మార్పులు జరిగింది ప్రధానంగా మూడు తేదీల విషయంలో. కథానాయకుడు క్రయోజెనిక్ నిద్రలోకేళ్లిన గత మూడు సందర్భాల తేదీలూ – నేను రాసినవి ‘1984 అక్టోబర్, 1991 మే, మరియు 2012 డిసెంబర్ 23’ కాగా, పత్రికలో అవి ‘1981, 1991 మరియు 2010 డిసెంబర్ 23’గా పడ్డాయి. వీటిలో మొదటి రెండు మార్పులూ నేను పైన చెప్పిన సాంకేతిక కారణాల వల్ల కాగా, మూడవది అప్పుతచ్చు.
వీటిని మినహాయిస్తే, నేను రాసిన కథ అక్షరం పొల్లుపోకుండా, ఎక్కడా ఎడిట్ చేయకుండా యధాతధంగా ప్రచురించబడింది. ముఖ్యంగా – ఇంత పొడుగాటి కథని తమకి అనువుగా తెగ్గోయమని అడగకుండా, రొటీన్‌కి భిన్నంగా రెండు వారాల పాటు ప్రచురించిన సాక్షి ఫన్డే సంపాదకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇక ఆలస్యమెందుకు …. చదవండి, చెప్పండి.
@Abrakadabra gaaru
mee story naaku konchem confuse anipinchindi..Hero ne Kalki cheyyadm emiti.naaku ee twist nachchale..maalaanti kodi burra prajalu chaalaa kastapadaali ee story ardham chesukovaalante..naakaite ee story OK..meeru inkaa saralamayina baashalo marintamandi prajalaki ardham ayye stories kooda raayalani manavi..Thx..
కధ భలేగా ఉంది. చివరి పేజి దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను. మరల చదివితే కాని అర్ధం కాలేదు.
ఈ కధ ఒక పజిల్ లా ఉంది. దీనిని అర్ధం చేసుకోవటమే పజిల్ కి సమాధానం. దీనికి ఏమని పేరుపెట్టవచ్చు? (కధజిల్ అందామా?)
ఆలస్యం లేకుండా చదివాము 🙂 బోలెడు సందేహాలు వస్తున్నాయి చదివాక !
Excellent narration. But Expected twist in climax based on ur previous stories like aaro pranam and maro prapancham.
and also ‘gadiyaaram’
అవి ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ మరణించిన సంవత్సరాలు అనుకుంటాను,కాంట్రవర్సీ కాకుండా అయి ఉండవొచ్చు.
కథలో ఎక్కడా పట్టు సడల లేదు,కానీ నాబోటి వాళ్ళకి అర్థం కావడానికి కొంచెం(అంటే చాలానే) సమయం పడుతుంది.
కథ బాగానే ఉంది. కాని, మీ ‘నాగరికథ ‘, ఇంకో serial killer కథల కలబోతే ఈ కథ. ‘నాగరికథ ‘ లో లానే, కాల ప్రయాణం చేసి, భవిష్యత్తు నుంచి వెళ్ళిన వ్యక్తి/వ్యక్తులు చరిత్రని మార్చటం, Serial Killer కథ లో లానే, పాఠకులు ఎదురు చూసే వ్యక్తి narrator అయి ఉండటం…
బహుశా అందువల్లనేనేమో, కల్కి యెవరో నాకు ముందే తెలిసిపోయింది.
Am I forcing the similarities? May be…may be not…:D
బస్ ప్రయాణం లో పాత్రల మధ్య జరిగిన చర్చ బావుంది.
ప్రారంభంలో ఒకే లైను ( టైము ట్రావెల్ )మీద రాస్తున్నట్టు అనిపించినా , కధ అత్యధ్భుతం గా వుంది. సందేశం కూడా 😉
కానీ .. పొదలలో కాకుండా తోటి ప్రయాణికుడే ‘ ఆ తను ‘ అని కాసేపు అనిపించింది.. అలా వుంటే ( పోల్చుకోలేకపోవడం ఎలా కుదురుతుందో తెలియదు..) ఇంకా బాగుండును.
ఈ కధని పొడిగించనా? ( మీరు ఇది ఎడిట్ చేస్తే బాగుంటుంది ఏమో? )
అక్కడ ఇద్దరు కంటే ఎక్కువ అతడులు వుండే అవకాశం వుంది కదండీ! అలాగే ఆ మెమరీ లాస్ మందు వేసుకోకుండా కధానాయకుడు మరోసారి వస్తే…. తనని ఆ స్టేజి మీద చూస్తే.. 🙂
కథనం పట్టు సడలకుండా సాగింది. పాఠకుల్ని అలరిస్తుంద్నడంలో సందేహం లేదు. మీ మునుపటి కథలు చదివిన వారికి కల్కి ఎవరో తేలిగ్గానే తెలిసిపోతుంది. కొత్తదే అయినా ఇంకో మూస తయారు చేసుకుంటున్నారేమో ఆలోచించుకోండి. కొంతమందికి క్లూగా పనిచేస్తుందేమో కనక వ్యాఖ్య ప్రచురించకండి.
యండమూరి శైలికి దూరంగా జరగాలంటే “అప్పుడు వచ్చింది నవ్వు”, “అది కాదు నేను ఆలోచిస్తున్నది” (నాగరికథ) లాంటివి మానండి.
I liked the story. 🙂
సూపర్ అండి బాబు! కధలో కధానాయకుడే కల్కి అయ్యి ఉంటాడని మొదటి టపాలోనే ఊహించాను కాని, మీరు ఇలా సర్కిల్ లా ఉండే climax ఇస్తారని అస్సలు ఊహించలేదు. కధ లో “ఈ” (అంటే కొత్త) నేను కల్కి అయిపోవడం వల్ల ఎన్ని సార్లు ఏబి మళ్ళీ “ఈ” నేను ని కల్కి ని చంపడానికి వెళ్ళినా వాడు మళ్ళీ కల్కి గా మారుతాడు + యువ నేత రాడు కనక “ఆ” (అంటే పాత) నేను ప్లాన్ కచ్చితంగా flop అయ్యి తీరుతుంది. “ఆ” నేను బ్రతికే ఉంటాడు కాబట్టి వాడికి ఏమి గుర్తుండదు కాబట్టి వాడు కచితంగా ఆ ఆరుగురు అనుచరులకు కనిపించి తీరుతాడు మూడు రోజుల తరువాత… ఇదిలా recursive గా జరుగుతూనే ఉంటుంది.
నాకు తెగ నచేసింది. మీకు మీరే సాటి. ఇలాంటివి మరి కొన్ని కావాలి నాకు…(ఇంకా పూర్తిగా మీ బ్లాగ్ అంతా చదవలేదనుకోండి – ఇప్పుడే మొదలెట్టా. అన్నీ కవర్ చేస్తా!!)
ఐతే ఈ కల్కి అనబడే ఆ కల్కి చరిత్ర తిరగ రాసాడనమాట మొత్తానికి! మరి ఏబీ కార్ప్ సంగతి ఏమై ఉంటుంది? ఆ విషయం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారండీ మీరూ.. 🙂
Simply Superb. మీ కథాయణం కోసం వేచి చూస్తున్నాను.
అయ్యబాబోయ్ నేను ఊహించింది కరెక్టే…ముందే చెప్పానుగా హీరోనే కల్కిలా అనిపిస్తున్నాడని.వేరే దారే లేదు ఎండింగ్ కి 🙂 .నా వ్యాక్య ప్రచురించలేదేం మరి మీరు …బస్ ఎక్కగానే ఎవరో ఒక వ్యక్తి వేదాంతం చెప్పి కల్కి మనసు మార్చేసి ఉంటాడు అప్పుడు హీరో కి తన జీవితం మీద విరక్తి కలిగి కల్కిలా చనిపోతాడు అనుకున్నా. కాకపోతే ఆ వ్యక్తి తన ఉంగరం కల్కి కి ప్రెజెంట్ చేస్తాడు అనుకున్నా . హీరోయే అడిగి తీసుకున్నాడు. ..అయితే స్టోరీలో నాకు ఏం విషయాలపై డౌట్ వచ్చిందంటే అంత పెద్ద కాబోయే మినిస్టర్ సభలో ఒక్కళ్ళూ వీడియో తీయలేదా ??రాజీవ్ గాంధీని ధాను చంపేస్తే అంత పెద్ద ప్రేలుడు జరిగిన తరువాత కూడా సాక్ష్యాలు సంపాదించారుగా…కనీసం ఎదురుగా బురద గుంట ఉంది అని ప్రస్తావించినపుడైనా హీరోని అందులో ముంచేయాల్సింది ఏదో వంకన సాక్ష్యాలు లేకుండా :ఫ్.కాకపోతే కల్కి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు అని రాసారుగా అందుకే సగం డౌట్ వచ్చింది హీరోయే కల్కి అని.
అతనికతనే మండిపోవడం అనగానే హీరో ఆర్గానిక్ కెమిస్ట్రీ లో స్టూడెంట్ కదా ఏదో చేసి ఉంటాడు అనుకున్నా గాని… ఈ సైన్స్ నాకు తెలియదు లేండి ఆలోచించినా తట్టదు.
మొత్తానికి మీ కధ చదివి నేను నాలుగు రోజులు పడుకోలేదు,నా ఫ్రెండ్స్ ని ఒక నలబై మందిని పడుకోనివ్వలేదు… స్టోరి చెప్తూ ఏండింగ్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ…
మీకేం సార్ బాగానే కధలు రాసేస్తారు సస్పెన్స్ భరించేవాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ..
చాలా చాలా బాగా రాసారు… ఆ కధనాన్ని ఎలా పొగడాలో కూడా తెలియడం లేదు 🙂
సారీ పెద్ద వ్యాఖ్య ఏమనుకోవద్దు..:)
చాలా బాగుందండీ. అక్కడక్కడా ఆనేను ఈనేను ల విషయంలో ఒకటి రెండు సార్లు చదవాల్సి వచ్చింది కానీ కథ బాగుంది. కథాయణం కోసం ఎదురుచూస్తున్నాను 🙂
మీ కధ చాల బాగుంది.ఇంకొక కధ కొసం ఎదురు చూస్తూ ఉంటాను.
మీరు రాసే కధల కోసం ఎలాగు వెయిట్ చేస్తున్నాం… కధాయణం కోసం కూడా వెయిట్ చేయాలా ????ఇది మీకే అన్యాయం అనిపించడం లేదూ ???
ఈ కథలు కాకరకాయలు సరే….”ప్రవాసం” లో మిగతా భాగాలు ఏవి?
నేను దానికోసమే వైటింగు…..త్వరగా ప్రవాస భాగాలు రాయండి
iam waiting for your blogs.
నేను అప్పటికీ చెప్తాను..వద్దు సార్..క్రొత్త సినిమాలు చూడకండీ అని..నా మాట వింటారా.. ఇప్పుడు చూడండి మొత్తానికి బ్లాగ్ లోకం లో కనిపించడం లేదు..ఇక పోస్ట్లమాట దేవుడెరుగు …
బాలయ్యబాబు ‘సింహా’నే నన్నేమీ చెయ్యలేకపోయింది. మిగతా కొత్త సినిమాలో లెక్కా? 🙂
ప్రస్తుతానికి వేరే హాబీలతో బిజీ. మళ్లీ రాయాలనిపించినప్పుడే మరో పోస్టు.
మీ కల్కి నేనిప్పుడే చదివానండీ, చాలా బావుంది. మీరు చెప్తున్నదాన్నీ ఊహించడానికి ప్రయత్నించాను, ఉహూ అందలేదు. “ఆ నేను, ఈ నన్ను” అబ్బే అసలు ఎక్కలేదు. మీకెలా వస్తాయండీ ఇలావి ఐడియాలు…కానీ కథ మాత్రం సూపరు. ఎక్కడా పట్టు తగ్గకుండా చాలా చాలా బాగా రాసారు.
story chala bagundi sir.great job