ఏడెనిమిది నెలల కిందటి మాట. నాగరికథ మీద పనిచేస్తుండగా వచ్చిన చిన్న ఐడియాని విస్తరించి అధివాస్తవికత, సైన్స్, కొంత వేదాంతం కలగలిపి చిట్టి కథొకటి రాశాను. దానికి ‘మరో ప్రపంచం’ అని పేరు పెట్టాను. అది పూర్తయేలోపు నాగరికథ అచ్చవటం, హిట్టవటం జరిగిపోయాయి. విజయం విశ్వాసాన్నిస్తుందంటారు. నాకు మాత్రం అనుమానం తెచ్చిపెట్టింది – మరో ప్రపంచం మీద. రాసినప్పుడు బాగానే అనిపించినా, ఆ తర్వాత ఎక్కడో ఏదో లోపించిందన్న అనుమానం (వేరేవీ ఉన్నాయి. అవేంటో తర్వాతెప్పుడన్నా తీరిగ్గా రాస్తాను). హడావిడిగా ఈ కథని ప్రచురింపజేసుకుని వచ్చిన కాస్తో కూస్తో పేరు చెడగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో దాన్ని అవతల పారేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకి ఓ స్నేహితుడి బలవంతమ్మీద తటపటాయిస్తూనే దాన్ని వంగూరి ఫౌండేషన్ వారి పోటీకి పంపటం, అది ఊహాతీతంగా అందులో నెగ్గటం తాజా కబురు. ఆ ఫౌండేషన్ వారి కథల పోటీల్లో గెలుపొందిన రచనలు కౌముదిలో లేదా రచనలో ప్రచురించే సంప్రదాయం ఉందట. అలా మరో ప్రపంచం దానంతటదే ప్రచురణకర్తల్ని వెదుక్కుంది, పుట్టిన ఆరు నెలలకి వెలుగు చూసింది – ఈ నెల కౌముదిలో.
అదీ – నా గురించీ, నా కథ గురించీ స్వాతిశయ సొంత డబ్బా. ఇంత గప్పా చదివాకా ఆసక్తి (అనగా ధైర్యం) కలవారు ఇక్కడ నొక్కితే కథ చదవొచ్చు. ఒరిజినల్ డ్రాఫ్ట్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది (రెండిటికీ తేడా శూన్యం. ఏ రాయైనా ఒకటే)
Note: Please do not read the comments before reading the story
పేరు పెట్టటానికి లేని రచన, చా……….లా బాగుంది
కథ కొత్తగా,ఆలోచింపచేసేట్టుగా ఉంది. Good job.
ఎందుకో Jodie Foster – Contact సినిమా గుర్తుకొచ్చింది.
పోతే చిన్న సందేహము.. ఈ కథ రాసింది నాకు తెలిసిన ఈ లోకములోని మీరా లేక.. :-).
రాసింది మీ లోకంలోని నేనే.
Contact is one of my fav sci-fi movies of all time. Slow paced – but makes sense for a storyline that deals with vast expanses of space and time.
బాగా రాసారు. బహుమతి లభించినందుకు అభినందనలు.
కానీ ఎక్కడో లాజిక్ మిస్సయినట్టు అనిపిస్తుంది. బహుశా మీరు multiple Universes గురించి చెపుతుంటే నేను wave function collapse గురించి ఆలోచిస్తున్నానేమో!
దీనికంటే ‘నాగరికథ ‘ ఇంకా లాజికల్ గా పకడ్బందీ గా వుందని నా అభిప్రాయం.
అన్నట్టు సొంత dopplegangerని చూడటం రాబోతున్న మృత్యువుకి సంకేతం అంటారు. 🙂
Well done, again.
శారద
హింట్ పట్టేశారు 🙂
లాజిక్కేమో కానీ ఇందులో ఫిక్షన్‌కన్నా సైన్సు సోది ఎక్కువయిందని నా అనుమానం. అందుకే ఇన్నాళ్లూ బయటపెట్టటానికి మొహమాటపడ్డాను.
ఒక పద్దతి ప్రకారం రాస్తే సోదే ఆసక్తికరంగా ఉంటుంది, ఈ కథలో ఉన్నట్టు.
BTW మీరు Butter fly effect సినిమా చూసారా, ఈ కథకేం పోలిక ఉండదు కాకపోతే బాగుంటుంది.
నిజం చెప్పాలంటే ఇంత వేదాంతం ఉన్న కధలు చదవడం నావల్ల కాదు..కానీ మీ శైలి 3 సార్లు చదివేలా చేసింది…ఇప్పటివరకు పీడ కలలు ఎక్కడ నిజం అవుతాయో అన్న ఒకే కోణం లో ఆలోచించేదాన్ని … కానీ ఇంకో కోణం లో కూడా జరిగే అవకాశం ఉంది అని ఇలా భయం పెట్టేస్తారేంటండి బాబు.. మొత్తం మీద చప్పట్లు… సూపరూ …:)
కథ బాగుంది.
లాజిక్కులు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
climax is expected based on ur previous stories gadiyaaram, and aaropraanam. If u bring ur multiple universe concept just before the end, then it might have increased the curiosity a bit more. From the point u r aligning the story with the “time lines”, it is little expected. But not a boring read.
కథ బాగుంది కాని నాకొక చిన్న సందేహం ఇద్దరు హాస్పిటల్ ముందు కలవాలి కదా కాని మీ కధనం ప్రకారం ఇది జరగదేమో (కార్ దూరం గా పార్క్ చేసాడు కదా )? లేకపోతే ఇద్దరే ఎందుకు ఉండాలి ఇంకొక నకలు కూడా ఉన్నారా 🙂
ఓహ్ అర్ధమైంది ! మట్టి బుర్ర కు 4 సార్లు చదివితే కాని వెలగలేదు 🙂
ఇంకో నకలా? అసలు ఒక నకలూ లేరనీ అనుకోవచ్చుగా.
ఈ వాక్యం గుర్తుందా – ‘మనకి తెలీని దృక్కోణాలూ ఉంటాయి’. The whole thing is just the protoganist’s perspective – nothing more than that. It’s a collection of random thoughts, a recollection of recently learnt strange facts, and an unfortunate event. Together, they defined his perspective on the climactic incident. It’s unclear if that’s actually what happened in the end. Who knows, may be it happened the usual way. There could be dozens, if not hundreds, of cars that look just like his.
నిజమే కదా యాదృచ్చికం గా జరిగి ఉండచ్చు , ఐనా నిజం గా పారలెల్ గా జరిగితే నిద్ర లేచి హాస్పిటల్ కు వచ్చే సమయం ఉండదు కదా 🙂
” ఒక్కో విశ్వంలోనూ కాలం ఒక్కో వేగం తో నడవవచ్చు. ఒక చోట క్షణం మరొక చోట యుగం కావచ్చు.
అరక్షణం ఈజ్ ఈక్వల్ టు మూడు గంటలు. ”
మీరు మరొక్కసారి కధ చదవవలిసినదిగా వినతి. 🙂
ఈ కథని కౌముదిలో చదివి, అక్కడిచ్చిన బ్లాగ్ లింకుకొచ్చి చూసి..ఓహ్ ఇది రాసింది తెలుగోడు బ్లాగరా అని ఆశ్చర్యపోయానండీ! మళ్ళీ, నా బ్లాగులోకొచ్చి చూస్తే మీ వ్యాఖ్య ఉంది. surprise!
మీ కథ చాలా బాగుంది. కథలో 8:21 దగ్గరికి వచ్చేసరికి నాకు కూడా అప్పుడు జరుగబోయేదేంటో అర్థమైపోయింది. అంతగా ఇన్వాల్వ్ అయిపోయానన్నమాట చదువుతూ! బహుమతి పొందినందుకు అభినందనలు.
కొన్నేళ్ళ క్రితం విపులలోనో లేక మరో పత్రికలోనో ఓ కథ చదివాను. అందులో ఒకామెకి ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి గురించి ఇలాంటి కల, ఇలాంటి ముగింపే ఎదురవుతుంది. అది అనువాద కథ అనుకుంటాను. ఆ కథ బేస్ లైన్, మీ కథ బేస్ లైన్ ఒకటే అవడం ఆశ్చర్యం అనిపించింది. ఆ కథ వివరంగా చెబితే ఈ కథ కీలక మలుపులు వివరంగా తెలుస్థాయి కాబట్టి ఆ కథలోని మలుపులు వివరంగా చెప్పడం లేదు. మీరు ఓకే అన్నప్పుడు ఆ కథ నాకు గుర్తున్నంతవరకూ వివరంగా చెబుతాను.
మీరు మరో ప్రపంచంలో ఆ కథ ఇప్పటికే వ్రాసివున్నారేమో!
ఫర్లేదు ఇప్పుడే చెప్పండి (దాన్నెటూ అవసరమైనంతవరకూ ఎడిట్ చేస్తానుగా). అదేమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
చాలా ఏళ్ళయ్యింది ఆ కథ చదివి కాబట్టి ఎక్కువగా గుర్తుకులేదు. విపులలోనే ఇలాంటి కథలు వేస్తారు కాబట్టి అందులొనే ఇతర భారతీయ భాష నుండి అనువదించిన కథ చదివానని అనుకుంటున్నాను. నేను చదివిన కథలో ఒక యువతికి వచ్చిన కొన్ని కలలు నిజం అవుతూవుంటాయి. ఒకసారి కలలో వచ్చే శనివారం రోజు (అనుకుంటా) సాయంతరం 4:30 గంటలకు (అనుకుంటా) తనకు తెలిసిన ఒక బస్సుస్టాండులో ఎర్ర చీర కట్టుకున్న యువతికి కారు ఏక్సిడెంటు అయి మరణిస్తుందని కల వస్తుంది. ఆ యువతిని ఎలాగయినా ఆ ప్రమాదం నుండి కాపాడాలని ఆ రోజు, ఆ సమయానికి (కొద్దిగా ముందుగా) , ఆ బస్సు స్టాండుకి చేరుకుంటుంది. ఎర్ర చీర కట్టుకున్న యువతి కనపడుతుందేమో హెచ్చరిద్దామని ఉద్విగ్నంగా పరికించి చూస్తుంటుంది. ఈలోగా ఒక కారు అదుపుతప్పి ఆమెకే గుద్దుకుంటుంది. ఆమె మరణం సంభవిస్తున్న క్షణాన ఆమెకు తానే ఎర్ర రంగు చీర కట్టుకున్న విషయం గుర్తుకువస్తుంది!
అన్నట్లు ఆ కథ పేరు ‘ఎర్రచీర’ అని లీలగా గుర్తుకువుంది. చాలావరకు దక్షిణ భారతీయ కథ (తమిళ్) అని కూడా గుర్తుకువుంది. రచయిత,అనువాదకుడు గుర్తుకులేడు.
మంచి కాన్సెప్టుతో ఉంది మీ కథ. మీకు మల్లెనే నాక్కూడా సెంటిమెంటు కథలు చదివి చదివీ విసుగెత్తిపోయింది. కొత్త తరహా కథ అందించినందుకు కృతజ్ఞతలు.
అబ్రకదబ్ర గారు,
చాలా రోజుల నుంచి మీ బ్లాగ్ చదువుతున్నాను కానీ ఎపుడు రిప్లై ఇవ్వలేదు. ఈ రోజే మీ మరో ప్రపంచం చదివా. అద్బుతంగా ఉంది. చాలా బాగా రాశారు.
కృతజ్ఞతలు,
శ్రావణ్
Those who are fooling around with people’s lives in the name of seperate telangana, should learn a lot from these kids.
http://www.eenadu.net/main4.asp
I know, this comment is not related to this posting, but thought this will message will get to more people who look at this blog and who want to ask for telangana.
I wish we get more and more of this kind of sincerere citizens for India, rather than fools who just ask telangana, but do nothing to develop people’s lives at all.
మీరు ఈ కధ పెట్టగానే చదివినా, అసలు నచ్చిందా నచ్చలేదా, కామెంటాలా వద్దా, కామెంటితే ఏమని కామెంటాలి అని ఆలోచిస్తా ఇంత ఆలస్యం అయ్యింది. కధ ఆలోచింపచేసెది గా వుంది. ఎటొచ్చి ఈ సమాంతర విశ్వాలు అన్న కాన్సెప్ట్ పై హాలివుడ్లో ఒకటో రెండో సినిమాలు వచ్చాయి కదా! శరత్ గారు చెప్పిన కధ నేను కూడా చదివినట్టు అనిపిస్తుంది కాని గుర్తుకు రావడం లేదు.(లేదా నా నకలు మరో లోకంలో ఆ కధ చదివి వుంటుందా!)
ఇక యధావిధిగా నా అనుమానాలు(ఆల్రేడీ శ్రీ వాసుకి గారు నాకు అనుమానపు పక్షి అని పేరు పెట్టేసారు కాబట్టి ఇది నా బాధ్యత :-))
>>ఒకటి కన్నా ఎక్కువ సంభావ్యత వున్న ఏ సంఘటన జరిగినా అప్పుడు మరిన్ని కొత్త లోకాలు పుట్టుకు వస్తాయి. >>
మరి అంతకు ముందు వరకు ఆ విశ్వాలు వుండవా? ఈ సిధ్ధాంతం ప్రకారం మరి మన ప్రపంచం ఎలా పుట్టి వుంటుంది.ఈ కధ ముగింపులో మరో ఫలితం ఏర్పడడం కోసం మరొక విశ్వం పుడుతుందా?? లేక కధా నాయకుడు మరొక లోకం తన నకళ్లు ఇంకా బ్రతికే వుంటాయని సంతృప్తి పడుతున్నాడా? లేక మరో ప్రపంచంలో భౌతిక నియమాలు వేరుగా వుండవచ్చు కాబట్టి ఆరడగుల ఎత్తు నుండి తల క్రిందులా కింద పడ్డా ఏమి కాదన్న ధైర్యమా?
ఇదంతా కేవలం తన ఆలోచన మాత్రమే కావచ్చు అన్నది కొంచెం నిరాశ కలిగించేదిగా లేదూ? నాగరి ‘కధ ‘ లో కొసమెరుపు (ది మమ్మీ సినిమా అడ్వర్టైజుమెంటు) లా ఏమి ఈ కధలో లేకపోవడం బహుశా కొంత మందికి నిరాశ కలిగిస్తుంది ఏమో?
ఇంకో వినతి: మీరు కూడా నీతి కధలు రాయండి ప్లీజు. ఒక మంచి రచయత ఒక మంచి పాపులర్ రచయతగా వుండిపోవడం నాకు మటుకు నచ్చడం లేదు. మీ వద్ద చెప్పే శైళి వుంది. విషయ పరిజ్ఞానం వుంది. కేవలం ఇప్పటి వరకు నీతి కధలు చెప్పిన వారి పద్దతి మీకు నచ్చలేదు. మీరు చెబితే ఎలా చెబుతారో ఒకసారి ప్రయత్నించి చూడండీ.
ఇంకో డౌటు: నాకు కధలు రాయలని కోరికా! కాని రాసి వాటిని పోస్టు చెయ్యడం చిరాకు. వెబ్‌జైన్ల సంగతి పక్కన పెట్టండి. ప్రింటులో చూసుకోవాలి అంటె, ఇప్పుడు వున్న పత్రికలకి ఈ-మెయిలులో పంపే సౌకర్యం వుందా?
హాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. టెర్మినేటర్ (Yes, even that series is really about parallel worlds) నుండి క్రానికిల్స్ ఆఫ్ నార్నియా దాకా. ఆ మధ్య జెట్ లీ సినిమా కూడా ఒకటొచ్చింది – The One అనుకుంటా.
MWI నా సిద్ధాంతం కాదండీ. క్లుప్తంగా చెప్పాలంటే కష్టం. స్టీఫెన్ హాకింగ్ స్ట్రింగ్ థియొరీ మీద రాసిన పుస్తకాలు, ఇంకా వేరేవి చదివితే కొంచెం కొంచెంగా అర్ధమవుతుంది.
ఇదంతా అతని ఆలోచన కావచ్చుగా అనేది ఇక్కడ వ్యాఖ్యాతగా నా మాట. కథా రచయితగా ఆ ముక్క కథలో నేననలేదు. My story is open ended. You can assume whatever you want 🙂
ఆశ్చర్యకరమైన ముగింపుతో కూడిన ఉత్కంఠభరితమైన కథలే నాకు సాధారణంగా నచ్చుతాయి. అందుకే నేనూ అలాంటివే రాస్తున్నాను. వీటిలోనూ నీతులున్నాయి – కాకపోతే వెతుక్కుంటే తప్ప కనపడవు. ‘గడియారం’ నుండి ‘మరో ప్రపంచం’ దాకా మళ్లీ చదివి చూడండి. కనిపిస్తాయి 😉
ఈ-మెయిల్ ద్వారా పత్రికలకి పంపొచ్చు. వివరాలు కావాలంటే నేనిస్తాను.
గడియారం : అమానవీయ శక్తులు వున్న లేక పోయినా మన విజ్ఞత కంటె వాటి మీదే ఆధరపడడం సరి కాదు.
ఆరో ప్రాణం : అనాలోచితంగా ఎవరిని అనుమానించకూడదు, అలాగే నమ్మెయ్యకూడదు. కొంచెం ఆలోచించాలి.
నాగరి ‘ కధ ‘ : dont just look… see!!!
మరో ప్రపంచం : %$*!%$^@
(బుర్ర గోక్కుంటున్నాను, కధ అర్ధమయ్యింది అని పెద్ద ఫోజు కొట్టా, మరో సారి చదవండి అని ఒక వాఖ్యాత వద్ద బిల్డప్పు ఇచ్చా అర్ధం అవ్వడానికి నా లా మేధావి అవ్వాలంటూ, తీరా చూస్తే నాకు ఇందులో నీతి ఏమిటో చెప్పలేకపోతున్నా! నాకు సరిగా అర్ధం కాలేదా కొంప దీసి ??? హ్మ్… ఇంతకీ మీ మొదటి మూడు కధలకన్నా సరైనా వాఖ్యానమేనా అండీ నాది?? )
ఇక పత్రికల ఇ- తంతి చిరునామాల విషయంలో మీరు సహాయం చేస్తె కృతజ్ఞుడిని.
ఆ మూడూ సరిగా పట్టేశారు 🙂 ఇది పట్టుకోకపోవటం ఆశ్చర్యమే…. కథలోనే ఓ వాక్యంలో ఉంది కదా!
The plot element of మరో ప్రపంచం is kind of an extension to that of నాగరికథ. So in a way, the ‘message’ of మరో ప్రపంచం is an extension to that of నాగరికథ – too. If నాగరికథ says ‘see .. do not just look’, మరో ప్రపంచం says ‘there is more than one way to see it’. In other words, there is nothing called absolute truth. తేలికపాటి తెలుగులో చెప్పాలంటే: మనకి తెలిసిందే వేదం కాదు.
ఓహ్!!! కరెక్టే కదా! దృక్కోణాలు గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది ఈ కధలో! బాగుంది మీ వివరణ కూడా. ధన్యవాదములు. కానీ ఇంకొక విషయంలో నాకు ఒక అనుమానం. ఆల్రేడి మీరు దీనికి గురించి చెప్పారనుకుంటా! మీ నాగరికధ గానివ్వండి, ఇప్పటి మరో ప్రపంచం కానివ్వండి, మామూలు పాఠకులు ఎంత మంది సరిగా అర్ధం చేసుకుంటున్నారు? కధ స్థాయి, రచయత స్థాయి కి పాఠకుడి స్థాయికి వున్న అంతరం లో తాను చెప్పలనుకున్నది ఎదుటివారికి అందకపోవడం అనే ప్రమాదం వుంటుంది కదా! పాఠకుల స్థాయి కి దిగి రాయనక్కరలేదు గాని, టైము ట్రావెల్ , సమాంతర విశ్వాలు ఎంతగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి అంటె అసలు మెసేజ్ ఎక్కడో దారి తప్పి పోతుంది. అప్పుడు నాలాంటి వాళ్లు అదెందుకు ఇదెందుకు అని మిమ్మలని విసిగించడం అనే ప్రమాదం వుంది 🙂 ఇంకా రచయత గా మీరు చెప్పాలనుకున్నది మేము అందుకోలేక పోతున్నామని మీకు కూడా ఒక అసంతృప్తి కలగవచ్చు. యండమూరి నే తీసుకోండి, ఒక పాపులర్ రచయత గా తనకున్న లిమిటేషన్ల వలన తనలోని రచయత చాలా సార్లు రాజీ పడవలసి వచ్చిందని వాపోతాడు. ఇప్పటి రచయతల నీతి మరీ పాచి వాసన కొడుతూ నిస్సారంగా వుండవచ్చుగాక! కానీ లియొ టాల్‌స్టాయ్ అభివ్యక్తత, అభూత కల్పనలు థ్రిల్లర్లకి తక్కువేమి కాదు. కానీ నీతి కప్పబడిపోలేదు కదా ఎక్కడా!
నా ఆలోచన దోరణి ఇది. ఇందులో తప్పులు వుండవచ్చు, కాని మీకు చెబితే గాని ఉపశమనం దొరకదు.ఎప్పటికన్నా ఒక మంచి కధ (నవ్విస్తానే మనలని మంచిగా మార్చే ప్రయత్నం చేసె కధ) రాస్తారని ఆశిస్తా 🙂 మీరు రాసిన కధలు బాగొలేవని కాదండీ నా ఉద్దేశ్యం. మీ నుండి ఒక క్లాసిక్ రాగలదని నా ఆశ!
>> ” టైము ట్రావెల్ , సమాంతర విశ్వాలు ఎంతగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి అంటె అసలు మెసేజ్ ఎక్కడో దారి తప్పి పోతుంది”
మెసేజ్ ఇవ్వటానికి సినిమా ఎందుకూ, టెలిగ్రామిస్తే పోలా అన్నాడో పెద్దాయన. మన జీవితాల నిండా ఉండే డ్రామానే తలా ఒక రకంగా తిప్పించీ మళ్లించీ చెప్పి మెసేజిలివ్వటం ఎందుకూ? బోర్. అలాంటివి రాయటం తేలికో ఎందుకో మరి అందరూ అవే రాసి పారేస్తున్నారు, చదివేవాళ్లకీ వేరే దారిలేక సర్దుకుపోతున్నారు. వాళ్లకి కొత్తదనం రుచిచూపిస్తే, అవసరమైతే రచయిత స్థాయికి ఎదిగైనా అర్ధం చేసుకోటానికి తయారుగా ఉన్నారని ‘నాగరికథ’కి నాకొచ్చిన ఇ-మెయిళ్ల ద్వారా తెలిసింది. కాబట్టి పాఠకుల స్థాయిని తక్కువగా అంచనావేయకండి.
ఆ మెసేజిని బలంగా హత్తుకు పోయెటట్టు చెప్పడానికి. ప్రతి కధలోను / సినిమాలోను నీతి వుంటుంది. అది క్రైము థ్రిల్లరైనా, ఒక సామాజిక అంశం పై సెటైరిక్ అయినా! ఒక కన్యాశుల్కం తీసుకోండి, లేకపోతె తారె జమీన్ పర్ తీసుకోండి, బలంగా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం వుంటుంది. అలాగే అవతార్ కూడా! ప్రకృతి పట్ల గౌరవం చూపమని చెబుతుంది ఆ సినిమా! కాని టెర్మినేటర్ ??? యంత్రాల పై ఎక్కువ ఆధారపడడం మన వినాశనం కే దారి తియ్యొచ్చని నర్మ గర్భంగా చెప్పినా అందులోని స్పెషల్ ఎఫ్ఫెక్టులు, భారీ చేజింగులు గురించే మాట్లాడుకుంటూ థియేటర్ బయటికి జనాలు వస్తారు. అంతెందుకు ఇప్పుడు ఇన్ని వాఖ్యలలో ఎంత మంది, దృక్కోణాల గురించి మాట్లాడుకున్నారు కధ చదివాక!అందరికి ఆ విషయం అర్ధం అయ్యి వుండవచ్చు గాని చర్చ, అందరి దృష్టి సమాంతర విశ్వాల పైనే వుండి పోయిందేమొ కదా! నాగరికధ చదివాక అర్ధం కాని పాఠకుల జవాబులు గురించి మీరు చెప్పారు కదా! ఆన్‌లైను పాఠకులకి, ప్రింటు చదివే పాఠకులకి కొంచెం వేరు వేరు స్థాయిలలో కధ రాస్తే బావుండునని మీ అభిప్రాయం కదా? బహుశా మన దృక్కోణాలు వేరు వేరు కావచ్చు.>>‘there is more than one way to see it’. In other words, there is nothing called absolute truth.>> నా దృక్కోణమే కరెక్టని నేను అనడం లేదు, కాని ఈ దృక్కోణంలో కూడా ఆలోచించమని ప్రార్ధన!
>> “అందరికి ఆ విషయం అర్ధం అయ్యి వుండవచ్చు గాని చర్చ, అందరి దృష్టి సమాంతర విశ్వాల పైనే వుండి పోయిందేమొ కదా”
Exactly. అదే నేను ఆశించింది కూడా. దాన్నొదిలేసి నా కథలో నీతి గురించి జనాలు మాట్లాడుకుంటూ ఉంటే ఓ రచయితగా నేను పరాజయం పొందాననుకుంటాను. I’m glad that’s not the case.
im glad that u got the intended result. success of our efforts can only be judged according to our perspective. judging a classical singer in a western’s(music) point of view …. wont make sense. and certainly i am not one who can judge whether ur efforts yielded you intended result. we have quiet different points of view about how to write. i would like to hear 4m u abt my write-up (whenever it gets completed 🙂 ) any how once again congrats.
Absolutely brilliant!
కాస్త చదివాక ముగింపు తెల్సిపోయినా అస్సలు ఆపకుండా చదివేలా చేశారు!
శుభాకాంక్షలు 🙂
చాలా బాగుంది. మంచి కథ.
తెలుగులో సై ఫై కథలు చూడడం అరుదే, మీరు వ్రాయడం ఆనందంగా ఉంది.
తెలుగు పదాలు ఉన్నచోట ఆంగ్ల పదాలు వాడడం తగ్గిస్తే బాగుంటుంది. “లోకల్ ట్రైన్ ట్రాక్స్” వగయిరా… కావాలని చేసిందయితే ఒకే 🙂
కథ బాగుంది. మధ్యమధ్యలో కొద్దిగా బోర్ కొట్టింది. కొంచెం ఎడిటింగ్ చెయ్యాల్సింది. డాక్టర్ పాత్ర ఇంకొంచె ఎష్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఊరికే పేషంట్ కు స్వాంతన చేకూర్చటానికి డాక్టర్ అలా అబద్దమాడినట్టు అది నిజమై కూర్చున్నట్టు మారిస్తే ఎలా ఉంటుంది.
brilliant!
and congratulations!
ఇంకొంచెం కుదింపు ఉండొచ్చన్న చావా మాటలతో ఏకీభవిస్తాను.
@అబ్రకదబ్ర: ఈ కథ కూడా బావుంది.
అఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ కామెంట్ వెయ్యకపోతే తెలు-గోడు కొచ్చే నష్టం లేదు. కానీ, ’పొగడ్త ప్రోత్సహిస్తుంది’. ఇలా ప్రోత్సహించకపోతే, తెలుగోళ్ళకి నష్టం రావచ్చేమో!! అని.. 🙂
Rayraj .. yes did the right thing. మనకి ఏదన్నా నచ్చినప్పుడు కచ్చితంగా ఆ మెచ్చుకోలు చూపాలి! ఆ పుచ్చుకునేవాడు హిమాలయోన్నతుడా, వాలఖిల్యుడా అనేది మనకి అనవసరం. Again, you did the right thing.