పదో అబద్ధం:
మాది అభివృద్ధి సమస్య కాదు .. ఆత్మగౌరవ సమస్య
ఇదీ నిజం:
వేర్పాటువాదుల తూణీరంలో మాయా బాణాలన్నీ ఐపోయాక, వాటిలో ఏ ఒక్కటీ లక్ష్యాన్ని తాకక, చివరాఖరికి ప్రయోగించిన అబద్ధపుటాస్త్రమే ఈ ఆత్మగౌరవ నినాదం. తెలంగాణ గౌరవంపై జరుగుతున్న దాడి అంటూ వాళ్లుదహరించే విషయాలు హాస్యాస్పదం: తెలంగాణలో ఆంధ్రా హోటళ్లున్నాయి కానీ ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లేవీ, సమ్మక్క సారక్క జాతర ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెక్కడా చెయ్యరెందుకు .. ఇలాంటివి. వాటిలో నిజానిజాలెంతనేదీ ఇంతకు ముందే వివరంగా చూశాం. తెలంగాణ పరువుకి భంగమేదన్నా కలిగిందంటే – అది నోటికొచ్చినట్లు పొరుగు ప్రాంతీయుల్ని తూలనాడి అదేమంటే ‘ఇదే తెలంగాణ భాష, ఇదే తెలంగాణ సంస్కృతి’ అనే ప్రబుద్ధుల వల్లే. ఆ విషయం తెలుసుకోలేకపోటానికి ప్రజలంత పిచ్చివాళ్లు కాదు. ఎవరివల్లో వాళ్ల గౌరవానికి తూట్లు పడుతున్నాయనుకున్నప్పుడు ఎవరూ తట్టిలేపనవసరం లేకుండానే లేస్తారు, తడాఖా చూపిస్తారు. గతంలో అలా జరిగిన సందర్భాలు ఒకటికి రెండున్నాయి. వాటి జ్ఞాపకాలింకా జనం తలపుల్లో తాజాగానే ఉన్నాయి.
ఆత్మగౌరవ నినాదాన్ని జనరంజకంగా మలిచి, ఆరు కోట్ల ఆంధ్రులకి ఆశాకిరణంగా నిలిచి, ఆంధ్రా సీడెడ్ నైజాముల్లో అసంఖ్యాక హృదయాల్ని గెలిచి – తెలుగోడి దమ్ము చూపుతూ, దశాబ్దాలపాటు సింహాసనంపై తిష్టవేసుక్కూర్చున్న కాంగిరేసు కేతిగాళ్ల దుమ్ము రేపుతూ – ఇరవయ్యెనిమిదేళ్ల కిందటో పెద్దాయన అదిరిపోయే విధంగా అధికారంలోకొచ్చాడు. అయితే నాటి కథలో అసలు నాయకుడు సదరు తెర తార కాదు. అతడో ఆయుధం మాత్రమే; అతడో అవకాశం మాత్రమే. ఆ మహా విజయంలో అతడు కేవలమో పాత్రధారి. సూత్రధారులు తెలుగు ఓటర్లు. వాళ్ల ఆవేదనా, ఆవేశమూ ఎవరో రేపెడితే రాత్రికిరాత్రి పుట్టుకొచ్చింది కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఢిల్లీ దేవత చిన్న కొడుకు కాలి జోళ్లు మోసే స్థితికి దిగజారిన తెలుగుజాతి పరువుప్రతిష్టల్ని మౌనంగా గమనిస్తూ, కాంగీ కామందులకి బుద్ధి చెప్పే తరుణం కోసం నిరీక్షిస్తున్న తెలుగువారికి అతడి రూపంలో అనుకోకుండా రామబాణమొకటి దొరికింది. పెల్లుబికిన పౌరుషంతో దాన్ని గురిపెట్టి కొడితే హస్తిన కుంభస్థలం భళ్లున పగిలింది. అదీ – ఆత్మగౌరవం అంటే. మార్పు కోసం తామిచ్చిన తీర్పుని అపహసిస్తూ, నాటి అధిష్టానాధిదేవత బుర్ర తిరిగేలా తామేసిన తారక మంత్రానికి రెండేళ్లు తిరిగేలోపే దొంగదారిలో తిరుగుబడి చెయ్యబోయిన కుటిల యత్నానికి అదే ఆత్మగౌరవం అంతకు మించిన స్థాయిలో ఉవ్వెత్తున మళ్లీ ఎగసిపడి అడ్డుపడింది, ఊరూవాడా ఏకం చేసింది, గల్లీ నుండి ఢిల్లీదాకా దద్దరిల్లజేసింది. కానీ – ఆ తర్వాత పదకొండేళ్లకి – ఆ తెరవేలుపే మరో మారు పదవీచ్యుతుడైతే చోద్యం చూశారే తప్ప ఆత్మగౌరవం పేరుతో ఆదుకోలేదు ఆంధ్రులు. ఎందుకు? ఈ తడవ గొడవ ఆయన ఇంటి సమస్యే తప్ప తమ ఆత్మగౌరవ సమస్య కానే కాదన్న ఇంగితం ఉండటం వల్ల.
చెప్పొచ్చేదేమంటే – తెలుగు వోటర్లెంత అమాయకులైనా, ఏది తమ ఆత్మగౌరవ సమస్యో, ఏది నేతల బతుకుతెరువు సమస్యో తేల్చుకోగల తెలివితేటలు పుష్కలంగా ఉన్నవారే. ఆత్మగౌరవం అనేది ఎవరికి వారికి అనుభవమయ్యేదే తప్ప ఎవరో రెచ్చగొడితే గుర్తుకొచ్చేది కాదు. అదేమీ అంగడి సరుకు కాదు, అవసరమొచ్చినప్పుడల్లా కేజీల్లెక్కన కొనుక్కోటానికి. బొంత పురుగుల్ని కావులించుకుంటేనూ, బొందలు పెడతామని కావుకావుమంటేనూ, ముక్కు నేలకి రాయిస్తేనూ, మూర్ఖపు వాదాలు చేస్తేనూ, సెలైన్ దీక్షలతోనూ, అమాయకుల (ఆత్మ)హత్యలతోనూ సిద్ధించే వరం కాదది. అడుక్కుంటే వచ్చి వళ్లో పడేదీ కాదది. తొడ కొట్టి సాధించుకోవాల్సిందది. ఆ కలేజా వేర్పాటువాదులకేదీ? అదే ఉంటే ఉడుకురక్తం విద్యార్ధుల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పి తాము మాత్రం తాపీగా ఆ మంటల్లో చలికాచుకుంటూ ఆత్మగౌరవ జపాలు పఠిస్తారా? వాళ్లకి నిజాయితీయే ఉంటే నిజాముని పొగిడిన నోటితోనే ఆత్మాభిమానం గూర్చిన పాఠాలు వల్లెవేస్తారా? తెలంగాణ ఆత్మగౌరవానికి నిజంగానే భంగం కలిగుంటే, మెజారిటీ తెలంగాణవాసుల్లో ఆ భావన నిజంగానే ఉంటే .. ఆత్మగౌరవం పేరుతో రేయీపగలూ రచ్చ చేస్తున్న రాజకీయ పక్షానికి ఏ ఒక్క ఎన్నికలోనూ ఏకపక్ష విజయం దక్కలేదేం? ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారై ఆఖరుకి, ఏ హైదరాబాదు కోసమైతే ఈ నాటకం మొదలెట్టారో ఆ మహానగరం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చెయ్యలేక ముఖం వేలాడేసిందేం?
పదేళ్లుగా పదే పదే చదువుతున్నా ఆత్మగౌరవ మంత్రం ఆశించినన్ని చింతకాయలు రాల్చలేదన్న గ్రహింపుతో వేర్పాటువాదులు ఈ మధ్యనే ట్యూను మార్చారు. ఆత్మగౌరవానికి స్వయంపాలననే తోక తగిలించారు. ఇప్పటిదాకా మోతమోగించిన అభివృద్ధిలేమి, వెనుకబాటుదనం, వగైరా, వగైరా అసలు సమస్యలు కావట. ఇది వాళ్లని వాళ్లే పరిపాలించుకోటానికి చేస్తున్న ఉద్యమమట! అద్దిరబన్నా .. అనుకోకుండానైనా, అసలు విషయం బయట పెట్టేశారు దొరలు. ఇదంతా పదవుల పందేరానికి సంబంధించిన విషయం. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉంటే అధికారం మరో రెండు ప్రాంతాల నేతలతో పంచుకోవాల్సొస్తుంది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం రగడ మొదలెట్టారన్న మాట – అలాగైతే అధికారం తామూ, తమ తరతరాల వారసులూ అనుభవించొచ్చనే దుగ్ధతో. తెలంగాణనో నయా జాగీరుగా మార్చేయాలన్నే కుట్రే ఇదంతా. పదవి రాని బాధలో వేర్పాటువాద భూతానికి ఊపిర్లూది ఊతమిచ్చిన ప్రబుద్ధుడి బుద్ధి అంతకన్నా గొప్పగా ఏముంటుంది గనక. తెలంగాణకి ఇన్నేళ్లుగానూ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా, అక్కడివారెవ్వరూ మంత్రి పదవులూ ఏ ఇతర అధికారాలూ వెలగబెట్టకపోయినా ఈ స్వయంపాలననే వాదనకి అంతో ఇంతో విలువుండేది. సరే, వితండవాదులకి లాజిక్కులతో పనుండదు కదా. వాళ్ల పైత్యం వాళ్లదే. ఆ పైత్యం ముదిరి ఆంధ్రా వస్తువుల్ని బహిష్కరిద్దాం, ఆంధ్రోళ్లని తన్ని తరిమి కొడదాం అనేదాకా వచ్చింది. రేపో మాపో ఇది పన్నులు ఎగ్గొడదాం అనేదాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు.
విదేశీయులేసిన దాస్య శృంఖలాల నుండి భరతజాతిని విముక్తం చేసే క్రమంలో, కుల మత ప్రాంత వర్గ భేదాలకతీతంగా దేశాన్ని ఒక్క తాటి మీదకి తెచ్చే సత్సంకల్పంతో అసలు సిసలు దేశోద్ధారకులు పుట్టించిన పదాలు స్వయంపాలన, సహాయ నిరాకరణ, వస్తు బహిష్కరణ, ఇత్యాదివి. అవి ప్రజల్లో దేశభక్తిని రగిల్చాయప్పుడు. తెలుగుజాతిని రెండుగా విడగొట్టి పబ్బం గడుపుకునే కుయత్నంలో ఆ పదాలని హైజాక్ చేసి వాటికి తమ చిత్తమొచ్చిన అన్వయాలిచ్చేసి సొంతవారిపైనే ఇష్టమొచ్చినట్లు ప్రయోగించే స్వార్ధపరుల దుష్టతంత్రాన్ని విస్తుపోయి చూడటం విజ్ఞుల వంతైందిప్పుడు. పైగా దానికి సమర్ధనగా – నేటి వేర్పాటువాదానికి నాటి స్వతంత్రపోరాటంతో నిస్సిగ్గుగా పోలిక పెట్టే విపరీత పోకడలు!
చైనా ఉత్పత్తుల్లేనిదే అమెరికాలో ఏ ఇల్లూ నడవని రోజులివి. గ్లోబలైజేషన్ పుణ్యాన ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన ఈ కాలంలో ఒకరిపై ఒకరు ఆధారపడనిదే ఏ వ్యక్తీ, సమాజమూ మనగలిగే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ అంతరాలు పెంచటం ద్వారా తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రం – అది వస్తే గిస్తే – తెలంగాణవాసులకి ఏ రకంగానూ ఉపయోగపడదన్న నిజం పట్టించుకోని కుక్కమూతి పిందెల్లాంటి నేతలు, మేధావుల ముసుగులో వాళ్లకి వంతపాడే భూత ప్రేత పిశాచ వందిమాగధ గణాలూ కలసికట్టుగా ఆ ప్రాంతానికి ఇప్పటికే చేసిన, ఇంకా చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ఆ సంగతి వాళ్లకి తెలీదా? తెలిస్తే, ఈ రభసంతా ఎందుకు?
ఎందుకో మీకు తెలుసు.
(సమాప్తం)
చాలా బాగా చెప్పారు!నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
@కృష్ణ గారు
హమ్మయ్య మీ అనుమాలన్నీ తీరినట్టే కదా.
