ప్రత్యేక రాష్ట్రాన్నిక పడుకోబెట్టినట్టేనా? పరిస్థితులు పరికిస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇటు రాష్ట్రంలో రోజు రోజుకీ ఊపందుకుంటున్న సమైక్యవాదం, అటు కేంద్రంలో పాలక పక్షానికి భాగస్వాముల నుండి మొట్టికాయలు, తెలంగాణపై వేసిన తప్పటడుగుతో దేశంలో పుట్టగొడుగుల్లా తలెత్తుతున్న ప్రత్యేకవాద ఉద్యమాలు .. వెరసి, లేనిపోని లంపటంలో వేలుపెట్టామని తలపట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వాధినేతలు. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై తెగించి ముందడుగేయటం ఇక సాధ్యం కాకపోవచ్చు. ‘రాష్ట్రం తీర్మానం చేస్తేగానీ మేమేం చెయ్యలేం’ అంటూ బంతిని రాష్ట్ర అసెంబ్లీలోకి నెట్టేసి కేంద్రం చేతులు దులుపుకునే అవకాశాలే మెండు. ఇప్పటికే ఆ దిశలో వెల్లడవుతున్న సూచనలు. రాష్ట్ర అసెంబ్లీలో ఆ తీర్మానమెటూ వీగిపోవటం ఖాయం – అదీ ఏ వంద ఓట్ల తేడాతోనో. కేసీయార్ మాత్రం ‘అసెంబ్లీ తీర్మానం అవసరమే లేదు. కేంద్రం తలుచుకుంటే రాష్ట్రాల్ని చీల్చటం ఓ లెక్కే కాదు’ అంటూ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఆయన వాదనలోనూ నిజముందని కొందరు రాజ్యాంగ నిపుణులంటున్నారు. కానీ అసెంబ్లీ తీర్మానంతో పని లేకుండా కేంద్రం తెలంగాణ విషయంలో బిల్ పాస్ చేసే అవకాశముందా అన్నది సందేహం. ఆ అవకాశమున్నప్పుడు, తీర్మానం సంగతి మొదటే ప్రస్తావించకుండా ఉండాల్సింది కదా. తీర్మానం నిలబడినా, వీగిపోయినా కేంద్రం తను చెయ్యాలనుకున్నది చేసి తీరేట్లయితే అసలు తీర్మానం ఊసెందుకు? ‘ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలయింది’ అన్న ఒక్క ముక్కకే, ఆ ప్రక్రియ ఇంకా మొదలే కాకపోయినా, ఎప్పుడు మొదలవుతుందో సైతం తెలీకపోయినా తెల్లారే సరికి రాష్ట్రం భగ్గుమంది. ఎందుకు? ‘మా మనోభావాలు కనీసం తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రజలు అనుకోబట్టి. తమ అభిప్రాయాలు తెలుసుకోకపోయినందుకే ఆంధ్రులు అగ్గి మీద గుగ్గిలాలైతే, అసెంబ్లీలో భారీ తేడాతో తీర్మానం వీగిపోయాక సైతం కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి పచ్చ జెండా ఊపితే ఇంకెంత రౌద్రంగా రియాక్ట్ అవుతారో ఊహించనలవి కాదు. అంత ఆగ్రహాన్ని తట్టుకోటానికి కేంద్రం సిద్ధంగా ఉందా? ఉండకపోవచ్చు. అసలు, అసెంబ్లీ నిర్ణయంతో పని లేకుండానే రాష్ట్ర విభజన చేసేయొచ్చని తెలిసినా ‘అసెంబ్లీ తీర్మానం’ మడత పెట్టటంలో మతలబు – పరిస్థితులు తారుమారైతే పరువు పోకుండా చేతులు దులుపుకోటానికే కావచ్చు. దాని వెనకున్న చిదంబర రహస్యమేదైనా, అప్పుడా క్లాజ్ పెట్టినందుకు చిదంబరం ఇప్పుడు చిదానందభరితుడౌతుంటాడు.
మొత్తానికి అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా – అది ప్రవేశ పెట్టటమంటూ జరిగితే – తన పని తాను చేసుకుపోయే ధైర్యం కేంద్రం చెయ్యకపోవచ్చు. ఆ సంగతి కేసీయార్‌కి తెలీదా? తెలీకేం – బ్రహ్మాండంగా తెలుసు. మరి ఇంకా ఏ ధైర్యంతో ‘తెలంగాణ వచ్చేసినట్లే’ అంటున్నాడు? అదర్ధం కావటానికి అంతగా తెలివితేటలక్కర్లేదు. ఆయన స్టైలే అది కదా. మొన్నటిదాకా ఆలూ చూలూ లేకపోయినా అడిగడిగో సోమలింగం అంటూ నెట్టుకొచ్చినోడికి, ఆకాశంలో మబ్బు తునక లేకున్నా నీళ్లు పట్టుకోటానికి బకెట్లతో నిల్చోమని తెలంగాణవాసుల్ని హడావిడి పెట్టేసినోడికి, ఉత్తి మాటలతోనే ఐదారేళ్లు అలవోకగా నెట్టుకొచ్చేసినోడికి – ఇప్పుడు ఇదిగిదిగో తెలంగాణ, ఇంకేముంది వచ్చేసింది అంటూ మరో ఐదారేళ్లు బండి లాగించే వెసులుబాటు దొరికింది. తెలంగాణ ప్రజలు అలవాటుగా దీన్నీ నమ్మేస్తారు. ఆంధ్రా బూచోళ్లని తిట్టుకుంటూ ఇంకొన్నేళ్లిలాగే దొర్లిస్తారు. అద్దంలో చందురుడిని చూపిస్తూ పబ్బం గడుపుకునే దొరలని అమాయకంగా నమ్మేస్తూ, ఎన్నటికీ రాని తెలంగాణ కోసం ఆవురావురుమంటూ తరాలకి తరాలే గడిపేస్తారు. ‘రాష్ట్రమొద్దూ గీష్ట్రమొద్దూ. చేతనైతే మాకిన్ని స్కూళ్లో, నీళ్లో తెచ్చియ్యి’ అని మాత్రం నిలదీసి అడగరు.
ఏతావాతా, ఇంత రభస, రచ్చ జరిగాక ఒరిగిందేమిటి? రాష్ట్రం చీలలేదు. రాష్ట్రంలో పార్టీలు మాత్రం రెండుగా చీలిపోయాయి. దాన్ని మించి – అసలు రాష్ట్ర ప్రజానీకమే ప్రాంతాలవారీగా చీలిపోయింది. మూడు ప్రాంతాలూ రెండు ప్రాంతాలుగా ఏకీకృతమయ్యాయి. ఆ రెండు ప్రాంతాల ప్రజలకీ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. అందరూ తెలుగువాళ్లే ఐనా అందులోనే రెండు వేర్వేరు జాతులన్నంతగా పరిస్థితి ముదిరిపోయింది. ‘తెలుగు వేరు, ఆంధ్రం వేరు’ అంటూ ఒకటే భాషని రెండు విడివిడి భాషలుగా విడగొట్టి చూసే చోద్యపు పోకడలూ పుట్టుకొచ్చాయి. ఎవరివల్ల? పనీ పాటా లేకుండా కూర్చుని చేతికొచ్చినవి రాసిపారేసే స్వప్రకటిత భాషావేత్తల వల్ల. వాళ్లు రాసిన చెత్తనల్లా ముందూ వెనకా చూడకుండా అచ్చు గుద్ది పారేసే బాధ్యతారాహిత్య మీడియా వల్ల. ఈ మీడియాని వాడుకుని కొందరు తాజాగా ప్రచారం చేస్తున్న వితండవాదం: ‘ప్రత్యేకవాదం మిన్నంటినప్పుడే సమైక్యవాదం ఊపందుకోవటం ఏమిటి? దీని వెనక ఏదో కుట్రుంది’. రాష్ట్రం చీలే ప్రమాదం లేనప్పుడు కలిసుంటామంటూ ఉద్యమాలు చేయనవసరం ఏముంది, ఎవరికుంది? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని చవటాయిలు – ప్రత్యేకవాదాన్ని తలకెత్తుకున్న మేధావులు!
సమైక్యవాదం అనేది బోగస్ అని కేసీయారూ, ఆయన వందిమాగధులూ నోళ్లు పారేసుకోవచ్చుగాక. ఆ మాటలకు విలువీయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకవాదం ఎంత నిజమైనదో సమైక్యవాదమూ అంతే నిజమైనది. వీటిలో ఏదెంత నిజమైనదన్నది ప్రశ్నే కాదు. ప్రజల్లో దేనికెంత మద్దతున్నదన్నదే ప్రశ్న. ఆంధ్రా, సీమల్లో ఉన్నదంతా సమైక్యవాదమే. ఆ విషయంలో అనుమానాలు అనవసరం. తెలంగాణలో సైతం సమైక్యవాద గొంతుకలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయనేదాంట్లోనూ సందేహం లేదు. కాకపోతే ‘సమైక్యవాదుల తలలు నరుకుతాం, మెడలు తెగ్గోస్తాం’ అంటున్న వేర్పాటువాదుల విచ్చలవిడి హెచ్చరికలతో ఆ గొంతులు మౌనవ్రతం పట్టాయి. ఈ తరహా బెదిరింపులో పక్క, సమైక్యవాదమే బోగస్ అనే గోబెల్స్ ప్రచారం మరోపక్క కలిపి హోరెత్తించేస్తున్నారు వేర్పాటువాదులు. అందులో భాగంగా, పోయిన వారం మాటల మరాఠీ కేసీయార్ ‘ప్రపంచంలో ఎక్కడైనా విడిపోటానికి ఉద్యమాలు జరిగాయే తప్ప కలిసుండటానికి జరిగాయా’ అని చొప్పదంటు ప్రశ్నొకటేశాడు. ఉద్యమాలేం ఖర్మ, కలిసుంటానికి ఏకంగా యుద్ధాలే జరిగాయి. దొరవారు చిన్నప్పుడు బళ్లో బూతు కూతలు నేర్చుకోటమ్మీద పెట్టిన శ్రద్ధలో సగమన్నా చరిత్ర పాఠాల మీద పెడితే నేడీ పిచ్చి ప్రశ్నేసుండేవారు కారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నూట యాభయ్యేళ్లనాటి అమెరికన్ సమాజాన్ని తలపిస్తుంది. బానిసత్వ నిషేధం వంకతో అమెరికా నుండి విడిపోతామన్న దక్షిణాది రాష్ట్రాలు (కాన్ఫెడరేట్ స్టేట్స్), వారికి వ్యతిరేకంగా సమైక్య మంత్రం పఠించిన ఉత్తరాది రాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్), ఆ రెండు శిబిరాల మధ్యా జరిగిన నాలుగేళ్ల అంతర్యుద్ధంలో చివరికి గెలిచింది సమైక్యవాదులే. ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయేదీ అదే. సారువాడికి కాస్త చరిత్ర జ్ఞానమన్నా వస్తే వాగుడు కొంచెం కట్టిపెడతాడేమో. ఎటూ అమెరికా నుండి మస్తుగా మందు (ఏ మందో?) తెప్పించుకు తాగి జబర్దస్తుగా బాగుపడతానంటున్నాడుగా, పనిలో పనిగా ఒకట్రెండు ‘అమెరికన్ హిస్టరీ ఫర్ ఇడియట్స్’ పుస్తకాలు కూడా ఎగుమతి చేస్తే మంచిదీ మందుబాబుకి.
కొసమెరుపు: ఇప్పుడే అందిన వార్త. ‘ఆంధ్రోళ్ల సినిమాలు మాకెందుకు, కాలేజిలో నేను బెస్ట్ యాక్టర్‌ని’ అన్నాడు దొరబాబు. రేపు కొంపదీసి ప్రత్యేక రాష్ట్రంగానీ వస్తే అన్న సినిమా హీరో అవతారమెత్తుతాడన్న మాట. ఈ వార్త దావానలంలా వ్యాపించటంతో టీఆర్ఎస్ శ్రేణులు జెండాలవతల పారేసి కకావికలై ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోతున్నట్లూ, కరడుగట్టిన ప్రత్యేకవాదులు సైతం సమైక్య రాగం ఆలపించే ఆలోచనలో ఉన్నట్లూ విశ్వసనీయవర్గాల భోగట్టా.
అమెరికన్ హిస్టరీ ఫర్ ఇడియట్స్ యూట్యుబ్ లొ విడియోలు ఎమయినా దొరుకుతాయెమొ చూడండి.. మనొళ్ళకి విడియోలు, లింక్‌లు అయితేనే బాగా ఎక్కుతాయి..
అవునండీ వాళ్ళకి దేని గురించి ప్రశ్న వేసినా సూటిగా సమాధానం చెప్పకుండా, ఆ లింకు చదవండి, ఈ లింకు చదవండి, వీడియో చూడండి అని ప్రశ్నను దాటవేస్తారే తప్ప సూటిగా సమాధాన మివ్వరు.
కమ్యూనిస్ట్ గోలతో వేరయిన ఈస్ట్ జెర్మనీ గతి ఏమయ్యింది? దేశం చిన్నా భిన్నమయ్యింది. ఎర్ర చొక్కాలు తొడుక్కుని వేర్పాటువాదులు చక్కగా దోచుకున్నారు. వాళ్ళే పెట్టుబడి దారులుగా అవతారమెత్తి మళ్ళా జెర్మనీలు రెండూ కలిసేవరకూ నానా లాబీయింగూ చేసారు. బెర్లిన్ వాల్ కూలితే ఎవరు లాభపడ్డారు? ఇప్పుడు తెలుగునాట జరుగుతున్నదీ అంతే! మేధావులూ, సిద్ధాంతకర్తలకీ కావల్సింది నాలుగు రాళ్ళు పోగుచేసుకోడమే! పెట్టుబడి లేని రాబడి.
హహహహ
చాలా చక్కని పోస్ట్. దొరవారు నోరు తెరవకముందే భాజాభజంత్రీలు వాయించే VT99 వుండగా, ఇలాంటి విశ్లేషణాత్మక విషయాలు పట్టించుకునే తీరికెక్కడిది.
Hilarious post and equally amazing comments by మంచుపల్లకీ.
మన కేసీఆర్ దొర రగిల్చిన అగ్గిలోంచి మహరాష్ట్ర నవనిర్మాణా సేన లాంటి కొత్త సైన్యాలు పుట్టుకురావచ్చు.
ఆ తాగుబోతు గాణ్ణి హీరో చేసి, రచయితల్ని రెచ్చగొట్టీ, ప్రజల మధ్య విద్వేషాలు కుమ్మరించింది ఆంధ్రజ్యోతి. అందులో పనిజేసే అందరికీ ఈ విద్వేషం పీకల వరుకూ కూరుకుపోయింది. సంపాదకులు వేర్పాటు వాదులు కాబట్టి ఆయన్ని సంతోషపెట్టడం కోసం నానా చెత్తా రాసారు. ఇప్పుడు కూడా చూడండి, సీమాంధ్రా, తెలంగాణా అంటూ విభజన చేసేది వీళ్ళే! ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పత్రికలు విద్వేషాలు సృష్టిస్తున్నాయి. మరలా ఈ పత్రికల వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు మేధావులంటూ నడ్డి గీక్కుంటూ ఉంటారు. ముందు రాజకీయనాయకుల్నీ, మీడియాని ప్రజలు బహిష్కరిస్తే సగం గొడవలు తప్పుతాయి.
ఇప్పటి మీడియా వ్యక్తులు తమ పైత్యాన్ని జానాలమీదకి ఎలారుద్దాలని చూస్తారొ మీకు ఆనందిని బ్లాగు చూస్తే అర్దం అవుతుంది. మీమద్య ఆయన ఎంత ఒన్ సైడెడ్ గా రాస్తున్నరొ , ఆ రాతల్లొ ఒక ప్రాంతం వాళ్ళమీద ఎంత విద్వేషం చూపిస్తున్నారొ చూడండి..
//‘రాష్ట్రమొద్దూ గీష్ట్రమొద్దూ. చేతనైతే మాకిన్ని స్కూళ్లో, నీళ్లో తెచ్చియ్యి’ అని మాత్రం నిలదీసి అడగరు //
అబ్రకదబ్ర గారు … అమెరికా చరిత్ర కంఠస్థ పట్టిన తమరికి తెలంగాణా ఉద్యమ చరిత్ర గురించి తెలియకపోవడం శోచనీయం.ఠఠ్ , నాకు తెలియకపోవడం ఎంటీ నాన్సెన్స్ ??? అని అనరు కదా ? కొంపదీసి … అనరు లే ..ఒక వేళ తెలిసి ఉండుంటే పై వ్యాఖ్య చేసి మీరు కూడ కేసియార్లా వాస్తవాలెరుగక వితండవాదం చేసి వుండెవారా చెప్పండి ???
ఉద్యమ చరిత్ర? నాకు తెలీదు చెప్పండి. చరిత్రంతా చెప్పే ఓపిక లేకపోతే కింది ప్రశ్నకి సమాధానమన్నా చెప్పండి.
యాభయ్యేళ్లకి పైగా చరిత్రుందని చెప్పుకుంటున్న ఉద్యమం ఇన్నేళ్లలో ఓ నిఖార్సైన నాయకుడిని పుట్టించలేకపోయిందంటే, కేసీయార్ లాంటి వాళ్లే దానికి ప్రాణాధారమంటే .. ఆ ఉద్యమమానికున్న బలమేంటో అర్ధమవటం లేదా?
ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన నాయకులు ఉన్నతులై ఉంటారు. నాయకుల అవసరాల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలు – ఇదిగిదిగో, ఇలాగే ఉంటాయెప్పుడూ. మీలాంటివారు సైతం ఆ ఊబిలో పడటం దురదృష్టకరం.
