కల్కి రాసిన రెండున్నరేళ్లకి మళ్లీ కథ రాసే మూడొచ్చింది. అంటే కొత్త కథకో కొంగొత్త ఐడియా వచ్చిందన్నమాట. ఎప్పటిమాదిరిగా ఇదీ సైన్స్ ఫిక్షనే. ఎప్పటిమాదిరిగా ఇందులోనూ నా తరహా సస్పెన్స్ మరియు ట్విస్టులుంటాయి. ఎప్పటిమారిగా కాకుండా ఇప్పుడు మాత్రం కథ చెప్పే పద్ధతి మారింది – ఇప్పటిదాకా నేను రాసిన కథలన్నీ ఉత్తమ పురుషంలో నడిస్తే, ఇది థర్డ్ పర్సన్లో నడుస్తుంది.
కథలు రాసేటప్పుడు నిడివి గురించి నిబంధనలు పెట్టుకోకపోవటం నా అలవాటు. కల్కి కానీ, ఈ ‘రీబూట్’ కానీ అలా రాసినవే. అచ్చులో వేయాల్సొచ్చేసరికి అలాంటి కథలకి సమస్యలొస్తాయి. కానీ కథలో సరుకుంటే అచ్చులో రావటానికి అదో అడ్డంకే కాదని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆంధ్రజ్యోతి వారు ఈ రీబూట్ కథని రెండు భాగాలుగా ప్రచురించాలని నిర్ణయించారు. అందుకు వారికి ధన్యవాదాలు. రీబూట్ మొదటిభాగం ఈ రోజు విడుదలయింది. రెండో భాగం వచ్చే ఆదివారం వస్తుంది. ఆసక్తి కలవారికోసం, ఈ కథ మొదటి భాగం పీడీఎఫ్ ఇక్కడ.
As usual Brilliant narration !
చాలా చాలా బావుందండి ! ఇదంతా చనిపోయే ముందు అరగంట లో జరిగిందా ? రెండో పార్ట్ కోసం eager గా వెయిటింగ్ !
నాకు కొంచెం డౌట్ గా అనిపించింది, అంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా ఇద్దరు మనుషులు ఉన్న దగ్గర ఒక్కరికే సమాచారం అందించాలి అంటే, ఇంకొకరు అక్కడే ఉన్నా చేయలేమా అని 🙂
Do you mind, if I share this link on my plus?
>> “Do you mind, if I share this link on my plus?”
Not at all.
Brilliant!! Enjoyed reading this story.
Waiting eagerly for next part.
పొద్దున్న పేపర్లో చదివినప్పుడు అనుకున్నాను… ఇది మీ కథే అని. వెయిటింగ్ ఫర్ సెకెండ్ పార్ట్. సైన్స్ ఫిక్షనే అంటారు… 🙂
nice…
Tarun
http://techwaves4u.blogspot.in
(తెలుగు లో టెక్నికల్ బ్లాగు)
చాలా బాగా రాశారు! మంచి ఉత్కంఠగా ఉండగా ఆపేశారు కూడా. మీరన్నట్టుగా తెలుగులో sci-fi కథలు చాలా తక్కువే.
మీ కథ చదువుతుంటే Asimov’s stories, Michael Crichton’s Andromeda Strain మరియూ మైనంపాటి భాస్కర్ గారి బుద్ధిజీవి గుర్తుకు వచ్చాయి.
మరిన్ని కథలు రాస్తారని ఆశిస్తూ…