చక్కగా చెప్పారు. ఒక వేళ తెలంగాణాకి స్వయం పాలన వస్తే తెలంగాణా ఏవిధంగా అభివృధీ చేస్తారో ఒక్కరూ చెప్పరేమి. దానికి మరల ఇప్పుడు తిడుతున్న వాళ్ళ మీద ఆధార పడవలసిన్దేకదా. రాజకీయ నాయకులుగా ఎన్ని చట్టాలు తెచ్చినా సమర్ధతగా పనిచేసే ఆఫీసర్స్ కావాలి. తిట్టి పని చేయించు కోవటం చాల కష్టం. వారి ఉద్దేశం లో తెలంగాణా వస్తుందనే నమ్మకం లేదు అని నా భావన.
మీ పది అబద్దాలు ఓపికగా చదివాను. కొన్ని విషయాలలో మీతో ఏకీభవిస్తున్నాను. కాని చాలా విషయాలలో మీ ప్రాంతేతర వివక్ష సుస్పష్టం. మీ ప్రతి అబద్దానికి నేను జవాబు సమయం దొరికినపుడు తీరిగ్గా రాయగలను. ఎవరో కొందరు (కెసిఆర్ లాంటివారితో కలిపి) వ్యక్తపరిచే భావాలను మాత్రమే గ్రహించి అసలు నిజాలను వదిలేయడం సబబు కాదు.
తెలంగాణ శత్రువులు ఊహకందనంత బలవంతులు. ఈ శత్రువులు ఒక తెలంగాణ ప్రజలకే కాదు ఇతర ప్రాంతాలవారిది కూడా!
మహాత్ముడు ఎంతగానో దూర ఆలోచనతో వేసిన అతి చిన్న ఉప్పు సత్యాగ్రహం అనే ఎత్తుకు తెల్లతోలు వెధవలకు ఎక్కడో కాలింది. బ్రిటిష్ పరిపాలకులు మొదట చాలా చులకనగా తీసుకున్నా ఆ తరువాత చిర్రెత్తి పిచ్చికుక్కల్లా ప్రవర్తించారు కాని ఏం పీకలేకపోయారు.
అయితే ఈ దేశంలో స్వాతంత్ర్యానంతరం తెల్ల తోలు వెధవలను మించిన నియంతలు కంటికి కనబడకుండా తయారవుతారని గాంధిగారు అప్పుడు ఊహించి ఉండరు… అలా తెలిసి ఉంటే విముక్తి కోసం మరోలా పోరాడేవారేమో.
నోట నాలుకలేని అమాయక తెలంగాణ ప్రజలు ఈ పోటి ప్రపంచంలో తెలివైన ఆంధ్రుల సరసన నిలదొక్కుకుని ఎదగడమనేది కలగనడం వరకే. తరతరాలుగా ఎదురుచూసే అవకాశాలు చేతిదాకా వచ్చినట్టే వచ్చి అవి అందకుండా పోటీ గ్రద్దలు తన్నుకుపోతుంటే చేసేదిలేక కడుపులో రగిలే మంటను తమ స్వార్థానికి వాడుకునే మరో స్థానిక రెడ్డి, వెలమ లేక గౌడు దొరలకు జైకొట్టి చల్లార్చుకోవడానికి ప్రయత్నించి తృప్తిపడే ఈ జనాలకు నిజమైన మేలుకొలుపు పాడేదెవరో అసలు తెలుసుకోలేక తేల్చుకోలేక… చికాకు బ్రమలోపడి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మోసపోయేది మళ్ళీ ఈ నాలుకలేని అమాయక తెలంగాణ ప్రజలే! అలా విసుగుచెంది విరక్తిపరమైన పగతో కొందరు హింసాయుత మార్గంలోకి వెళ్ళడం చాలా సహజం.
మరి శత్రువులెవరు…?
పోటీపడి నాది అనుకున్న అవకాశం తన్నుకుపోయే వేరే ప్రాంతంవారా… కానే కాదు! పాపం వారిలో చాలామట్టుకు కష్టపడి చదువుకుని పైకిరావలనుకోవడం బ్రతుకుదెరువుకోసం కదా! సమైఖ్య ముసుగులో కొందరు దుష్ట వలసదారులు చేసే అరాచకాల కారణంగా మొత్తం ఆంధ్రోళ్ళను నిందించడం చాలా తప్పు. వాళ్ళలో ఎంతో మంది మహామహులున్నారు. కష్టించి ఫలితాలు సాధించే ఆంధ్రోళ్ళ సుగుణం తెలంగాణ అమాయక ప్రజలకు ఆదర్శం కావాలి.
ప్రశాంతంగా ఆలోచిస్తే అసలు శత్రువులెవరన్న నగ్నసత్యమొకటి బోధపడుతుంది.
ఇప్పుడున్న నాగరిక మరియు అనాగరిక జన ప్రపంచంలో ఎదుటివారి మంచితనాన్ని మరియు గొప్పతనాన్ని వారి ఆర్థిక స్థోమతకతీతంగా, వివక్షారహితంగా గుర్తించడం – గుర్తించిన గొప్పతనాన్ని మరియు సామర్థ్యాన్ని గౌరవించడం – వారిని ప్రోత్సహించి సమాజ శ్రేయస్సు కొఱకు వినియోగించడం… ఇదంతా ఎవరి బాద్యత? ఆ బాద్యత కలిగిన వారంతా నిస్పాక్షికముగా తటస్థముగా ప్రవర్తిస్తున్నారా?
అలా ప్రవర్తించలేని లక్షణాలు మరియు గుణగనములు మెండుగాఉన్న జనాలు అన్నిచోట్లా ఉంటారు కాని ఈ రాష్ట్రంలో తెలంగాణతో పోలిస్తే తెలంగాణేతర ప్రాంతంలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణవారి లేమి అణిగిమనిగి ఉండిపోయే మనస్తత్వాన్ని సోమరితనంగా ఊహించుకుని నిర్హేతుకమైన అసహ్యము వెళ్ళగక్కేస్తారు. ఇక్కడివారికంటే చాలా తెలివైనవారమని సగర్వముగా ప్రవర్తించేస్తారు ఒకరకమైన మానసిక క్షోభకు గురిచేసి రెచ్చగొట్టేస్తారు.
ఈ ప్రవర్తనా లక్షణాలు కలిగిన జనాలు కాదు శత్రువులు. అసలు శత్రువులు ఆ గుణములూ మరియు లక్షణాలే… చాలా బలవంతులు… ఊహకందనంత బలవంతులు.
అయ్యా నీ కాల్మొక్త బాంచన్!
అమ్మా నీ కడుపు సల్లగుండాలె!
దొరా నీ గులాంగిరికొచ్చినోన్ని!
దొరసాని దండంబెడ్త!
నీ పేర్జెప్పుకుని బత్కుత!
నీకాళ్ళకాడవడి ఉండెటోల్లం!
నీమోచేత్లనీళ్ళు తాగెటోల్లం!
అంటూ ప్రతిరోజు ఒక గండంగా తరతరాలుగా బ్రతుకులీడ్చిన అమాయక తెలంగాణ ప్రజలకు ఈ మాటలుతప్ప మరో వేదమే లేదు రాదు. నూటికి తొంభై ఐదు శాతం ఇదే బాళి. ఇలాంటి పరిస్థితిలో రాజకీయంగా వచ్చిన మార్పు పై ఎలాంటి అవగాహన లేకుండా కలలుగనే జనం మిగతావారితో పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని పైకి రావాలంటే ఈ ప్రాంతాన్ని పాలించే నాయకులు ఏం చేయాలి మరి? అవన్ని గుర్తించారా? గుర్తించినవి అమలు చేసారా? లేక సక్రమంగా చేయనిచ్చారా? నిస్వార్థంగా పనులు జరిగాయా? వాటి ఫలాలు వివక్షరహితంగా అమాయక ప్రజలకు చేరుకున్నాయా? లేక కాగితాలవరకే పరిమితమయ్యాయా?
దొరలు, దొరసానులు, తహసీల్దార్లు, జమిందార్లు, గిరిదార్లు, పటేళ్ళు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌లు, అమీన్‌సాహెబ్‌లు, నిజాం రజాకార్లు పోయి… కొత్తగా ప్రెసిడెంట్లు, పంచాయితీలు, చైర్మెన్‌లు, ఇన్‌స్పెక్టర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పోలీసులు వచ్చారు. అంతే మిగతా ఏమ్లేదు. దోచుకుతినే గుంట నక్కలు అప్పుడూ ఉండేవారు – ఇప్పుడు కాస్తా ఎక్కువయ్యారు.
అప్పటి భూస్వాములే ఇప్పటి దోపిడీదార్లు… కాని కంటికి కనబడరు! ఊరికే అంధ్రోళ్ళు మాత్రమే దోచుకున్నారనడం తప్పు!
అసలు శత్రువును తక్కువగా అంచనా వేసి బోర్లాపడిపోవడం తెలంగాణ పోరాట యోధులకు పరిపాటి అయిపోయింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే మనస్తత్వం మన అసలు శత్రువు. నియమాలు నిభందనలు ఒప్పందాలు బూజుపట్టే దస్తావేజులవరకే పరిమితం చేసే వివక్ష గుణం మనకు నిజమైన శత్రువు. తన బలాన్నంతా ఉపయోగించి తనవారికి మాత్రమే లక్ష్మినంతా కట్టబెట్టే కల్మషమైన లక్షణం మరొక కానరాని వింత శత్రువు. ఈ శత్రువులు చాలా బలవంతులు… ఊహకందనంత! నా తోటి తెలంగాణ ప్రజలారా జర బద్రం!
మంచివారిని గుర్తించి ఆదరించే వెనకటి కాలం పోయింది. ఇక తిరిగి రాదు…. అందుకే ప్రత్యేక రాష్ట్రమొక్కటే దారి. మారిన లోకానికి అనుగుణంగా తెలంగాణ ప్రజల కష్టసుఖాలను నిండు మనసుతో అర్థం చేసుకుని స్నేహపూర్వకంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడాలని విజ్ఞప్తి.
ఆంధ్రోళ్ళలో కూడా మంచివారున్నారు! అనే తృప్తికరమైన మాటను మీరు సార్థకం చేయాలని నా ఈ తెలంగాణ అల్పసంతోషి స్వార్థం లేని అకాంక్ష.
చాలా కాలం తర్వాత డొంక తిరుగుడు మాటల్లేని అసలైన తెలంగాణా వాదిని మీలో చూస్తున్నాను. hats off to you…
రవి చంద్ర గారు,
అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు.
mee nijayati naaku nachchindi.
vidiovadam avasarame ainaa daaniki vidvesham avasaramA??
hyd govt office lo pani chestunna maa freind ki warning ichchaarata “mimmalni ekkuva rojulu undanivvam” ani.
కార్తిక్ గారు,
అలా బెదిరించడం గాని – ఆ అర్థం వచ్చేలా వాఖ్యలు చేయడం గాని చాలా తప్పు.
మరి రాష్ట్రానికే రాజులాంటి పదవిలో ఉండి వై.ఎస్.ఆర్. ఈ అమాయక ప్రజలను మరింత రెచ్చగొట్టేలా మొదటి విడత ఎన్నికలకు ముందు ” నేను తెలంగాణ వ్యతిరేకిని కాను ” అని ఆ తరువాత రెండో విడతకు ముందు చాలా తెలివిగా, చలాకీగా, చాణక్యచతురంగా ” ఇక్కడికి రావాలంటే వీసా తీసుకోవాలి ” అనడం ఎంతవరకు సబబు. అదికూడా తప్పే కదా!
నాయకులు అధికార దాహంతో అలా ప్రవర్తించబట్టే మన మధ్య ఇలా బేదాభిప్రాయాలు స్పర్థలు వస్తాయి.
మహిశ్రీ,
అంతా బాగానే వుంది. తెలంగాణా శత్రువు ఎవరో చివరికి మీరు కనిపేట్టేశారు. కానీ మళ్ళీ ఇదేమిటి?
“మంచివారిని గుర్తించి ఆదరించే వెనకటి కాలం పోయింది. ఇక తిరిగి రాదు…. అందుకే ప్రత్యేక రాష్ట్రమొక్కటే దారి.”
ఈ వాక్యంతో మీరు పైన రాసింది మొత్తం void ఐపొయింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే, మీరు ఆ వాక్యం పైన రాసిన విషయాలు ఏవిధంగా మారుతాయో రాయగలిగితే, అప్పుడు మాట్లాడుదాం. లేకుంటే, మీది కూడా ’కేవలం ప్రత్యేక రాష్ట్రం కావాలి’. కాకపోతే, మీరు sugar coat చేశారు అంతే.
నాగేశ్వరరావు గారు,
మా ప్రాంత నాయకులను ప్రశ్నిస్తే వారినుండి వచ్చిన సమాధానాల పరంపరను క్లుప్తంగా విశ్లేసిస్తే వారంతా అత్యధికులైన తెలంగాణ అమాయక ప్రజలకు డొంక తిరుగుడుగా చెప్పేదొక్కటే… తెలంగాణేతర ప్రాంత పాలకులు వారిని సరిగ్గా అభివృద్ది చేయనివ్వడం లేదు…. అని. వీళ్ళలో ఎవ్వరికి నిలదీసే స్థోమతగాని వాదించే వాక్చాతుర్యం కాని లేవు… రావు. వాళ్ళు చెప్పే డొంక తిరుగుడు సమాధానాలను నమ్మక తప్పని పరిస్థితి సృష్టించే ప్రాంతేతర నాయకులు బోలెడు.
తెలంగాణ ప్రాంతం వేరే రాష్ట్రంగా ఏర్పడితే ఆ డొంక తిరుగుడు పద్దతి మాత్రం మార్చుకునే పరిస్థితి వస్తుంది. ఆ తరువాత – ఇదే అమాయక ప్రజలు తిరగబడి స్థానిక నాయకులను తన్నే రోజు కూడా వస్తుందేమో ఎవరికి తెలుసు.
కెసిఆర్ లాంటి వారిని హీరోలను చేసింది తెలంగాణ ప్రజలు కాదు – యాదృచ్చికంగా అలా జరిగిపోయేలా పరిస్థితులు కల్పించారు ప్రాంతేతర నాయకులు.
ఈ తెలంగాణ అల్పసంతోషి స్వార్థం లేని అకాంక్షలో Sugar Coat లాంటి వాటికి అవకాశం ఉండదని మీరు గ్రహించాలి. ఇంకా వివరంగా చాలా చెప్పొచ్చు…. whether to void or validate… is out of question. I am beyond these attachments. I would request you to analyze the situation being completely unattached to a united state or separate state.
@మహిశ్రీ:
మీరెలాగైతే మిమ్మల్ని గురించి I am beyond these attachments అనీ, నిష్పక్షపాతంగా అన్నిట్నీ విశ్లేషించగలరనీ అనుకుంటున్నారో, నేనూ అలాగే అయ్యుండొచ్చు కదా. పక్షపాతానికి తావులేకుండా ఆలోచించే, విడిపోతే అందరికీ ఉపయోగం కన్నా నష్టాలే ఎక్కువని నమ్మాన్నేను.
మీ మొదటి వ్యాఖ్యలో నన్నో వివక్షాపరుడినన్నారు. నా గురించి మీకేం తెలిసి ఆ మాటన్నారో చెప్పగలరా? నాయకుల మోసాల గురించీ, నాటకాల గురించీ నేను పది టపాలు రాస్తే వాళ్ల గురించి కాకుండా నా గురించే మీరు ఎక్కువగా అర్ధం చేసుకున్నట్లున్నారు.
రాజశేఖరరెడ్డి ప్రత్యేక తెలంగాణవాదాన్ని వాడుకుని పనయ్యాక ప్లేటు ఫిరాయించటం గురించి నేను ‘ఆషాడభూతం’ అని గతంలో ఓ టపా రాశాను. వీలైతే వెదికి చదవండి.
మీ వాదన లో పరస్పర విరుద్ధ భావనలు ఉన్నాయి
1). మొదట, ప్రతిరోజు గండంగా తరతరాల తెలంగాణ ప్రజలు కాల్మొక్కింది ‘తెలంగాణా దొరలకి ‘ అన్నారు.
2). తర్వాత, ఆ దొరలే ఇప్పటికీ వేరే రూపంలొ దోచుకుంటున్నారు అన్నారు
3). చివరికి, విడిపోతే అణగారిన ప్రజలకు మంచి జరుగుతుంది అని ముక్తాయించారు.
1,2 ల నుండి 3 ఎలా పరిష్కారం అవుతుందో నాకు అర్ధం కావటం లేదు.
నా ద్రుష్టిలో, 1,2 సమస్యలు అయితె, దానికి పరిష్కారం సమైక్యంగా వుండటమే! ఎందుకంటే,
1. ఆంధ్ర & తెలంగాణా దొరల మధ్య ఘర్షణ వల్ల తెలంగాణా వెనుకబాటుతనం వెలుగులోకి వచ్చె అవకాశం ఉంది
2. సామాన్య ప్రజలని తర తరాలుగా హింసించిన దొరలకు పూర్తి రష్ఠ్రాధికారం లేకపొవటం వల్ల, ఎటునుంచైన ఎవరైన మంచి నాయకుదు మీకు మంచి చేసె అధికారం వుంది
3. తెలంగాణాకు అన్యాయం జరింగుతొందీ అని నిరంతరం గగ్గొలు పెట్టి నిధులూ రాబట్టుకొవచ్చు
4. దొరలు ఆంధ్రోల్లను దొంగోళ్ళుగా చిత్రించి, ఎక్కువ నిధులు రాబట్టుకొవచ్చు
మీరు కొత్త ఐడియా ఇచినట్టున్నారు. పన్నులు కట్ట వద్దని.. దీని మీద మన ప్రొ. కోదండ రాం గారి కామెంటు ఏమిటో చూడాలి.
చాలా బాగా చెప్పారు.
చాలా చక్కగా చెప్పారు ! ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన ఈ కాలంలో ఒకరిపై ఒకరు ఆధారపడనిదే ఏ వ్యక్తీ, సమాజమూ మనగలిగే అవకాశం లేదు >> exactly !
బాగా చెప్పారు. రోజుకొక సరికొత్త నినాదంతో తెలంగాణా ఉద్యమం నడిపిస్తున్నారు. ఆత్మగౌరవం నినాదం తర్వాతిదేమిటో.
అయినా మనం ఎన్నెన్ని వ్రాసుకున్న ముందు నాయకుల చిత్తం మారాలి. యధా రాజా తధా ప్రజా అని నానుడి. ప్రజలు నాయకుల్ని, వాళ్ళ మాటల్ని నమ్ముతారు. నిజమని భ్రమిస్తారు. ఈ విషయంలో తెలంగాణైనా, ఆంధ్రా ఐనా ఒక్కటే. నిన్ననే జె.సి. దివాకర్ రెడ్డి గారు కొత్త పల్లవి అందుకున్నారు ఒకప్రక్కన సమైక్యమంటూనే విడిపోవాల్సి వస్తే తెలంగాణాతో కలిసి ఉంటామని. అది కూడా రాయలసీమకు నీళ్ళ కోసమని అన్నారు. అవి తెలంగాణా ప్రాంతం నుంచే రావాలి కదా. మరైతే ఆంధ్రా కు కూడా అక్కడి నుంచే నీళ్ళు రావాలి కదా. ఈ లెక్కన కోస్తాంధ్ర కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి,కృష్ణా గుంటూరు జిల్లాలను తెలంగాణాలో కలిపేయాలన్నదే నా డిమాండ్. (ఇలా అయితే ఎప్పటికి అందరం కలిసే ఉండొచ్చు.)
@అబ్రకదబ్ర గారు
మీ పది ఉద్యమ టపాలన్నీ అయినట్టేనా ఇంకా ఏమైనా వేడివి మా కోసం దాచి ఉంచారా కొద్దిగా చెబుదురు. ఏదో ఆత్రం అంతే.
సందర్భం, అవసరం వస్తే .. మరోటో రెండో వస్తాయేమో. ఈ సిరీస్ ఐతే ఐపోయింది.
ఇక బీపీ తగ్గించుకుని సరదా సంగతులు రాసుకునే పనిలో పడాలి.
ఆ సరదా సంగతులు కోసం ఎదురు చూస్తున్నామండీ!!
చాలా చక్కగా చెప్పారు.
@మహిశ్రి గారు
చక్కగా వ్రాస్తున్నందుకు చాల సంతోషం. తెలంగాణా వస్తే మారేవి నా చిన్న బుర్రకి తెలిసినవి మూడే మూడు.
కొత్త హైకోర్టు: అందుకనే తెలంగాణా న్యాయవాడులకి ఇష్టం. కొత్త పదవులు.
కొత్త మంత్రివర్గం: అందుకనే తెలంగాణా రాజకీయ నాయకులకి ఇష్టం. కొత్త పదవులు.
కొత్త ప్రభుత్వ కార్యాలయాలు: అందుకనే విద్యార్దు లకు ఇష్టం. కాని కొత్త పదవులు ఎన్ని వస్తయ్యి?
అందుకనే ఈ మూడు వర్గాలు ఆందోళన చేస్తున్నాయి అని నా భావన. తెలంగాణా వస్తే తెలంగాణా ప్రజలు ఏ విధంగా బాగు పడు తారో ఎవ్వరూ చెప్పటల్లేదు. కొత్త ప్రాజెక్టుల ప్రణాళిక లేమిటి? విద్యారంగం లో అభివ్రుది చేసుకుంటారా? ఏవిధంగా? కొత్త పరిశ్రమలు పెడతారా? ఏవి అవి? వ్యవసాయం లో కొత్త మార్పులు తెస్తారా? అవి ఎటువంటివి?
రామకృష్ణ గారు,
అర్థం చేసుకుని గుర్తించినందుకు కృతజ్ఞతలు. మీరు చెప్పింది కొంతవరకు నిజమే –
ఇక్కడి ప్రజలు బానిస బ్రతుకుల నుండి విముక్తి పొందిన వెంటనే తెలంగాణేతర తెలుగు ప్రజలతో పోటీ ఎదుర్కోవలసి వచ్చింది. బ్రిటిషు పాలనలో తెలంగాణవారి కంటే ఎంతో పరిణతి చెందిన ఇతరవారితో పోటిపడి నిలదొక్కుకునే సామర్థ్యం ఆనాటికి కచ్చితంగా లేదు. ఈనాటికి కూడా లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు తొమ్మిది తరాలుగా బానిసలుగా బ్రతుకులీడ్చిన జనాలు నిజాం నియంతల చెరనుండి విముక్తి కలిగినా కూడా – బానిస ప్రవర్తన అలాగే కొనసాగింది. అణిగిమణిగి ఉండే తత్వంతో తమను తాము ఎలా అభివృద్ది పరచుకోవాలో ఓ కార్యచరణ రూపొందించుకోవాలన్న ఆలోచన కూడా రాలేదంటే – ఎంతటి హీనమైన స్థితిలో ఉండేవారో ఊహించుకోవచ్చు. అలాగని కొందరు తెలివైనవారు లేకపోలేదు – కాని వారి ప్రయత్నాలు బలం లేమి కారణంగా విఫలం అయినాయి. ఒక్క తెలంగాణ ప్రాంతమే కాదు నిజాం రాజులు పాలించిన విదర్బ మరియు ఇతర ప్రాంతాలలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి… తెలంగాణతో పోలిస్తే ఈ ప్రాంతాలు కొద్దిగా మేలు… వసంతరావ్ నాయక్ ముఖ్యమంత్రిగా విదర్బను కొద్దో గొప్పో అభివృద్ది చేసాడు.
నూటికి తొంభై అయిదు శాతం తెలంగాణ ప్రజలు తమ భావ వ్యక్తీకరణలో చాల వెనకబడి ఉన్నారు. ఇలాంటి వారి అభివృద్దికి తోడ్పడాలంటే ఉన్నతమైన చదువులొక్కటే సరిపోవు – ప్రతి విషయం లోను తోడు-నీడగా ఉండాలి. ఈ మార్పు రావడానికి కొన్ని తరాలు కూడా పట్టొచ్చు. అంతవరకు వీళ్ళ అవకాశాలను వనరులను ఇతర ప్రాంతాల తెలివైన ప్రజలు తన్నుకు పోకుండా పెద్దన్నల్లాగా (మహానుభావులు) చేదోడు వాదోడుగా దగ్గరుండి కాపాడాలి. ముల్కి మరియు GO-610 లాంటివి కాగితాలకే పరిమితం కాకూడదు.
కాని సమైఖ్య ముసుగులో కొందరు దుష్టులు ఈ పెద్దన్నలను కూడా ఖాతరు చేయడం లేదు – పైగా బెదిరింపు ధోరణితో తమవైపుకు తిప్పుకునే కుటిల ప్రయత్నం లో సఫలమౌతున్నారు. మంచివారిని గుర్తించి ఆదరించే వెనకటి కాలం పోయింది. ఇక తిరిగి రాదు…. అందుకే ప్రత్యేక రాష్ట్రమొక్కటే దారి అని అత్యధికంగా ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు – వారికి మరో గత్యంతరం ఉందా చెప్పండి!
అలా అనుకోవడం కూడా ఈ ప్రాంత ప్రజల తప్పు కాదు – తమ సొంత కడుపులు ఆకలితో మాడుతూ ఉంటే మరో పక్క తెలంగాణ ప్రాంతమంతటా వేరే ప్రాంతాలనుండి మన తెలుగువారే వలస వచ్చి వ్యాపారాల్లో ఆర్జిస్తూఉంటే – అది తమ చాతకానితనానికి వెక్కిరింపుగా అనుకోని అవమానపడాలో లేక తమ తెలివితక్కువతనానికి ఋజువు అనుకుని బాధపడాలో తెలియక కడుపులో రగిలే మంటలను చల్లార్చుకోడానికి తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డాక తమ బతుకులు బాగుపడతాయని ఆశ.
కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు, మార్పులు విద్యాభివృద్ది గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు ఇక్కడి జనాలు – తాను చదివి పైకొచ్చి తనవాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టాలన్న ఆలోచనే తప్ప ఇక్కడి యువతకు గొప్పగా అలోచించేటంత లోకజ్ఞానం ఇంకా కలుగలేదు. కాస్త వయసొచ్చాక రోజంతా కష్టపడి సాయంత్రానికి పొట్టనిండకపోయినా ఓ కల్లు పొట్లం తాగి పడుకుంటారు. ఇదీ మామూలు జనాల స్థితి. NTR పాలనలో కొద్దోగొప్పో అభివృద్ది ప్రయత్నం జరిగింది – కాని ఇక్కడివారి స్థితిగతులపై ఎలాంటి అవగాహనా లేని ఇతర ప్రాంత అధికారులే అధికంగా ఉండడం వలన ఆ అభివృద్ది ఫలాలు ఈ అమాయకులకు అందలేదు. ఇది నిజం. అధికారిక చిట్టాలలో మాత్రం బ్రహ్మాండంగా ఖర్చులు చూపిస్తారు… తెలియనివారు అదే నిజమనుకుంటారు.
ఇలా రాస్తూ పోతే ఓ పుస్తకమే తయారవుతుంది. అందుకే ఇక ముగిస్తాను.
ధన్యవాదములు!
ఎంతకీ ఎవడో తమ సొమ్ము దోచుకుపోతున్నాడని గగ్గోలు పెట్టి ప్రజల దృష్టి మళ్లించటమే తప్ప, విడిపోతే ఇప్పుడున్న సమస్యలెలా పరిష్కారమౌతాయనేదానికి ఒక్క వేర్పాటువాదీ సమాధానం చెప్పడు.
తీరప్రాంతం సహా చెప్పుకోదగ్గ వనరులేవీ లేని తెలంగాణ విడిపోతే వచ్చే లాభాలకన్నా నష్టాలే ఎక్కువ. ‘విడిపోతే మన నీళ్లు మనమే వాడుకోవచ్చు’ అనే ఆశొకటి చూపిస్తున్నారు వేర్పాటువాదులు. అందులో డొల్లతనం చూడండి. కొత్తగా ఆనకట్టలూ, ప్రాజెక్టులూ కట్టకుండా అదెలా సాధ్యం? రాష్ట్రం వేరు పడ్డ వెంటనే ప్రాజెక్టులు పుట్టుకొచ్చేస్తాయా? నలభై రెండు మంది ఎంపీలుంటేనే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాట చెల్లుబాటవటం లేదు. అందులో సగం బలం కూడా లేకుండా తెలంగాణకి ప్రాజెక్టులెలా మంజూరు చేయించుకొస్తారు, నీళ్లెలా వాడుకోగలుగుతారు? అష్టకష్టాలు పడి ఏవన్నా మంజూరు చేయించుకోబోయినా, అడ్డమైన తిట్లూ తిని వెళ్లగొట్టబడ్డాక ‘ఆంధ్రా దోపిడీదారులు’ శాయశక్తులా వాటికి అడ్డుతగలకుండా ఊరుకుంటారా? మొత్తమ్మీద – కొత్త ప్రాజెక్టులు రావటం సరే, ఇప్పుడు నడుస్తున్నవీ అటకెక్కే అవకాశాలు మెండు. అప్పుడు తెలంగాణ పరిస్థితి కొండనాలుక్కి మందేసిన చందమౌతుంది, ఆంధ్రా రైతులు పండగ చేసుకుంటారు.
ఇంతకీ, ఆంధ్రావాళ్లు దోపిడీదార్లే అనుకుందాం. తెలంగాణ విడిపోయినంత మాత్రాన ఆ దోపిడీ ఆగుతుందా? రాష్ట్రాల హద్దులు వాళ్లని ఆపగలుగుతాయా? ఎలా? అంబానీలు ఆంధ్రాలో వ్యాపారాలు చెయ్యకుండా అడ్డు పడగలిగామా? పోనీ పూర్తిగా ఆగకపోయినా, అంతో ఇంతో తగ్గుతుందంటారా? అప్పుడు కొత్త ‘స్థానిక’ దోపిడీదార్లు పుట్టుకురారనేంటి? ఏ రాయైతేనేం?
విడిపోతే…
మొదట నీళ్ళు. మా వాటా నీళ్ళు మాకోస్టై. కడుపు మాడ్చుకొని అయినా సరే మేం వాటిని వాడుకునే ప్రాజెక్టులు కట్టు కుంటం. మా పై పెత్తనం చేటు, మాయ మాటలు చెప్పి నీటిని ఆంధ్రాకు అక్రమంగా మళ్ళించే ఆంధ్రా వాడు ఉండదు. నిన్న జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన మాటలే దీనికి ప్రబల సాక్ష్యం. తెలంగాణా వస్తే తేరగా దోచుకుంటున్న నీరు ఇకపై రాదని ఆయన నిర్మొహమాటంగనే చెప్పిండు. మేం ప్రాజెక్టులు ఎట్లా గట్టుకుంట మన్న ఆలోచన మీకు వద్దు. అది మేం జూసుకుంటం.
“నలభై రెండు మంది ఎంపీలుంటేనే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాట చెల్లుబాటవటం లేదు”
LOL.
నలభై రెండు మంది ఉంటె కూడ చెల్లు బాటు ఆయిత లేదు. మరి కేరళ, పంజాబ్, హిమాచల్, హర్యానా, ఆఖరుకు మన పక్కనున్న కర్నాటక, తమిళనాడు లకు కూడ నలభై రెండు లేవు. మరి అవి ఎట్లా డెవలప్ అవుతున్నయి? జర ఆలోచించు, సమాధానం తెలుస్తది.
“అప్పుడు తెలంగాణ పరిస్థితి కొండనాలుక్కి మందేసిన చందమౌతుంది, ఆంధ్రా రైతులు పండగ చేసుకుంటారు”
చేసుకోమ్మనే చెప్పుతున్నాం. అయినా ‘ఒద్దు, ఒద్దు’ అనుకుంట కాళ్ళ బేరం చేస్తున్నారు. జేసీ ‘రాయల తెలంగాణా’ ఒక పెద్ద ఉదాహరణ. LOL.
@ abracadabra
మీరు చెప్పె వాటితొ 90% నేను ఏకీభవిస్తాను..ఒక్క ఉద్యమానికి సంబంధించిన విషయాలు తప్ప!!!
తెలుగు వారి ఆత్మ గౌరవంతొ నెగ్గిన ntr ఆ తరువత వచ్చిన ఎన్నికలలొ ఎందుకు ఓడిపొయాడు?? తెలుగు వాడికి అత్మ గౌరవం ఎక్కువయ్య?? లేక ఆత్మ గౌరవం చాలు అనుకున్నాడ?? కాదు కద…అప్పుడు తెలుగుదేశం ఒడిపొడానికి ఎన్నొ కరణాలు..ఇక్కడె కాదు..ఏ ఎన్నికైన ఒక కారణంతొ ఎవరు గెలవరు..ఎవరు ఓడిపోరు.. అని ఎన్నికల వ్యవస్థనే హాస్యం పేరుతో అపహాస్యం చేయబోయిన మీకు చెప్పనవసరం లేదు అనుకుంటున్నాను..మరి trs vote శాతానికి,తెలంగాణ ఉద్యమానికి ఎలా ముడిపెడుతారు??తెలంగాణ అంటె trs,kcr తప్ప ఇంక ఏమిలెదు అని భావించడం చేతన??
ntr 1994 లొ పదవీచ్యుతుడు అయ్యాక ప్రజలను cbnకి వ్యతిరేకముగ చాలానే రెచ్చకొట్టారు??మరి రెచ్చిపొలేదె??tdp(ntr) విజయఢంకా మొగించలేదె?? కారణం మీరె చెప్పారు..కుటుంబ వ్యవహారం అని..మీరు చెప్పినట్టు అప్పుడు రెచ్చిపోకుండ విచక్షణతో వ్యవహరించగలిగిన ప్రజలు,ఈ రోజు మాత్రం మీ దృష్టిలో రాజకీయ నాయకుల కుట్రలకు బలవుతున్న అమయకులు??అలా ఉండేది కొందరే అని మీకు తెలీదా??అందరిని ఒకె గాటున కట్టెస్తె ఎలా?? ప్రత్యేక తెలంగాణ కొరుకుంటె చాలు వాడు శత్రువు అన్నట్టెనా??(dallas nagasewar raoగారు మొత్తం చదివింది నచ్చి, చివర ఒక్క వ్యాఖ్యానికి మహిశ్రీ గారిని మీరు అందరి బాపతే అనట్టూ).. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది అని తెలుసుకోలేరా?? అలా కొరుతున్న వాళ్ళందరూ స్వార్థపరులేనా??
అత్మ గౌరవం మీద రెండే చెప్పరు?? తెలంగాణ విమొచన పోరాటం,నాయకులు ఏ తెలుగు పాఠ్యాంశం కాదెందుకు??తెలంగాణ పండుగలు “మన పండుగలలొ” కనిపించవెందుకు??నీళ్ళు,బొగ్గు ఇక్కడి వ్యవసాయానికి,పరిశ్రమలకి వాదరెందుకు?? ఇవన్ని అత్మగౌరవ సమస్యలు కావ??
ఇప్పుడేదో తెలంగాణాకి అన్ని దొరుకుతున్నట్టు ప్రత్యేక తెలంగాణలో దొరకవు అని భయపెడుతున్నారు..బాగుంది..కాని అది అలొచించవలసింది ఇక్కడి ప్రజలు..వాళ్ళె కొరుకుంటుండగ ఇక గొడవెందుకు?? ఏదైన, ప్రజస్వామ్య వ్యవస్థలో మంచైనా,చెడైనా నిర్ణయించేది ప్రజలెగా?? అంత అవినీతి చెసిన ysr గెలిచాడు అంటె అది ప్రజల నిర్ణయం..ysr గెలవడం నాకు ఇష్టం లేనంత మాత్రాన కాంగ్రెస్సుకి వోటు వెసిన అందరిని తూలనాడగలన??
ఆలొచించుకొండి..
ఆఖరున మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ..
chaitanya
>> “తెలుగు వారి ఆత్మ గౌరవంతొ నెగ్గిన ntr ఆ తరువత వచ్చిన ఎన్నికలలొ ఎందుకు ఓడిపొయాడు??”
As I said, it’s never about NTR. That’s why.
ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్న వారందరూ స్వార్ధపరులని నేననలేదే. ఆ వంకతో విద్వేషాలు రెచ్చగొడుతున్నవారినే అంటున్నా. వాళ్ల మాయలో కొందరన్నా పడుతున్నారు – మీలాంటోళ్లు. వాళ్ల కోసమే ఈ ప్రయత్నమంతా.
పదో అబద్ధం ఎత్తుకోవడం లోనే మీ అబద్ధపు పోకడలు కనపడుతున్నాయి.
మాది అభివృద్ధి సమస్య కాదని ఎప్పుడూ ఎవ్వరు అనలేదు. మాకు అభివృద్ధి, ఆత్మా గురవం సహా చాలా సమస్యలు ఉన్నయి. అభివృద్ధి సమస్య కాదు, ఆత్మ గౌరవమే సమస్య అని ఎవరు ఎక్కడ అన్నరో ఆధారాలు చూపించండి. మీరు చూపించ లేరు. పై పెచ్చు నన్నే ‘ఎవరూ అనలేదు’ అని నిరూపించమని కూడా అన గలరు!
మీ పీఠిక అబద్ధంతో మొదలయ్యింది. ఇంక మీరు ఇతరుల అబద్ధాల గురించి చెప్పే స్థాయి ఎక్కడిది? సహజంగా మీ వివరణలో కూడా అబద్ధాలు ఉంటయని సులభంగ ఊహించొచ్చు.
“తెలంగాణలో ఆంధ్రా హోటళ్లున్నాయి కానీ ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లేవీ, సమ్మక్క సారక్క జాతర ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెక్కడా చెయ్యరెందుకు…”
ఈ మాటలు ఎక్కడ ఎవరు అనంగ విన్నవ్ అబ్రకదబ్రా? ఆ ఆధారాలు ఇస్తే కొంచం బాగుంటది. దీన్ని బట్టి ఆత్మ గౌరవం అంటె ఏంటిదో కూడ మీకు తెలిసినట్టు లేదు. సమ్మక్క సారక్క జాతర చేస్తున్నందుకు తెలంగాణల గర్వ పడుతరు. అంతే కాని ఇంకెక్కడా చేస్త లేరని బాధ పడరు. ఇదిగో, ఇట్ల కుటిలమైన ఆలోచనలు చేస్తుంటారే, అట్లాంటి వాళ్ళ గురించే బాధ పడుతరు, తెలంగాణా వాళ్ళు.
ఒకప్పుడు అంజయ్యను రాజీవ్ అవమానించినడని తెలుగు వారి ఆత్మ గౌరవ సమస్య లేవ నెత్తినడు ఎన్టీయార్. ఇప్పడు ఆంధ్రోల్లు చేసేది ఏంటి? తెలంగాణా వస్తే నక్సలిజం పెరుగుత దంట(రాయపాటి). ఆంధ్రోల్లు వీసాలు తీసు కోవాల్సి వస్తదట (వై ఎస్సార్). ISI కాచుకొని కూర్చుందట (లగడపాటి). వేర్పాటు వాదులట (అబ్రకదబ్ర). ఏం? మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్రోల్లు వేర్పాటు వాదులు కాదా? మరి వేర్పాటు వాది ఐన పొట్టి శ్రీరాములుని పుస్తకాలల్ల ఆకాశాని కెట్టుతుంట రే? అప్పుడు లేని వేర్పాటు వాదం, దేశ సమైఖ్యత ఇప్పుడు ఎందుకు గుర్తు కొస్తున్నయి? నిజంగా మీరు నిష్పాక్ష పాతి ఐతే పొట్టి శ్రీరాములు కూడ వేర్పాటు వాదే అని ఒప్పు కొండి. మీకు ఆంధ్రోల్ల నుండి ఎన్ని చీవాట్లు వస్తయో చూడండి.
మాటి మాటికి తెలుగు వోటర్లు, ఎన్నికల్ల తీర్పు అని చెప్పుడు అన్నిటి కన్నా పెద్ద అబద్ధం. 2009 లో సమైఖ్యాంధ్ర అని చెప్పి పోటీ చేసినవి రెండే పార్టీలు. సీపీయం, ఎం ఐ ఎం. ఈ రెండు పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినయి? మిగతా పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినయి? అంతెందుకు? ప్రత్యేక తెలంగాణాకి సపోర్టు చేసినా గూడ, ఆంద్రాల కాంగ్రేసును, టీడీపీని ఎందుకు గెలిపించిన్రు, అక్కడి వాళ్ళు? దీనికి చెప్పండి సమాధానం, మీదగ్గర వుంటే. దీన్ని బట్టి తెలియడం లేదా, ఎన్నికల డొల్ల తనం?
“పదేళ్లుగా పదే పదే చదువుతున్నా ఆత్మగౌరవ మంత్రం ఆశించినన్ని చింతకాయలు రాల్చలేదన్న గ్రహింపుతో వేర్పాటువాదులు ఈ మధ్యనే ట్యూను మార్చారు…”
ఒహో! ఆత్మగౌరవం నినాదం చివరాఖరికి ఒచ్చింది కాదన్న మాట! పదేళ్ళ నుండీ ఉందన్న మాట!. మరి మొదట్లో “చివరాఖరికి ప్రయోగించిన అబద్ధపుటాస్త్రమే ఈ ఆత్మగౌరవ నినాదం” అన్నా రేమిటి అబ్రకదబ్రా? చిన్నప్పుడు పట్టాభిరాం ‘అబ్రకదబ్ర, అబ్రకదబ్ర’ అని మ్యాజిక్ చేయడం
చూసే వాణ్ని. ఇది కూడా అలాంటిదేనా? మీరు పైన రాసింది అబద్ధమా, కింద రాసింది అబద్ధమా, జర వివరించండి.
పచ్చి నిజాలను అబద్దాలుగా, అబద్ధాలను నిజాలుగా చేయడానికి గత కొన్ని రోజులుగా మీరు పడ్డ కుస్తీ చూస్తుంటే నిజంగా జాలేస్తుంది.
>> “.. నిజంగా జాలేస్తుంది”
Thanks for your pity. Struggling or not .. at least I tried to convey what I believed in. At the end, I’m happy with the bit of constructive effort I put forward.
What did you do?
యోధుడు,
గింతకు ముంగటి టపాల బదులియ్యకపోతివి. పోన్లే తప్పు తెల్సుకున్నవనుకున్న. కానీ తెలివి నీది ఇంకా తెల్లారినట్లే ఉన్నదని ఇది చూసి తెలుస్తంది.
““తెలంగాణలో ఆంధ్రా హోటళ్లున్నాయి కానీ ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లేవీ, సమ్మక్క సారక్క జాతర ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెక్కడా చెయ్యరెందుకు…”
ఇదెవడండని సిగ్గులేకుంట అడ్గుతున్నవా? ఎవడు ఆడే ఆ గద్దముక్కు బక్కోడు, దొంగ తెలంగాణా పటేల్. ఇంకా నమ్మకుంటే ఆణ్ణే పోయి అడుగు.
@బ్రహ్మి
తెల్వకుంట ఎందుకు మాట్లాడుతవు? కేసీయార్ ‘ఆంధ్రా భోజన హోటల్’ అని పేరు పెట్టుకోవద్దన్నడు. అది కూడా నేను సమర్ధించను. కాని పై context ల ఎప్పుడు అనలె.
ఒక వేళ అన్నడే అనుకుందం. ‘కేసీయార్ వంద అబద్ధాలు’ అని తెలుగోడు రాసినా కూడ నాకు అభ్యంతరం లేదు, అవి నిజాలైనంత వరకు. కాని ఈ తెలు-గోడు కేసీయార్ మాటలనో, ఇంకొకడి మాటలనో ఉద్యమానికి ఆపాదిస్తెనే అభ్యంతరం. మరి ఈ మాతలేక్కడ విన్నాడో, ఎవరి దగ్గర విన్నాడో అబ్రకదబ్ర చెప్పాలె. నువ్వు గాదు.
నరం లేని నాలుకలతో, రాజకీయ నాయకులు పూట కోక మాట ఒక్క తెలంగాణలనే గాదు, ప్రతీ చోటా మాట్లాడుతనే వున్నరు. వాటిని తెలంగాణా ఉద్యమానికి ఆపాదించి తెలు-గోడు విష ప్రచారం చేస్తున్నాడు. అందుకనే అభ్యంతరం.
పది అబద్దాలని రుజువు చెయ్యడానికి తెలు-గోడు ఎన్ని అబద్ధా లాడినడో కనపడుతనే ఉన్నయి. వీటికి తెలు-గోడి సమాధానం లేదు.
@అబ్రకదబ్ర
నీది constructive effort కాదు, constructed effort, cautiously constructed to project the false argument ‘samaikhyandhra’ and to blame telangaanaa. Even Goebbels might have interested to learn few things from you.
తెలంగాణా రావడం ఖాయం. క్రెడిట్ వాళ్ళకే రావాలని కాంగ్రెస్ ఆలస్యం చేస్తోంది తప్ప 2014 ఎన్నికలకు ముందు తెలంగాణా వస్తుంది. అప్పుడు తెలంగాణా ప్రజలే ఈ రాజకీయనాయకులకు తగిన గుణపాఠాలు చెబుతారు. మీరు పెదగా ఖంగారుపడి బాధపడక్కరలేదు.
తెలంగాణా ఇప్పుడు ప్రజల ఉధ్యమం. వాళ్ళకు నాయకుల నినాదాలు, సమైక్యవాదుల తింగరి లాజుక్కులకన్నా తెలంగాణా తెచ్చుకోవడం ముఖ్యం. వస్తే ఏమైనా చేద్ధామనే బాధ్యత వాళ్ళు నెత్తికెత్తుకున్నన్నాళ్ళూ ఏమౌతుందో అనే బాధ మనలాంటోళ్ళకి అనవసరం. అలా అయితే మనకు స్వాతంత్ర్యమే అవసరమయ్యేది కాదు. హాయిగా ఇంగ్లీషోళ్ళ పాలనలో ఉండేవాళ్ళం కదా! Actually English thought Indian will disintegrate in no time. Same prophecy you have in offering now.
కత్తి గారూ మీ వాదనకి పదును లేదు.
టి వి లో చూపించిన చెత్త చూసి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నరు.
ఉదా1: బొత్సా ని ప్రశంసిస్తు తెలంగాణా వాదుల ప్రదర్శన – టివి9 లో చూపించారు – పట్టుమని పదిమంది లేరు స్క్రీను మీద.
ఉదా2: లాయర్లు ఇందిరా పార్కు దగ్గర చావుదెబ్బలు తిన్న సంఘటన – నలుగురు లాయర్లు, చదువుకున్న వాళ్ళు, నాలుగు వెల కార్యకర్తల ముండు నిలబడి గొదవకు దిగటం….రాజకీయ కుట్ర కాకపొతే….వాళ్ళ మానసిక స్థితి మీద నాకు అనుమానంగా వుంది.
కాబట్టి ఇప్పటిదాక జరిగిన విషయాలని పరిశీలిస్తే, తెలంగాణా అయితే గియితే రాజకీయ నాయకుల వల్ల వస్తాది కానీ ప్రజల పోరాటం వల్ల కాదు అని తేలిపోయింది.
సోనియమ్మ పుట్టీనరోజు కానుకగానో, రాహుల్ యువరాజు పట్టాభిషేక కానుకగానో, లేక బాబు పదవీకాంక్షతోనొ, లేదా భాజపా దివాలాకొరు రాజకీయంతోనొ తప్ప, తెలంగాణా ప్రజాపొరాటంతో రాదు.
ఇలాంటి ఊకదంపుడు రాతలు రాసి ఈ బ్లాగర్లు, అమాయకుల ఆత్మహత్యలకి కారణం అవుతున్నారు. ఒక కత్తి, ఒక యోధుడు, ఒక మహీ రోడ్డు మీద కి వెళ్ళి ఒక్క రోజు నిరాహార దీక్షొ, లేక లాఠీ దెబ్బలు తినటం చెసిన రోజున, నేను నా అభిప్రాయం మార్చుకుంటాను.
అంతవరకు, వూరికే మనం అంతర్జాలంలో సమయం వ్రుధా చేస్తున్నాము.
>> “తెలంగాణా ఇప్పుడు ప్రజల ఉధ్యమం”
Then let them speak …. let them all speak it out aloud. Why aren’t they? Why are only a bunch of political buffoons, sponsored student goons and their slime-ball teachers doing all the talking?
అబ్రకదబ్రగారూ అమెరికాలో కాదండీ… నిజామాబాద్ కాకున్నా కనీసం హైదరాబాదన్నా వచ్చిచూస్తే తెలంగాణా ప్రజలు కనిపిస్తారు. వాళ్ళ ఉధ్యమఘోష వినిపిస్తుంది. Enjoy making fun of Telangana people. This is precisely what pisses them off.
get your facts clear, katti mahesh kumar.
since I read your comment, I have been roaming around in Hyd with audio recorder to record the so called ghosha! there was little filmi noise at film chamber. someone trying to play T card for his gains…nothing else.
except for Harish rao, his henchmen (students) making little noise here and there, not many hyderabadi’s care for this crap.
if anybody had cared, then TRS would have contested the corp elections.
what pissess hyderabadi’s off is the hype created by media (including bloggers) who report magnified images of these seperatists.
now, pl. dont write dramatic statements, without backing them with hard facts.
“ghosha, guna patham, rakta tarpanam, prana tyagam…etc..” are big words. Someone who respect you may take these words seriously and commit his life. As I said earlier, yadayya’s were made by you.
🙂 🙂 🙂
ఉద్యమఘోషా, ఊరగాయ బద్దా …. ఈ సంగతి రాబోయే ఉపఎన్నికల తరువాత చూద్దాం … పాపం లక్ష్మీనారాయణ, అనిల్ … వీళ్ళని తలుచుకుంటేనే జాలేస్తోంది.
>>ఒక కత్తి, ఒక యోధుడు, ఒక మహీ రోడ్డు మీద కి వెళ్ళి ఒక్క రోజు నిరాహార దీక్షొ, లేక లాఠీ దెబ్బలు తినటం చెసిన రోజున, నేను నా అభిప్రాయం మార్చుకుంటాను.
What an idea witreal ji
కెసిఆర్ ఆంధ్ర వాళ్ళని ఇలా అన్నాడు బాబు నాయనలార అని ఆధారాలతో చూపిస్తే కెసిఆర్ కి తెలంగాణా ఉద్యమానికి సంభంధం లేదు అనడం, అదే కెసిఆర్ ని ఏమన్నా అంటే మాత్రం మొత్తం తెలంగాణా ప్రజానీకాన్నే అన్నట్లు మాట్లాడటం. ఇదేమి లాజిక్కో అర్ధమయ్యి చావదు . మీ ఈ సీరిస్ అయిపోయినా ఈ కొసరు విషయం మీద కూడా ఒక టపా రాయమని మాలాంటి వాళ్ళ మనవి. ఇక ఈ ఉద్యమాల గురించి మన టీవీల వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు చేసే హైప్ గురించి నేను Feb లో హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు చక్క గా అర్ధం ఐంది .
కెసిఆర్, వైఎస్‌ఆర్, సీబిఎన్ లాంటి నాయకులంతా ఒకటే… వ్యంగంగా మాట్లాడే కెసిఆర్ మరియు ఇతర తెలంగాణ నాయకులలాంటివారు, లగడపాటివంటి వదురుబోతు నాయకులు బయటకి కనిపిస్తారు. వైఎస్‌ఆర్ మరియు సీబిఎన్ వంటివారు కనపడరు… ఈ కనపడని వారికన్నా కనపడేవారు ఎంతో మేలు. అంటే వైఎస్‌ఆర్ కన్నా కెసిఆర్ చాలా మేలు.
వీళ్ళందరికీ తమ సొంత పలుకుబడి తమ వాళ్ళ పట్ల అభిమానం మరియు వివిధ స్థలాలలో ప్రజలకు వీరిపట్ల గౌరవం అభిమానం ఉన్నాయి. అది సహజం. అభిమానించే ప్రజల మధ్య బేధాభిప్రాయలు ఉండడం కూడా సహజమే. మీ నాయకుడి నోరు కంపు మా నాయకులు మంచివారు అని ఒకరినొకరు నిందించుకోవడం – బావిలో కప్పలదండుకి మనకి పోలిక ఉన్నట్టే!
నిప్పు లేనిదే పొగ రాదు. పరిపాలించిన అతి తక్కువ స్థానిక నాయకులు అత్యధిక స్థానికేతర నాయకులు ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలను విస్మరించారనడం నిజం. అలా పాలించిన వాళ్ళకి స్థానిక ప్రజల ద్వారా ఎన్నికైన దగుల్బాజీ తెలంగాణ రాజకీయ నాయకుల అండ ఎంతుంది?
తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసిన తరువాత అభివృద్ధి పేరిట ముసుగులో జరిగిన దోపిడితో తమకోసం మరియు తమవారి కోసం పోగేసిన దెంత?
కన్ను మూసి తెరిచేలోపు ఇంకెక్కడికో తరలిపోయే ఈ ఐటి రంగాన్ని స్థానిక ప్రజలు ఎంతగా నమ్మొచ్చు? దాని వల్ల లబ్దీ పొందేది ఎవరు?
ఆంధ్రోళ్ళు మరియు కొంత మంది తెలంగాణోళ్ళు కూడబలుక్కుని జరిపిన ఈ ఉత్తుత్తి అభివృద్దిలో మిగతా తెలంగాణ జనం (అంటే మనం) పోషించిన పాత్ర ఏమిటి?
నిద్రపోతున్నామా… ఇప్పుడే తాడికల్లు మత్తు దిగి నిద్ర లేచామా?
ఇలాంటి ప్రశ్నలకు అర్థాలు దొరకవు – తెలిసినా ఏ నాయకుడు బయటికి చెప్పడు – ఎందుకంటే వాడి జుట్టు కూడా మరొకడి పిడికిలిలో ఉంటుంది.
ఇలా బ్లాగులలో మన సమయం చక్కగా వినియోగించుకోవాలంటే – ఈ వాదనలను ఆపేసి, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలేం కోరుకుంటున్నారని ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం విడిపోతే ఏమౌతుందని ఆశ పడుతున్నారు… ఇక్కడి ప్రజలు ఏ వాగ్దానాలను నమ్మే స్థితిలో లేరు. It is very difficult to re-build the lost Trust among various groups of Telugu people. So the more we quarrel the more differences will grow.
రోడ్డు మీదకెళ్ళి నిరాహార దీక్షలో లేక లాఠీ దెబ్బలు తినడమే ఉద్యమం కాదు – ఈ బ్లాగు లోకంలో తెలంగాణ అమాయక ప్రజల స్థితిగతులను తెలియజేయటం కూడా ఒక రకమైన ఉద్యమమే. అయ్యో ఆంధ్రప్రదేశ్ ముక్కలై పోతోంది అని మదనపడిపోయే వారందరికి ఒకే ఒక విజ్ఞప్తి – మనం బ్రతికేది చాలా తక్కువ సమయం. మరో రెండు మూడు వందల ఏళ్ళ తరువాత ఈ ధరిత్రి రూపురేఖలెలా ఉంటాయో ప్రజల బ్రతుకులు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. తెలుగు/తెలుంగు/ఆంధ్రం మాట్లాడే వారందరికి ఒకటే రాష్ట్రం రాజ్యం వస్తుందని ఐదారు వందల ఏళ్ళకు పూర్వం ఎవరూ ఊహించి ఉండరు.
అందుకే ఇప్పుడు మనం వాదులాడుకునే విషయాలకు అర్థం లేదు. తెలంగాణ ప్రజల వద్ద న్యాయమైన కోరికలున్నాయి… అందులో మొదటిది స్వయంపరిపాలన (self-administration) – ఇక్కడివారి మనసుల్లో, ఇప్పటికే అభివృద్దిచెందిన ఆంధ్ర మరియు రాయలసీమ ప్రజల తెలివితేటల ముందర తామెందుకూ కొరగానివారమనే భావన పాతుకు పోయింది. అదిప్పుడు మనం పది అబద్దాల ఉద్యమమని వంద తప్పుల దురుసు నాయకులని వాదించుకుంటే పోదు. అలాంటి భావన 54 ఏళ్ళ క్రితం కలిసేటప్పుడు ఉంది – దాన్ని తుడిపివేయడానికి నాయకులు పాలకులు చేసిందేమి లేదు – ఎప్పుడూ తమ అధికారాన్ని ఎలా కాపాడుకోవాలనో లేక వచ్చే ఎన్నికలలో ఎలా అధికారంలోకి రావాలనో తాపత్రయపడ్డారే తప్ప – ఇక్కడి అమాయక ప్రజల మనసులలో భావాలను మార్చడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. పైగా అణచివేసే ధోరణి అవలంభించారు. ఈ ప్రాంతం వారి ఘోష ఎవ్వరూ వినే ప్రయత్నం చేయట్లేదని మనం చింతించాలి. కన్నవారికి కడుపుకోతలు ఇంకెన్నాళ్ళో! కొడ్కా కొండయ్యా పోతివా! Hopefully their lives will get better.
ఒకరి యాస మరొకరికి తిట్టుగా వినిపించొచ్చు. అంత మాత్రాన గౌరవించడం రాదు అనడం తగదు. ఉదాహరణకు మనమెంతొ గౌరవప్రదంగా వాడుకునే పదం ‘రండి’ – ఆ పదానికి మరాఠీ, గోంఢి, లంబాడి, ఉర్దూ, హింది మరియు ఇతర భాషలలో బూతు అర్థం వస్తుంది. తెలంగాణలో ఈ భాషలు మాట్లాడేవారు అధికంగా ఉంటారు… అందుకనేమో కాలక్రమేనా ఆ బూతు పదం వాడుకలో ఇప్పుడు లేదు. దానికి ప్రత్యాయంగా వేరే పదం అనడం అగౌరవం అసలే కాదు. ఇలాంటి విషయాలు సరిగా అర్థం చేసుకోవటం మూల కారణంగా ఒకరినొకరు రెచ్చగొట్టేల మనం వాదించుకోవడంలో అర్థం లేదు.
@మహిశ్రీ గారు
మీరు చక్కగా చెబుతున్నారు సంతోషం. వ్యాఖ్యలను బట్టి చాలా మందికి ప్రశ్నలు మిగిలిపోయినవి.
ఒకటి. తెలంగాణా రావడం తెలంగాణా ప్రజల కోరిక అంటున్నారు. ఏవిధంగా ఇది నిజమని అందర్ని ఒప్పిచ్చ గలం?
జరిగిన ధర్నా ల మూలన్గానా? “అదుర్సు” సినిమా ఫై దాడి మూలంగాన? చిరంజి ఎలివేటరు లో వెళ్ళుతుంటే కరెంటు తీసివేయ్యటం మూలన్గానా? సినిమా షూటింగులు ఆపటం మూలంగానా? ఐక్యా తెలంగాణా సమితి లో జరిగే రాజకీయాల మూలంగాన? ఆత్మాహుతుల మూలానా? రిజైను ఇచ్చిన నాయకులనందర్నీ గెలిపించటం ద్వారానా? చెప్పండి.
రెండు. నదుల మీద ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల కట్టలేరు. దానికి సాంకేతిక కారణాలు చాలా ఉంటాయి. తెలంగాణా లో పారే నదుల మీద ప్రాజెక్ట్స్ కట్ట టానికి ప్రోపోసల్స్ చేసి మానేసినవేమన్న ఉన్నయ్యా? దానికి ఏనాయకులు కారణం? నదులు ఎక్కడో పుట్టి ఎక్కడో సముద్రం లో కలుస్తాయి. ఇంకొకళ్ళకి నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయని అడ్డుకద్తే వరదలతో మునిగి పోవలసొస్తుంది.
మూడు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు తెలంగాణకి ఏమి చెయ్య లేదంటున్నారు. వాళ్లనే ఎందుకు మరల మరల ఎన్నుకుంటున్నారు? వాళ్ళని ఏరివేసి కొత్త వాళ్ళని పెట్టొచ్చు కదా?
నాలుగు. ఐటి రంగం కన్నా త్వరగా రాబడి తెచ్చేవి ఎమన్నా ఉన్నయ్యా? రాబడి ఉంటె కర్చు పెట్టె వాళ్ళు ఉంటారు. దానితో పరిశ్రమలు పెరుగుతాయి. మీరు రోజు వుపయోగించే వి ఐటి రంగం మూలాన వచ్చినవే. మొబైల్ ఫోన్లు, టీవీ లు, కార్లు, సూపర్ మార్కెట్లు అన్ని వాటి మూలాన వచ్చినవే. ఇది అభివ్రుది కాదంటారా? ప్రపంచం లో ఐటి రంగం లో అభివృద్ధి కి దోహదం చేసిన వాళ్ళల్లో తెలంగాణా మిత్రులు చాలా మంది ఉన్నారు.
రామకృష్ణ గారు,
నా ప్రయత్నం ఇలాంటి ప్రశ్నల చిక్కుముడుల నుండి మనం బయటకు రావాలనే…
మళ్ళీ అస్తమానమూ ఇతరుల చేష్టలను మన సొంత ఊహాగానలతో మనకు తోచినట్టుగా విశ్లేషణ చేసి మనవద్దనున్న మితమైన సమాచారంతో ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకొని తప్పొప్పులను బేరీజు వేసి స్పర్థలు పెంచుకోవడం నాసు సుతారమూ ఇష్టంలేదు.
కాని మీరడిగిన ప్రశ్నలకు నాకు తోచిన విభిన్న తరహాలో ప్రయత్నించా…
ఒకటి:
ఇది నిజమని నేను ఒప్పించక్కర్లేదు. నేను పుట్టింది పెరిగింది మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే… ఉద్యోగరీత్యా బెజవాడలో గవర్నర్‌పేటలో ఓ సంవత్సరం పాటు తప్పించి మిగతా అంతా తెలంగాణలోనే. నాకు తెలిసి తెలంగాణ ప్రజలలో ఒక్కరు కూడా మాకు సమైఖ్యంగా ఉండడం ఇష్టమే అని అనగా నేను వినలేదు చూడలేదు.
దీనికి నిదర్శనంగానే – ఏ ఒక్క పార్టీకూడా మేము తెలంగాణ రాష్ట్రమివ్వడానికి వ్యతిరేకమని చెప్పలేదు (తెలంగాణలో గుర్తింపు లేని రెండు చిన్న పార్టీలు తప్ప). సిగ్గులేకుండా సిబిఎన్ కెసీఆర్ వేసుకున్న చెట్టాపట్టాలు జగమెరిగిన సత్యాలు – వైఎస్‌ఆర్ రెండు నాల్కల ధోరణి కూడా విధితమే… చిరంజీవి గురించి చెప్పవలసిన అవసరం లేదు. కావున ఏ ఎలక్షన్లు కూడా ప్రజల కోరికలకు రిఫరెండం కాలేదు. ఎవరు మోసగాళ్ళొ లేక ద్వంద వైఖరితో ఓట్లడుక్కున్నారో ఇక్కడి ప్రజలు గుర్తించేటంత జనాల మెదళ్ళు వృద్ది జరగలేదు. ఓ కల్లు ప్యాకెట్టుతో బిర్యాని పొట్లం ఎవడిస్తే వాడికే ఓటు – ఓటంటే ఇక్కడి ప్రజలకు తెలిసిన అర్థం అది.
ఈ ఉద్యమాన్ని సరైన దారిలో నడిపించే గాంధీ లాంటి దూరాలోచన కలిగిన తెలివైన నాయకులు కరువయ్యారు – గతిలేక కెసిఆర్ హీరో అయిపోయాడు. నిజంగా గాంధీ గారు మళ్ళీ పుట్టినా ఈ జనాలను ఒక్కతాటిపై నడపలేరేమో. ఎవరికి తోచిన విధంగా వారు ఉద్యమించేస్తున్నారు. అందుకే నేను దీని గురించి వాదించదలచుకోలేదు.
రెండు:
అయ్యా – మీకు తెలియదనుకుంటా… దయచేసి వివరాలు తెలుసుకోండి. పోచంపాడు ఎత్తు పెంచడాని జలసంఘం అన్ని సాంకేతిక అనుమతులు ఇచ్చింది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలన్న డిమాండ్ గత 36 ఏళ్ళుగా అన్ని అనుమతులున్నా పట్టించుకున్న నాధుడు లేడు. పెన్‌గంగాపై ప్రాజెక్టుకు పివిఎన్‌ఆర్ ఉన్నప్పుడు శంఖుస్తాపన జరిగింది ఆ తరువాత గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై నిధులు మాయం చేసారు. ఈ కాంట్రక్టర్లలలో అత్యధికులు తెలంగాణేతరులే కావడం మరో యాదృచ్చికమైన విషయం. ఇక ఈ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రాంతం వారికి కార్మికులలో చోటు కల్పించారా అంటే అదీ లేదు… చెప్పినట్టు విని అణిగిమనిగి ఉంటారని ఎక్కడో బీహార్ నుండి తెస్తున్నారు. ఇక్కడివారికి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాలరాసినట్టేకదా.
ఎక్కడొ పుట్టి ఎక్కడో ప్రవహించే నదుల గురించి ఎవరూ అడగట్లేదు… ఈ ప్రాంతం ద్వారా ప్రవహించే నదుల జలాలతో జరిగిన వివక్ష గురించె అడిగేది. ఈ వీడియో చూడండి: http://www.youtube.com/watch?v=s2g1b_TK9J0
పైగా తెలంగాణ వచ్చినా కూడా కేంద్ర జలసంఘంను ఎదిరించి అడ్డుకట్టేసే తెలివి ఈ అమాయక తెలంగాణ ప్రజలకు లేదు.
మూడు:
ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే వారంతా అత్యధికులైన తెలంగాణ అమాయక ప్రజలకు డొంక తిరుగుడుగా చెప్పే సమాధానమొక్కటే… తెలంగాణేతర ప్రాంత పాలకులు వారిని సరిగ్గా అభివృద్ది చేయనివ్వడం లేదు…. అని. వీళ్ళలో ఎవ్వరికి నిలదీసే స్థోమతగాని వాదించే వాక్చాతుర్యం కాని లేవు… రావు. వాళ్ళు చెప్పే డొంక తిరుగుడు సమాధానాలను నమ్మక తప్పని పరిస్థితి సృష్టించే ప్రాంతేతర నాయకులు బోలెడు. వాళ్ళని ఏరివేసి వేరే వాళ్ళని పెట్టేదెవరు… ఆ అధికారం ప్రజలకు ఉందా? ఎక్కడో నివసించే అధిష్టానం నాయకులు లేకపోతే ఎవడు ఎక్కువ డబ్బులు వెదజల్లుతాడో వారికే అవకాశమిచ్చే కుళ్ళుబోతు రాజకియాలలో బ్రతుకుతున్నామండి మనం. కొత్త వాళ్ళని పెట్టొచ్చుగా? అని అమాయకంగా అడిగారో లేక వ్యంగ్యమో నాకు తెలియదు.
నాలుగు:
తెలంగాణ అంటే హైదరాబాదులో విదేశీ కంపెనీల మోచేయి నిళ్ళతో మిళమిళ మెరిసే ఐటియాబాద్ మాత్రమే కాదు. ఈ రాబడి ఇక్కడి చిన్న వృత్తి పనులుచేసుకునే చేనేత, కుమ్మరి, చాకలి, మంగళి, మేదరి, గోండి, లంబాడి మొదలైనవారికీ మరియు చిన్న పెద్ద రైతులకు ఎలా ఉపయోగపడింది? ఐటియాబాద్ / సైబరాబద్ ఉద్యోగాలలో పోటీ పడడానికి వాళ్ళ సంతానం కంప్యూటర్లు నేర్చుకోవాలా? అదెంత వరకు సమంజసం? కన్ను మూసి తెరిచేలోపు ఇంకెక్కడికో తరలిపోయే ఈ ఐటి రంగాన్ని స్థానిక ప్రజలు ఎంతగా నమ్మొచ్చు?
మొత్తం హైదరాబాదులో ఐటీ రంగంలో పనిచేసేది ఎంతమంది? పట్టుమని పది లక్షలు ఉంటారా?… మొబైల్ ఫోన్లు, టీవీలు, కార్లు, సూపర్ మార్కెట్లు అభివృద్ది అనుకుని మనం వాదించుకోవడం ఎంతవరకు సమంజసం. ఈ అభివృద్దితో మిగతా మూడున్నర కోట్ల ప్రజలకొచ్చిన లాభమేంటని ఆలోచిస్తే ఏమీ లేదని పచ్చి నిజం బోధపడుతుంది.
హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది యాదృచ్చికంగానే సౌకర్యాలున్నాయి కాబట్టి జరిగింది – ఈ దేశంలో ఎక్కడైనా నిరాటంకంగా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టొచ్చు; వ్యాపారాలు చెయ్యొచ్చు; హద్దనేది లేకుండా అర్జించవచ్చు. కాని ఆ ఆర్జించినదాంట్లొ ఓ పరక స్థానిక సమాజాభివృధ్దిలో పాలుపంచుకోడానికి స్థానిక ప్రజలెచేత ఎన్నుకోబడిన స్థానిక పాలకులచే పరిపాలించబడే ప్రభుత్వం న్యాయపరమైన నిబందన పెడితే దానికి కట్టుబడి అన్నిప్రాంతాలవారు పుష్టిగా అర్జించవచ్చు.
చివరగా…
మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే రాష్ట్రాలుంటే తప్పా?
ఏవరికి లాభం సమైఖ్య రాష్ట్రంతో?
“ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్
మహిశ్రి గారూ
చక్కగా చెప్పారు. చాలా థాంక్స్. నా ఉద్దేశం ఉద్రేక పడకుండా వాళ్ళు నమ్మిన నిజాలని బయటికి తీసుకురావటం. అంతకన్నా ఇంకేమి లేదు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముందరికి వెళ్తే ఏపనులు అవవు. మా గడియారాలు మార్చు కున్నామివాళ. అర్ధ రాత్రి అయింది. మీ చక్కటి స్పందనకి థాంక్స్ ఎగైన్.
>> “నాకు తెలిసి తెలంగాణ ప్రజలలో ఒక్కరు కూడా మాకు సమైఖ్యంగా ఉండడం ఇష్టమే అని అనగా నేను వినలేదు చూడలేదు”
నాకు తెలిసి సమైక్యమే ముద్దనే అచ్చ తెలంగాణవాసులు చాలామందున్నారు .. ఎక్కడో కాదు, నా ఇంట్లోనే.
>> “ఈ కాంట్రక్టర్లలలో అత్యధికులు తెలంగాణేతరులే కావడం మరో యాదృచ్చికమైన విషయం”
అత్యధికుల సంగతి సరే. ఆ మిగతా ‘కొందరు’ ఎక్కడివారు? వాళ్లంతా నీతిపరులేనా? కానప్పుడు, ప్రాంతాతీతంగా కాంట్రాక్టర్ల లక్షణమే దోపిడీ ఐనప్పుడు, దానికి ప్రాంతీయ రంగు పులమటమెందుకు?
ఈ ప్రయత్నాన్ని అడ్డుకోటానికే నా టపాలన్నీ. ముందు ఇంటిదొంగల పని పడితే తెలంగాణ సమస్యలు వాటంతటవే తీరతాయి. ఇది అన్ని ప్రాంతాలకీ వర్తించే విషయమే. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకి ఎక్కువ వర్తించే విషయం.
>> “ఇక ఈ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రాంతం వారికి కార్మికులలో చోటు కల్పించారా అంటే అదీ లేదు… చెప్పినట్టు విని అణిగిమనిగి ఉంటారని ఎక్కడో బీహార్ నుండి తెస్తున్నారు. ఇక్కడివారికి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాలరాసినట్టేకదా”
మళ్లీ పైప్రశ్నే నాది. తెలంగాణ కాంట్రాక్టర్లందరూ స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా? అవునని మీరు రుజువు చెయ్యగలరా? లేనప్పుడు మిగతావారి గురించి గొంతు చించుకోవటమెందుకు?
హెచ్-1 వీసాలతో అమెరికా వచ్చే ‘ఐటీ కూలీ’ భారతీయుల (వాళ్లలో అత్యధికులు తెలుగువారు) మీదా, ఔట్‌సోర్సింగ్ పేరుతో అమెరికన్ ఉద్యోగాలని బయటికి తరలించటం మీదా (మళ్లీ వాటిలో అత్యధికం ఇండియాకి) అమెరికాలో విమర్శలు చెలరేగుతున్నాయి – అచ్చంగా మీరు పైన చేసిన విమర్శ లాంటివే. మరి సదరు ఐటీ అవకాశాల వల్ల ఉపాధి పొందుతున్న తెలంగాణ యువత ఆయా ఉద్యోగాలొదిలెయ్యాలంటారా? దుబాయిలో లేబర్ పనులకి తరలెళ్లే మనవాళ్లనీ మీరు దోపిడీగాళ్లనే అనగలరా? అక్కడ ఆ పనులు చేసేవాళ్లు లేక కాదు మనవాళ్లని తీసుకునేది – మనవాళ్లు తక్కువకే పని చేస్తారు కాబట్టి.
ఆంధ్రా కాంట్రాక్టర్లకి ఆంధ్రావాళ్లపై అంత ప్రేముంటే ఆంధ్రా కూలీలనే పెట్టుకోక బీహారీలనెందుకు రప్పించుకుంటాడు? దానికీ వివక్ష రంగు పులమాల్సిందేనా? వ్యాపారస్థుడన్నాక లాభం కోసమే చూస్తాడు – అది ఆంధ్రా కాంట్రాక్టరైనా, అంతర్జాతీయ ఐటీ సంస్థ ఓనరైనా, దుబాయ్ షేకైనా. బీహారీలతో పని చేయించుకోటం తెలంగాణ ప్రాజెక్టుల్లోనే కాదు, ఆంధ్రా/సీమ ప్రాజెక్టుల్లోనూ జరుగుతుంది. అదేదో తెలంగాణలోనే జరుగుతున్న చోద్యమన్నట్లు గుండెలు బాదుకోకండి.
>> “ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే వారంతా అత్యధికులైన తెలంగాణ అమాయక ప్రజలకు డొంక తిరుగుడుగా చెప్పే సమాధానమొక్కటే…”
నాయకుల్ని నమ్మలేమంటారు, వాళ్లని మార్చలేమంటారు .. మరి అదే నాయకులతో వేరే రాష్ట్రమొచ్చాక ఏం సాధిస్తారు, ఎలా సాధిస్తారు అనేది మాత్రం ఆలోచించరు.
>> “తెలంగాణ అంటే హైదరాబాదులో విదేశీ కంపెనీల మోచేయి నిళ్ళతో మిళమిళ మెరిసే ఐటియాబాద్ మాత్రమే కాదు”
Now we are getting somewhere. అలాగే, ఆంధ్రా అంటే ‘దోపిడీదార్లు’ కొలువైన ఆ నాలుగు కోస్తా జిల్లాలే కాదు, ఆంధ్రోళ్లంటే మీరెరిగిన ఆ పాతిక మంది కోటీశ్వరులే కాదు. ఆ నాలుగిట్లోనూ చేనేత, కుమ్మరి, చాకలి, మంగలి, మేదరి, గోండి, లంబాడి, ఎరుకల, యానాది, ముత్తరాసు ఇంకా లక్షా తొంభై వర్గాల పేదలున్నారు. Their fate is no better than that of their Telangana bretheren. సమస్యలు లేనిదెక్కడ? వేరేవారిని నిందిస్తే తీరేవి కావవి.
>> “మన దేశంలో హింది ప్రముఖంగా మాట్లాడే 12 రాష్ట్రాలు లేనిది – 2 లేదా 3 తెలుగు మాట్లాడే రాష్ట్రాలుంటే తప్పా?”
నేనూ అడగ్గలను: ‘మనదేశంలో తమిళానికీ, కన్నడానికీ, బెంగాలీకీ, మలయాళానికీ, ఒరియాకీ, గుజరాతీకీ ఒక్కో రాష్ట్రమే ఉన్నప్పుడు తెలుగుకి ఒకటికన్నా ఎక్కువెందుకుండాలి?’.
>> “ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్”
ఓహో. విడగొడితే తప్ప ఏకీకరణకి నాంది పలకటం కుదరదన్నమాట. నిజమే సుమీ. చెడగొడితేనే కదా దేన్నైనా బాగు చేసే అవకాశమొచ్చేది. బాగుంది గౌరీశంకరుల ఉవాచ.
ఇంతకీ, ప్రాంతీయ పోరాటం స్థాయి దాటి ఇది ఏకంగా జాతి పోరాటమైపోయిందా? ‘తెలంగాణ జాతి’ అనేదొకటి ఎప్పుడు పుట్టుకొచ్చింది? గౌరీశంకరుల మాటలు వింటే తెలుగువారు జిల్లాకో జాతిగా మారి తన్నుకు చచ్చినా చచ్చినట్లు గౌరవించాలి.
జూలూరు గౌరీశంకర్‌ని మించిన తాత్వికుడు, శాస్త్రవేత్త, యోధుడు, రాజకీయవేత్త, రచయిత .. వెరసి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుడొకాయన రెండున్నర శతాబ్దాల క్రితమే ఓ మంచి ముక్క చెప్పాడు: ‘We must all hang together or assuredly we shall all hang separately’. ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. అదే ముక్క ఆయనకన్నా ముందే మన పూర్వీకులు మరింత తేలికైన తెలుగులో నొక్కి వక్కాణించారు: ‘కలసి ఉంటే కలదు సుఖం’.
చెప్పొచ్చేదేమంటే – కొటేషన్లూ, స్లోగన్లూ నేనూ ఇస్తాను .. కావలసినన్ని. వాటిద్వారా ఒరిగేది సున్న.
@రామకృష్ణ,
ధర్నాలంటే మాగుండె చప్పుడు, ఆవిధంగా మాకు తెలంగాణా కావలని వినిపించినం.
తెలంగాణ ఆత్మగౌరవం కొంతమంది ఆంధ్రొళ్ళవల్ల బెదరదని ’అదుర్స్’ని ఆపెశినం.
ఇక్కడ మాకడుపులు కాలుతుంటె, ఆ కరెంటు బెట్టుకుని మీరు లిఫ్టులల్ల తిరుగుతరా? అందుకనే బంద్ జెశినం.
ఐక్యా తెలంగాణా సమితి మా స్వంత విషయం. మేంజూసుకుంటం.ఎన్నితన్నుకున్నా, మేం మేం ఒక్కటే.
ఆత్మాహుతులంటె, తెలంగాణ ప్రజల హ్రుదయఘోష అట్ల బయటపడింది. మీలెక్క మాకు కిరికిరిల్ జెయ్యనీకి రాక, ఉరితాళ్ళు ముద్దాడినం, అగ్నిదేవున్ని కౌగిలించుకున్నం.
మాగ్గావలసినచోట ప్రొజెక్టులు గట్టుకుంటం. మునిగిపోతయంటవా, పొనియ్. అది మేంజూసుకుంటం. మా అన్న kcr ఆయన పడవలుతెచ్చి మమ్మల్ని వొడ్డుకు జెరుస్తడు, మీకేమన్న ఇబ్బందా?
ఇయన్నీ గాదయ్య, మాతెలంగాణ మాగ్గావాలె. మేంరాజ్యమెలాలె. నాలుగునెలల్ల లక్ష ఉద్యోగాలు స్రుష్టించి గిన్నిస్ రికార్డు స్థాపిస్థాం. చూస్తూ వుండండి.
Yodudu lite teesko ,
nee argument lo pasa ledu.
Cinemalu aapestam, Manushulni liftlo irikinchadam lantivi chesi telangaana vaala baadalu cheppalanukovadam kante picchi pani marokati undadu.
Atuvantappudu ee blogulu avasaram ledu eee udyamalu avasaram ledu.
Ayina oka chota KCR nothing antavu inkoka chota KCR peddanna antavu first atanu enti? adi decide chesukunte manchidi.
Ikya telangana naaku telisi telangana prajala gunde goshani vinipistundi adi naa swanta vishyam anataniki veelu ledu. Neeku answer teliyada oppuko telangana ante nuvvu kaadu kada anni neeku teliyalsina avasaram ledu.
Maa telangana maaaku kaavale, mem raajyamelale..
Donka terugudu lekunda maatladadam ante moorkamga maatlada mani kaadu.
ఒక తెలంగాణా యోధుడు ఇలా రాసారు
>>> “ధర్నా మా గుండె చెప్పుడు”
అంటే మీరు రోడ్ల మీద పది బస్సులు తగుల పెట్టి రోడ్ల లో ఎవరూ తిరగ కుండ చేస్తేయ్ అది ధర్నా కాదు మీ గుండె చెప్పుడు అంత కంటే కాదు అది సామాన్య ప్రజల దుర్భాగ్యం ఎందుకంటే వాళ్ళు పన్నులు కట్టి ప్రజలు కోసం ఉన్న బస్సులు రోడ్లలో తిరుగ లేక పోతున్నందుకు …. మీ నాయకులూ బక్క నా కొడుకుకు ఇలాటివి పట్టవు . తెలంగాణా లో కూడా రెక్కదితేయ్ కాని డొక్కాడని మనుషులు ఉన్నారు…
సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆత్మ గురవం తొక్క తోడూ అని .. ఇది ఒక ఉద్యమమేనా అని నాకు చాల పెద్ద సందేహం
>>> లక్ష ఉద్యోగాలు సృష్టించి గిన్నిస్ బొక్క్ లోకి ఎక్కుతాం అని అన్నారు…
ఇట్లాంటివి సర్కుస్ లో చేస్తేయ్ బాగుంటుంది
సమాన యుల గురించి ఆలోచించటం మరచిపోయిన వాళ్ళు రేప్పొద్దున తెలంగాణా వచినా చేసేయ్దేమి ఉండదు.. జనాలను దూచుకు తినటం తప్ప.
>>> తెలంగాణలో ప్రాజెక్ట్లు కట్టి ఊరకు మునిగి పోతే మీ కెసిఆర్ పడవలో వస్తాడా ? ఎంత హాస్యాస్పదం …
వాడె ఫస్ట్ మీమ్మల్ని మీ కర్మానికి వదిలి పెట్టి,పెళ్ళాం, కూతురు కవిత, అల్లుడు కలిసి ఢిల్లీ చెక్కేస్తాడు
nice analysis sir
మంచి అనలిసిస్ అబ్రకదబ్ర గారు అండ్ మహిశ్రి గారు.
నాది గుంటురే కాని,నాకు ఎందుకొ తెలంగాణ ప్రజల వాదనలొ
కొంచెం అర్ధం మరియు అవేదన ఉన్నది అనిపిస్తుంది.వాళ్లు వద్దు అనుకుంటుంటె మనము వేలాడ పడటం ఎందుకండి.విడిపొయిన తరువాత ఎవరి అద్రుష్టం ఎలాగ ఉంటె అలా జరుగుతుంది.
ఈమధ్య నెట్ లో జనం వేరేవేరే ఐడెంటిటీస్ క్లెయిమ్ చేస్తూ సొంత అభిప్రాయాలు రాయడం నేర్చుకున్నారు. గుంటూరువాణ్ణని చెబుతూ తెలంగాణవాదాన్ని సపోర్టు చేయడం. లేదా కరీంనగర్ వాణ్ణని చెబుతూ సమైక్యవాదిననడం. అట్లనే ఈ పైన ఇంద్రసేనారెడ్డిగారి గుంటూరు డొమిసైల్ కూడా సందేహాస్పదమే కావచ్చు. గుంటూరువాడెవడూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చేయమని చెప్పడు.
అబ్రకదబ్ర గారు ఇవాలే మీ తెలంగాణ వ్యాసాలు అన్ని చదవడం పూర్తి చేసాను అండి.అత్యద్బుతం అనే పదం చాల తక్కువ అనుకంట మీ రచనా శైలిని మరియు మీ నాలెడ్జిని ప్రశంసిచడానికి.మీరు ఓపిగ్గ రాసి వివరించినదుకు క్రుతఘ్నతలు .
@ఒబుల్ రెడ్డి గారు
నేను ఏమి సత్య హరిస్చంద్రుడుని కాక పొయినా ఇంత చిన్న విషయానికి అబద్దం చెప్పాల్సిన అవసరం రాదులెండి.గుంటూరు కారపు పచ్చడి,గొడ్డు గారం తిని కొంచెం పౌరుషం ఎక్కువ అండి.నేను కూడ సమైక్యవాదినే,కాని వాళ్లు వద్దు అంటె,మనము ఎందుకు కావాలని అనుకొవడం,నాకేమి తక్కువ అని పౌరుషం ముంచుకొచ్చి విడిపొదాం అన్నాను.నేను వేర్పాటు వాదిని కాను.
మేలుకొలుపు