్టుగానే సాగుతాయి.
@ఆ మెరక తెలుగోడు,ప్రవీణ్,రవి:
ధన్యవాదాలు.
@కొత్తపాళీ:
ఎవరో ఆ రచయిత 🙂 నిన్నటినుండీ తెగ చించేస్తున్నా ఆయనెవరో కనుక్కోటానికి.
@ఇండిపెండెంట్:
మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరిచ్చిన వివరాలు బాగున్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ని వేదాంతాన్నీ విశ్లేషిస్తూ మీరో వ్యాసం రాయొచ్చుగదా. మీదగ్గర చాలా సరుకున్నట్లుంది కానీ మీకంటూ ఓ బ్లాగులాంటిది లేనట్లుంది. ఆ పనెందుకు చెయ్యకూడదు?
@సరస్వతి కుమార్, రానారె:
దైవభక్తి ఎక్కువగా కల కుటుంబంలోనుండొచ్చిన నాకీ ధోరణెందుకలవడిందో తెలీదు. వింతేమిటంటే, మొదట్లో నా ఈ ధోరణి మార్చటానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, చివరికి వాళ్లూ (చాలావరకూ ) నా ధోరణిలోకే వచ్చేశారు!
ఆచరించాక చెప్పే మాటలకూ, ఏదీ ఆచరించకుండా తోచింది చెప్పే మాటలకూ చాలా తేడా ఉంటుంది. మతాల సంగతెలా ఉన్నా ఆస్తికత్వం అనేదొక సున్నితత్వపు స్థాయి (sensitivity level). అది అంత తొందరగా జాగృతం కాదు. ఎన్నో (వేల) జన్మలు పట్టే విషయం. ఒక బ్లాగులోనో టపాలోనో తేలిపోయేది కాదు. నలుగురు అగ్నోస్టిక్/ నాస్తిక మిత్రుల భళాభళీలతో మూలపడేదీ కాదు.
నా పద్దతీ ఇంచుమించి ఇలాంటిదే. మానవత్వాన్ని పెంచలేని మతమూ, మంచిని దగ్గరచేర్చని కులమూ రెండూ “వ్యర్థమైన సామాజిక అవసరాలు” అని నేను భావిస్తాను. కాకపోతే ఈ ఇజాల-నిజాలనుంచీ తప్పించుకోలేము గనక,అప్పుడప్పుడూ వాద- ప్రతివాదనలూ, ఖండనలూ-వితండాలూ చెయ్యాల్సి వస్తుంది.
తాడేపల్లిగారు
మరి మీకెన్ని వేల ఏళ్ల తపస్సు తర్వాత జాగృతమయిందేమిటి ఆస్తికత్వం? అబ్రకదబ్ర చెప్పిన హేతువాదికి సరితూగే పిడివాదపు ఆస్తికుడిలాగున్నారు మీరు. మీ వాదన మీరు సూటిగా చెప్పకుండా భళాభళి అంటూ అంత వ్యంగ్యమెందుకో?
వంశీ గారూ..మీరు మరీనూ..దొరికితే చాలు 🙂
వదిలేయొచ్చు కదా..ఏదో ఎప్పుడూ వ్యాకరణమో, ఛందస్సో చెప్పే తాడేపల్లి గారేదో అన్నారే అనుకో..
దేవుడు కనపడడు కాబట్టి, పాపం..ఆస్థికులు ఆయన్ని చూపించలేరు కాబట్టి, చూపించమని సవాల్ చేసే వాళ్ళకి, సహజంగానే ఒక highroad లభిస్తుంది వాదనల్లో .
ఒక ఆధిపత్య స్థానం లోంచి మాట్లాట్టం చాలా సుళువు కదండీ. Absence of Presence doesn’t mean Presence of Absence అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. తాడేపల్లి గారు, ఒక దేవుడి గురించో, మతాల గురించో మాట్లాడలేదు కదా. దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించలేమో, లేడని కూడా నిరూపించలేము కదా. అదే అబ్రకదబ్ర గారు రాసారు కూడాను.
చాలా abstract concepts లానే, spirituality కూడా, it can only be experienced, but not explained. మన అనుభవం లోకి రాలేదు కాబట్టి, ఎందుకు మనం మాత్రం superior గా ఫీల్ అవ్వటం.
అఫ్ కోర్స్. ఇది తాడేపల్లి గారికి కూడా వర్తిస్తుంది అనుకోకండి. “వేల జన్మలు, భళా భళీలు” లేకుండానే ఆయన చెప్పదలచుకుంది చెప్పేస్తే ఈ డిస్ట్రాక్షన్స్ ఉండేవి కావెమొ.
హ హ హ..ఇపుడు మీ ఇద్దరి మీద నేను high road తీసేసుకున్నాగా 😉
Keep the “fun” alive in discussions guys…will you? 🙂
బాబోయ్..ముద్రా రాక్షసం…”అనుకోకండి” కాదు “అనుకోండి”.
నరేంద్ర భాస్కర్ S.P.
నమస్తే!
శాస్త్రానికి కొనసాగింపే వేదాంతం, చాలా బాగా చెప్పారు,
ఇండిపెండెంట్ గారన్నట్టూ చిరకాల దర్శనం – పలుకే బంగారమాయెనా ?
నేను మాత్రం దేవుణ్ణి నమ్ముతాను,
దేవుడనే నమ్మకానికి మూలం ఙాన దీపం వెలుగులో కళ్ళకు కనపడే స్వానుభవమే ఐతే ఎవడి జీవితం వానికి ప్రధమ దేవుడు, పక్కోడూ అలాంటి ప్రధమ దేవుడే
:)) బాగుంది చివరి ఎపిసోడ్. కొ.పా. గారు చెప్పింది కూడానూ.
మీరు ఆగ్నోస్టిక్ ఏమో అని నాకు అనిపిస్తోంది మరి. ఇంతకీ….agnosticism ని తెలుగులో ఏమంటారు?
“దేవుడు ఉన్నాడు” అనేదాని కన్నా “దేవుడు లేడు” అనేదే సత్యానికి దగ్గరగా ఉంటుంది, ఈ రెండూ వేర్వేరు కావు అనేది నిజానికి గమ్మత్తైన విషయం.
దేవున్ని నిరూపించడం ఎంతో సులభం! కాకపోతే పదాల్లో, అక్షరాల్లో, వస్తువుల్లో దేవున్ని వెతకడం అన్నది ఒక రకంగా మలంలో మూలాన్ని వెతికినట్టు… 🙂
ఈ టపా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆస్తికుడిని కాదు. నాస్తికుడిని కాదు.
>>>>>
agnosticism ని తెలుగులో ఏమంటారు?
>>>>>
ఆజ్ఞేయవాదం అంటారు.
మీవి సేం నా లాంటి ఆలోచనలె.