ఆరో అబద్ధం:
నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య
ఇదీ నిజం:
భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ దుర్ఘటన జరిగి పాతికేళ్లు దాటిపోయింది. అందులో మృతి చెందినవారి సంఖ్య దాదాపు పాతిక వేలు. ఆ విషవాయువుల ధాటికి వివిధ జన్యు సంబంధిత రోగాల బారిన పడ్డవారి సంఖ్య రమారమి ఐదు లక్షలు! అంత దారుణ దుర్ఘటన జరిగి ఒక తరం గడిచిపోయినా, ఆ బాధితులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. కారణం? మన దేశంలో చట్టాలు చట్టుబండలయ్యాయి కాబట్టి, ప్రభుత్వాలు అంత పసందుగా పని చేస్తాయి కాబట్టి. మన వ్యవస్థ కుళ్లిపోయింది. దానితో పాటే అది పుట్టించే నాయకులూనూ. అలాంటి వారికి సమస్యల నిజ పరిష్కారాలు వెదకటం కన్నా, వాటిని పెంచి పోషించటం, పనిలో పనిగా కొత్త సమస్యలు పుట్టించటం, తర్వాత తీరుబడిగా వాటిని తమ స్వలాభాలకి వాడుకోవటం ముఖ్యం. శవాల మీద చిల్లరేరుకునే రాజకీయవేత్తలు మనకి కొత్త కాదు. వాళ్లకి మేధావిగణాలు సైతం వంత పాడటం మన రాష్ట్రంలో మొదలైన వింత.
తాగు నీటిలో ఫ్లోరిన్ ప్రమాదకరమైన మోతాదులో (1.5 mg/l కన్నా ఎక్కువ) ఉంటే వచ్చే జబ్బు ఫ్లోరోసిస్. పంటి జబ్బుల నుండి ఎముకలు క్షీణించటం దాకా పలు రకాల వ్యాధులు దీనివల్ల వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ నివారించాల్సినవే కానీ, నయం చెయ్యలేని జబ్బులు. పారిశ్రామిక వ్యర్ధాలు భూగర్భ జలాలనీ, నదీ జలాలనీ కలుషితం చెయ్యటం నీటిలో ఫ్లోరిన్ శాతం పెరిగిపోవటానికి ప్రధాన కారణం. సాధారణంగా నిరుపేదలే ఫ్లోరోసిస్ బారిన పడటం కద్దు. ఇటువంటి వారి సంఖ్య ఒక్క నల్లగొండ జిల్లాలోనే లక్షల్లో ఉందనేది నివేదికలు నిగ్గుదేల్చిన నిజం. దశాబ్దాలుగా ఆ వ్యాధిగ్రస్తుల వేదన అరణ్య రోదనే ఔతుందన్నదీ నిజం.
ఈ సమస్య వేర్పాటువాదులకి వరంలా సిద్ధించిందన్నది వీటన్నిట్నీ మించిన నిఖార్సైన నిజం. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య అపరిషృతంగా ఉండటం వీళ్ల పంట పండించింది. అసలు సమస్య పరిష్కారం విషయంలో వీళ్లకి చిత్త శుద్ధే ఉంటే, తెలంగాణపై వీళ్లకి నిజమైన ప్రేమే ఉంటే ఆ సమస్య ఇప్పుడింత తీవ్రంగా ఉండేదే కాదు. కానీ సమస్యల్లేకపోతే వీళ్ల పబ్బం గడిచేదెలా? అవలా ఏళ్లూ పూళ్లూ సాగటమే వీళ్లకి ముద్దు. ఎంచక్కా దాన్నీ పక్కోళ్ల మీదకి నెట్టేసి, వివక్షాభియోగాలు సంధించి, తెలంగాణవాసుల్ని రెచ్చగొట్టేసి తమ పన్లు కానిచ్చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతుందదే.
నల్లగొండలో ఫ్లోరోసిస్‌కీ ఆంధ్రోళ్లే కారణమట! మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టటం కన్నా విచిత్రమైన విషయమిది. ఇన్నేళ్లలో తెలంగాణకి అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ ప్రాతినిధ్యమే లేదా? నల్లగొండ ఫ్లోరోసిస్ గురించి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పోరాట్టానికి ఆంధ్రా, సీమల ప్రజా ప్రతినిధులే తెలంగాణకి దిక్కయ్యారా? ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏకంగా ఓ ప్రధానమంత్రి సైతం తెలంగాణ ప్రాంత నుండి వచ్చారు. వాళ్లందరూ ఫ్లోరోసిస్ విషయంలో చేతులు కట్టుక్కూర్చున్నారా? వాళ్లని నిలదీయాల్సిన వేర్పాటువాదులు ఆ తప్పునీ ఆంధ్రోళ్ల మీదకి నెట్టటం – వాళ్ల స్వభావానికి తగ్గట్లే ఉంది. సాక్షాత్తూ వేర్పాటువాదుల్లోనే మంత్రి పదవులు వెలగబెట్టిన మహానుభావులున్నారు. తమ తమ పదవీకాలాల్లో నల్లగొండ ఫ్లోరోసిస్ విషయంలో వాళ్లేం ఊడబొడిచారో అడిగేవారు లేరు, చెప్పేవారూ లేరు.
ఇంతకీ, ఈ ఫ్లోరోసిస్ అనేది నల్లగొండకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలో పాతిక పైగా దేశాల్లో ఉన్న సమస్యిది. మన దేశంలో ఇరవై రాష్ట్రాలు ఫ్లోరోసిస్ బారిన పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే, పందొమ్మిది జిల్లాల్లో ఫ్లోరోసిస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాటిలో నల్లగొండ ఒకటి. ఫ్లోరోసిస్ కేసుల్లో నల్లగొండకి దీటైనది ప్రకాశం – ‘ఆంధ్రోళ్ల’ జిల్లా. నిజానికి, ప్రపంచంలో మొట్టమొదటి ఎముకల/నరాల సంబంధిత ఫ్లోరోసిస్ కేసు వెలుగు చూసిందే ప్రకాశం జిల్లాలో – 1937లో. అప్పట్నుండీ ప్రభుత్వాలెన్ని మారినా ఆ సమస్య ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గింది లేదు. దానిక్కారణం ఓ పక్కనున్న తెలంగాణవాళ్లో, మరో పక్కనున్న రాయలసీమ వాళ్ళో అని ప్రకాశంవాసులు అనలేదే. తెలంగాణ వేర్పాటోద్యమాల పుణ్యాన నల్లగొండ ఫ్లోరోసిస్‌కి దేశవ్యాప్త గుర్తింపొచ్చింది కానీ, ప్రకాశం జిల్లాకి ఆ భాగ్యమూ లేదు. ఆ వారా, నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితులకి అంతోయింతో సహాయమన్నా అందింది. ప్రకాశం బాధితుల గోడెవరు వినేది? వాళ్లే కాదు, మిగిలిన జిల్లాల బాధితుల దుర్గతీ అదే. వాటిలో తెలంగాణ జిల్లాలూ ఉన్నాయి. వేర్పాటువాదులకి తక్కిన తెలంగాణ జిల్లాల బాధ పట్టదు. నల్లగొండలో ఫ్లోరోసిస్ కేసులెక్కువ కాబట్టి, వీళ్ల నాటకాలకి అక్కడ రాలే చిల్లర ఎక్కువ కాబట్టి, ఎంతకీ నల్లగొండ ఫ్లోరోసిస్ గురించే గొంతు చించుకుంటారు, ఆ వంకతో ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. రేపు తెలంగాణ ఏర్పడితే అప్పుడు మిగతా జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య ముందుకు తెచ్చి మరో రాష్ట్రం కావాలనటానికి ముందస్తు జాగ్రత్తగా అటక మీద దాచుకుంటున్న అస్త్రమన్న మాట.
ఫ్లోరోసిస్ సంగతి పక్కన పెడదాం. మన రాష్ట్రంలో ఆరోగ్య సంబంధిత సమస్యల్లేనిదెక్కడ? మన్యంలో ఏటా విష జ్వరాల బారిన పడి మట్టిలో కలిసిపోయేవాళ్లెందరు? పోషకాహార లోపంతో పుట్టుకలోనే అవకరాల బారినపడే పిల్లల్లేని జిల్లాలు రాష్ట్రంలో ఎన్ని? వీటన్నిటికీ పక్క జిల్లాల మీదనో, ప్రాంతాల మీదనో పడి ఏడవటంలో ఔచిత్యమెంత? అలా ఏడిస్తే బాధితులకి నికరంగా ఒరిగేదేంటి? సమస్యలకి నిజమైన పరిష్కారాలు వెదక్కుండా పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమంటూ ప్రతిదానికీ ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమనే పాట పాడటం ఎవరి ప్రయోజనం కోసం?
ప్రాంతాలకు ప్రాంతాలే దారుణమైన వ్యాధులకి గురౌతున్నా ప్రభుత్వాల్లో చలనం ఉండకపోవటం దేశవ్యాప్తంగా అతి మామూలైన విషయం అనేదానికి భోపాల్ సంఘటన ఓ తిరుగులేని రుజువు. ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ జిల్లా మాత్రమే రోగాలతో బాధపడుతున్నట్లూ, దానికి కారణం ఆంధ్రా/సీమ వాసులన్నట్లూ చిత్రీకరించటం వేర్పాటువాదుల అతి తెలివికి నిదర్శనం. ఈ అబద్ధాన్ని అత్యంత పకడ్బందీగా ప్రచారం చేసే కుహనా మేధావులు వాళ్లకి తోడవటం తెలుగు జాతి ఖర్మం. అభివృద్ధి, సంస్కృతి, భాష, ఉద్యోగాలు .. కాదేదీ వేర్పాటుకనర్హం. ఆఖరికి జబ్బులు కూడానా!
(సశేషం)
భూగర్భజలాలు అడుగంటితే ఫోరోసిస్ సమస్య ఎక్కువ అవుతుంది. దానికి ఆంధ్రోల్లే కదా కారణం. ఒక బ్లాగు రన్ చేస్తున్నావంటే నువ్ చదువుకున్నవాడివని అర్దం అవుతుంది. దొంగ ఫ్యామిలీలో పుట్టామని దొంగతనం సబబే అని వాదిస్తామా?
ఫ్లోరోసిస్ సమస్యలో నల్లగొండ ప్రపంచంలోనే నెంబర్ వన్. మరి మానాయకులు ఇన్నాళ్ళు ఏంచేశారు అనేది నన్ను ఇన్నాళ్ళు వేదించిన సమస్యే. కానీ లగడపాటి దొంగ నిరాహారదీక్షతో ఆ డౌట్ కాస్తా తీరిపోయింది. మీవాళ్ళు మీదికానిదానికోసం కూడా చాలా గట్టిగా పోరాడుతారు. మావాళ్ళు మాదైనా గట్టిగా అడగలేదు. పైగా ముదనష్టపు అదిష్టానాల ఆంక్షలు ఉండనే ఉన్నాయి. తప్పుకదా. బ్రదర్ ముందు విషయాన్ని స్టడీ చేయి అర్దం చేసుకో ఆతర్వాత తెలంగాణా గురించి రాయి. తప్పకుండా నీకు తెలంగాణా ఎందుకు అడుగుతున్నారో అర్దం అవుతుంది. పంటల పరిహారం తెలంగాణాకు 20 కోట్లు. మరి ఆంధ్రాకు 780 కోట్లు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గ్రాంటు ఒకటిన్నర కోటి. యోగి వేమన యూనివర్సిటీకి ౪౦౦ కోట్లు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు 1200 కోట్లులో జస్ట్ డబుల్ డిజిట్ లో తెలంగాణాకి. మిగతావి మీకు. ఇదీ మీ ఆంధ్రోల్ల పాలన. నా బ్లాగు చదువు నీకే అర్దం అవుతుంది.
ఇవన్నీ ఈ మద్య వేర్పాటు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలంలో చేసిన మోసాలే. ఇలాంటివి ఎన్నో.
Ramesh,
Fluorosis was initially detected in Nalgonda around 1945 and numerous cases were found by 1955. Andhra Pradesh has not formed by then. Could you clarify on how you came to your conclusion that Andhrites are the reason for this problem.
The problem has been in existence since pre-independence days, and you would rather blame leaders of other regions than question leaders of Nalgonda region for this problem not being solved yet? Why don’t you pose these questions to Jana Reddy, Komatireddi brothers and Ramreddy brothers (all from Nalgonda region) that’re the leading lights of the current Telangana JAC ?
Abhimaani
you read the comment fully. then you will understand. We hate you people. we are even ready to took the path of violence still you people are not ready to leave this place. why? because you gain something by being here and you are gaining means we are loosing something. Educated ayi undi vishayam ardam cheskokunda foolish questions vesthunnaru. Useless fellow didnt you read the comment fully?
mr. ramesh
in democracy every one has the right to express their opinion and fight for them.
difference in opinion, and discussion and debate on differences will only enlight for betterment.but my question is that why you people use foul language while discussing?
i think only those will be agitated , when there is no real point in their arguement.
so i hope u will appreciate good healthy discussion and if possible will give light on our mistakes in democratic way.
we may not be ur enemy if we have any different opinion than you.
ముందు మీరు ‘వేర్పాటు వాదులు’ అనే పదం ఉపయోగించడం మానండి. తొంభై శాతానికి పైగా తెలంగాణా ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని వాన్చిస్తున్నారు. ఒక వేల మేం వేర్పాటు వాదులమైతే, మద్రాసు నుండి విడిపోయిన మీరు కూడా వేర్పాటు వాదులే.
ఒక వైపు నుండి వందల అబద్ధాలు మీరు చెపుతూ ‘పది అబద్ధాలు’ అంటూ గోబెల్సు ప్రచారాలు చేస్తున్నారు. ముందుగా ప్రణాళిక వేసిన విధంగా సిద్దేశ్వరం దాగ్గర నాగార్జున సాగర్ డ్యాము కడితే నల్లగొండ, ఒంగోలు ఫ్లోరీన్ సమస్యల తో బాటు మహబూబ్ నగర్ కి కూడా కరువు తప్పేది అని మీ హ్రస్వ దృష్టికి కనపడక పోవచ్చు. డబ్బు బలం కలిగిన కృష్ణా గుంటూరు లాబీలే నాగార్జున సాగర్ ని నందికొండ వద్దకు దింపి నారని తెలుసుకోండి. అసమానతల పొత్తులో డబ్బున్న వాడే మరింత అభివృద్ధి చెందు తాడనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
ముప్పై సంవత్సరాల క్రితం పూర్తయిన శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమ కాలువలో ఇప్పటివరకు ఎందుకు నీళ్ళు రాలేదు? కుడివైపున మద్రాసు వరకూ వెళ్ళిన నీరు ఎడమవైపుకు పరీవాహకం లో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్లను కూడా తడప లేక పోతుందే. ప్రక్కనే ప్రాజెక్టు పెట్టుకుని ఫ్లోరీన్ తో అలమటిస్తున్న ప్రజల పై కనీస సానుభూతి లేక పోగా అబద్ధాలంటూ అపహాస్యం చేస్తున్నారు.
మాటి మాటికి మీ నాయకులు, మీ నాయకులు అంటూ అంటారు. చిత్తశుద్ధి తో పనిచేస్తున్న జయ ప్రకాష్ నారాయణ కూకట్ పల్లి నియోజక వర్గాన్ని ఏపాటి అభివృద్ధి చేస్తున్నాడో అందరూ చూసే విషయమే. గుంపులు, మంద బలం తో మాత్రమె పనులు జరిగే ఈ దేశం లో చిత్తశుద్ధి ఎంత వరకు పని చేస్తుందో జగద్విదితం. అరవై శాతంగా వుండే ఆంధ్రులు సహజంగానే అన్ని నిర్ణయాలనూ ప్రభావితం చేయగలరు. అందుకే మా రాష్ట్రం మేం కోరుతున్నాం.
ఒక జాతి స్థానిక స్వపరిపాలన కోరుకున్నప్పుడు ప్రపంచంలో ఏ పొరుగు జాతి, దానికి వ్యతిరేక ఉద్యమం చేయలేదు. ప్రపంచంలో మొదటి సారిగా మీరు మాత్రమే ఆ ఘనత సాధించారు. తెలంగాణా వాదం నాలుగు కోట్ల ప్రజల ఆత్మా ఘోష. అది సాకారం కావడం త్వరలో మీరు చూస్తారు. ఈలోగా ఇలాంటి పిచ్చి రాతలు రాసి తెలంగాణా ప్రజల దృష్టిలో మరింత చులకన కావద్దని మాత్రమే మేంకోరేది.
Nagarjuna Sagar was always planned to be built at the Nandikonda Site. Pulichintala and Siddheswaram were the sites for balancing reservoirs. The change of project site is mis-information. Raja of Muktyal played a major role (http://en.wikipedia.org/wiki/Raja_of_Muktyala#Achievements) in getting the Nagarjuna Sagar project built. Please do not blame Krishna/Guntur regions. It is the leaders from these regions that lobbied with the central govt. for this project (before Andhra Pradesh was formed. The foundation stone for Nagarjune Sagar was laid in 1955). If anything, Telangana got benefited from this project, with no major effort from their side.
Abhimaani
Your link does not inform any thing more than what I said. The statement “Nagarjuna Sagar was always planned to be built at the Nandikonda Site” is another lie. You can check that at this link. It clearly says “Siddeswaram and Pulichintala were identified as the suitable locations for the reservoirs“. Reservoirs, not balancing reservoirs.
@Telangana Yodhudu:
>> “ఈలోగా ఇలాంటి పిచ్చి రాతలు రాసి ..”
Huh? I wouldn’t invite myself to somebody’s party and call the host names. I’m letting you go for this once. Please don’t do it again.
Coming to your comment ..
నల్గొండలో ఫ్లోరోసిస్‌కి, నాగార్జున సాగర్‌కి ఏమిటి సంబంధం?
మీరు చెప్పేదాని ప్రకారం దేశంలో ఫ్లోరోసిస్ ఉన్న చోటల్లా ఆంధ్రావాళ్లు చేసిన మోసాలే కారణం కావాలి – ఆంధ్రా, సీమ జిల్లాలతో సహా. ఎంత విచిత్రమైన వాదన చేస్తున్నారో గమనించారా?
>> “ఫ్లోరీన్ తో అలమటిస్తున్న ప్రజల పై కనీస సానుభూతి లేక పోగా అబద్ధాలంటూ అపహాస్యం చేస్తున్నారు”
ఏమిటో ఆ అపహాస్యం? నల్గొండలో ఫ్లోరోసిస్ లేదన్నానా, లేక వాళ్ల బాధల్ని చూసి కడుపుబ్బా నవ్వుకున్నానా? వాళ్ల బాధల్ని తమ సొంత పనులు చక్కబెట్టుకోటానికి చక్కగా వాడుకుంటున్న కుటిల రాజకీయుల కుత్సితాల్ని ఎత్తి చూపాను. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు?
>> “ముప్పై సంవత్సరాల క్రితం పూర్తయిన శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమ కాలువలో ఇప్పటివరకు ఎందుకు నీళ్ళు రాలేదు?”
మంచి ప్రశ్న. బదులుగా నాది మరో ప్రశ్న. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెల్లారేసరికి ఆ కాల్వలో నీళ్లు బిలబిలా పరవళ్లు తొక్కుకుంటూ వచ్చేస్తాయా? పనికిమాలిన ఉద్యమాల మీద పెట్టిన శ్రద్ధలో పదోవంతు పనులు చేసుకోటమ్మీద పెట్టుంటే సగం సమస్యలన్నా తీరుండేవి. కానీ అదికాదు కదా వేర్పాటువాద నాయకులకి కావాల్సింది. సమస్యలు ఎక్కడివక్కడే ఉండాలి. అప్పుడే కదా వాళ్లు మీలాంటివాళ్లని రెచ్చగొట్టగలిగేది.
>> “అరవై శాతంగా వుండే ఆంధ్రులు సహజంగానే అన్ని నిర్ణయాలనూ ప్రభావితం చేయగలరు”
Really? మరి రాష్ట్రంలో అత్యంత కరువు ప్రాంతాలుగా రాయలసీమ జిల్లాలు వెలిగిపోతున్నాయెందుకు? నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా పల్నాడులో కరువు తాండవిస్తుందెందుకు? గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరులు ఏటేటా వరదల్లో కొట్టుకుపోతాయెందుకు? ఉత్తరాంధ్ర జిల్లాలు తెలంగాణలో వెనకబడ్డ జిల్లాలకన్నా వెనకబడ్డాయెందుకు? ఓ శ్రీకాకుళం మంత్రిగారి కుటుంబంలో అరడజను మంది ప్రజాప్రతినిధులున్నా ఆ జిల్లా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉందెందుకు?
మీవద్ద సమాధానాలుండవు. అవీ నేనే చెబుతా. నాయకులంతా ఒకటే – ఏ ప్రాంతం వాళ్లైనా. ఈ ఆరువ్యాసాల్లో నేనెక్కడా ఆంధ్రా/సీమ నాయకులు పెద్ద పత్తిత్తులు, తెలంగాణ వాళ్లు మాత్రమే చవటలు అనలేదు. అందరూ అందరే. పైన చెప్పిన కోస్తా/సీమ సమస్యలకి తెలంగాణ నాయకుల్ని నిందిస్తే ఏం ఉపయోగం? అలాగే తెలంగాణ సమస్యలకి వేరే ప్రాంతాల నాయకుల్నీ, ప్రజల్నీ నిందిస్తే ఏం లాభం? ఎవరి నాయకుల్ని వాళ్లు నిలదీయాలి. తెలంగాణలో రాజకీయ నాయకులు కోటాను కోట్లకి పడగలెత్తటం నిజం కాదా? సొంత ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెంచేసుకోటానికి అడ్డం రాని ‘ఆంధ్రా వాళ్ల మంద బలం’ తెలంగాణ సమస్యల విషయంలో కృషి చెయ్యటానికి మాత్రం వచ్చిందా? ఈ మాట ఇంకెక్కడా అనకండి – నవ్విపోతారు. నాలాంటి వాళ్ల మీద ప్రదర్శించే ఉద్రేకం మీ కళ్లకు గంతలు కట్టి మా మీదకు ఉసిగొలుపుతున్నవారి మీద చూపండి. అది అందరికీ మంచిది.
>>ఒక జాతి స్థానిక స్వపరిపాలన కోరుకున్నప్పుడు ప్రపంచంలో ఏ పొరుగు జాతి, దానికి వ్యతిరేక ఉద్యమం చేయలేదు.
U know about confederate states of america??
http://en.wikipedia.org/wiki/Confederate_States_of_America
మీ తరువాతి comment కూడ నేనే చెబుతా…అమెరికా వాడి గోల నాకెందుకు అంటారు..”ప్రపంచం” గురించి మాట్లాడింది మీరే కదా సార్ 🙂
1969 – First telangana movement.
1971-2 – Jai Andhra Movement (for separate andhra state)…
If state was to be separated, that was the right time…Why was it not done?? by the way, CM then was Mr. P.V. Narsimha Rao…from Telangana 🙂
“ఒక జాతి స్థానిక స్వపరిపాలన కోరుకున్నప్పుడు ప్రపంచంలో ఏ పొరుగు జాతి, దానికి వ్యతిరేక ఉద్యమం చేయలేదు. ప్రపంచంలో మొదటి సారిగా మీరు మాత్రమే ఆ ఘనత సాధించారు.” – ఇది విడిపోవడం కాదు. సమైక్యంగా ఉండి, అందరూ కలిసి రాజధానిని బాగా అభివృద్ధి చేసుకున్నాక, సమయం చూసి, ‘ఇదంతా మాదే, ఇక నీ దారి నువు చూసుకో’ అని తోటివాణ్ణి బయటికి గెంటేయబూనడం. దానికోసం ఉద్యమం చేస్తున్నారీ తేనె పూసిన కత్తుల్లాంటి ఉద్యమకారులు. ఇలాటివాళ్ళు ప్రస్తుతం లోకంలో ఇంకెక్కడా లేరు. అప్పుడెప్పుడో 5 వేల ఏళ్ళ కిందట భారతదేశంలోనే ఒకడలా చేసాడంట!
తమ ఆశయసాధనకోసం లక్షలాదిగా అబద్ధాలను సృష్టించినవాళ్ళు కూడా ప్రస్తుతం లోకంలో ఇంకెక్కడా లేరు. ఒకప్పుడు జర్మనీ అనే దేశంలో ఒకడెవడో ఉండేవాడంట.
“అసమానతల పొత్తులో డబ్బున్న వాడే మరింత అభివృద్ధి చెందు తాడనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.” – ఓహో, గొప్ప సత్యాన్ని నిదర్శనాల్తో కూడా చూపారు. ఈ లెక్కన తెలంగాణ ఏర్పడ్డాక కూడా నల్లగొండకు ఒరిగేదేమీ లేదన్నమాటే! మహబూబునగరు జనం వలసలు పోతూనే ఉంటారన్నమాటే! ఎంచేతంటే పాపం కరీంనగరు, వరంగల్లులతో వాళ్ల పొత్తు అసమానతల పొత్తే కదా! ఇలాంటి దార్శనికతే భవిష్యత్తులోనూ పరిఢవిల్లితే బహుశా ఓ ఇరవై పాతిక తెలంగాణలను చూడొచ్చు.
“కుడివైపున మద్రాసు వరకూ వెళ్ళిన నీరు ఎడమవైపుకు పరీవాహకం లో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్లను కూడా తడప లేక పోతుందే. ప్రక్కనే ప్రాజెక్టు పెట్టుకుని ఫ్లోరీన్ తో అలమటిస్తున్న ప్రజల పై కనీస సానుభూతి లేక పోగా అబద్ధాలంటూ అపహాస్యం చేస్తున్నారు.” – ఇక్కడే కాదు, ఎక్కడా ఎగతాళిగా మాట్టాడ్డం నేను చూళ్ళేదు. పైపెచ్చు, వాళ్ళ కష్టంతో సహానుభూతి కనబరచడమే చూసాను. కానీ తె.వాదులు మాత్రం వీరిపట్ల అమానుషంగా వ్యవహరించడం చూస్తున్నాం. సహానుభూతి కాదుగదా కనీసం సానుభూతి కూడా వాళ్ళకు లేదు. వాళ్ళ కష్టాలను పట్టించుకోవడం మానేసి, వాళ్ళను తమ ఉద్యమంలో సమిధలుగా వేల్చుతున్నారు. పైగా, “ముప్పై సంవత్సరాల క్రితం పూర్తయిన శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమ కాలువలో ఇప్పటివరకు ఎందుకు నీళ్ళు రాలేదు?” అని అడుగుతున్నారు. ఎక్కడడగాల్సిన ప్రశ్న ఇది? ఎప్పుడడగాల్సిన ప్రశ్న? ఎవరినడగాల్సిన ప్రశ్న?
@ramesh..
భూగర్భజలాలు అడుగంటితే ఫోరోసిస్ సమస్య ఎక్కువ అవుతుంది. దానికి ఆంధ్రోల్లే కదా కారణం
can you show some proof..?? please enlighten us.
ఫ్లోరోసిస్ సమస్యలో నల్లగొండ ప్రపంచంలోనే నెంబర్ వన్. మరి మానాయకులు ఇన్నాళ్ళు ఏంచేశారు అనేది నన్ను ఇన్నాళ్ళు వేదించిన సమస్యే. కానీ లగడపాటి దొంగ నిరాహారదీక్షతో ఆ డౌట్ కాస్తా తీరిపోయింది.
ela theeripoindho kastha cheppu baasu.. :D… artham cheskuntaam..
భూగర్భజలాలు అడుగంటితే ఫోరోసిస్ సమస్య ఎక్కువ అవుతుంది. దానికి ఆంధ్రోల్లే కదా కారణం
మోకాళ్ళకు , బోడిగుండు కి భలే ముడి.
110 మంది తెలంగాణా M.L.A లు అందరు గత 50 సం|| చేతకాని దద్దమలని చెవిలో పూలు పెట్టకండి. అసలు M.L.A స్థాయికి ఎవడైన వచ్చాడంటేనే అర్థమవుతుంది అతడి capacity ఎంటో?
నాయకులు అందరూ దొందూ దొందే! తనకి కావలసింది అడగడం చేతకాని ణాయకుడు వున్నాడంటే ఎవరూ నమ్మరు. ఇక పొతే ప్రజలకి ఎంకావాలో పట్టని నాయకులు కోకొల్లలు.
అందులో తెలంగాణా నాయకులు ముందు వరసలో వుంటారు. మరలా అటువంటి నాయకులు రేపిన తీట వుద్యమమే ఈ తెలంగాణా వుద్యమం.
Ramesh :-)) You Rock ..Typical
flourosis okka nalgonda lone ledu its also in anantapur dist. kakapote akkada konchem ekkuva kavachu.. ikkada kallu chetulu.. paniki rakunda potunna vallu velallo unaru…
ఎవరు ఏఉద్యమం చేసిన అది వారి బాగు కోసమే. ప్రజల కోసం ఎవరూ చేయరు.రాజకీయ నాయకులకి రాజకీయం ముఖ్యం. అది లగడపాటి ఐనా, కె.సి.ఆర్ ఐనా. కె.సి.ఆర్ కేంద్రంలో మంత్రిగా వున్నప్పుడు తెలంగాణ కోసం ఏమి చేసాడు. దాని అభివృద్ది కోసం ఏమైనా ఫ్యాక్టరీలు తెచ్చాడా లేదే, ఆయన మాత్రం అభివృద్ది చెందాడు. అప్పుడు చేయలేని వాడు ఇప్పుడు చేస్తానంటున్నాడు.ఎలా నమ్మడం. ప్రత్యేక రాష్ట్రం కోసం కాకుండ అభివృద్ది కావాలని ఎవరు ముందుకు రారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంత మాత్రాన అభివృద్ది జరిగిపోతుందా. అలా ఐతే ప్రతీ జిల్లా ఒక ప్రత్యేక రాష్ట్రం అవ్వాలి. ఇక దీనికి అంతూ పొంతూ వుండదు. ఒకటి మాత్రం నిజం హైదరాబాద్ అందరిది. అంతేగాని మరే రకమైన ప్రాంతీయ భేదం మన మధ్య అనవసరం. ఎవరు ఎప్పుడు ఎక్కడకైనా వెళ్ళి రావచ్చు. వెంకన్న బాబుని చూడాలంటే తిరుపతి వెడతాను అంటానుగాని రాయలసీమ వెడతాను అని అనను. జోగుళాంబను చూడాలంటే అలంపురం వెడతాను అంటానుగాని తెలంగాణ వెడతాను అని అనను. శివుడ్ని చూడాలంటే ద్రాక్షారామం వెడతాను అంటానుగాని కోస్తా వెడతాను అని అనను. “తెలుగు మట్లాడతాము కాబట్టి మనమంతా తెలుగు వారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతున్నాము కాబట్టి మనమంతా ఆంధ్రులం”. ఇది తెలుసుకుంటే చాలు.
మీరు అందిస్తున్న ఈ సిరీస్ చాలా బాగుందండి. కొంత మంది వేర్పాటు వాదులని అయినా ఇది అలోచింప చేస్తుంది అనుకుందాం.
ఇక తెలంగాణాలో “ఉద్యమం” ఎలా ఉందో, నాకెదురైన తమాషా సంఘటన చెప్తాను.
ఈ మధ్య తెలంగాణా ప్రాంతంలో, ఒక సినిమా (వీర్) కి వెళ్లాను.99% విద్యార్థులే !
ఒక గ్రూపు విద్యార్థులు సినిమా ఆరంభంలో, ” జై తెలంగాణా” అంటూ రెండు సార్లు అరిచారు. మిగితా గ్రూపుల్లో విద్యార్థులు రెండు సార్లూ, స్వరం కలిపారు.మూడో సారి మళ్ళీ, ఉత్సాహంగా మొదటి వారు “నినదించారు”.ఈ సారి రెస్పాన్స్ లేదు. ఏమిటీ గోల అన్నట్టు మిన్నకున్నారు ! 🙂 🙂 ఇది విద్యార్ధి ఉద్యమం అనటం ఎంత వరకు సమంజసం ?
విభజన చేసి బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎలా పాలించారు అన్నది సినిమా కాన్సెప్ట్. అలాంటి దేశభక్తి డవిలాగులు వచ్చే సమయంలో, హాస్యాస్పదంగా, ” జై తెలంగాణా” అంటూ అరుస్తున్నారు ఆ గ్రూపు వారు. పట్టు వదలకుండా సినిమా మొత్తమూ, మధ్య మధ్యలో నినాదాలు మర్చిపోలేదు ! ఆర్యా , అదీ సంగతి !
well, recent ga nenu bus lo ekkanu. bus lo unnodevadiko stop ekkado telido lekapote valla illu stop ki stop ki undo mari. bus apamante konchem mundundi babu stop akkada aputam annadu. jai telangana ani arichadu so-called “babu”. evaro anunte okay. kani a babu evado kaadu sakshattu arts college student!!!
ఒక విషయం మీద వివరణ ఇస్తే మరొకటి, దానికి వివరణ ఇస్తే ఇంకొకటి. అంతా చేస్తే, చివరికి మా సంస్కృతి వేరు అనే జపం. వేర్పాటువాదుల తీరు ఇది. మీరన్నట్లు సమస్యలు పరిష్కారమవడం కాదు కావలసింది. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఊళ్ళు పంచుకోవడం మాత్రమే ఇప్పుడు వాళ్ళకు కావలసింది.
మనం వివరణ ఇచ్చేకొద్దీ వేర్పాటువాదులు పిచ్చి పాయింటులు లాగుతూనే ఉంటారు. కానీ కనీసం కొందరైనా ఈ సిరీస్ ని చూసి మారుతారని ఆశిస్తున్నాను. ఒక మాట మాత్రం నిజం. నాకు తెలిసి, కాస్తో కూస్తో చదువూ, విజ్ఞతా ఉన్న ప్రతీ తెలంగాణా వాస్తవ్యుడూ రాష్ట్ర విభజనని సమర్ధించడమే లేదు. ఇలా మనలో మనం పోట్లాడుకోని ఇతర భారతీయుల మధ్య నవ్వుల పాలు అవుతున్నామని, ఈ గొడవ వల్ల హైదరాబాదు మహా నగర పరువు పోయిందనీ బాధ పడుతున్నారు. ఎటూ కాకుండా దీన్ని పెంచి పోషిస్తోంది స్వార్ధ రాజకీయ నాయకులూ, అనుభవమూ, అవగాహనా లేని కొందరు విద్యార్ధులూను. ఒక్క తెలంగాణా జిల్లాలే కాదు, వెనుకబడ్డ ప్రాంతాలు ఎక్కడ ఉన్నా – సమగ్రం గా అభివృధ్ధి జరగాలి. కేవలం మీతో కలిసి ఉన్నందుకే మేము వెనుకబడ్డాము అని వితండంగా వాదించే వారికి మనం చెప్పేవి ఏవీ తలకి ఎక్కవు. ప్రతీ ఇంట్లో – మామూలు పిల్లలూ. మొండి పిల్లలూ ఉంటారుకదా, అలాటి మొండి పిల్లలకి మనం ఏమి చెప్పినా ఒప్పించలేము. వేర్పాటు వాదంతో ఏమీ సాధించలేమని వారికై వారు తెలుసుకునే రోజు త్వరగా రావాలని ఆశిద్దాం.
(samyam lekapovadam tho telugu lo rayaleka potunnanu.)
Oka blog-padi abaddalu!!
Oka blog udheshyam mana abhiprayalanu velladinchadame ani, nenu mee mundu tapalaku vakhayalu cheyaledu..mee abhiprayalanu gauravinchi..kani velladinche sthayi nunchi ave nijalu ani brahminpachese sthayiki vachai ani anipinchi ide rastunnanu..
Gamanika:meru adiginattu rasina dantlo nijalu leni vatini etti chupatame naa udheshyam kani..shodinchi,parishodhinchi,vadhinchataniki matram kaadu !!!
Oka udhyamam padi abaddalu -1
1.“Andhra vale baago” ani annadi ikkada vyaparam perutho bhumalani akraminchukoni,government sahayam tho tagguva daralaki koni, labharjana dheyanga annam pette raitulanu adukkune sthayiki tesukuvachina vallanu( e vishayam kcr kuda cheppadu..meru miss ayyaru)..asalu mottam Andhra vale ani ante kcr bataggalgutada..telangana valle kcr bhago antaru appudu.eroju telangana ammaini Andhra intiko..andhra ammaini telangana intiko ichukunnamu.. bandhuvalani vellagodithe urukontara evaraina?? Janalaki vyatirekhanga pravartinchi evaraina nayakuluga migalagalara??aa vakhyalanu ala artham chesukunte baagundedi..ika “nalukalu kostham” annadi Hyderabad vishayam lo mohanbabu chesina matha vidveshalu rechagotte sthyalo unna pichi prelapanalaku samadhaname ainapattiki ala matladdam garhaneyam ani telangana prajalaku kuda telsu..rajadhani nundi muppai lakshala mandi Andhra vallani paradrolutam ani annadi evaro nenu aithe ekkada vinaledu..ade evaru e sandharbham lo annaro chebithe meku kruthagnudini..danipai appudu nenu vakhyanisthe sari ani naa alochana..sankranthi ki vellina vallanu raniyyam ane vakhyam kanipinchina meku, telangana raagane dussehra ku ade andhraki vellina vallanu ghanamga swagatam palukutam ani, ade vidhyarthi nayakudu ade vidyarthi garjana lo cheppadam meru gamaninchaledu anukovala??enchukunna paddati tappamo…valla uddhesham matram manushula meeda dwesham kaadu annadi suspashtam.. telangana pai abhimanam matrame ani pai vakhyalu cheppatleda??
Ayya talibanlu ani mee che pilavabadutunna vidhyarthulu nijanga talibanlu aithe ila ahwanistamu ani matladutarani nenu puttina deggara nunchi eruganu..antha manchi Talibanlu ekkada untaro chebithe santosham..andhrollu ani ekkada vadina adi paina cheppabadina vidham gaane kani mare uddhesham kaadu annadi suspashtam..
2.Ika meru tapa tapa vadulutunna banallanti taphalloni meru perkonabadina modati abbadddam vishayanaki vasthe..telangana jillalu venakabaddayi ani udhyamam lo cheppadam entha nijamo..vere pranthalaloni jillalatho polchukoni chebutunnaru annadi anthe abaddam..kani venkabatutaname udhyamaniki mulam kaadu annadi gurtu pettukovali…aa venukabatutananiki karanamaina vivaksha udhyamaniki mula karanam..aa vivaksha edo tapa rasinattu unnaru..aa vishayam akkade charchistanu..ide ikkada vadilipetti migata vishayaniki vastanu..meru venakabatu tannani a vidhanga kolichiraro cheppane ledu suma..mari daniki prathibandika emiti??raitulaku chendina vela ekaralanu takkuva daragalaku tesukoni,ave velam vesi.. laskhala kotlu(intha dara palkina deggara abhivruddi leda ani adagakandi..real estate danda vidhanam emito meku telusu ane ankuntunnanu..hyderabad deggare undi kabatti palikina darale ave) projectlaku pettadaniki paniki vachina ranga reddy bhumulu oka government degree college pettadaniki panikiraka povadam vallena abhivruddi chendina jilla ani cheppabadindi..chaduvu vishayam lo abhivruddi chendakunte asalu aa prantham abhivruddi chendinattena??unna ekaika pedda industry nizam sugar factory ni ammakaniki pettadamena nizambad chesukunna abhivruddi??sirisilla athmahatyalani pattinchukoni telugu prajalanu mostunnandi.. ade na karimnagar abhivruddi??bayata deshallo banisaluga magutunna tana biddalni vidipinchadaniki prayatnichani prabhutvalanu bharistunnadi adena abhivruddi?? abhvruddi ki kolamanam cheppakunda categorize cheyatam entha varaku sababu??nenu migata pranthalloni sthithigatulanu chudaledu kabatti vati gurinchi matlade hakku naku ledu ani ankuntunnanu..
3.telangana prantham lo kuppakuyatam antu pedda vyakhyale chesaru..charitra naku chala telsu ani mee nunchi chala sarlu vinna maata..mari six point formula valla mana rashtram edu zones ga vidagottaru ani..andulo Hyderabad,secunderabad oka zone ani..mottam teluguvari saulabhyam kosam ala chesaru ani..meku cheppanavasaram ledu ankunta kada..mari akkada jarigina abhivruddi ni telangana ki aapadinchadam entha varaku samanjasam??hyderabad ki vachina project lanu erpatu cheyadaniki ,Danni chuttapakkala unna 4 jillala loni konni pranthalanu kalpukoni greater Hyderabad ga erpadi akkada jarigina abhivruddi mottam telangana abhivrudda??jarugutunnadi Hyderabad abhivruddi..chestunnadi telugu vallu..kadanaleni nijam..ikkada poratam migata telangana jillalu unna telangana zone yokka abhivruddi kosam kani, hyderabad okka abhivruddi chusi pastulundamanatam entha varaku sababu??
4.varu Hyderabad 1956 munupu chala abhivruddi chendi na prantham ani cheppataniki kolabadda nijam kaadu..nizam tatalu kuda kaadu..appati telangana prantha GDP Belgium GDP ki samanam ani telsu kabatti ala matladaru..appati Andhra tho polchukunte, nizam chera nunchi vimukti pondina telangana per capita income ekkuva ani telsu kabatti(source:SRC report).anthe tappithe ashta kashtalu petti adapaduchulanu nagnam ga batukamma adinchina nizam sampada chusi kadu andi..nizam ni chusi pongi poye sthithiki telangana eppatiki cherukodu!!
5.andhra lo vidipothamani udhyamalu jaragaleda??mari jai Andhra udhyamam bhutakamena??telangana ki edo dakkutunnai ani kadupumanta tho chesinavena??leka rajakeya nayakulu tappithe prajalu palgonaleda??(ala aithe kaadu ane nenu chadivina charitra chebutundi mari)
Enti industry lu ,ukku karmagaralena abhivruddi ki suchika??ide aithe prapancham mottam industry la tho nindipoyedemo kada..naku telsinantha varaku abhivruddi ki suchika vidya sadupayalu,vyasaya abhivruddi..sare telangana abhivruddi ani meru antunna dani gurinchi, naku telsinavi..nenu chadivinavi konni mee kosam..(vetiki samadhanam istaru ani ashithu)
1.andhra Pradesh erpadutunappudu 11 lakshalu ga unna tank irrigated area eroju 6 lakshalaku digajaratam e abhivruddi ki suchika??
2.moodu pranthallokalla education lo venakapaddadi telangana prantham.mari ikkada government schools 32 shatham, aided primary schools 6.58 shatham undatam,aa paina unna(pattika lo) rayalseema lo 22 shatham,10.49 shatham ,ade kostha lo 46 shatham,82.93 shatham e abhivurddi ki suchika..ekkadaina chadvulo venakapadda prantham lo prabhutvalu school lu nadapadam chusam kani mari e vyatyasam enduku??
Ika degree college la vishayam lo nu,grant in aid vishayam lo nu,university la vishayam lo nu rama rami ide paristhithi..leka antha kanna darunam..mari ide enduku avutundi ila??abhivruddi meda dhyase levu prabhutvalu ankunte anni pranthalaku sama nyayam ga anyayam cheyali kada??
Warangal,nalgonda nunchi technological university,open university Hyderabad ki taralinchadam jariginadi chala yella kritham(state level universities ni capital city lo pettadam kosam)..mare university of health sciences,Dravidian university,women’s university enduku taralinchabadaledu ade karanam chetha..oka university unte aa prantham lo entha abhivruddi jarugutundo university lo chadutunna naku telsu kabatte e vishayalanu cheppadam jarigindi..vatini taralinchamani kaadu..vetini enduku taralincharani??
(Source : 1. Bureau of Economics & Statistics, A.P.
2. Directorate of School Education, A.P.)
3.telangana lo kuppala teppala industries vachi padutunnai ani annaru..ade Hyderabad lo matrame annadi gurtupettukovalsina vishayam..mari Azamjahi Mills (Warangal), Sir Silk Factory
(Sirpur), Antargaon Spinning Mills (Adilabad) muthapadda industries..ive e abhivruddi ki suchika??
Panendu milk chilling plants ni museveyabaddai(telangana regional committee che erpatu cheyabaddavi)..idena abhivruddi??coal belt lo unna ramagundam fertilizer factory nanyamaina boggu ledu ani musiveyabadatam(aa boggu ekkada tarulutundo cheppanavasaram ledemo) abhivrudda??
Meru cheppina Hyderabad abhivruddi lo 95 shatham jobs Andhra vallave annadi telangana vallu labha padatam ledu Hyderabad lo jarugutunna abhivruddi tho ani cheppe prayathnam matrame..evarapai dwesham tho kaadu..undadu(naku Andhra tho chala anubandhame unnadi mari)migata vallatho poti padalante kavalsindi educational infrastructure ani vere cheppalsina avasaram ledemo kada..
4. inka udyogalu,arthika vibhagalu,budget allocations,revenue cheppukuntu pothe okati rendu kadu..
Ainaa meru mari too much..raasthe ramayanam antha kavyam ayye telangana udhyama charitrani oka blog lo 10 tapallo ela abaddam ani cheppeddam anukunnaru??
telangana udhyamam appatikaina, ippatikaina ,eppatikaina prabhutvala meda,rajakeeya nayakula meda,vetini,vallanu nirdeshistunna pettubadi darula meda kani oka prantham vari paina kadu..a prantham ainaa telugu vallame ane spruha telangana lo nu unnadi ani telsukunte kruthagnudini!!!
(sashesham)
Deniki mee nundi samadhanam vachina taruvate migata tapalaku naa vyakhyalu 🙂
Telangana vasthe ikkadi samasyalanu ela pariskrinchalo,telangana ravatame deniki migilina ekaika pariskaram elano kuda vivarinchagalanu!!!
chaitanya
చైతన్య గారూ,
అబ్రకదబ్ర గారినుంచీ మీరు సమాధానం ఆశించినా, నాకు తెలిసిన సమాధానాన్ని నేనూ చెబుతున్నాను. వేర్పాటు వాదాన్ని సమర్ధించడానికి కుటిల రాజకీయ నాయకులు చెబుతున్న అబధ్ధాలని ఇక్కడ ఎత్తి చూపుతున్నారు తప్పిస్తే, ఏ ప్రాంతమైనా అభివృధ్ధి చెందకూడదనీ, లేక ఎవ్వరూ బాగు పడకూడదనీ కాదండీ. మీరు నిజంగా ఆంధ్రావాలే భాగో అన్న మాటని వినలేదా? అస్సలు ఆ మాట ఎంత బాధ పెడుతుందో తెలుసా? ఆ మాటని తమ లాభానికి భూములు అమ్ముకున్న వారిని అన్నారని అంటున్నారే? హైదరాబాదులో కబ్జా చేసిన వారిలో అస్సలు తెలంగాణా వారే లేరా? స్థిరాస్థి ధరలు ఆకాశాన్ని అంటినందువల్ల ఇక్కడ స్థానికులు కోట్ల రూపాయలకి భూములు అమ్ముకోలేదా? వ్యాపారం అనేది ఎవ్వరైనా లాభం ఉంటేనే చేస్తారు – దానికి తెలంగాణా వారు మినహాయింపేమీ కాదే? మరి వారినీ వెళ్ళగొడతారా? ఇక హైదరాబాదు గురించి – అస్సలు ఒక మాట తెలంగాణా వాదులు ఒప్పుకోవడంలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని కావడం వల్లే హైదరాబాదు ఇంతగా అభివృధ్ధి చెందింది. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనే మాట లేకుంటే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. హైదరాబదు – దాని చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కలిసి అభివృధ్ధి చేసుకుంటే, ఇప్పుడు మాత్రం ఇది మాది, మీరు ఏమీ చెయ్యలేదు అనడం ఎంతవరకు సబబు? హైదరాబాదులో ఉన్న చాలా పరిశ్రమలు, ప్రాజెక్టులూ అన్నీ ఉమ్మడి రాష్ట్ర సొత్తు. అంతేగానీ, హైదరాబాదు తెలంగాణా కి మాత్రమే చెందిన ప్రాంతం ఏ మాత్రమూ కాదు. తెలంగాణా అభివృధ్ధి విషయానికి వస్తే, హైదరాబాదుని మినహాయించమంటారు ; మరి తెలంగాణా రాష్త్రానికి మాత్రం హైదరాబాదు ఇచ్చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే ఉన్న రాజధానిని ఎవ్వరూ ఇచ్చేయలేదు ఇప్పటివరకూ – కానీ తెలంగాణా కి మాత్రం అలా అప్పణంగా అందరూ కలిసి అభివృధ్ధి చేసుకున్న హైదరాబాదుని ఇచ్చేయ్యాలని అడగటం ఎంతవరకూ సమంజసమో అలోచించండి. అన్ని రకాల వివక్షలూ మీ మీద చూపుతున్నారని రాస్తున్నారు – అదే నిజమైతే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఒక రాష్ట్రంగా ఉండగలిగేవారమా? రెండు నెల్ల నుంచీ భావోద్వేగాలను రెచ్చగొట్టేలాగా కొందరు మాట్లాడిటేనే ఇప్పటి ఉద్యమ కారులకు ఈ వివక్ష విషయమూ, అన్యాయాల విషయమూ గుర్తుకు వచ్చాయా? తెలంగాణా జిల్లాలకంటే మన రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అనంతపురం రాష్ట్రం మొత్తానికే వెనుకబడ్డ జిల్లా. మరి దీనికి ఆ జిల్లా వారు అభివృధ్ధి హైదరాబాదుకే పరిమితం అవుతోందీని తెలంగాణా వారిని నిందిస్తున్నారా ? నిజానికి హైదరాబాదు లో పుట్టి పెరిగిన మాలాటి వారం మేము తెలంగాణా వారిమే అని సగర్వంగా చెప్పుకుంటాము. నాలాటి వారు చాలామంది “హైదరాబాదు నాది” అంటారు – మరి వారి నాలుకలు కూడా తెగ కోస్తాడా ఆ కేసీయార్? హైదరాబాదు మాది అని తెలుగు వారు అందరూ అన్నారు, అంటున్నారు, అంటారు కూడా. దాన్ని కేవలం తెలంగాణా ఆస్తిగా పరిగణిస్తే రాష్ట్రానికి చెందిన వారు ఎవ్వరికైనా బాధ కలగడం సహజం. కేవలం వారి స్వార్ధం కోసమే ఈ నాయకులు తెలంగాణా పల్లవి అందుకున్నారు – ఆ విషయాన్ని గుర్తించండి. తెలుగు వారమంతా ఒక్కటిగా ఉండాలని సమైక్య వాదులు మంచిగా చెబుతున్న మాటలని తెలంగాణా వ్యతిరేకతగా అపార్ధం చేసుకోకండి. సమైక్య రాష్త్రం అంటే – అది తెలంగాణాతో కలిపే అని గుర్తు పెట్టుకోండి. మనలో మనకి తగువులు పెట్టి వినోదం చూస్తున్న వారి నోళ్ళు మూయించాలే గానీ వారి శుష్క వాదాలూ, అబధ్ధాలూ విని అమ్మ లాటి ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు చేయాలని ఆలోచించకండి. జై తెలుగు తల్లి ! జై తెలుగు జాతి!
@చైతన్య:
ముందుగా – చాలా కష్టపడి పెద్ద వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. అది చదవటానికి అంతకన్నా కష్టపడాల్సొచ్చింది 🙂
మీ ప్రశ్నల్లో చాలావాటికి ఇంతకు ముందు టపాల్లో వివరంగా సమాధానాలిచ్చేశాను. వెదుక్కుంటే దొరుకుతాయి. మిగిలినవాట్లో కొన్నిటికన్నా రాబోయే నాలుగు టపాల్లో సమాధానాలుంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ రాయను. మళ్లీ మళ్లీ అడగ్గొద్దు. Let’s not go in circles.
ఒకట్రెండు ముక్కలు.
మీరన్నారు:
>> “చరిత్ర నాకు చాలా తెలుసు అని మీ నుంచి చాలా సార్లు విన్న మాట”
నాకంతా తెలుసని నేనేమీ అనుకోను. కానీ ‘చరిత్ర చదువుకో’ అని దురుసుగా ఉచిత సలహాలిచ్చే వాళ్లకి మాత్రం నా సమాధానం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు నా నుండి ఆ మాట విన్న ప్రతి సందర్భంలోనూ నాకా తరహా సలహా ఇచ్చినోళ్లు ఉండుంటారు, మళ్లీ వెళ్లి చూడండి. నాది పొగరని మీరనుకుంటే no problimo. That’s what I am.
కేసీయారు దొరవారు ‘అంధ్రావాలే భాగో’ అన్నది కొందరినే, అందర్నీ కాదు అని మీరు అర్ధం చేసుకున్నారు, మమ్మల్నీ చేసుకోమంటున్నారు. ఆనందం. కానీ, నేనీ టపాలు రాస్తుంది అందరు తెలంగాణవారిని ఉద్దేశించి కాదని మాత్రం అర్ధం చేసుకోలేకపోయారు. ఆశ్చర్యం! ప్రత్యేక రాష్ట్రం పేరుతో రెచ్చగొట్టే వాళ్లని ఉద్దేశించిన ప్రతివాక్యంలోనూ నేను ‘వేర్పాటువాదులు’ లేదా ‘ప్రత్యేకవాదులు’ అన్న మాటే వాడాను తప్ప ‘తెలంగాణవాదులు’ అని కాదు. అది ఈ ఒక్క టపాలోనే కాదు. నేనీ వేర్పాటు గొడవల గురించి రాసిన ఏ టపాలోనైనా మీరు వెదికి చూసుకోవచ్చు. నా దృష్టిలో తెలంగాణవాదం అంటే తెలంగాణ అభివృద్ధిని కోరుకోవటం. అందులో తప్పు లేనే లేదు. నేను ఏకీభవించనిది వేర్పాటువాదంతోనే – దాని వెనకున్న కారణాలు ఎలాంటివైనా. నా దాడి ఆ వాదన చేసేవారి మీదనే. ఆ పేరుతో వాళ్లు చేసే అసత్య ప్రచారమ్మీదనే.
I know you will do like this. that is y i have written about you in my blog. you have edited my comment to make it suitable for making fun of it. Useless fello. Just ni clue dorakadame alasyam.
Edited your comment? What is it?
I’m leaving your comments here to expose what you really are. Ask Telangana Yodhudu, Mahesh Kalal, Veejay and Chaitanya if I edited anything out of their comments.
Dear Ramesh, You wrote,
“Just ni clue dorakadame alasyam.”
——————-
I am writing to you, ramesh:
Manchiga vunte, cheta kaani thanam anukuntaaru.
People like you are the true parasites of Telangana, who have no brains and act only physically. This is why, telangana area politicians keep looting “us” and use people like you for their own selfish gains.
Useless fellows. I have mentioned other points how your andhra parasites are feeding on telangaanaa. Read them. feel great about your cheating policies. design more ways to cheat more people. Once your people asked for separate state from Madras. Then you were separatists. Now you all posing smart. Nautanki fellows. You all will see the result for this instigation. Dandam dasha gunam bhaveth. You remember that?
Dear ramesh,
will you & KCR (other telangana politicians) take oath on GOD and declare here that you will give up your life, if telangana is not developed by politicians, after the state is formed?
If you can take that oath, then, you will see telangana state getting formed. Otherwise, no state is formed at all.
Nee dikku vunna chota cheppuko vacchu.
By the way, I am born and brought up in Telangana and I know much about telangana and people as well.
రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ జనాలందరం పని లేని వెధవలమే అదే మీ భాష లో Useless fellows, మళ్లీ మీరు నొక్కి చెప్పి కష్టపడకండి . అబ్రకదబ్ర గారు మీరు ఇక ఈ టపాలకు కూడా కామెంట్ సెక్షన్ మీద ఒక కన్ను వేయల్సిందేనేమో 😦
ikkada veedoka moorkapu darbar pettaduroi. vaadiki thoduvanthapaade valasavada moorkapu naayaallu kondaru
Nenu telangana lo putti perigina vaadini. Kaani, telangana politicians ethics and ethics of people like you make me decide that telangana should not be given, since if telangana is given, there will be no development, excapt you and KCR and other politicians will loot it again.
I now say to you with utmost humility that you will never see Telangana state getting formed at all in your life time. THIS IS THE DECIDED ONE. Period.
Look for my comments and give answers to my questions in my comments that I wrote in this blog series and take responsibility, then you will see TELANGANA STATE FORMED. Till then, nothing will be done.
KOjjaa naayaallu. Kojja darbar
Ramesh,
stop this nonsense. Don’t even think you can fool me with fake names. There are other things that give your identity away. There’s no anonymity on the internet, no matter how hard you try. You can’t write whatever you want and get away with it. Try it again if you’re ready to face the consequences.
Dear Jaitelangana,
Will you take responsibility and give up your life if telanaga is not developed by KCR or whoever becomes power holder once the state is formed?
If you can be that sincere about your motherland and its development, then you can see telangana in your life, but otherwise, no TELANGANA.
DONOT BLAME OTHERS FOR THE MISTAKES OF YOUR OWN POLITICIANS.
I can show many TELANGANA politicians who had not worked on the peoples causes, but who had amassed hundreds of crores of properties.
ITS NOT THAT THESE POLITICIANS HAD BEEN SUPPRESSED BY ANDHRA PEOPLE, BUT ITS PURELY THAT THESE POLITICIANS OF TELANGANA NEVER WANTED TELANGANA DEVELOPED. Hence there is no development in telangana.
Go and first ask your politicians first as to what they have done instead of blindly supporting their demand of seperate state.
Donot fall prey to the politicians evil design of seperate state demand, because TELANGANA politicians want to cover up their own selfishness (and failure to serve people) and hence they are bringing seperate state demand to forefront.
By the way, I can give you many examples of Telangana politicians who had hundreds of crores, but not done anything to telangana area.
ఈ తె.వాదుల్లో కొంతమందికి ఒక జబ్బు ఉంది.. చర్చ మామూలుగానే మొదలెడతారు. వాళ్ళ వాదనలో పసలేదన్న సంగతి బయటపెడే కొద్దీ వాళ్ళలో అసహనం పెరిగిపోతూ ఉంటది. ఇక తట్టుకోలేక బూతులకు దిగుతారు. ఎప్పుడైతే వాళ్ళీ స్థాయికి దిగజారుతారో అప్పుడు ఇక వాళ్ళ దగ్గర అబద్ధాలన్నీ అయిపోయాయని అర్థం!
if they resort to foul language, then we should not take them lightly. No mercy for those who do mistakes and then reverse attack those who question them.
Look at what happened to YSR. He used to do all sorts of looting of public property, and when asked, he used to reverse attack. He thought he could get away.
At the end , he died “KUKKA CHAAVU”. I have no mercy for those who have NO RESPONSIBILITY towards common man and his country.
No one can escape the universal laws of GOD.
Those who are asking for seperate state are those who HAVE NO RESPONSIBILITIES AT ALL or doesnot know how to deal the different aspects of life with the management skills. Such people will always be a failure in their life.
its great quality that you keep your composure. way to go 🙂
“ఉద్యమాల మీద పెట్టిన శ్రద్ధలో పదోవంతు పనులు చేసుకోటమ్మీద పెట్టుంటే సగం సమస్యలన్నా తీరుండేవి. కానీ అదికాదు కదా వేర్పాటువాద నాయకులకి కావాల్సింది. సమస్యలు ఎక్కడివక్కడే ఉండాలి. అప్పుడే కదా వాళ్లు మీలాంటివాళ్లని రెచ్చగొట్టగలిగేది.”
ఇది అక్షర సత్యం. విభజనతో నాయకులకు దోచుకోడానికి రాచమార్గం ఏర్పరుస్తున్నామే తప్ప రాష్ట్రాభివృద్ది కోసం కాదు అనే సత్యాన్ని ఆవేశపరులు తెలుసుకునే వరకూ ఈ రావణకాష్టం రగులుతూనే ఉంటుంది rather స్వార్ధ రాజకీయనాయకులు రగిలిస్తూనే ఉంటారు.
To ramesh………….
Sorry for not writing in telugu.
Konni rojulu pothe ee ramesh lanti vaallu maa pilladu chi chhi poyatam ledu daniki ee andra vaalle karanam antaru.Ilanti vallani separate ga oka state create chesi andhulo vunchali appudu kuda pakka raastrala meeda padi yedustuntaru chetakani vallalaga…………..
ఏమిటి సార్ క్రొత్త టపాకాయని మా మీదకి ఎప్పుడు వదులుతున్నారు. ఇక్కడ కళ్ళు కాయలు కాస్తున్నాయి. బ్లాగ్లో ఈ తిట్టుకోవడాలని తీసేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది. సరదాగా అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవాలిగాని ఏమిటి ఈ గోల. అలా అతి చేసేవాళ్ళని కట్ చేయండి.సదా మీ బ్లాగ్ కోసం ఎదురుచూస్తూ…..
mr.anil(abrakadabra)
although i like ur blogs and regularly follow them its very difficult to digest some of the comments which leave sour taste( comments) after a good treate(the blog)
can you do any thing to avoid these mindless stpids who use very foul and unparliamentary language?
and in previous blog i asked you to tone down the aggression towards seperatists but im wrong. no problem with good thinking seperatists who have a lending ear for good advice but for extremists we must retard back.
@కృష్ణ:
నా బ్లాగ్‌లో ఇటువంటి కామెంట్లు ఇదే మొదటిసారి. నేనెంచుకున్న అంశం సున్నితమైనది. అయినా చాలామంది ప్రత్యేక తెలంగాణ కోరుకునేవారు అసహనానికి లోనుకాకుండానే తమ అభిప్రాయాలు వెల్లడించారు. పిచ్చి వ్యాఖ్యలు చేస్సిన వ్యక్తి ఒకరే. అతని అభిప్రాయం, అదెలాంటిదైనా వెల్లడించనీయాలి కాబట్టే వాటిని ప్రచురించాను. అతను ఇకనుండీ పద్ధతిగా వ్యవహరిస్తాడనే ఆశిస్తున్నాను.
nenu rasina daniki meru reply istaru ani ashinchi 4 rojuluga chustunna mee blog lo replies..ivvatledu mari??
ఇచ్చాను కదండీ. మీ వ్యాఖ్య కిందే ఉంది నా రిప్లై. చూసినట్లు లేరు 🙂
@ abrakadabra
yeah..ghataina comments madyalo me reply chudaledu..mottanki kashtapettanu annamata :D(chaduvu ane constraint valla telugu lo marpidi cheyalekapotunnanu 😦 ) dhanyavadalu meru chadivinanduku :)..charitra telsu ane vakhyam pogaru tho chesindi ani naa artham kaadu..meku telsu kada ane cheppadaniki..naa baada antha meru etti chuputunna amshala paine..ave asalu telangana udhyamaniki pramukyatha leni amshalu ani naa bhavana..
@virajaji..
mana zonal vyavastha ni parishilisthe enduku hyderabad abhivruddi telangana abhivruddi kaado artham avutundi ani naa manavi..andhra vale bhago ani vinaledu analedu kada..adi evarini annaro cheppanu!!!meru annadi nijame evari svartham vallade..naa udhesham andhra vaale bhago anna vakhyaku samrthana kaadu..ade mottam andhra vallani ani cheyabadina pracharaniki khandana…naku kavalsindi vivakhaleni,abhivruddi chendina telangana..ade prathyeka rashtram lo ainaa..andhra pradesh lo ainaa..(samaikya ane padam nenu upayoginchanu..rashtralu verainaa..telugu varu eppudu samaikhyame ga mari)
nd nenu jai telugu talli antanu.. adi naa matru baasha kabatti..
nenu jai andhra pradesh antanu.. adi na rashtram kabatti..
nenu jai telangana ani kuda antanu..ikkadi prajala kashtalanu chusi chalinchina vadiga!!!jai telangana ane prathi vadu meru perkona badinattu verpaatuvadi kadu ani telusukuntaru ani ashistu..
dhanyavadalu
chaitanya
You said there are 19 districts which high floride(> 1.5mg/l). But floride levels are much higher at Nalgonda. See
http://nalgonda.org/fluorosis/flouridelevels.htm
or http://nalgonda.org/fluorosis/bbc.htm
Thats the reason for higer disability in Nalgonda. You are trying to discredit the actual problem of Nalgonda by trying to compare other areas. Do you have stats for floride levels in other districts?
>> “You said there are 19 districts which high floride(> 1.5mg/l)”
I didn’t say that. Govt of India said that. I gave a reference in the post.
>> ” But floride levels are much higher at Nalgonda”
I never said the opposite.
>> “You are trying to discredit the actual problem of Nalgonda by trying to compare other areas”
I didn’t do that either. I only said, Prakasam also has severe fluorosis. My point is – Nalgonda fluorosis is being used as a bait by the T politicians.
>> “Do you have stats for floride levels in other districts?”
Well. Do you?
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుందంటే ఏదో చెప్పొచ్చు. రాముడికి రాముడు ఏమౌతాడంటే ఏం చెబుతాం? 🙂 జబ్బుల వంకతోనూ పబ్బాలు గడుపుకోబూనే గబ్బు రాజకీయాల గురించి వివరిస్తే, అదంతా చదివాక ‘ఇంతకీ నల్గొండలో ఫ్లోరోసిస్ లేదంటారా’ అంటే ఏం చెబ్తాం? ఆ ముక్క నేనన్నదెక్కడ? ప్రకాశంలో కూడా ఫ్లోరోసిస్ తీవ్రంగానే ఉందంటే నల్గొండలో లేనే లేదని కాదు కదా. రాజు గారి పెద్ద భార్య మంచిదని మాత్రమే నేనన్నది. రెండో భార్య చెడ్డదని మీరర్ధం తీస్తున్నారు.
All I am saying there are 160 villages in Nalgonda dist which have floride levels of > 3 mg/L; incuding several villages having floride levels > 10mg/L. I am not sure how serious in floride problem in other districts(how high the floride levels in how many villages). All the villages in all districts should get safe drinking water. Otherwise we, Indians, have to pay big price in long term. Telangana or No Telangana this is serious problem it should be solved asap. I hope you agree to this.
We have trust issues here. No matter what statistics Telangana people give Andhra people are going to say its given by Telangana people with seperate state as agenda. Telangana people saying same thing about Andhra people. Even Telangana people might even say how can we trust statistics prepared by secretariate which has more than 90% Andhra beaurocrats? What is the solution?
Last time we had such discussion in 1969, there was committee to find out how much Telangana funds were transferred to Andhra projects, headed by “Justice Bhargava”.
Here in this editorial, those figures were summarized.
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/feb/12edit3
You can see the Justice Bhargava’s original report. Here it is.
http://books.google.com/books?id=mISVwxcF5asC&ots=knn_jTsLVn&pg=PA175
You can also see the further analysis on Justice Bhargava report India’s most distinguished economist by Ch Hanumant Rao at
http://books.google.co.in/books?id=mUheLSywxYsC&lpg=PA205&ots=kWxoOMnax5&pg=PA205
Hope these documents are nuetral enough for you. I will leave upto you whether there was injustice to Telangana until 1969 or not? Lets see whether we agree up to this point or not?
See think this link (Govt of India web site) to prove that except Hyderabad district, all other Telangana districts(9 out of 10 Telangana districts) are identified as backward districts. 3 out of 4 districts in Rayalaseema, 1 out of 9 districts in Coastal Andhra are identified as backward districts.
http://brgf.gov.in/brgfdistricts.html
http://panchayat.nic.in/viewContentItem.do?View=viewItem&itemid=3417&ptltid=3414