ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 2

రెండో అబద్ధం:

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి యాభయ్యేళ్ల చరిత్రుంది.

ఇదీ నిజం:

అనగనగా 1985 ప్రాంతంలో హీరో కృష్ణ నటించి నిర్మించిన ‘సింహాసనం’ అనబడే జానపద చిత్రరాజం విడుదలైన రోజులవి. దక్షిణ భారతంలో తొట్టతొలి 70 ఎం.ఎం. సినిమాగా భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా కావటం చేతనూ, కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం కావటం చేతనూ ఆ సినిమా విజయమ్మీద విడుదలకు ముందే అంచనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అప్పట్లో కొత్త సినిమాలు జిల్లా కేంద్రాల్లోనూ, జిల్లాలోని ఒకట్రెండు ప్రముఖ కేంద్రాల్లోనూ మాత్రమే విడుదలయ్యేవి. విడుదలయ్యాక, సినిమా జయాపజయాలనిబట్టి బి, సి కేంద్రాలకు యాభై రోజుల తర్వాతనో, వంద రోజుల తర్వాతనో వచ్చేవి. ఆ ఆనవాయితీకి భిన్నంగా సింహాసనం చాలా బి, సి కేంద్రాల్లో సైతం విడుదలయింది. అలాంటివాటిలో పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ఒకటి.

మాచర్లలో ‘సింహాసనం’ వారం రోజులు ఆడించాక అక్కడినుండి ఎత్తేయబడింది. తిరిగి నలభై తొమ్మిదో రోజునుండి రెండు రోజులు వరసగా ప్రదర్శించబడి మళ్లీ ఎత్తేయబడింది. ఆ తర్వాత నూరవ రోజున మొక్కుబడిగా రెండాటలు ప్రదర్శించబడింది. మొత్తమ్మీద మాచర్లలో ఆ సినిమా ఆడింది పది రోజులు. ‘సింహాసనం’ శత దినోత్సవ కేంద్రాల జాబితాలో మాత్రం ఆ ఊరు సగర్వంగా చోటు చేసుకుంది!

అయ్యా, అదీ సంగతి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ‘యాభయ్యేళ్ల చరిత్ర’ లెక్క సింహాసనం సినిమా నూర్రోజుల కేంద్రాల లెక్కకి ఏ మాత్రం తీసిపోదు. ఆ లెక్కా డొక్కా చూద్దాం పదండి.

అసలీ ప్రత్యేక ఉద్యమ చరిత్ర విషయంలో అనేక అంకెలు చలామణిలో ఉన్నాయి. కొందరది అరవయ్యేళ్లుగా ఉందంటారు, ఇంకొందరి లెక్కన యాభయ్యేళ్లు, మరి కొందరి లెక్కలో నలభయ్యేళ్లు. నిజానికి తాజా ఉద్యమానికి నిండా తొమ్మిదేళ్లు లేవు – అదీ పడుతూ లేస్తూ.

అరవయ్యేళ్లకి ముందు ఆంధ్రప్రదేశ్ లేదు, కనీసం ఆంధ్ర రాష్ట్రమూ లేదు. మరి అప్పుడే ప్రత్యేక ఉద్యమం ఎక్కడి నుండొచ్చిందో అడిగే వారు లేరు, చెప్పేవారూ లేరు. ఇదో అబద్ధపు లెక్క. దీనికి ఇంతకన్నా వివరణ అనవసరం.

యాభయ్యేళ్ల కిందట – 1959లో – ప్రత్యేక తెలంగాణ కోసం ఏ ఉద్యమమూ జరిగిన దాఖలాల్లేవు. అదీ అబద్ధపు లెక్కే. మొదటి తెలంగాణ ఉద్యమం మొలకెత్తింది 1969లో. రెండేళ్లు, మూడొందల అరవై మంది అమాయకుల నిండు ప్రాణాల అనంతరం దాన్ని రెచ్చగొట్టిన నాయకుల పబ్బం గడవటమూ, వెనువెంటనే ఆ ఉద్యమం నీరుగారిపోవటమూ జరిగిపోయాయి. ఇది అందరికీ తెలిసిన చరిత్రే. ‘ప్రజల ఆకాంక్షలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమైతే నాయకుల అవసరాలు తీరగానే ఎందుకు సద్దుమణిగింది?’ – ఇది ప్రత్యేకవాదులు వాళ్లని వాళ్లు వేసుకోవలసిన ప్రశ్న.

నాటి ఉద్యమం నాయకుల ముద్దు బిడ్డేనన్నది దాస్తే దాగే రహస్యం కాదు. దానికి రుజువు – అది చల్లారిన ఏడాదికే లభించింది. 1972లో ముల్కీ నిబంధనలకి వ్యతిరేకంగా ‘జై ఆంధ్ర’ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉంది ఓ తెలంగాణ ప్రాంతీయుడే. 1969 తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షల మేరకే జరిగినట్లైతే, ఆ ఉద్యమం వేడి ఇంకా చల్లారకుండా ఉన్నట్లైతే ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చెయ్యటానికి 1972ని మించిన తరుణం మరేముంది? ప్రస్తుతం చిక్కుముడిగా మారిన హైదరాబాద్‌ని అప్పట్లో ‘జై ఆంధ్రా’ వాదులు అడగలేదు కూడా. ‘జై ఆంధ్రా’కి మద్దతుగా ఇవతల ‘జై తెలంగాణ’ ఎందుకు రాజుకోలేదు? ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అని చిలకపలుకులు పలికేవాళ్లు అలా విడిపోగలిగిన ఒక్క అవకాశాన్నీ ఎందుకు వదులుకున్నారు? 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకవాదంతో 40 చోట్ల పోటీ చేసిన ఎస్‌టీపిఎస్ (సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి) అభ్యర్ధుల్లో ఒక్కరు తప్ప మిగతా వాళ్లందరూ మట్టికరవటం, మిగిలిన వారిలో 28 మంది డిపాజిట్లు సైతం కోల్పోవటం దేనికి సూచిక? ఈ రోజు తెలంగాణవారిలో ఆంధ్రావారిపై వెల్లువెత్తుతున్న ఆవేశకావేషాలు ఎప్పట్నుండో ఉన్నవేనైతే గత రెండు దశాబ్దాల్లో ఆంధ్రా, సీమ వాసులు వేలం వెర్రిగా హైదరాబాదులో పెట్టుబడులెందుకు పెడతారు? ‘విడిపోయి మా బ్రతుకు మేం బ్రతుకుతాం, మా అభివృద్ధి మేమే చేసుకుంటాం’ అని ఈనాడు గొంతులు చించుకుంటున్న వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హోదాలో హైదరాబాదుకి వెల్లువలా పరిశ్రమలూ, ప్రాజెక్టులూ వచ్చిపడుతున్నప్పుడు ఏమైపోయారు? నలభయ్యో, యాభయ్యో, అరవయ్యో ఏళ్లుగా ఉద్యమం సాగుతూనే ఉన్నప్పుడు, తెలంగాణ స్థానికుల్లో ‘ఆంధ్రా దోపిడీదారుల’పై నిరసన సెగలు రేగుతూనే ఉన్నప్పుడు ఆంధ్రా పెట్టుబడిదారుల ‘దండయాత్ర’ని ఎప్పటికప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఏనాటికైనా విడిపోక తప్పకపోతే ఆనాడు ఇవన్నీ విప్పలేని చిక్కుముడులవుతాయని తెలియదా?

ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పటం అతి సులువు. ఈ ప్రత్యేక భావనలు ప్రజల్లో ప్రబలంగా లేవు. తమ తమ ప్రాంతాలకి జరుగుతున్న అన్యాయాలపై ఇరు ప్రాంతాల్లోనూ నిరసనలున్నాయి. అందర్నీ అన్ని వేళలా సంతృప్తి పరచటం కుదిరే పని కాదు కాబట్టి ఇలాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటి కోసం రాష్ట్రాలూ, దేశాలూ విడిపోవాలన్న ఆలోచనలు ప్రజల మదుల్లో వాటంతటవే పుట్టుకు రావు. ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టే ఆలోచనలు ప్రజల్లోంచి పుట్టుకొచ్చినవి కావు – ఎవరి లెక్కలు వాళ్లేసుకునే కొందరి మస్తిష్కాల్లోంచి మొలుచుకొచ్చినవి.  కాబట్టే అవి ఎంత హఠాత్తుగా పుట్టాయో అంత హఠాత్తుగానూ పడకేశాయి. అవసరం మేరా ఉద్యమాలని వాడుకుని అది తీరాక వాటిని అటకెక్కించటం ప్రపంచవ్యాప్తంగా నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. మూడు దశాబ్దాల తర్వాత – ఆ విద్యని నేటి తరం తెలుగు రాజకీయ రాబందుల్లో రెండాకులు ఎక్కువ చదివిన మహానుభావుడొకడు మహత్తర రీతిలో ప్రదర్శించదలచుకోవటంతో తెలంగాణ లొల్లి పేరిట తాజా నాటకానికి మరోమారు తెర లేచింది.

మంత్రి పదవి రాలేదని అలిగిన ఈ మహాదొర తెలంగాణ జెండా భుజానేసుకుని అక్కడి జనాలని ఉన్నపళాన ఉద్ధరించేస్తానంటూ బయల్దేరింది 2001లో. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న ఆయన పక్షం ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించింది లేదు. పైగా, ఆ పార్టీ ప్రతిష్ట నానాటికీ తీసికట్టుగా మారి 2009 సాధారణ ఎన్నికలనాటికి ఎవరు తోడొస్తే వారితో జట్టుకట్టటానికి ఆవురావురుమనే దశకొచ్చి, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకే కాక వారితో జట్టు కట్టిన పక్షానికీ తల బొప్పి కట్టిన చరిత్ర ఇంకా తాజాగానే ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగానూ, విడిగా ఎన్నికల మ్యానిఫెస్టో సైతం లేకుండానూ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ ప్రతిసారీ ఓటమికి చెప్పే కుంటి సాకు ‘ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని స్థానిక అంశాలే ప్రభావితం చేశాయి తప్ప రాష్ట్ర సాధన కాదు’! తెలంగాణ ప్రజలకి ప్రత్యేక రాష్ట్ర సాధన ఏమంత ప్రధానమైన విషయం కాదని వీళ్ల మాటల్లోనే తేలిపోవటం లేదా?

ఇంతెందుకు – ఈ రోజు ఏ హైదరాబాదైతే ‘మాదే’ అంటూ తాజా చిచ్చు కారకులు గాండ్రిస్తున్నారో, సాక్షాత్తూ ఆ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక వాళ్లు తోక ముడిచిన వైనం సైతం నిన్నా మొన్నటిదే. ఇదీ – ‘ఉద్యమానికి నవ ఊపిరులూదిన పార్టీ’ భంగ చరిత్ర, తెలంగాణలో వాళ్లకున్న అసలైన బలం. తమ బలం సన్నగిల్లటం చూసి కలవరపడి, ఆఖరి యత్నంగా వేర్పాటువాదులు విసిరిన పాచిక – విభజించి పాలించటం. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పనులు చక్కబెట్టుకోవటం వీళ్ల తాజా తంత్రం. వీళ్లకి తోడు విద్యార్ధులని రెచ్చగొట్టే ప్రొఫెసర్లూ, మేధావుల ముసుగులోని వామపక్ష తీవ్రవాదుల సానుభూతిపరులూ. తరాలుగా సాగుతున్న ఉద్యమం అంటూ అమాయకులని మభ్యపెట్టటానికి వీళ్లు కలసికట్టుగా ప్రచారం చేస్తున్న అబద్ధమే ఉద్యమ చరిత్రకి సంబంధించిన కాకి లెక్కలు.

వేర్పాటువాదులు చెబుతున్నట్లు తెలంగాణ ఉద్యమానికి దశాబ్దాల చరిత్రే ఉందని ఒప్పుకున్నా- అసాధ్యమైన లక్ష్యాల కోసం ఏళ్లూ పూళ్లూ ఏకధాటి ఉద్యమాలు నడిపే బదులు, వీళ్లు పదే పదే ప్రస్తావించే పెద్ద మనుషుల ఒప్పందం, 610 జీవోల అమలు గురించి ఆ స్థాయిలో ఉద్యమాలు చేపడితే ఎవరొద్దంటారు? వాటి కోసం ఈ మహానుభావులు ఎప్పుడన్నా కనీసం ఉత్తుత్తి దీక్షలన్నా చేశారా? వీళ్లకి కావలసింది సమస్యలు తీరటం కాదు – అవి నిక్షేపంగా కొనసాగటం. తమ స్వార్ధాల కోసం ఉన్న సమస్యల్ని ఎక్కువ చేసి చూపటానికీ, కొత్త సమస్యలు సృష్టించటానికీ వీళ్లు తయార్. ఒకవేళ తెలంగాణ విడిపడ్డా ఈ రాబందుల రెక్కల చప్పుడు కిందే మనవలసి ఉంటే – వేరయినా ఒరిగేదేమిటి? అర్ధం చేసుకోవటానికదో బ్రహ్మ రహస్యం కాదు. దానిక్కావలసిందల్లా వాస్తవాలని స్వీకరించే గుణం. అది మీకుందా?

(సశేషం)

51 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 2”


  1. 1 రవి 9:33 సా. వద్ద జనవరి 5, 2010

    చాలా సూటిగా, డొంకతిరుగుడు లేకుండా అడిగారు. ప్రత్యేక తెలంగాణా ఒక వేళ వచ్చినా కూడా వారి సమస్యలు సాధించబడవు.

  2. 2 naalonenu 10:26 సా. వద్ద జనవరి 5, 2010

    అద్భుతం . మంచి విశ్లేషణ.
    తాలిబాన్లకు నచ్చవు లెండి
    నిద్రపోతున్న వాళ్ళను లేపవచ్చు గానీ నిద్ర నటిస్తూ కలల ప్రపంచంలో ఉండే వారికీ రుచించదు

  3. 4 viswamitra 10:44 సా. వద్ద జనవరి 5, 2010

    బాక్టీరియా ఎప్పుడూ బలహీనులని త్వరగా చేరుతుంది. ఆరోగ్యవంతులని ఏమి చేయలేదు. అలాగే ఈ విషయాలు తెలిసిన తెలంగాణా పౌరులెవ్వరూ ప్రత్యేక తెలంగాణాను సమర్ధించట్లేదు అన్నది నిజం. మీ వివరణ బాగుంది 🙂

  4. 5 kvsv 10:47 సా. వద్ద జనవరి 5, 2010

    అయ్యా నిరుద్యోగం ఆర్దిక సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితులు ఈ నాడు ప్రజల్ని ఇలాంటి వుద్యమా లవయిపు నడిపిస్తున్నాయి తెలంగాణ విద్యార్డులు రేపటి నిరుద్యోగాన్ని ఆంధృల దోపిడీ[అనే ఇమాసి నేసన్] కి లింక్ చేసి చూడడం కూడా వారి ఆందోళనలో కనబడుతుంది ఆంద్ర సెపరేట్ అయితే వుద్యోగ బయమ్ వుండదు ఈ ఆలోచన కూడా వారిని వుద్యమించేలా చేస్తున్నది దీనికంతటికి కారణం తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళ వారి దోపిడీ వల్లే వెనకబద్దరన్న విష ప్రచారం.. దాన్ని ప్రజలు ఈనాటికి పూర్తిగా నమ్మి రాజకీయనాయకుల వలలో పడడం ..రవి గారు చెప్పినట్టు ప్రత్యేక తెలంగాణ వచ్చినా వారికి వొరిగేధి యేమి వుండదు.. సమస్యకు కారణం గా యెవరినో చూపించి తెలంగాణ నాయకులు మాత్రం తెలివిగా ప్రజలిని పక్క దారి పట్టించారు యేమి ఈ నాయకులంతా అసెంబ్లి లో పార్లమెంట్ లో *** ***** తున్నారా ?తెలంగాణ సమస్యలు వారికి తెలియవా?కేసిఆర్ వారి పార్టీ వాళ్ళు ఒక్క రోజన్న వారి సమస్యలు ప్రస్తావించారా?ప్రతీరోజూ మీడియా ముందు కొచ్చి ప్రత్యేక రాష్ట్రం కావలన్న డిమాండ్ తప్పితే సమస్యల గురించి యెందుకు పోరాడలేదు?అంటే వీరికి కావలసింది ప్రత్యేక రాష్ట్రం..దాని ద్వారా వచ్చే పదవులు..ఎస్ఈజెడ్ లు ఖనిజ సంపదలు అదికారం లో వుంటే వచ్చే భారీ కాంట్రాక్ట్ లు..పిచ్చి నా ప్రజలారా వీళ్లు మిమ్మలిని అడ్డు పెట్టుకుని పెద్ద గేమ్ ఆడుతున్నారు …దయ చేసి కళ్ళు తెరవండి ..హర్ద్వోర్క్ చెయ్యండి …వున్నత చదువులు చదవండి ..మీ వృత్తి లో నైపుణ్యం పెంచుకోండి..నెంబర్ ఒన్ కాకుండా ఈ ప్రపంచం లో యెవరూ మిమ్మల్ని ఆపలేరు ..

  5. 6 kvsv 10:48 సా. వద్ద జనవరి 5, 2010

    విశ్వామిత్ర గారూ సూపర్బ్

  6. 7 హనుమంత రావు మద్దుకూరి 10:59 సా. వద్ద జనవరి 5, 2010

    మీ తార్కిక విశ్లేషణ చాలా బాగుంది.

  7. 8 వెంకటరమణ 12:07 ఉద. వద్ద జనవరి 6, 2010

    చాలా మంచి విశ్లేషణ. మొదటినుంచీ ఈ రాజకీయ నాయకులు అమాయక ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలను పెంచేది, తమ రాజకీయ అవసరాల కోసమే. ఇంత పెద్ద ఉద్యమం తెలంగాణా ప్రధాన సమస్య అని చెబుతున్న నీటి కోసం, చేసి ఉంటే కాదనే వారు ఎవరూ ఉండరు. తటస్థులు, ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కూడా ఉండేది. అకారణంగా వేరే ప్రాంతంలోని మెజారిటీ ప్రజలను ద్వేషిస్తే, వారికి తెలంగాణా ప్రజలపై సానుభూతి ఎలా కలుగుతుంది? వారికి కూడా అకారణ ద్వేషమే కలుగుతుంది. చివరికి పరస్పర ద్వేషం. అభివృద్ధి చెందిన జిల్లాలు అని చెప్పబడుతున్న కోస్తా జిల్లాల్లో ఎక్కువ మంది పొలం, భూములు లేక రోజువారీ కూలి చేసుకొనేవారే. ప్రజలు తమ సమస్యల కోసం రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వినకుండా వారిపైనే తిరగబడే రోజు ఎప్పుడు వస్తుందో!

  8. 9 రహంతుల్లా 12:56 ఉద. వద్ద జనవరి 6, 2010

    మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 890కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యానాం ముఖ్యమంత్రి వి వైద్యలింగం కృష్ణాగోదావరి బేసిన్‌ నుంచి తమ ప్రాంతానికి 2.515 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువును ప్రతిరోజూ సరఫరా చేయాలని కోరారు. కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ,రాజ్య సభ ఆమోదం లభించింది. దాదాపు 970కిమీల పొడవు కలిగిన ఈ జలమార్గంలో 888 కిమీలు మన రాష్ట్ర పరిధిలో ఉంది.కొన్ని చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య వంతెనలు నిర్మించాలని కోరారు. ఈ జాతీయ జలమార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్ హామ్ కాలువ, దీని పరిధిలోకి వస్తాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేశారు.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి

  9. 10 వీజె 1:31 ఉద. వద్ద జనవరి 6, 2010

    >>> అర్ధం చేసుకోవటానికదో బ్రహ్మ రహస్యం కాదు. దానిక్కావలసిందల్లా వాస్తవాలని స్వీకరించే గుణం. అది మీకుందా? >>>>

    తెలంగాణ వాదిగా నాది మీ ప్రశ్నే :)… మీరు వేసిన ప్రశ్నే మిమ్మల్ని మీరు వేసుకోని , కాస్త ఆలోచించి చూడండి … సమాధానం మీకే దొరుకుతుంది … సమైఖ్యంధ్రా వాదిగా మీరు తెలంగాణ ఉద్యమాన్ని కృష్ణ సినిమాతో పోల్చినా , తెలంగాణ వాదిగా నేను సమైఖ్యాంద్ర ఉద్యమాన్ని షకీలా సినిమాతో పోల్చిన ఒరిగేది ఎముంది చెప్పండి ? మీరు పట్టిన దానికి మూడని మీరు , నేను పట్టిన దానికి నాలుగని నేను మనలో మనం కొట్టుకు చావడం తప్ప …

    బైదవే , ఈ రోజు దినపత్రికల్లో వచ్చిన మొదటి ఎస్సార్సీ నివేదిక నిజనిజాల తాలూకు ఆర్టికల్స్‌ని చదివారా మీరు ? ఆ ఏమి లేదు … పూర్వము తెలంగాణ చరిత్ర గురించి ఎమీ తెలీదని నాతో అన్నారు కదా ! మీకేమైనా ఉపయోగ పడచ్చేమోనని … అసలే తెలంగాణ వాదానికి వ్యతిరేకముగ ఎపిసోడ్‌ల వారిగా వ్యాసాలు వ్రాస్తున్నారాయె 😉 …

    • 11 అబ్రకదబ్ర 11:29 ఉద. వద్ద జనవరి 6, 2010

      >> “అసలే తెలంగాణ వాదానికి వ్యతిరేకముగ ఎపిసోడ్‌ల వారిగా వ్యాసాలు వ్రాస్తున్నారాయె”

      నా వ్యాసాలు తెలంగాణవాదం పేరుతో ప్రచారం చేస్తున్న అబద్ధాలకు వ్యతిరేకంగా, ఆ పేరుతో సాటి తెలుగువారిపై వేస్తున్న నిందలకు వ్యతిరేకంగా. ఎస్సార్సీలు, ఆరు సూత్రాలు, పెద్ద మనుషుల ఒప్పందాల గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రాశారు. వాటిని అడ్డు పెట్టుకుని వేర్పాటువాదులు ప్రచారం చేస్తున్న అబద్ధాల గురించి వివరంగా రాసినవాళ్లు మాత్రం కొందరే. అందుకే ఈ వ్యాసాలు.

      కృష్ణ సినిమాతో పోల్చినా, షకీలా సినిమాతో పోల్చినా – ఈ వ్యాసంలో వివరించదల్చుకుంది యాభయ్యేళ్ల చరిత్రుంది అంటూ ఊదరగొడుతున్న ఉద్యమ అసలు చరిత్ర. ఇందులో తప్పులేవన్నా ఉంటే మీరవి ఎత్తి చూపితే బాగుండేది.

  10. 12 Prabodh 1:51 ఉద. వద్ద జనవరి 6, 2010

    You better try to read today news papers and try to get an idea of history behind the movement..Once again dont try to put forward your *opinions* as facts…

    సమైక్య ఊసరవెల్లులు

  11. 14 raj 2:00 ఉద. వద్ద జనవరి 6, 2010

    చాలా విషాదకర విషయం ఏమిటంటే తెలంగాణాలోని పల్లెపల్లెల్లో అంధ్రావాళ్ల అణచివేత అని ఒక వీడియో వేసి చూపిస్తున్నారు ( పులకేసి & పార్టీ) దాని లొ చాలా విద్వేషాలు రెచ్హగొట్టే ప్రసంగాలు అంధ్రా వారు అంటే దోపిడీదారులు అని ప్రచారం చెYయటం జరుగుతుంది..
    దీనిమీద ప్రభుత్వం వెంటనే ఏదోఒకచర్య తీస్కొవాలి లేకపోతే ఒకర్ని ఒకరు దూషణ తో మొదలైన ఈ ఉద్యమం ఏ పరిస్తితులకి దారితీస్తుందో అని చాలా భయంగా వుంది..

  12. 15 సుజాత 3:32 ఉద. వద్ద జనవరి 6, 2010

    తొమ్మిదేళ్ళుగా ఆయన ఎంత హంగామా చేసినా తెలంగాణాలో సైతం పట్టించుకున్న దిక్కులేకపోయింది. కనీసపు వోట్లు కూడా రాక ఎవరు కనపడితే వాళ్లతో జట్టు కట్టడానికి సిద్ధ పడ్డాడు. తెలంగాణా ప్రజలే ఛీ కొట్టిన సందర్భాలు మర్చిపోయాడు.

    రాజశేఖర్ రెడ్డి బతికున్న రోజుల్లో కిక్కురుమనేందుకు కూడా ధైర్యం చాలక, ఇప్పుడు నిరాహార దీక్షతో రాత్రికి రాత్రే గాంధీ స్థాయి నాయకుడైపోయాడు.తెలంగాణా లో పార్టీ వైఫల్యానికీ ఉద్యమానికీ సంబంధం లేదని, ఇదంతా జనంలో సెంటిమెంటనీ ఆయన అనుకుంటున్నాడు. ఆ మాటకొస్తే హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో తప్ప గొప్ప ఫీవర్ లేదు. ఊరంతా మాతం రకరకాల రంగుల యూనిఫారాలతో రకరకాల పోలీసు దళాలు. విరక్తి పుడుతోంది సిటీని చూస్తుంటే!

    మేథావులమని భర్మిస్తున్న ప్రొఫెసర్లు కూడా ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో చూస్తుంటే ఏమనాలో తోచడం లేదు.

    ఈ నడమంత్రపు ఉద్యమాలు విద్యా సంవత్సరం నష్టపోడానికే తప్ప, కూటికీ గుడ్డకూ కొరగావని.. గర్జిస్తున్న విద్యార్థి సింహాలు, వారి విజయాలను కీర్తిస్తున్న వారూ ఎప్పటికి తెలుసుకుంటారో!

    ఒకటి మాత్రం నిర్ణయమైపోయింది. రాష్ట్రం ప్రకటించినా ప్రకటించకపోయినా ఆంధ్రా-తెలంగాణా ప్రజల మధ్య కేసీ ఆర్ ఏర్పరచిన అగాధాలు ఇక పూడవు.

  13. 16 screentalent 5:06 ఉద. వద్ద జనవరి 6, 2010

    1969 లో తెలంగాణా ఉద్యమాన్ని అణిచివేసిన తరవాత 1972 లో జై ఆంధ్రా ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణావాదులంతా ఏమైపోయారనేది ఎప్పటినుంచో నాకున్న సందేహం. చాలా చక్కగా వివరించారు.

  14. 17 a2zdreams 8:18 ఉద. వద్ద జనవరి 6, 2010

    లేటుగా అయినా మీ వాయిస్ వినిపిస్తున్నందుకు కంగ్రాట్స్ !

    ఇప్పుడు సమస్య ఏది నిజం, ఏది అబద్దం అనేది కాదు.

    మీరు అనుకుంటున్న నిజాలు రాజకీయ పార్టీలకు, రాజకీయ మేధావులకు తెలియదా ?

    కేంద్రం పక్రియ మొదలు పెడతాం అనేదాకా సై అన్న వాళ్ళు, ఒక్క రాత్రిలో ప్లేటు ఎందుకు ఫిరాయించారు ?

    interesting to see:
    1) రెచ్చగొట్టిన ప్రజలను ఎవరు సముదాయిస్తారో చూడాలి.
    2) స్వార్ద పూరిత అమాయక ప్రజలు ఇంకెంత కాలం రెచ్చిపోతూ మోసపోతారో చూడాలి.
    3) మా సోమ్మేమి పోయిందిలే అని తెలంగాణ మేధావులు ఎంత కాలం మౌనం గా వుంటారో చూడాలి.

    • 18 అబ్రకదబ్ర 12:21 సా. వద్ద జనవరి 6, 2010

      >> “మీరు అనుకుంటున్న నిజాలు రాజకీయ పార్టీలకు, రాజకీయ మేధావులకు తెలియదా?”

      శుభ్రంగా తెలుసు. తెలీనిది చాలామంది సాధారణ ప్రజానీకానికి. వాళ్ల కోసమే ఈ శ్రమ. నా టపాలు చదివేది ఎందరంటారా? పది మంది చదివినా ఫరవాలేదు, వారిలో ఒక్కరు అర్ధం చేసుకున్నా చాలు. అసలెవరూ చేసుకోకపోయినా ఫరవాలేదు. నేను నమ్మింది పదుగురికి చెప్పే ప్రయత్నం చేశానన్న సంతృప్తి చాలు నాకు.

      అన్నట్టు, ఇవి నేను ‘అనుకుంటున్న నిజాలు’ కావు, ‘ఉన్న నిజాలు’.

      >> “కేంద్రం పక్రియ మొదలు పెడతాం అనేదాకా సై అన్న వాళ్ళు, ఒక్క రాత్రిలో ప్లేటు ఎందుకు ఫిరాయించారు ?”

      Funny you should ask that. ఒకప్పుడు మీరు సమైక్యవాది. ఎప్పుడైతే మీ అభిమాన నటుడు పార్టీ పెట్టి ‘జై తెలంగాణ’ అన్నాడో అప్పుడు మీరూ ప్లేటు ఫిరాయించారు. ఎందుకని ఎవరన్నా అడిగారా?

      Any way, ఈ ప్రశ్న మీరు నన్ను పదే పదే ఎందుకు అడుగుతున్నారో నాకర్ధం కావటం లేదు. నాది ఎప్పుడూ సమైక్యవాదమే (ఆ సంగతి ఏడాదిన్నరగా నా బ్లాగు చదువుతున్న మీకు తెలుసనే అనుకుంటాను). ప్లేటు ఫిరాయించినవాళ్లని వదిలేసి నన్నడిగితే లాభమేమిటి?

      • 19 Prabodh 2:51 సా. వద్ద జనవరి 6, 2010

        The reason people are hating the actor is because he has cheated the people..You can see his statements and compare how he has changed his opinion

      • 20 అబ్రకదబ్ర 3:18 సా. వద్ద జనవరి 6, 2010

        @Prabodh:

        the question ‘does changing an opinion count as cheating?’ demands a separate discussion thread. People rejected Chiranjivi as a politician, long before he changed his stance on the T issue. He’s not the topic of discussion here. Let’s keep it that way.

        So far, none of the critics have at least attempted at answering a single question I raised in the post!

      • 21 sri 3:53 సా. వద్ద జనవరి 6, 2010

        Politicians thought that the state will never be divided and at any cost its not going to be done based on KCR like fools demands. Nobody thought that the state division is getting serious. They supported telangana issue purely for getting votes(promising before elections and ditching after elections which by the way is a normal thing for the current politicians and political parties). Imagine these major issues:

        1.Ethical values of the current politicians
        2.Naxalite issues
        3.ISI Terrorist issues
        4.Hyderabad ownership issue
        5.Water projects issues
        6.Hyderabad seperation demand by MIM/Muslims(Since BJP&TRS are closer, if telangana is given, MIM asks for seperation of HYD from telangana)
        7.TDP supported T-state in 2009 to overthrough YSR rather than affection for splitting the state. Also, since TDP didnot wwin the state, it need not support the T-state.
        8.BJP supports T-state since it anyway has nothing to loose.
        9.PRP opposes T-state now since they guaged that the majority of people of andhra pradesh state doesnot like the division.

        By the way, you make a promise in politics for the sake of power and if you donot get power, the promise is also gone to the water. Period.

        THIS IS HOW POLITICIANS AND POLITICS WORK brother.

      • 22 prabodh 2:27 సా. వద్ద జనవరి 7, 2010

        The history of Telangana struggle is well known to the world…The Govt of India ,even Andhra Political leaders have accepted that the struugle is there from 50 years…There is no point in comparing with a film story and expecting people to show negavtive points in the article…Your understanding the struggle is flawed…You treat there only fight until people come to road and dispaly..but that is not the correct understading…Every struggle in the history will have break point where people come out and fight..that doesnot mean the fight didnt exist till that moment…try to get basic understanding a fight first and then try to put your argument forward

      • 23 Manipal Reddy 5:30 ఉద. వద్ద జనవరి 17, 2010

        Anna Jan 5th all party meeting lo samykyavadaniki chiranjeevi cheppina reason ento andaru chadive untaru…..adi entante..telangana vasthe seemandra ki neella karavu vastundi ani. chusara…telngana prajala meeda entha premoooooo.

        Guys this is not just a gossip it is official now….he said this in a meeting with home ministry.

        Ippudu cheppandi samykya vadi ga chiranjeevi ni emanalo….

        manspurthi ga andaram kalisundam,bedabiprayalu tolaginchu kundamani evaranna sare daniki nenu anduku support chestha. Anthe gani guddiga telangana lo enni jillalu unnayo kuda telayani vedavalu kuda tealngana gurinchi silliga matladuthunte oppukomu.

      • 24 అబ్రకదబ్ర 12:39 సా. వద్ద జనవరి 17, 2010

        చిరంజీవి నిజంగానే ఆ మాట చెప్పి ఉంటే అతని అజ్ఞానానికి నవ్వుకోవాల్సిందే. మహారాష్ట్ర, కర్నాటకల పుణ్యాన మన రాష్ట్రానికి నీళ్ల సమస్యలు ఇప్పటికే ఉన్నాయి. రేపు తెలంగాణ విడిపోతే అప్పుడు ఏర్పడ్డ రెండు (లేదా మూడు) చిన్న రాష్ట్రాలకి ఎగువ రాష్ట్రాలతో నీటి విషయమై పోరాడే బలం అసలుండదు. వాళ్లు నీటిని ఇప్పటికన్నా ఎక్కువ బిగపట్టటం తధ్యం.

        ఆ మిగిలిన కాసిని నీళ్లతో తెలంగాణకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. కోస్తాకి నీరు బిగబట్టటమంటే రోడ్లమీద అడ్డుగోడలు కట్టి ట్రాఫిక్ ఆపేసినంత తేలిక కాదు. దానికి కొత్తగా కృష్ణా, గోదావరిల మీద వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టాలి. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రం దగ్గర ప్రాజెక్టుల కోసం అనుమతులు, ఫండింగ్ తేటం చేతకావటం లేదు. ఇక తెలంగాణవంటి చిన్న రాష్ట్రానికి అది సాధ్యమయ్యే పని కానే కాదు.

        ఏతావాతా, తెలంగాణ విడిపడ్డా కోస్తాకి నీటిని అడ్డుకునే సామర్ధ్యం లేదు. చిరంజీవి అలా అన్నాడంటే అది అతని అవివేకం.

  15. 25 చదువరి 12:30 సా. వద్ద జనవరి 6, 2010

    “అన్నదమ్ముల్లా విడిపోదాం’ అని చిలకపలుకులు పలికేవాళ్లు అలా విడిపోగలిగిన ఒక్క అవకాశాన్నీ ఎందుకు వదులుకున్నారు?” -యాభైయేళ్ళుగా ఉద్యమం చేస్తూ ఉన్నామంటున్న ఈ అన్నల్దమ్ములవాదులు ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారేమో చూడాలి.

    a2zdreams: “కేంద్రం పక్రియ మొదలు పెడతాం అనేదాకా సై అన్న వాళ్ళు, ఒక్క రాత్రిలో ప్లేటు ఎందుకు ఫిరాయించారు ?” – రాజకియ నాయకులు ముందేం చెప్పారు, తరవాతేం చెబుతున్నారు అనే సంగతిని అలా ఉంచండి.. కోస్తా, సీమ వాసులు రాష్ట్రవిభజనపై తమ అభిప్రాయాలు గతంలో ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడే మొదటగా చెప్పారు. గట్టిగా చెప్పారు. తమ ప్రజలు ఇంత దృఢంగా చెప్పిన మాటను పట్టించుకోకుండా వీళ్ళు మనగలరా? తమ మాట వినని రాజకీయ నాయకుల మెడలు తెలంగాణవాదులు ఎలా వంచారో, వంచుతున్నారో చూసాం గదా.. మామాట మీరూ వినాల్సిందేనని కోస్తా సీమల ప్రజలు తమ నాయకులకు చెబితే తప్పేంటి? వాళ్ళ మాట అక్కడి శాసనసభ్యులు వింటే తప్పేంటి?

  16. 26 a2zdreams 1:21 సా. వద్ద జనవరి 6, 2010

    >>ఎందుకని ఎవరన్నా అడిగారా? <<

    మీరు ఇంతకు ముందు నన్ను అడిగినట్లు, నేను సమాధానం కూడా చెప్పినట్టు గుర్తు.
    *** — ***

    అసలు విషయానికి వస్తే "నేను సమైక్యవాదా ? తెలంగాణ వాదా ? , మీరు సమైక్యవాదా ? తెలంగాణ వాదా ? అనేది కాదు" సమస్య.

    ప్రాంతం పేరుతొ రాజకీయలకు ముగింపు పలకాలన్నదే నా కోరిక.

    నాకు తెలిసి రాష్ట్ర విభజనే ఈ సమస్యకు పరిష్కారం !

    చదువరి గారు,
    నాకు తెలిసి 2009 ఎన్నికలలో కీలక మైన అంశం ప్రత్యేక తెలంగాణ. తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వచ్చినా తెలంగాణ వస్తుందనే ఓటు వేసారు.

    సీమాంధ్రలో తెలుగుదేశం , ప్రజారాజ్యం పార్టీలకు ఓటు వేసిన వారంతా ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నవారి క్రిందే లెక్క.

    సీమాంధ్రలో కాంగ్రెస్ కు వేసిన వారికి మినాహియింపు ఇవ్వవచ్చు . ఎందుకంటే తెలంగాణ అంశం కేవలం రాజకీయమే అని చెపుతూ వై.యస్ "నో" అని పెద్ద క్లూ ఇచ్చాడు.

  17. 27 చదువరి 8:35 సా. వద్ద జనవరి 6, 2010

    a2zdreams గారూ, మీ లెక్క ప్రకారం చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యనక్కర్లేదని 2004 తరవాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు చెప్పేసారు. దాదాపుగా ప్రతీ ఎన్నికలోనూ జనం తెరాస పిలక కోస్తూ వచ్చారు. ఈ టపాలోనే చెప్పినట్టు హై. ఎన్నికల్లో పోటీ చెయ్యకుండ దాక్కోవాల్సి వచ్చింది ఆ పార్టీకి. ఈ ఎన్నికల లెక్క ప్రకారం చూస్తే తెలంగాణ అనేది అసలు ఒక విషయమే కాదు, అదో నాన్-ఇస్యూ!

    • 28 prabodh 2:29 సా. వద్ద జనవరి 7, 2010

      After 2004 elections, every political party has put Telangana on their manifestos..Everyone who has voted for any polticial party has indirectly accepted for Telangana..BTW Andhra political parties were also invited to Pranab Mukherji committe, that time they never had any problem..Now suddenly from no where they have problems…

  18. 29 ram 2:25 ఉద. వద్ద జనవరి 7, 2010

    మీరు ఎన్ని వివరణలు ఇచ్చిన వాళ్ళు వినరండి బాబు

  19. 30 మంచుపల్లకీ 10:37 ఉద. వద్ద జనవరి 7, 2010

    వైస్ నొ అన్నా అధికారం ఇచ్చారంటే మెజార్టి ప్రజలు సమైక్య అంధ్రా వైపు వున్నరన్నమాట.. 🙂 అందుకే లగడపాటి రెఫెరెండం అంటున్నాడు,,
    అయినా ఇంక డిస్కషన్స్ ఎమిటండి బాబు.. తెలంగాణా అంశం ఎప్పుడొ అటకెక్కెసింది కదా .. ఇక అంతా మాములే .. మళ్ళీ కె సి ఆర్ మందు కొట్టి పడుకుంటాడు,,, తెలంగాణ ప్రజలు ఎప్పటిలాగనే టి అర్ ఎస్ ని ఎలెక్షన్స్ లొ తిప్పికొడతారు.. లగడపాటి హైదరాబాద్ లొ ఎక్కడ అపార్ట్మెంట్స్ కడదామా అని చూస్తూ వుంటాడు..

  20. 31 CDR 9:30 ఉద. వద్ద జనవరి 8, 2010

    ఆంధ్ర ప్రేదేశ్ ని పరిపాలించిన ప్రతి ప్రభుత్వం.. తెలంగాణా సమస్యని ఇంతదాకా రానిచింది..వెనకబడిన ప్రతి ప్రాంతాన్ని.. (అది తెలంగాణా కావొచ్చు..ఆంద్ర కావోచు రాయల సీమ కావొచ్చు..) అబివృద్ది చేసినట్టయితే… అభివృద్ధి అనగానే.,, ఏదో ఆకాశ హర్మలు కాదు.. ఆహరం ఆరోగ్యం..మంచినీరు …విద్య, ఇలా మనిషి కనిస
    అవసరాలు తీర్చగలిగి ఉంటె దేశం ( రాష్టం ) ఈ నాడు ఈ గతికి వొచ్చి ఉండేది కాదు. కాని.. మన నాయకులూ పదవీ వ్యామోహంతో..సుఖ బోగ లాలసులై.. తరతరాలకి తరగని ఆస్తులు కుడబెడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అని మరిచి పోయి ప్రజలకి సేవ చేయగలిగే అపూర్వ అవకాశాన్ని వదులుకుంటూ ..జన్మని వృధా చేసుకుంటున్నారు.
    మనిషికు ఉండలిసిన బేసిక్ లక్షణాలు కూడా లేని నాయకులే అందరూ . అంతరాత్మలు చచ్చిన మనుషులు వాళ్ళు.
    మన ప్రభుత్వాలు , ఆరోగ్యాన్ని కార్పోరేట్ పరం చేసి.. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది.
    జనాభా పెరుగుదల ని పట్టిచుకునే నాథుడే లేడు.
    దేశం capital of diabetis and aids గా మారుతుంటే అడిగే దిక్కు అంతకన్నా లేదు.
    మత చందాసం ప్రభలుతోంటే .. terrorist లు దేశం లోకి చొరబడి జనాల్ని పిట్టల్ని కాల్చి నట్టు కాల్చుతుంటే.. సంసృతి పరిరక్షణ పేరుతో వ్యక్తి స్వేచని భంగపరుస్తోంటే.. ఎన్ని అని చెప్పేది…
    భారత దేశము కర్మ భూమి…నా కర్మ భూమి.. ఇదా నా భారత దేశం??
    (స్వయం పరివర్తన చెందని వాడు విశ్వాన్ని మార్చలేడు)

  21. 32 Mahesh Kalaal 2:33 సా. వద్ద జనవరి 8, 2010

    మీ వ్యంగ్య రచనా శైలి కి నిజంగా నా అభినందనలు, సుమారుగా ఒక సంవత్సరం క్రితం మీ బ్లాగ్ చదివాను. చాలా బాగా అనిపించింది. సరే ప్రశంసలు పక్కకు పెడదాం.
    అయిన గురువు గారు స్క్రిప్ట్ మాత్రం అదిరింది, మీరు ఏదయినా సినిమాకి స్క్రిప్టు రాస్తే తప్పకుండ హిట్, మాది గ్యారంటీ. తెలంగాణా ఉద్యమాన్ని ఒక సినిమాతో పోల్చగానే కోపం, బాధ, ఏడుపు వచ్చాయి. ఇలా పోల్చిన మీ తలకాయ ఎలా ఉంటుదా అని చాలా సేపు ఆలోచించాం కాని మా ‘అమాయక’ బుర్రలకి తట్టనేలేదు సుమీ.
    ఒక ఉద్యమం, పది అబద్ధాలు
    1.అరవయ్యేళ్లకి ముందు ఆంధ్రప్రదేశ్ లేదు, కనీసం ఆంధ్ర రాష్ట్రమూ లేదు. మరి అప్పుడే ప్రత్యేక ఉద్యమం ఎక్కడి నుండొచ్చిందో అడిగే వారు లేరు, చెప్పేవారూ లేరు. ఇదో అబద్ధపు లెక్క. దీనికి ఇంతకన్నా వివరణ అనవసరం.

    వివరణ: అరవయ్యేళ్లకి ముందు ఆంధ్రప్రదేశ్ లేదు, కనీసం ఆంధ్ర రాష్ట్రమూ లేదు కాని హైదరాబాద్ అనబడే ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉండేది ఆ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది 1948 లో అప్పటి నుండి 8 ఏళ్ళ దాక అంటే 1956 దాక తెలంగాణా ఒక రాష్ట్ర౦గా ఉండేది. 1952 లోనే ఇడ్లీ సాంబార్ ఉద్యమం వచ్చింది. అదే సమయంలో 1952 JVP కమిటీ (Jawaharlal Nehru, Vallabhai Patel, Pattabhi seeta raamaiah) ఆంద్ర హైదరాబాద్ రాష్ట్రాలు వేరుగా ఉండడం మంచిదని సిఫారసు చేసింది.

    1953 లో పొట్టి శ్రీరాములు కూడా తెలంగాణా తో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమం సాగించలేదు. ఆ ఉద్యమం కేవలం మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికోసం మాత్రమే చేయబడింది. అప్పుడేమయింది సమైఖ్యాంద్ర ? అప్పుడేక్కడుంది తెలుగు తల్లి.

    1937 లో రాయలసీమతో ఉన్న ఒడంబడిక వల్ల ఆంధ్ర రాష్ట్రం లో రాయలసీమ కలప బడింది. ఆ ఒడంబడికలో కూడా తెలంగాణా ఊసే లేదు. అప్పుడేమయింది సమైఖ్యాంద్ర ? అప్పుడేక్కడుంది తెలుగు తల్లి.

    1956 లో మొదటి SRC కమిటి కూడా ఆంధ్ర , తెలంగాణా రాష్ట్రాలను విడి విడి గా ఉంచటమే మంచిదని నెత్తి నోరు మొత్తుకుంది.

    1956 లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొన్ని షరతుల మేరకు జరిగింది. అదే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, కలిసి ఉండడం కుదరక పొతే 5 ఏళ్ళలో విడిపోయే వీలుంది.

    అందులో ఇప్పటివరకు ఒక్క ఒప్పందం కూడా అమలు గాలేదు. అమలు గాని ఒప్పందం Indian contract act ప్రకారం చెల్లదు , ఆ ఒప్పందం పైన ఏర్పడిన రాష్ట్రము చెల్లదు.

    మన భారత స్వతంత్ర ఉద్యమం కూడా మీ లాజిక్ ప్రకారం చూస్తె 90 ఏళ్ళు ఏక ధాటిగా ఏమి జరగలేదు, అది గూడా పడుతూ లేస్తూ సత్తువ కూడ గట్టుకొని సాగిందే. అంత మాత్రాన ఆది ఉద్యమం కాదంటారా? మనకు వచ్చింది స్వాతంత్రం కాదంటారా? అన్నా అంటారు లెండి.

    మచ్చుకు 1987 తరువాత 1906 స్వదేశి ఉద్యమాల మద్యలో ఎటువంటి పెద్ద ఆందోళన లేదు. అప్పుడు బ్రిటిష్ వాడు 1857 తరువాత ఇన్ని రోజులు మీ ఉద్యమం ఏమయింది అని అడగలేదు ఏ సినిమాతో పోల్చనులేదు. కనీసం వాడు ఉద్యమాన్ని ఉద్యమంలా చూసి గౌరవించాడు.

    కనీసం ఈ విషయం లోనయిన వాళ్ళు సంస్కారవంతులే అని చెప్పుకోవచ్చు.

    బ్రిటిష్ వాడు కాబట్టి 1947 లో అయిన స్వతంత్రం ఇచ్చారు. అదే హిట్లర్ అయి ఉంటె వరుసగా ఉద్యమం ఎందుకు చేయలేదని భారతీయులను ఊచకోత కోసేవాడు.

    ఉద్యమంతో పాటు ఉద్యమం ఎవరి పైన అనేది కూడా ముఖ్యమయిన అంశం. ఉద్యమం ఉనికినే ప్రశ్నించే వాడిని ఏమనాలి?? హిట్లర్ అనాలా?

    ఇక మీ లాజిక్ విషయానికి వస్తే, ఉద్యమ౦ పడుతూ లేస్తూ సాగిన౦త మాత్రాన , తెలంగాణాఫై జరిగిన దోపిడీ అబద్దమంటారా? ఆ దోపిడీ మాత్రం పడుతూ లేస్తూ ఏమి సాగలేదు, నిరవధికంగా సాగిన 50 ఏళ్ళ చరిత్ర ఆ దోపిడీకి ఉంది.

    ఇంతకి మీరు ఆ దోపిడీ గురించి మీ గోడు వినిపిస్తారని అనుకున్నా. కాని ఒక సినిమాతో తెలంగాణా ఉద్యమాన్ని పోల్చినప్పుడే మీ అహ౦భావ ధోరణి తేటతెల్లమయిపోయింది.

    2.యాభయ్యేళ్ల కిందట – 1959లో – ప్రత్యేక తెలంగాణ కోసం ఏ ఉద్యమమూ జరిగిన దాఖలాల్లేవు. అదీ అబద్ధపు లెక్కే. మొదటి తెలంగాణ ఉద్యమం మొలకెత్తింది 1969లో. రెండేళ్లు, మూడొందల అరవై మంది అమాయకుల నిండు ప్రాణాల అనంతరం దాన్ని రెచ్చగొట్టిన నాయకుల పబ్బం గడవటమూ, వెనువెంటనే ఆ ఉద్యమం నీరుగారిపోవటమూ జరిగిపోయాయి. ఇది అందరికీ తెలిసిన చరిత్రే. ‘ప్రజల ఆకాంక్షలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమైతే నాయకుల అవసరాలు తీరగానే ఎందుకు సద్దుమణిగింది?’ – ఇది ప్రత్యేకవాదులు వాళ్లని వాళ్లు వేసుకోవలసిన ప్రశ్న.

    > చరిత్ర పై మీకున్న అపార జ్ఞానానికి మేము ముగ్దులమయ్యాము. అవును మేము అమాయకులమే. మా ఉద్యమ చరిత్ర కొంచెం సేపు పక్కకు పెట్టండి. ప్రజల ఆకాంక్షల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమైతే 1972 లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం నాయకుల అవసరాలు తీరగానే ఎందుకు సద్దుమణిగింది? ఇది సమైఖ్య వాదులు వాళ్లకు వాళ్ళు వేసుకోవలసిన ప్రశ్న.

    ౩.నాటి ఉద్యమం నాయకుల ముద్దు బిడ్డేనన్నది దాస్తే దాగే రహస్యం కాదు. దానికి రుజువు – అది చల్లారిన ఏడాదికే లభించింది. 1972లో ముల్కీ నిబంధనలకి వ్యతిరేకంగా ‘జై ఆంధ్ర’ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉంది ఓ తెలంగాణ ప్రాంతీయుడే. 1969 తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షల మేరకే జరిగినట్లైతే, ఆ ఉద్యమం వేడి ఇంకా చల్లారకుండా ఉన్నట్లైతే ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చెయ్యటానికి 1972ని మించిన తరుణం మరేముంది? ప్రస్తుతం చిక్కుముడిగా మారిన హైదరాబాద్‌ని అప్పట్లో ‘జై ఆంధ్రా’ వాదులు అడగలేదు కూడా. ‘జై ఆంధ్రా’కి మద్దతుగా ఇవతల ‘జై తెలంగాణ’ ఎందుకు రాజుకోలేదు? ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అని చిలకపలుకులు పలికేవాళ్లు అలా విడిపోగలిగిన ఒక్క అవకాశాన్నీ ఎందుకు వదులుకున్నారు? 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకవాదంతో 40 చోట్ల పోటీ చేసిన ఎస్‌టీపిఎస్ (సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి) అభ్యర్ధుల్లో ఒక్కరు తప్ప మిగతా వాళ్లందరూ మట్టికరవటం, మిగిలిన వారిలో 28 మంది డిపాజిట్లు సైతం కోల్పోవటం దేనికి సూచిక? ఈ రోజు తెలంగాణవారిలో ఆంధ్రావారిపై వెల్లువెత్తుతున్న ఆవేశకావేషాలు ఎప్పట్నుండో ఉన్నవేనైతే గత రెండు దశాబ్దాల్లో ఆంధ్రా, సీమ వాసులు వేలం వెర్రిగా హైదరాబాదులో పెట్టుబడులెందుకు పెడతారు? ‘విడిపోయి మా బ్రతుకు మేం బ్రతుకుతాం, మా అభివృద్ధి మేమే చేసుకుంటాం’ అని ఈనాడు గొంతులు చించుకుంటున్న వేర్పాటువాదులు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హోదాలో హైదరాబాదుకి వెల్లువలా పరిశ్రమలూ, ప్రాజెక్టులూ వచ్చిపడుతున్నప్పుడు ఏమైపోయారు? నలభయ్యో, యాభయ్యో, అరవయ్యో ఏళ్లుగా ఉద్యమం సాగుతూనే ఉన్నప్పుడు, తెలంగాణ స్థానికుల్లో ‘ఆంధ్రా దోపిడీదారుల’పై నిరసన సెగలు రేగుతూనే ఉన్నప్పుడు ఆంధ్రా పెట్టుబడిదారుల ‘దండయాత్ర’ని ఎప్పటికప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఏనాటికైనా విడిపోక తప్పకపోతే ఆనాడు ఇవన్నీ విప్పలేని చిక్కుముడులవుతాయని తెలియదా?

    > సరే మీ పెట్టుబడి దారుల్ని అడ్డుకోవడం లో నిజంగానే మేము విఫలమయ్యం, మొత్తానికి సమైఖ్య వాద౦ అనగా హైదరాబాద్ లో ఆంధ్ర పెట్టుబడి దారి వ్యవస్తే అని వివరించినందుకు కృతజ్ఞతలు.

    సరే మేము ఆంధ్రా పెట్టుబడిదారుల ‘దండయాత్ర’ని ఎప్పటికప్పుడు అడ్డుకోకపోయినంత మాత్రాన జరిగిన ‘దండయాత్ర ‘ అబద్దం అయిపోదు కదా.

    ఉదా: 1600 లో మొదలయిన బ్రిటిష్ పెట్టుబడిదారి ‘దండయాత్ర’ని ప్రశ్నిచడానికి మనకు సుమారు 250-300 సం|| పట్టింది. అంత మాత్రాన జరిగిన బ్రిటిష్ పెట్టుబడిదారుల ‘దండయాత్ర ‘ అబద్దం అయిపోదు కదా.

    >1971 లో ప్రత్యేకవాదంతో 14 చోట్ల పోటీ చేసిన ఎస్‌టీపిఎస్ (సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి) 11 స్థానాల్లో గెలిచింది (మరి ఇది దేనికి సూచిక ). అయినప్పటికీ తెలంగాణా ఇవ్వకపోతే వెంటనే 1972 లో మళ్ళీ అదే పార్టీకి ఓట్లు ఎలా వస్తాయి?? ఈ ‘లాజిక్’ ఎలా మిస్సయ్యారు.?? అసలు 1971 ఎన్నికల గురి౦చి ప్రస్తావి౦చకు౦డా బలే కవరు చేసారు గురువు గారు.

    (మనలో మన మాట ఇంతకి ఇలా ఎన్ని లాజిక్కులు మిస్సయ్యారు?? )

    4.ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పటం అతి సులువు. ఈ ప్రత్యేక భావనలు ప్రజల్లో ప్రబలంగా లేవు. తమ తమ ప్రాంతాలకి జరుగుతున్న అన్యాయాలపై ఇరు ప్రాంతాల్లోనూ నిరసనలున్నాయి. అందర్నీ అన్ని వేళలా సంతృప్తి పరచటం కుదిరే పని కాదు కాబట్టి ఇలాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటి కోసం రాష్ట్రాలూ, దేశాలూ విడిపోవాలన్న ఆలోచనలు ప్రజల మదుల్లో వాటంతటవే పుట్టుకు రావు. ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టే ఆలోచనలు ప్రజల్లోంచి పుట్టుకొచ్చినవి కావు – ఎవరి లెక్కలు వాళ్లేసుకునే కొందరి మస్తిష్కాల్లోంచి మొలుచుకొచ్చినవి. కాబట్టే అవి ఎంత హఠాత్తుగా పుట్టాయో అంత హఠాత్తుగానూ పడకేశాయి. అవసరం మేరా ఉద్యమాలని వాడుకుని అది తీరాక వాటిని అటకెక్కించటం ప్రపంచవ్యాప్తంగా నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. మూడు దశాబ్దాల తర్వాత – ఆ విద్యని నేటి తరం తెలుగు రాజకీయ రాబందుల్లో రెండాకులు ఎక్కువ చదివిన మహానుభావుడొకడు మహత్తర రీతిలో ప్రదర్శించదలచుకోవటంతో తెలంగాణ లొల్లి పేరిట తాజా నాటకానికి మరోమారు తెర లేచింది.

    > ఎవరి లెక్కలో ఎందుకు, ఎవరి మస్తిష్కలో ఎందుకు, 1953 లో మద్రాసు ని దేశ ‘సమైఖ్యతకు’ విరుద్ధంగా రెండు రాష్ట్రాలుగా చీల్చిన పాపం మీది కాదా?

    >ఎందుకు సారూ ఈ తలకయలేని లాజికులు, మొత్తం భారత దేశాన్నే ఒక రాష్ట్రంగా ఉంచేస్తే పోలా?? అందరు సమైఖ్యంగా అన్నదమ్ముల్లగా, కలిసి మెలిసి ఏ దోపిడీ లేకుండా ఉండొచ్చు. దీనికి మీరు తప్పకుండ ఒప్పుకుంటారని భావిస్తున్న. ‘జై సమైఖ్య భారత్’.

    > మీరు వేరే రాష్టం కోసం ఉద్యమిస్తే అది ఆత్మ గౌరవ సమస్య అదే మేము ఉద్యమిస్తే మాత్రం ‘సింహాసనం’ సినిమా. ఎలా వస్తాయి సారూ ఇంత గొప్ప ‘లాజిక్కులు’??

    5.మంత్రి పదవి రాలేదని అలిగిన ఈ మహాదొర తెలంగాణ జెండా భుజానేసుకుని అక్కడి జనాలని ఉన్నపళాన ఉద్ధరించేస్తానంటూ బయల్దేరింది 2001లో. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న ఆయన పక్షం ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించింది లేదు. పైగా, ఆ పార్టీ ప్రతిష్ట నానాటికీ తీసికట్టుగా మారి 2009 సాధారణ ఎన్నికలనాటికి ఎవరు తోడొస్తే వారితో జట్టుకట్టటానికి ఆవురావురుమనే దశకొచ్చి, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకే కాక వారితో జట్టు కట్టిన పక్షానికీ తల బొప్పి కట్టిన చరిత్ర ఇంకా తాజాగానే ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగానూ, విడిగా ఎన్నికల మ్యానిఫెస్టో సైతం లేకుండానూ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ ప్రతిసారీ ఓటమికి చెప్పే కుంటి సాకు ‘ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని స్థానిక అంశాలే ప్రభావితం చేశాయి తప్ప రాష్ట్ర సాధన కాదు’! తెలంగాణ ప్రజలకి ప్రత్యేక రాష్ట్ర సాధన ఏమంత ప్రధానమైన విషయం కాదని వీళ్ల మాటల్లోనే తేలిపోవటం లేదా?

    >అయ్యో సోదర, ఈ KCR నోట్లో వేలు వేసుకోక మునుపే తెలంగాణా ఉద్యమ ‘సినిమా’ రెలీస్ అయింది. ప్రింట్ కావాలంటే ప్రూఫ్ ఉంది పంపుతాం.

    > 2009 లో ప్రతి పార్టి కూడా తెలంగాణా ఇస్తామనే ఎన్నికల బరిలోకి దిగాయి.

    6ఇంతెందుకు – ఈ రోజు ఏ హైదరాబాదైతే ‘మాదే’ అంటూ తాజా చిచ్చు కారకులు గాండ్రిస్తున్నారో, సాక్షాత్తూ ఆ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక వాళ్లు తోక ముడిచిన వైనం సైతం నిన్నా మొన్నటిదే. ఇదీ – ‘ఉద్యమానికి నవ ఊపిరులూదిన పార్టీ’ భంగ చరిత్ర, తెలంగాణలో వాళ్లకున్న అసలైన బలం. తమ బలం సన్నగిల్లటం చూసి కలవరపడి, ఆఖరి యత్నంగా వేర్పాటువాదులు విసిరిన పాచిక – విభజించి పాలించటం. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పనులు చక్కబెట్టుకోవటం వీళ్ల తాజా తంత్రం. వీళ్లకి తోడు విద్యార్ధులని రెచ్చగొట్టే ప్రొఫెసర్లూ, మేధావుల ముసుగులోని వామపక్ష తీవ్రవాదుల సానుభూతిపరులూ. తరాలుగా సాగుతున్న ఉద్యమం అంటూ అమాయకులని మభ్యపెట్టటానికి వీళ్లు కలసికట్టుగా ప్రచారం చేస్తున్న అబద్ధమే ఉద్యమ చరిత్రకి సంబంధించిన కాకి లెక్కలు.

    > Done! KCR డౌన్ డౌన్! తెలంగాణా రాష్ట్రం ఇచ్చేది కెసిఆర్ అయిన, లగడపాటి అయిన, లేక ‘Italy’ సోనియా అయిన మాకు ఒక్కటే.

    > KCR మమ్మల్ని తెలంగాణా ఓటు బ్యాంకుగా ఎలా వాడకున్నాడో అలాగే తెలంగాణా రాష్ట్ర అవతరణ కోసం మేము ఆయన్ని అలాగే వాడుకుంటున్నాం. రెండో రోజే KCR అన్నం తినడానికి తయార్ అయితే నడ్డి వంచి దీక్షకు కూచో బెట్టింది మేమే అన్న సంగతి మరవద్దు . ఇంతకి సమైఖ్య వాదులు సమైఖ్య రాష్ట్రాని ఎందుకు కోరుకుంటున్నారో మీ మేధావి బుర్రకి తట్టే ఉంటుంది.

    >కెసిఆర్, తెలంగాణా మా దృష్టిలో రెండు పూర్తిగా వేరు వేరు అంశాలు.

    6వేర్పాటువాదులు చెబుతున్నట్లు తెలంగాణ ఉద్యమానికి దశాబ్దాల చరిత్రే ఉందని ఒప్పుకున్నా- అసాధ్యమైన లక్ష్యాల కోసం ఏళ్లూ పూళ్లూ ఏకధాటి ఉద్యమాలు నడిపే బదులు, వీళ్లు పదే పదే ప్రస్తావించే పెద్ద మనుషుల ఒప్పందం, 610 జీవోల అమలు గురించి ఆ స్థాయిలో ఉద్యమాలు చేపడితే ఎవరొద్దంటారు? వాటి కోసం ఈ మహానుభావులు ఎప్పుడన్నా కనీసం ఉత్తుత్తి దీక్షలన్నా చేశారా? వీళ్లకి కావలసింది సమస్యలు తీరటం కాదు – అవి నిక్షేపంగా కొనసాగటం. తమ స్వార్ధాల కోసం ఉన్న సమస్యల్ని ఎక్కువ చేసి చూపటానికీ, కొత్త సమస్యలు సృష్టించటానికీ వీళ్లు తయార్. ఒకవేళ తెలంగాణ విడిపడ్డా ఈ రాబందుల రెక్కల చప్పుడు కిందే మనవలసి ఉంటే – వేరయినా ఒరిగేదేమిటి? అర్ధం చేసుకోవటానికదో బ్రహ్మ రహస్యం కాదు. దానిక్కావలసిందల్లా వాస్తవాలని స్వీకరించే గుణం. అది మీకుందా?

    > సరే ఈ రాజకీయ నక్కల్ని కొంచెం సేపు పక్కకు పెడదాం. ఈ ఒప్పందాల గురించి, GO గురించి ఎన్నో సార్లు , ఎందరో సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు తమ తమ రీతిలో తమ స్థాయికి తగ్గట్టు నిరసనలు వ్యక్తం చేసారు.

    > మా దగ్గర రెండు choice లు ఉన్నాయ్.

    ౧. ఆంధ్ర రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు కింద మనవలసి ఉండడం.

    ౨. తెలంగాణా రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు కింద మనవలసి ఉండడం.

    మేము రెండవ ఛాయస్ కే మొగ్గు చూపుతం, ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం లో Constitutional safeguards ఉంటై. అలాగే మా వనరుల పైన మాకు కూడా హక్కు ఉంటుంది. దీంతో పాటు బచావత్ త్రిబునల్ ద్వారా కృష్ణ జలాలు, అంతర్ రాష్ట్ర నదీ జలాల పంపిణి ప్రకారం గోదావరి జలాలు, ప్లానింగ్ కమీషన్ మరియు ఫైనాన్స్ కమీషన్ (ఆర్టికల్ 380) ద్వారా రాష్ట్రానికి నిధులు అందుతాయి.

    >మా నుడికారం అన్నా, మా వ్యవహార శైలి అన్నా, మా సంస్కృతి అన్నా మీకు చులకన భావమే. ఈ చులకన భావమే లేకుంటే తెలుగు పాఠ్య పుస్తకాల్లో అట్లతద్దెతో పాటు మా బతుకమ్మ పండుగ, సమ్మక్క-సారలక్క పండుగలు కూడా స్థలం దక్కి౦చుకునెవి. వాస్తవానికి తెలంగాణా సమస్య ఒక్క వెనుకబాటుతన౦తొనె ముడిపడి లేదు, ఇది మా ఆత్మ గౌరవ సమస్య కూడా.

    తెలంగాణా ఒక ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, రాజ్యాంగ సమస్య (మీ అచ్చ తెలుగు లో ‘సినిమా’).

    >మీరు దోచుకునే కృష్ణ, గోదావరి జలాలు గాని, ఎగ తన్నుకు పోయిన ఉద్యోగాలు గాని(ముల్కి రూల్స్) ,మీకు ఏ ఉద్యమం చేస్తే వచ్చాయి? మీ పెట్టుబడులన్నీ ఉద్యమం చేసే పెట్టారా? మీకు న్యాయంగా రావలసిన వాటాలన్నికూడా ఉద్యమం చేసే తెచ్చుకున్నారా? అలాంటప్పుడు మాకు న్యాయంగా, రాజ్యాంగ పరంగా ఒప్పందాల పరంగా, GO ల పరంగా, రాష్ట్రపతి ఉత్తర్వుల పరంగా రావాల్సిన ప్రతి వాటా, ప్రతి హాక్కు ఉద్యమం చేసే తీసుకోవాలా???? మీకో న్యాయం మాకో న్యాయమా???

    ఈ “సమైఖ్య” రాష్ట్రం లో మాకు న్యాయంగా దక్కవలసిన హక్కుల కోసం, వాటాల కోసం, రోజు ఉద్యమించే దౌర్భాగ్యం పట్టింది. ఉద్యమం ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో కూడా చెప్పించు కునే దౌర్భాగ్యము పట్టింది.

    ఇది అర్ధం చేసుకోవటానికదో బ్రహ్మ రహస్యం కాదు. దానిక్కావలసిందల్లా వాస్తవాలని స్వీకరించే గుణం. బావి లోంచి బయటకి రావడం , అది మీకుందనే అనుకుంట.

    • 33 sreenu 11:30 సా. వద్ద జనవరి 10, 2010

      okkamata nijam? dopidi anedi nonsense…,dopidi ki pratipadika emito, pettubadulu pettadama, sthalalu konukovadama, evaru konnapudu sthalalu cheapgane vastai, taruvata rate periginidi, cheap konnaru ani ediste, aa lekkana kosta, rayalasemma tho poliste national and international projects anni hyderbadki kada vachhindi, evadanna kosta, seema vadu adigadaa…., akkada enduku pedutunnaru ani…, endukunte mana hyderabad lo vachhindi.., ani feeling, naku telsi kosta, seemallo vunna vallu andaraki ye problem ledu .. endukani… ippatai daka hyderabad manadi anukonnaru kabatti.., anduke pettubadulu pettaru., sthalalu konnaru, ippudu suddenga idi madi, meru dopidi darulu ante…, elaga kuduridi…, sare deeniki solution nenu cheptanu…., no doubt vidipovadame correct……… kakapote oka 5 years aagandi….

      1. Appataki prati andhra vadu evadi dabbulu vadu tesukuveltadu.., prashantamga…, evadu pettubadulu pettadu.., appudu njoy…

      2. Atleast ee lopala konni international projects anna kosta, seema ki tesukurandi babu.., vallu nalukulu kostaru, rodla meda addamga godalu kadataru….

      3.Monna KCR gari daughter interview choosanu” kavita garidi” — avida edupu ento aardam kaledu, GMR company vallu airport labour kinda telangana vallani petuuukonnaru anta.., edichinattlu undi, andhra lo kadithe andhra vallani pettukontanduu.., tamil nadu lo pedite tamil nadu vallani pettukontadu….. em matladuthunnaro emo…., counterlo kurchoni nirnayam chese adhikaram kavalanta….,adi andhra vadiki, kosta vadiki freega vastunnatlu…

      4. Andarau na mata vinandi… okati matram nijam ee godavalu challaravu.., andukani prashantamga evadi pettubadulu vallu tesukelli evadi vullalo vadu pettukondi….

      5. Ikkada even IITB lo hyderabadlo job ra ante ma friends bayapadutunnaru.., em vuru ra babu…. ani

      6. Asalu osmanialo vunnavallani students ani evadu anandu, general ga.. naku telsi, anta josh cinemalo unde panipata leni batch…

      7. Idanta na edupu.., babu babu, pratyeka telgana vadulu andaru ee lane oka 5 years me protest continue cheyanidi…, prashantamga hyderbad enduku panikirakunda potundi…,okka it company kuda vundadu…., andhra vadu , seema vadu andaru vellipotaru… appudu malli meru specailaga separate medak, vudyamam, separate karimnagar vudyamam start cheyandi…, kadu kadu inko mandubabu start chestadu.., avunu mari ante kada..
      TELANGANA vaste anni oke sari abhivruddi jarigi potya…, ledu kada. koddiga adilabad lo takkuvagarigite.. nonsense pratyeka adilabad kavali voch…………..

    • 34 sri 11:12 ఉద. వద్ద జనవరి 11, 2010

      Dear Mahesh Kalal,
      My intuition tells that there will be no telangana at all especially considering the current state of our politicians and their selfish motives.

      By the way, you have written so much regarding someone cheating telangana area.

      I am born and brought up in telangana and never been to non-telangana area for more than 1 or 2 days and that too, once or twice. Infact, I am more interested in my COUNTRY getting developed, than anything else.

      I HAVE A VERY SIMPLE QUESTION TO YOU.

      Will you take up responsibility (with your life as a stake) if Telangana area is not developed by current politicians after the state is formed?

      Since splitting a state is anticipated to having both negative and positives, will you give up your life if the anticipated positives(in this case, its development of telangana area) doesnot take place or doesnot happen?

      If those who talk for telangana state doesnot take the responsibility for their actions, then, they donot have the right to ask for it. Period.

      Since there are no such responsible people or politicians in current telangana movement, State of telangana will not be granted.

    • 35 Manipal Reddy 5:10 ఉద. వద్ద జనవరి 17, 2010

      Anna ee nijaalu veellaki eppatiki artham kaavu…veeella nara narallo talangana valla meeda dvesham undi. They are supporting United Andhra not to stay united and not really from heart. Ekkada telangana vasthe maa aasthulu vaudulukoni povalo ani bayamu thappa maremi ledu.telangana state vasthe vallaku neellu karavu vasthadi ani valla bayam. This is just adipathya dorani matrame….otami ni angeekarinchaleni gunam idi. Anduke inni prayatnalu. Ippudu telangana ku against ga inni matalu mtlade okka koduku kuda..gatha 50yrs lo okka naadu guda United Andhra ani erugaru. Antha swartham. tappu andra prajaladi kadu….. endukante vidipothe vallakocche nastam ledu. Annadammulu vidipovadam telanganathone modalayyindi annattuga falthu matalu matladuthunnaru. Intha kullu ni kadupulo pettukoni vallu ela angeekaristaru cheppu.

      But you have done your best.

  22. 36 అబ్రకదబ్ర 2:46 సా. వద్ద జనవరి 8, 2010

    >> “ప్రజల ఆకాంక్షల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమైతే 1972 లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం నాయకుల అవసరాలు తీరగానే ఎందుకు సద్దుమణిగింది? ఇది సమైఖ్య వాదులు వాళ్లకు వాళ్ళు వేసుకోవలసిన ప్రశ్న”

    దీనికి సమాధానం నా టపాలోనే ఉంది. గమనించకపోతే, ఇదిగో అది: “‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టే ఆలోచనలు ప్రజల్లోంచి పుట్టుకొచ్చినవి కావు – ఎవరి లెక్కలు వాళ్లేసుకునే కొందరి మస్తిష్కాల్లోంచి మొలుచుకొచ్చినవి. కాబట్టే అవి ఎంత హఠాత్తుగా పుట్టాయో అంత హఠాత్తుగానూ పడకేశాయి”

    విభజన ఉద్యమాల మీద నా అభిప్రాయం అది – అది ఏ ప్రాంతం గురించైనా నాది అదే మాట. మీరడిగిన చాలా ప్రశ్నలకి సమాధానమూ ఆ ముక్కలోనే ఉంది. మళ్లీ వివరించే ఓపిక నాకు లేదు. నాది ‘అహంభావం’ అని ఎటూ అనేశారు కాబట్టి ‘ఓపిక = అవసరం’ అని మీరు అర్ధం చేసుకున్నా ఫరవాలేదు.

    బైదవే, ‘ఇడ్లీ సాంబార్ ఉద్యమం’ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుని మళ్లీ రండి. స్లోగన్‌కీ, ఉద్యమానికీ తేడా ఏంటో తెలుసుకుంటే మంచిది 🙂

  23. 37 KumarN 12:15 ఉద. వద్ద జనవరి 9, 2010

    మహేశ్ కలాల్ గారు,

    నా మట్టుకు నేను సమైక్య వాదినే అయినప్పటికీ, మీరిక్కడ ఇచ్చిన కొన్ని replies were impressive. pretty good job. కొంత మంది సమైక్య వాదులు తెలంగాణలో పుట్టి పెరగడం అంటే ఏంటో తెలీదు కాబట్టి, ఎమోషన్స్ మూలం ఎక్కడుందో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించకుండ ఉండడం వల్ల, వాళ్ళ టోన్స్ లో అవహేళన పాలు ఎక్కువై, అది పరిస్థితికి ఇంకొంచెం ఫ్యూయల్ యాడ్ చేస్తోంది. మరి కొంత మంది సమైక్య వాదులకి నిజంగా కూడా కొవ్వెక్కువ. They need to be answered with a fitting reply.

    అందరూ ఏదో రెటరిక్ కోసం కాకుండా, కొన్ని పాయింట్లతో డిబేట్ చేసుకుంటే, un-informed readers ki, కేవలం ఎమోషన్స్ తో అటో ఇటో మొగ్గు చూపకుండా, కొంచెం informed opinions ఏర్పర్చుకోవడానికి అవకాశం ఉంది. What is happening here is good.

    అయితే ఒక రెటరిక్ నాకెప్పుడూ అర్ధం కానిది, నిజం లేకుండా ఊరికే జనాల్ని ఎగదోసె స్లొగన్ ఏంటంటే ..ఆంధ్రా వాళ్ళు దోపిడీ దారులు, వాళ్ళు మనదంతా దోచుకొనెళ్ళిపోయారు. ఎందుకండీ ఆ మాటలన్నీ. ..నేను తెలంగాణలో పుట్టి పెరిగి నా రిలేటివ్స్ అంతా కూడా తెలంగాణ లోని 2,3 జిల్లాల్లో ఉన్నవాళ్ళే. తెలంగాణ బాధలేంటో చిన్నప్పటి నుంచీ నేను, నా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు అనుభవించిన వాళ్ళే. కాని నాకెప్పుడూ కూడా ఆ పరిస్థితులకి ఆంధ్రా దాఖలాలే కనపడలేదు. నేను చెప్పేది కోర్ విలేజెస్ గురించి చెపుతున్నా..గోదావరి బార్డర్స్ లోని తెలంగాణ ఊళ్ళ గురించి నాకంత తెలీదు. అక్కడ ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువని నాకు తెలుసు కాని మరి దోపిడి ఏమయిన ఉందేమో తెలీదు నాకు.

    All in all, ప్రత్యేక తెలంగాణ వల్ల ఏమీ ఒరుగుతుందని నేను అనుకోవట్లేదు, పైగా, తెలంగాణ నేల మీద పాలు తాగి పెరిగిన మనిషిగా (హ్మ్మ్.. మా ఊర్లో పాలే సరిగ్గా దొరికేవి కాదు, ఘడీ లకి బోతే కొంచం బోసెటోళ్ళు దొరలు. ఇంక పెరుగంటెనే ఎర్క లేదాయె మాకు, మంచి చల్ల దొర్కుడే ఎక్వ మా ఊల్లే). ఐ డిగ్రెస్.

    నాకు తెలిసినంత వరకీ, నా అనుభవాల ద్వారా, నా మేధ కి అందినంత వరకీ నేనకుంటున్నది మాత్రం, తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రం వల్ల వచ్చే లాభాల కన్నా, నష్టాలే ఎక్కువ కొనితెచ్చుకుంటారని నేను గాఢంగా నమ్ముతున్నాను.

  24. 38 అబ్రకదబ్ర 12:32 సా. వద్ద జనవరి 9, 2010

    @కుమార్N:

    రిప్లై ఎంత పొడుగ్గా ఉంటే అంత ఫిటింగా 😉

    మహేష్ కలాల్ గారి వ్యాఖ్య వివరంగా ఉంది – సత్యాలు, అసత్యాలు, కొన్ని అర్ధ సత్యాల కలగాపులగంగా. వేర్పాటువాదులు ఏళ్లుగా ప్రచారం చేస్తున్న విషయాలనే మరోమారు వల్లెవేయటం తప్ప, ఆయన కొత్తగా చెప్పిందేమిటి ఇక్కడ?

    తెలంగాణకి అన్యాయం జరిగిందా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశమే కాదు. అన్యాయాలనేవి అన్ని ప్రాంతాలకీ అంతో ఇంతో జరిగాయి, ఇక ముందూ జరుగుతూనే ఉంటాయి. ఎవరికి ఎక్కువ జరిగిందనే విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. వాటికి పక్కవారిని నిందించటం, అన్యాయాల వంకతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టటం ఎంతవరకూ సబబు? (Ofcourse, ఈ ప్రశ్నకి మీ సమాధానం అడగటం లేదు. అదేమిటో మీ వ్యాఖ్యలో ఆల్రెడీ ఉంది)

    విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్న అబద్ధాల్ని అడ్డుకోటానికి నేనీ టపాలు రాస్తున్నానని ముందే చెప్పాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర అసలు వయసెంత అనే విషయమ్మీద ప్రస్తుత టపా ఉంటే, మహేష్ కలాల్ గారు అందులో నేనడిగిన ప్రశ్నలు వదిలేసి తెలంగాణకి అన్యాయం జరగలేదా, పెద్ద మనుషుల ఒప్పందం అమలయిందా, ఆంధ్రావాళ్లు ఇంకెన్నేళ్లు దోపిడీ చేస్తారు, అప్పుడేమైంది సమైక్య వాదం, పొట్టి శ్రీరాములు తెలంగాణ కోసం దీక్ష చేశాడా, ఇడ్లీ సాంబార్ ఉద్యమం గురించి తెలుసా (దీని గురించి మహేష్ గారికి ఏమీ తెలీదని మాత్రం నాకు తెలిసింది) వగైరా ప్రశ్నలతో చర్చని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బోనస్‌గా అహంభావులు, హిట్లర్‌లు, బావిలో కప్పలు వగైరా బిరుదులు!

    మహేష్ గారి సుదీర్ఘ వ్యాఖ్యలో నా టపాకి సంబంధించినది ఒకే విషయం ఉంది. ‘భారత స్వతంత్రోద్యమం కూడా తొంభయ్యేళ్ల పైగా పడుతూ లేస్తూనే సాగింది. అంత మాత్రాన అది ఉద్యమ కాకుండా పోయిందా?’ అని ఆయనడిగారు.

    అర్ధం లేని పోలిక అది. అలాగైతే నేనూ కాశ్మీర్ విమోచనోద్యమంతో తెలంగాణ ఉద్యమానికి పోలిక పెట్టగలను. అరవయ్యేళ్లుగా అడుగుతున్నారని కాశ్మీర్‌కి స్వతంత్రం ఇచ్చేయాలంటారా?

  25. 41 KumarN 5:43 సా. వద్ద జనవరి 9, 2010

    అబ్రకదబ్ర:
    భలే వాళ్ళే, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు :-). మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోలేదు నేను. మీరు అక్కడక్కడా కనపరిచే పరిమతమైన అహం(ఆ పదం కరక్టు కాదు, మీకు అంత స్ట్రాంగ్ పదం సరైనది కాదు అని నాకు తెలుసు, కాని సమయానికి తట్టట్లేదు మంచి పదం) ప్రదర్శించే సందర్భాలు ఈ విషయంలో లేవు లెండి. కాపోతే మీరూ అందరి లాగే సెలక్టివ్ ఆబ్జక్టివిటీ ప్రదర్శిస్తారు, కానీ అందరికన్నా ఎక్కువ ఆబ్జక్టివ్ అన్నట్లుగా ఉంటుంది మీ టోన్, విచ్ ఐ ఆల్వేస్ ఫైండ్ అమ్యూసింగ్….. అయిపోయిందా.. రాసేసానా 🙂 ఇదేదో మీకూ, నాకూ గొడవ కింద తయారయ్యేట్లుగా ఉంది. నోరు ఊరుకోదు నాకు. సారీ.

    లెట్ మీ కం బాక్ టు ద టాపిక్ హియర్. నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను ఆంధ్ర ప్రదేశ్ విడిపోకూడదు..అదేదో సెంటిమెంట్స్ రీజన్స్ వల్ల కాదు.. ప్రతేక రాష్ట్రం వల్ల వచ్చే నష్టం తెలంగాణ కి చాలా రెట్లు ఎక్కువ..(ఈ తెచ్చి పెట్టుకున్న ఆత్మ గౌరవం, ఇలాంటి సొల్లు పదాల గారడీ లాభాలు వదిలేస్తే).

    బ్లాగుల్లో కొంతమంది సమైక్యవాదులు, ఈ తెలంగాణ కావాలని అడిగేవాళ్ళని కొన్ని రిపీటెడ్ ప్రశ్నలు అడుగుతుంటారు..అవ్వెలాగూ సమాధానల్లేని ప్రశ్నలు. అందుకని మొత్తం తెలంగాణ వాళ్ళని, వాళ్ళ నిబద్దతనీ, ఇంకొందరు శ్రుతి మించి వాళ్ళ ఆహార్యాన్ని, యాసనీ, వాళ్ళ లేనితనంలోంచి వచ్చిన కొంచెం ఇరుకు బుద్దినీ(యెస్ ఐ మీన్ ఇట్), వీళ్ళేదో స్వర్గం లోంచి ఊడిపడ్డట్లుగా చులకన చూపు చేసి మాట్లాడుతుంటారు. ఇంకో వయసు మాత్రమే మీద పడిన పెద్దాయన తెలంగాణ యాస తెలుగు లో కలిస్తే అమృతం లో విషం కలసి నట్లుగా..ఆర్ అలాంటిదేదో సెలవిచ్చారు ఇక్కడ బ్లాగుల్లో.
    పెద్దాయన కదా..ఏమీ అనకుండా వదిలేస్తే మనకీ మర్యాద.

    ఇహ తెలంగాణ వాదులు…., బయట నాకింకా ఒక్కరు కూడా తగల్లేదు(నాకున్న స్నేహితుల్లో 90+% ఆంధ్రా ప్రాతం వాళ్ళు కాబట్టనుకుంటా) కాని, బ్లాగుల్లో మాత్రం కండ కావరం ఎక్కి, సిగ్గూ ఎగ్గూ లేకుండా తెలంగాణ వాదం, ఆత్మ గౌరవం, ఇంకేదో పిండాకూడు వాదాలన్నీ కలపి, రౌడియిజం(యెస్) ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రా వాళ్ళంతా సిగ్గులేకుండా హైదరాబాదులో, మేం పొమ్మన్న పోకుండా ఇంకా ఎందుకుంటున్నరూ అంటా.. వీళ్ళబ్బ..ఒక్కొక్కన్నీ బయటకు లాగి మక్కెలిరగతంతే సరి. ఆంధ్రా వాళ్ళు మమ్మల్ని జోకర్లు లాగానూ, మా వేష భాషల్నీ చులకన చేసి స్టీరియో టైప్ లో పడేస్తున్నరు అని అరిచే మహానుభావులు , వాళ్ళు చేసే అవహేళన కన్నా వీళ్ళిప్పుడు చేస్తున్న రౌడీగిరి, రుబాబు, బద్మాష్ తనం అంతకన్నా ఎక్కువని తెలీదా ఈ సన్నాసులకి. బ్లాగుల్లోనే “స్వీయ హేతువు” ని మాత్రమే నమ్ముకునే ఇంకొకాయన విద్యార్ధులంతా అరుస్తున్నారు కాబట్టి, “జై విద్యార్ధి ఉద్యమం, జై తెలంగాణ” అంటా. నవ్వాపుకోలేక చచ్చా.

    మహేశ్ కలాల్ గారు.. మాకున్న రెండు చాయిస్ లల్లో అవసరమయితే మేం తెలంగాణ బాస్ లనే ప్రిఫర్ చేస్తాం, ఇప్పుడున్న ఆంధ్రా బాస్ లని కాదు అని కూడా ఏదో అన్నట్లున్నారు. కాని మహేశ్ గారూ..అసలు ఆ ప్రిన్సిపుల్ కు ఉన్న ప్రిమిసే తప్పని నేనకుంటాను. ఆంధ్రా వాళ్ళు బాస్ లని నేను అనుకోవట్లేదు. యెస్ దే ఆర్ అహెడ్ ఇన్ మేనీ ఫ్రంట్స్, బట్ దే ఆర్ నాట్ బాసెస్. అస్సల్లీ “us” అండ్ “them” భాషే చిరాగ్గా ఉంది నాకు. వ్యాఖ్య పెద్దదయి పోతుంది కాని, ప్రత్యేక తెలంగాణ వస్తే, నక్సలైట్లు రాజ్యం మొత్తాన్ని వాళ్ళ కంట్రొల్ లోకి తీసుకుంటారని నా పంచ ప్రాణాల సాక్షిగా చెప్తున్నాను మిత్రమా. అంత గ్యారంటీ ఏంటీ అంటారా. నేను నక్సలైట్లతో పాటూ పెరిగా. ప్రతి ఇంట్లోంచి నక్సలైటు ఉన్న గ్రామంలో నేను ఆరవ తర్గతి వరకీ బస్సు సౌకర్యం కూడా లేని గ్రామం లో పెరిగా.. వాళ్ళంటే అభిమాన పడ్డా..వాళ్ళతో తిరిగా..ఆ సాహిత్యం బాగా వంట పట్టించుకున్నా. వాళ్ళ మోడస్ ఆపరాండీస్ అన్నీ దగ్గర్నించీ చూసా..కొన్నిట్లో సహాయం చేసా.. వాళ్ళకి ఎవరు “prey” ఎవరో నాకు బాగా తెలుసు. నాకు తల్చుకుంటూనే భయం, తెలంగాణ మళ్ళీ ఎన్ని దశాబ్ధాల వెనక్కి వెళ్ళిపోతుందేమోనని. పోయిన వారం మొట్ట మొదటి సారిగా గుడి కెళ్ళి మరీ మొక్కుకున్నా..భగవంతుడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాత్రం రాకూడదు ఎట్టి పరిస్తితుల్లో అని. Now that Telanga has made it’s point loud and clear, why don’t we press the leaders and get some tangible things out from them. It could be a huge special package deal or any other thing where we think that Telangana needs special assistance to have level playing field with any other geographical region .

    పొడుగాటి వ్యాఖ్యకి సారీ అబ్రకదబ్ర గారూ. నేను తెలుగు టివి ని ఇండియా వెళ్ళినప్పుడు తప్పితే, అమెరికా లో ఎప్పుడూ చూడలేదు. అందుకని ఎ పి గాసిప్స్, పాలిటిక్స్ గురించి వినడమే తప్ప, మాట్లడలేని స్తితిలో ఉండేవాణ్ణి. ఒక మూడు వారాల క్రితం అది మారింది. ఆంధ్ర జ్యోతి వెబ్ సైట్ లో డైరక్టుగా వస్తూంటే హాలిడేసే కదా అని ఒక రెండు వారాలు బాగా చూసాను. అదెంత పొరపాటో నాకిప్పుడు బాగా తెలిసొస్తోంది. I will go back to my little hole 🙂

  26. 42 KumarN 5:53 సా. వద్ద జనవరి 9, 2010

    How do I edit a vyaaKya after I posted it. There were some problems in cut and paste in the areas where English text followed the Telugu text.

    • 43 అబ్రకదబ్ర 7:52 సా. వద్ద జనవరి 9, 2010

      Unfortunately, WordPress doesn’t provide that option. అయినా మీ వ్యాఖ్య స్పష్టంగానే ఉందిగా. సరి చెయ్యాల్సింది నాకేమీ కనపడలేదు.

      మీరన్నదాని గురించి నేనేమీ భుజాలు తడుముకోటం లేదు. కన్నుగొట్టే స్మైలీ పెట్టింది అలా అపార్ధం చేస్కోకూడదనే కదా 🙂 మీరు, మహేష్ కలాల్, వీజే లాంటి వాళ్లతో సంవాదం చొక్కాలు పట్టుకునేవరకూ వెళ్లదులెండి – హద్దులు మీరి మాట్లాడరు కాబట్టి.

  27. 45 Vasu 7:01 సా. వద్ద జనవరి 11, 2010

    అబ్రకదబ్ర గారూ,

    చాలా విశ్లేషనాత్మకంగా ఉంది మీ సిరీస్. ఈ పాయింట్స్ తో ఒక వీడియో ఆంగ్లం లో చేస్తే బావుంటుందని పిస్తోంది. ఇంకా ఎక్కువ మంది, నిజానిజాలు తెలుస్కోడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇది ఆంగ్లం లో కూడా రాసి ఉన్నా, లేక ఏదన్నా విడియో చేసినా లంకె ఇవ్వగలరు. లేకపోతే, మీరు అనుమతిస్తే , చెయ్యడానికి నేను సహకరిస్తాను

  28. 46 అబ్రకదబ్ర 7:07 సా. వద్ద జనవరి 11, 2010

    అనుమతులేమీ అవసరం లేదు. మీరు ఆంగ్లానువాదం చెయ్యాలనుకుంటే చేసేయండి 🙂 సమయాభావం వల్ల నేనా పని చెయ్యలేను.

  29. 47 krishna 1:06 సా. వద్ద జనవరి 16, 2010

    abracadabra garu
    sorry to say u sound lil bit inclined to samaikya vadam?
    there s no balanced view about this struggle (?)
    one thing i want to ask mr. mahesh is that what does he mean by “dopidi?”
    i have not done any dopidi but my relatives were attacked.
    as far as seperate statehood is concerned , in MP, UP and bihar natuarl resources were taken 4m one area and profits were given to another. that may be DOPIDI?
    but investing money cant be DOPIDI?
    the total share of central aid to telanagana is much more than seema n andhra?
    same if it divides into another state.
    but telangana dont have any natural resources like jharkand, chattishghar or uttaranchal?
    how it will be more fruitful to be seperated?
    mahesh ji plz explain?

  30. 48 Shyam 5:24 సా. వద్ద జనవరి 20, 2010

    You are completely against the Telangana and I recommend you to open up ur mind and gain all the facts before you post anything. Otherwise, its really difficult to cope up. Why are you so narrow on ur thoughts. Why can’t you understand the problems of Telanagana people. If all the people are given equality and development, then there should not be any issues like this. But, anyway, you are a great lier and try to imbibe plots in between people of AP. Don’t think that u are too smart. Fisrt accept the truth and read material. Try to behave a unbiased human being.

    • 49 అబ్రకదబ్ర 5:43 సా. వద్ద జనవరి 20, 2010

      >> “You are completely against the Telangana”

      Wrong. What’s damn right is – I am dead against T separatists.

      >> “Why can’t you understand the problems of Telanagana people”

      I do. What did my post say anything against their problems, or them for that matter? I think you don’t understand Telugu that well.

      >> “But, anyway, you are a great lier and try to imbibe plots in between people of AP”

      Is that so? The last I checked, ‘unity’ still meant keeping people together and ‘separation’ meant exactly the opposite.

      If you believe that the separatists are fighting to keep AP together and ‘evil lying folk’ like me are busy tossing up ideas to split the inhabitants of AP with their unity chants … that’s the biggest joke one’s heard in recent times.


Leave a reply to అబ్రకదబ్ర స్పందనను రద్దుచేయి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,984

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.