రహస్యం

కరువు తర్వాత వరద. రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కథలు రాసే మూడ్ రావటం, వరసగా మూడు రాసెయ్యటం జరిగిపోయాయి. వాటిలో మొదటి కథ ‘రీబూట్‘ మార్చ్ నెలాఖర్లో ముద్రితమవగా, మూడో కథ ‘రహస్యంఈనాడు ఆదివారం అనుబంధంలో (మే 5, 2013) ప్రచురితమయింది. ఆసక్తిగలవారు ఆ కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి.

మొదటిదీ, మూడోదీ వచ్చేశాయి. మరి రెండో కథేమయింది? అది జూలై మాసంలో విడుదలవనుంది. ఆ నెల్లోనే ఎందుకనేదానికో కారణముంది. అది అచ్చయ్యేదాకా రహస్యం. ప్రస్తుతానికి ఈ ‘రహస్యం‘ ఏంటో తెలుసుకోండి. చదివాక ఏవైనా సందేహాలుంటే ఇక్కడే అడిగేయొచ్చు. వాటికి సమాధానాలు నేను ఇక్కడైనా ఇవ్వొచ్చు, లేదా కథాయణంలోనైనా రాయొచ్చు.

అచ్చేసే సమయంలో నిడివి సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కథకి అక్కడక్కడా కత్తెరలు వేయాల్సొచ్చింది. వాటి మూలంగా మూలకథకి లోటేమీ రాకపోయినా, రచయితగా నాకెక్కడో వెలితి. పాఠకులకి ఆ తేడా తెలీకపోవచ్చు కానీ, కథలో ఓ చోటొచ్చిన కనబడీ కనబడని కంటిన్యుటీ సమస్య నా దృష్టిని మాత్రం తప్పించుకోలేకపోయింది. అదేంటో కనిపెట్టండి చూద్దాం (పెద్ద కష్టమేం కాదు). పోల్చి చూడటానికి కావాలంటే కథ అసలు ప్రతి ఇక్కడ లభిస్తుంది. కథల్ని ఎలా ఎడిట్ చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారిక్కూడా ఇది ఉపయోగపడుతుంది.

పంపిన రెండువారాల్లోపే ఈ కథ ప్రచురించిన ఈనాడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు.

4 స్పందనలు to “రహస్యం”


 1. 1 జలతారువెన్నెల 8:38 సా. వద్ద మే 8, 2013

  చాలా బాగుందండి. ముఖ్యంగా చివరలో ఈ కథ లో [spoiler-edited] కారణం convincing గా కూడా ఉంది.

 2. 2 hari.S.babu 4:02 ఉద. వద్ద మే 9, 2013

  rరెండు కధల్నీ విడివిడిగా చదివి పోల్చి చూడటం కష్టంగా ఉంది.మీరు చెప్పిన కంటిన్యుటీ సమస్య తెలియ రాలేదు.కధ మాత్రం చాలా బాగుంది.

 3. 3 Vamsi Nutalapati 1:22 సా. వద్ద మే 13, 2013

  I guess it is how/when the agent got a tie to his hands.

  • 4 అబ్రకదబ్ర 11:08 సా. వద్ద మే 18, 2013

   Nope. Professor was seated next to the agent when they were sipping coffee. After a few moments, he tossed an apple at the agent from the fruit-bowl which is across the room on his desk. When did he get there?

   The part where professor gets up and walks to his desk was edited out along with a few other lines. There was also a line explaining why the agent didn’t try to convince the professor to keep it a secret, before doing what he did. It was removed as well.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: