మళ్లీ ‘విదేశీ హస్తం’

‘భారత దేశాన్ని ఆర్ధికంగా బలహీనపరచేందుకు కొన్ని దేశాలు చేస్తున్న కుట్ర ఫలితమే చమురు ధరల పెరుగుదల’. కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోలియం ఆధారిత ఇంధనం ధరలపై వివరణిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఇది. అగ్ర రాజ్యంగా ఎదుగుతున్న భారత్ ను దెబ్బతీయటానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందట. నాలుగేళ్ల క్రితం నలభై డార్లకు దగ్గర్లో ఉన్న పీపా ముడి చమురు ధర ఇప్పుడు నూట నలభై దగ్గరకు రావటానికి ఇదే ప్రధాన కారణమట!

మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టటం అంటే అదే. ఈ మాటలు చదివాక వై.ఎస్. అమాయకుడో, జనాలు పిచ్చివాళ్లో అర్ధం కాక బుర్ర బద్ధలు కొట్టుకోవాల్సిందే. ముడి చమురు ధరల పెరుగుదల మన దేశానికి మాత్రమే వర్తించే విషయం కాదని ఆయనకు తెలియదా? భారత దేశాన్ని ఇబ్బంది పెట్టటానికి ధరలు పెంచాల్సిన అవసరం చమురు ఉత్పత్తి దేశాలకేముంది? వ్యాపారి ఎప్పుడన్నా లాభం కోసం పనిచేస్తాడే కానీ వినియోగదారులని నాశనం చేయాలని కాదు. అలా చేయటమంటే తన ఇంటికి తాను నిప్పు పెట్టుకోవటమే. ఒక ‘డైనమిక్ ఆంట్రప్రన్యూర్’ తండ్రిగారికీ విషయమే తెలియకపోవటం విడ్డూరం.

కేంద్రం పెంచిన చమురు ధరల సెగ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ తన ప్రభుత్వానికి పొగ పెడుతుందోననే ఆందోళనతో వై.ఎస్. ఆలోచన లేకుండా హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లుంది. చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ వ్యవహారమనీ, ఆ విషయంలో కేంద్రంకానీ, తన ప్రభుత్వం కానీ చేయగలిగేదేమీ లేదనీ, ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నాయనీ కూడా వై.ఎస్.ఇదే సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇందులో చాలావరకూ నిజమే. ఆయన అంత వరకే చెప్పి ఆగి ఉంటే బాగుండేది. ‘విదేశీ హస్తం’ విషయమెందుకు మధ్యలో?  దానికి బదులు దేశంలో చమురు ధరల పెరుగుదల ఎందుకు అనివార్యమో వివరించటానికి ప్రయత్నించి ఉండాల్సింది. అర్ధం చేసుకునేవాళ్లు చేసుకుంటారు, లేని వారు లేదు.

విదేశీ కుట్రకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేయాలట. లేకపోతే వాళ్లూ ఆ కుట్రలో భాగస్వాములేనని ప్రజలు భావిస్తారట. ప్రతిపక్షాలకు ఎక్కడ చెడ్డపేరొస్తుందోనని వై.ఎస్.కి ఎంత బాధో! పెట్రో ధరల పెంపుపై నానా యాగీ చేస్తున్న ప్రతిపక్షాలని ఏదో రకంగా ఇరుకున పెట్టటానికే ఈ విదేశీ హస్తం ప్రస్తావన అన్నది సుస్పష్టం. కానీ ఆయననుకున్నంత అమాయకులా ప్రజలు?

ఇరవయ్యేళ్ల క్రితం దాకా దేశంలో ఎక్కడేమి జరిగినా ‘సి.ఐ.ఎ. కుట్ర’ అనటం నాయకులకో ఫ్యాషన్ గా ఉండేది. ఆ తరువాత ఆ స్థానంలోకి ‘ఐ.ఎస్.ఐ. కుట్ర’ వచ్చి చేరింది. వినీ వినీ ప్రజలు విసిగెత్తిపోయారో లేక అనీ అనీ నాయకులే విసుగెత్తిపోయారో కానీ మొత్తానికి చాలాకాలంగా అటువంటి చమత్కారాలు కనుమరుగైపోయాయి. వై.ఎస్. పుణ్యాన ఆ సంస్కృతి మళ్లీ మొదలవనుందేమో.

6 స్పందనలు to “మళ్లీ ‘విదేశీ హస్తం’”


 1. 1 కె.మహేష్ కుమార్ 9:07 సా. వద్ద జూన్ 9, 2008

  వై.ఎస్ తన పాత అలవాటు గా ‘విదేసీ హస్తం’ అనేసాడుగానీ, ఈ పెంపు వెనక కొన్ని అంతర్జాతీయ వ్యాపార, రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయనడంలో కొంత నిజముందని నాకూ అనిపిస్తుంది. చమురు ధరల నిర్ణయం విషయంలో అమెరికా ప్రవర్తిస్తున్న తీరు కొంఛెం అనుమానాస్పదంగా లేదూ? ఏది ఏమైనా కొన్ని conspiracy theories మనకు అవసరమే! కానీ మరీ చౌకబారు వై.ఎస్ కామెంట్లు మాత్రం కాదు. బాగా చెప్పారు.

 2. 2 ఓ ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు 7:22 ఉద. వద్ద జూన్ 10, 2008

  ప్రతి చేతకాని వాడు తన వైఫల్యాన్ని ప్రక్కవాడిమీద తోయడం మనకు (ముఖ్యంగా తెలుగు వాళ్ళకు) అనాదిగా వస్తున్న అచారం. ఇంత మంచి ఆచారాన్ని మనవాళ్ళు అంత తొందరగా వొదులుతారా!

 3. 3 Srinivas Vangala 10:47 సా. వద్ద జూన్ 10, 2008

  Why analyze the foolish statements made by our politicians?How can you expect that these statements will be logical? If YSR expects people to believe him,then he is living in fools paradise.People are smart and intelligent.See the way they taught both Congress and JD(S) a lesson in Karnataka.Devegowda got a resounding slap in his face.The people unceremoniously dumped Devegowda &sons,Sona Gandhi and her stupid son.We will also do the samething.

 4. 4 బొల్లోజు బాబా 5:35 ఉద. వద్ద జూన్ 13, 2008

  ప్రతి చేతకానివాడు తన వైఫల్యాన్ని ప్రక్కవాడిమీద తోయడం అనే వాఖ్య అభ్యంతరకరం.

  విదేశాలకు పరుగులెత్తి మళ్లా డయాస్పోరా పేరిట, తమ సంస్కృతిని, సాంప్రదాయాలను గుర్తుచేసుకొంటూ నిరంతర మానసిక చింతన చేసుకొంటున్న “ఓ ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు” అనే ఆసామీకి, ఇక్కడే ఉండిన వాళ్లందరూ చేతకాని వారిగా కనిపించటం చాలా దారుణం.
  మూలాలను మరచి సాము చేయటం అంటే ఇదేనేమో?
  ఈయన మాటలకు మనవాళ్లుత్త వెధవాయిలోయ్ అన్న గిరీసం మాటలకు తేడాలేదు. కానీ పాత్రోచితంగా గిరీశం, ఒక అవకాశవాది, అబద్దాలకోరు, నైతికత లేనివాడు. ఈ మహాను భావుడు కూడా అంతేనా?

  పెట్రోలు ధరలు పెరగటంలో మనవైఫల్యమేముంది. ఈ రోజున ప్రపంచానికి గ్లోబల్ పోలీసు అమెరికా కాదా? తన కనుసన్నలలో తప్ప ప్రపంచం మరో విధంగా అలోచించటానికి కూడా అవకాశం లేదన్న విషయం అబద్దమా?
  ఎంత అమెరికాలో ఉంటే మాత్రం,(అమెరికన్ సిటిజన్ అయిపోరుగా) సాటి తెలుగువారిపట్ల ఇంత అవమానకరంగా మాట్లాడటం సబబు కాదు.

  బొల్లోజు బాబా

 5. 5 ఓ ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు 3:14 సా. వద్ద జూన్ 17, 2008

  బాబా గారి స్పందన చదివాక నాకు నాలుగు ముక్కల్లొ ప్రత్యుత్తరం ఇవ్వలనిపించింది.

  1. గుమ్మడి కాయల దొంగ అంటె భుజాలు తడుముకొన్నడట.

  2. ఏరు దాటక తెప్ప తగలెయ్యటం. మన నేతలు అమెరిక వచ్చి బిచ్చం ఎత్తుకున్నాప్పుడు ఎమైందో ఈ పొరుషం. ఏందరో NRIల పెట్టుబడులే ఈనాడు మన దేశాన్న్ని కాస్తయిన ముందుకు తెసుకెళ్తున్నాయి.

  3. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని. బావుంది. వ్యాపారం పేరుమీద వలస వెళ్ళి నాలుగు వెనకేసుకోవచ్చు, (లేదా మన నాయకుల్లా ప్రజల్ని, దేశాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించుకోవచ్చు) కాని తెలివికి విలునిచ్చిన దగ్గర ఉద్యొగం మాత్రం చెయ్యకూడదు. బావుంది.

  4. పాడిందె పాడర పాచిపళ్ళ దాసుడ అన్నట్లు. మళ్ళి అదే ప్రతిపక్షం తప్పు, కేంద్రం తప్పు, అమెరికా తప్పు, చైనా తప్పు. ఈప్పుడు విదేశంలో వున్న నా తప్పు.

  బావుంది.

  ఓ ఆమెరికా (ఆ మెరక)తెలుగోడు

 6. 6 telanagnodu 12:05 సా. వద్ద జూన్ 27, 2008

  oho americalo vunna telugodaa sametahlu bagane cheppavu kaani matalo hethu badhatha lopinchindhi petrol matala ku manamu ela karanam avuthamandi prapancha market lo vachinna marupulu dhanni aaa konam lo chudali kani mee samethala konalo kani mee chinnapudu erparu chukunna abipryalatho … kadu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: