‘సంక్రాంతి సందర్భంగా కోస్తాలో కోడి పందేలకి తరలి వెళ్లిన తెలంగాణ నాయకులు‘ – చద్ది వార్త
‘ఆంధ్రోళ్ల బిర్యానీ పేడ లెక్కుంటది’ – తాజా వార్త
—-
అసుర సంధ్య వేళ దాటి అటూ ఇటూగా ఆరుగంటలయింది. ఆఖరి కస్టమర్ ఇచ్చిన బిల్లు డబ్బులు సరిచూసుకుంటున్నాడు వెంకట్రావు. పగలంతా డొంకరోడ్డు మీద దుమ్మురేపిన ట్రాఫిక్ అప్పటికి బాగా తగ్గిపోయింది. సంక్రాంతి సీజన్ కావటంతో అర్ధరాత్రి కావస్తున్నా రద్దీ పూర్తిగా సద్దుమణగలేదు. లేకపోతే తొమ్మిది గంటలకే హోటల్ కట్టేసుండేవాడతను.
‘బిర్యానీ బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. ఈ సారి మళ్లీ ఇటొస్తే తప్పకుండా ఇక్కడాగి తినాల్సిందే’.
కస్టమర్ మాటలకి చిరునవ్వు నవ్వాడు వెంకట్రావు. అతనికీ అభినందనలు కొత్త కావు. అతని హోటల్ బిర్యానీకి ఆ చుట్టుపక్కల యాభై కిలోమీటర్లదాకా తిరుగులేని పేరుంది మరి.
‘అయ్యగారూ, గోంగూర పచ్చడి రుబ్బి ఇస్తర్లో పెట్టినా. గిన్నిలోకి మార్చి ఫ్రిజ్జిలో సర్దుకో. పోతన్నానింక. శానా ఆలిస్సెమైనాది’, కొంగుకి చేతులు తుడుచుకుంటూ అటుగా వచ్చి చెప్పింది నాగి.
‘పోదువు కానీ ముందా గొడ్లు కట్టెయ్యి. అదే చేత్తో కొష్టం కొంచెం శుభ్రం చేసిపో’, చిల్లర లెక్కపెట్టి కస్టమర్‌కిస్తూ చెప్పాడు వెంకట్రావు. అయిష్టంగా మొహం పెట్టి అటెళ్లింది నాగి.
‘ఈ సారి బెట్టింగ్ కోట్లలోనే ఉందంట బాబాయ్. నైజాం సైడు నుంచి పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చి ఆడుతున్నారంట’, చిల్లర జేబులో పెట్టుకుంటూ అన్నాడు కస్టమర్. అతని దృష్టి దూరంగా ఉన్న కొండమలుపు వైపు ఉండటం చూసి తనూ అటు చూశాడు వెంకట్రావు. నాలుగైదు కార్లు రయ్యి రయ్యిన వస్తున్నాయి అట్నుండి.
ఆ కొండ వెనకాల ఏటేటా ఈ సీజన్లో కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అలనాడు పలనాటి ఊళ్లలో దర్జాగా వెలిగిపోయిన పందేలు నిషేధం దరిమిలా నీరసంగా ఇలాంటి కొండలూ గుట్టల వెనక్కి తరలిపోయాయి. నాలుగైదేళ్లుగా వాటిల్లో పేరుమోసిన రాజకీయ నాయకుల పెట్టుబడులు ఎక్కువైపోయాక అధికారిక నిషేధం కాగితం పులయ్యింది, కోళ్ల పందాలు అనధికారిక సంస్కృతీ చిహ్నాలయ్యాయి. ఏది ఏమైనా, కోడి పందేల నిమిత్తం ఆ దారిన వచ్చేపోయే వాళ్లందరూ తన హోటల్ బిర్యానీ కోసం ఎగబడటంతో వెంకట్రావుకి మాత్రం పంట పండింది.
—-
‘దొరకి ఈ కోడి పందేల పిచ్చేందిబై? ఎక్కడ జనం గుర్తుపడ్తరో అని హడలి చచ్చినా. ఓడిపొయి బచాయించినం. లేపోతే రేపూ గీడ్నే ఉండాల్సొచ్చేది’, గుసగుసగా అన్నాడు యాద్గిరి.
‘ఛస్.. మూస్కుని గాడీ తోలుబే. సాబ్‌కి ఇనిపిస్తే సస్తవ్. ఎక్వ తక్వ వాగక్. సాబ్ ఏదంటే అదే రైటనాల, ఏం సేస్తే అది మూస్కుని సూడాల. గదే మన పని. సమజైందా?’, మెల్లిగా కసురుకున్నాడు మల్లేష్ వెనక్కి తిరిగి చూస్తూ.
వెనక సీట్లో వ్యూహాత్మక మౌనంలో మునిగున్నాడు దొరసాబ్. కారెక్కేముందు పూటుగా పట్ట్టించిన నాటుసారా మత్తులో సోలుతున్నా, ఆయన బుర్రమాత్రం పాదరసంలా పనిచేస్తుంది – కోడిపందాల్లో పోగుట్టుకున్న కోటిన్నరకి డబల్ మొత్తంలో తిరిగి సంపాదించే పన్నాగాలు పన్నుతుంది.
‘గది కాదు బై. గదేదో మనసైడు ఆడుకోవచ్చుగా. రేసులున్నై, బ్రాకెట్టాటుంది, కిర్కెట్ బెట్టింగుంది. గయ్యన్నీ ఆడ్తడుగదా. మల్లా గిటొచ్చీ కోళ్లపందేలేందిబై. జనాలు గుర్తు పట్టిన్రంటే మనకీడనే బొందల్ పెట్టుండేటోల్లు ….’. యాద్గిరి గొణుగుతూనే ఉన్నాడింకా, అంతలోనే దొరసాబ్ గొంతు మోగింది.
‘బిడ్డా, ఆడ ఓటలేదో ఉన్నట్టుంది జర ఆపు. ఏదన్నా తిని పోదం’
—-
ఆఖరి కస్టమర్ ఉత్తి వాగుడుకాయలాగున్నాడు. అతని కబుర్లకి ఊకొడుతూ వెంకట్రావు గల్లాపెట్టె సర్దుకుంటుండగా వచ్చి హోటల్ ముందాగింది ఇందాక కొండమలుపులో కనిపించిన కార్ల సమూహం. ఆగీ ఆగగానే బిలబిలమంటూ పదిమందికి పైగా దిగారు. వెంకట్రావు తలెత్తి అటు చూసేలోపే వాళ్లలో ఒకతనొచ్చి కౌంటర్ ముందు నిలబడ్డాడు. మరుక్షణం అతని గొంతు ఖంగుమంది: ‘తినేందుకేం దొర్కుతది భై? పద్కొండు మందిమున్నం’. ఖంగుమనిపించినవాడు మల్లేష్.
వెంకట్రావు నోరు తెరిచేలోపే వాగుడుకాయ చెప్పేశాడు, ‘బాబాయ్ దగ్గర బిర్యానీ చాలా ఫేమస్ గురూ. అది ..’
అతని మాటలు పూర్తి కాకముందే మల్లేష్ గొంతు మళ్లీ ఖంగుమంది, ‘ఐతే గదే పట్కరా’.
అంతలో కరెంట్ పోయింది. అంతటా అంధకారం.
‘నాగీ. ఆ పెట్రోమాక్స్ లైట్ అంటించి పట్రావే’, కేకేశాడు వెంకట్రావ్, ‘ఇంతమందికి సరిపడా బిర్యానీ మిగిలుందో లేదో’ అనుకుంటూ.
‘గదొద్దు. జర మోంబత్తులుంటే సూడు’, మల్లేష్ మరోమారు ఖంగు ఖంగుమన్నాడు.
‘ఏం బత్తులు!?!’
‘గదే భై. కొవ్వత్తుల్’
వింతగా అతనికేసి చూస్తూ మళ్లీ కేకేశాడు వెంకట్రావు, ‘పెట్రొమాక్స్ వద్దు, నాలుగు కొవ్వొత్తులంటించవే’
—-
దొరసాబ్ కారు దిగి పక్కనున్న నీళ్ల గాబు దగ్గరికెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కున్నాడు. అనుచరుడందించిన తువ్వాలుతో చేతులు తుడుచుకుని పక్కనున్న నులకమంచమ్మీద కూలబడ్డాడు.
