నేనొక్కడినే

ఓ మంచి పుస్తకం చదివినప్పుడూ, ఓ మంచి సినిమా చూసినప్పుడూ …. అది మరో పది మందితో పంచుకోవాలనిపిస్తుంది. వాళ్లనీ ఆ పని చెయ్యమని ప్రోత్సహించాలనిపిస్తుంది. తెలుగు సినిమాలు చూసినప్పుడు నాకలాంటి భావం అంత తరచుగా కలగదు.

ఈ రోజు కలిగింది.

‘మన సినిమాలు బాగు పడవు గురూ’. తెలుగు సినీ విమర్శకుల నోళ్లలో పాచిపోయిన పాటిది. ఇన్నాళ్లకి వాళ్ల కల నిజం చేసే సినిమా ఒకటొచ్చింది. తీరా చూస్తే దానికి వాళ్ల స్పందన: ‘అబ్బే, ఇది నాకే అర్ధమవలా. ఇంక మామూలు ప్రేక్షకుడికేం అర్ధమవుద్ది’. అచ్చు పత్రికల్లో, వెబ్ మ్యాగజైన్లలో, టీవీల్లో … అన్ని చోట్లా అదే మోత. “నేల విడిచి సాము”, “మనోళ్లకి ఇది ఎక్కదు”, వగైరా, వగైరా.

మొత్తానికి అంతా కలిసి ఈ సినిమా ఎవరికీ అర్ధం కాదని తేల్చేసి చప్పరించేశారు.

అంతగా అర్ధం కానిదేం ఉందో అర్ధం చేసుకుందామని ఈ రోజు పనిగట్టుకుని మరీ వెళ్లి ఆ సినిమా చూశాను. చూశాక, డంగైపోయాను. తేరుకున్నాక, చప్పట్లు చరిచాను – తక్కిన ప్రేక్షకులు నన్ను అదోలా చూసినా పట్టించుకోకుండా.

ఈ సినిమాలో ….

– కథానాయకుడి కరుణా కటాక్షాల కోసం దేబిరిస్తూ అతని మీదకి ఎగబడిపోయే నాయిక లేదు. ఆమెని ఎంత కించపరిస్తే అంత మగతనం అనుకునే హీరో లేడు.
– నాయకుడి పక్కనో నలుగురు సైడ్ కిక్కుల్లేరు. వాళ్ల బఫూనరీ లేదు. కథకి సంబంధం లేని కామెడీ ట్రాక్ లేదు. నలుగురినీ నవ్వించటానికి పదుగురితో తన్నులు తినే జఫ్ఫాలూ, వాళ్లు పడే తిప్పలూ లేవు.
– విశ్రాంతి సమయానికి ముందో వీర భీకర బిగ్ బ్యాంగ్ లేదు. ఆ తర్వాత హీరో అసలు రూపం గుట్టు విప్పటం అసలే లేదు.
– చీజీ గ్రాఫిక్స్ లేవు. పాత్రోచితంతో పనిలేకుండా ప్రతి పదంలోనూ ప్రాస కోసం ప్రయాస పడే పాత్రల్లేవు. పంచ్ డైలాగుల్లేవు.
– వంశ చరిత్రలు తవ్విపోసుకుని ఉద్రేకపడిపోయే కథానాయకుల్లేరు. తండ్రుల, తాతల పేర్లు తలచుకుని తబ్బిబ్బైపోవటం లేదు. తొడలు కొట్టటాల్లేవు. భుజాలు చరుచుకోవటాల్లేవు.

అలాగని – విమర్శనాగ్రేసరులు వాపోయినట్లు – అర్ధం కాకుండా బుర్రలు తినేంత గజిబిజి కథనమూ లేదు. ఈ మాత్రం కథన శైలికే కళ్లు తేలేసే ప్రబుద్ధులు విమర్శకావతారాలెత్తి ప్రేక్షకుల నాడి ప్రభావితం చెయ్యటం తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం.

ఈ సినిమాలో ఉన్నదల్లా – నిఖార్సైన నిజాయితీతో ఓ దర్శకుడు చేసిన ప్రయత్నం; అతని మీద నమ్మకంతో కోట్లు కుమ్మరించే దమ్మున్న నిర్మాతలు; వాళ్ల నిబద్ధతకి మెచ్చి ‘నా ఫ్యాన్స్ కోసం ఫలానా ఫలానా లెక్కలుండాల్సించే’ అని బెట్టు చెయ్యకుండా పనిచేసుకు పోయిన ప్రధాన నటుడు; ఇన్నాళ్లూ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కళ్లు విప్పార్చుకు చూసిన విజువల్స్; అద్భుతమైన నేపధ్య సంగీతం; చిన్న కథకి ఈ హంగులన్నిట్నీ అవసరమ్మేరా వాడుకుంటూ రెండున్నర గంటలు కట్టిపడేసే చిక్కటి చక్కటి కథనం. (చిన్నా చితకా పొరపాట్లూ ఉన్నాయి. మహా మహా ‘టైటానిక్’లోనే ఉన్నాయవి. ఇక్కడెంత? అవన్నీ క్షమించగలిగేవే) వెరసి, తెలుగు తెరపై ఓ నవశకానికి నాంది పలికే సినిమా.

