‘ఆన్నీ’: లఘుచిత్ర కథ

కథలని, నవలల్ని సినిమాలుగా మార్చటం సాధారణం. ఆ క్రమంలో ఆ కథ/నవల సినిమా స్క్రిప్టుగా తిరగరాయబడుతుంది. అయితే – అరుదుగానైనా, కొన్నిసార్లు సినిమాలని నవలలుగా వెలువరించే సంప్రదాయమూ ఉంది. తెలుగులో ముళ్లపూడి వారు అలా నవలీకరించిన సినిమాలు వేళ్లపై లెక్కపెట్టగలిగేన్ని ఉన్నాయి.

ఈ ఉపోద్ఘాతం దేనికంటే, నేను తీయబోతున్న తదుపరి లఘుచిత్రం స్క్రిప్టుని కథగా మార్చి ఈ మధ్యనే ప్రచురించాను. ఆ లఘుచిత్రం తయారై విడుదలవటానికి చాలా సమయముంది. ఈ లోగా దాని కథ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినవారికోసం – లంకె ఇక్కడ ఇస్తున్నాను. కథ పేరు ‘Annie’. ఆంగ్ల లఘుచిత్రం కనుక ఈ కథ కూడా ఆంగ్లంలోనే రాయబడింది. దీన్ని త్వరలోనే తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురిస్తాను.

పజిల్స్‌లా ఉంటూ పాఠకుల మెదళ్లకు పదును పెట్టే కథలు రాయటం నాకిష్టం. నా కథల్ని చదివిన వారు చివరికొచ్చేసరికి అందులోని చిక్కుముడి విప్పిన తృప్తిని ఆస్వాదించాలి. లేదా – కథ నిండా నేనొదిలిన క్లూస్ అర్ధం చేసుకోలేని వారు తల గోక్కుంటూ ఉండిపోవాలి. నా కథల ద్వారా నేను పాఠకులకి ఇవ్వబూనుకునేది అదే. ఈ ‘Annie’ కథ కూడా అంతే. ప్రతి పదాన్నీ జాగ్రత్తగా చదవండి.

https://anilsroyal.medium.com/annie-3607ba950536


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,982

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.