మూడేళ్లు

మూడేళ్లంటే ఇరవయ్యొకటి కాదు. త్రీ ఫింగర్స్ కూడా కాదు. త్రీ ఇయర్స్. మూడు చెవులు కాదు భాయియోఁ అవుర్ బెహెనోఁ. మూడు ఏడాదులన్న మాట. ఎప్పటికి? నిన్నటికి. దేనికి? ఈ బ్లాగులు గిలకటమూ అదీ నేను మొదలెట్టి. ఐతే ఏంటిష? టిష లేదూ, త్రిష లేదూ. ఊకినే. సింహావలోకనంమరో వసంతం అంటూ సంవత్సరం నిండినప్పుడల్లా ఆ ఏడాదిలో ఏం పొడిచేసిందీ రాసేసి మీ అసుంటోళ్ల మొహానేసే అలవాటొహటి జేసుకున్నాం గదా. మీరూ ఏఁవనుకోకండా చదివేసి పెద్దరికంగా ప్రోత్సహించేస్తన్నారు గదా.  మరి, మీరు మళ్లీ పెద్దరికం జూయించే అవకాశమియ్యాలా వద్దా? అంచాత కొంత సొంత డబ్బా నింపిన సోదన్న మాట.

మొదటేడాది నూట నాలుగు టపాకాయలు పేల్చాం. రెండో ఏడాదవి అరవైకి తగ్గాయి. మూడో ఏడాది పన్నెండుకి పడిపోయాయి . అంటే నెలకో పోటు పొడిచామన్నమాట. మొదట్లో సూపర్ స్టార్ కృష్ణలా శివాలెత్తిపోయి మూడ్రోజులకోటి విడుదల చేసేశాం. అక్కడ్నుండి రాజేంద్రప్రసాద్ రోజులకొచ్చాం. ప్రస్తుతం మహేష్ బాబు తరం కాబట్టి కాలానికి తగ్గట్లు పోతున్నామన్నమాట. టపాల తరచుదనం తగ్గింది. చురుకుదనం, కరకుదనం మాత్రం తగ్గలేదనే అనుకుంటున్నా. నిజమో కాదో చెప్పాల్సింది మీరు. ఆ పన్నెండు పోట్లలో కొన్ని: అరాచకం, పుచ్చకాయ – ఓ సచ్చినోడి లవ్ స్టోరీ, ప్రవాసం – 1, పేడ బిరియానీ, ఉత్తుత్తమ కథలు, స్పందన.

ఈ ఏడాదిలో ఓ శుభోదయాన పొలోమని  ‘ప్రవాసం’ పేరుతో టపాల పరంపర మొదలెట్టాను కానీ దానికి ఆదిలోనే హంసపాదడింది. రాసుకుంటూ పోతే ఎన్ని భాగాలవుతుందో నాకే ఓ అంచనా లేకపోవటం ప్రధాన కారణం. సీరియల్ తరహాలో రాసే ఓపిక లేకపోవటం మరో కారణం. మొత్తానికది మొదటి భాగంతోనే మూలన పడింది. మళ్లీ ఎప్పుడన్నా మూడొస్తే రాస్తానేమో చూడాలి.

రెండేళ్ల కిందట కథలొండే పనిలోకి దిగాను. ఇందాకా నే రాసిన వాటిలో నాగరికథ జగమెరిగిన బ్రామ్మడు. అది ‘కథ-2009’, ‘వర్తమాన కథ’ అనబడే రెండు సంకలనాలకు ఎంపికయింది. ఆయా సంకలనకర్తలకు ధన్యవాదాలు. పోయినేడాది రాసిన రెండు కథల్లో మరో ప్రపంచం అమెరికానుండి వెలువడే ఒకానొక సంకలనంలోకి ఎంపిక్కాగా, ‘కల్కి’ పేరుగల పెద్ద కథ సాక్షి ఫన్‌డేలో రెండు భాగాలుగా ప్రచురితమయింది (మొదటి భాగం, రెండవ భాగం). నాలుగైదు కథలతో నేనో పాపులర్ రచయితనైపోయాయన్న అపోహ లేదు. కథకుడిగా నావింకా తప్పటడుగులేనన్న స్పృహే ఉంది. ఆవగింజంత గుర్తింపైతే వచ్చింది. అందుకో ఏమో, తమ కథల పోటీలకీ, ప్రత్యేక సంచికలకీ వాటికీ ఏదన్నా రాసి పంపమని ఇద్దరు ముగ్గురడిగారు. ఎంపిక చేసిన కథాంశాలకి ఫలానా తేదీలోపు రాయటం నాకు చేతనయ్యే పని కాదు కాబట్టి ఆ విజ్ఞప్తుల్ని సున్నితంగా తిరస్కరించాను. ప్రస్తుతానికైతే నా ధోరణిలో ఓ కథ రాస్తున్నాను. ఎప్పటికయ్యేనో ఎవరికెరుక? ఈ సారి సైన్స్ ఫిక్షన్ కాదు. నా మూస నేనే ఛేదించుకునే ప్రయత్నమిది.

మూసంటే గుర్తుకొచ్చింది. నా కథలన్నీ ఓ రకం మూసలోకి జారుకుంటుండటం ఈ ఏడాదిలో నేను గమనించిన విషయం. కథలన్నీ ఉత్తమ పురుషంలో నడవటం, ఏ పాత్రకీ పేరుండకపోవటం, స్త్రీ పాత్రలు లేనే లేకపోవటం, కథ ఇతివృత్తానికి కాలంతో ఏదో ఓ రకంగా సంబంధముండటం, కథలో ఓ మరణం ఉండి తీరటం, చివర్లో ఓ ట్విస్టుండటం, కథానాయకుడే అనుమానితుడిగా తేలటం … ఇత్యాదివన్న మాట. వీటి మూలాన, నా మిగతా కథలు చదివిన పాఠకులు/రాళ్లు తాజా కథ చివర్లో ఏమవబోతుందీ ముందే చూచాయగా ఓ అంచనాకొచ్చేయటం గమనించాను. (ఇంతకీ – చివర్లో ఏమవబోయేదీ కథ నిండా క్లూస్ ఉన్నా, వాటినిబట్టి కాకుండా కేవలం రచయిత పేరుని బట్టి ముగింపు ఊహించటం అంటే రచయిత విఫలమయినట్లా, చదువర్లు విఫలమైనట్లా?)

ఆరున్నొక్క సూత్రాలు ఈ ఏడాదీ పాటించాను. ఒకరిద్దరు బ్లాగర్లతో మాత్రం కొంచెం పరిచయం కలిగింది. ఇరుగు పొరుగు బ్లాగిళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి పోయింది. కూడల్లోకి తొంగి చూట్టమూ కరువైపోయింది. ఇతర బ్లాగుల్లో కామెంట్లు రాయటం అత్యంత అరుదైపోయింది. నా బ్లాగులో వ్యాఖ్యానించిన వారికి బదులివ్వటమూ ఆగిపోయింది. అది తలపొగరుతో కాదు. పేరుపేరునా థాంకులు, థాంకులు అంటూ ఏం చెబ్తాంలే అన్న బద్ధకంతో. అప్పటికీ పొడుగాటి సమాధానాలివ్వాల్సిన సందర్భాల్లో ఇస్తూనే ఉన్నా. మీ మీ కామెంట్లకి తరచూ బదులీయటం లేదని అలగమాకండి. మీ సమయం వెచ్చించి నా రాతలు చదువుతున్నందుకు, వ్యాఖ్యానిస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు, విమర్శిస్తున్నందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

బ్లాగుల్లో రెండు మూడేళ్ల కిందున్నంత ఆరోగ్యకరమైన వాతావరణం (ఇదో సాపేక్ష పదం) ఇప్పుడు లేదు. అంత ఆసక్తికరమైన టపాలూ ప్రస్తుతం రావటం లేదు. వచ్చినా నా కళ్లబడటం లేదు. మొత్తానికి తెలుగు బ్లాగుల పరిస్థితేం బాగులేదు. బ్లాగులు సాహితీ సేవా కేంద్రాలు కానక్కర్లేదు. బజారు భాషా పరిజ్ఞాన  ప్రదర్శనాంగణాలు కాకుంటే చాలు. అవనే అయ్యాయి. ఇక చేసేదేం లేదు.

ఈ ఏడాదిలో కొన్ని సరదా కామెంట్లొచ్చి పడ్డాయి నా బ్లాగులో. వాటిలో ఒకటి, నన్ను తెగ నవ్వించింది: శ్రీ ఏసుక్రీస్తుడు చదివి ‘మా మతాన్ని కించపరుస్తున్నావు. నువ్వు పురుగులు పడిపోతావు’ అన్న వ్యాఖ్య (అసలు దీవెనలు ఇంతకన్నా నాగరికమైన భాషలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రచురించకుండా దాచుకున్నాను). అదే టపా గురించి, ‘రాఘవేంద్రరావు గారు హిందూ మతాన్ని కించపరుస్తూ సినిమాలు తీస్తే మీరు ఆయన మీద కోపంతో క్రిస్టియన్లని కించపరుస్తూ టపా రాయటం అస్సలు బాలేదు’ అన్న అమాయకురాలొకావిడ! ఆ హాస్య టపాని ఈ రకంగా కూడా అర్ధం చేసుకునేవాళ్లుంటారని తెలిసొచ్చిన సందర్భాలవి. భారతీయం వంటి టపాలు చదివి నన్ను దీవించిన హిందూ మతోద్ధారకులు ఓ రకమైతే, ‘శ్రీ ఏసుక్రీస్తుడు’ చదివి అక్షింతలేసిన క్రైస్తవ సోదర సోదరీమణులు ఇంకో రకం. అందరికీ నచ్చేలా ఉండటం నా తరమా? తరమయ్యెనుబో, అది నాకవసరమా?

అందుకే, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అలాగే బండి లాగించుకెళుతున్నా.

15 స్పందనలు to “మూడేళ్లు”


  1. 1 Anuradha 9:32 సా. వద్ద మే 9, 2011

    అందరికి నచ్చేలా ఉండటం మీ తరమే కాదు,ఎవ్వరి తరమూ కాదు.అందుకని మీరు మీలాగానే ఉండండి.చదవాలి అనిపించేలా రాసే అతి కొద్దిమంది బ్లాగర్లలో మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.మీ బ్లాగ్ పాపాయి కి జన్మదిన శుభాకాంక్షలు.

  2. 2 జాజిశర్మ 11:16 సా. వద్ద మే 9, 2011

    “రేయ్! నీకున్నది లాప్ టాపో, డెస్కు టాపో తెలీదు గాని, టాపులేపావుగదట్రా! అప్పారావూ!! టాపిక్కేలేకుండా, ఇలారాసుకు పోకురా! రేయ్” అని
    కూకెలేద్దామనుకుంటే, పరిచయం లేదు కదా.

    ప్రియఅక్షరాలామేజికోడా!
    అబ్రకదబ్ర అంటే, అక్షరాల మేజికోడని రెండుజెళ్ళ సీత మొన్నో అప్పుడెప్పుడో ఓజీడిచ్చిజెప్పిందిలే. “ఛీ! ఇలాంటివి తినకబోకురా!
    రోగాలొస్తాయి” అని నాచేతుల్లోంచి లాక్కెళ్ళింది సీగానపెసునాంబ. “ఆ పక్కెళ్ళి, బాబాయిగాడితో కలిసి జుర్రుకుంటుందని,
    నాకు బోల్డంతనుమానంలాంటి ఖోపంమొచ్ఛసింది. కాసింత ఏడుపొచ్చింది కాని, రెండుజెళ్ళ సీతగాని,
    సీగానపెసునాంబగాని చూస్తారని, మింగేశా. ఇంతకీ నే చెప్పొచ్చేదేటంటేరోయ్! కాసింత అక్షరాలతో
    మేజిక్ చేసే నీ అసుంటోళ్ళు, ఇంట్లో ఒత్తునే తినితొంగుంటే , కాసింత కలాపోసన నాఅసుమంటోళ్ళు
    చేసేత్తాం, తెలుఘోళ్ళు, నిఝంఘా ఘొల్లుమంటారు. –జాజిశర్మ రోయ్

  3. 3 ఆ.సౌమ్య 12:02 ఉద. వద్ద మే 10, 2011

    మీరు బాగా రాస్తారు ఎందుకంటే మీకునచ్చినట్టుగా రాస్తారు కాబట్టి. ఇతరులకి నచ్చినట్టుగా రాసుంటే ఇంత “బాగు” ఉండదేమో!. కాబట్టి అదే శైలిలో కొనసాగిపొండి. మళ్ళీ మళ్ళీ వసంతలు పూయిస్తూ ఉండండి. All the best!

  4. 4 సిరిసిరిమువ్వ 12:58 ఉద. వద్ద మే 10, 2011

    అభినందనలు. నిజమే మీ బ్లాగులో టపాల తరచుదనం తగ్గింది కాని చురుకుదనం..కరకుదనం మాత్రం తగ్గలేదు. బ్లాగు అన్నది మన వ్యక్తిగతం అయినప్పుడు అందరికి నచ్చేలా ఎందుకుండాలి..మనకి నచ్చేలానే ఉండాలి. ఇలానే మీదైన శైలిలోనే వ్రాస్తుండండి.

  5. 5 Ruth 1:16 ఉద. వద్ద మే 10, 2011

    Hmm…. I did read the post on Christ and did feel a bit skeptical about choosing JC for the post but from your/your-post’s point of view it was apt. But yes, there is a very high chance of people being hurt about it ’cause you see there is a very thin line beyween comedy and abuse and your post did have a lot of edge on it’s own and the comments didn’t help much too.
    What is new to me is, that there is any christian crowd who reads/responds for such posts. But I think you did made your life easier with out missing any punch in your post by choosing Christ. If only you would have taken any other hindu god, I’m sure the numbers of applauding and cursing comments woud have deffinitely been reversed and the point of your post would wholly been missed by the majority.
    Oh btw, all the best for your future blogging.
    -Ruth

  6. 6 nestam 2:13 ఉద. వద్ద మే 10, 2011

    అప్పుడే మూడేళ్ళు అయిపోయాయా 🙂
    అభినందనలు.. మరీ 12 పోస్ట్ లు వేసారా ?ప్రవాసం ఏం పాపం చేసిందని ఒక్క ఎపిసోడ్ తో ఆపేసారు… ఈ ఇయర్ ఎలాగో ఇంట్రెస్ట్ తెచ్చుకుని రాసేయండి ప్లీజ్ . మీ బ్లాగ్ ద్వారానే తెలుగు బ్లాగ్ ప్రపంచం నాకు తెలియడం వల్లనేమో మీ బ్లాగ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం .అంటే మీ శైలి కూడా నాకు చాలా బాగా నచ్చేస్తుంది .మీ కధల్లో కామన్ గా ఉన్న విషయాలు భలే చెప్పారు.. అన్నట్లు ఈ ఇయర్ కనీసం 10 కధలు రాయాలంతే మీరు 🙂

  7. 7 chinni 4:03 ఉద. వద్ద మే 10, 2011

    nenu thppakunda chusi chadive blog listlo meedi okati .

  8. 8 వేణూశ్రీకాంత్ 8:16 ఉద. వద్ద మే 10, 2011

    అభినందనలు అబ్రకదబ్ర గారు… వచ్చే ఏడాది టపాలు ఎన్ని రాసినా కనీసం నెలకో కథన్నా రాస్తారని ఎదురుచూస్తున్నాను.

  9. 9 G 9:53 ఉద. వద్ద మే 10, 2011

    తెలుగోళ్ళు గిల్లుకుంటూనే ఉన్నారు రోజూ, అబ్రకదబ్ర (అబ్ రఖా dab రా) గారు తోకలు కత్తిరిస్తూనే ఉన్నారు. ఎన్ని టపాలు వేశారన్నది కాదు ముఖ్యం, అసలంటూ వేశారా లేదా అన్నది ముఖ్యం. తెలుగు బ్లాగర్లలో ఈనగారి పోస్టెప్పుడొస్తుందా అని ఎదురుజూసేలా చేసేవారిలో మీరే నంబరు వన్ను. చాలా మంది ఎవరెవరి స్టైళ్ళలో వాళ్ళు సెటిలయి మోనటోనస్ గా తయారైనా, మీరు కూడా మీ సిగ్నేచర్ ని పసిగట్టగలిగేలా వ్రాసినా, రీడబిలిటీ మిస్ అవటం లేదు సె’బాసు’. I wish you more productive times ahead.

    “ఆవగింజైత” Typo? 😮
    *** *** ***

    ఇంతకీ – చివర్లో ఏమవబోయేదీ కథ నిండా క్లూస్ ఉన్నా, వాటినిబట్టి కాకుండా కేవలం రచయిత పేరుని బట్టి ముగింపు ఊహించటం అంటే రచయిత విఫలమయినట్లా, చదువర్లు విఫలమైనట్లా?

    The answer is obvious 😀

    హ్మ్! ఒక్క మాట చెప్పి ముగిస్తాను!

    అయన్ రాం౨డ్ ను ఎవరో మీరు మర్డర్ మిస్టరీలు ఎక్కువ వ్రాయరెందుకు అని అడిగితే చెప్పిన సమాధానం… “Do you think,” Ayn Rand answered, “that I would ever give the central action in a story of mine to anyone but the hero?”

    అదన్నమాట సంగతి.

    టెల్ గూఫ్స్ కతల గురించి మీరు బద్దలు కొట్టిన కుండ ఇంకా పారెయ్యక ముందే ఈ మధ్యొచ్చిన కతల పోటీ ఫలితాలు మీ వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయి. బాగుపడాలని కోరుకుంటూ…

    సె’లవ్’

    JC fan association సెగట్రీ, (మీరు సెల్ఫ్ డిక్లేర్డ్ అద్దెచ్చులు గనుక :D)

  10. 11 Geeta 9:42 సా. వద్ద మే 10, 2011

    గీతాచార్య గారు తిరిగి రంగప్రవేశం చేసినట్టున్నారు? G పేరుతో?

  11. 13 Deepa 7:15 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2012

    నేను కూడా ఆవేశంగా బ్లాగుదామని బ్లాగు తెరిచాను..ఒక్క టపాతోనే దాని ప్రస్తానం ఆగిపోయింది.. Nice post. Congrats.

  12. 14 vaishnavi devi 8:32 ఉద. వద్ద డిసెంబర్ 18, 2016

    Hi Anil garu. Nenu meeku pedda fan andi. nenu chadivina mee first story Kalki. chala different ga anipinchindi. next week edition kosam week anta wait chesanu. telugulo science fiction rayadam bagundi. mee padala vadakam chala kuduruga untundi. meeru inka kadhalu rayandi


Leave a reply to Ruth స్పందనను రద్దుచేయి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,992

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.