కుంతీకుమారి

సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తుల్లో ఒకడైన రాబర్ట్ ఎ. హెయిన్‌లిన్ 1959లో రాసిన ‘All You Zombies‘ అనబడే అద్భుతమైన కథ, నాకు బాగా నచ్చిన సైన్స్ ఫిక్షన్ కథల్లో ఒకటి. ఒక రకంగా, నేను కథలు రాయాలనుకున్నప్పుడు సైన్స్ ఫిక్షన్ వైపు అడుగులేసేలా ప్రేరేపించింది ఈ కథే. చదువుతున్నంతసేపూ ఉత్కంఠకి గురి చేసి, చదవటం పూర్తయ్యాక అంతా అర్ధమైనట్లూ, ఏమీ అర్ధం కానట్లూ ఏక కాలంలో భ్రమింపజేయగల శక్తి ఈ కథ సొంతం. ఈ కథని అనువదించాలన్న కోరిక ఎప్పట్నుండో వెంటాడుతుండగా, ఇన్నాళ్లకి ఆ పని చేయటం కుదిరింది.

సాధారణంగా తన సాహిత్యాన్ని ఓ శిల్పంలా  ‘చెక్కే’ అలవాటున్న హెయిన్‌లిన్ ఈ కథని మాత్రం నాలుగే గంటల్లో ఒకే సిటింగ్‌లో రాసేయటం వల్ల, ఆయన శైలి చెక్కుడు ఇందులో కనబడదు. ఇది స్వేఛ్ఛానువాదం కాబట్టి, మక్కీకి మక్కీ అనువదించకుండా, హెయిన్‌లిన్ విడిచిపెట్టిన చెక్కుడు బాధ్యత నా నెత్తినేసుకున్నాను. మూలకథలో 90% అలాగే ఉంచి మిగతా పది శాతమూ నా శైలిలో కొన్ని మార్పులు చేశాను – అసలు కథ దెబ్బ తినకుండా జాగ్రత్తపడుతూనే. ఈ మార్పులన్నీ మూలకథలో ఉన్న ఉత్కంఠని పెంచుతాయని నా నమ్మకం. అలాగే, ఈ కథలోని స్థల కాలాలు తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చటం జరిగింది. ఆ విధంగా రూపుదిద్దుకుంది, నా తొలి అనువాద కథ – కుంతీకుమారి.

ఈ కథ ఈ రోజే అంతర్జాల పత్రిక కినిగె్‌లో విడుదలయింది. మీ బుర్రకి పదునుపెట్టే పజిల్ కావాలనుకుంటే చదివి చూడండి. చదివాక మీ తల తిరిగినా, మీరెవరో మీకే అర్ధం కాకుండా పోయినా, అందుకు నాది బాధ్యత కాదు.

కథ లంకె: http://patrika.kinige.com/?p=3936

4 స్పందనలు to “కుంతీకుమారి”


  1. 1 sri 3:13 సా. వద్ద జనవరి 20, 2015

    Interesting story and nice dubbing by you. We may see these concepts in future turning out to be real. I would have never read this story if not for this dubbing.

  2. 3 Bhaskar 12:39 సా. వద్ద జూన్ 11, 2015

    I love Heinlein. Thanks for the translation, I hope we get more stories in Telugu like this, you are doing a great job of writing sci-fi in telugu.

  3. 4 Bhaskar G 5:21 సా. వద్ద ఆగస్ట్ 8, 2015

    I am watching ‘Predestination’ on blu-ray, which is inspired by ‘All you zombies’, reminded me of your story, so I am back here adding my comment.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: