మన కచరా గారికి తీరని నోటి తీట. తెలిసిన సంగతే. వారి మేనల్లుడు తహరాగారు రెండాకులెక్కువ చదివారు కాబట్టి నాలుగడుగులు ముందుకేసి కనపడ్డోళ్లందరి మీదా చెయ్యి చేసుకుంటుంటారు. ఆ గుణం జన్యు సంక్రమణం. మొన్నామధ్య అసెంబ్లీలో డార్విన్ సిద్ధాంతాన్ని మరోమారు రుజూ చేస్తూ కల్లు తాగిన కోతిలా బెంచీల మీంచీ, సహచర సభ్యుల శిరస్సుల మీంచీ చెంగు చెంగున గెంతుతూ గవర్నర్ గార్ని తన్నబోయిన వైనమూ, అదే రోజు గాంధీ బొమ్మ సాక్షిగా జేపీ నారాయణపై చెయ్యి చేసుకున్న దృశ్యమూ ఇంకా జనాల తలపుల్లో తాజాగానే ఉన్నాయి. ఈ చేతిదూలకి జన్యు దోషమే కాక మరో కారణమూ ఉందనేది ఈ మధ్యనే తెలిసిన విషయం. తప్పు తహరా గారిది కాదు, వారి పూర్వీకులది. ఎదురైన వాళ్లందర్నీ ఎగిరి తన్నటానికి పురికొల్పుతుంది వారి ఇంటి పేరే తప్ప మరొహటి కాదు. తన్నేరు హరీష్ రావు గారి గృహనామానిదే తప్పు తప్ప ఆయన దోషమేం లేదని మన రాష్ట్ర ప్రభుత్వం నమ్మేసి మిన్నకుండటంతో అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యేని ఉతికినా తహరాగారు బతికిపోయారు. ఇంటి పేరు నిలబెట్టటం కోసం ఆయన పడుతున్న ఆరాటంగా ఆంధ్రులు కూడా అర్ధం చేసుకుని క్షమించి వదిలేశారు. అయితే అందరు ఆంధ్రుల్లోనూ అదే స్థాయి క్షమాగుణం ఉండదు కదా. అందునా ఆంధ్రప్రదేశం బయటుండేవాళ్లలో అది అస్సలుండకపోవచ్చు.అనువుగాని చోట అధికులమనరాదని అచ్చ తెలుగు సామెత. హైదరాబాదులోనూ, తెలంగాణలోనూ ఏ వెధవ్వేషాలేసినా చెల్లిపోయింది కానీ, దేశ రాజధానిలో సైతం అవే పోకడలు పోతే ఎలా కుదురుతుంది? కానీ ఆ పాటి జ్ఞానం ఉంటే ఆయన కచరాగారి మేనల్లుడెలా అవుతారు? పైగా, వారి భాష వేరే కాబట్టి అచ్చ తెలుగు సుద్దులు వారికర్ధమైతే ఒట్టు. అందుకే అలవాటుగా ఢిల్లీలో తమ చేతివాటం ప్రదర్శించబోయి భంగపడ్డారు.
అదేం విచిత్రమో కానీ – తెల్లారి లేస్తే తెలంగాణ కోసం ప్రాణాలిస్తాం, పీకలు కోసుకుంటాం, రక్తం చిందిస్తాం, అగ్నికి ఆహుతౌతాం అని గొంతులు చించుకునే ఏ ఒక్క లీడరూ అన్న మాటకి కట్టుబడి పుణ్యం మూటగట్టుకోలేదు. ఆ నీతిమాలిన నేతల మాటల మాయలో పడి తమని తాము తగలేసుకునేవాళ్ళు మాత్రం అడపాదడపా రాలిపోతున్నారు. (అసలీ ఆత్మహత్యల్లో ఆత్మప్రబోధాల శాతమెంతనే అనుమానాలు వెల్లువెత్తినా, అవన్నీ సీమాంధ్ర మీడియా అల్లిన కల్లబొల్లి కహానీలంటూ అదే సీమాంధ్ర మీడియా దన్నుతో విరుచుకుపడే తెలివితేటలీ తెలబాన్ దొరల సొంతం కాబట్టి అలాంటి వెర్రిమొర్రి అనుమానాల జోలికెళ్లకుండా వాళ్లు చెప్పిందే వేదమనుకుంటే అందరికీ సుఖం) ఈ ప్రాణాలు తీసుకునే ట్రెండ్‌కి ఓ పసందైన డ్రామాతో ప్రాణప్రతిష్ట చేసిన తహరా దొర మాత్రం మడతలు నలగని ధవళ వస్త్రాల్లో తెల్ల మల్లెలా మెరిసిపోతూ హుషారుగా, కుశాలగా తిరిగేస్తూనే ఉన్నాడు. కనపడ్డోళ్లందర్నీ కుమ్మేస్తూనే ఉన్నాడు. అయితే శవాల మీద చిల్లరేరుకునే ఆత్రంలో ముందూ వెనకా చూసుకోకుండా ఎవర్నిపడితే వాళ్లని కుమ్మేస్తే ఎలా? అవతలున్నదెవరో, అతని కులమేంటో తెలుసుకునే పనిలేదా? అనగనగా అపుడెపుడో అయ్యేయెస్ వెలగబెట్టిన అగ్రవర్ణ అసెంబ్లీ సభ్యుడిని అలవోకగా తన్ని తగలేసినా అడిగేవాడుండడు కాబట్టి చెల్లిపోద్ది. పీడిత తాడిత దళిత చిరుద్యోగికీ అదే సామాజికన్యాయం వర్తింపజేస్తామంటే మాత్రం అంబ పలుకుద్ది, పంబ రేగుద్ది. తన్నులు తిన్న దళితోద్యోగి సహధర్మచారిణి చెప్పు తీసుకు తరిమినప్పుడు ఈ సూత్రం మస్తుగా వంటబట్టింది తన్నేరువారికి. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఢిల్లీ చట్టానికి తెలంగాణతో చుట్టరికం లేదు కాబట్టి దాని పని అది చేసుకుపోయింది. తెల్లారే సరికి తహరాగారి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు బనాయించబడింది. అది వారి బ్యాండ్ బజాయిస్తుందా లేదా అన్నది వేరు ప్రశ్న. ఈ సంఘటన నాలో రేకెత్తించిన ధర్మ సందేహాలు వేరే.
తహరా తన్నింది ఓ అగ్రవర్ణ అధికారినైతే కేసుల ఊసు లేకుండా తప్పించుకునేవాడా? తహరా సైతం దళితుడయ్యుంటే ఆయన మీద అట్రాసిటీస్ చట్టం ప్రయోగించవచ్చా లేదా? తన్నబోయే ముందు తన్నించుకునేవాడి కులమేదో తెలుసుకునే తన్నాడా? అవతలున్నది ఓ దళితుడని తెలీక తన్నాడని రుజువైతే ఆయన అమాయకుడంటూ కేసు కొట్టేస్తారా? ‘దళిత ప్రభుత్వోద్యోగిపై చెయ్యిచేసుకున్న ఎమ్మెల్యే’ తరహా వార్తాశీర్షికలు సదరు ప్రభుత్వోద్యోగిని కులం పేరుతో అవమానించటం కిందకి రావా?ఎవరు దళితులో ఎవరు కాదో, ఎవరిని ఎవరు తన్నొచ్చో, ఎవరెవరిని ఎవరెవరు తన్నకూడదో తేలిగ్గా తెలిసేలా ప్రజలంతా మెడల్లో తమ తమ కులాల పేర్లుండే బోర్డులు వేలాడదీసుకు తిరగాలంటూ దేశవ్యాప్త శాసనం చేస్తే ఎలా ఉంటుంది?
అందుకే అలవాటుగా ఢిల్లీలో తమ చేతివాటం ప్రదర్శించబోయి భంగపడ్డారు._____________ఏం భంగ పడ్డారు? సరాసరి లోపలికెళ్ళాడు, కసి తీరా (ఆ దెబ్బలు ఎంత బలంగా కొట్టాడో చూశారా) కొట్టాడు. వచ్చాడు. ఆవేసంలో కొట్టానన్ని సారీ చెప్పాడు. అయిపోయింది బస్ ఖేల్ ఖతమ్! ఆయన మీద పెట్టిన కేసులూ అవీ నిలిచి చర్యల దాకా వెళితే చూద్దాం లెండి!
ఆత్మహత్యలు చేసుకునే భావావేశం యువకులకు, విద్యార్థులకే తప్ప వాళ్ల నాయకులకెవరికీ కలక్కపోవడం ఆశ్చర్యం! వాళ్ల పని వీళ్ళలో భావావేశాన్ని రేపడం వరకే అన్నది స్పష్టం!
మీ చివరి పేరాలో ధర్మ సందేహాలే నాలోనూ చందర్రావుని తన్నినప్పటినుంచీ రేగుతున్నాయి.
మీ బ్లాగులో ఫాంట్ పరిమాణం పెంచండి బాబూ చదవటానికి ఇబ్బందిగా ఉన్నది.
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నిలవదు. కారణం, కుల పరంగా అవమానిస్తే ఆ చట్టం వర్తిస్తుంది. ఇక్కడ ఆయన కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ అతన్ని కొట్టలేదు. ఎదురులేని సాక్ష్యాలతో రికార్డ్ అయిపోయింది కాబట్టి ఈ కేసు మామూలు క్రిమినల్ కేసు కింద గెలిచే అవకాశం ఉన్నది. కాని ఆ కేసులో తీర్పు వస్తే గిస్తే ఎప్పటికి వస్తుంది????
అయినా కొట్టటం ఏమిటండీ. రేప్పొద్దున తెలంగాణా వస్తే వీళ్ళేగా ఆ రాష్ట్రానికి మంత్రులో ముఖ్య మంత్రులో అయ్యేది. ఇలా తన భావావేశాలను అదుపు చేసుకోలేని వాళ్ళు పై పదవుల్లో ఉంటే ఎన్నెన్ని అనర్ధాలు తెచ్చి పెడతారో అని అనుమానం రావటం సహజమే కదా
dear shivaprasad garu,
ఇటువంటి అత్మ నిగ్రహం లేని నాయకులు కీలక పదవుల్లొకి వచ్చి తెలంగన ప్రాంతాన్ని “కుక్కలు చింపిన విస్తరి” చెస్తారు అన్న భయము కూడ జనాలలొ వుంది. అందుకె చాలమంది ఈ వుద్యమాన్ని అదరించడము లేదు.
తెలంగాణా ప్రజలకు ఈ సంఘటన ఒక సందేశాన్ని అందించగలిగి ఉంటే సంతోషమే
{ఎవరు దళితులో ఎవరు కాదో, ఎవరిని ఎవరు తన్నొచ్చో, ఎవరెవరిని ఎవరెవరు తన్నకూడదో తేలిగ్గా తెలిసేలా ప్రజలంతా మెడల్లో తమ తమ కులాల పేర్లుండే బోర్డులు వేలాడదీసుకు తిరగాలంటూ దేశవ్యాప్త శాసనం చేస్తే ఎలా ఉంటుంది?}
కేక, పొలికేక, మరియు ఈలలు వేస్తూ, ప్రముఖ ‘అట్రాసిటీ సామాజిక శాస్త్రవేత్త’, విమర్శకుడు, హేటువాది ఐన కత్తి మహేష్ కుమార్ గారు తమ అమూల్యాభిప్రాయములు చెప్పాలని కోరుతూ, వేదిక ఎక్కుడుమని కోరుతున్నాను.
నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి నన్ను ప్రతివాళ్లూ ఇష్టమొచ్చినట్లు తన్నొచ్చు.
2010 lo mohamad jony (mee seemandhrude) oka st officer ni tante emi kesu pettaru mahasaya……
తాడేపల్లి గారూ,
చందర్ రావు , “జయప్రకాష్ కులం వాడు కాదు”, కాబట్టీ చందర్ రావుకి హరీష్ రావు క్షమాపణ చెప్పవచ్చు అని ఒకాయన కామెంటాడు చూడండి ఇక్కడ:
http://seperateandhra.blogspot.com/2011/07/blog-post_22.html
ఇక్కడ జే పీ కులం బదులుగా ఏ అగ్రకులమైనా విషయం ఇంతే.
“ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నిలవదు. కారణం, కుల పరంగా అవమానిస్తే ఆ చట్టం వర్తిస్తుంది.” -శివరామప్రసాద్ కప్పగంతు
ఆంధ్ర జ్యోతి దినపత్రిక కార్యాలయం పై దాడి తర్వాత, శవ ఊరేగింపు లో పాల్గొన్న కారణంగా ఆ పత్రికా సంపాదకుడు శ్రీనివాస్ (నిజానికి అణగారిన బడుగు వర్గాలపై ఎంతో సానుభూతి ఉన్నవాడు, వారి అభ్యుదయానికి కృషిచేసినవాడు) జైలు పాలయ్యాడు. తను కులపరంగా ఎవరిని తిట్టలేదు. ఊరేగింపులో పాల్గొనటమే ఆ సంపాదకుడి నేరంగా అభియోగం ఆపాదింపబడింది.
@సిబిరావు:
ఆంధ్రజ్యోతి సంపాదకుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి టపాతో సంబంధం లేని సంగతొకటి.
ఆ ఊరేగింపు గొడవలప్పుడు ఈయన జ్యోతిలో సంపాదకీయం ఒకటి రాశాడు. ‘ఊరూ పేరూ లేని మాదిగ దండోరా ఉద్యమానికి చిలవలు పలవలు జోడించి వార్తలు ప్రచురించి మంద కృష్ణనీ, అతని ఉద్యమాన్నీ పెంచి పోషించి మేము కాదా?’ అని సూటి ప్రశ్నొకటేశాడందులో. అలా, అనుకోకుండా ఓ సంగతి బయట పెట్టేశాడాయన. పత్రికా సంపాదకుల ఇష్టాయిష్టాలని బట్టి ఉద్యమాల్ని రెచ్చగొడతారన్న మాట!
ప్రత్యేక తెలంగాణ విషయంలోనూ ఈ మహానుభావుడి సంపాదకీయంలోని ఆంధ్రజ్యోతి చేసిన ఓవర్‌యాక్షన్ ఇంతా అంతా కాదు. మూడు నాలుగేళ్లుగా అందులో వచ్చిన వ్యాసాలు చదివినవారికి అది తెలిసిన విషయమే.
అమెరికన్ ప్రెసిడెంట్ల అంతరంగిక జీవితాల దగ్గర నుండి ఆఫ్రికాలో అంతర్యుద్ధాల దాకా అన్నిట్నీ విమర్శిస్తూ సంపాదకీయాలు రాసే తెలుగు పత్రికలు వేర్పాటువాదుల వెర్రివేషాలని (ఉదా: ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల విధ్యంసం, సినిమా షూటింగ్‌లపై దాడులు) అదే స్థాయిలో ఎండగట్టలేకపోవటానికి కారణం?
@అవతలున్నదెవరో, అతని కులమేంటో తెలుసుకునే పనిలేదా….
తరచూ ఏపీ భవన్ ను దర్సించే వీళ్ళకు అవతలి వ్యక్తి కులం తెల్సు కాబట్టే అంత చులకన…అంత దైర్యంగా కుమ్మేసాడు…అదే మరో అగ్ర జాతి వాణ్ణి అయితే చెయ్యి చేసుకునే ధైర్యం ఈ హరీష్ రావుకు ఉండదు…రాజ్యాన్ని పరిపాలించాలని అనుకుంటున్న ఈ దొర లకు నిమ్న కులపోళ్ళంటే ఎంత చులకనా??పట్టుకుని తన్నినా ఏం పీకగలరు ఈ అలగా జనం అన్న దైర్యమే వీళ్ళకు… …ఆ తర్వాత ఈకల రాజేందర్ పొగరు మోతు మాటలు చూసారా??మళ్ళీ ఒక సారి ఈకల రాజేంద్ర మాటల పొగురుబోతుతనాన్ని చూడండి…ఎవరినైనా తన్నే హక్కు మాకుందన్నట్టు వాగేడు…ఇలాంటి వెదవల్ని నడి రోడ్లో షూట్ చేసి పారేయాలి…కారణం వీళ్ళు భాద్యతా యుతమైన స్థానాల్లో ఉండి వీది గూండాల్లా ప్రవర్తించడమే…..
@సుజాత:
>> “ఏం భంగ పడ్డారు?”
హైదరాబాద్‌లోలా హల్చల్ చెయ్యలేకపోయాడు కదా. అంతోఇంతో వ్యతిరేకతైతే వచ్చింది. ఆ మేరకది భంగపాటేనని నా ఉద్దేశ్యం.
@శివరామప్రసాద్:
మీ బ్రౌజర్లో జూమింగ్ సదుపాయం ఉంటుంది ప్రయత్నించి చూడండి. వర్డ్ప్రెస్లో ఫాంట్ పరిమాణాలు పెంచాలంటే (నేను వాడుతున్న స్కిన్‌కి) చాలా పెద్ద తంతు జరపాలి. I’ll have to do some custom CSS.
@ksvc:
మన తహరాకి అవతలోడి కులంతో పనిలేదండీ. జేపీ నారాయణ ఉదంతం ఉదాహరణ.
ఒకవైపు హరీష్ రావుకి సరైన గుణపాఠమే జరిగిందనే ఆనందంతోపాటూ, అతని మీద బనాయించిన అట్రాసిటీ కేసుదగ్గర మాత్రం మీరు అంగీకరించలేని విషయం వచ్చేసరికీ విలవిల్లాడిపోతున్నారే! What a funny way of putting a post together.
హరీష్ రావు చేసింది రౌడీయిజమే. అంతమాత్రానా మొత్తం ఉద్యమన్ని తప్పుపట్టడం ఎంత దారుణమో, అట్రాసిటీ కేసు ఈ సందర్భంలో అసందర్భమైనంత మాత్రానా మొత్తంగా యాక్టిని హాస్యాస్పదం చెయ్యడమూ అంతకన్నా దారుణం. నిజానికి హీనం. This is not expected of you.
There’s nothing funny about it. My post is right to the point, and you missed it by a mile. ఇక్కడ ప్రశ్న – తన్నటం తప్పా, లేక దళితులని తన్నటం మాత్రమే తప్పా అనేది. అట్రాసిటీస్ చట్టాన్ని హేళన చేసిందెక్కడ? అది కూడదన్న వాదనా ఇక్కడ లేదే. మీరు ‘హీనం’, ‘దారుణం’ అంటూ వాపోయే బదులు చివరి పేరాలో నేనడిగిన నాలుగు ప్రశ్నలకీ బదులిస్తే బాగుండేది. That’s what’s expected of you.
ఈ ఉద్యమం (అసలిది ఉద్యమమైతే) అంతా ఒక మహా మెంటల్ వ్యవహారంగా ఉంది.
వాళ్ళే తంతారు. మర్నాడు వాళ్ళే బందుకు పిలుపు ఇస్తారు. వాళ్లే డెడ్లైన్లు పెట్టుకుని వాళ్లే రాజీనామాలు చేస్తారు. చేయకపోతే జనం తంతారని వాళ్లే చెప్పుకుంటారు. అది విని తెలంగాణ జనం “ఓహో మనం ఇప్పుడు వీళ్ళని తన్నాలి కాబోలు” అని ఐడియా వచ్చి వాళ్ళని నిజంగానే తంతారు. అలా తమని ప్రతీసారీ తమని తామే గిచ్చుకుని, గిల్లుకుని భోరున ఏడుస్తూంటారు.
తన్నేరు హరీష్ నిర్వాకాన్ని కప్పిపుచ్చడం కోసం కేసీయార్ ఫ్యామిలీ పత్రిక – కృష్ణాజిల్లాలో ఎవఱో దొంగలు తెలంగాణ భక్తుల మీద చేసిన దాడిని “మనోళ్ళ మీద ఆంద్రోళ్ళ దాడి” అంటూవిపరీతమైన పబ్లిసిటీ చేస్తోంది.
అణా కాని విలువ చెయ్యని “టి.ఆర్.ఎస్” వాళ్ళ మాటలు వినడం ఏంటో ఆత్మహత్యలు చెసుకోవటం ఏంటో. బొత్తిగా జీవితము అంటె విలువ తెలియని బ్రతుకులు బ్రతుకుతున్నారు.
అసలు హరిష్ రావుని తీసుకెళ్లి బొక్కలొ పడేసి నాలుగు తంతె వాదికి కూడ భయము వుంటుంది. వీళ్ళకి భయము లేకనె ఈ తంటాలన్ని.
where has gone our posts……………? 🙂
Your language wasn’t appropriate. So I had to remove your comments along with the discussion that followed. Please refrain yourself from using abusive language. As long as you follow that simple rule, your opinions are most welcome no matter how different they are from mine.
HI
అంత బావుంది బాసు మనం ప్రతి 5 సంవస్తరలకు Elections పెత్తి బొలెదు Kotlu కర్చు పెత్తి MLA లను MP లను ఎన్నుకుంతం కద.
మరి తెలంగన విషయం లొ కూద వొతింగ్ పెత్తమని అదగొచుగ మీరు (మెము కూద) అది మానెసి బందు లంతం రస్త రొకొలు అంతం సకలజన సమ్మెలంతం రైల్ రొకొలు అంతం బస్సు రొకొలు అంతం మన ఆస్తులను మనమె తగలబెత్తు కుంతం .ఆత్మ హత్యలు చెసుకుంతం
దరిద్రపు ఎదవలు అందరుకలిసి సమైక్యంద్ర AND టెలంగన ఉద్యమల్లొ ఉన్నతున్నరు ఒక్కదు logical గ ఆలొచించదు.
ఎమొ వాల్లకు ఎమైన స్వప్రయొజనలు ఉన్నయెమొ తెలియదు బాసు తెలంగన ఇవ్వలొ వద్దొ Election పెత్తమను.
టెలంగన ఒక్కదంత్లొనె Election పెదితె 80% మంది తెలంగన కావలంతె ఇచెయ్యమని అందరు పొరదదం
మొత్తం అంద్రప్రదెష్ లొ అయితె 60% ఒప్పుకుంతె తెలంగన ఇవ్వమని పొరదదం అంతెకాని మన ఆస్తులను మనమె పాదు చెసుకొవదమొ లెక మన సొదరులను (సీమంద్ర OR టెలంగన) మనమె కొత్తుకొవదమొ మూర్కత్వం ల లెదు
ఇంక 80% మీద నీకు doubt రవొచు కాని అది correct ఎందుకంతె మల్లి మర్చుకొలెని నిర్నయం కాబత్తి.అందరు
బాసు ఇకనైన లొగిచల్ గ aalochiddam.
మీ సలహా బాగుంది. నిజానికి, సమస్య హైదరాబాద్ గురించి కాబట్టి ఆ మహానగరం వరకూ ప్లెబిసైట్ నిర్వహిస్తే సరిపోతుంది. నగరవాసుల అభిప్రాయం ఏమిటి – తెలంగాణలో ఉంటారా, ఆంధ్ర ప్రదేశ్‌లో ఉంటారా, లేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటారా అనే ఆప్షన్స్ ఇచ్చి, ఆ మూడిటి లాభనష్టాలనూ వివరించి ఏది కావాలో వాళ్లనే అడిగితే పోలా? హైదరాబాద్ ఎవరిదో వీళ్లూ వాళ్లూ కాదు నిర్ణయించాల్సింది. ఆ నగరంలో నివాసం ఉండే ప్రజలు. మొన్నీ మధ్యనే కాంగ్రెస్ తెలంగాణ నాయకులు వాళ్ల హైకమాండ్‌కి ‘హైదరాబాద్‌లో ఉండే సీమ/ఆంధ్రా ప్రజల సంఖ్య ఐదు లక్షలకి మించదు’, ‘నగరంలో వాళ్ల పెట్టుబడులేవీ లేవు’ అని నివేదికలేవో ఇచ్చారు కూడా కదా. కాబట్టి ఈ రకమైన ప్లెబిసైట్ పెడితే సీమ/ఆంధ్రా ప్రజల మందబలంతో ఆంధ్ర ప్రదేశ్‌కి అనుకూలంగా తీర్పిచ్చేస్తారనే భయమూ ఉండదు. (ఆ నివేదిక తప్పంటారా? అలాగైతే తెలంగాణ విషయంలో వేర్పాటువాదుల ఇతర వాదనలూ తప్పే అనుకోవాలి. అప్పుడిక ఈ ఉద్యమానికి అర్ధమే లేదు. అదే మొదట్నుండీ నాలాంటోళ్లు మొత్తుకుంటుంది)
ఓ తెలంగాణ పోరాటయోధురాలు-తెలంగాణ వస్తే దొరల రాజ్యమే!
ఏ దిక్కుమాలిన న్యూస్ చానెల్లోనొ ఎదో ఆశించి చేసిన ఇంటర్వ్యూ కాదు. సూటిగా వాస్తవాలని నిజాయీతీగా, తెలంగాణా వస్తే ఏమి జరుగుతుందో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఒక స్వాతంత్ర సమరయోధురాలి బంగారమంటి మాటలు-తూటాలు.దయచేసి విడియో పూర్తిగా చూడండి. http://youtu.be/V-iPAzDNB6s