కలాపోసన – 7

ఈ మధ్య రాయటం మీదనుండి గీయటం మీదకి గాలి మళ్లింది. ఏళ్ల కిందట అవతల పడేసిన పెయింటింగ్ సరంజామా దుమ్ము దులిపే ఓపిక లేక, డిజిటల్ యుగానికి తగ్గట్టు ఐప్యాడ్ మీద బొమ్మలేయటం సాధన చేద్దామనుకుంటూ ఓ చిన్న ప్రయత్నం చేస్తే ఇదిగో, ఇలా వచ్చింది. వేళ్లతో రంగులద్ది బొమ్మలేసే ప్రక్రియని ఫింగర్ పెయింటింగ్ అంటారు. ఐప్యాడ్ వంటి టచ్‌స్క్రీన్ సాధనాల మీద వేసే బొమ్మల్నీ అలాగే వ్యవహరిస్తుంటారు (అన్నట్టు, మీరెప్పుడన్నా నఖ చిత్రాల గురించి విన్నారా? అలనాటి ఆంధ్రపత్రికల్లో విరివిగా కనిపిస్తాయవి). కానీ నేను వేసింది ఫింగర్ పెయింటింగ్ అనకూడదేమో – వేళ్లకి బదులుగా స్టైలస్ వాడాను కాబట్టి. పేరేదైనా, ప్రయత్నం మాత్రం బహు సరదాగా అనిపించింది. బొమ్మ కూడా బ్రహ్మాండంగా కాకపోయినా ఫర్లేదనిపించేలా వచ్చింది.

సంప్రదాయకంగా వేసే ఆయిల్ పెయింటింగ్స్‌తో ఈ సాంకేతిక ప్రక్రియని పోల్చకూడదేమో కానీ, కొన్ని విషయాల్లో మాత్రం ఈ విధానం చాలా సౌకర్యవంతంగా అనిపించింది. రంగులు కలుపుకునే అవసరం లేకపోవటం,  అవి ఆరిపోయేలోగా పెయింటింగ్ పూర్తి చేయాలనే వత్తిడి లేకపోవటం, ఒక్కో లేయర్‌కీ మధ్య రంగులు ఆరేదాకా నిరీక్షించే పనిలేకపోవటం, పదే పదే కుంచెలూ ఇతర సామగ్రీ కడుక్కునే బాధ తప్పటం, పొరపాట్లు చేసినా తేలిగ్గా దిద్దుకునే వెసులుబాటుండటం, వగైరా, వగైరా. వీటన్నిట్నీ మించి నన్ను ఆకట్టుకున్న విషయం మరోటుంది: నేను వాడిన ‘బ్రషెస్’ అనబడే సాఫ్ట్‌వేర్ మనం గీసిన ప్రతి గీతనీ వివరంగా గుర్తు పెట్టుకుని ఒకదాని వెంట ఒకటిగా – సినిమా లాగా – వాటన్నిట్నీ తిరిగి ప్రదర్శించటం.  కింద కనిపిస్తున్న రెండు నిమిషాల నిడివి క్విక్‌టైమ్ మూవీ ఆవిధంగా రూపొందించిందే. ఇంకెందుకాలస్యం? ప్లే బటన్ నొక్కండి, ఈ వర్ణచిత్రం ఎలా గీయబడిందో వివరంగా చూడండి.

(పాత కలాపోసనలు: మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది)

10 స్పందనలు to “కలాపోసన – 7”


  1. 1 Rao Lakkaraaju 5:48 సా. వద్ద జూలై 13, 2011

    మొదటి ప్రయత్నం చూడటానికి బాగానే ఉంది. ముందు ముందు ఇంకా మంచి మంచివి చూద్దామని ఉంది.

  2. 2 nestam 8:38 సా. వద్ద జూలై 13, 2011

    చాలా చాలా చాలా * 1000 times వేసుకోండి… భలే బాగుంది 🙂

  3. 3 కన్నగాడు 2:21 ఉద. వద్ద జూలై 14, 2011

    డిజిటల్ యుగమో అనలాగ్ యుగమో ఏదైతేనేమి కాని, మొత్తానికి నిద్రపోతున్న కళని లేపి పోషిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలి అనుకుంటూ…

  4. 5 వేణూశ్రీకాంత్ 4:45 సా. వద్ద జూలై 14, 2011

    హ హ హ కథలే అనుకున్నాను బొమ్మల్లో కూడా ఆత్మలు ప్రేతాత్మలు థ్రిల్లర్లు వదలరా డెవిల్స్ టవర్ ఏంటండీ 😛 సరదాగా అంటున్నాను..
    బొమ్మ బాగుంది 🙂 ఎలారూపుదిద్దుకుందో తెలిపే వీడియో మరింత బాగుంది..

  5. 6 Vasu 9:35 సా. వద్ద జూలై 19, 2011

    ” బొమ్మ కూడా బ్రహ్మాండంగా కాకపోయినా ఫర్లేదనిపించేలా వచ్చింది”

    కరెష్టుగా చెప్పారు.
    అందరూ “అదేం కాదు” అంటారని కదూ 🙂

  6. 7 kranthigunnam 6:41 ఉద. వద్ద జూలై 20, 2011

    రాతలతోనే కాదు గీతలతో కుడా అలరించారు ఎప్పటిలానే 🙂

  7. 8 వేణూశ్రీకాంత్ 9:31 ఉద. వద్ద జూలై 30, 2011

    పెయింటింగ్ గురించి నాకు ఓనమాలు తెలియవు.. గూగులిస్తే దొరికిన విషయం ఇదీ.. ఈ సమాచారం సౌమ్యగారి బ్లాగ్ లో మీరు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తుందేమో చూడండి..
    http://www.explore-drawing-and-painting.com/oil-pastel-painting.html

  8. 10 venkat 10:58 ఉద. వద్ద డిసెంబర్ 25, 2011

    god elagi melo unna kalala nu kalakaruda nu nedralepandi


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: