కల్కి – 1

సహ బ్లాగరొకరు సరదాగా నాకో సవాలు విసరటం, బదులుగా నేను  కథలు వడికి జనాభా మీదకి విసిరే పని మొదలెట్టటం …. పద్నాలుగు నెలల పాత ముచ్చటిది. ఇందాకా విసిరినవి నాలుగు. ఐదోది – ‘కల్కి’ – కొండవీటి చాంతాడంతైనందువల్లనూ, కుదించటం కుదరనే కుదరనందువల్లనూ – రెండు భాగాలుగా తెగ నరికి రెండు ఆదివారాలపాటు అచ్చొత్తాలని ‘సాక్షి’ దినపత్రిక వారు నిర్ణయించారు. మొదటి భాగం ఈ రోజే బయటికొచ్చింది (ఇక్కడ లభిస్తుంది). ముందే చెప్పినట్లు, ఇది మొదటి భాగం మాత్రమే. కాబట్టి కథ అర్ధాంతరంగా ఐపోయిందనుకునేసుకుని తొందరపడి రాళ్లేయకండి. పై ఆదివారం దాకా ఓపిక పడితే మిగతా భాగమూ చదివి ఆ రాళ్లేవో తీరిగ్గా అప్పుడే విసరొచ్చు.
ఆన్‌లైన్ పాఠకులకో గమనిక: అక్కడ కథ పేరు చూసి కంగు తినొద్దు. అదో భీభత్సకరమైన అప్పుతచ్చు. దాన్ని మించి, కథలో వివిధ సెక్షన్ల మధ్య ఉండాల్సిన సెపరేటర్లని కూడా ఎగరగొట్టేశారు. కాబట్టి, కథ చదివి మీరు గందరగోళపడిపోతే అది నా తప్పు కాదు. ఈ గొడవంతా ఎందుకనుకుంటే, శుభ్రంగా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుని చదవండి. అక్కడన్నీ శుద్ధంగానే ఉన్నాయి.
ఇకపోతే, ఈ కథ వెనక చాలా కథుంది. ఈ కథాంశానికి ప్రేరణ, దీనికి ముడిసరుకు కోసం నే పడ్డ పాట్లు, సేకరించిన వివరాలు, గట్రా, గట్రా – మరోసారి ‘కథాయణం’లోవివరంగా రాస్తాను. ప్రస్తుతానికి నే రాయదలుచుకుంది – ఇద్దరు మహా కథకులకు నేనర్పిస్తున్న నివాళిది. కాల్పనిక సాహిత్యంలో నాకత్యంత ప్రీతిపాత్రమైన ఒకానొక విభాగమ్మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆ ఇద్దరి గురించీ కథాయణంలోనే చూద్దురు, ముందు ‘కల్కి’ సంగతేంటో చూడండి.
షరా మామూలుగానే, కథలో మలుపుల్ని విప్పిచెప్పే వ్యాఖ్యలు సందడి సద్దుమణిగేంతవరకూ కత్తిరించబడతాయి.

17 స్పందనలు to “కల్కి – 1”


 1. 1 SRRao 1:06 ఉద. వద్ద ఆగస్ట్ 15, 2010

  మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  శిరాకదంబం

 2. 2 nestam 2:11 ఉద. వద్ద ఆగస్ట్ 15, 2010

  భలే రాసారు.కధ సరళం గా అర్దం అయ్యేలా ఉంది..నాకైతే చాలా గర్వంగానూ ఉంది…ఇంత చక్కని రచయిత బ్లాగుల్లో ముందే తెలిసినందుకు..అదే పేపర్లో చదివి ఉంటే ..ఎవరబ్బా ఇంత బాగా రాసారు అనుకోవడం తప్ప మా అభిమానాన్ని చాటుకోలేం కదా 🙂

 3. 3 రవి చంద్ర 2:15 ఉద. వద్ద ఆగస్ట్ 15, 2010

  నవ్యత, సమకాలీనత, ఆసక్తి కలిగించే కథనం, మీకంటూ సృష్టించుకున్న ప్రత్యేకమైన శైలి… కథలో ఇవన్నీ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. మిగతా భాగం కోసం ఎదురు చూస్తున్నా…

  ఆ నేను, ఈ నేను… అనే చోట మాత్రం అర్థం చేసుకోవడానికి రెండు మూడు సార్లు చదవాల్సి వచ్చింది. అయినా దాన్ని మీరు రాసిన దానికంటే బాగా వ్యక్తీకరించలేమని అనిపించింది.

 4. 4 వాసు 4:43 సా. వద్ద ఆగస్ట్ 15, 2010

  చాలా రోజుల తరువాత (మరో ప్రపంచం తరువాత ) ఒక ఆలోచింపచేసే కథ చదివాను. మరో ప్రపంచం చదివినప్పుడు మీరు జేమ్స్ కామెరూన్ లా భవిష్యత్తులోకి పరిగెడుతూ ఉంటె కొన్ని బ్లాగులు (నా బోటివి ) కరణ్ జోహార్ సినిమాల్లా అనిపించాయి. మీరు ఈ సారి ఇంకో అడుగు ముందుకేశారు మీరు. మీకు మురళిగారి కథల్లో అన్నిటికంటే ఉత్పరివర్తనం ఎందుకు నచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది.

  మొత్తానికి కథ అదరగొట్టారు. నేను తెలుగు కాల్పనిక సాహిత్యం (ఫిక్షనే కదా ) అసలేం చదవలేదు. మీ కథ ముందుమాటని బట్టి బోలెడు అద్భుతమయిన సైన్స్ ఫిక్షన్ కథలు తెలుగు వచ్చాయని తెలుస్తోంది.

  త్వరలో మీ కథల సంపుటి పుస్తకం గా విడుదలవ్వాలని ఆశిస్త్తున్నాను.

 5. 5 వాసు 4:43 సా. వద్ద ఆగస్ట్ 15, 2010

  ఈ నేను ఆ నేనుని చంపడం – Grandfather’s Paradox ని రిసాల్వ్ చెయ్యడానికి ఏం వాడారా అని వెతుకుతున్నాను కథలో.

  అన్నట్టు Frequency, Deja vu సినిమాలు బాగా గుర్తొచ్చాయ్.

 6. 6 మేధ 9:31 సా. వద్ద ఆగస్ట్ 15, 2010

  ఒక నవలకి కావల్సినంత అంశాన్ని ఎంచుకుని, మరీ కధలా మార్చేయడం.. హ్మ్.. మీరు నవల వ్రాయాల్సిందే!

 7. 7 nestam 10:33 సా. వద్ద ఆగస్ట్ 15, 2010

  కొంపదీసి హీరోయే కల్కి కాదు కదా ??? చదువుతున్న కొద్దీ అలానే అనిపించేస్తుంది..అందులోనూ మీరు చివరాకరికి హీరోనే అన్ని సంఘటనలకి బాధ్యుడిని చేసేస్తారు…. చాలా చాల బాగారాసారు … కధనం బాగా నచ్చేసి రెండో కామెంట్ అన్నమాట

 8. 8 కన్నగాడు 1:58 ఉద. వద్ద ఆగస్ట్ 16, 2010

  మీరు ఎప్పటిలాగే కథను అద్భుతంగా రాసారు, మీకు కథ రాయడానికి మూలం(ప్రేరణ) ఏంటో తెలీదు కాని నాకైతే కొన్ని అంగ్ల చిత్రాలు గుర్తుకొచ్చాయి.
  పనిలో పని, ఈ కింది పోస్ట్।లో కామెరాన్ గురించి చిన్న చర్చ జరిగింది, మీ అభిప్రాయం కూడా ఒకటి వదలండి
  http://ubusu.blogspot.com/2010/08/blog-post_15.html

 9. 10 K.Mahesh kumar 3:11 ఉద. వద్ద ఆగస్ట్ 16, 2010

  బాగుంది. నాకెందుకో యండమూరి గుర్తొచ్చాడు.

  • 11 అబ్రకదబ్ర 8:13 సా. వద్ద ఆగస్ట్ 17, 2010

   మీ అభిమానం 🙂 కాకపోతే కథాంశాల్లో ఉత్కంఠ మేళవించటం అనేదొక్కటీ వదిలేస్తే, నిజానికి ఆయన శైలికి నాది ఆమడ దూరంలో ఉంటుంది. యండమూరి రచనల్లో వెల్లివిరిసే భావుకత నా వాటిలో మచ్చుకైనా ఉండదు. ఆయన ఓ బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథల్లుతాడు; నా కథల్లో అసలు స్త్రీలే ఉండరు. వెదకండి, ఇంకా ఇలాంటివెన్నో.

 10. 12 Srinivas 2:38 సా. వద్ద ఆగస్ట్ 17, 2010

  ఉత్కంఠ తేకెత్తించే కథనం బాగుంది. చదవడం మొదలెట్టాక మీరు రాసినట్టు తెలిసిపోయింది. కాకపొతే యండమూరి ముద్రను మీరు వదుల్చుకోలేరనుకుంటాను.
  మింగుడు పడనిది ఒక spontaneous combustion తో (మూడ్రోజులయ్యాక మళ్ళీ కనిపించిన పుకారు వినవచ్చినా) ప్రపంచ వ్యాప్తి చెందే ఒక మతం ఏర్పడటం; అదీ శాంతి పూరితంగా ;-). ఇంకో ఎత్తు వేయాల్సిందక్కడ.

  • 13 అబ్రకదబ్ర 3:32 సా. వద్ద ఆగస్ట్ 17, 2010

   But nowhere did I say it happened over night. SHC started it all. After that, it could’ve taken several decades to spread all over. What do you think his ‘six apostles’ were doing? 😉 This being a short story (which already got too long to be called so), I couldn’t risk a few extra lines to explain that chronology. They’re not of much interest to our protagonist any way. Besides, I’m the kind of writer who leaves such gaps on purpose for the readers to be creative and fill in – which must be apparent from the endings of ‘Nagarikatha’ and ‘Maro Prapancham’.

 11. 14 chavakiran 11:35 సా. వద్ద ఆగస్ట్ 17, 2010

  I read and enjoyed your story. I will reserve my comments until next part is out 🙂

 12. 15 3g 6:40 ఉద. వద్ద ఆగస్ట్ 22, 2010

  ఈ ఆదివారం కోసం గత ఆదివారం నుండి వేచిచూస్తున్నాను మీ కథకి రెండో భాగం చదవాలని. చదివేవాళ్ళ ఆలోచనల్ని ప్రశాంతంగా ఉంచకుండా పరుగులు పెట్టించే మీ శైలి నాకు బాగా నచ్చుతుంది. మీ ముందు కథలు రెండేసిసార్లు చదివిన అనుభవంవల్లననుకుంట కల్కి ఎవరో కొంచం ముందుగానే ఊహించగలిగాను. ఇక పొదలవెనుక తిరిగే ఆకారం, మూడోరోజున బేస్ కేంప్ కి తిరిగి వెళ్ళే విషయాలు నామెదడు ఇంకా ప్రాసెస్ చెయ్యలేకపోతోంది. ఈ కథకూడా రెండోసారి ప్రశాంతంగా చదవక తప్పని పరిస్థితి.

 13. 16 కన్నగాడు 10:23 ఉద. వద్ద ఆగస్ట్ 22, 2010

  కల్కి-౨ ఇక్కడ రాలేదేమైంది, ఏమయినా సాక్షి పత్రికలో చదివాను బాగుంది. ఈ కథలో కూడా “కాజాలిటీ పారడాక్స్” ఉంది 🙂

 14. 17 చక్రవర్తి 6:13 సా. వద్ద ఆగస్ట్ 24, 2010

  కన్నగాడు గారు,

  జేమ్స్ కేమరూన్ లాంటి వ్యక్తి షట్టర్ ఐలాండ్ లాంటి పైశాచికమైన సినిమా తీస్తాడని నేను అనుకోను. అలాగే జేమ్స్ కేమరూన్ తీసిన కొన్ని సినిమాలు నాకు చాలా బాగా నచ్చాయి. నాకు నచ్చిన సినిమాలలో ఎక్కువ శాతం త్యాగం అనే ఒక్క మూల కారణంగా మాత్రమే తీసినవి అయ్యుంటాయి. అలాంటి సినిమాలలోకే వస్తుంది అవతార్ సినిమా కూడా. అవతార్ సినిమా గురించి చర్చించడం కన్నా.. జేమ్స్ కేమరూన్ గురించి చెప్పాలంటే.. ఈ తీసిన సినిమాలలో ఎక్కువ శాతం కల్చర్ అనే పదం పై అధార పడి ఉంటుందని నా అభిప్రాయం. ఆఫ్‍కోర్స్ నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను కాబట్టి నాకు ఇంతకు మ్రించి ఎక్కువ తెలియదు. ఏది ఏమైనా జేమ్స్ కేమరూన్ లాంటి వ్యక్తి షట్టర్ ఐలాండ్ లాంటి సినిమా తియ్యడు అని నేను ఘంటా పధంగా చెప్పగలను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: