మూడో అబద్ధం:
రాష్టానికి వచ్చే ఆదాయంలో సగం తెలంగాణ ప్రాంతం నుండే వస్తుండగా, అలా సమకూరిన నిధుల్లో తెలంగాణకి లభించే వాటా అత్యల్పం.
ఇదీ నిజం:
ఈ లెక్కలు ఒక్కో కథలో ఒక్కో రకంగా ఉంటాయి. మొత్తమ్మీద – తెలంగాణ నుండి సమకూరే ఆదాయం 45% నుండి 55% దాకానూ, అందులో తెలంగాణకి లభించే వాటా 20% నుండి 30% దాకా మాత్రమే అనీ కనిపిస్తుంది. శాతాల సంఖ్యలో వాస్తవాలటుంచి ప్రత్యేకవాదుల వాదనే నిజమనుకుంటే ఓ పెద్ద తిరకాసు కనిపిస్తుందందులో. వేర్పాటుకి వాళ్లు చెప్పే ప్రధాన కారణం తెలంగాణ వెనకబాటుదనం. అంత వెనకబడ్డ ప్రాంతం నుండి రాష్ట్ర ఖజానాకి అత్యధిక ఆదాయం సమకూరటం – ఎలా సాధ్యం?
సాధ్యాసాధ్యాలెలా ఉన్నా, ప్రత్యేకవాదుల గడుసుదనానికికిదో తిరుగులేని ఉదాహరణ. ఆదాయం లెక్కలేసేటప్పుడు హైదరాబాదుని తెలంగాణలో భాగంగా భావించటమూ, ఖర్చుల దగ్గరికొచ్చేసరికి హైదరాబాదుని తీసేసి మిగతా తెలంగాణ జిల్లాలని గురించి మాత్రమే మాట్లాడటమూ వీళ్లకలవాటు. వాళ్లు పైన చెప్పిన ‘తెలంగాణ ఆదాయం’లో అత్యధిక శాతం హైదరాబాదు మహానగరం, మరియు దాని పరిధిలోని మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పరిశ్రమలు, వ్యాపారాలు, ఐటీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇత్యాధి రంగాల నుండే వస్తుందన్నది గమనార్హం. ఆయా రంగాల్లో (ఐటీ రంగాన్ని మినహాయిస్తే) కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల యాజమాన్యంలో ఉన్నవే ఎక్కువన్నదీ గమనార్హం. ఉమ్మడి రాజధానిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల పెట్టుబడుల నుండి వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతపు ఆదాయంగా చూపించటమూ, ఆ ఆదాయమంతా మిగతా తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలనటమూ న్యాయమేనా?
ఇప్పుడు వేర్పాటువాదులు ‘తెలంగాణ ఆదాయం’లో అత్యధికం హైదరాబాదు నుండే వస్తుందనన్నా ఒప్పుకోవాలి, లేదా తెలంగాణ వెనకబడలేదనన్నా ఒప్పుకోవాలి. మొదటిది ఒప్పుకుంటే – హైదరాబాదు రెవిన్యూ చెందితే హైదరాబాదు నగరానికి మాత్రమే చెందాలి, లేదా రాష్ట్రం మొత్తానికీ సమానంగా చెందాలి అన్న వాదనొస్తుంది. రెండోది ఒప్పుకుంటే – వేర్పాటుకి ప్రాతిపదికే లేదు. కాబట్టి వాళ్లు చేసే పని .. అసలు నిజాలు దాచి రాజధాని నగరం సమకూర్చే ఆదాయాన్ని తెలంగాణ ఆదాయంగా అబద్ధపు ప్రచారం చెయ్యటం, అందులో సింహభాగం తెలంగాణకి చెందటం లేదని గగ్గోలు పెట్టటం. ఏం తెలివి!
తమాషా ఏంటంటే – తమ సొమ్ము దగ్గరికొచ్చేసరికి ఎవరి సొమ్ము వారిదే అనే ఈ వేర్పాటువాదులు, పక్క ప్రాంతాల సొమ్ము తెలంగాణకి ఉపయోగపడటం గురించి అడిగితే మాత్రం గొంతు పెగల్చరు. దానికో ఉదాహరణ చూద్దాం. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వివిధ తెలంగాణ జిల్లాల్లో సాగుబడిలో ఉన్న భూమి విస్తీర్ణాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ – 7,46,242 ఎకరాలు
కరీంనగర్ – 6,47,402 ఎకరాలు
నల్గొండ – 4,79,328 ఎకరాలు
నిజామాబాద్ – 4,15,869 ఎకరాలు
మహబూబ్నగర్ – 4,02,773 ఎకరాలు
ఖమ్మం – 3,83,005 ఎకరాలు
ఆదిలాబాద్ – 1,84,336 ఎకరాలు
మిగిలిన మూడు తెలంగాణ జిల్లాలు – హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి – ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతాలు కాబట్టి ఇక్కడి వ్యవసాయ భూమి తక్కువ.
మరో పక్క 7,26,090 ఎకరాల సాగుభూమితో కృష్ణా జిల్లా, మరియు 6,78,197 ఎకరాల సాగుభూమితో గుంటూరు జిల్లా రెండూ వరంగల్ కన్నా వెనకబడి ఉన్నాయి! ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో సాగులో ఉన్న ఎకరాలెన్ని, ప్రస్తుతం సాగులో ఉన్నవెన్ని? ఒకప్పుడు ‘రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా’గా పేరొందిన కోస్తా జిల్లాలు ఇప్పుడు వరి సాగుబడిలో తెలంగాణ జిల్లాలకన్నా వెనకబడిపోవటం దేనికి సూచిక?
ఆదాయ వ్యయాల గురించిన చర్చలో సాగుభూమి విస్తీర్ణాల పిడకల వేట ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. యాభై శాతం పైగా బోరు బావుల మీద ఆధారపడి సేద్యం చేసే జిల్లాలు తెలంగాణలో ఎనిమిది ఉండగా, రాయల సీమలో నాలుగు, కోస్తాలో ఒకటి ఉన్నాయి. కోస్తాలో అధిక శాతం సాగుబడి పంట కాలువల కిందే సాగుతుందనీ, ఆ తరహా సేద్యానికి ఏడాదికి ఒక పంట మించి వేసే వెసులుబాటు (ముఖ్యంగా పై రాష్ట్రాలు నీళ్లు బిగబడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో) లేదనీ తెలిసిందే. అదే సమయంలో, బోరు బావుల నీటితో సేద్యం చేసే వారు ఏడాదికి రెండు పంటలు పండించటం కద్దు. దానికయ్యే కరెంటు ఖర్చుని ప్రభుత్వం సబ్సిడీలు, ఉచిత వరాల రూపంలో భరిస్తుంది. దీని లబ్దిదారులు తెలంగాణలోనే అధికంగా ఉండటం గమనించాల్సిన విషయం. మరి ఆ సబ్సిడీ సొమ్ము రాష్ట్ర ప్రజలందరూ కట్టిన పన్నుల ద్వారా సమకూరిందా, లేక ఒక్క తెలంగాణ ఆదాయం నుండే సమకూరిందా? మా సొమ్ము మరెక్కడో ఖర్చు పెట్టటమేంటని కోస్తా/సీమల్లో ఎవరూ పాంప్లెట్లు పంచటం లేదేం?
(సశేషం)
ఇకనుంచి అడ్డగోలు ఆరోపణలు చేసే తెలంగాణా వాదులకు నేను కూడా లింకులివ్వదల్చుకున్నాను. అబ్రకదబ్ర బ్లాగు తాలూకువి!
awesome analysis.
Keep it up
మీ అబద్ధాలు బాగున్నాయి….
తిండి గింజలు లేనోడికి వరిగానీ డబ్బులు పండించేవారికి (వ్యాపారపంటలు పండించేవారికి) నిజంగా వరిసాగు కావాలా?????
ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పొగాకు ఎక్కడ పండిస్తారు?
పత్తి ఎక్కడ పండిస్తారు?
మిర్చి-మిరప ఎక్కడ పండిస్తారు?
చేపల పెంపకం ఎక్కడ ఎక్కువగా జరిగుతుంది?
artham kaledu boss telangana vaste ivanni akkada pandutaya??
మహేష్ గారు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే పైన మీరు పేర్కొన్న పంటలు , పెంపకాలు అక్కడ ఎక్కువగా జరుగుతాయి అంటారా ?
అయితే ఆndhraa రైతులంతా వ్యాపార పంటలే సాగుచేస్తున్నారన్నమాట..మహేశ్ కుమార్ గారూ..
@ Banti:
Good Question…
నాకు తెలిసిన ఒకతను ప్రకాశంజిల్లాలోని తన పొలాలని అమ్ముకొని (సాగు చేసుకొలేక కాదు పండించిన పైరుకి తగిన గిట్టుబాటు రాక)మెదక్ జిల్లలోని సదాశివపేటలో మూడు ఎకరాలు కొనుక్కొని పొద్దుతిరుగుడు సాగు చేసాడు..కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది.ఇది 1994 మాట..2005 లో రియల్ ఎస్టేట్ బూములో కొంత పొలం అమ్ముకొని బాగా స్థిర పడ్డాడు..ఇప్పుడు తెలంగాణా వాదులు అతన్ని భూములు వొదులుకొని వెళ్లిపొవాలి అని ఒత్తిడి చేస్తున్నారట ..ఇది ఏమి న్యాయం..
విచిత్రం ఏమిటంటే ఇతనికి ప్రభుత్వం వారు ఉత్తమరైతు అని ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు ..1994లో ఇతను ప్రకాశం నుండి ఇంకొ పది మందిని తెచ్చి కౌలుకి ఇక్కడ పొలాలు సాగు చేసి మంచి లాభాలు తెచ్చేసరికి ఇక్కడి వారు వారే స్వయం సాగు ఛేసి ఒక సంవత్సరం నష్టాలు తెచ్చుకొని ఆ పొలాలని అలానే వదిలేసారుట..అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అంటే ఇదేనేమో ….
ఇది నిజం..
అబ్రకదబ్ర
అబ్రకదబ్ర
అబ్రకదబ్ర
ఇప్పుడు మీకు పొగాకు పంటలు కనపడవు, మిర్చీ కనపడదు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు కనపడవు. కేవలం వరి సాగు మాత్రం కనపడుతుంది.
అబ్రకదబ్ర
అబ్రకదబ్ర
అబ్రకదబ్ర
ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణా లో నించి మాయమైంది… ఇప్పుడు చూడండి, ఆంధ్రా నది బొడ్డులో కనిపిస్తుంది…
యోధా, యోధా, యోధా
నే రాసిన అసలు విషయం వదిలేసి మాటవరసకి ప్రస్తావించిన కొసరు సంగతి మీదకి అందరి దృష్టీ మళ్లిద్దామనుకుంటున్నావా? 🙂
ఆ పప్పులుడకవు. కింద చదువరి రాసిందీ చదవండి.
నేను కూడా ఇలాంటి గణాంకాలనే ఇస్తే, అప్పుడు కూడా ఇలాంటి చచ్చు వాదనలు ఒకళ్ళిద్దరు చేసారు. వాదనల జోలికి పోవడం ఎందుకులే అని నేను సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వలేదు కాబట్టి అక్కడేదో మనం చెప్పుకోలేనిది ఉందని అనుకుంటున్నట్టున్నారీ మేతావులు. ఒకాయనైతే ఆ ముక్క ఎక్కడో రాసుకున్నాడు కూడా!
మీరు వరి పంట బాగానే పండుతుందని అన్నారనుకోండి అంటే కేవలం వెనకబాటుతనం ఎంతవరకు ఉన్నది అని చర్చించే క్రమంలో ఉదాహరణల కోసం ఇచ్చే గణాంకాలను పట్టుకోని, పత్తి ఎలా పండుతుంది? మిరప ఎలా పండుతుంది? ఆ లెక్కలు చెప్పు అని అడగడం అతి తెలివి మాత్రమే కాదు.., అత్యంత తెలివి! మన స్వయంప్రకటిత మేధావుల కుటిలనీతి ఏ స్థాయిలో ఉందో పై ప్రశ్నలు చెబుతాయి.
ఇక, వాళ్లడిగిన గణాంకాలు ఏం చెబుతాయో చూద్దాం. అవి చెప్పాక, మరి కాసిని పుచ్చు ప్రశ్నల్ని తెచ్చి మన నెత్తిన తెచ్చి పోస్తారెలాగూ! అంచేత నాకు తెలిసిన మరికొన్ని గణాంకాలను కూడా రాస్తున్నాను.
పత్తిపంట గణాంకాలు:
పంట వేసిన విస్తీర్ణం: తెలంగాణ 70.31% కోస్తా+సీమ: 29.69%
పంట దిగుబడి: తెలంగాణ 67.41% కోస్తా+సీమ 32.59%
పసుపు పంట విస్తీర్ణాలివి :
తెలంగాణ 81.66%
కోస్తా+సీమ 18.34%
మిరప పంట విస్తీర్ణాలివి :
తెలంగాణ 52.56%
కోస్తా+సీమ 47.44%
అల్లం పంట విస్తీర్ణాలివి :
తెలంగాణ 95.37%
కోస్తా+సీమ 4.63%
పొగాకు పంట విస్తీర్ణాలివి :
తెలంగాణ % 15.28% 14.94%
కోస్తా+సీమ % 84.72% 85.06%
ఒక్క పొగాకు పంట తప్పించి, మిగతా అన్ని పంటల్లోనూ తెలంగాణాయే గైరుగా ఉంది. మామూలుగా కాదు.. భౌగోళిక విస్తీర్ణం శాతానికి సరిగ్గా వ్యతిరేకంగా!!
భౌగోళిక వైశాల్యాలు ఎలా ఉన్నాయో చూసారా.. సరిగ్గా వ్యతిరేకం: తెలంగాణ: 40%, కోస్తా+సీమ: 60%
ఏం మేతావులూ! ఒప్పుకోబుద్ధి కావడం లేదా!?
మిరప పోగాకుల్లో కాస్త సీమను తీసి లెక్కెయ్యండి.
ఆంధ్రా…రాయలసీమలు ఒకటెప్పుడయ్యాయి. అత్యంత అన్యాయం జరిగింది మాకే…జై రాయలసీమ.
పై గణాంకాలు ఇచ్చే ముందే రాసాను, ఇప్పుడు తెచ్చి పోయనే పోసారు!
నిజాలు ఒప్పుకుంటే వారు తెలగాణ్యులు ఎలా అవుతారు? రాజకీయ నాయకుల అబద్ధాలు నిజమని నమ్మేవారికి మనం ఎన్ని వాత్సవాలు చూపించినా, వినిపించినా – కనలేని, వినలేని – కవి లవుతారు.
నేను తెలంగాణా వాదిని కాదు బహురాష్ట్రవాదిని. నా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలూ ఒక కేంద్ర పాలిత ప్రాంతం అవ్వాలి. తెలంగాణా, రాయలసిమ, ఆంధ్ర, ఉత్త్రరాంధ్ర, హైదరాబాద్.
విభజనవాదులను చాలామందిమి చూసాం. కానీ విచ్ఛిన్నవాదులను మాత్రం ఎక్కడోగానీ చూడం!
మహేష్,
మీ వాదన బాగానే ఉంది కానీ, ఆంధ్రప్రదేశ్ ఐదు ముక్కలైతే మిగిలిన రాష్ట్రాలు ఏవి ఎన్నెన్ని ముక్కలవాలి? దేశం మొత్తంలో ఎన్ని కొత్త రాష్ట్రాలు రావాలి? ఇప్పుడున్న ముప్పై ఐదు (28 + 7) ముక్కల మధ్యే సవాలక్ష అంతర్రాష్ట్ర తన్నులాటలుంటే, వీటికి ఇంకో పాతిక ముక్కలు జతపడితే ఇంకెన్ని కొత్త తగాదాలు పుట్టుకొస్తాయో ఆలోచించారా? కలిసి ఉంటేనే తన్నుకులాడేవాళ్లు విడిపోతే ఇంకెంత ఘోరంగా తన్నుకుంటారో ఊహించలేరా? కుప్పల కొద్దీ ఉన్న చిన్న రాష్ట్రాలు కుండలో పీతల మాదిరిగా ఒకదాన్నొకటి కిందకి లాక్కునే పనిలో మునిగితేలుతుంటాయి. నాయక శిఖామణులకు మాత్రం తమ తమ ప్రజల్ని మభ్య పెట్టటానికి మరిన్ని ఇరుగు పొరుగు భూతాలు దొరుకుతాయి.
అంతేగాక, రాష్ట్రాలు చిన్నవయ్యే కొద్దీ కేంద్రం మరింత బలపడటం తప్ప ఆయా రాష్ట్రాలకు ఒరిగేదేమీ ఉండదు. చిన్న రాష్ట్రాలు ప్రతిదానికీ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది.
వెరసి, విడిపోవటం ఏ సమస్యకీ పరిష్కారం కాదు. అది మరిన్ని కొత్త సమస్యలకి అంటుగట్టే రాచమార్గం. కలిసి ఉండక తప్పని పరిస్థితి కల్పించటం – అదీ అసలైన పరిష్కారం. ‘అదెలా’ అనేది ప్రశ్న. ఎలా విడగొట్టాలి అనే విషయం ఆలోచించటం మానేసి ఎలా కలిసుండాలి అని ఆలోచించటం మొదలెడితే ఆ ప్రశ్నకి సమాధానం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఆ తరహా ఆలోచనెటూ రాజకీయ నాయకత్వం నుండి రాదు. ఆ పని చెయ్యాల్సింది ఆలోచించగలిగే మనలాంటి మామూలు మనుషులే. అందులో భాగంగా మొదట చెయ్యాల్సింది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టటాన్ని వ్యతిరేకించటం, అవాస్తవ ప్రచారాల్ని అడ్డుకోవటం. అదే నేనిప్పుడు చేస్తున్న పని. నా ప్రయత్నంలో లోపాలుంటే ఉండొచ్చు, నా నిజాయితీలో మాత్రం అవి లేవు. అది గుర్తించండి, వీలైతే మీరూ నాకు చేయూతనివ్వండి.
Yes. You are right Mahesh Kumar. We need countless smaller states, where in we fight among ourselves by forgetting the patriotism and by yielding to our mean minded selfishness. This will result in falling India to the external invaders like PAK or China and eventually going under the rule of the PAK or Islamic fundamentalists or Chinese communists and lead a slave like life exactly like the way it happened in the past.
Remember, we had many kingdoms in the past over vast India and those kings(leaders) yielded to selfishness or mean minded ness and fought among themselves, and there by weakening which inturn lead to the rule of Islamic fundamentalists and leading slavery and also under british rule.
If you are truly sincere and hard working and ethical, then you will get yourselves developed under a larger state form or under a smaller state form.
Aren’t we many Indian going out and struggling and making a good life for us outside of India inspite of so many negative forces against us in foreign countries?
Its the lack of sincerety and will among common man and especially lack of true spiritual values that is the root cause of the current state of affairs.
Oh GOD. Please, please, please give some common sense to the people of my mother country.
@చదువరి: నేను బహురాష్ట్రవాదం అంటే మీరు విచ్చిన్నవాదం అంటున్నారు. మాటగాలరడి కాకపోతే మరేమిటి? భారతదేశం పలు చిన్నరాష్ట్రాలుగా ఉండటం “విచ్చిన్నం” ఎలా అవుతుంది!
ఒక చిత్తూరోడిగా, it never made sense to me to have Hyderabad as capital. పరిపాలనా సౌలభ్యం, ప్రజల reach ను దృష్టిలో పెట్టుకుని ఒక sensible reorganization of Indian states జరగాలి. అది దేశాన్ని బలపరుస్తుందేతప్ప విచ్చిన్నం చెయ్యదు.
@అబ్రకబధ్ర: అంతర్రాష్ట్ర సమస్యలేకాదు ప్రతి జిల్లాకూ, ప్రతి గ్రామానికీ, ప్రతి పల్లెకూ, ప్రతి కుటుంబానికీ మధ్య గొడవలుంటాయి. వాటిని ప్రజాస్వామికంగా తీర్చుకోవడానికి మనకు చట్టముంది, విధానం ఉంది. దాన్ని మరిచి యాభై చిన్నరాష్ట్రాలైతే దేశం విచ్చిన్నమైపోతుందనే ప్రతిపాదన ప్రజాస్వామ్యం మీద అస్సలు నమ్మకం లేనోళ్ళు చెయ్యాల్సిన వాదన.
రాష్ట్రాలు కేంద్రానికి సలాం కొట్టే గులాములు కాకుండా ఫెడరల్ వ్యవస్థ కోసం రాష్ట్రాల స్వయంప్రతిపత్తికోసం పోరాడదాం. ఇలా by hate కాకుండా by convenience విడిపొయ్యే మార్గాన్ని ఎంచుకుందాం. ఒక అర్థవంతమైన SRC policy కోసం పాటుపడదాం. Let’s strengthen democracy. Everything will fall in line.
@Sri: మీ వ్యాఖ్యలో అపోహలెక్కువా కామన్ సెన్స్ తక్కువా ఉంది. Grow up boss!
అదే మీ ఉద్దేశ్యం అయితే అనవసరంగా ఈ తెలబాన్ గొడవల్లో తల దూర్చకండి.
మీ బోటి వారి కోసం ఎప్పుడో నా ముక్క వ్రాసి పెట్టాను.
http://te.chavakiran.com/blog/?p=688
చిన్న రాష్ట్రాలు మెరుగనే సిల్లీ ఫెలోస్
Dear Mahesh,
Since you said I am having “apohalu” on smaller states, can you give me a guarantee to me that after the division, smaller states will develop?
Since it is the people who are having no common sense, the development will not happen even after the splitting. Infact, having smaller states in the hands of the politicians will make the job of looting easier for them, since the people who can question them will be less in number and its going to be very easy for these political looters to control smaller crowds.
I doubt if there will be development in smaller states for sure, especially considering that our political and governamaental corruption and the general public ethics are not that great. No matter what you do, unless the publics way of thinking changes, India will be like this even after 100 divisions of different states.
The only groups that will have advantage with smaller states will be Naxalites, Terrorists and anti-social forces.
mahesh garu 23 rashtralaithe inka baaguntundhemo aalochinchandi…..malli mana future generation vaallu kottukokunda ila……
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః
* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్పాత్లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.
బాబ్బాబు! ఈ గణాంకాలు హరీష్రావు కో, దామోదరరెడ్డి కో, రాద్దాంతకర్త గారికో పంపించండి వారికి కొంచం తెలుస్తుంdi
@చదువరి,
“ఏం మేతావులూ! ఒప్పుకోబుద్ధి కావడం లేదా” మంచి ప్రశ్న అడిగారు :). సమాధానం రాకపోగా, కేసులు పెడతారేమో చూసుకోండి. 🙂
ఒకవేళ తెలంగాణా వారి వాదనల్లో నిజముందనుకోండి – వేర్పాటు చేస్తారా? తెలంగాణా అభివృద్ధి చెందలేదని మీరు గుర్తించారనుకోండి – అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోనీయడమేనా? అది కాదు సమస్య. విభేదాలు వున్నా, సమస్యలు వున్నా, అన్యాయాలు వున్నా వుండే పరిష్కరించుకోవాలి – కలిసివుండే పరిష్కరించుకోవాలి. ఇది ఒక్క తెలంగాణా విషయమే కాదు – అన్ని వేర్పాటు ఉద్యమాలకీ – ఆఖరుకి మా కెనడా దేశం నుండి విడిపోదామనుకుంటున్న ‘ఫ్రెంచ్’ క్యుబెక్ రాష్ట్రానికీ ఇది వర్తిస్తుంది. అసలు విడిపోవడమన్న ప్రస్థావనే అసంబద్ధమయినప్పుడు ఎవరికి అన్యాయం జరిగిందనే చర్చ ఇంకా అసంబద్ధం.
చచ్చినట్లు కలిసివుండాల్సిందే. అది అర్ధమయ్యినప్పుడు, వేరే గత్యంతరం లేనప్పుడు అందరూ కూర్చొని సమస్యలు పరిష్కరించుకొనే సహనం, అవసరం దానంతట అదే ఎర్పడుతుంది. తెలంగాణా విషయంలోనూ అదే జరుగబోతోంది.
“ఆంధ్రా…రాయలసీమలు ఒకటెప్పుడయ్యాయి.” – కోస్తా, రాయలసీమ, తెలంగాణ -అన్నీ ఆంధ్రాలో భాగమే! లింకు కావాలా?
అవునూ.., రాయలసీమేదో ఒక్కటిగా ఉన్నట్టు మాట్టాడతారేంటి.. అక్కడ నాలుగు జిల్లాలు, 4000 గ్రామాలూ ఉన్నాయి. ఒక్కో ఊళ్ళో మీ కుటుంబం, నా కుటుంబం లాగా వేలాది కుటుంబాలున్నాయి.
“నేను తెలంగాణా వాదిని కాదు బహురాష్ట్రవాదిని. నా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలూ ఒక కేంద్ర పాలిత ప్రాంతం అవ్వాలి. తెలంగాణా, రాయలసిమ, ఆంధ్ర, ఉత్త్రరాంధ్ర, హైదరాబాద్.”
This seems to be about decentralization. Without strong representative local governments at various levels (from village level onwards), there is this posibility that backward regions may go further backward if power is captured by regional elites.
ఒక జాతిగా, తెలుగువాళ్ళుగా మనం ఉమ్మడిగా పంచుకోదగ్గ విషయాలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మఱుగున పెట్టి కేవలం తేడాల్ని మాత్రమే ఉద్ద్యోతించి చూపిస్తారు వేర్పాటువాద భావాలు గలవారు. నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ని మూడు లేదా నాలుగు ప్రాంతాలుగా చూసే ఈ నవీనాధునిక మూఢత్వం నుంచి మనకి విముక్తి కావాలి. తెలంగాణ అని చెప్పబడుతున్నభూభాగంలోనే కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందిన నాగరిక ప్రాంతాలూ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి అభివృద్ధికి నోచుకోని అనాగరిక ప్రాంతాలూ ఉన్నాయి. కోస్తా పరిస్థితైనా అంతే. అభివృద్ధి చెందిందని భావించే గుంటూరు జిల్లాలో తూర్పుప్రాంతం సిరిసంపదలతో కళకళలాడుతూంటే పశ్చిమప్రాంతం మాత్రం నిరంతర కఱువులతో, నీటి ఎద్దడితో సతమతమవుతోంది. విశాఖపట్నంలో వైజాగ్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో వెలిగిపోతూండగా ఆ జిల్లాలోని తతిమ్మా ప్రాంతాలు దుర్భర పేదఱికంలో అలమటిస్తున్నాయి. ఱేపు ప్రత్యేకరాష్ట్రాలిస్తే మళ్ళీ ఆ ప్రత్యేకాల్లోనే మళ్ళీ ఈ ప్రాతిపదిక మీదనే మఱిన్ని ప్రత్యేకాల్ని కోరేవాళ్లుంటారు. “ఉండరు” అని మీరు బల్లగుద్ది జోస్యం చెప్పలేరు.
తెలంగాణ విషయానికొస్తే తెలంగాణవాళ్ళ అవగాహనాస్థాయి ఇలా అఘోరించడం మన జాతి చేసుకున్న పాపకర్మ.
An article by Jayaprakash Narayan on the economic consequences of separation:
http://www.blonnet.com/2009/12/12/stories/2009121250290800.htm