అంతలో మల్లేషొచ్చి చెప్పాడు, ‘గీడ బిర్యానీ మస్తుంటది సాబ్. గదే ఆర్డరేసినా. పంద్రా మినిట్లో రెడీ ఐపోద్ది’.
దొరసాబ్ తలాడించాడు. ఆడించాక అనుమానంగా మొహం పెట్టి మల్లేష్ వంక చూశాడు. అర్ధమైనట్లు చూసి చెప్పాడు మల్లేష్.
‘పరేషానవ్వొద్దు సాబ్. కరెంట్ పీకేసినం, మోంబత్తులెట్టమని సెప్పినం. ఎవ్‌డూ గుర్తుబట్టడింక. నువ్వు బిందాస్‌గుండు’.
దొరసాబ్ ముఖంలోంచి అనుమానం మటుమాయమైంది. వెనక్కి వాలి కూర్చుని కళ్లు మూసుకుని మళ్లీ వ్యూహాత్మక మౌనంలోకి జారుకున్నాడాయన. మల్లేష్, యాద్గిరి పక్కనే నిలబడి పహారా కాయసాగారు.
—-
పావుగంట గడిచింది. చెప్పినట్లే బిర్యానీ సిద్ధమయింది. అందరికీ విస్తరాకులు, మంచినీళ్లు సిద్ధం చేసింది నాగి – ఆఖరి క్షణంలో వచ్చి తను ఇంటికెళ్లటం ఇంకా ఆలస్యం చేసినందుకు అందర్నీ లోలోపలే తెగతిట్టుకుంటూ, ఆ చికాకు బయటికే ప్రదర్శిస్తూ.
దొరసాబ్, మల్లేష్, యాద్గిరి బయట నులక మంచం ముందే టేబుల్ వేయించుకుని తింటామన్నారు. మిగతావాళ్లు పొలోమంటూ హోటల్ లోపలికెళ్లారు. నాగి కొవ్వొత్తొకటి తెచ్చి టేబుల్ మీద పెట్టబోతే వారించాడు మల్లేష్.
వేడివేడి కోడి బిర్యానీ ఆవురావురుమంటూ రెండు ముద్దలు తిన్నాక నోరు విప్పాడు దొరసాబ్, ‘నిజంగనే మస్తుంది. గుంటూరు ఘాటు మన బిర్యానికేడినుండొస్తది? దీన్ల గోంగూర పచ్చడి నంజుకుంటేనా … ఇగ జూస్తోరి ….’, మాట పూర్తికాకముందే ఆయన దృష్టి ఎదురుగా రోటి పక్కన గట్టుమీద పెట్టున్న విస్తరాకు మీద పడింది. పిల్లగాలికి రెపరెపలాడుతుందది. అర్ధచంద్రుడి కిరణాలు అందులో ఉన్న పదార్ధమ్మీద పడి పరావర్తనం చెందుతున్నాయి. దాన్ని చూసి ఆయన కళ్లు మిలమిల మెరిశాయి. కారుమబ్బులు కమ్మినట్లుండే ఆయన మొఖం ఆ కాంతిపుంజాల ధాటికి అంత చీకట్లోనూ వెలిగిపోయింది.
‘అద్గో గోంగూర పచ్చడి. అనుకోగనే కనపడింది. ఫ్రెష్‌గా నూరినట్టుండ్రు. లాగిద్దాం జల్దీ తీస్కరండి’ అన్నాడాయన అరమోడ్పులైన కళ్లతో అటే చూస్తూ, నోట్లోనుండి ఉబికి వస్తున్న లాలాజలాన్ని ఆపుకునే ప్రయత్నమన్నా చెయ్యకుండా.
మరునిమిషంలో వాళ్ల డైనింగ్‌టేబుల్ మీద వాలిందా విస్తరాకు. ఎంగిలి చేత్తోనే ఆబగా అందులోంచి అందినంత అందుకుని బిర్యానీమీద కుమ్మరించుకుని కసాపిసా కలిపి ఓ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు దొరసాబ్. తక్కినోళ్లిద్దరూ అదే పని చేశారు.
మొదటి ముద్దకే యాద్గిరికి పొలమారింది. గ్లాసందుకుని నీళ్లు తాగుతూ మల్లేష్ చెవిలో గుసగుసలాడాడతను ‘గుంటూరు గోంగూర గురించి కతల్ కతలే ఇన్నా. గిదేందిభై గిట్లుంది. అంత సొల్లు కార్చుకునేదానికి గిందులో ఏముంది?’
మోచేత్తో అతని డొక్కలో పొడిచాడు మల్లేష్. అతని మొహంలోనూ ఏదో చిత్రమైన కవళిక కదలాడింది. అది దాచుకుంటూ దొరసాబ్‌తో అన్నాడు, ‘బిర్యానీ జబర్దస్తుగుందిగానీ గోంగూర పచ్చడికంత సీన్ లేదు సాబ్’.
‘అరె చుప్. ఆంధ్రాల గోంగూర పచ్చడి గిట్లనే ఉంటది. ఎప్పుడైనా తిన్న మొగమైతేగదా ఆ రుచి తెలిసేది. వంకల్ పెట్టకుండా నోర్మూస్కు తిను బిడ్డా’, దొరసాబ్ కసిరాడు ఆకులోంచి మరో ముద్ద తీసి బిర్యానీలో దట్టిస్తూ.
—-
భోజనాల తర్వాత అరగంటసేపక్కడే విశ్రాంతిగా కూర్చున్నాక ఇక బయల్దేరదామన్నట్లు లేచాడు దొరసాబ్. మల్లేష్ తప్ప మిగతా అనుచరులందరూ అప్పటికే కార్లలో కూర్చుని అసహనంగా ఎదురుచూస్తున్నారు. యాద్గిరి కడుపులో తిప్పుతుంది. ‘ఛత్. దీని ఘాటేమొ గాని ఐద్రాబాద్ పోయేతల్కి ఖతమయ్యేటట్టున్న. గింకెప్పుడూ ఆంధ్రోల్ల బిర్యానీ తిన్రాదు మల్ల’ అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆపసోపాలు పడుతున్నాడు.
కార్లోకి ఎక్కబోతుండగా నాగి మాటలు వినపడి ఆగిపోయాడు దొరసాబ్. రోటి దగ్గరనుండి వెంకట్రావుతో పెద్ద్దగా అరిచి చెబుతుందామె.
‘పండగ పూట ముగ్గులో గొబ్బెమ్మల కోసరం ఈల్దాక గొడ్లకాడ్నించి ఇంత పేడ ఇస్తర్లోకెత్తి ఈడ గట్టు మీదెట్టినా. నువ్వేమన్నా తీసి పారేసినావా అయ్యగారూ?’
అప్పటిదాకా అరవిరిసినట్లున్న దొరసాబ్ వదనం అవి చెవినబడగానే ఆముదం తాగినట్లయింది.
తొండి చేసిందిరా బై నాగి
ఇంకా నయం గొబ్బెమ్మలు ఆవుపేడ తోనే పెడతారు, ఇంకేదైనా అయితే యాక్క్ ..!!
very funny.supercounter to mukkodu
correstu correstu..
అయితే పేడ తినిపించనే తినిపించారన్నమాట! :-))
🙂
కేసీయార్ వేరే పేడ తినాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యలు చేయడమే తినడంతో సమానం. ఈ టపా వ్రాయడం ద్వారా ఇక్కడ కూడా కొంతమంది అదే పని చేసినట్టనిపిస్తుంది.
🙂
Keka
చర్య-ప్రతిచర్య అని చిన్నప్పుడు సైన్సు పాఠాల్లో చదువుకున్నాం. అది ఇలా ఈయన మీదకు ప్రయోగించవచ్చని ఇప్పుడే తెలిసింది. అయినా గబ్బు మాటలు మాట్లాడేవారికి ఇట్లనే సమాధానమియ్యక సంస్కృతంలో శ్లోకాలు రాయాలా ఏంది?…
కేక
ఏమనుకోకండి అనిల్ గారు, మీ శైలికి తగినట్టు లేదీటపా ..This is not matching up to the high standards of blogging that you created for yourself, and its purely my personal perception.
ఎప్పటి మాదిరిగా కాకుండా భిన్న ప్రయత్నమిది. నా టపాల శైలిలో లేకున్నా, నా కథల శైలిలోనే ఉంటుంది గమనించండి (red herrings, surprise endings, the need to read between the lines, blah, blah, blah). నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
Enjoy this great song on andh(a) politics: “గారడీ చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు, మొండికి పోతుండ్రు తొండికి దిగుతున్రు”
Maybe you should ask Lagadapati & his three sons to join you 🙂
కెవ్వ్….సూపరసలు…మీకెలా వస్తాయి ఇలాంటి అవిడియాలన్నీ?
నేను ఒక్కొకరి మొహాలు ఊహించుకుని మరీ నవ్వుకున్నా….మస్తుగంది, జబర్దస్తుగుంది.
కేకో కేక
చాలా చాలా బాగుంది. చాలారోజుల తరువాత ఓ కథ చదివి హాయిగా కళ్ళల్లో నీళ్ళొచ్చేలా నవ్వుకున్నా. కథ కాన్సెప్ట్ సూపర్బ్. ఆ సంక్రాంతి గుంటూరు బిర్యాని-గోంగూర అరిగించుకోడానికి తెల్లారి హైద్రాబాద్ చేస్రాక బతుకమ్మ ఆడిఉంటారని తలుచుకుంటే … హ్హ్వా హ్హ్వా హ్హ్వా
:-):):)
Chaaalaa baagundi.
Who are exposing their hatred? రక్తచరిత్ర పేరుతో తెలంగాణావాళ్ల గురించి చెత్త వ్రాతలు వ్రాసినప్పుడు మీరు సైలెంట్‌గా ఉండిపోయారు. శ్రీనివాస తేజ అనే డాక్టర్ గారు కోపం తగ్గించుకోవాలి అని తెలంగాణా ప్రజలకి శ్రీరంగనీతులు చెప్పారు. “నీ జేబులో చెయ్యి పెట్టినవాడ్ని ఏమీ అనకు. నీ జేబులో డెబిట్ కార్డ్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ ఉన్నా శాంతం వహించు. నీ జేబులో చెయ్యి పెట్టినవాడ్ని కొడితే నీకే నష్టం” ఇలా ఉన్నాయి శ్రీనివాస తేజ గారు చెప్పిన శ్రీరంగనీతులు. ఆయనే ఇక్కడ పేడ బిర్యానీ గురించి వ్రాసినది బాగుందంటున్నారు.
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై ఖండించటానికి అందరికీ నీకున్నంత తీరికుండాలిగా ప్రనీణన్నా 😀 అయినా దానికి నువ్వున్నావుగా ఇంకా వేరేవాళ్లెందుకులే
ఎవరూ కెసిఆర్ అన్నాడా “ఆంధ్రోళ్ల బిర్యానీ పేడ లెక్కుంటదని” భళె భళె… బ్రహ్మాండంగా రెచ్చగొట్టాడుగా. ఇంత పొడుగాటి బ్లాగు రాయకపోతే పిల్లితలగొరిగితే సరిపోయేది… కాస్తోకూస్తో పుణ్యమైనా వచ్చేది.
మీలాంటోళ్ళని ధీటుగా కెలకడానికి ఆ కెసిఆర్‌గాడే కరెక్టు.
అసలు బిర్యనీలొ గొన్గుర ఎన్తన్డి చ్హన్దాలమ్ గా….. ala కుDa కలుపుకొవచ్హ్హు అని idea ela vachindandi….
okasari e link chudandi
Ippudu Cheppandi. KCR lanti chandaalapu daridrapu Nayakula chetilo Telangana State ni Pettaalani anipistundaaa?.
Meeku Anipistunnaaa, Prakruti Niyamaalu Oppukovu. Anduke, Telangana State will never be Formed. Amen. Om. Ameen.
People like KCR or other politicians had never demonstrated their Caliber to develop the state. Only thing they have demonstrated is either their cheap behavior or their selfishness. These are not the Qualifications to lead a State of 4 crore people and hence they will never get Telangana State.
శ్రీ గారూ
తెలంగాణ ఇవ్వడం జరిగితే కె.సి.ఆర్ కి ఇవ్వడమే అని అనుకోవటం కరెక్ట్ కాదేమో! ప్రధానంగా గుర్తించవలసింది అక్కడి ప్రజలు తెలంగాణ్ కోరుతున్నారా లేదా అన్న విషయం. కే.సి.ఆర్ ఒక్కడే కోరుకుంటున్నట్లయితే అసలు తెలంగాణ ఉద్యమం ఇన్నాళ్ళూ ఉండగలిగేది కాదనుకుంటా. ఆయన ఒక్కడే కోరినట్లయితే అసలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ప్రజలంతా కోరుతున్నపుడు వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రజల కోరిక తీర్చడం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల కర్తవ్యం.
నేను తెలంగాణ వాసిని కాదు. గుంటూరు వాసిని. ఒంగోలు స్నేహితుడి ఇంటికి వచ్చి అక్కడ నెట్ లో చూసి ఇది రాస్తున్నా.
–శేఖర్
Will you stop KCR from gaining power if T-state is formed?
I am from Telangana area and we need DEVELOPMENT OF T-area AND NOT MERE RE-DRAWING OF THE BOUNDARIES.
Only those who are week minded and donot have guts to make their politicians accountable so far and are easily falling to evil designs of the selfish politicians are asking for Telangana.
Had this fool KCR spent all this Time and Energy to solve issues of Telangana Area, I would have trusted his workmanship and would have also demanded for T-state so that I could trust current politicians and given power to lead us. But, nothing productive was done by KCR so far and I donot have any confidence that he will do anything good in future. Only thing that he and other politicians would do when come to Power in a smaller T-state is that they will loot even more freely.
Guys,
This short story (or whatever you want to call it) is written in a lighter vein. Let’s keep it that way and not get into heated discussions.
ఉన్నమాట చెప్పారు శ్రీ గారు
why did you remove my comments….? you don’t have balls to face.
Because this is not the place to showcase your hatred. Opinions are welcome here – however contradictory they are to those of mine. Sarcasm is tolerable to certain extent. Your circus is not.
చివర్లో రాసిన పంచ్ డవిలాగు అదిరింది…బాలయ్య బాబుకివ్వండి…కుమ్మేస్తాడు. 😛
అయ్యబాబోయ్…………కేకో కేక….అసలు ఇంత creativity తో రాసిన టపా ఈ మధ్య కాలం లో చూడలేదు…
అద్భుతం….అంతకన్నా నా దగ్గర మాటల్లేవ్….
హాట్స్ ఆఫ్ గురూ గారు….హాట్స్ ఆఫ్….
/Sarcasm is tolerable to certain extent. Your circus is not./
:))
OMG……..mee ‘puchakaaya-oka sachinodi love story’ chadivinappude comment pedadhaam anukunna.. asalu meeku elaa vasthundho intha chamat’kaaram’..KCR peda biryani annappude anukunna..dhaani meedha okati raasthaarani.. Too good idhi… chadivinantha sepu navvakundaa undalekapoyaa..keep going…..
Why are you exhibiting your tegulu fanaticism even here? KCR never used the word “peda”. Speaking in Urdu, he compared andha biryani to “gobar”.
Dude,
Why are you exhibiting your KCR craze here? I never used his name in this post.
My limited Urdu knowledge tells me ‘gobar’ means cow dung. If not, Urdu pundits like you are most welcome to enlighten this poor soul with its real meaning.
In the meantime, enjoy this math axiom:
దొరసాబ్ = KCR iff gobar = పేడ
OK, so who spoke about peda (doodh peda?) biryani?
జార్జి ! పన్నెండుకోట్లమంది మాట్లాడె మాతృభాష పేరుని వికారం చేసి తెగులు అని వ్రాయడం ఏమైనా బావుందా ? ఏ ఇతర భాషవాళ్ళన్నా ఇలా చేస్తున్నారా ? నిన్ను జార్జి అనికాకుండా ఒరే జార్జిగా ! అని సంబోధిస్తే నీకు నచ్చుతుందా ? నీలాంటివాళ్ళు ఇలా అడుగడుగునా తెలుగుని అవమానించబట్టే ఇదివఱకు లేని తెలుగుభాషోన్మాదం కొత్తగా పుట్టింది.
By the way, నేనొక తెలుగుభాషోన్మాదిని. నా గురించి జాగ్రత్తపడండి.
The gloves are off, aren’t they? You start revealing your true colors on linguistic fanaticism. How can you want to be united when you hate others so much?
You can call me anything you like. We are used to much worse from you guys.
It shows your craze on Urdu and English. First find a place outside India. US should be better! Because I didn’t see you writing in Telugu, I am replying in English. Can you write in Telugu in the same way with out having spelling and grammatical mistakes? and after writing mistakes in Telugu can you write same way in English? You will commit suicide.
First respect yourself then you can respect others.
నాకు తెలుగు, హిందీ, కన్నడ భాషలు వచ్చు. కానీ నాకు భాషా దురభిమానం లేదు. Happy now?
I can also repeat this statement in all the languages. I respect all languages and not a fanatic like others. A self proclaimed “తెలుగుభాషోన్మాది” called Telangana people drunkards, so much for his respect!
We will not die just because you wish it out of your hatred. मरे हमारे दुश्मन!
Hey George,
There is nothing wrong in saying “తెలుగుభాషోన్మాది” .
Dude js wanna say one thing, Telangana is not a separate language…its a telugu language but with a different slang which is influenced with some urdu words coz of nizam rule over there…thats it…no more explanation needed for that..and KCR scolding telugu thalli is highly unacceptable coz, it just the representation of Telugu speaking ppl including You..
మాది తెగులు ఐతే నీ తెలంగానా దురద ని ఎమనాలి? జార్జి-గజ్జి అంటే సక్కంగా ఉంటది
You always whine that Telangana people hate you. On the other hand you claim “brotherly love” towards Telangana but spew venom at every chance.
My comment is against a person who abused the word “Telugu”.. Dont be oversmart in attributing it to entire telangana. brotherly love doesn’t mean whatever u write will be accepted..
If that is the case, why did you call it “తెలంగానా దురద”? BTW your pronunciation is wrong 🙂
Praveen Sarma అనే ఆయన నా గురించి Dr. Srinivasa Teja)యిలా రాసారు
“” Who are exposing their hatred? రక్తచరిత్ర పేరుతో తెలంగాణావాళ్ల గురించి చెత్త వ్రాతలు వ్రాసినప్పుడు మీరు సైలెంట్‌గా ఉండిపోయారు. శ్రీనివాస తేజ అనే డాక్టర్ గారు కోపం తగ్గించుకోవాలి అని తెలంగాణా ప్రజలకి శ్రీరంగనీతులు చెప్పారు. “నీ జేబులో చెయ్యి పెట్టినవాడ్ని ఏమీ అనకు. నీ జేబులో డెబిట్ కార్డ్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ ఉన్నా శాంతం వహించు. నీ జేబులో చెయ్యి పెట్టినవాడ్ని కొడితే నీకే నష్టం” ఇలా ఉన్నాయి శ్రీనివాస తేజ గారు చెప్పిన శ్రీరంగనీతులు. ఆయనే ఇక్కడ పేడ బిర్యానీ గురించి వ్రాసినది బాగుందంటున్నారు”””””
నా జవాబు:
నేను కోపం గురించి రాసింది మనిషి సాధారణ ప్రవర్తన గిరించి. దానికి తెలంగాణాకి ఏమి సంబంధం?
తెలంగాణా నుడికారుల కోపం తెలుగు గెలుపు కావాలి అనే వ్యాసం మరొకటి రాసాను. తెలంగాణా ఏర్పడ్డాక తెలుగును కాపాడుకోవటం గురించి రాసాను. తెలంగాణా ఏర్పడినా ఏర్పడక పోయినా నేను రాసింది తెలుగు నుడి పెంపుకోసం. దానికి మీ కామెంటుకు సంబంధము ఏమిటి?
పేద బిర్యాని కధనం బాగుందని నా అభిప్రాయం రచయితకు తెలిపాను. దానికి తెలంగాణా కు సంబంధం ఏమిటి? సంబంధం లేని, విడివిడిగా ఉన్నా వాటిని తెచ్చి ఒక దగ్గర రాసి మీరెందుకు గందరగోళ పడతారు?
అనవసర విషయాలను కెలుక్కొని పిసుక్కోవటం ఎందుకు శర్మ గారూ? ముందు “తెలంగాణా నుడికారుల కోపం తెలుగు గెలుపు కావాలి” అనే article ను ఒకటికి పదిసార్లు బాగా చదవండి అందులో సంగతులు తెలంగాణా తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇంకా మీకు అనిపిస్తే మీరు బ్లాగుల్లో కామెంట్లు రాసే స్థాయికి ఎదగాలేదేమో అని మిమ్మల్ని, మీ కామెంట్లను పట్టించు కోవాల్సిసిన అవసరం లేదేమో?
కేకో కేక చాలా బాగుంది
anthe mari meeku telangana valla notlo mattikottadam 60 yendlanunchi vunnadekada. ippudu develop ment peda
ఎదుటోల్ల మీద పడి ఏడ్చుడు మీకు భూమి పుట్టకముందునించీ ఉందేగా. ఇందులో కొత్తేముంది బై 🙂
excellent
anil gaaru mee rachana saili chaala baaguntundi. ee blog prapamcham lo nenu chadivina modati blog meede. mee kathalu anni chadivaanu. chaala baagunai. aite pai post gurunchi
1. mee swabhaavaniki virudamga vundi
2. daya chesi oka prantapu yasanu vekkirinchavaddu. (gowravinchaka poina parledu). adi vaari vaari puttukato vachindi.
3. andaram kalisundaam ane mee baavaaniki idi vyatirekam.
4. meeru pettina perlu oka prantapu prajalanu vekkirinchinatunavi.
5. meeku evari meeda kopam vunte vaarini dhairyamga vimarsinchandi. kani andari pai visham kakka vaddu.inka chaala rasedi undi. kaani samayam ledu.
నాగి యాస నా సొంతం ప్రాంతాన్ని (పల్నాడు) వెక్కిరించేదిగా ఉంది కదా మరి …. అది కనపడలేదా సతీష్ గారు?
రచనల్లో సహజత్వం కోసం ఏ ప్రాంతంవారి యాస, పేర్లు వాళ్లకి పెడతాం. దాన్ని వెక్కిరింపు అనుకుంటే నేను చెయ్యగలిగేదేమీ లేదు. ఈ కథాంశంలో పాత్రలకి మల్లేష్, యాద్గిరి అని కాకుండా రాథోడ్, కులకర్ణి అని పేర్లు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఇందులో తెలంగాణ ప్రజల్ని విమర్శించిందెక్కడ? వెటకారం చేసింది కారుకూతలు కూసిన ఒకానొక నాయకుడిని మాత్రమే. కథకి అవసరం కాబట్టి అతని అనుంగు అనుచరులిద్దర్నీ ఆ క్రమంలో వాడుకోవాల్సొచ్చింది. తెలంగాణ ప్రజల్నందర్నీ హోల్‌సేల్‌గా ఎకసెక్కం చేసే ఉద్దేశమే ఉంటే తక్కిన ఎనిమిందినీ ఎందుకు వదిలేస్తా?
అన్నట్టు, నాకు తెలంగాణతో మీకు తెలీనంత దగ్గరి అనుబంధం ఉంది. వివరాలు అనవసరం.
అబ్రకదబ్ర, మీరిలా చెప్పాల్సింది. ‘మాతెలంగాణోళ్ళు, మాఇష్టం. మాకూ మాకూ మధ్య లక్ష వుంటాయి, అడగడానికి ఇంగ్లీషోడు నీవెవరు?’ 🙂
Very good answer and wonderful sense of తెలుగు ఆత్మగౌరవం 🙂
anna Snkr, naaku telugu lo type cheyyadam raadu. edo konchem takkuva knowledge.edo naa abhiprayam cheppaanu. daanimeedamaatladithe bavuntundi. deenine vetakaaram antaaremo. english guy gaariki kooda.
Hai Sir,
Nenu roju mee blog ki raavadam velladam jaruguthoo undi..mee kotta godu kosam..ippatiki okko godu 4 saarlu chadivesa…plz kotta godu eppudu sir..
BAGUNDI
chala baga chepparu