ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 1

ప్రాంతీయ అసమానతల నెపంతో విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు జాతిని రెండుగా చీల్చి పబ్బం గడుపుకోజూస్తున్న దొంగ నాయకుల పన్నాగాలకు నేడు ఆంధ్రప్రదేశ్ బలిపీఠమ్మీద నిలబడి బెదురు చూపులు చూస్తుంది. ‘ఆంధ్రావాలే భాగో’ దగ్గర మొదలై ‘మాకెదురాడిన వారి నాలుకలు తెగ్గోస్తాం’ అనేదాకా, ఓ పార్లమెంటు సభ్యుడి తలకే వెలకట్టే దాకా, ‘రాజధాని నుండి ముప్పై లక్షల మంది ఆంధ్రా ప్రాంతీయులని పారదోలతాం’, ‘సంక్రాంతికి ఊర్లకి వెళ్లినవారిని తిరిగి రానీయం’ అంటూ పెట్రేగిపోయేదాకా వచ్చింది వేర్పాటువాదుల విచ్చలవిడితనం. ఆ క్రమంలో వాళ్లు తెలంగాణ తాలిబాన్లుగా రూపాంతరం చెంది హైదరాబాదులో సాగించిన, సాగిస్తున్న అరాచకం తాజా పరిణామం. స్వకార్యాలు చక్కబెట్టుకునే దురాలోచనతో ‘ఆంధ్రోళ్లు దోపిడీదార్లు’ అంటూ విద్యార్ధుల ముసుగులోని తెలబాన్లు, మేధావుల పేరుతో వారిని రెచ్చగొడుతున్న ప్రబుద్ధులూ, వీరందరి వెనకున్న రాజకీయ నాయకులూ సాగిస్తున్న దుష్ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వేర్పాటువాదుల దాడుల భయంతోనో, మరే ఇతర వ్యాపార కారణాలతోనో రాష్ట్రంలో మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం వేర్పాటువాదానికి ఊతమిచ్చే వార్తలకి ఇస్తున్న ప్రాధాన్యత వారు ప్రచారం చేస్తున్న అవాస్తవాలనీ, అబద్ధాలనీ ఎండగట్టటానికి ఇవ్వకపోవటం శోచనీయం. ఈ పరిస్థితుల్లో నిజానిజాల నిగ్గుదేల్చే బాధ్యత మనలాంటివారు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

‘తెలంగాణవాసులు అమాయకులు. అదే అలుసుగా ఆంధ్రోళ్లు వాళ్లని దోచుకుంటున్నారు’ అన్నది వేర్పాటువాదుల ప్రధాన ఆరోపణ. అందులో కొంత నిజముండకపోలేదు – తెలంగాణవాసుల అమాయకత్వం వరకూ. ఆ అమాయకత్వం మూలానే ఇంటి దొంగల మాటలు గుడ్డిగా నమ్మేసి సాటి తెలుగువారిపై అకారణ ద్వేషం పెంచుకుంటున్నారు ఎందరో తెలంగాణ ప్రజలు. అటువంటివారికి అసలు విషయాలు వివరించి వేర్పాటువాదుల గోబెల్స్ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటానికి ఉద్దేశించినది ఈ సుదీర్ఘ వ్యాసం. దీనికి ప్రేరణ విజయ్ కట్టా గారి ఆంగ్ల టపా (విజయ్ కట్టా టపాకి మూలాధారమైన అజ్ఞాత అభిమాని టపాలు ఇక్కడ)

గత దశాబ్దంలో వేర్పాటువాదులు విస్తారంగా ప్రచారంలోకి తీసుకొచ్చిన కొన్ని అబద్ధాలు, వాటికి సంబంధించిన అసలు నిజాలు – కింద. ఇవన్నీ చదవండి, మరో పదుగురితో చదివించండి. నిజమేమిటో అర్ధం చేసుకోండి, మరింతమందికి వివరించండి. ఆ పని చేయటానికి మీరు తెలంగాణవాసులా, కోస్తాంధ్రవాసులా లేక సీమవాసులా అన్నదానితో సంబంధం లేదు. మీ ప్రాంతమేదైనా, రాజకీయ రాబందుల స్వార్ద నాటకాలకి తెలుగుజాతి బలి కాకూడదని కోరుకునేవారైతే చాలు.

మరో మాట – ఈ వ్యాసం ఉద్దేశం వేర్పాటువాదుల ఆరోపణల అంతుచూడటం. ఇది రాష్ట్రం విడిపోవాలా వద్దా అన్నది తేల్చే వ్యాసం కాదు. తెలంగాణవాసులపై కోపతాపాలు వ్యక్తం చేసే ప్రయత్నం అసలే కాదు. వేర్పాటు పేరుతో ఉచితానుచితాలు మరిచి ఓ ప్రాంతంవారిపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే.  నా వ్యాసంలో పేర్కొనే విషయాలకి సంబంధించి ఏవైనా సవరణలు, వివరణలు ఉంటే ఆధారాలతో సహా తెలియజేస్తే తప్పులు దిద్దుకోవటానికి సిద్ధం. అంతకు మించి, దీనిపై జరిగే చర్చలో నేను పాల్గొనను. ఒకరినొకరు రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు రాయవద్దని మనవి. వ్యాఖ్యల్లో ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ వంటి నినాదాలు చేస్తే తొలగించబడతాయి.

ఒకటో అబద్ధం:

తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో 7 వెనకబడి ఉండగా, రాయలసీమ 4 జిల్లాల్లో 1 జిల్లా, కోస్తాంధ్ర 9 జిల్లాల్లో 3 మాత్రమే వెనకబడ్డాయి. వెనకబడ్డ జిల్లాలు తెలంగాణలో 70% కాగా రాయలసీమలో 25% మరియు కోస్తాంధ్రలో 33% మాత్రమే.

ఇదీ నిజం:

తెలంగాణ జిల్లాలు: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్. వీటిలో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వెనకబడ్డ జిల్లాల లెక్కలోకి రావు. నిజంగా వెనకపడ్డవి ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ మరియు మహబూబ్‌నగర్ మాత్రమే. అనగా నాలుగు జిల్లాలే. మిరి మిగిలిన మూడూ ఏవి?

రాయలసీమ జిల్లాలు: కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. వీటిలో చిత్తూరులో కొన్ని ప్రాంతాలూ, కడప జిల్లా పూర్తిగానూ వెనకబడ్డ ప్రాంతాలు. ఇక అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతం. వేర్పాటువాదుల లెక్కన మాత్రం రాయలసీమ మూడు జిల్లాల్లో జరిగేది రతనాల సాగే!

కోస్తాంధ్ర జిల్లాలు: నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. వీటిలో విజయనగరం, విశాఖపట్నం (వైజాగ్ సిటీ మినహాయించి), గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లా మొత్తం, గోదావరిలో మన్యం పాంతం, శ్రీకాకుళం జిల్లా మొత్తం, కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాలు. ఉన్న తొమ్మిది జిల్లాల్లో మూడు పూర్తిగానూ, మరో నాలుగు పాక్షికంగానూ వెనకబడే ఉండగా కోస్తాంధ్ర అభివృద్ధిని తట్టుకోలేక అల్లాడిపోతుందనేది వేర్పాటువాదుల ప్రచారం!

ఇక్కడ కనిపిస్తుందంతా – వెనకబాటుదనం పేరుతో వేర్పాటువాదులు నోటికొచ్చినట్లు చెబుతున్న అంకెలే. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో వెనకబడ్డ ప్రాంతాల శాతాలు ఎంతెంత? మీరే తేల్చుకోండి.

‘వెనకబాటుదనం’ గురించిన మరో ఆసక్తికరమైన విషయం. 2001 జనాభా లెక్కల ఆధారంగా రెండేళ్ల కిందట జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పదమూడు అసెంబ్లీ సీట్లు గల్లంతవగా తెలంగాణ ప్రాంతంలో (ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల) అవే సంఖ్యలో అసెంబ్లీ సీట్లు పెరిగాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి రాజధానికి వలసలు పెరిగిపోవటం దీనిక్కారణం. అభివృద్ధి ఉన్నచోటే అవకాశాలు అధికంగా ఉంటాయనీ, అవకాశాలున్న చోటికే వలసలు వెల్లువెత్తుతాయనీ అర్ధం చేసుకోటానికి అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టనవసరం లేదు.

రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి ఏదన్నా ఉందంటే అది తెలంగాణకి గుండెకాయ వంటి హైదరాబాదులోనూ, ఆ మహానగరం చుట్టుపక్కలా మాత్రమే కేంద్రీకృతమయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా నలభై రెండు మంది పార్లమెంటు సభ్యుల బలంతో గత యాభయ్యేళ్లలో కేంద్రం నుండి మంజూరు చేయించుకున్న ప్రాజెక్టులు, ఇతరత్రా మరెన్నో సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలోనే కుప్పపోయటం దీనిక్కారణం. వాటిలో కొన్ని: బిహెచ్ఇఎల్, ఈసీఐఎల్, ఎన్ఐఎన్, డిఆర్‌డివో ప్రయోగశాల, దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఎస్‌బి, రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ (వరంగల్), హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఈ జాబితాకి అంతులేదు.

‘హైదరాబాద్ యాభయ్యేళ్ల కిందటే అభివృద్ధి చెందిన ప్రాంతం, కొత్తగా వచ్చిన అభివృద్ధేమీ లేదక్కడ’ అనే మహానుభావులు ఉన్నారు. ‘1937 ప్రాంతంలో అప్పటి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా పేరొందాడు. ఇది చాలదా అప్పట్లోనే తెలంగాణ ఎంత సంపన్న ప్రాంతమో చెప్పటానికి’ అనేది తమ వితండవాదనకి సమర్ధనగా వారు చూపే హాస్యాస్పద కారణం. ఒక్కడి సంపద ఓ ప్రాంత సౌభాగ్యం మొత్తానికీ టోకు సూచికైతే అంతర్జాతీయంగా అపర కుబేరుల జాబితాలో పైస్థానాలు అలంకరించిన అంబానీలని చూపి భారత దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి అనాల్సిందే!

మరో పక్క – కోస్తాంధ్రలోనైనా, రాయలసీమలోనైనా గడచిన యాభయ్యేళ్లలో ప్రభుత్వం నెలకొల్పిన చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ ఒక్కటీ లేవు – కొనప్రాణంతో కొట్టుకులాడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మినహా. నౌకాశ్రయం ఉన్నదన్న కారణంతోనే ఆ ఒక్కటీ దక్కింది తప్ప; హైదరాబాద్ సముద్రం ఒడ్డున ఉండుంటే ఉక్కు ఫ్యాక్టరీ సైతం తెలంగాణలోనే నెలకొల్పబడేదనటం అతిశయోక్తి కాదు. రాష్ట్రానికి గుంటూరు విద్యాకేంద్రం, విజయవాడ వాణిజ్యకేంద్రం అనేవి ఒకప్పటి మాటలు. ఇప్పుడా రెండు హోదాలూ హైదరాబాదుకే దఖలు పడ్డాయి. ఏ అభివృద్ధికి సూచికలివి? అప్పటికీ ఇప్పటికీ కోస్తాంధ్ర వ్యవసాయాధారితమే. కొత్తగా వచ్చిన అభివృద్ధేమిటి? ఓ ఏడాది వరదలకి అతలాకుతలమైనా, మరుసటేడాది నీళ్లు లేక పంటలు ఎండిపోయినా కోస్తాంధ్ర రైతులు కన్నీళ్లు దిగమింగారే తప్ప వేర్పాటువాద పల్లవందుకోలేదే. రమారమి వెయ్యి కిలోమీటర్ల పొడుగున దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతమున్నా, అంతర్జాతీయ జలాలకి అతి సమీపంలో ఉండి నౌకా రవాణాకి అత్యంత అనువుగా ఉన్నా కోస్తాంధ్ర ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి ఓడరేవులెన్ని? ఈ విషయంలో గుజరాత్‌తో పోటీ పడాల్సిన తమ ప్రాంతం అంతగా వెనకబడిపోటానికి ‘పాలకులు హైదరాబాదుపైనా, దాని పరిసర తెలంగాణ ప్రాంతాల పైనా చూపిన ప్రేమ తమపై చూపకపోవటమే కారణం’ అంటూ కోస్తాంధ్రవాసులు విడిపోతామనలేదేం? ఇక రాయలసీమ – రాష్ట్రానికి అత్యధిక కాలం ఇక్కడివారే ముఖ్యమంత్రులుగా వెలిగిపోయినా ఈ ప్రాంతం యాభయ్యేళ్లుగా రాళ్ల సీమే, బీళ్ల సీమే. మరి పౌరుషాల సీమ ప్రజ తమ నిర్భాగ్యానికి పొరుగువారిని నిందించటం లేదే.

కల్లబొల్లి కబుర్లోపక్క, కళ్లెదురుగా ఉన్న నిజాలో పక్క. ఆలోచించండి – గత అర్ధ శతాబ్దిలో ఏ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో.

(సశేషం)

41 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 1”


 1. 1 Pradeep 6:08 సా. వద్ద జనవరి 4, 2010

  Good one … it will be useful for those who want to think … if they are really thinking the situation will be much different … we might not need this post … this is all like mass hysteria … either in Seema-andhra / Telangana …

 2. 2 Praveen Sarma 8:04 సా. వద్ద జనవరి 4, 2010

  కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలు వెనుకబడే ఉన్నాయన్న నిజాన్ని తెలంగాణావాదులు కాదనలేదు. తెలంగాణావాళ్ళు చెప్పని విషయాలని చెప్పినట్టు ఆరోపించడం తెలంగాణా పై ద్వేషం కాదా? విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించదు. శ్రీకాకుళం జిల్లాలో 1600 గ్రామాలు ఉండగా, అందులో 300 గ్రామాలకి బస్సు సౌకర్యం లేదు. విశాఖపట్నం జిల్లాలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు 1100 ఉన్నాయి. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్, హార్బర్, కైలాసగిరి, ఋషికొండ, భీమిలి బీచ్ రోడ్ లాంటివి చూసి విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందింది అని ఎవరూ అనలేదు, తెలంగాణావాదులు కూడా అలా అనరు. ఒకవేళ విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందింది అని ఒప్పుకుంటే హైదరాబాద్ ఐ.టి. కంపెనీల వల్ల తెలంగాణా అభివృద్ధి చెందింది అని కూడా ఒప్పుకోవాలి. ఒక అబద్దాన్ని నమ్మితే దానికి సంబంధించిన ఇతర అబద్దాలని కూడా నమ్మాల్సి వస్తుంది అని తెలంగాణావాళ్ళకి తెలియదా?

 3. 3 Malakpet Rowdy 8:18 సా. వద్ద జనవరి 4, 2010

  అమ్మ ప్రవీణూ! పోస్టుకి సంబంధం ఉండే కామెంటు వేశావా … నువ్వు నువ్వేనా? లేక నా ఐ.క్యూ. అమాంతం పెరిగిపోయి నీ కామెంట్లు అర్ధమయ్యే స్టెజీకి వచ్చేసిందా? :))

  Sorry for the digression abracadabra .. jsut couldnt resist it …

  As of your post … aint it evident that both the parties – Samaikya and Telangana – are interested only in Hyderabad and nothing else? Fault is on both the sides!!

 4. 4 Praveen Sarma 8:36 సా. వద్ద జనవరి 4, 2010

  >>>>>
  అప్పటికీ ఇప్పటికీ కోస్తాంధ్ర వ్యవసాయాధారితమే.
  >>>>>
  కోస్తా ఆంధ్రలో కూడా పెద్ద పరిశ్రమలు లేవు, స్టీల్ ప్లాంట్ లాంటివి తప్ప. ఐ.టి., టూరిజం లాంటి సర్వీస్ సెక్టార్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ప్రొడక్టివ్ సెక్టార్స్ ని గాలికి వదిలెయ్యడం పాలకుల తప్పు కాదా? ఇందులో ప్రజల తప్పు లేదు. అది తెలంగాణా ప్రజలైనా, కోస్తా ఆంధ్ర ప్రజలైనా.

 5. 5 Rajanna 9:42 సా. వద్ద జనవరి 4, 2010

  కడుపు కాలిన వాడి భాష
  సుష్టుగా పంచ భక్ష పరమాన్నాలతో భోజనం చేసి తాబూలం సేవిస్తూ మాట్లాడే వాడి భాష లా
  అందంగా ఎట్లా వుంటుంది మహా ప్రభూ.

  గతం లో ఎన్టీ రామారావు కూడా కాంగ్రెస్ వాళ్ళని, చంద్రబాబునీ విమర్శించేటప్పుడు వాడిన భాష గుర్తు తెచ్చుకోండి. అదే ఉస్మానియా విద్యార్ధులు ….
  ” మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ” సంక్రాంతి పండుగకు మనం ఆంధ్రాకు పోదాం … దసరా పండుగకు ఆంధ్రోల్లని తెలంగాణాకు ఆహ్వానిద్దాం ” అన్న స్నేహ పూర్వక మాటలు మీ చెవిన పడలేదా?
  వాటి గురించి ఎందుకు ప్రస్తావించరు ?

  మీ మోసాలను ఇక భరించలేం మేం విడిపోతాం అటుంటే వినిపించుకోకుండా చచ్చినట్టు కలసి ఉండాల్సిందే అంటూ దగుల్భాజీ ఉద్యమంతో రెచ్చ గోడుతున్నప్పుడు ఇంకేం భాషవస్తుంది?

  ఎంత సామరస్యంగా చెప్పినా మేకల గోడు తోడేళ్ళకు అర్ధం అవుతుందా?

  మీకు నిజాయితీ వుంటే … ఈ కింది అంశాలు విపులంగా ప్రస్తావించి సమాధానాలు చెప్పండి మీ టపాలో
  ౧) ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాల విలీనమప్పుడు కుదుర్చుకున్న జెంటిల్ మెన్ అగ్రిమెంట్ లో ని అంశాలెంటి. వాటిని తుచ తప్పక అమలు చేసారా.
  ౨) ఫజల్ అలీ కమిషన్ నివేదిక లోని అంశాలు.
  ౩) ౧౯౬౯ ప్రత్యెక తెలంగాణా ఉద్యమం పూర్వాపరాలు. అణచివేత.
  ౪) ౧౯౭౨ ప్రత్యెక ఆంధ్ర ఉద్యమాక్ పూరాపరాలు
  ౫) ౧౯౫౬ తర్వాత దేశం లో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, వాటి ప్రాతిపదిక. ఆంద్ర తెలంగాణా రాష్ట్రాల విభజనకు ఎందుకు వీలు కాదు?

  • 6 sri 2:19 ఉద. వద్ద జనవరి 5, 2010

   Dear rajanna, who want to take the responsibility if telangana is not developed by so called selfish politicians after the telangana state is granted?

   Remember, division is having its own negative and national security related issues as well. But if the telangana is not developed by politicians and if the negative aspects of the division also add up, it is the worst nightmare situation.

   This is the reason I am asking you if you want to take up the responsibility by death that if telangana is not developed, then will you give up your life? Do you have this daringness to take up this level of responsibility? then only talk about the telangna state formation. Otherwise, start thinking about asking telangana politicians of what they did so far for telangana and if they had failed, why the hell they failed to develop the telangana area?

   Remember, politicians in telangana had amassed 100’s of crores for their selfish gains by using power, but not achieved anything for the common man of telangana area. I doubt if they will do any good after the sstate formation.

   Even now, they are trying to mask their failure to develop telangana by blindly going after KCR, who again an irresponsible and highy incapable fool, who had performed very poorly in elections.

  • 7 అబ్రకదబ్ర 12:30 సా. వద్ద జనవరి 5, 2010

   @రాజన్న:

   రామారావు చంద్రబాబునీ, కాంగ్రెసునీ మాత్రమే అనటానికీ; వేర్పాటువాదులు ఆంధ్రా ప్రాంతీయులందర్నీ కట్టగట్టి అనటానికీ తేడా లేదా?

   >> “స్నేహ పూర్వక మాటలు మీ చెవిన పడలేదా? వాటి గురించి ఎందుకు ప్రస్తావించరు?”

   మిమ్మల్నెవరన్నా చావ చితగ్గొట్టి ఆనక తీరిగ్గా ఆయింట్‌మెంట్ పూసి ఇంటికి పంపితే .. మీరెళ్లి వాళ్లు కొట్టారని కేసేస్తారా, లేక మందు రాశారని మురిసిపోతారా?

   నా నిజాయితీ ఎవరికీ నిరూపించుకోవలసిన అవసరం లేదు. నా వ్యాసం లక్ష్యాలేమిటో మొదట్లోనే స్పష్టంగా రాశాను. రాష్ట్రం ఎందుకు విడిపోవాలో/విడిపోకూడదో చర్చించటం వాటిలో ఒకటి కాదనీ అప్పుడే రాశాను. ఉద్యమాల పేరుతో అమాయకుల ఆస్తులు ధ్వంసం చేయటాన్ని, అబద్ధాలు ప్రచారం చెయ్యటాన్ని, వ్యాపారాలపై దాడులు చేయటాన్ని, సరిహద్దు గ్రామాల్లో అడ్డుగోడలు కట్టటాన్ని, వాణిజ్య సంస్థల పేర్లు తిరగరాయటాన్ని, విద్వేషాలు రెచ్చగొట్టటాన్ని ప్రశ్నించండి ముందు. నా నిజాయితీ గురించి తర్వాత అడుగుదురు కాని. కడుపు కాలినవాళ్లూ, గుండె రగిలినవాళ్లూ అన్నిచోట్లా ఉన్నారు. ఆ వంకతో అరాచకం సృష్టించే హక్కు ఎవరికీ లేదు. మీ దొరలా మీరూ వెధవ పనులని వెనకేసుకు రావద్దు.

  • 9 S Nageswara Rao 1:23 ఉద. వద్ద జనవరి 16, 2010

   Dear Rajanna garu,

   Neither you nor me a politician. This is a game for political power. Even if we get Telangana, neither you nor will not get any benefit.

   I want to clarify you:

   1. The expolitation of yours or any otehr’s region is done by the politicians and their chamcha goondas, not be ordinary people. Do you believe that there is no Telangana goondas who grabbed the vacant sites.

   2. FOR THE ARGUMENT SAKE I AGREE THAT ENTIRE COASTAL PEOPLE LOOTED NIZAM. ALL THESE DAYS THERE ARE MANY MLAs MPs AND MINISTERS FROM NAZAM, INCLUDING THOSE WHO ARE CRYING ABOUT THE LOOTING. WHAT THEY HAVE DONE TO SAVE NIZAM REGION FROM THE LOOTING OF COASTAL PEOPLE, WHEN THEY WERE IN POWER. WHY THEY REMEMBER LOOTING ONLY WHEN THEY DON’T HAVE A POWER.

   3. If you worry about the prosperity of Coastal area Business people, why don’t you thing about the Punjabis, Marathis, gujaratis, marwadis who are more in number when compared to coastal businessmen. Atleast Coastal business men speak the same langauage (with sligh variation of accent) you speak, follow same culture which you follow. But the Businessmen from the other states never honour your/our language or culture. Do you find a single north inidan’s shop in Abids, Koti or some wenre else with a PROMINANT TELUGU SIGN BOARD. Yet they are good for you and your Telugu Brotehr is an enemy or expoiter

   LASTLY I WANT TO CLARIFY. NOTHING WILL HAPPEN IF STATE IS DEVIDED OR CONTINUED UNITED. BECAUSE, EVEN THOUGH WE HAVE 42 MPs FOR A.P, NOT A SINGLE PROJECT IS ACHIEVED, NOR A TRAIN IS OBTAINED. NOT EVEN NH9 ETC ARE WIDENED. BECAUSE OUR POLITICANS WORRY MORE ABOUT THEIR BUSINESS, BENEFITS ETC. THEY SELDOM THNK ABOUT US.

   May it be KCR or any other Politician from A.P, have you find anyone who fough for our benefits.

   I conlcude, we are always second garade citizens in Indian Republic, we get any thing only after every one had got their watned share. So neither you nor me, never prosper

 6. 10 naalonenu 9:51 సా. వద్ద జనవరి 4, 2010

  Thought provoking and nice.
  As our friend Malakpet rowdy said ” Bone of contention ” is only Hyderabad.
  I think we should come out with a matured sloution of generating 4 capitals on turn basis, each for a ten year period. For example Kadapa can be state capital till 2019 and later Vizag. By this way in about 60 years all the corners of the state would develop.
  Another solution is to elect only ministers i.e all 300 would be ministers and no MLAs.
  Any how one thing is destined- Politicians all across are intersted in extorsion, power and money.
  Common man pays for it

 7. 11 వేణూ శ్రీకాంత్ 10:18 సా. వద్ద జనవరి 4, 2010

  ప్రదీప్ గారు అన్నట్లు ఆలోచించే వారికైతే ఈ లెక్కలు కానీ మాస్ హిస్టీరియా జనాలకి వీటితో పనిలేదు. రాష్ట్రాభివృద్ది అంటే హైదరాబాద్ అభివృద్ది అని నమ్మిన నాయకులని అనాలి.

 8. 12 Praveen Sarma 10:32 సా. వద్ద జనవరి 4, 2010

  కోస్తా ఆంధ్ర కూడా వ్యవసాయం పై ఎక్కువ ఆధారపడుతోంది కనుక కోస్తా ఆంధ్ర కూడా అభివృద్ధి చెందలేదని ఒప్పుకుంటాను. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలలో ఖరీదైన దాల్వా వరి పండించి, రొయ్యల చెరువులు పెంచి, లక్షలూ, కోట్లు సంపాదించిన భూస్వాములతో పోలిస్తే తెలంగాణా భూస్వాములు చాలా చిన్నవాళ్ళే. అందుకే తెలంగాణాలో భూస్వామ్య వర్గం వాళ్ళు కూడా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారు. కోస్తా ఆంధ్ర కూడా వ్యవసాయం పై ఎక్కువ ఆధారపడుతోందనే విషయం తెలంగాణావాళ్ళకి తెలియనిది కాదు.

 9. 14 రవి చంద్ర 10:54 సా. వద్ద జనవరి 4, 2010

  ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అంటే హైదరాబాద్ అభివృద్ది అని ఇప్పటిదాకా దాన్నే అభివృద్ధి చేసిన మన పాలకులకి ఇది ఒక గుణపాఠం కావాలి. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు చేరవేయడానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి.

 10. 16 kvsv 11:26 సా. వద్ద జనవరి 4, 2010

  ఏ ప్రాంతం వారయినా ఒక్కటి గుర్తువుంచుకోక తప్పదు ..మన కస్టమే మనము తింటాము హైదరాబాద్ లో వూన్నంత మాత్రాన రిక్షా కార్మికుడు ఏ.సి.రూమ్ లో పడుకోడు కదా ..యే రాస్త్రమయినా సామాన్యుడికి తిప్పలు తప్పవు ..ఇది క్లియర్ గా అధికారం కోసం అది దూరమయిన నాయకుల కోసం జరుగుతున్న యుద్దం ..దీనిలోకి ప్రజలను మీరు దోపిడీ చేయబడతున్నారు అంటూ వారిని రెచ్చగొట్టి లాగారు …అబద్దానికి నోరు పెద్దది అంటారు..అందువల్ల ఈనాటికి ప్రజలను పూర్తిగా .సంపూర్ణంగా నమ్మించగలిగారు..తెలంగాణ వస్తే యెధో జరిగిపోతుండి యెధో వొరిగిపోతుంది ఆన్కుని విద్యార్డులు జీవితాలను నాశనం చేస్కుంటున్నారు…10 కోట్ల రూపాయలకు ఎం.పి. టికెట్ అమ్ముకున్న కేసిఆర్ .కొడుకులకి మేనల్లుల్ల కి టికెట్లు లు కేటాయించి కుటుంబ వ్యాపారం జరుపుకునే కేసిఆర్ ఈ మొత్తం సర్కస్ కి రింగ్ మాస్టర్ ..రాజకీయాలంటేనే యెత్తులు పై యెత్తులు కావచ్చు కానీ రాస్త్రాలను విబజించే అంతా గానా?

 11. 19 మేధ 2:20 ఉద. వద్ద జనవరి 5, 2010

  హైదరాబాద్ రాష్త్రాన్ని ఆంధ్రలో కలిపేటప్పుడు, జరిగిన ఒప్పందాలు అమల్లోకి రాలేదని, విడిపోవాలి అంటున్నారు… అసలు ఇప్పటివరకు, తెలంగాణాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వాటి అమలు గురించి పట్టించుకున్నారా..? రేపు రాష్ట్రం విడిపోయినా, ఇదే నాయకులు తెలంగాణాని పరిపాలిస్తారు, ఇప్పుడు పరిష్కారం కాని సమస్యలు అప్పుడు ఎలా పరిష్కరించబడతాయి..!? అదేమంటే, మేము-మా రాష్ట్రం-మా ఇష్టం అంటారు..!!!

 12. 20 Prabodh 3:35 ఉద. వద్ద జనవరి 5, 2010

  Hello

  http://brgf.gov.in/brgfdistricts.asp

  That is a govt site listing the number of districts considered to be backward.

  As you have listed districts from each region. i think you know how many are from each region

  • 21 అబ్రకదబ్ర 11:43 ఉద. వద్ద జనవరి 5, 2010

   @Prabodh:

   Thank you for the link. I’ve seen that earlier.

   రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సైతం ‘వెనకబడ్డ జిల్లాల’ కోటాలో కేంద్ర నిధులు రావటం, అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకి మాత్రం రాకపోవటం … వింతగా లేదా? విజయనగరం కన్నా కూడా మెదక్, రంగారెడ్డి జిల్లాలకే ఎక్కువ నిధుల కేటాయింపు జరగటం మరో వింత. పైగా ఇవి మౌలిక అవసరాల ఏర్పాటు కోసం మంజూరు చేసిన నిధులు. రాజధానికి కూతవేటు దూరంలోని జిల్లాల్లో లేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, మన్యం ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నమ్మకం కాబోలు!

   I’m not against the Centre allocating more funds to Telangana districts, whatever their qualifying criteria is. We can’t rely solely on such programs to decide who’s really backward.

 13. 23 pullayana 4:33 ఉద. వద్ద జనవరి 5, 2010

  nice post. మిగతావి కూడా త్వరగా రాయండి

 14. 24 Kalyani 5:30 ఉద. వద్ద జనవరి 5, 2010

  పెద్దమనుషుల ఒప్పందం, ఇంకా రకరకాల ఒప్పందాలు అమలుకు నోచుకోలేదు అంటే దానికి కారణం సీమ, కోస్తా ఆంధ్రా నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వారిదా? వాటి అమలు కోసం ఏ రకంగానూ ప్రయత్నించని ప్రజా ప్రతినిధులదా? ఇందులో సమాన్య జనం తప్పు ఏముందని దోచుకుంటున్నారు, అణగదొక్కుతున్నారు లాంటి భాష వాడుతున్నారు.

 15. 25 a2zdreams 7:53 ఉద. వద్ద జనవరి 5, 2010

  ప్రొఫసర్ జయశంకర్ కూడా కేంద్రం నుంచి తెలంగాణ యేర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటన వస్తే ప్రళయం సృష్టిస్తాం అని వార్నింగ్ ఇస్తున్నాడు.

  మీరు తెలంగాణ ప్రాంతంకు చెందిన వారయితే ఇదే విధంగా ఆలోచించేవారా ?
  హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో లేకపోతె ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వుండేదా ?
  అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు సై అన్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు రాలేదు ?

  అబద్దాలు, ఆరోపణలే రాజ్యం ఏలుతున్న రోజులివి. చెయ్యి జారిపోయింది. రాష్ట్ర విభజనే పరిష్కారం.

  జై తెలంగాణ, జై కోస్తాంధ్ర, జై గ్రేటర్ రాయలసీమ !

  హైదరాబాద్ లో ఆస్తులు వుండి, అభద్రతా భావంతో వుంటే “జై హైదరాబాద్” ఉద్యమం లో దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తో కలవడమే మరో మార్గం.

  • 26 అబ్రకదబ్ర 12:52 సా. వద్ద జనవరి 5, 2010

   >> “హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో లేకపోతె ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వుండేదా?”

   Good question. దాన్నే తిరగేసి మరో విధంగానూ అడగొచ్చు: “హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో లేకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉండేదా?”

   రెండు ప్రశ్నలకీ సమాధానం ఒకటే. అదేమిటో మీకు తెలుసు.

   >> “అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు సై అన్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు రాలేదు ?”

   యాభయ్యేళ్లుగా ఆరకుండా రగులుతుందని చెప్పుకుంటున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో ఉవ్వెత్తున ఎగసిన ‘జై ఆంధ్ర’ ఉద్యమమప్పుడు దుప్పటి తన్ని పడుకుందెందుకు? మీరు దీనికి సమాధానం చెప్పండి; తర్వాత నేను మీ ప్రశ్నకి చెబుతాను.

   ఇక – మీరు చెప్పిన కారణాలతో నేను ‘జై హైదరాబాద్’ అనాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉండాలని కోరుకుంటా నేను. దానర్ధం నాకు శ్రీనగర్‌లో ఆస్తులున్నాయనా?

 16. 29 గణేష్ 8:26 ఉద. వద్ద జనవరి 5, 2010

  One of the Excellent posts that I have seen about this topic. Please go ahead and post the further parts.

 17. 30 sri 10:25 ఉద. వద్ద జనవరి 5, 2010

  here is a shocking news for all those telangana supporters. I donot know if this gets prime time media coverage, but they should investigate and bring this KCR to the accountability:

  http://www.greatandhra.com/ganews/viewnews.php?id=18381&cat=15&scat=16

  This proves that trusting and giving telangana to KCR like goons is of high risk factor and should never be done.

 18. 32 varun 5:26 సా. వద్ద జనవరి 5, 2010

  I dont aggree with everything you have written but people should understand that Telangana movement is not just a political movement, its a people movement which has put all the political parties on alert. Hyderabad lo settle aina Andhra people should be loyal to the area and support Telangana rather than being anti-telangana. Wow you guys are great “you want to eat the cake and have it too!.” Wake up Guys this is 21st Century!!

 19. 33 telugubhoomi 9:53 సా. వద్ద జనవరి 5, 2010

  తెలంగాణావాదులు, సమైక్యవాదులు, తటస్తవాదులు అందరూ ఈ లింక్ కి వెళ్ళి చూస్తే ఆ డాటా తో ఎవరు వెనకబడ్డారో, ఎవరు అభివృద్ది చెందారో తెలుస్తుంది. (మీ అందరికీ ఈ లింక్ ముందే తెలిసిఉంటుంది)

  Click to access APHDR_2007_AppendixIII.pdf

  If that kind of basis is not there, it goes in circles.
  Even when data is there, people will interpret it the way it suits them.

  If the same energy is spent on starting new businesses, finding new business opportunities, identifying each district’s strengths and weaknesses ,state’s per capita income might have gone up just in this last 30days

 20. 34 telugubhoomi 9:59 సా. వద్ద జనవరి 5, 2010

  Full report of the Andhra Pradesh Human Development Report 2007 can be found at

  http://www.aponline.gov.in/apportal/Human-Development.html

  Report has full information by district, whether literacy or economy or agriculture

  Let us all fight with actual data. Start with this and go back to history.

  జై తెలుగుభూమి

 21. 35 Sarath 'Kaalam' 11:35 సా. వద్ద జనవరి 9, 2010

  మీకు క్రెడిట్స్ ఇస్తూ యూట్యూబులో ఇది చదువుతూ వీడియో వెయ్యబోతున్నాను. మీకు అభ్యంతరం అయితే తెలియజేయండి – తీసివేస్తాను.

 22. 38 hari 3:51 సా. వద్ద జనవరి 11, 2010

  @Varun
  ante telangana lo undi telangana adagadam… koochunna kommani narukkodama???

 23. 39 S Krishna 6:50 సా. వద్ద జనవరి 15, 2010

  Hello

  I have three doubts

  1. When people know that KCR is full fraud and people consider him as a reincarnated potti sriramulu? Is the telangana the private property of him and his family members?
  is the So called live Telangana Talli Kavitha born to acheive telangana?

  2. Let the do what ever they want but why do you mess up the lives of common people? Why the students in Universites specially in OU bothering about Telangana instaed of their futures?

  3. Why police dint shoot the goondas and these so called trouble makers in the name of encounters? They do it when really we dont want.

 24. 40 Sankar 7:44 సా. వద్ద ఫిబ్రవరి 5, 2010

  Rajanna comments are lame with no technical reference to the article.

  Rajanna, your sentiments have no sense! ex. ‘ OU idiots told we will visit you for sankranti , you visit us for dasara’
  ‘ annadammullaa viDipOtaam ‘ – then what about brother’s share?!

  Don’t think yourself smarter, which you ppl can never be.. let another 1000years pass..


 1. 1 Tweets that mention ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 1 « తెలు-గోడు -- Topsy.com 11:59 సా. వద్ద జనవరి 4, 2010 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: