వచ్చే ఏడాది విడుదలవటానికి వరుసలో నిలబడున్న తెలుగు చిత్ర రాజములు:
సెంటిమెంట్ చిత్రాల దర్శకుడు పగడాల అబ్బయ్య రూపొందిస్తున్న దగాస్టార్ పునరాగమన చిత్రం ‘పుట్టింటికిరా తమ్ముడూ’.
లేపాక్షి నంది దర్శకత్వంలో దగా జూనియర్ నటిస్తున్న మాక్సిమమ్ మడ్ క్రియేషన్స్ వారి ‘రొచ్చు’.
ద్వివిక్రమ్ దర్శకత్వంలో గిల్లు గర్జన్ నటిస్తున్న రెండవ సినిమా ‘ఆగస్టాయి (అనబడే ఆకతాయి)’.
తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ కిషోర్ తుమ్ముల రూపుదిద్దిన అచ్చ తెలుగు చిత్రం ‘దిసీజ్ టెల్గూ లైఫ్’.
మంట లక్ష్మీ ప్రసూన అన్నీ తానై నటిస్తూ నిర్మిస్తున్న ‘కొంపంతా కొల్లేరు’.
సంకటేష్, హిమేష్ క్రేజీ కాంబినేషన్లో రోమ్ నేపాల్ శర్మ నిర్మిస్తున్న భయానక చిత్రం ‘దెయ్యాలదిబ్బలో మఱ్ఱిచెట్టు’.
బాతు రామశ్యామ నిర్దేశకత్వంలో అనూహ్య ప్రధాన పాత్రధారిణిగా మల్లెపూల కృష్ణప్రసాదరెడ్డి ఆరేళ్లుగా సాగదీస్తున్న దెయ్యాల సినిమా ‘అమావాస్య’.
ఫీవర్ స్టార్ వాయు వివాహ్, తినమ్మా జంటగా కథ, కాకరకాయ లాంటి పట్టింపులేమీ పెట్టుకోకుండా ఇడ్లీ విశ్వనాధ్ చుట్టేస్తున్న ‘దొంగకోళ్ల రంగడితో రత్తాలు’.
గానార్జున, దర్శకచంద్రుల హిట్ కాంబినేషన్లో మరో భక్తిరస పౌరాణికం ‘ప్రవక్త మహమ్మద్’.
గోలయ్యబాబు, మంట జెనోమ్ క్రేజీ కలయికలో ఇంకో పిచ్చెక్కించే సినిమా ‘ఛీ కొడతారా? చిరాకు పడతారా??’.
చిల్లర సురేష్, బీమాలేని కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘బుడబుక్కలోడు’.
ప్రతీకారం ప్రధానాంశంగా పందిమాత పతాకమ్మీద ఎన్.ఎన్.రామజౌళి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీజీఐ ఎక్స్‌ట్రావగాంజా ‘దోమ’.
మూసమహారాజా కవితేజ సరసన అందాల నాయిక పెప్సీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ‘మదం’.
డాన్స్‌మాస్టర్ ఫ్లోరెన్స్ దర్శకత్వంలో ప్రభాత్ భీకరంగా నటించేస్తున్న ‘గుభేల్’.
ఉద్యమ నేపధ్యంలో యమ్.కింకర్ రూపొందిస్తున ఇంకో సినిమా ‘జజ్జనకరిజనారే’.
నైజాం నిష్కృతి పతాకంపై కచరా సమర్పణలో శ్రీమతి తవిక ప్రధమ ప్రయత్నంగా ప్రయత్నిస్తున్న ‘బొంద పెడతా’.
పై సినిమాకి పోటీగా జగడపాటి రామగోపాల్ తీస్తున్న మొదటి సినిమా ‘ఉస్కో అంటే ఉస్కో అంటా’.
ఎవరికీ పోటీ రాకుండా, ఫలితంతో సంబంధం లేకుండా మిత్రచిత్ర పతాకంపై ఆరు పారాయణమూర్తి తన దోవన తాను తీసుకుపోతున్న ‘జాలిమ్ కౌన్ రే’.
కొండ సంకట్ సమకూర్చిన కథాంశంతో వేణు దాట్ల నేతృత్వంలో మిక్సర్ & గ్రైండర్ బ్యానర్ మీద ఊరూపేరూ లేని నిర్మాతెవరో వండుతున్న ‘కిచిడీ’.
ఆంగ్ల చిత్రం ‘ఎక్స్‌పెండబుల్స్’ ఆధారంగా శ్రీమతి జీవిక దర్శకత్వంలో డా.రామశేఖర్, గజపతి బాబు, శ్రీశాంత్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘మేమింకా మిగిలున్నాం’.
ఇవి కాక ఇంకా హిందీ అనువాదాలు – వైద్యా బాలికన్ ‘అగ్లీ పిచ్చర్’, రేణు బెనర్జీ ‘కుయ్యా’, సన్నీ సిలోన్ ‘భస్మ్ – 3’; తమిళ అనువాదాలు – జి.వి.సంతోష్ ‘భంగం’, బి.ఆర్.మురికిదాస్ ‘నాన్ సెన్స్’, డూపర్‌స్టార్ గజనీశాంత్ ‘పచ్చడయ్యాన్’ వగైరా కళాఖండాలు తెలుగు దేశమ్మీద మూకుమ్మడి దాడి చెయ్యబోతున్నాయి.
హహహ ఒక్కో టైటిల్ ఒక్కో సీమటపాకాయలాగా పేలిందండీ 🙂 అదుర్స్ :))
హహహహ ఈ పేరడీ పేర్లు అవీ చదివి చాలారోజులవుతుందేమో… హిలేరియస్ 🙂 “మేమింకా మిగిలున్నాం” టైటిల్ కెవ్వు :-))
Ganarjuana movie and expendables are very hilarious.
LOL
Lol
“vAyu vivAh” …”mEminkA batikunnAm” …. highlights of the episode!!
“మేమింకా మిగిలున్నాం” అనేకంటే “మేమింకా మిగిలే ఉన్నాం” అన్న టైటిల్ బాగుంటుందేమో? ఇన్ ఫర్మేటివ్ గా ఉంటుందేమో!!
“పై సినిమాకి పోటీగా జగడపాటి రామగోపాల్ తీస్తున్న మొదటి సినిమా ‘ఉస్కో అంటే ఉస్కో అంటా’.”
సూపరో సూపరు. అందర్నీ ఓ ఒతుకుతికేశారు 🙂
Super..
అదుర్స్….
kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
దేవుడా.. ఒక్కో లైన్ కీ ఒక్కోసారి కన్నీళ్ళొచ్చేలా నవ్వుకున్నా….
ఈ మధ్య కాలం లో నేను ఈ రేంజ్ లో నవ్వుకున్న పోస్ట్ ఇదేనండీ..
కుమ్మేశారు…
అరిపించారు.. నవ్వి నవ్వీ బుగ్గలు నొప్పెట్టాయి
– పగడాల అబ్బయ్య ఇంకా బతికున్నాడా? అతని గురువు మోసరి రామాయణ ను వదిలేశారే?
– సంకటేష్ హిమేష్ ల క్రేజీ కాంబినేషన్ లో అంతకు పదింతలు క్రేజీ దర్శకుడు రోమ్ నేపాల్ శర్మ సినిమా కోసం నేను కళ్ళు కాయలు కాసి పండ్లై, రాలి పడేలా ఎదురు చూస్తున్నాను.
నికృష్ణవంశీ టోపీచంద్, పెప్సీ ల పిచ్చి కాంబినేషన్ లో వదులుతున్న కుటుంబ కధా పైత్య చిత్రం “గొడుగు”
అబ్బ, ఇలాంటివి రాయాలంటే మీకు మీరే సాటి!
ఫీవర్ స్టార్ వాయు వివాహ్….:-)
నైజాం నిష్కృతి పతాకంపై కచరా సమర్పణలో శ్రీమతి తవిక ప్రధమ ప్రయత్నంగా ప్రయత్నిస్తున్న 🙂 🙂
మేమింకా మిగిలున్నాం 🙂 🙂 ఇది మరీ కేక
సంపేసినారు 🙂 🙂
హ…హ…రచ్చ ..రచ్చ ..:))
“Vyagyam” viraga poosindhi.
katthi anil jee … telugu cinimaala meeda mee lolona raguluthunna badabaagni laavaalaa virajimmaaru. aamadya ‘dummu’ chhoosi nenu dummu kottuku povalasinde kaanee … pramaadam trutilo thappindi.
డూపర్‌స్టార్ గజనీశాంత్ ‘పచ్చడయ్యాన్’ మంట లక్ష్మీ ప్రసూన అన్నీ తానై నటిస్తూ నిర్మిస్తున్న ‘కొంపంతా కొల్లేరు’. సూపర్ సర్ నవ్వలేక నవ్వలేక చదవడం మానేసాను