సైన్స్ ఫిక్షన్ కథల మధ్యలో చిన్న విరామం తీసుకుని ఆటవిడుపుగా నేను రాసిన కథ ‘శిక్ష’. నిన్న ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితమయింది. ఆ కథ పీడీఎఫ్ ఇక్కడ లభిస్తుంది.
ఇది ‘రీబూట్‘ తర్వాత రాసిన కథ. జూన్ నెలలో అయితే సమయోచితంగా ఉంటుందని ఇప్పటివరకూ ప్రచురించకుండా ఆపటం జరిగింది. అందువల్లే దీని తర్వాత రాసిన ‘రహస్యం‘ దీనికన్నా ముందే అచ్చైపోయింది.
నా కథలన్నిట్లోనూ అతి తక్కువ నిడివున్నది ఇదే. కానీ దాన్ని కూడా ప్రచురణకి అనువుగా కొంత తగ్గించాల్సొచ్చింది. అలాగే ప్రచురణకర్తలకుండే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కథలో ఒకట్రెండు చోట్ల మార్పులు చేయాల్సొచ్చింది. ఇలాంటివి సాధారణమే, కానీ నేను రాసింది రాసినట్లు వెలుగు చూడలేదన్న అసంతృప్తి లోలోపలెక్కడో. ఆసక్తి కలవారికి, ఈ కథ పూర్తి ప్రతి ఇక్కడ లభిస్తుంది.
అభినందనలు. రహస్యం కథను ఇదివరకే చదివాను.కొత్తగా అనిపించింది.మీరే వ్రాశారని ఇప్పుడు తెలిసింది.
Absolutely Brilliant narration. The twist at the end was quite a suprise and I did not even have a clue. You are a great writer.
good one 🙂
jamesbond movies laa unde mee kathalanu chadivi, pandanti kaapuram laanti katha vraasaaraa anipinchindi. mamulugaa crisp, speed & straight narration unde mee kathananiki poorti virudhdhamgaa undi. idi “meeru vraasina katha” kaabatti, chivarivarakoo opigga chadivaanu. ledante, modati page sagam lone vodilesevadini. but, katha chivarlo unna twist chadivaaka, ee type narration enduku enchukunnaaro artham ayyindi.
బావుందండి ! చివరి ట్విస్ట్ మాత్రం ఊహించలేదు 🙂
చాలా రైట్ టైమింగ్! ఇది ప్రచురించడానికి జూన్ దాక ఎందుకు ఆగారో బాగా అర్ధం అయింది. గత శనివారం నాకు ఖచ్చితంగా ఇలాంటి వాతావరణమే తారసపడింది. [spoilers removed]
ట్విస్ట్ కెవ్వ్ :))
ఎప్పట్లాగే అద్భుతంగా వ్రాసారు.. కథ చెప్పటం లో మీకు మీరే సాటి.. [spoilers removed]
చాలా బావుందండీ . . .