Posts Tagged 'డెవిల్స్ టవర్'

కలాపోసన – 7

ఈ మధ్య రాయటం మీదనుండి గీయటం మీదకి గాలి మళ్లింది. ఏళ్ల కిందట అవతల పడేసిన పెయింటింగ్ సరంజామా దుమ్ము దులిపే ఓపిక లేక, డిజిటల్ యుగానికి తగ్గట్టు ఐప్యాడ్ మీద బొమ్మలేయటం సాధన చేద్దామనుకుంటూ ఓ చిన్న ప్రయత్నం చేస్తే ఇదిగో, ఇలా వచ్చింది. వేళ్లతో రంగులద్ది బొమ్మలేసే ప్రక్రియని ఫింగర్ పెయింటింగ్ అంటారు. ఐప్యాడ్ వంటి టచ్‌స్క్రీన్ సాధనాల మీద వేసే బొమ్మల్నీ అలాగే వ్యవహరిస్తుంటారు (అన్నట్టు, మీరెప్పుడన్నా నఖ చిత్రాల గురించి విన్నారా? అలనాటి ఆంధ్రపత్రికల్లో విరివిగా కనిపిస్తాయవి). కానీ నేను వేసింది ఫింగర్ పెయింటింగ్ అనకూడదేమో – వేళ్లకి బదులుగా స్టైలస్ వాడాను కాబట్టి. పేరేదైనా, ప్రయత్నం మాత్రం బహు సరదాగా అనిపించింది. బొమ్మ కూడా బ్రహ్మాండంగా కాకపోయినా ఫర్లేదనిపించేలా వచ్చింది.

సంప్రదాయకంగా వేసే ఆయిల్ పెయింటింగ్స్‌తో ఈ సాంకేతిక ప్రక్రియని పోల్చకూడదేమో కానీ, కొన్ని విషయాల్లో మాత్రం ఈ విధానం చాలా సౌకర్యవంతంగా అనిపించింది. రంగులు కలుపుకునే అవసరం లేకపోవటం,  అవి ఆరిపోయేలోగా పెయింటింగ్ పూర్తి చేయాలనే వత్తిడి లేకపోవటం, ఒక్కో లేయర్‌కీ మధ్య రంగులు ఆరేదాకా నిరీక్షించే పనిలేకపోవటం, పదే పదే కుంచెలూ ఇతర సామగ్రీ కడుక్కునే బాధ తప్పటం, పొరపాట్లు చేసినా తేలిగ్గా దిద్దుకునే వెసులుబాటుండటం, వగైరా, వగైరా. వీటన్నిట్నీ మించి నన్ను ఆకట్టుకున్న విషయం మరోటుంది: నేను వాడిన ‘బ్రషెస్’ అనబడే సాఫ్ట్‌వేర్ మనం గీసిన ప్రతి గీతనీ వివరంగా గుర్తు పెట్టుకుని ఒకదాని వెంట ఒకటిగా – సినిమా లాగా – వాటన్నిట్నీ తిరిగి ప్రదర్శించటం.  కింద కనిపిస్తున్న రెండు నిమిషాల నిడివి క్విక్‌టైమ్ మూవీ ఆవిధంగా రూపొందించిందే. ఇంకెందుకాలస్యం? ప్లే బటన్ నొక్కండి, ఈ వర్ణచిత్రం ఎలా గీయబడిందో వివరంగా చూడండి.

(పాత కలాపోసనలు: మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.