ఈ మధ్య కాలంలో నన్ను అమితంగా ఆకట్టుకున్న ఆంగ్ల కథ ‘The Egg’. దాని రచయిత పేరు Andy Weir. మూడేళ్ల కిందట ఇతను రాసిన ‘The Martian’ అనే సైన్స్ ఫిక్షన్ నవల ఈ ఏడాది అదే పేరుతో హాలీవుడ్ సినిమాగా వచ్చి కాసులు కొల్లగొట్టింది.
‘ది మార్షియన్’తో పేరు ప్రఖ్యాతులు సంపాదించక ముందు, అనామకంగా ఉన్న దశలో ఆండీ వెయిర్ రాసిన కాసిని కథల్లో ఒకటి ‘ది ఎగ్’. నాలుగేళ్ల కిందట అది చదివినప్పట్నుండీ దీన్నెవరైనా తెలుగులోకి అనువదిస్తే బాగుండుననుకునేవాడిని. అప్పటికే ఆ కథ సుమారు పాతిక భాషల్లోకి అనువదించబడి ఉంది.
నాలుగేళ్లు గడిచాయి. అనువాదం రాలేదు. ఇంకా ఎదురుచూసేబదులు ఆ పనేదో నేనే చేసేస్తే పోలా అనిపించింది. అనిపించటం ఆలస్యం, మూల రచయిత అనుమతి కోరటం, అతను సమ్మతించటం, అనువదించటం, దాన్ని ‘సారంగ’ పత్రికలో ప్రచురించటం – అంతా రెండే రోజుల్లో జరిగిపోయింది. అనువాదం పేరు ‘బ్రహ్మాండం‘. ‘కథన కుతూహలం’ పేరిట సారంగలో నేను మొదలు పెట్టిన శీర్షికలో తొట్టతొలిగా ఈ అనువాదం ప్రచురించబడింది. చదవండి.
http://magazine.saarangabooks.com/2015/12/03/సంభాషణల్లోంచి-కథనం/
మీ మాట