తెలంగాణకి సమస్యలు లేవా? ఉన్నాయి. ఆ విషయంలో మీదీ, నాదీ ఒకేమాట. అయితే ఆ సమస్యలకి ఎవరినో నిందించటం, విడిపోతా అనటం పరిష్కారం కానే కాదు.
ఎనిమిదేళ్ల ‘ఉద్యమం’ తర్వాత కేసీయార్ సాధించింది – తెలుగుజాతిని రెండుగా చీల్చటం. ప్రాంతీయ అసమానతలు, ఒకరినొకరు ఎగతాళి చేసుకోటాలు మన రాష్ట్రానికే పరిమితమైన విషయాలు కావు. అవి ఎప్పుడైనా, ఎక్కడైనా ఉండేవే. కేసీయార్ పుణ్యాన ఇంతకు ముందు శుభ్రంగా ఉన్నవారిలో సైతం ఇప్పుడు పరాయి ప్రాంతం వాళ్లంటే చులకనో, ద్వేషమో ఏర్పడింది. ఎవరి మేలు కోసం ఇది? ఆంధ్రా బూచిని చూపి కేసీయారూ, ఆయన కుటుంబమూ కోట్లు సంపాదించుకున్నారు. తెలంగాణలో ఎనిమిదేళ్ల కిందట కూలీ నాలీ చేసుకుని బతికినవాడి బతుకు గొంగళేమో వేసిన చోటే ఉంది. తెలంగాణ వచ్చినా, రాకున్నా కేసీయార్ బతుకు మాత్రం బాగుపడింది. అదే మేలు సగటు తెలంగాణవాసికి ఎందుకు జరగలేదు – రాష్ట్రం చీలికతో నిమిత్తం లేకుండా? ఆలోచించండి.
‘ఉద్యమ చరిత్ర’ అనే క్యాచీ పదాలు వాడటం మానేయండి ఇకనైనా 🙂
ఎంత సేపు యాభై సంవత్సరాల ఉద్యమ చరిత్ర అని డబ్బాలు కొట్టుకోవడమే గానీ వాస్తవ పరిస్థుతుల్నెవరైనా గమనించారా. 1969లో ఒక సారి వచ్చింది, ఆగిపోయింది. 1972 లో ఒకసారి వచ్చింది మళ్ళీ ఆగిపోయింది. తరువాత 2002 దాకా దాని ఊసే లేదు. మరి దీన్ని ఎలా యాభై ఏళ్ళ ఉద్యమంలా పరిగణించాలి?
@రవిచంద్ర:
1972లో జై ఆంధ్రా ఉద్యమం.
తెలంగాణ చరిత్రని మొత్తం మీ బ్లాగ్‌లో ఒక ప్రత్యుత్తరంగా వ్రాయడం సాధ్యం కాని విషయమని తెలిసి కూడా , ” నాకు తెలీదు చెప్పండి ? ” అని మీరు నన్ను అడగడం మీ బోటి తెలుగు బ్లాగ్పితామహులకి సబబు కాదు … అయిన ” ఉద్యమ చరిత్ర ” క్యాచీ పదంగా అనిపించిన మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలియచేసే నా ఫ్రయత్నం వృధాప్రయాసే అవుతుంది …
ఇక మీరు కేసీఆర్ మీద మీకు వున్న అక్కసుని , మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజల మీద వారు చేస్తున్న ఉద్యమం మీద రుద్దడం ఎంత వరకు సబబు అంటారు ? కేసిఆర్‌ని దూషించే నెపముతో మీరు కూడా అందరిలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిపై వెకిలి వ్యాఖ్యలు చేయడం నాకు మింగుడు పడటం లేదు . మీరన్నట్టు రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చే ప్రతిపాదన కేవలం కేసిఆర్ 8 ఏళ్ళ ఉద్యమ ఫలితం కాదండి , 1969 నుండి వుదండీ … ఉద్యమ చరిత్ర చదవమంటే మొండికేస్తారాయే … ప్చ్ …
FYI :తెలుగు బ్లాగ్లోకములో మీరు నాకు నచ్చిన వ్యంగ్య రచయిత కావడం , నా concern ప్రజల నుండి పుట్టిన ఉద్యమం గురించి కావడం , కేసిఆర్ పై అభిమానం కాక పొవడం వెరసి నేను మీ టపాపై కామెంట్ వ్రాయడనికి దారి తీసాయి … తెలంగాణ ఉద్యమ చరిత్రని మీరు క్యాచీ పదం అన్నా సరే నేనింకా మీ అభిమానినండోయ్ , వ్యంగ్యం పండించాలంటె మీ తరువాతే ఎవరైనా 🙂 ..
జై తెలంగాణ !!!!
అయ్యా ! రవి చంద్ర గారు ….
ముందు కాస్త చరిత్ర తెలుసుకురండి , తరువాత తీరిగ్గా మాట్లడుకుందాం డబ్బాల గురించి … పోలిస్ కాల్పుల్లో వందల మంది జనం చస్తేనే , ప్రభుత్వ ఆస్తులకి నష్టం జరిగితేనే ఉద్యమం జరిగినట్టా ??? 1969 ఉద్యమం తరువతా ” కలిసుండి ప్రగతి సాదిద్ధాం రండి .. ” అని బీరాలు పలికిన సదరు సమైఖ్యాంధ్రా నేతలు , ముల్కి నిబంధనలు ,610 జీఓలను తుంగలో త్రొక్కినప్పుడు కూడా చాలా సార్లు నిరసనలు , ఉద్యమాలు లేచాయండి … కాకపొతే మీరు ఆశించిన ప్రాణ ,ఆస్తి నష్టం జరగలేదు అంతే … అప్పుడు , ఇప్పుడూ , ఎల్లప్పుడు తెలంగాణ ప్రజలు ఒకే వాదానికి కట్టుబడి వున్నారు … ఉద్యమం పేరిట డబ్బాలు కొట్టుకునే అవసరం మాకు లేదు .. వుంటే , గింటే 1972 లొ జై ఆంధ్రా అని ఇప్పుడూ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన జారీ చేయగానే హైదరాబాద్ కావాలనే ముసుగులో “జై సమైఖ్యాంధ్ర” అని నినదిస్తున్న మీ బోటి ద్వంద్వ వైఖరి గల వాళ్ళకి వుంటుంది , డబ్బాలు కొట్టుకునే అవసరం …
@వీజె:
మీ అభిమానానికి ధన్యవాదాలు. ఐనా నేను మాత్రం నా అభిప్రాయాలు చేతనైనంత వాడిగానే రాస్తాను 🙂
కేసీఆర్ మీద నాకున్నది అక్కసు కాదు, అసహ్యం. అయితే దాన్ని టోకున తెలంగాణవాసులందరి మీదా రుద్దే అవివేకం మాత్రం లేదు. నేనెప్పుడూ తెలంగాణ ప్రజల్ని కానీ, వారి వేష భాషల్ని కానీ, సంస్కృతీ సంప్రదాయాల్ని కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎద్దేవా చేసి ఎరగను. ఎక్కడైనా చేసుంటే ఎత్తి చూపండి.
నా దాడంతా కేసీయార్ మరియు వేర్పాటువాదుల మీద. సందర్భమొచ్చిన ప్రతి చోటా ‘వేర్పాటు వాదులు’ అనో ‘ప్రత్యేక వాదులు’ అనో రాశానే తప్ప ‘తెలంగాణ వాసులు’ అనెక్కడన్నా రాశానా? “అద్దంలో చందురుడిని చూపిస్తూ పబ్బం గడుపుకునే దొరలని అమాయకంగా నమ్మేస్తూ, ఎన్నటికీ రాని తెలంగాణ కోసం ఆవురావురుమంటూ తరాలకి తరాలే గడిపేస్తారు. ‘రాష్ట్రమొద్దూ గీష్ట్రమొద్దూ. చేతనైతే మాకిన్ని స్కూళ్లో, నీళ్లో తెచ్చియ్యి’ అని మాత్రం నిలదీసి అడగరు” అనే వ్యాఖ్యలో సైతం ఉన్నది సగటు తెలంగాణ జీవి అమాయకత్వమ్మీద జాలే తప్ప వ్యంగ్యం కాదు. నా టపా మొత్తంలో మీకేమి వెకిలితనం కనిపించిందో నాకంతు పట్టటం లేదు!
‘తెలంగాణవారు అమాయకులు, అది అలుసుగా వారిని ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు’ అనేది వేర్పాటువాద నాయకుల ఆరోపణ. వాళ్ల అమాయకత్వం నిజం; ఆ అమాయకత్వం ఆసరాగానే ఆంధ్రోళ్లని బూచులుగా చూపి అతి తేలిగ్గా నమ్మించేయగలుగుతున్నారన్నది అంతకన్నా పెద్ద నిజం.
ఇక ‘1969 నుండీ ఉన్న’ ఉద్యమ చరిత్ర గురించో ముక్క. అప్పుడు రెండేళ్ల పాటు సాగి నాటి ‘ఉద్యమ సారధుల’ అవసరాలు తీరాక అటకెక్కిందా ఉద్యమం. అది ప్రజల మదిలో నిలిచే ఉంటే, 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచినప్పుడు (ఆస్థుల విధ్వంసమూ, అమాయకుల చావులే ఇలాంటి బోగస్ ఉద్యమాల తీవ్రతకి కొలమానాలు కాబట్టి – 1969 ‘జై తెలంగాణ’ చావులెన్నో 1972 ‘జై ఆంధ్రా’ చావులూ అటూ ఇటూగా అన్నే) ఓ తెలంగాణవాసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ‘జై తెలంగాణ’ గాయాలూ, గేయాలూ ఇంకా తాజాగానే ఉండి, ‘జై ఆంధ్రా’ వారు ‘హైదరాబాదు కూడా మాకొద్దు మా దారిన మమ్మల్ని పోనివ్వండి బాబో’ అని మొత్తుకున్నప్పుడు .. అప్పుడేమైపోయింది తెలంగాణ ఉద్యమం? రాష్ట్రాన్ని విడగొట్టటానికి అంతకన్నా మంచి తరుణం ఎప్పుడుంది?
మీతో పాటు ‘జై తెలంగాణ’ అని నేనూ అంటాను. అదే సమయంలో జై రాయల సీమ, జై కోస్తాంధ్రా, జై కర్నాటక, జైజై తమిళనాడు .. ఏదన్నా అనటానికి సిద్ధమే. దేశమంతా నాదే. అలాగే మీదీను. మరి నాలా అన్నిటికీ జై కొట్టటానికి మీరు సిద్ధమా? అలా సిద్ధమైన నాడే నాయకుల ఉచ్చులోంచి బయటికొచ్చి నిజానిజాలు చూడగలిగేది, సమస్యలకి నిజ పరిష్కారాలు ఎక్కడుందీ తెలుసుకోగలిగేదీ. రాష్ట్రాలు చీలిస్తేనూ, సాటివారిని నిందిస్తేనూ, ప్రాంతాల మధ్య అంతరాలూ పెంచితేనూ తీరేవి కావు తెలంగాణ సమస్యలు. రాష్ట్రం రెండు ముక్కలైనా, రెండొందల ముక్కలైనా మనకి ఒరిగేది ఏమీ ఉండదు. ఇరు ప్రాంతాలవారికీ పోయేదే ఎక్కువ. చిన్న రాష్ట్రాలే మంచివనుకుంటే మనతో పాటు దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నిట్నీ చిన్నవిగా విడగొట్టాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ని అలాగే ఉండనివ్వాలి. కొందరు నాయకుల అవసరాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టటం దారుణం.
చేట భారతమంత కామెంట్ రాశానిప్పటికే. చివరిగా .. ‘జై తెలంగాణ’, ఒకనాటి ‘జై ఆంధ్రా’ రెండు ఉద్యమాలూ నాయకుల స్వార్ధాల్లోంచి ఊడిపడ్డవేనన్నది నా నమ్మకం. ఇప్పుడూ ‘జై ఆంధ్రా’ అంటున్న వెధవలు కొందరున్నారు. మొదట మద్రాసు వదులుకుని, తర్వాత కర్నూలుకి రాజధాని హోదా పోగొట్టుకుని, యాభయ్యేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ని అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రుల్ని అందించినా ఎక్కడి వెనకబాటుదనం అక్కడే ఉంచుకుని, దేశంలోనే అత్యంత ఘోర కరువు తాండవించే జిల్లాల్లో మొదటి స్థానం కొట్టేసిన ఘనత మాత్రమే సాధించి .. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా ఎవరి మానాన వారు విడిపోతే రాయలసీమ గతేమిటి? రెడ్డొచ్చె మొదలాడె అనుకుంటూ మొదట్నుండీ మొదలెట్టాలా సీమ వాసులు?
బైదవే, తెలంగాణతో నాకు మీరు అనుకునేదానికన్నా ఎక్కువ అనుబంధమే ఉంది. ఆ వివరాలు అనవసరం అనుకోండి ….
జై ఆంధ్రా !!! జై గ్రేటర్ రాయలసీమ !!! జై తెలంగాణ !!! 🙂
నా అభిమాన రచయితగా మీ మీద నాకెంత గౌరవం వున్న ” జై సమైఖ్యాంధ్రా ” అని మాత్రం నినదించలేను … నిజాయితీ లేని కృత్రిమ ఉద్యమాలకి నేను జై కొట్టలేననండి .క్షమించండి 🙂 …
మీరెంతగా వారించినా , కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రజల సాధక బాధలు ఎరిగిన ఒక తెలంగాణ ప్రాంతవాసిగా , తెలంగాణ ఉద్యమం ప్రజల్లోనుండి పుట్టిన ఉద్యమంగానే భావిస్తాను … మీరనట్టుగా వేర్పాటువాదుల స్వార్ధపూరిత రాజకీయల్లో నుండి పుట్టిన ఉద్యమంగా మీరు దాన్ని అభివర్ణిస్తే , ముమ్మాటికి ఖండిస్తాను …
టీవీల్లొ కేసిఆర్ వ్యాఖ్యలు చూసి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని , ఉద్యమ స్ఫూర్తిని , ప్రజలను దూషించడం అనేది , రెసిప్షనిస్ట్ ప్రవర్తన బాగోలేదని మొత్తం కంపనీ యాజమాన్యాన్ని దాని ఉద్యోగులను దూషించడం వంటి తర్కం లేని చర్య …
ఉద్యమ చరిత్ర’ అనే క్యాచీ పదాలు వాడటం మానేయండి ఇకనైనా
*** *** ***
😀 😀 😀
Well, తెలంగాణ ఉద్యమానికెంత నిజాయితీ ఉందో సమైక్యాంధ్ర ఉద్యమానికీ అంతే నిజాయితీ ఉంది – మీరు జై కొట్టినా కొట్టకపోయినా.
కరీంనగరే కాదు, తెలంగాణ వెనకబాటుదనం గురించి మీరు చెప్పేవి నమ్మనని నేననటం లేదే. అయితే ఆ వెనకబాటుదనానికి పొరుగుప్రాంతం వాళ్లని దూషించటాన్ని ఒప్పుకోను. ‘ఓ ప్రాంతం వాళ్లంతా హోల్‌సేల్‌గా అమాయకులు, మంచివాళ్లు; మరో ప్రాంతం వాళ్లంతా దుర్మార్గులు, దోపిడీదారులు’ అనే వాదనలో ఏం తర్కం ఉంది? ఈ నైజం మారకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా మీ వెనకబాటుదనానికి పరిష్కారం మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? అప్పుడు మీ నాయకులు మరో యాభయ్యేళ్లపాటు ‘ఆనాడు ఆంధ్రోళ్లు దోపిడీ చెయ్యబట్టే ఇప్పటికీ వెనకబడిపోయాం’ అని చెబుతారు – అచ్చం మన వయ్యెస్సార్ తమ ప్రభుత్వ వైఫల్యాలన్నిట్నీ పాత తెదేపా పదేళ్ల పాలన మీదకి నెట్టేసినట్లు.మీరది అమాయకంగా నమ్మేసి ఆంధ్రోళ్లని తిట్టుకుంటూ మరిన్ని తరాలు గడిపేస్తారు.ఇంతోటిదానికి రాష్ట్రం చీల్చటం ఎందుకు?
నేను తెలంగాణ ప్రజల్ని దూషించిందెక్కడో చెప్పటం లేదింతకీ.
చాలా బాగా చెప్పారు. మీ వ్యాఖ్య రెండు లైన్లు చదవగానే నేనైతే ఏది రాద్దామనుకున్నానో సరిగ్గా అదే చెప్పారు.
అయ్యో భలే వారండి మీరు అబ్రకదబ్ర గారు , అలా అపార్ధన చెసుకుంటె ఎలా ? మీరు దూషించారని నేనలేదే … కేసిఆర్ మీదున్న అక్కసుతో కొంతమంది( నాకు తెలిసి కాస్త ఎక్కువనే )తెలంగానేతర ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలను దూషిస్తున్నారన్న issue context లో నేను వ్యాఖ్యానించడం జరిగింది … I would have been more specific , నెక్స్ట్ టైం జాగ్రత్త పడతా లెండి … మీరెలాగైతె ఆంద్రోళ్ళని తెలంగాణోళ్ళూ తిడుతున్నారు అనే వ్యాఖ్యని ఇష్యూ Context లో raise చేసారో , నేను అలాగె చేసాను … కొంపదీసి ఆంద్రోళ్ళ పై ధూషణ భారాన్ని నా మీద వేయరు కదా ? 😉
ఇక మన ధూషణల పర్వాన్ని దాటితే , తెలంగాణ రాష్ట్ర ఏర్ఫాటు తదనంతర పరిణామాలు మీరు ఇప్పుడే ఊహించేసుకొని , దానికి కూడ ” ఆంధ్రా దోపిడీ ” బూచిని చూపి మమ్మల్ని అమాయకులని చేసి మా నాయకులు ఆడిస్తారనడములో మీ తర్కమెంత ? ప్రత్యేక రాష్ట్రం కావలనుకున్నప్పుడు మా బాధలేవో మేము పడతాము కదండీ .. అయినా ఇప్పుడా చర్చ అప్రస్తుతం … ఒక విషయం తెలియకడుగుతా , మీరు చీటికి మాటికి తెలంగాణా ప్రజలందరు అమాయకులు అనడములో మీ ఉద్దేశ్యం ఏంటొ అంతు చిక్కడం లేదు నాకు… రాజకీయ ఉచ్చులో పడి , ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఎక్కడో విజయనగరంలో సమైఖ్యాంద్ర ఉద్యమంలో పాల్గొనే రిక్షావాడిలో నాకు అమాయకత్వం కనబడుతుందే గాని , 50 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్న సగటు తెలంగాణా ప్రజల్లో నాకు ఏ కొశాన అమాయకత్వపు చాయలు కనబడటం లేదు … కాస్త ఈ ” అమాయకత్వం ” నుండి బయట పడాల్సిందిగా ప్రార్థన 🙂
చిన్న పాయింట్ మరిచాను .. మీరు ఇష్యూని కేసిఆర్ దారి పట్టించరంటే తెలంగాణా వాదిగా నాదో మాట ….
” మా పోరాటం సీమాంధ్రా పాలక వర్గంపై గాని సీమాంధ్రా ప్రజలపై కాదు “
మా పోరాటం సైతం తెలంగాణ నాయకుల పైనే 😉 మీలా పద్ధతిగా వాదించే వేర్పాటువాదుల మీద కూడా కాదు.
Any way, ఇప్పటికే ఎక్కువ వాదించేసుకున్నట్లున్నాం.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాధాలు … నూతన సంవత్సర శుభాకంక్షలు 🙂 …
ఈ దొరవారు ఏదిజరిగినా అది అంధ్రావాల్ల వల్ల అని అంటం..వారి వందిమాగధులు భజన చెయ్యటం అలవాటుగా మారిపొయింది…
ప్రతిసారి ఏదొవొకటి వాగటం తూచ్ నేను ఆంధ్రాపాలకులని అన్న ప్రజలని కాదు అని అనటం..
ఈయన వాగుడికి బ్రేకు వెయ్యకపొతే ఈ తెలబాన్లు బాగా రెచ్హిపొయే ప్రమదం వుంది
మొత్తం తెలంగాణా ఎపిసోడ్ వల్ల ఒరిగిందేమిటంటే నిరాహార దీక్షలు ఫర్ డమ్మీస్ అన్న పుస్తకం రాసుకోడానికి తగినంత సరుకు దొరికింది.
తెలంగాన వాల్లు సమైక్య వాదమే కోరుకుంటే ఇంతవరకూ రాజకీయ పర్టీ లు తెలంగాణా విషయంలో మేము కట్టుబడి ఉన్నాము..లాంటి కబుర్లు ఎందుకు చెప్పాయి? ఇవ్వము అని చెప్పొచ్చు కదా?
ఇప్పుడెలాగూ ఎమ్మెల్యేలంతా రజీనామా చేసారు కాబట్టి మల్లీ ఎలక్షన్లు రనీండి. అప్పుడు తెలంగాణాలో సమైక్యాంధ్ర కి మద్దతు పలికే పటీలే గెలిస్తే, మీరన్నట్టు తెలంగాణా వాల్లు సమైక్యాంధ్ర కోరునుంటున్నారు. అప్పుడు అలాఘె కానిద్దాం.
“అద్దంలో చందురుడిని చూపిస్తూ పబ్బం గడుపుకునే దొరలని అమాయకంగా నమ్మేస్తూ, ఎన్నటికీ రాని తెలంగాణ కోసం ఆవురావురుమంటూ తరాలకి తరాలే గడిపేస్తారు. ‘రాష్ట్రమొద్దూ గీష్ట్రమొద్దూ. చేతనైతే మాకిన్ని స్కూళ్లో, నీళ్లో తెచ్చియ్యి’ అని మాత్రం నిలదీసి అడగరు.”
Well said.
అమెరికన్ హిస్టరీ ఫర్ ఇడియట్స్ :-)))
బాబోయ్, మీరు ఉద్యమ చరిత్ర అడక్కండి! ఇప్పుడు నానా లింకులూ చదవలేక చావాలి మేము!
Sorry for writing in telugu. Here are my 2 cents.
Credibility of current telangana movement:
POINTS NEEDING CLARITY:
1.division is not a simple family problem.we should be careful of what we ask and careful of whom we give power to after getting telangana.Its a higly responsible task.
2.our politicians incapability or selfishness is reason for the underdevelopment in Telangana and not the andhra people.90 percent of Telangana politicians amassed atleast 100 crores by using power instead of fighting for peoples problems.
3.what was done to alleviate problems in telangana by our telangana politicians?
4.Who takes responsibility for development. Will anybody(who is supporting telangana state) take oath that they will face death penalty if Telangana is not developed by our politicians even after 10 years of telangana formation?
5.THOSE WHO TAKE RESPONSIBILITY FOR THE AFTER EFFECTS OF TELANGANA ARE THE ONLY ONES WHO CAN BE LISTENED TO but there are none in telangana agitation right now.
6.Those who are involved in the telangana agitation right now are politicians who donot have any ministries.Those who donot have any jobs or those who have government jobs and will never loose them at any cost and the students who anyway have no responsibilities or burdens whatsoever are the ones who are agitating.
7.Instead of asking the telangana politicians of what they have tried to solve the problems of telangana area,people fell in to the trap of sentimental blackmail by politicians, especially KCR.Remember,He had not done anything as M.P or central Minister in his entire career.How can we trust & give a state to him
Sri Garu..
//especially KCR.Remember,He had not done anything as M.P or central Minister in his entire career.How can we trust & give a state to him//
really good point..and he dint even fight for single social cause till now except for his kalpataru-Separate Telangana.
“కేసీయార్ ‘ప్రపంచంలో ఎక్కడైనా విడిపోటానికి ఉద్యమాలు జరిగాయే తప్ప కలిసుండటానికి జరిగాయా’ అని చొప్పదంటు ప్రశ్నొకటేశాడు.” – అతగాడీ ప్రశ్న వెయ్యగానే మధు యాస్కీ లాంటి ఇంకా కొందరు సత్రకాయిలు కూడా అదే పాట పాట్టం మొదలెట్టారు. ఎవ్వుడికీ కూడా బెంగాలు విభజనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గుర్తుకు రాలేదు.
హెహెహె భలే పాయింటెత్తారు. ఐనా మనోళ్ళూ బెంగాలీలు కాదు కదా. తెలుగోళ్ళు గిల్లుకునేటోళ్ళు కదా. గోళ్ళు గిల్లుకునేందుకు కూడా చేతగాక లేన గొడవలు పెట్టుకుంటున్నారు.
“అన్నదమ్ముల్లెక్క ఇడిపోదం” అంటున్నాడు కదా కేసీయార్? ఏ అన్నదమ్ములు? కౌరవులూ పాండవులూనా? అంటే రాష్ట్రం వచ్చాక కురుక్షేత్రం తప్పద, సర్వనాశనం తప్పదు. ఇప్పటికే అంధ్రా వాళ్ళు భయంతో చస్తున్నారు. రాష్ట్రం వచ్చాక పాకీస్తాన్ లో హిందువులే అవుతారేమో మరి. జై తెలికీస్తాన్
*** *** ***
With due respect to the తెలంగాణా పీపుల్, ఆమ్ధ్రావాళ్ళుండటం కాదు దౌర్భాగ్యం. సరైన నాయకులను పుట్టించుకోలేక పోవటం దౌర్భాగ్యం. ఇంకెంతకాలం బొబ్బిలి బ్రహ్మన్నని పట్టుకుని వేళాడతారు?
“ఎవ్వుడికీ కూడా బెంగాలు విభజనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గుర్తుకు రాలేదు.” రాదుకూడా, ఎందుకంటే అది selective (pick & choose) పాలసీ కాబట్టి.
తేలంగాణ్ ఇస్తే మరి అంద్ర కి రాజదాని ఏక్కడ రామలసిమ లోన కోస్తా అంద్రలోనా.
ఏక్కడ ఏక్కడ ఏక్కడా…
Thummithe voodathamane mukkuloo! Mari appule nishpaththilo panchukundam?
really proud to read telugu blogs
telangana tooch ki ardam marabothundi brother….andhra palakula nollaki kallallu pade vidhamga..roju roju penu marpulo chusthunaru kada…..vidhyarthi garjana tho prathi okkari hrudayapu chappullu vinipinchai anukunta samaikyandhra vaadhulaki….
yellaki tharabadi charithra unna telangana undhyamam tooch anela cheyyali anukunna evvaru apagalaru…;)
palle palle lo jai telangana anna ninandham vinapadatleda…
ok anyways blog nice…good keepit up…
jai hindh
@telanganabidda meeru telangana korukodam lo tappu ledu,kani pakka valla meda dwesham kakki kadu, late ysr cheppinatlu hyderabad ravalnte passport kavalani. vidayardhulu antunnaru, vignatho tho matludu tunnara. chaduvukuntunna vari ga samskarm tho matladali gada. alanti matalu meeku meerantunna socalled samaikya vadullo matladatam ledu . daya chesi gamanichali.
మీకు place ఉందని బాగానే పెద్ద వ్యాసం రాసారు బాగుంది కానీ.మీరు ఒక్కసారి హరీష్ రావు Assembly లో ఇచ్చిన స్పీచ్ చుడండి. moreover తెలంగాణ అంటే KCR ఒక్కరే కాదు. ఆయన తాగుతున్దచ్చు, మనం ఎవ్వరు తాగామా? మరి 2001 lo YSR తెలంగాణా కావాలని అందరి MLA, MP లతో కలిసి సంతకాలు తీసుకోని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేకలు ఇచ్చాడునిజమగా అన్యాయము జరగపోతే? మీరు facebook, orkut తెలంగాణా profiles కి వెళ్లి చుడండి మీకు చాలా Pdf, word documents దొరుకుతాయి. మీరు ఎందుకు separate వద్దు అంటున్నారో ఒక్క కారణం కూడా ఇవ్వ్వలేదు. ఒక్క తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిచడం తప్ప. కానీ తెలంగాణా వాళ్ళు వంద కారణాలు చూపిస్తారు ఎందుకు కావాలో.
మీరు చెప్పారు, తెలంగాణా లో కొందరు సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నారు అని మరి ఆంధ్ర లో లేరు అంటారా separate రాష్టం కావాలని కోరుకునే వాళ్ళు..ఉన్నారు మీరు regular గా వార్తలు follow అయ్యి ఉంటె మీరు చూసే ఉంటారు. మేము అందరు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేసారు అని అనడం లేదు, తెలగాణ పోరాటం ఆంధ్రా ప్రజల మీద కాదు, ఆంధ్రా పాలకుల మీద మాత్రమే.
తెలంగాణా వచ్చిన తరువాత ఆంధ్రా వాళ్ళను వేల్లగోడుతారు అని అనుకోవడం తప్పు. ఎ విషయం చదువుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఈ ఉద్యమం లో కొందరి ఆస్తులు ద్వంసం చెయ్యడం ఏదో ఆవేశం లో అంటే…Example, సమైక్యాంధ్ర ఉద్యమం లో ఆంధ్రా ప్రజలే ఆంధ్రా లో తమ వాళ్ళ ఆస్తులు ద్వంసం చెయ్యడం చేసారు. అంటే తప్ప ఏదో అందరిని వెళ్ళగొట్టాలని కాదు.
తెలంగాణా వాళ్ళు ఒక్కరే మనం తెలుగు వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా..అందరు అనుకోవాలి.