పండుటాకు

నా కొత్త కాలక్షేపం మీద మోజింకా తాజాగానే ఉంది. ఆ మధ్య అరగంటలో దెయ్యాల దిబ్బ బొమ్మ గీశాక ‘ఫర్లేదు, పదేళ్ల తర్వాత కుంచె పట్టినా కుదురుగానే గీస్తున్నా’ అన్న భరోసా వచ్చేసింది. అదే ఊపులో మరో నాలుగ్గంటలు నావి కావనుకుని ఈ సారి నాకు ప్రీతిపాత్రమైన నలుపు తెలుపుల్లో ఓ బొమ్మేయాలని మొదలు పెడితే ఈ ఈ వృద్ధుడిగా తేలింది. ఆ క్రమంలో, డిజిటల్ పెయింటింగ్స్‌లో ఉండే కొన్ని సమస్యలు అనుభవంలోకొచ్చాయి. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న ముసలాయన ముఖంలో ఉండాల్సిన ముడతలు, మాసిన గెడ్డం, వగైరా వివరాలు సంప్రదాయ కుంచెల్తో సృష్టించినట్లే ఇక్కడా చేయాలంటే కుదరదని అర్ధమయింది. అదో కొత్త పాఠం. నేర్చుకోవలసిన పాఠాలు ఇంకెన్నో ఉన్నాయి.

ఈ పెద్దాయన్ని గీసిన పద్ధతి చూడాలంటే కింది విడియోని ఓ చూపు చూడండి. ఆరున్నర నిమిషాల చిల్లర పొడుగుంటుందది. అంత ఓపిక లేనివారు ఇక్కడ నొక్కితే ఎకాఎకీ పెయింటింగ్ చూసేసి మీ దోవన మీరు పోవచ్చు.

3 Responses to “పండుటాకు”


  1. 2 వాసు 3:56 ఉద. వద్ద ఆగస్ట్ 3, 2011

    అదరగొట్టారు.. జుట్టు ముఖ్యంగా..ఆ సన్నని తెలుపు-నలుపుల మెరుపు భలే బావుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 275,800

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: