ఆగస్ట్, 2010ను భద్రపఱచుకల్కి – 1

సహ బ్లాగరొకరు సరదాగా నాకో సవాలు విసరటం, బదులుగా నేను  కథలు వడికి జనాభా మీదకి విసిరే పని మొదలెట్టటం …. పద్నాలుగు నెలల పాత ముచ్చటిది. ఇందాకా విసిరినవి నాలుగు. ఐదోది – ‘కల్కి’ – కొండవీటి చాంతాడంతైనందువల్లనూ, కుదించటం కుదరనే కుదరనందువల్లనూ – రెండు భాగాలుగా తెగ నరికి రెండు ఆదివారాలపాటు అచ్చొత్తాలని ‘సాక్షి’ దినపత్రిక వారు నిర్ణయించారు. మొదటి భాగం ఈ రోజే బయటికొచ్చింది (ఇక్కడ లభిస్తుంది). ముందే చెప్పినట్లు, ఇది మొదటి భాగం మాత్రమే. కాబట్టి కథ అర్ధాంతరంగా ఐపోయిందనుకునేసుకుని తొందరపడి రాళ్లేయకండి. పై ఆదివారం దాకా ఓపిక పడితే మిగతా భాగమూ చదివి ఆ రాళ్లేవో తీరిగ్గా అప్పుడే విసరొచ్చు.
ఆన్‌లైన్ పాఠకులకో గమనిక: అక్కడ కథ పేరు చూసి కంగు తినొద్దు. అదో భీభత్సకరమైన అప్పుతచ్చు. దాన్ని మించి, కథలో వివిధ సెక్షన్ల మధ్య ఉండాల్సిన సెపరేటర్లని కూడా ఎగరగొట్టేశారు. కాబట్టి, కథ చదివి మీరు గందరగోళపడిపోతే అది నా తప్పు కాదు. ఈ గొడవంతా ఎందుకనుకుంటే, శుభ్రంగా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుని చదవండి. అక్కడన్నీ శుద్ధంగానే ఉన్నాయి.
ఇకపోతే, ఈ కథ వెనక చాలా కథుంది. ఈ కథాంశానికి ప్రేరణ, దీనికి ముడిసరుకు కోసం నే పడ్డ పాట్లు, సేకరించిన వివరాలు, గట్రా, గట్రా – మరోసారి ‘కథాయణం’లోవివరంగా రాస్తాను. ప్రస్తుతానికి నే రాయదలుచుకుంది – ఇద్దరు మహా కథకులకు నేనర్పిస్తున్న నివాళిది. కాల్పనిక సాహిత్యంలో నాకత్యంత ప్రీతిపాత్రమైన ఒకానొక విభాగమ్మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆ ఇద్దరి గురించీ కథాయణంలోనే చూద్దురు, ముందు ‘కల్కి’ సంగతేంటో చూడండి.
షరా మామూలుగానే, కథలో మలుపుల్ని విప్పిచెప్పే వ్యాఖ్యలు సందడి సద్దుమణిగేంతవరకూ కత్తిరించబడతాయి.

ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,188

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.