ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 4

నాలుగో అబద్ధం:

మీ ఫలానా వేరు, మా ఫలానా వేరు.

ఇదీ నిజం:

రాజకీయం అంటే జనవాదం అనేది పాచిపట్టిన పాత మాట. అరవైల్లోనే అది భజనవాదంగా మారిపోయింది, తొంభైల్లోకొచ్చేసరికి విభజనవాదంగా పరిణమించింది. స్వకార్యాలు చక్కబెట్టుకోటానికి ఉన్న సమస్యలు ఎక్కువ చేసి చూపటం, లేని సమస్యలు సృష్టించటం, తద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టటం, ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టటం నేటి తరం నాయకగణం గుణం. అలా రెచ్చగొట్టే కళలో ఆరితేరిపోయినవాళ్లీ తెలంగాణ వేర్పాటువాద ఉద్యమ సారధులు. వీళ్లకీ, వీళ్ల అనుయాయులకీ ఓ ఉమ్మడి లక్షణం ఉంది. తమ వేర్పాటు కోరిక్కి వెనకబాటుదనం కారణం అంటూ వాదన మొదలెడతారా, నాలాంటి వాడెవడో వచ్చి ‘ఎక్కడ లేదు వెనకబాటుదనం’ అని ఎదురు ప్రశ్నేస్తే వెంటనే ప్లేటు ఫిరాయించేసి ఆంధ్రావాళ్ల దోపిడీ కారణం అంటారు. అందులో నిజానిజాలేంటో నిగ్గుదేల్చబోతే అక్కడ్నుండి తెలివిగా మరోదాంట్లోకి చర్చని దారి మళ్లిస్తారు. ఓపిగ్గా ఒక్కో ఆరోపణ అంతుచూడటం మొదలు పెడితే ‘అసలిదంతా ఎందుకు .. మీరు వేరు, మేం వేరు ఫో’ అనేస్తారు.

ఏవేవో వేరంటే ఏదోలా అడ్జస్టైపోవచ్చు, కానీ ఏకంగా ‘మీ భాష వేరు, మా భాష వేరు’ అనటం వేర్పాటువాదుల తాజా పైత్యం. దానికి ప్రతిగా వివరణొకటి ఇవ్వాల్సి రావటం విధి వైపరీత్యం. భాషకీ, యాసకీ, మాండలికానికీ తేడా తెలీని పండితపుత్రులు ఈ మధ్య మెళ్లో మేధావులనే బోర్డొకటి తగిలించేసుకుని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసి పారేస్తున్నారు – ‘తెలుగు వేరు, ఆంధ్రం వేరు’ అంటూ! ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణవాసులు మాట్లాడేది తెలుగు, తక్కినోళ్లు మాట్లాడేది ఆంధ్రం అని వీళ్ల విచిత్రాచిత్ర విపరీతవాదం.  ఒకే భాషకి రెండు పేర్లున్నంత మాత్రాన అవి రెండు వేర్వేరు భాషలెలా ఐపోతాయన్న ప్రశ్నడిగినోడు వెర్రివాడని వాళ్ల నమ్మకం. అటువంటి వెర్రి మొర్రి ప్రశ్నలకి  సమాధానంగా చరిత్రకందని అనాది ఘటనల సంగతులేవేవో మేళవించి ఆదితాళంలో సంగతులేసి మరీ పాడగల ఘనాపాటీలు వాళ్లు. ఆ చెవులతో వింటే ఆంగ్లమూ, ఇంగ్లీషూ సైతం వేర్వేరు భాషల్లా వినిపిస్తాయేమో!

అయితే అసలు సమస్య సదరు పండితపుత్రులతో కాదు – వాళ్ల వితండవాదాన్ని ప్రత్యేకవాద ప్రచారానికో పరమాయుధంగా వాడుకునే పోటుగాళ్లతో. సరే, మాటవరసకి తెలంగాణవారిది తెలుగనీ మిగతావాళ్లది ఆంధ్రమనీ ఒప్పేసుకుందాం. అలా చేస్తే – ఎప్పట్లాగానే ఇక్కడా ఓ తిరకాసెదురౌతుంది. తెలంగాణ భాష తెలుగైనప్పుడు తెలుగు తల్లి వారి తల్లి కాకుండా ఎలా పోయింది? ‘తెలంగాణ తల్లి’ అంటూ కొత్త తల్లిని సృష్టించుకునే బదులు తెలుగు తల్లిని లాక్కుని ‘మీరే ఆంధ్ర తల్లిని పుట్టించుకోండి’ అనుండొచ్చుగా? ఎందుకనలేదంటే, ఈయొక్క ‘తెలుగు, ఆంధ్రం వేర్వేరు’ అనే మహత్తర భాషాస్త్రాన్ని రంగంలోకి దించాలనే అవిడియా తెలంగాణ తల్లిని పుట్టించేనాటికీ దొరలకు తట్టలేదు కాబట్టి, అది తాజాగా వెలిగిన బల్బు కాబట్టి.  ఈ మహానుభావులు నిన్నా మొన్నటిదాకా ‘తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి’ అని ఆరున్నొక్క రాగం తీసినోళ్లు. ఇప్పుడు కొత్తగా ‘తెలుగు, ఆంధ్రం వేర్వేరు కనక మా భాష ప్రాతిపదికన మాకో ప్రత్యేక రాష్ట్రం ఉండాల్సిందే’ అనే పాటందుకున్నారు!

దీన్నిబట్టి అర్ధమయ్యేదేంటయ్యా అంటే – తెలుగు, ఆంధ్రం వేర్వేరా ఒకటా అన్నది వీళ్లకనవసరం. ‘తెలుగు భాష మాదైతే తెలుగు తల్లి మాది కాకుండా ఎలా పోతుంది’ అనే పనికిమాలిన లాజిక్కులకి వారి దగ్గర స్థానం లేదు. తమ లక్ష్యాన్ని కొట్టటానికి ఏ రాయి దొరికితే దాన్ని విసరటమే వీళ్లకి ముఖ్యం. ఊరూవాడా పాంప్లెట్లూ, పోస్టర్లూ వేసి మరీ ఈ తరహా ప్రచారం ఊదరగొడితే జరిగేదేంటి? ‘నిజమేనుస్మీ, ఆంధ్రావాళ్లు వేరు తెలంగాణ వాళ్లు వేరు’ అనే భావన జనాల్లో నరనరానా జీర్ణమవటం మొదలవుతుంది. వేర్పాటువాదుల ఎత్తుగడ అదే. ‘వాళ్లు వేరు, మనం వేరు’ అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కలిగించటం, దాని వల్ల వాళ్లలో తలెత్తే అభద్రతాభావాన్ని, పరాయివారిపై మానవసహజంగా కలిగే అపనమ్మకాన్ని తమ పనులు చక్కబెట్టుకోటానికి వాడుకోటం. ఆ వ్యూహం ఫలిస్తుందనేదానికి సూచనే తెలంగాణ ప్రాంతంలో కోస్తాజిల్లాల రిజిస్ట్రేషన్లున్న వాహనాలు ధ్వంసం చెయ్యటం, ఆంధ్రాబ్యాంకు వంటి పేర్లని మార్చటం వగైరా విపరీత చర్యలు. తెలంగాణని వందలేళ్లు దాస్యంలో మగ్గబెట్టిన నిజాముల పేర్లతో హైదరాబాదులో కొలువైన భవనాలూ, సంస్థలూ లెక్కలేనన్ని. ‘ఆంధ్రా’ పేరు మీద దాడులు చేసే మొనగాళ్ల ఆత్మగౌరవ నినాదంలో నిజాయితీ ఉంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ, నిమ్స్, సాలార్‌జంగ్ మ్యూజియం ఇత్యాది పేర్లు మార్చరేం?

సంస్కృతి విషయంలోనూ అదే రకం మోసపూరిత విష ప్రచారం. తెలంగాణ సంస్కృతి వేరు, తతిమ్మా తెలుగువారి సంస్కృతి వేరట. ఇది పూర్తిగా అబద్ధం కాదనుకోండి, అయితే పూర్తిగా నిజమూ కాదు. రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, నాన్-తెలంగాణ సంస్కృతి అంటూ రెండే రకాలున్నట్లు మాట్లాడటం ఆ అబద్ధం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమైన భారతదేశంలో ఈ సంస్కృతి అనబడేది వంద మైళ్లకో విధంగా మారిపోయే పదార్ధం – ఇరుగు పొరుగు సంస్కృతుల్లో తేడాల శాతమెంతనేది వేరే విషయం. ఒక ఊరిలోనే కులానికో కట్టుబాటు, మతానికో కట్టూబొట్టూ. ఒక కులంలోనే కోస్తాలో ఓ రకం ఆచారాలు, సీమలో మరో రకం ఆచారాలు, తెలంగాణలో ఇంకో రకం అలవాట్లు. కోస్తాలోనే ఒక్కో జిల్లాలో ఒక్కో రకం ఆహారపుటలవాట్లు – ఓ జిల్లా వారు స్వీట్లు చూసి లొట్టలేస్తే, ఆ పొరుగు జల్లావారికి పచ్చడి లేనిదే ముద్ద దిగదు. ఒకే జిల్లాలో ఓ ప్రాంతంవాళ్లు గొడ్డు కారాన్నైనా అరాయించుకుంటారు, మరో ప్రాంతంవాళ్లు ఆ ఘాటుకి గుడ్లు తేలేస్తారు. శుభకార్యాల్లో మాంసాహార విందులు నిషిద్ధమైన ప్రాంతాలు కొన్ని, దానికి విరుద్ధమైన ప్రాంతాలింకొన్ని. ఓ ప్రాంతంలో పేరున్న దేవుడు మరో ప్రాంతంలో అనామకుడు. ఒక చోట చేసే పండగలూ, జాతరలూ ఇంకో చోట చెయ్యరు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి చిన్నా పెద్దా తేడాలు లెక్కకందవు. వేషాలు, యాసలు, సంప్రదాయాలు, ఆచారాలు, అన్నం తినే అలవాట్ల ప్రాతిపదికన రాష్ట్రాలేర్పాటు చేస్తూ పోతే దేశాన్ని ఎన్ని వేల రాష్ట్రాలుగా విడగొట్టాలి?

(సశేషం)

34 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 4”


 1. 1 Malakpet Rowdy 7:01 సా. వద్ద జనవరి 11, 2010

  This is a great series of posts! Full of reasoning and logic. I would definitely love to see somebody from the Pro Telangana camp come out with something similar to this. I BET, it will be a great discussion – away from the venom thats being spit at eachother on the blogs.

 2. 2 raman 8:40 సా. వద్ద జనవరి 11, 2010

  your posts are thought provoking, but for staunch, brai washed telagans it is “Chevitodi mundo shankam voodinattu”
  keep it up.

 3. 3 రవి 10:16 సా. వద్ద జనవరి 11, 2010

  ఈ తెలంగాణా ఉద్యమంలో తీవ్రతను, కనీసం 50 శాతం ఆంధ్రప్రదేశ్ సమస్యలపై కేంద్రాన్ని నిగ్గదీయడంలో చూపిస్తే, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. సందేహం లేదు.

  ఈ టపాలన్నీ ముగిసిన తర్వాత, ఈ శ్రేణిని, చదువరి గారి టపాలతో కలిపి, ఓ పీడీఎఫ్ గా మార్చి, జాలంలో పెట్టండి.

 4. 4 వేణూ శ్రీకాంత్ 10:40 సా. వద్ద జనవరి 11, 2010

  మలక్ గారి మాటే నాదీనూ, మీ టపాలు చాలా బాగుంటున్నాయ్. సరైన రీజనింగ్ మరియూ లాజిక్ తో వాదనకు ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇటువంటి ప్రయత్నం మొదలెట్టినందుకు అభినందనలు. నా బ్లాగ్ లో మీ ఈ టపాలకు చదువరి గారి టపాలకు లింక్ ఇస్తాను త్వరలో. అందరూ అలా చేయాలని కూడా కోరుకుంటున్నాను. పీడీయఫ్ వెలువరించాక ఆ లింక్ కూడా ఇవ్వచ్చు.

 5. 5 zulu 11:30 సా. వద్ద జనవరి 11, 2010

  Hi,
  YOU ROCKS MAN. I AM REQUESTING YOU TO PUBLISH THIS IN ANY DAILY OR WEEKLY ETC. THESE ARE DAMN GOOD REASONS, WHERE WE CAN SHOW THE REALITIES. URGING PEOPLE TO MILEAGE THIS LINK AMONG YOUR BLOGS. I AM WISHING WE WILL BE UNITED FOR EVER AND THE LIKES OF KCR ETC WILL GONE WITH THE WIND AND WILL THERE AMONG THE WORST IN HISTORY.

 6. 7 సత్య 1:33 ఉద. వద్ద జనవరి 12, 2010

  Excellent..Great post..
  న్యూస్ పేపర్లవాళ్ళు ..టివి చానెల్స్ వారు రేటింగ్స్ కోసం ఏదో ఒక మరుగున పడిపోయిన బ్లాగులనుండి సమాచారం సేకరించక ఇలాంటి బ్లాగులనుండి విషయాన్ని సేకరించి మేధవులతో చర్చరు జరపాలి..అప్పుడు నిజాలు నిగ్గు తేలి రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడుతుంది..
  మీనుంచి మరిన్ని మంచి పొస్ట్లులు ఆశిస్తున్నాము..

 7. 8 a2zdreams 4:49 ఉద. వద్ద జనవరి 12, 2010

  తెలంగాన ఉద్యమం వంద అబద్దాలు అయినా ..

  సమైక్యవాదులు ఇప్పుడు చేస్తున్న సమైక్యాంధ్ర నినాదం మాత్రం పెద్ద కామెడీ .. “జై హైదరాబాద్” అంటూ దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లతో పాటు చేతులు కలిపుంటే ఎంతో గౌరవంగా వుండేది ..

  • 9 అబ్రకదబ్ర 1:09 ఉద. వద్ద జనవరి 13, 2010

   @a2z:

   అది కామెడీ అని మీరు తీసిపారేయాల్సిన విషయం కాదు. సమైక్యవాదమే లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడేది కాదు. ఆ రకంగా – ప్రత్యేకవాదంకన్నా ముందు నుండే సమైక్య భావనుంది.
   మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చూడండి.

  • 11 ఏ రాయైతేనేమి 1:10 సా. వద్ద జనవరి 12, 2010

   I kind of agree with the arguments made in that book/site. If a scientific/objective assessment is made, T-separation may loose its ground.

   I am completely dismayed by Prof. JayaSanker’s presentation of the facts. As someone said, exposing partial truth can lead to misconceptions. As I research more on this issue, I loose sympathy for the telangana backwardness. It is not as if, T is the only backward region and the rest of AP is rich-n-wealthy. What pains me is, pointing fingers at others for all the wrong reasons.

   In fact, on many accounts, North-Telangana fares better than North Kosta and Seema and is comparable to South-Kosta. On the other hand, south-T excluding Hyd is as bad as any other backward region in AP. However, 610, Gentlmen’s agreement, water rights, have to be revisited.

   Contrary to claims by T-seps, kosta-seema bore the brunt of the merger due to AP formation,. Nizam telangana (as of 1956) was ridiculously backward then. Often people ignore many geographical aspects that contribute to regional disparities. Even the Naxals were a pain-in-the neck during 1980-90s when they were destroying Govt. establishments, railway stations, communication systems and massacring Police personnel. Even recently, they burnt construction equipment in the Devadula project. Who is stopping the progress in T and who is paying for its backwardness?

   AP formation was a disaster for towns like Vizianagaram, which were once flourishing ( not necessarily in terms of commercial development but under intellectual & cultural settings). As I see it, almost every family that nourished such atmo. is now either settled in Hyd. or elsewhere, but mostly Hyd.

   On the other side, this presented a wonderful opp. for the Ts to come out of the oppressive regime and open-up for a cultural exchange, an equivalent of genetic mutation for survival.

   However, with the T-sep, they are again shutting the doors. I am not undermining their abilities but suggesting that such measures could be counter-productive.

   Coming to Hyd. issue: Growth does not happen in a day and not by few hundred people. Cities develop like ant-colonies. Ants themselves can not build, but collectively they build wonderful structures. Likewise, ordinary working class and middle class form a formidable force and develop into societies. Large support systems depend on them and they in-turn develop as result.

   50+ years of merger has changed the equation so much that separation is no longer an issue concerning just the T-people but it affects entire AP. Rest of T have made emotional and infrastructural investments in AP, often at the cost of their native regional development.

   I hope that the think-tanks of the T-sep. realize this. Btw, T-seps can construct boundaries along seem-kosta border, completely block Krishna-Godavari water rivers and resort to other blackmailing techniques. With right technology and right intentions, seema-kosta people can fend for themselves.

 8. 12 ASHOK 8:59 ఉద. వద్ద జనవరి 12, 2010

  ప్రత్యేక తెలంగాణా అనే వాదం, ఉద్యమం ఉన్నది కాబట్టి అందులు పది అబద్దాలు ఉన్నాయని నువ్వు రాయ గలుగు తున్నావు కాని సమైక్య వాదం అనేదే లేదు కదా ఇంకా అందు లో ఏముంటుంది రాయడానికి , చర్చలు జరపడానికి.

  మనస్సాక్షి లేని ఆంధ్రులు సమైక్యవాదం అని అంటారు. సిగ్గు, శరం, ఆత్మ గౌరవం లేని వాళ్ళు ,చి పో అంటున్న కాళ్ళు పట్టుకుని నిన్నోదల అనే వాళ్ళు ఆంధ్రులు కారు . నిజమైన ఆంధ్రులు నీ టపాలు చూసి సిగ్గు పడుతారు.

 9. 15 sravyav 9:23 ఉద. వద్ద జనవరి 12, 2010

  మీ టపాలు చాలా ఆసక్తికరం గా ఉన్నాయండి !
  చెప్పుకుంటూ పోతే ఇలాంటి చిన్నా పెద్దా తేడాలు లెక్కకందవు. వేషాలు, యాసలు, సంప్రదాయాలు, ఆచారాలు, అన్నం తినే అలవాట్ల ప్రాతిపదికన రాష్ట్రాలేర్పాటు చేస్తూ పోతే దేశాన్ని ఎన్ని వేల రాష్ట్రాలుగా విడగొట్టాలి? >> ఏముంది సింపుల్ కుటుంబానికి ఒకటి 🙂

 10. 16 ram 11:01 ఉద. వద్ద జనవరి 12, 2010

  abrakadabra garu:- pls dont allow that type of comments. they dont want to hear any logical explantion. If u try to explain than they wil respond like this type coments. raman garu cppenittu idhiantha “చెవిటొడి ముందు శంఖం వూదినట్టు”

 11. 17 మంచుపల్లకీ 11:23 ఉద. వద్ద జనవరి 12, 2010

  a2zdreams –
  నాకర్ధం కాలేదు.. సమైక్యవాదం ఎందుకు కామెడీ.. 5 కొట్లమంది కొస్తా,సీమ ప్రజల్లొ ఎంతమందికి హైదరాబాదులొ స్వంత ఆస్తులువున్నయ్.. అందరూ హైదరాబాద్ కొసమె చేస్తున్నరు అనుకొవడం తప్పు.. ఇక్కడ విడిపొవడం , విడిపొకపొవడం ఎలా వున్నా వాళ్ళ వెనకబాటుతనానికి వేరె వాళ్ళని నిదించడం సిగ్గుచేటు.. ఇన్నాళ్ళు తెలంగాణా ప్రాంతం లొ వాళ్ళు అంధవాళ్ళని ప్రజా ప్రతినిదులుగా ఎన్నుకుంటున్నారా.. వాళ్ళే కదా ఎం ఎల్ యే లు.. ఎం పి లు, కేంద్ర మంత్రులు కదా.. కె సి ఆర్ ఎప్పుడు తాగి పడుకొవడమే కానీ ఎనాడయినా తెలంగాణాకి ఎమయినా చేసాడా.. పొరాటాల పురిటిగడ్డ అని చెప్పుకునె వాళ్ళు వాళ్ళ అభివ్రుద్దికొసం ఎనాడయినా పొరాటం చేసారా.. పక్కొడిమీద పడి ఏడవటం పొరాటమా.. హైదారాబద్ ప్రబుత్వాస్తులగురించి అనుకుంటే దానిమీద అందరికీ హక్కుంది ..ఇన్నాళ్ళు నా టాక్స్ డబ్బుతొ కట్టిన ఇంఫ్రాస్ట్రుక్చర్ ఈరొజు ఎవడొ వచ్చినాదంటే నేను ఎందుకు ఊరుకుంటాను.. ( మన తోటి బ్లాగరు ఎవరొ విస్తరి , భొజనం ఉదాహరణ చెప్ప్పరు ..అది చదువండి) .. నేను సమక్యవాదినే.. నాకు హైదరాబాదు లొ ఎమి ఆస్తులు లేవు.. నా అభిప్రాయాన్ని కామెడి అని ఎలా చెబుతున్నారు.

 12. 18 తాడేపల్లి 12:22 సా. వద్ద జనవరి 12, 2010

  సమైక్యవాదం లేదా సమైక్యం ఒక సజీవసత్యం. కళ్ళముందు కనిపిస్తున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకు ఒక సజీవ నిదర్శనం. మన తల్లిదండ్రుల పరస్పర ప్రేమ ఫలితంగా మనం ఈ రోజు అస్తిత్వంలో ఉన్నట్లే మన పూర్వీకుల సమైక్యవాదం ఫలితంగానే ఈ రాష్ట్రం ఒకటి ఇప్పుడు మన ముందు నిలబడి ఉంది. సమైక్యం ఒక వాదం కాదు. కోట్లాదిమంది తెలుగువారి హృదయాల్లో సుస్థిరంగా శాశ్వతంగా ఉన్న భావం. నేను తెలుగువాణ్ణి, తెలుగు మాట్లాడేవాళ్ళంతా నావాళ్ళు అనే భావం. అమెరికా వెళ్ళినా నిన్ను, నన్ను వెంటాడే భావం.

  సమైక్యం ఈనాడు ఒక వాదమూ కాదు, ఉద్యమమూ కాదు. ఆ స్థాయిని అది దాటిపోయి దశాబ్దాలవుతోంది. ఇప్పుడు అది ఒక బృహద్‌వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పేరుతో భారతరాజ్యాంగంలో రిజిస్టర్ అయిన మహావ్యవస్థ. అయితే కొంతమంది తమ స్వార్థం కోసం రియాక్షనరీ ఉద్యమాల్ని లేవనెత్తినప్పుడు సమైక్యాన్ని మళ్ళీ ఉద్యమబాట పట్టించాల్సి వస్తుంది. తప్పేముంది ? ప్రజల అజ్ఞానం మీదా, పచ్చి అబద్ధాల మీదా ఆధారపడి మనుగడ సాగిస్తున్న తెలంగాణ వేర్పాటువాదం కంటే కామెడీ కాదు.

  మనం అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే మన తల్లిదండ్రుల ప్రేమ, దాని ఫలం అంతరించిపోతాయి. అలాగే మనం ఇప్పుడీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే మన పూర్వీకుల సమైక్యవాదం చరిత్రలో మఱుగున పడుతుంది. బహుశా వేర్పాటువాదులక్కావాల్సింది అదే. కానీ తెలుగుజాతి ఉన్నంతకాలమూ దాని నీడలా సమైక్యం కోసం తాపత్రయం కూడా ఉంటూనే ఉంటుంది. ఆ తాపత్రయాన్ని చంపడం ఎవఱి తరమూ కాదు. దాన్ని చంపాలంటే అసలు తెలుగుజాతినే నిర్మూలించాలి.

 13. 19 a2zdreams 1:58 సా. వద్ద జనవరి 12, 2010

  మంచుపల్లకీ,
  అభివృద్ధి చెందిన రాజధాని హైదరాబాద్ వాళ్ళ ప్రాంతంలో వుంది కాబట్టి, ప్రత్యేక తెలంగాన వస్తే వారు రాజులు అయిపోతాం అనే భ్రమలో ప్రస్తుత తెలంగాణ వాదులు పోరాటాలు చేస్తున్నారు.

  దానికి కౌంటర్ గా అభివృద్ధి చెందిన రాజధాని హైదరాబాద్ వదులుకోలేక సమైకాంధ్ర అంటున్నారు తప్ప, సాటి తెలుగు వాళ్ళపై ప్రేమతో అనేదాన్ని నేను నమ్మను. నాకు అందుకే కామెడీ గా కనిపిస్తుంది.

  కలిసున్నా, విడిపోయినా నాకు ఒరిగేది ఏమి లేదు. కలిసుంటే రేపు కె.సి.ఆర్ లాంటొడు మరొకడు తయారవుతాడు. నాకు శాశ్వత పరిష్కారం ముక్కలు చేయడమే అనిపిస్తుంది.

  bottomline, ఈ అంశంపై రాజకీయ నాయకుల డ్రామాలు, ప్ర్రాంతం పేరుతొ రెచ్చగొట్టుడు ప్రసంగాలు ఆగాలి.

 14. 20 Sridhar 4:00 సా. వద్ద జనవరి 12, 2010

  Most of the readers here seem to love the idea of United AP not just for the sake of Hyd or economcis but for the idea of unity of telugus and a common culture and identity. But unfortunately, even after ignoring rogue elements like TRS, the majority Telanganites do not share the same passion in recent years – partly overwhelmed by growth and diversity in Hyd and secondly consumed by anti-andhra rhetoric of TRS. Despite that TRS did badly in elections because most people did not believe that a separate state could actually be realized. But Chidamabaram’s recent announcement has changed everything and shattered the myth that Telangana is unachievable. I personally do not think that most Telanganites would be willing to see reason, truth or logic because for them everything else is secondary. The joy of a tiny separate state and taking possession of the mighty Hyd is all so tempting that it is okay to turn-off wisdom or act deaf to people on other side. And I don’t think govt is in a position to reign in the exploding madness. Hence it is actually wise that the United thinkers focus on laying the ground work for state separation and may be think more in the lines of H.Jogaiah and put an end to the unproductive emotional toil and insanity for once and all. My two cents!

 15. 21 సుజాత 10:00 సా. వద్ద జనవరి 12, 2010

  ఆయనే ఉంటే మంగలెందుకని..ఇంత లాజిక్ అర్థమైతే ఈ గోలంతా ఎందుకు? అందరు మాట్లాడేదీ తెలుగేగా? అనే ప్రశ్న రాగానే తెలుగు ఆధ్రం అని రెండు భాషలు పుట్టించగల సమర్థులు! పెట్టుబడుల సంగతి మాట్లాడితే కొంచెం కూడా లాజిక్ లేకుండా “సాలార్ జంగ్ మ్యూజియం మీ పెట్టుబడా, ఉస్మానియా యూనివర్సిటీ మీ పెట్టుబడా? గాంధీ ఆస్పత్రి మీ పెట్టుబడా? ఏదీ మీ పెట్టుబడి? ఎక్కడా?” అని అడగ గల ధృతరాష్ట్రులు ఈ వేర్పాటు ఉద్యమ నాయకులు!

  ఈ సిరీస్ ని పీడీ ఎఫ్ లో పెట్టడం కాదు, వేర్పాటు ఉద్యమం చల్లారకమునుపే పుస్తకంగా వేయాలి. అందరికీ పంచాలి!

 16. 22 రహంతుల్లా 2:49 ఉద. వద్ద జనవరి 13, 2010

  తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతావరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతుంటే…..గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్కలేనమ్మ న్వర్గానికి ఎలా ఎక్కుతుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ,అత్యాశ పనికి రాదని…..కొందరు తెలుగు పెద్దలే నాకు చెప్పారు. కాని వారికికూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని,ఇంట గెలవాలని,రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రన్తుత పరిస్థితిని చూని ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ.ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను ఆశావాదిని.
  ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
  ”మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు సంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం.బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం.ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి.రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట.దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు.మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు.ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు.ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో,వారి భాష కూడా సులభంగా రాజ్యమేలుతుంది.రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే,ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది.
  ”భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం.తెలుగుమీడియంలో చదివినవారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!—(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకం నుండి.
  ఇప్పటినుంచైనా హైదరాబాదులో రాజధాని పేరుతో పాతుకుపోయిన అభివృధ్ధి కేంద్రాలను రాష్ట్రంలోని ఆరుజోన్లకు మెల్లగా తరలించాలి.తెలుగునాట అన్ని ముఖ్య పట్టణాలలోకి హైదరాబాదుస్థాయి అభివృధ్ధిని వికేంద్రీకరించాలి.

 17. 23 virajaaji 4:45 ఉద. వద్ద జనవరి 13, 2010

  చాలా మంచి మాట చెప్పారు రహంతుల్లా గారు!

  కానీ మన భాషపై మనకే మమకారం లేదు … ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యనే ప్రభుత్వం ఆంగ్లీకరణం చేస్తూ ఉంటే, మాతృభాషలో విద్యాబోధన గురించి ప్రభుత్వం పట్టించుకోవడం సత్య దూరంగా కనిపిస్తోంది. అస్సలు మాతృభాషలో నేర్చుకున్న విషయాలు త్వరగా అర్ధం అవుతాయి, సులభంగా మనసుకి హత్తుకుంటాయి అన్న మాట ఎంత మంది అంగీకరిస్తున్నారు?

  సుజాతగారూ, నిజమండీ. తెలంగాణా ఒక మాండలికమని అనకుండా అస్సలు ఆంధ్ర భాషే కాదు అని మాట్లాడే ఈ శూరులకి నేనూ ఒక సూటి ప్రశ్న వేయదలచుకున్నాను. మా భాష లిపి ని మరి మీరు ఎందుకు వాడుకుంటున్నారు? కొత్త లిపిని కనిపెట్టుకోలేకపోయారా?

  ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర గల మన తెలుగు జాతి ఇలాటి మూర్ఖుల వల్ల ఎలా అయిపోబోతుందో అని బాధ గా ఉంది. వేర్పాటు వాదుల వాదనలో పస లేదని వారికి తెలుసు గనుకనే – ఆఖరికి మీరు వేరు, మేము వేరు అని అనవసరపు వితండ వాదానికి దిగుతున్నారు. అందరూ సమైక్యంగా ఉండాలని ఎక్కువ మంది అభిలషిస్తే – వీరి శుష్క వాదనలు వీగిపోక తప్పదు.

 18. 24 Giridhar 6:28 సా. వద్ద జనవరి 13, 2010

  What nonsense is this?

  http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/13edit4

  మనం పెద్ద మనసు చేసుకొని విడిపోదాం అంటున్నారు. హైదరబాద్ తెలంగాణ జిల్లాల మధ్యలొ ఉంధి కాబ్బట్టి అది తెలంగాణా వారికి ఇచ్చి, తెలంగాణ వారి సహాయం తొ మనకొసం ఒక తెలుగు నగరాన్ని నిర్మించుకోవాలి అట.

  ంఅరి ఇన్ని రొజులు నుంచి హైదరబాదుకు తరలిన సంపద గురుంచి చాల మంచి కామెంట్ చేసరు “అవన్ని ఎవరి స్వార్ధం కొసం వారు చేసుకొన్నవె” నంట.

  మరి దీనికేమి అందురు బ్లాగరులు?

 19. 25 నాగన్న 6:27 ఉద. వద్ద జనవరి 14, 2010

  >నాలుగో అబద్ధం: >>మీ ఫలానా వేరు, మా ఫలానా వేరు.

  కావా? అంత సమగ్రంగా అభివృద్ధి సాగిందా!? అంత సమభావం కొనసాగుతుందా??

  >‘తెలుగు, ఆంధ్రం వేర్వేరు కనక మా భాష ప్రాతిపదికన మాకో ప్రత్యేక రాష్ట్రం ఉండాల్సిందే’ అనే పాటందుకున్నారు!

  అసలు సమస్య ఏమిటి? ఏమిటా ఆవేదన? ఎందుకు పోరాడుతున్నారో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

  ఆ తరువాత ఎన్ని అబద్ధాల గురించి రాసినా అర్ధం ఉంటుంది.

 20. 26 లేఖరి 9:43 ఉద. వద్ద జనవరి 14, 2010

  చాలా విపులంగా నిప్పు లాంటి నిజాలు విశదీకరించి వ్రాస్తున్నారు.తెలంగాణా అతివాదులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మీ ఇంటి ముందు “మహా తెలంగాణా గర్జన” కార్యక్రమం ఏర్పాటు చేస్తారేమో జాగ్రత్త మరి!

  మనం తెలంగాణా ఉద్యమం గూర్చి ఎన్ని వందల నిజాలు రాసినా అవి చెవిటి వాడి ముందు శంఖం ఊదిన దానితో సమానమే.పోయిన వారం మా వాళ్ళకి జరిగిన ఒక చిన్న యదార్థ సంఘటన ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతాను.మా మామయ్య గారి శ్రాద్ధ కర్మలకు బీచ్ పల్లి వెళ్ళి అక్కణ్ణించి అటే గద్వాల వెళ్ళిన మా వాళ్ళకి చాలా చేదు అనుభవం ఒకటి ఎదురయ్యింది.అక్కడ చీరల షాపులో వాళ్ళు మీరు తెలంగాణా నించి వచ్చారా? ఆంధ్ర నించి వచ్చారా? అని చాలా కటువుగా షాపులోకి వెళ్ళిన వాళ్ళందర్నీ అడుగుతున్నార్ట.

  వెళ్ళింది ఆంధ్రా వాళ్ళైతే గద్వాల చీరలు అమ్మరేమో మరి??

  ఈ తెలంగాణా వేర్పాటు వాదం జనాల్లో ఎంతగా వేళ్ళూనుకునిపోయిందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

  ప్రజల్లో అంత లోతుగా ఈ వితండవాదం చొచ్చుకుపోవడానికి టీవీ ఛానల్స్ యధా శక్తి తమ వంతు కృషి చేసాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? ముందు న్యూస్ ఛానల్స్ నిర్దాక్షిణ్యంగా బ్యాన్ చేసి పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వార్తలు చూడాలంటే కేవలం DD News మాత్రమే అదీ ఒక అరగంట సేపు మాత్రమే వార్తలు చూసే ఒకే ఒక ఛానల్ అందుబాటులో ఉంచితే రోజంతా తెల్లవారుఝాము నించి అర్థ రాత్రి వరకూ అవే క్లిప్పింగులు చూసినవే మళ్ళీ చూసి ఈ తలకాయ నొప్పులన్నీ తెచ్చుకుని విద్యార్థులు రెచ్చిపోయి ఆర్టీసీ బస్సులు తగలబెట్టకుండా, కనిపించిన షాపునీ,వాహనాన్నల్లా రాళ్ళతో విధ్వంసం చెయ్యకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సుఖంగా ఉంటారేమో!!

 21. 27 నిజం 3:54 సా. వద్ద జనవరి 14, 2010

  మీ ప్రయత్నం నిజంగా అబిన్దనియం…. ఒక చిన్న ఉదాహరణ ….నేను మాట్లాడినప్పుడు నా బాషని గేలిచేసిన ఆంధ్ర మిత్రులు ఎందఱో……. అసలు తెలంగాణా వారు మాట్లాడేది ఒక బాష నా అని అన్న ఆంధ్ర సహోదరులు ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యమం ప్రారంబించేసరికి అంత ఒకటే. మీరు మేము మాట్లాడే బాష ఒక్కటే అంటే ఇంకా ఎన్ని రోజులు నమ్మమంటారు ఈ కల్లబొల్లి మాటలను…….ఎన్ని సార్లు తెలంగాణా వారిని అవమానిoచలేదు.

 22. 28 krishna 8:29 సా. వద్ద జనవరి 14, 2010

  @ నిజం గారు,
  యాసను గేలి చేయటం అన్ని చోటలా ఉండేదే, కొస్తా లొనె గోదావరోళ్లు బెజవాడ పోయి మాట్లాడితే నవ్వుతారు, అంతెందుకు బెజవాడవాళ్లు క్రిష్ణా జిల్లాలో నే ఉన్న పశ్చిమ ప్రాంతానికి బోయి మాట్లాడితే అక్కడ నవ్వుతారు (అది నా స్వీయానుభవం హైస్కూల్ లో ఉన్నప్పుడు), ఇక నెల్లోర్ వాళ్లను గుంటూర్ వాళ్లు, చిత్తూర్ వాళ్లను పెకాశం వాళ్లు ఇలా యాస వరకు నవ్వటం కామనే. మనం వినని యాస ఒక్కసారి వినటం మొదలెడితే నవ్వురావటం సహజమే కదా. అంతెందుకు మన హైదరాబాద్ వాళ్లు మాట్లాడే ఉర్దూ యాస కలసిన హిందీ ని మాట్లాడించుకొని, మాట్లాడించుకొని ఉత్తరాది న ర్యాగింగ్ లలో నవ్వుకోవటం ఏ BITS, Pilani లాంటి వాటిలో చదివిన వారికి పరిచితమే.

  మా టెక్సాసోళ్లు బోయి, బోస్టన్ లాంటిచోట మాట్లాడుతుంటే సదరన్స్ అంటూ ఎగతాళి చేస్తారు, అంతెందుకు సాక్షాత్తు బుష్ గారి భాషను , యాసను ఎగతాళి చేయని ఒక్క లేట్ నైట్ షో కూడా లేదంటే నమ్మండి, అందుకు టెక్సాస్ వాళ్ళు విడిపోవాల్సిందేనంటారా?

  మీ యాసనయినా, నా యాసనయినా ఎవరయినా హాస్యం చేస్తే వాళ్ల యాసను చక్కగా తిరిగి గేలిచేయక, ఆకారణం గా రాష్ట్రం విడగొట్టాల్సిందేనని typical తెలబాన్ లాగా మాత్రం మీరు అనటంలేదనుకొంటున్నాను 🙂

 23. 29 venkat 12:57 ఉద. వద్ద జనవరి 16, 2010

  paina rasina varandariki
  mee andaru samakyandra antunnaru vidipothe meeku vache nastam ento cheppandi…..idi 60 years nundi jarugutundi
  ikkada telanganalo 3 lakhs jobs vunte andhra lo 9 lakh vennayu naa daggara motham list vundi adi nenu update chsta chudandi..

 24. 30 S Nageswara Rao 1:44 ఉద. వద్ద జనవరి 16, 2010

  Ayya,

  None of is a politician. This is a game for political power. Even if we get Telangana or continued in United A.P, none of us will get any benefit.

  I want to clarify:

  1. The expolitation of yours or any other’s region is done by the politicians and their chamcha goondas, not be ordinary people. Do we believe that there is no Telangana goondas who grabbed the vacant sites. Are there no Telangana Goondas who played with the lives of Telangana people.

  2. FOR THE ARGUMENT SAKE I AGREE THAT ENTIRE COASTAL PEOPLE LOOTED NIZAM. ALL THESE DAYS THERE ARE MANY MLAs MPs AND MINISTERS FROM NAZAM, INCLUDING THOSE WHO ARE CRYING ABOUT THE LOOTING. WHAT THEY HAVE DONE TO SAVE NIZAM REGION FROM THE LOOTING OF COASTAL PEOPLE, WHEN THEY WERE IN POWER. WHY THEY REMEMBER LOOTING ONLY WHEN THEY DON’T HAVE A POWER.

  3. If you worry about the prosperity of Coastal area Business people, why don’t you think about the Punjabis, Marathis, gujaratis, marwadis who are more in number when compared to coastal businessmen. Atleast Coastal business men speak the same language (with sligh variation of accent) you speak, follow same culture which you follow. But the Businessmen from the other states never honour your/our language or culture. Do you find a single north inidan’s shop in Abids, Koti or some wenre else with a PROMINANT TELUGU SIGN BOARD. Yet they are good for you and your Telugu Brother is an enemy or expoiter

  LASTLY I WANT TO CLARIFY. NOTHING WILL HAPPEN IF STATE IS DEVIDED OR CONTINUED UNITED. BECAUSE, EVEN THOUGH WE HAVE 42 MPs FOR A.P, NOT A SINGLE PROJECT IS ACHIEVED, NOR A TRAIN IS OBTAINED. NOT EVEN Highways LIKE NH9 ETC ARE WIDENED. BECAUSE OUR POLITICANS WORRY MORE ABOUT THEIR BUSINESS, BENEFITS ETC. THEY SELDOM THNK ABOUT US.

  May it be KCR or any other Politician from A.P, have you find anyone who fough for our benefits.

  I conlcude, we are always second garade citizens in Indian Republic, we get any thing only after every one had got their watned share. So neither you nor me, never prosper

 25. 31 వేణూశ్రీకాంత్ 3:47 ఉద. వద్ద జనవరి 19, 2010

  అబ్రకదబ్ర గారు ఈ టపాల సిరీస్ కి తెలంగాణ అని ట్యాగ్ తగిలించి మీ వర్గవివక్ష 🙂 లో లింక్ ఇవ్వగలరా. ఇక ముందు వచ్చే టపాలు కూడా ఈ వర్గంలోనే వచ్చేలా ప్రచురించండి. టపా టైటిల్ దగ్గర ఉన్న Tag పై క్లిక్ చేస్తే wordpress టపాలన్నీ చూపిస్తుంది. నేను మీ బ్లాగ్ లో టపాలు మాత్రమే లిస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

 26. 32 manikarnika 7:46 ఉద. వద్ద జనవరి 20, 2010

  Bhashala pratipadikana rastralu erpadite e bharatadesamlo 1652 rastralu undali. telangana ravala vadda annadi vignulaki vadiledam prastutaniki. mana desam 200 years parayi valla palanalo undadaniki kaaranam mana tappe. desamloni antargata kalahala valle mana swatantram poyindi. pitta pitta godava chandana aindi. andhra rayalaseema telangana ani manam kottukuntu unte e taliban vaado danni alusuga teeskloni inkonta allakallolam srustistadu.
  telangana vidipovadam tappo kado naku telidu. kani telangana prantam lo unna non-telangana’s ni vellipomanadam, organizationlu institution la perlu marchadam matram pilla chestale. peru mariste pani aipoyetattu aite inni discussion lu anavasaram.ika vere prantalavallani oka choti nunchi vellipomane hakku evariki ledu. in that case no telangana person must stay outside telangana(even in US).US manadi kadu.
  inka dopidi sangati antara, english vallu cheinata dopidi evaru cheyaledu. okadu manani mati matiki dopidi chestunadu ante adhi mana tappe. dochukuntunadu ani edvadam kante vadiki dopidi chese chance lekunda cheyadam important.
  telangana abivrudhi jaragalante akkadi prajalani educate cheyadam kavali. ante kani prajalani mabhyapetti kadu.

 27. 33 krishna 8:57 సా. వద్ద జనవరి 21, 2010

  అయ్యా!!
  పై టపాలో ఎవరో ఆంధ్రజ్యోతి పత్రిక లో ఓకే యు . అర్ర్ .ల్ ఇచారు. అది నేను చదివా. ..
  ఆ రచయిత ఒక సామజిక కార్య కర్త అంట … నేను పడి పడి నవుతున్న …వాడి తాత పిండాకూడు

  కెసిఆర్ ఒక దేవుదంట.. ఆవేశ పూరిత ప్రసంగాలకు సమిక్యవాదులు రెచ్చిపోలేదంట 🙂
  ఎందుకో నేను చెప్తా నేను చెప్తా మేము ఎప్పుడో కెసిఆర్ ఒక కలూ తాగిన కోతి అని తెలుగు మాట్లాదీ వల్లనదరికి తెలుసు ..
  నిజమైన ఆవేశానికి ఊరికే రేచిపోవటానికి తేడ తెలియని మూర్ఖ సామజిక కార్యకర్తా నువ్వు ఏమి సమాజానికి ఏమి చేసావో చెప్పప్ప.. నీ ఉద్యమ చరిత్ర తెలుసు కొని తరిస్తాం…

 28. 34 manu 5:08 ఉద. వద్ద జనవరి 23, 2010

  vadi bonda padavi poyetapatiki em cheyalo teliyaka edo okati chestunnadu kcr anthe. vadi venta e thoka mahasayulanta zindabad kodataru andaru paramanandayya sishyulu mari.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,834

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: