ఏప్రిల్, 2013ను భద్రపఱచురీబూట్ (పార్ట్ – 2)

‘రీబూట్’ కథ మిగతా భాగం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో విడుదలయింది. పూర్తి కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి. ఈ కథకి వేయబడ్డ ఇలస్ట్రేషన్స్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. అవేమిటో కనిపెట్టినవారికి వెయ్యి ఉత్తుత్తి వరహాలు.

కాలయానం అనేది ఊహ తెలిసినప్పట్నుండీ నాకు ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా అనిపించేది. దాని సాధ్యాసాధ్యాల సంగతటుంచితే, కాల్పనిక సాహిత్యానికి అదో అద్భుతమైన సబ్జెక్ట్. అందుకే, నేను కాల్పనిక సాహిత్యం రాయాలని నిర్ణయించుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండా ఆ నేపధ్యాన్నెంచుకుని ‘నాగరికథ’ రాశాను. ఆ తర్వాత ‘కల్కి’ కూడా అనుకోకుండా అదే నేపధ్యంలో రాశాక, అదే నేపధ్యంతో ముచ్చటగా మూడో కథ కూడా రాసి నా టైమ్‌ట్రావెల్ త్రయం పూర్తి చేయాలన్న ఆలోచనొచ్చింది. అది రెండున్నరేళ్ల కిందటి సంగతి. ఆలోచనైతే వచ్చింది కానీ, అసలు కథలు రాయటమ్మీద ఆసక్తి కూడా అప్పుడే పోయింది. దాంతో ఇన్నాళ్ల విరామం. మళ్లీ ఇప్పుడు రాయాలనే కోరిక పుట్టటం, వెంటనే ఈ ‘రీబూట్’ రాసేయటం .. ఇది ఇప్పటి కథ.  ఈ కథ వెనకున్న కమామిషు కొద్ది కాలం తర్వాత, మరో టపాలో.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 300,711

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.