మూడున్నరేళ్ల తర్వాత నా బ్లాగులో రాస్తున్న మొదటి టపా!
కొవిడ్-19 పుణ్యాన ఈ వేసవి సెలవుల్లో బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునేబదులు – ఇంటిల్లిపాదీ కలిసి ఓ లఘు చిత్రం చేసేస్తే ఎలా ఉంటుంది?
ఆ ఆలోచనలోనుండి పుట్టాడు The Boogeyman. పది నిమిషాల నిడివున్న నిఖార్సైన zero budget చిత్రం. బడ్జెట్ హంగామా లేకపోయినంత మాత్రాన చిత్రంలో హంగులకి లోటుండక్కర్లేదని నిరూపించే సినిమా. ఆద్యంతం మిమ్మల్ని మునివేళ్ల మీద కూర్చోపెట్టి గుండెదడ తెప్పించకపోతే అడగండి. (సొంత డబ్బాలా ఉందా? చూశాక నాతో ఏకీభవించకపోతే – మళ్లీ సినిమా తీయను. ఇది నా పల్నాటి శపథం)
ఆలస్యమెందుకు. చూసేయండి. ఆనక మీ అభిప్రాయం కామెంట్లలో పడేయండి.
మీ మాట