అత్యాచారం

మూడు రోజుల వ్యవధిలో ఇటు అమెరికాని, అటు ఇండియాని కుదిపేసిన రెండు సంఘటనలు. పసిపిల్లలతో సహా ఇరవయ్యేడు మంది ప్రాణాలు తీసిన ఉన్మాదం ఒకచోట, ఇరవై మూడేళ్ల మెడికోపై అత్యాచారం చేసి రహదారిపై విసిరేసిన ఘాతుకం మరోచోట. రెండూ దారుణాలన్నవి నిజం. వాటికి ప్రజల ప్రతిస్పందన మాత్రం కడు భిన్నం. జబ్బుకి చికిత్స కనుక్కోవాలనే సంకల్పం ప్రపంచపు పురాతన ప్రజాస్వామ్యంలో; జబ్బుని గాలికొదిలి దాని లక్షణాలకి తక్షణ ఉపశమనం కనిపెట్టే ప్రయత్నం ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యంలో!

కనెక్టికట్ షూటౌట్ నేపధ్యంలో – తుపాకీ సంస్కృతిపై కొరడా ఝళిపించేలా పటిష్ట చట్టాలు తీసుకొచ్చే దిశలో ప్రభుత్వాలపై వత్తిడి అమెరికాలో పెరిగిపోగా;  న్యూఢిల్లీలో – గ్యాంగ్ రేప్ నిందితుల్ని  వెంటనే ఉరితీయాలనీ, చిత్రవధలు పెట్టి చంపాలనీ, బహిరంగంగా కొట్టిచంపాలనీ, ఇన్‌స్టంట్ జస్టిస్ అమలు చెయ్యాలనీ కోరుతూ  ‘ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం మరణించింది’ లాంటి తలాతోకాలేని బ్యానర్లు చేతబుచ్చుకుని రోడ్లెక్కిన యువజనం! సామాజిక సైట్లలో కాలక్షేపం కబుర్లతో వివాదాల్లో ఇరుక్కునే పిల్లకాయల సమస్య పరిష్కరించటానికి సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి దిగిరావలసొచ్చిందంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎలా వెలిగిపోతుందో అర్ధమైపోతుంది. హమారా భారత్‌లో నిత్యం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఘటనలు చాలానే జరుగుతుంటాయి కానీ ఢిల్లీలో జరిగిన ఒకానొక అత్యాచారాన్ని వాటిలో ఒకటిగా జమకట్టటం చూస్తే ఈ రోడ్లెక్కిన జనానికి అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలుసా అన్న అనుమానం నాక్కలిగింది. ఆటవిక న్యాయం అమలుచెయ్యమంటుందా ప్రజాస్వామ్యం? అలా చేస్తే నేరాలు అదుపులోకొచ్చేట్లైతే ఇప్పటికే అటువంటి చట్టాలున్న దేశాల్లో వాటి అవసరం ఇంకా ఎందుకు మిగిలుంది?

ఢిల్లీ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకి రాజకీయ దన్ను లేకపోవటం వల్లనో, డబ్బు చేసిన కుటుంబాలకి చెందకపోవటం వల్లనో, ఎటువంటి ఇతర పలుకుబడి లేకపోవటం వల్లనో .. మొత్తమ్మీద నిందితుల నేరం రుజువై వాళ్లకి శిక్షపడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంతమాత్రం దానికి వేలాది మంది రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యాల్సిన అవసరమేముంది? బాధితురాలికి సంఘీభావం తెలపటం కోసం అనుకుంటే – ఆ పనేదో శాంతియుతంగా చెయ్యొచ్చు కదా. పార్లమెంటు దగ్గరకీ, రాష్ట్రపతి భవన్లోకీ చొచ్చుకుపోవాల్సిన అవసరమేంటి? అక్కడ పహరా కాస్తున్న పోలీసుల్ని రెచ్చగొట్టి రాళ్లు రువ్వటం, ప్రతిగా రబ్బరు బుల్లెట్లు రువ్వించుకోటం. ఇవన్నీ ఎందుకు? అన్నట్టు, ఢిల్లీ నిరసనల్లో దిష్టిబొమ్మలు తగలేస్తున్న ఈ కింది ఉద్యమకారుల్ని చూడంది. వీళ్లలో ఎవరి ముఖంలోనైనా బాధ, ఆందోళన, సానుభూతి లాంటివి కనిపిస్తున్నాయా? నాకైతే అందర్లోనూ రేపు పత్రికల్లో ముఖం చూసుకోవచ్చన్న సంతోషమే కనిపిస్తుంది. ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అన్నాడు సినీకవి. ఈ నిరసనలూ అలాగే అనిపిస్తున్నాయి నాకు.

121226094038-india-rape-protests-story-top

(Courtesy: CNN.com. No copyright infringement intended)

ఈ కొట్టి చంపటాలూ, కాల్చి చంపటాలూ రోగానికి చికిత్స చెయ్యకుండా దానివల్ల ఏర్పడ్డ పుండ్లకి లేపనాలు పుయ్యటం లాంటివి. ఇలా ఆవేశపడటం వల్ల ఒరిగేది సున్న. వీధుల నిండా పబ్బులు, బార్లు; అక్రమ సంబంధాల కథలతో నిండిపోయిన జీడిపాకం సీరియళ్లు, ఆకతాయి పనులే హీరోయిజమనే సినిమాలు, అంగాంగ ప్రదర్శనలు చేసే హీరోయిన్లు; విచ్చలవిడి సెక్స్ మంచిదికాదని తెలియజెప్పేబదులు ఆ చేసేదేదో కండోములు వాడి చేసుకోండని ప్రకటనలు; ఫ్యాషన్ పేరుతో అమ్మాయిల అసభ్య వస్త్రధారణ, స్కూల్ రోజుల నుండే బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ బంధాల గురించి ఆరాటాలు; డ్రగ్స్; ఆడా మగా తేడాల్లేకుండా టీనేజ్ ప్రాయం నుండే ధూమపానాలు, మధుపానాలు; కోరుకున్నది అడ్డదార్లోనైనా దక్కించుకు తీరాలనే మనస్తత్వాలు ప్రబలేలా చేస్తున్న వినిమయ సంస్కృతి …. ఒకటా రెండా …. మనుషుల్లో మనో వికారాలు, ఉద్రేకాలు రేకెత్తించటానికి సవాలక్ష కారణాలు. వీటన్నిట్నీ మించి – ప్రజలకి వ్యవస్థ మీద సడలిన నమ్మకం, ఏం చేసినా చెల్లిపోతుందన్న భరోసా. ఢిల్లీలో అల్లర్లు చేస్తున్న వేలాదిమందిలో – ఇటువంటి సమాజం మాకొద్దు, దీన్ని మార్చే దిశలో ముందడుగేయమని ప్రభుత్వాన్ని అడిగిన గొంతు ఒక్కటైనా ఉందా? మధ్యలో ఉత్తి పుణ్యానికి ప్రభుత్వ ఆస్తుల్ని (అంటే మన ఆస్తుల్నే) కాపాడే విధిలో తన పని తాను చేస్తున్న పోలీసుని కొట్టి చంపారు. ఆ పని చేసిన వాళ్లని నడిరోడ్డు మీద నరికి చంపమని రేపు దేశమంతటా పోలీసుల కుటుంబాలు రోడ్డుకెక్కితే? అంతకన్నా ముందుకెళ్లి .. ఆయుధాలెటూ అందుబాట్లోనే ఉంటాయి కాబట్టి .. అవి తీసుకుని సంతోష్ తోమార్ మీద దాడి చేసినోళ్ల పని పడితే? మనం ఎక్కడి నుండి ఎక్కడికెళుతున్నాం? ఇటువంటి సందర్భాల్ని వ్యవస్థకి చికిత్స ప్రారంభించేందుకు గొప్ప అవకాశాలుగా మార్చుకునే బదులు ఆవేశాలకి లోనై ఇప్పటికే భ్రష్టు పట్టిన సమాజాన్ని ఇంకా నాశనం చేసే కోరికలు కోరటం అవివేకం. నా దృష్టిలో ఆ రేపిస్టులకి, ఈ పోలీసుని చంపిన వాళ్లకి తేడా లేదు. వాళ్లలాగే వీళ్లకి కూడా ప్రాణం విలువ తెలీదు. ఎదుటి మనిషి మీద గౌరవం లేదు. వాళ్లదైనా వీళ్లదైనా మందబలమిచ్చే ధైర్యమే. ఇటువంటివాళ్లు ఆ అమ్మాయికి న్యాయం చెయ్యమని రోడ్లెక్కటమంటే దెయ్యాలు వేదాలు వల్లించటమే.

18 స్పందనలు to “అత్యాచారం”


 1. 1 Bhimesh 7:56 సా. వద్ద డిసెంబర్ 26, 2012

  చాలా బాగుంది !! కాని, మనిషి ఆలోచన మాత్రం అందుకు విరుద్ధం, దెబ్బ తగిలితే తొందరగా ఉపసమనం పొందుటకు pain killers నే వాడడానికె ఇష్ట పడతాడు, దానికి side effects వస్తాయన్న వినడు. సమాజంలో ఆవేశ పౌరులు ఎక్కువైతే వాళ్ళు కోరికొనేది ఇలాంటి సత్వర శిక్ష. శాస్విత పరిష్కారం ఎవరికీ అక్కరలేదు. దెబ్బ కి దెబ్బ అన్నదే వాళ్ళ అభిమతం. ఈ డిబేట్ చూడండి.

 2. 2 ilam guru 11:47 సా. వద్ద డిసెంబర్ 26, 2012

  మనపేరు కనిపించాలని మన రాతలు చదవాలని మనం బ్లాగ్ లో ఏదో రాస్తాం కానీ కొన్ని లక్షల మంది తమ ముఖం పత్రికల్లో, కనిపించాలని ఇండియా గెట్ వద్ద ఆందోళన చేస్తారా ? ఏ పత్రికలో నైనా లక్షల మంది ఫోటోలు కనిపిస్తాయా ?

 3. 4 Narsimha 12:06 ఉద. వద్ద డిసెంబర్ 27, 2012

  రక్షణ కల్పించే పోలీసు జీవికి మన యువత ఇచ్చిన గౌరవం అది……ఇందు కే పోలీసులు కూడా దొరికితే లాటీ విరగ తంతున్నారు,అసలు ఉద్యమం అన్న పదానికి అర్థం మార్చేసారు,ఆకతాయిలు వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని ఈగో ని సంతృప్తి పర్చటం కోసం,వాళ్ళ(దూల,కోపంతీరటం కోసం) రోడ్డేక్కి అన్నీ పగలగొట్టీ…ఆనంద పడుతున్నారు.

 4. 5 బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ 9:29 ఉద. వద్ద డిసెంబర్ 27, 2012

  మీ టపాలో కొంత నిజం ఉన్నప్పటికీ ఒక సత్కార్యం కోసం ఉద్యమించిన యువతని పిల్లకాయలని,గుర్తింపు కోసం ప్రాకులాడేవారని అనటం సమంజసంగా లేదు.యువతలో ఈ మాత్రం చైతన్యం వచ్చిందంటే అది ఆహ్వనించదగ్గ పరిణామమే. ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది అభాగినులు దారుణంగా అత్యాచారాలకు గురవుతున్నా ఏనాడు వాటి గురుంచి పట్టించుకొని ప్రభుత్వం ఈనాడు కఠినశిక్షల గురుంచి ఆలోచిస్తోందంటే అది వారి చలవే.శాంతియుతంగా ధర్నా చేస్తున్న యువతని లాఠీలతో,వాటర్ కేనన్లతో తరిమికొట్టింది పోలీసులే. కానిస్టేబుల్‌ని చంపేసింది యువతే అని అప్పుడే నిర్ధారించేశారే ?

  వొట్టి కఠినశిక్షల వల్ల లాభం లేదనండి ఒప్పుకుంటాను. సమాజంలోను మార్పు రావల్సి ఉంది.మద్యాన్ని జీవనదులుగా మార్చేసిన ప్రభుత్వాలలో,ఆశ్లీల సినీ దర్శక నిర్మాతలలోను చైతన్యం రావాలి.కానీ అవి సఫలం అయ్యేవరకు కఠినశిక్షలు కోరవద్దంటారా? పసికందు పై అత్యాచారాలకు తెగబడే మృగాలకు ఎటువంటి శిక్ష విధించినా సరిపోదు

  • 6 అబ్రకదబ్ర 1:58 సా. వద్ద డిసెంబర్ 27, 2012

   >> “కానీ అవి సఫలం అయ్యేవరకు కఠినశిక్షలు కోరవద్దంటారా?”

   కఠినశిక్ష అంటే ఏంటి? రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపటం, శిరఃఛేదం చేయటం, బహిరంగంగా ఉరి తీయటం .. ఇటువంటివా? ఈ నిరసనకారులు కోరుతుంది అవే. నా అభ్యంతరం దాని మీద. ఇప్పటికి ఉన్న చట్టాలు, శిక్షలు పకడ్బందీగా అమలు చేస్తే చాలు. కొత్తవక్కర్లేదు. మన వెళ్లాల్సింది ముందుకి. మధ్యయుగాల్లోకి కాదు.

   >> “శాంతియుతంగా ధర్నా చేస్తున్న యువతని లాఠీలతో,వాటర్ కేనన్లతో తరిమికొట్టింది పోలీసులే. కానిస్టేబుల్‌ని చంపేసింది యువతే అని అప్పుడే నిర్ధారించేశారే ?”

   యువత శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని మీరెలా నిర్ధారించేశారు? మనదేశంలో వందమంది పోగైన ఏ ర్యాలీ ఐనా ప్రశాంతంగా ముగుస్తుందన్న నమ్మకం లేదు. అలాంటిది వేలాది మంది ఓ చోట చేరితే?

   అక్కడ పోగైన నిరసనకారులందరూ శాంతికాముకులు, వాళ్లని అదుపు చెయ్యబోయిన పోలీసులందరూ దుర్మార్గులన్నట్టు మాట్లాడటం ఏం సమంజసం? తప్పెప్పుడూ పోలీసులదే అవుతుందా? వాళ్లు మనుషులు కారా? వాళ్లకి కుటుంబాలు, కూతుళ్లు ఉండరా? అత్యాచార బాధితురాలి మీద వాళ్లకి మాత్రం సానుభూతి ఉండదా? For a moment, imagine you’re a police officer and think how you’d react if thousands of people are charging at you.

   >> “ఒక సత్కార్యం కోసం ఉద్యమించిన యువతని పిల్లకాయలని,గుర్తింపు కోసం ప్రాకులాడేవారని అనటం సమంజసంగా లేదు”

   పిల్లకాయలని నేనన్నది మరెవర్నో. అది బాల్ థాకరే ఉదంతం గురించిన వ్యాఖ్య. ఇక ‘గుర్తింపు’ వ్యాఖ్యంటారా …. అది పై ఫోటోలో వాళ్ల గురించి. ఆ మాట మళ్లీ అంటాను. ఆ ముఖాల్లో ఆనందం, నవ్వు చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. They just need a reason to take to streets and have some fun – which is exactly what they were having. I am no fool to believe they really care about the victim.

   >> “యువతలో ఈ మాత్రం చైతన్యం వచ్చిందంటే అది ఆహ్వనించదగ్గ పరిణామమే”

   కొవ్వొత్తులతో రెండ్రోజులు ధర్నాలు చేసి తర్వాత ఎవరిదారిన వాళ్లు పోయే బాపతు చైతన్యంతో మీడియా కవరేజ్ వస్తుందేమో కానీ మార్పు రాదు. నిజంగా మార్పు తేవటానికి కావలసిందో జీవితకాలపు నిబద్ధత. అది మనదగ్గరే మొదలవ్వాలి. ‘నేనెలాంటి బట్టలేసుకోవాలో నువ్వు చెప్పక్కర్లేదు’ తరహా ప్లకార్డులు పట్టుకునే హైసొసైటీ అమ్మాయిలు హాయిగా కార్లలో తిరుగుతూ కులాసాగా బతికేస్తుంటారు. వాళ్లు రేపెట్టే వాంఛలకి రెచ్చిపోయే చిత్తకార్తె కుక్కల పాలిట పడేదేమో బస్సుల్లో తిరిగే ఇతరులు. నా ఇల్లు నా ఇష్టం అని ఇంటికి తాళమెయ్యకుండా బయటికెళతామా? నా వళ్లు నా ఇష్టం అనటం కూడా అలాంటిదే. ‘రేపిస్టుల్ని ఆపండి’ అనే ప్లకార్డు పట్టుకుందో అమ్మాయి. ఇక్కడేమైనా ప్రభుత్వాలు ‘రండిబాబూ రేపులు చెయ్యండి’ అని లైసెన్సులిచ్చి కూర్చున్నాయా? ఇంకో అమ్మాయి ‘నగ్నంగా తిరుగుతా అంతమాత్రాన రేప్ చేస్తారా?’ అంటుంది! ఇలాంటి విచ్చలవిడితనం ఉన్నచోట ఉన్మాదులు కూడా ఉండితీరతారు. కఠినమైన చట్టాలు వాళ్లనాపుతాయా? చట్టాలనేవి నేరస్తుల్ని శిక్షించటానికే తప్ప నేరం జరక్కుండా ఆపటానిక్కాదు. అవి జరిగే వాతావరణమున్నంతవరకూ అత్యాచారాలు జరక్కుండా ఎవరూ ఆపలేరు. అసభ్య వస్త్రధారణ వల్లనే అన్ని ఘోరాలూ జరుగుతాయని కాదు. మార్పు రావాలనేది ఆ ఒక్క విషయంలోనే కాదు. అవన్నీ రాస్తూపోతే ఎక్కడో తేలతాం. చెప్పొచ్చేదేమంటే, ‘నా ఇష్టమొచ్చినట్లు నేనుంటా’ అనే వాళ్లకి మార్పు కావాలనే హక్కు లేదు. గాంధీగారన్నట్లు, you must be the change you want to see in the world.

 5. 7 జీడిపప్పు 11:49 ఉద. వద్ద డిసెంబర్ 27, 2012

  సరిగ్గా చెప్పారు. ఓ అమ్మాయి రెచ్చిపోయి పోలీసులు పహారా ఉన్న పరిధిలోకి వెళ్ళి లాఠీ లాక్కుంటే పాపం ఆ కానిస్టేబుల్ ఆ లాఠీని లాక్కోబోయి ఆమెను పడతోసాడు. ఇహ చూస్కో మన మీడియావాళ్ళ గోల, “అమ్మాయిని కొట్టారు” అని!
  ఓ చిత్రం: అక్కడ కొందరు “ఇస్లామిక్ చట్టం (అంటే బహిరంగ మరణశిక్ష) అమలు చేయాలి” అని ప్లకార్డులు పట్టుకొని ఉంటే ఇంకోకరు Don’t tell me how to dress (నా ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకుంటా, మీకు నచ్చినవి చూసుకోండి అని భావమనుకుంటా) అని పట్టుకొని గెంతుతున్నారు. హతోస్మి!!!

 6. 8 Venkayya 7:26 సా. వద్ద డిసెంబర్ 27, 2012

  ఈ విషయంలో స్పాంటేనియస్‌గా వుద్యమించిన యువతను తప్పు పట్టాల్సిన ఎంతవరకు సబబు? చనిపోయిన కానిస్టేబుల్ కిచ్చిన నేషనల్ కవరేజ్ సాంప్రదాయం, బలిమెల దంతెవాడల్లో చంపబడ్డ వందలాది పోలీసులకు ఎందుకు ప్రభుత్వం పాటించలేదే? గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు, సాక్షులు చెబుతున్నా, విడియో సాక్షాలున్నా ఇంటర్నల్ ఇంజురీతోపోయాడని పోలీస్ కమిషనర్ పోస్ట్మార్టం కన్నా ముందే బుకాయించాల్సిన అవసరమేమి? మరికై పోస్ట్మార్టం ఎందుకు? ఎంతమంది రేప్ బాధితులకు విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు? వారం రోజుల తరువాత సింగపూర్లో(అమెరికా, యూరోప్‌లు కాదు) మెరుగైన వైద్యం అని జ్ఞానోదయం అయ్యిందా? ఇండియాలో AIMS, Appolo, Breach Candy, Jeslok ఆస్పత్రులకన్నా సింగపూర్ వైద్యం మెరుగైనదా? వున్న చట్టాలను అమలుచేయడంలో వైఫల్యం ఎవరిది?
  ఇది కేవలం అత్యాచారం కాదు, వినడానికే అసహ్యంగా వుండేట్లు నిస్సహాయ బాధితురాలిని మర్మావయాల్లో ఇనుపరాడ్తో కలియతిప్పి(ఫారిన్ మీడియా రిపోర్ట్), బస్సులోంచి తోసివేయబడిందిన, దేశ రాజధానిలో ఓ ప్రధాన రోడ్డుపై గంట పైన జరిగిన పైశాచిక సంఘటన. ఢిల్లీలో బస్, ఆటోల్లో అమ్ర్యాదకరంగా ప్రవర్తించే మృగాలు కోకొల్లలని ఢిల్లీ పోలీసులకు తెలియదా? ఆటవిక నేరాలకు ఆటవిక శిక్షలు ఎందుకు వుండకూడదు? సోషల్ సైట్లలో కాలం గడిపే అని ఈసడించేముందు, ఆ యువతే తిరగబడింది అని గుర్తిస్తే మంచిది. వినిమయ సంస్కృతి, టివిలు, బూతు అంటూ కలిపికొట్టి ఈసడించే చాందసులు, ఆటవిక చట్టాలు అవసరమా అని వాదించడంలో తర్కమేమిటో బోధపడలేదు.

  • 9 అబ్రకదబ్ర 2:36 సా. వద్ద డిసెంబర్ 28, 2012

   పరస్పర విరుద్ధ వాదాలతో నిండిన వ్యాఖ్య మీది. ఒకసారి మీ వ్యాఖ్య మీరే సరిగా చదువుకోండి. And then, you didn’t get the context right on one or two little things I mentioned in the post despite the clarification I gave in the comments above. So, no point wasting my time on a lengthy reply. Have fun elsewhere, dear dude 😉

 7. 10 Vasu 11:10 ఉద. వద్ద డిసెంబర్ 28, 2012

  “జబ్బుకి చికిత్స కనుక్కోవాలనే సంకల్పం ప్రపంచపు పురాతన ప్రజాస్వామ్యంలో”
  ఆ సంకల్పం నిజంగా ఉందంటారా ? మూన్నెళ్ళ కోసారి ఇలాటి దారుణం జరగడం చర్చ తప్ప పరిష్కారం దిశగా చర్యలేమి కనిపించట్లేదు ..
  జరినపుడు అదే పనిగా న్యూస్ లో కనపడుతుంది .. తరువాత మీడియా జనాలు ప్రభుత్వం అందరూ దాని గురించి మరిచిపోతారు ..

  • 11 అబ్రకదబ్ర 1:18 సా. వద్ద డిసెంబర్ 28, 2012

   మీరన్నది నిజమే. అది అన్నిచోట్లా ఉన్న సమస్యే. నేనెత్తిచూపదల్చుకుంది వేరే. కనీసం ఆ మూడ్నెల్లపాటు తుపాకి సంస్కృతిపై జరిగే చర్చ సరైన దిశలో జరుగుతుంది – తుపాకుల లభ్యత కష్టతరం చేసే దిశలో. అంతే కానీ కాల్పులు జరిపేవాళ్లని ఎలా దండించాలన్న విషయంలో కాదు.

 8. 12 bondalapati 10:21 ఉద. వద్ద డిసెంబర్ 29, 2012

  “ఆటవిక న్యాయం అమలుచెయ్యమంటుందా ప్రజాస్వామ్యం? అలా చేస్తే నేరాలు అదుపులోకొచ్చేట్లైతే ఇప్పటికే అటువంటి చట్టాలున్న దేశాల్లో వాటి అవసరం ఇంకా ఎందుకు మిగిలుంది?”
  మాత్రలు వేసుకొన్నన్ని రోజులూ తల నొప్పి ఉండదు. మాత్రలు వేసుకోవటం మానేస్తే మళ్ళీ తల నొప్పి మొదలౌతుంది. అలానే ఆ కఠినమైన చట్టాలు తీసేస్తే మళ్ళీ పరిస్థితి మొదటి కొస్తుంది.అలా మొదటికి రాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు ఉండాల్సిందే! ఏ సమస్యకైనా సత్వర మరియూ దీర్ఘ కాలికమైన పరిష్కారాలు ఉంటాయి. కఠిన శిక్షలు షార్ట్ టర్మ్ సొల్యూషన్ అయితే, జనాల యాటిట్యూడ్ లో మార్పు తీసుకొని రావటం దీర్ఘకాలికమైన పరిష్కారం. Usually dispensations try both long term and short term sppraoches simultaneously. షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఆచరించక పోతే , ప్రస్తుతం జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తరువాత లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయలేని విధం గా పరిస్థితి చేయి దాటి పోవచ్చు.
  ఇక ఏ సమస్య కీ శాశ్వత పరిష్కారం ఉండదు. దీర్ఘ కాలిక పరిష్కారం మాత్రమే ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతానికి యాటిట్యూడ్ ప్రాబ్లం తక్కువ గా ఉన్నాయి. అక్కడ దీర్ఘ కాలం రేప్ గురించిన సమస్యలు మనకంటే తక్కువ గా ఉంటాయి. కానీ మళ్ళీ కొన్ని వందల యేళ్ళ తరువాత అక్కడ కూడా పరిస్థితి దిగ జారవచ్చు.

 9. 13 Manoj 7:31 ఉద. వద్ద డిసెంబర్ 30, 2012

  అబ్రకదబ్ర,
  నేను మీ ఆలోచనలతో, టపాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
  ఎక్కువమంది ఇలా ఆలోచించకపోడం, అర్ధం కూడా చేసుకోలేకపొవడం నిజంగా బాధాకరం.
  మన పత్రికలలో ఎక్కడా ఇలాంటి వ్యాసాలు రాకపోవడం మన దురద్రుష్టము.
  ప్రతి ఒక్కరు (ప్రశ్తుతానికి నేను కూడా) మందకి భయపడుతున్నారు.
  ఇటువంటి పరిస్తితులలో, మార్పు వస్తుందంటారా?

 10. 14 తాడేపల్లి 9:49 ఉద. వద్ద జనవరి 10, 2013

  I don’t like this rape phobia sweeping across the country by the influence of mindless media which is mostly feministic in nature. Though we are a backward country, our rape incidence is comparatively very low by international standards. Crimes can not be curbed with severe or barbaric punishments. Criminals are never afraid of punishments because every attempting criminal thinks he is acting too smsrt to be caught by the law. Consider these facts mentioned below. You will know how effective severe punishmnets are :

  USA registers not less than 84,000 rapes (full penetration) annually while our count is 22,000 only. USA is unable to reign in the sexual crime chiefly because the feminists there have been advancing the same argument as they are doing here : “We dress as we like and should not rape us.” American women are catching up with this masterpiece of slogan. But criminals are criminals and unfortunately they don’t know feminism and take its slogans lightly.

  South Africa reports 2,00,000 rapes a years. Note that both are developed nations.

  Crime rate is actually very high in Saudi Arabia though they are known to implement the most barbaric punishments on the globe. This year they have got to hang 147 convicts. Their population is only around two and a half crore. But their annual crime rate is 2,25,000 against India’s 1,60,000.

  Crime rate should be determined not by our panic or emotional reactions or a rarest case of civil brutality, but by its incidence per a population of 1,00,000 a year. That way, we are far better off. Already the existing anti-rape laws are out and out pro-women. If these laws are to be tightened more, every second or third male in the coutry will be booked as a rapist by women at their will and pleasure.

 11. 15 sri 6:45 సా. వద్ద జనవరి 25, 2013

  After reading the details in wikipedia about the incident, I have only one thing in my mind. I didnot read the details previously, but once read, its mind boggling how could they do it.

  That is, stop all the discussions about this incident and publicly peel off the skin on the genitals of these guys, one after the other, so that if tomorrow any body want to do this kind of animalistic behavior, they should think twice.

  Period. No discussions. We end up in discussing about this, if we are insensitive to the pain of the victim. But just imagine yourself in the same place as that of the victim. You will demand the same with out any scope for discussions.

  There are some crimes, that we as a society should demand instant and most cruel punishment. Otherwise, this will end up in leniency, which will lead to the utter lawlessness. This is one such crime incident.

 12. 16 sri 6:50 సా. వద్ద జనవరి 25, 2013

  Slow and unbearable painful death is what the correct punishment is for these guys, so that they know that they cannot escape from punishment.

  I cann’t believe that they teared the victims intestines after the incident. They donot deserve any life on earth. They donot either deserve short and quick or painless death.

  http://en.wikipedia.org/wiki/2012_Delhi_gang_rape_case

  I wonder if what so called thinkers in the society would have done if somebody came to tear their intestines. Would he be discussing about it with someone else?

 13. 17 amar 2:07 సా. వద్ద మార్చి 28, 2013

  Whether severe punuishments will lead to less crime or not is immaterial, I can only say one thing….the victim will only get justice only if the culprits go through the same pain as victim.

  The remedies the Obama regime is thinking about are very dangerous. A mad dog doesnt require a licensed gun, he can get the weapon any how, but by bringing gun control u r actually making citizens defence less against theses mad dogs.

  • 18 అబ్రకదబ్ర 2:51 సా. వద్ద మార్చి 28, 2013

   >> “A mad dog doesnt require a licensed gun, he can get the weapon any how”

   Right. But the problem is not so much with mad dogs. The problem is with perfectly sane folk who in a sudden fit of anger commit horrid crimes they wouldn’t otherwise think of. Imagine having a gun at your hand’s reach when you are really really upset and angry. Not everyone can control the urge to use it. Crimes of impulse outnumber pre-meditated crimes.

   Gun control not necessarily means banning guns altogether. It’s about strict licensing laws, more background checking, etc. States with strict gun laws have shown drops in crime rate. You need to know more before making blunt comments.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: