ప్రళయం

ఈ ఏడాది నన్ను కథల పురుగు తొలిచినట్లుంది. కరువు తర్వాత వరద. నా తాజా కథ ‘ప్రళయం‘, ఈ వారం సారంగలో ప్రచురితం. ఇది నా ఏడో కథ; ఈ ఏడాదిలో నాలుగో కథ. ఇలస్ట్రేషన్ కూడా నేనే గీసుకున్న తొలి కథ.

ఈ కథకి  నేను రాసుకున్న తొలి ప్రతి ముప్పయ్యారొందల పదాల పైచిలుకుంది. మూడ్నాలుగు సార్లు తిరగరాసి, అనవసరం అనుకున్న భాగాలు తీసేశాక మిగిలింది రమారమి మూడువేల పదాలు. తొలగించిన భాగాలు ఊరకే పారేయకుండా, ఈ కథకి కొనసాగింపు రాస్తే దానిలో వాడుకునే ఆలోచనుంది. సీక్వెల్ వస్తే గిస్తే వచ్చినప్పుడు చూడొచ్చు; ప్రస్తుతానికి ‘ప్రళయం’ సంగతేంటో చూడాలనుకునేవారికి లంకె ఇక్కడ లభిస్తుంది.

10 స్పందనలు to “ప్రళయం”


  1. 1 Sravya V 11:17 సా. వద్ద జూలై 25, 2013

    బావునండి కథ ! పార్ట్ 5 చదవి ఇదేంటి మాములుగా ఎండ్ చేస్తారా అనుకున్నా ! తరవాత ట్విస్ట్ బావుందండి !

    పదాల లెక్కలు హ హ మీరు మాథ్స్ లో P.hd నా తెలుస్తుందండి 🙂

  2. 2 ఫణీన్ద్ర పురాణపణ్డ 11:32 ఉద. వద్ద జూలై 26, 2013

    ఎందుకో ఓ 2-3 వారాలుగా మనస్సులో రికరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించిన ఆలోచనలు అస్పష్టంగా రికర్ అవుతూన్నాయి. నేను చదువుతున బ్లాగ్స్‌లోనూ అలాంటి రికరెన్స్‌లే కనిపిస్తున్నాయి, యాదృచ్చికమో కాకతాళీయమో మరి. అందులోనూ బ్యూటీ ఉంది లెండి. (నేను శైలి గురించి మాట్లాడడం లేదు.)

    మీ రీబూట్ కథ ఇంతకు ముందు చదివాను. ఓ అరగంట క్రితం ప్రళయం, శిక్ష, రహస్యం వరసగా చదివాను. ఒకానొక ఖేయాస్ రికర్ అవుతున్నట్టుగా అనిపించింది.

    సై-ఫై అంటే… రచయిత ఊహిస్తున్న అంశం భవిష్యత్తులో విజ్ఞానశాస్త్రంలో సాధ్యం అవడానికి కనీసం ఓ 20% ఐనా అవకాశం ఉండాలేమో కదా? అంతే తప్ప సైంటిఫిక్ ఫాక్ట్స్ ఆధారంగా అల్లుకునే ఆచరణసాధ్యం కాని కల్పనలు కాదేమో..

    రహస్యంలో భవిష్యదర్శనం సంగతి అలా ఉంచండి.. మైండ్ రీడింగ్ నైనా కనిపెట్టగల అవకాశాలు లేవనుకంటా.

    అలాగే రీబూట్‌లోనూ… స్పేస్ అండ్ టైం ట్రావెల్ కనీసం వచ్చే 500 యేళ్ళల్లోనైనా సాధ్యమయ్యే పనేనా? నాకు అర్ధమైనంత వరకూ అదో అందమైన, ఎప్పటికీ సాధ్యం కాని ఊహ.

    ఫోర్త్ డైమెన్షన్‌లో ప్రయాణం థియొరిటికల్‌గా సాధ్యమే అయినా ప్రాక్టికల్‌గా ఎప్పటికీ సాధ్యం కాని కలేనేమో. అలాంటిది… భూత వర్తమాన భవిష్య కాలాలను పేక దొంతి కలిపినట్టు కలిపేసుకుంటూ వెళ్ళిపోతుండడం… ఇంపాజిబుల్ కాదూ. ఎన్నివేల యేళ్ళ తరవాతయినా సరే….

    ప్రళయంలో అన్నింటినీ కలిపేసి ఆడేసుకున్నారుగా… అందులో మీ బయోట్స్ కానీ హై ఫై శాస్త్రవేత్తలు కానీ ఏదైనా చేయడానికి ఏ అవకాశమూ లేదు.

    కానీ ఆ మూడింటిలోనూ ఒకే థ్రెడ్ మీద కథ నిర్మించినట్టున్నారు.. వినాశకర ఆలోచనలు.. వాటి నుంచి బయటపడి ప్రిమిటివ్ స్టేజ్ నుంచి ఏర్పడగల ఓ మెరుగైన (టీవీ9 తరహా కాదండోయ్ :)) సమాజం కోసం ప్రయత్నాలూ…. అద్భుతమైన సోషల్ ఫిక్షన్.

    కొన్నాళ్ళ క్రితం సెర్న్‌లో దైవకణం సృష్టించారన్న వార్తలు వచ్చినప్పుడు… ఐన్‌స్టీన్ థియరీ తప్పు అయిపోయిందహో అంటూ వార్తలు వండేశారు తెలుగు చానెళ్ళ వాళ్ళు. నేను పని చేసిన చానల్‌లోనూ అలాంటి కథనమే రాసేశారు. ఆగండ్రా బాబూ అని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఒకట్రెండు హైలీ ఇన్‌స్టేబుల్ పార్టికల్స్ కాంతి వేగాన్ని అధిగమించాయి అన్న వార్త రాగానే… టైం మెషిన్ రెడీ అయిపోయింది… ఇంక మనం కాలంలో ముందుకూ వెనక్కూ ఉయ్యాలలూగడమే తరువాయి అన్న రేంజ్‌లో వార్తా కథనాలు వండేశారు.

    చిత్రమేమంటే ఆ ప్రయోగాన్ని లీడ్ చేసిన హెడ్ సైంటిస్ట్ మాత్రం చాలా అసహనం ఫీల్ అయాడు. తమ ప్రయోగమే తప్పేమో అని మళ్ళి ఇంకోసారి ఎక్స్‌పెరిమెంట్ రిపీట్ చేయించాడు. హిగ్స్ బోసాన్‌ని మొత్తం మీద సాధించినట్టున్నారు… అది వేరే కథ.

    ఈ గోలంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రాక్టికల్‌గా సాధ్యం కాని థియరీలు వెయ్యి ఉండవచ్చు గాక… వాటి ఆధారంగా రాసుకునే కథలని సై-ఫై సాహిత్యం అనవచ్చా? దాని బదులు సైన్స్ బేస్డ్ ఫిక్షన్ అనుకోవచ్చేమో.

    please don’t think am criticizing your works. I loved every bit of them. మంచి తెలివైన, చిక్కని కథా కథన శైలి మీది. ఇలాంటి ఇతివృత్తాలు హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం పెద్ద విశేషం కాదు. కానీ మీ యూనిక్‌నెస్ మీదే.

    • 3 అబ్రకదబ్ర 1:58 సా. వద్ద జూలై 26, 2013

      >> “please don’t think am criticizing your works”

      Not at all. Your comments are sensible. Constructive criticism is always welcome.

      However, I have a few things to say. I think it was Arthur Clarke, who said: “Fantasy is something we know isn’t real but wish it was real; where as sci-fi is something we know that could become reality but wish that day never comes”

      నా ‘science-based’ కథల్లో విషయాలు నిజమవుతాయా, లేదా అనేది పక్కనబెడితే; అవి నిజమైతే పరిణామాలు ఎలా ఉంటాయనేది వాటిలో ప్రధాన చర్చ. ఉదాహరణకి, టైమ్ ట్రావెల్ అనేది నిజంగా సాధ్యపడుతుందనేది నేన్నమ్మను. (Stephen Hawking doesn’t believe it; and I believe in him). ఒకవేళ అది సాధ్యపడితే ఎన్ని రకాల తిరకాసులు, paradoxes ఎదురయ్యే అవకాశాలున్నాయో చర్చించటం నా టైంట్రావెల్ త్రయం కథల ప్రధానోద్దేశం. రహస్యం లాంటి కథల పరమార్ధమూ అదే. ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందా అనేది మీ సందేహం. సమాధానం నాకు తెలీదు. నిజం కాకూడదనేదే నా కోరిక. (Even if that means branding my stories as non-science-fiction 🙂 )

  3. 4 Rajasekhar 5:38 ఉద. వద్ద జూలై 27, 2013

    Part5 gurunchi naku naku confusion undhi. Tirunalha, bakthajanam and pujari ivanni unnai kada part5 lo. Idi kalaa?, bramaa?

  4. 5 Mamtha 10:46 ఉద. వద్ద జూలై 27, 2013

    మీ కథలు నాకు చాలా బాగా నచ్చేసాయండీ…వాటిలో మునిగి పోయాను, ఇప్పుడు తర్వాత కథ కోసం చాలా ఎదురు చూస్తున్నాను…

  5. 6 Sanjeev 2:16 సా. వద్ద సెప్టెంబర్ 1, 2013

    మీ కథలు అన్ని చాలా బాగున్నాయి. తెలుగు కథల లో మీ కథలు ప్రత్యేకం. తర్వాత కథ కోసం ఎదురు చూస్తున్నాను, చాలా థాంక్స్. ప్రళయం కథ లో నాకు ఒక సందేహం వచ్చింది, అంతా సర్వనాసనం అయినప్పుడు కథ లో ఉన్న ఈ దొంగకు, గుడికి ఎందుకు ఏమి కాలేదు, బయట ఇంత జరుగుతున్నా గుడిలో ఉన్న అతనికి ఎందుకు తెలియలేదు?

  6. 9 బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ 11:58 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2013

    కథ చాలా బావుందండి. కాస్త ఆలశ్యంగా చదివాను. మీరు చిత్రకారులు కూడానా.అద్భుతహ

  7. 10 sri 5:05 సా. వద్ద సెప్టెంబర్ 12, 2013

    Good story. I re-read this story after some time when I found some leisure time.

    Interesting thing is that, what if this fiction is possible? May be there are those(both modern scientists & spiritually enlightened scientists) who are already playing with these concepts, which we perceive them only as fiction.

    Based on recent very advanced modern scientific developments, I can find that controlling other peoples minds is going to be a reality, probably in the next 15 or 20 years.

    Who knows. Once, electricity is a remote thought. Going to space is a remote thought. Killings millions in seconds is a remote thought. Now, they are reality. What may seem as remote thought(Fiction) will become reality for sure in future. Every thought(arising in the mind) has the potential to become reality(of course, lot of other things go into making this happen).

    Mother nature(vishala vishwam/vishwalu) has so many unravaled things kept in its stomach. Modern scientists are going after mother nature on a daily basis to reveal these secrets.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: