మే, 2013ను భద్రపఱచురహస్యం

కరువు తర్వాత వరద. రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కథలు రాసే మూడ్ రావటం, వరసగా మూడు రాసెయ్యటం జరిగిపోయాయి. వాటిలో మొదటి కథ ‘రీబూట్‘ మార్చ్ నెలాఖర్లో ముద్రితమవగా, మూడో కథ ‘రహస్యంఈనాడు ఆదివారం అనుబంధంలో (మే 5, 2013) ప్రచురితమయింది. ఆసక్తిగలవారు ఆ కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి.

మొదటిదీ, మూడోదీ వచ్చేశాయి. మరి రెండో కథేమయింది? అది జూలై మాసంలో విడుదలవనుంది. ఆ నెల్లోనే ఎందుకనేదానికో కారణముంది. అది అచ్చయ్యేదాకా రహస్యం. ప్రస్తుతానికి ఈ ‘రహస్యం‘ ఏంటో తెలుసుకోండి. చదివాక ఏవైనా సందేహాలుంటే ఇక్కడే అడిగేయొచ్చు. వాటికి సమాధానాలు నేను ఇక్కడైనా ఇవ్వొచ్చు, లేదా కథాయణంలోనైనా రాయొచ్చు.

అచ్చేసే సమయంలో నిడివి సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కథకి అక్కడక్కడా కత్తెరలు వేయాల్సొచ్చింది. వాటి మూలంగా మూలకథకి లోటేమీ రాకపోయినా, రచయితగా నాకెక్కడో వెలితి. పాఠకులకి ఆ తేడా తెలీకపోవచ్చు కానీ, కథలో ఓ చోటొచ్చిన కనబడీ కనబడని కంటిన్యుటీ సమస్య నా దృష్టిని మాత్రం తప్పించుకోలేకపోయింది. అదేంటో కనిపెట్టండి చూద్దాం (పెద్ద కష్టమేం కాదు). పోల్చి చూడటానికి కావాలంటే కథ అసలు ప్రతి ఇక్కడ లభిస్తుంది. కథల్ని ఎలా ఎడిట్ చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారిక్కూడా ఇది ఉపయోగపడుతుంది.

పంపిన రెండువారాల్లోపే ఈ కథ ప్రచురించిన ఈనాడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 300,712

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.