బిన్ లాడెన్ అంతంపై ఎవరేమన్నారంటే ….
హరీష్ రావు: ఇది ఆంధ్రోళ్ల కుట్ర.
కేసీయార్: నిజాం కన్నా గొప్పోడా లాడెన్? వాడి చచ్చుడి గురించి చర్చేంది? తెలంగాణ ఇస్తరో ఇయ్యరో తేల్చుండ్రి.
కోదండరామ్: పాకిస్తాన్‌కి చెప్పకుండా లాడెన్‌ని చంపటమంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలని అవమానించటమే. దీనికి నిరసనగా ట్యాంక్‌బండ్ మీద రెండువేల మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం.
రాజ్ న్యూస్: ఆదివారం అర్ధరాత్రి ఫలానా సమయంలో ప్రసిద్ధ తీవ్రవాది లాడెన్ చచ్చిండు. ఆ విషయం అమెరికా అధ్యక్షులు శ్రీ ఒబామా గారు వెల్లడించిండ్రు. అది విని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు సంబరాలు జరుపుకుండ్రు.
ఉస్మానియా జాక్: ఇది తెలంగాణ విద్యార్ధుల తొలి విజయం.
జాక్ ఆఫ్ ఆల్ తెలంగాణ జాక్స్: లాడెన్ చచ్చుడయింది. తెలంగాణ ఇచ్చుడే మిగిలింది.
ఆంధ్రా జాక్: ఈ సందర్భంగా ఒబామాని అభినందిస్తూ ఆయనకి బిర్యానీ పొట్లాలు పార్సిల్ చేస్తున్నాం.
బాబు: బిన్ లాడెన్ అంతం రాష్ట్రంలో తెలుగుదేశం బలంగా ఉందనేదానికి సాక్ష్యం. ఉపఎన్నికల్లో గెలుపు మాదే.
జగన్: మా నాన్నే ఉండుంటే లాడెన్ ఎప్పుడో పోయుండేవాడు. ఇది ప్రభుత్వ అసమర్ధతే.
రాహుల్: లాడెన్ హతమవటం నిస్సందేహంగా మా నాయనమ్మ ఘనతే.
మన్మోహన్: సోనియానడిగి చెబుతా.
సోనియా: సీడబ్య్లూసీలో చర్చించాకే చెబుతాం.
శంకర్రావు: మీకెందుకు చెప్పాలి? అధిష్టానానికే లేఖ రాస్తా.
చిదంబరం: ఏం చెప్పాలో తేల్చటానికి జస్టిస్ శ్రీరామ కమిటీ వేశాం.
జస్టిస్ శ్రీరామ: లాడెన్ మద్దతుదారులు, వ్యతిరేకులు అందరూ సంతోషించేలా మా ప్రకటన ఉంటుంది.
లాయర్ సన్యాసిరావు: ప్రభుత్వం వెంటనే ఏదో ఒకటి చెప్పాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ వేస్తున్నా.
సుప్రీం కోర్టు: ‘పిల్లులంటే అంత చులకనయ్యాయా’ అని లాయర్ సన్యాసిరావుకి అక్షింతలు వేస్తున్నాం.
బీజేపీ: ముస్లిముల ఓట్లు పోతాయనే కాంగ్రెస్ ఎటూ చెప్పకుండా నానుస్తుంది. ఈ ప్రభుత్వమ్మీద అవిశ్వాస తీర్మానం పెడతాం.
జేపీ: ఆటగాళ్లు మారితే లాభం లేదు. ఆట నియమాలు మారాలి. వ్యవస్థ మారాలి. మీరు మారాలి. నేను మారాలి. మనందరం మారాలి. మిగతావాళ్లూ మారాలి. అప్పుడు మార్పు దానంతటదే వస్తుంది.
కంనిష్టులు: సోవియెట్లని తిప్పలు పెట్టిన ఒసామా పోయినందుకు సంతోషిస్తూ, అమెరికాని అల్లాడించిన లాడెన్ పోయినందుకు విచారిస్తున్నాం.
ఒబామా: మరే, లాడెన్‌ని లేపేశాగా. వచ్చే ఎన్నికల్లో మీ ఓటు నాకే వెయ్యాలేం?
జర్దారీ: అర్రె. లాడెన్ అమెరికాలో దాక్కున్నాడనుకున్నాం. ఇక్కడున్నాడా!
గిలానీ: అర్రెర్రె. ఇతనా లాడెన్? రోజూ నాతో టీ తాగటానికొస్తాడు. ఇతనే లాడెన్ అంటే నమ్మలేకున్నా!!
పాక్ సైన్యం: అమెరికన్లు మాకీ దాడి సమాచారం ముందే అందించుంటే (లాడెన్‌కి) మరింత సహకరించుండేవాళ్లం.
రామ్ గోపాల్ వర్మ: బిన్ లాడెన్ ఎవరు?
రాజశేఖర్: నానూ, జీవిదా డెమొగ్రడిగ్ పార్టీలో జాయినయ్యే విషయం ఒబామాతో డిస్కస్ సేసేటప్పుడే ఇంద న్యూస్ తెలిసినాది. అపురమా, ఇరువురం ఒబామాకి కంగ్రాట్స్ సెప్పేసి, మరుపడియం కల్సుదామని సెప్పేసి వచ్చి పూడ్సినాం.
చిరంజీవి: అల్ ఖైదా ప్రతీకార దాడులకి దిగుతుందని అమెరికా భయపడనవసరం లేదు. అవసరమైతే నేను మద్దతిచ్చి ఆదుకుంటా.
పోసాని: నేను ప్రధాన పాత్రలో ‘మెంటల్ లాడెన్’ సినిమా తీస్తున్నా.
కల్యాణ్ రామ్: నేను కూడా అదే సినిమా తీస్తున్నా. పేరు ‘కల్యాణ్‌రామ్ మెంటల్ లాడెన్’
ఉపేంద్ర: నేనూ అదే పాత్రలో నటిస్తూ సినిమా తీస్తున్నా. ఇందులో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో నేనొక్కడ్నే ఉంటా కానీ నేనెక్కడా కనపడను. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు.
బాలకృష్ణ: నాన్సెన్స్. లాడెన్‌ని అమెరికా మట్టుపెట్టటమేంటి? రామకృష్ణ, మోహనకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, సాయికృష్ణ, శంకరకృష్ణ .. అహ .. ఇలా అరడజనుమంది కృష్ణలు పుట్టీ పుట్టగానే మట్టి తినటం మొదలెట్టితే అది చూసి తట్టుకోలేని మానాన్న ఈ సారి పుట్టేవాడు మట్టి తినిపించేవాడూ, మట్టి కరిపించేవాడూ కావాలే తప్ప మట్టి తినేవాడు కాకూడదని పెట్టాడురా నా పేరు బా….లకృష్ణ అనీ. అహ. మట్టి కరిపించినా మేమే, మట్టుపెట్టినా మేమే. మైండిట్.
మార్తాండ: మొన్న కలిసినప్పుడు రంగనాయకమ్మ పుస్తకాలిచ్చి చదవమన్నాను. చదవలేదు. అందుకే దిక్కులేని చావు చచ్చాడు.
Hilarious… ఎలావస్తాయండీ బాబూ మీకీ అవిడియాలు.
LOOOOOOOL :)) Too good!!!!
మార్తాండ could also be:
ఒసామాను చంపి ఫోటోలు దాచేస్తే నేను భయపడతానని ఒబామా అనుకున్నాడు. చెప్పకుండా 500 సార్లు దాడిచెయ్యటం ఒబామా స్టైల్ కదా. మా పక్కింటాయన ఆ వీడియో చూసి ఆడవాళ్ళు లేని ఆపరేషన్ స్త్రీస్వామ్యానికి విరుధ్ధమని చెప్పాడు.
ha ha too good !
అన్నీ బాగున్నాయి. ప్రత్యేకంగా తె లంగా లవి, కం నిష్టులవి.
ఇది అన్నింటికన్నా టాప్:
గిలానీ: అర్రెర్రె. ఇతనా లాడెన్? రోజూ నాతో టీ తాగటానికొస్తాడు. ఇతనే లాడెన్ అంటే నమ్మలేకున్నా!! :))
శంకర్రావు “మీకెందుకు చెప్పాలి? అధిష్టానానికి రాస్తా” (అని కోపం ఆపుకోలేక పక్కనున్న సెక్రటరీ చెంప పగలగొట్టాడు) అని ఉండాలి :-))
చిరంజీవి, బాలకృష్ణల స్పందన కూడా ఊహించినట్టే ఉంది.
అవునూ, తెలుగోడి స్పందన ఏమిటింతకీ?
తెలుగోడి స్పందనంతా చదివేసి తీరిగ్గా తెలుగోడి స్పందనేంటంటారేంటండీ!!
HAA HA HA HA HA HA 🙂 🙂 🙂 🙂 🙂 🙂
రచ్చ బాబోయి.. కేకలు… అరుపులు…. ఆర్తనాదాలు…
సూపరండీ… 😉
Wonderful. Too funny. పరకాయ ప్రవేశమంటే ఇదే.
🙂 🙂 మీ బుర్రను కాసేపు అద్దెకు ఇవ్వడి ప్లీస్…ఇంత బ్రహ్మాండమైన ఐడియాస్ మీకే వస్తాయండి….enjoyed every line of it…
F A N T A B U L O U S
గిలాని స్పందన అద్భుతం. అలాగే కోదండరామ్, చిరంజీవి, ఉపేంద్ర, బాలకృష్ణ స్పందనలు కూడా…
కిరణ్ కుమార్: రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తోందనడానికి నిదర్సనం ఒసామా బిన్ లాడెన్ చావు.
నరసింహన్: ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వానికి గోప్యంగా నివేదించా.
Hilarious..
hahahhah….too good 🙂
అదరగొట్టారు మాస్టారు .. నవ్వపోకోలేక పోతున్న 😀 😀
లాడెన్ పోయాక(పోయాడా?) ఒక సీరియస్ పోస్ట్ వేస్తారేమో అనుకున్నా! క్యామెడీతో చంపారు.


ఇరగాదీసారండి బాబు!!!
జే.సీ. దివాకర రెడ్డి: రాయల సీమ లో నేనే మంచి పేరున్న లీడర్, నన్ను అన్‌పాపులర్ చేయడానికే లాడెన్ హత్య లో నా హస్తముందని ఆరోపిస్తున్నారు!!! 😛
Lagadapati: కాకతీయుల కాలం నుంచి తెలుగు వాళ్ళు కలిసి ఉన్నారని ఈ చావు నిరూపించింది. ఒప్పుకోకపోతే జండా పట్టుకొని దీక్ష చేసి, నిమ్స్ లో దూరుతా 🙂
Nannapaneni: లగడపాటికి ఇచ్చినట్టే ఒబామాకి కూడా ముద్దులు ఇస్తా
JC Diwakar Reddy: తెలంగాణా కంటే రాయలసీమ వెనుక బడి ఉందని లాడెన్ మరణం వల్ల తేలిపోయింది
“Prof” Samuel (“leader” of andhera “JAC”): కలిసి ఉంటె కలదు సుఖం, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించం, లాడెన్ చావు తమిళనాడుకు చెందినా చిదంబరం, కర్ణాటకకు చెందినా మొయిలి కుట్ర
Nalamotu Chakravarthy: Laden’s death proves that the seperatist arguments are false. (Goes on to write a book bought by 13 people but quoted by every “samikya” supporter as a bible on TV)
Typical “samaikya” bloggers: ఇది తెగులు జాతి ఆత్మగౌరవానికి విజయం. కలిసి ఉంటె కలదు సుఖం. జై సమైక్యాంధ్ర; reams of typical nonsense
Typical settler: లాడెన్ చావు వల్ల హైదరబాద్ లో real estate value పడిపోతుంది. ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు తరిలి పోతున్నాయి
Tadepalli: తెలంగాణ ప్రజలు తాగుబోతులు. ఈ విషయం నాకు లాడెన్ స్వయంగా చెప్పాడు (raises his glass & downs his drink in toast to తెగులు నల్లి; runs off to పెద్దాపురం to celebrate).
Duggal: My report is a copy-paste of lies given by Lagadapati. The 800th chapter is a secret LOL!
Jai aka George aka English Guy:
రోజుకో పేరుతో ఎందుకు? ఒకే పేరుతో రాయొచ్చుగా 😀
మీ సెటైర్లు కూడా బానే ఉన్నాయి. తాలబాసు మీద వ్యాఖ్యలే మోతాదు మించాయి. ఇంకెప్పుడూ అలా రాయొద్దు.
:))
ఉండవల్లి: లాడెన్ కు చావు మూడిందని నాకు తెలుసు. ఆ వివరాలు నా దగ్గరున్నయ్. మొత్తం బయటపెడతాను.
Good one.
ఉపేంద్ర: నేనూ అదే పాత్రలో నటిస్తూ సినిమా తీస్తున్నా. ఇందులో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో నేనొక్కడ్నే ఉంటా కానీ నేనెక్కడా కనపడను. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు.
Idi Highlight.
@ Jai gadu…Telugu nalli …ఏమిటిరా…నెల తక్కువ తాలిబన్….
Having said the above….I can still understand your frustration as your ‘Role Model’ is no more. But nothing to worry, Talibans are now coming to Telabans area to recruit their leader and learn new tricks from you తెలబన్ guys….
మీరు అస్సలు ఎమి అనుకోనంటె చిన్న సలహ మీ బ్లాగు లోని అక్షరాలని దయచేసి కాస్త పెద్దవి చెయ్యలి మరి.ఉంటానండి .
Chaal abgunnayi !….Keko keka – Bala
రోశయ్య: ఏమిటీ? లాడెన్ చనిపోయాడా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నేను ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్ నించి బయటకు వస్తున్నా.. అయినా ప్రపంచం లో జరిగేది అంతా నాకు తెలియాలని రూల్ ఉందా?
అబ్బ rock దెబ్బ రా. బాక్కొట్టారు. మన్లాగా law den లో నలక్కుండా తేల్చవతల పారేశారు, ఆలీసెంగానైనా. అసలింతకీ పోయాడా ఉన్నాడా అన్నది కాస్త అనుమానంగానే ఉంది
అత్యద్భుతం!.
సుప్రీం కోర్టు: ’పిల్లులంటే అంత చులకనయ్యాయా’ అని లాయర్ సన్యాసిరావుకి అక్షింతలు వేస్తున్నాం.
మార్తాండ: మొన్న కలిసినప్పుడు రంగనాయకమ్మ పుస్తకాలిచ్చి చదవమన్నాను. చదవలేదు. అందుకే దిక్కులేని చావు చచ్చాడు.
Hilarious!!!!