Posts Tagged 'కథ'

కథాలయం

ఎనిమిదిన్నరేళ్ల కిందట ఈ తెలు-గోడు బ్లాగుతో ఆరంభమైన నా రచనా ప్రస్థానం బ్లాగు రాతల నుండి కథల్లోకి మళ్లి, ఇప్పుడు ‘కథాలయం‘ పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రారంభించేదాకా వచ్చింది. గత మాసం ‘సారంగ’ వెబ్ పత్రిక మూతపడిందన్న వార్త వెలువడింది. ‘సారంగ’లో ప్రచురితమైన నా కథలు, వ్యాసాలు మరెక్కడికైనా తరలించి భద్రపరచాలన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ కథాలయం. “ఎవరో నిర్వహించే వెబ్‌సైట్‌లో నా కథలుంచే బదులు, ఆ పనేదో నేనే స్వయంగా చేసుకుంటే పోతుందిగా” దగ్గర మొదలై, “నా కథలు, వ్యాసాలు మాత్రమే కాకుండా, ఇతరుల కథల్లో నాకు బాగా నచ్చినవీ – ఆయా రచయిత/త్రుల అనుమతితో – సేకరించి ఇందులో ఉంచితే?” దాకా వెళ్లిందా ఆలోచన.

ఆ తర్వాత ‘కథాలయం‘ రూపుదిద్దటం, ఆవిష్కరించటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇందులో ప్రస్తుతానికి నా కథలన్నీ (పది నేరువి, రెండు అనువాదాలు), ‘కథాయణం’ వ్యాసాలు, వాటికి తోడుగా ఇతర రచయితల నుండి అనుమతి తీసుకుని సేకరించిన మరో పన్నెండు కథలు ఉన్నాయి. నా వీలునిబట్టి మరిన్ని కథలు జోడిస్తూ పోతాను. కనిపించిన కథలన్నీ ఇక్కడుంచే ఆలోచన మాత్రం లేదు. ఈ ‘కథాలయం‘లో ఉంచబడే ప్రతి కథా కొన్ని ప్రమాణాలకి లోబడి ఉంటుంది. (అవి ఉన్నతంగా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదనుకుంటా). కథల ఎంపిక విషయంలో వాసికి మాత్రమే ప్రాముఖ్యత.

కథాలయం‘ వెబ్‌సైట్ చిరునామా: https://www.kathaalayam.com. మిగిలిన వివరాలు అక్కడే చదవండి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.