ఇంతకంటే చెప్పాల్సిందేం లేదు. పత్రికల్లో చదివినవి, టీవీల్లో చూసినవీ నమ్మటం మానేసి, వెళ్లి చూడండి … శ్రద్ధగా చూడండి …. ‘నేనొక్కడినే’.

8 స్పందనలు to “నేనొక్కడినే”


  1. 1 kantharao 3:22 ఉద. వద్ద జనవరి 18, 2014

    cinima super ga undee maheash acting super story super anduke mahesh superstar ayyadu

  2. 3 Ganesh 8:10 ఉద. వద్ద జనవరి 18, 2014

    మొదటి పేరా చదివిన తరువాత ఆగి, బుక్ మై షొలొ టికెట్ బుక్ చేసుకొచ్చి టపా చదవడం పూర్తిచేసాను.

  3. 4 వేణూశ్రీకాంత్. 2:04 సా. వద్ద జనవరి 18, 2014

    చాలా బాగా చెప్పారండీ.. ఒకసారి డైరెక్టర్స్ వ్యూ ఇక్కడ చూడండి.. http://www.idlebrain.com/movie/postmortem/1nenokkadine.html

  4. 5 gorusu jagadeeshwar reddy 7:13 ఉద. వద్ద జనవరి 20, 2014

    meeru monna cheppake eeroju JNTU daggara Arjun lo cinima chusaa. aa patraki maro Telugu Hero laedanedi yadaartham. meeru raasina ee abiprayam tHo 100 % aekeebhavistunnaa. – Gorusu

  5. 6 Vasu 2:58 సా. వద్ద జనవరి 21, 2014

    —చూశాక, డంగైపోయాను. తేరుకున్నాక, చప్పట్లు చరిచాను —

    Same feeling.

    నేను వెంటనే నాలా సినిమా పిచ్చి ఉన్న మిత్రులకి ఫోన్ చేసి ఈమెయిలు చేసి .. వెంటనే వెళ్లి చూడమని అని చెప్పాను. ఇంచు మించు ప్రతీ రోజు ఈ రోజు గురించి నాలా పిచ్చ పిచ్చగా నచ్చిన వాళ్లతో ఎక్కడ పడితే అక్కడ చర్చించు కోవడమే.

    నాకెంత నచ్చిందంటే $18 పెట్టి రెండు సార్లు చూసేంత.

    — అలాగని – విమర్శనాగ్రేసరులు వాపోయినట్లు – అర్ధం కాకుండా బుర్రలు తినేంత గజిబిజి కథనమూ లేదు. ఈ మాత్రం కథన శైలికే కళ్లు తేలేసే ప్రబుద్ధులు విమర్శకావతారాలెత్తి ప్రేక్షకుల నాడి ప్రభావితం చెయ్యటం తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం. —

    నిఝం. ఇప్పటికీ ఇంకా అదే వరస (చెత్త సినిమా అని ప్రచారం) ఎక్కడ చూసినా. ఎవరికో అర్థం కాదని వీళ్ళే నిర్ణయించేస్తారు

    I loved this line – “చిన్నా చితకా పొరపాట్లూ ఉన్నాయి. మహా మహా ‘టైటానిక్’లోనే ఉన్నాయవి. ఇక్కడెంత? అవన్నీ క్షమించగలిగేవే”

    అడ్డమైన సినిమాలకీ కల్లెక్షన్లకి ఎనభై ఏళ్ళ సినిమా చరిత్రలో అని మొదలెడతారు.
    అసల నిజాయితీగా ఈ సినిమాకి వాడాల్సిన ప్రిఫిక్స్ అది. ఇలాటి గొప్ప సినిమా ఈ genre లో రాలేదు. కల్లెక్షన్స్ చూస్తె ఇక పై ధైర్యం చేస్తారనుకోను (బిగ్ బడ్జెట్ లో )

    Someone said 1 is a great film in a wrong industry. May be true.

  6. 7 Sri 8:44 సా. వద్ద జనవరి 21, 2014

    Wish the director had distanced from the usual song and dance sequences so typical of desi movies.. would have been much more suave and engaging..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: