సమైక్య నాదం

ఒక్క రోజులో రాష్ట్రంలో రెండు ఊహించని పరిణామాలు! స్వప్రయోజనాలే పరమావధిగా కొందరు స్వార్ధపరులాడిన నికృష్ట రాజకీయ కేళి తన మనుగడనే ప్రశ్నార్ధకం చేయనుందని తెలిసి తెలుగుతల్లి గుండె పగిలి తల్లడిల్లింది. ‘బాధపడకు, మేమున్నాం నీకండగా’ అంటూ ఏళ్ల మౌనం వదిలి సమైక్యవాదులు పిడికిళ్లు బిగించి దిక్కులు పిక్కటిల్లేలా చేసిన సింహనాదానికి గల్లీ నుండి ఢిల్లీ దాకా దద్దరిల్లింది. ఆంధ్రుల దెబ్బకి అసెంబ్లీ అబ్బా అనింది. అన్నదమ్ముల మధ్య తాము పెట్టిన లొల్లి ఆఖరి అంకానికి చేరిందని చంకలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకోబోయిన వేర్పాటోన్మాదుల గొంతులో ముద్ద తిరిగి నోట్లోకొచ్చింది. తోలుబొమ్మలాటలో తన ప్రతిభ ఆంధ్రుల ముందు ప్రదర్శించబోయిన అధిష్టానం అధినేత్రి మెదడు మొద్దుబారేలా తెలుగువాడి తడాఖా తెలిసింది. ఎనిమిదేళ్లుగా లాగీ పీకీ గోరంత తెలంగాణ సెంటిమెంటుని భూతద్దంలో కొండంతగా చూపి తిమ్మిని బమ్మిని చేసి తిండీ తిప్పలూ మానుకున్నట్లు నటించి ఎట్టకేలకు తెచ్చుకోబోయిన ఈనాముకి ఊహించని రీతిలో పురిట్లోనే సంధి కొట్టి, ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర సెంటిమెంటు దెబ్బకి గాలికెగిరిపోయే సూచనలు కనిపిస్తుంటే బిత్తరపోవటం షరాబీబాబు వంతయ్యింది. విధ్వంసం సాగించి రాష్ట్రాన్ని చీల్చాలనే ఉన్మాదపుటెత్తుగడ ఫలించినట్లే అగుపించి ఆఖరి క్షణంలో అనుకోని రీతిలో చిత్తయ్యింది. సందట్లో సడేమియాగా – ఉత్తుత్తి దీక్షలకే కాళ్లబేరానికొచ్చే కేంద్రాన్ని తామూ ఓ చూపు చూస్తామంటూ, దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే దిశలో మరో పదకొండు ప్రత్యేక రాష్ట్రోద్యమాలు ఉన్న పళాన కొత్త ఊపిర్లూదుకుంటూ నిద్ర లేచాయి.

సినిమా పరిభాషలో ఇది తెలంగాణ తంతుకీ, తంపుకీ ఓ ఊహాతీత ట్విస్ట్ ఎండింగ్‌తో కూడిన యాంటీ క్లైమాక్స్. కిందపడ్డా గెలిచినట్లు బుకాయించే ప్రయత్నాలెన్ని చేసినా, అతికి పోయిన ప్రత్యేకవాదులు వాళ్లకి వాళ్లే కట్టుకున్న గోరీ ఇది. ఎదుటి వారి మౌనాన్ని అలుసుగా తీసుకుని అడ్డూ ఆపూ లేకుండా పెట్రేగిపోతే చివరికి జరిగేదేంటో, ఏ విషయాన్నైనా తెగేదాకా లాగితే ఒరిగేదేంటో రాబోయే కొన్ని తరాలపాటు చెప్పుకోటానికిదో గొప్ప ఉదాహరణ. మందుబాబొక్కడు అలిగి అన్నం మానతానని బెదిరిస్తేనూ, అతనికి మద్దతుగా కొన్ని వందలమంది పదుల సంఖ్యలో బండ్లనీ అంగళ్లనీ బుగ్గి చేస్తేనూ బెదిరిపోయి దిగొచ్చే దుర్భల ప్రభుత్వాలు వందల మంది ప్రజా ప్రతినిధుల మూకుమ్మడి నిరసనోద్యమాన్ని ఎలా తట్టుకుంటాయో మరి.

‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అనేది వేర్పాటువాదులు విరివిగా వాడుకలోకి తెచ్చిన ప్రయోగం. ఆ చిలక పలుకుల అర్ధమేంటో తెలీక తికమక పడేవాళ్లు కోకొల్లలు. ఎందుకంటే, అనాదిగా ఆంధ్రులెరిగిన వాడుక ‘అన్నదమ్ముల్లా కలకాలం కలిసి మెలసి ఉండండి’ అనేదే. వంకర రాజకీయవేత్తల విపరీతపు బుద్ధుల్లోంచి పుట్టేవే అన్నదమ్ముల్ని విడదీయాలనే వికృతాలోచనలు. ఇంతకీ తెలంగాణ-ఆంధ్ర ప్రజల్లో అన్నలెవరో, తమ్ములెవరో అని బుర్ర బద్దలు కొట్టుకునేవాడినిన్నాళ్లూ. ఇప్పుడర్ధమయింది ఎవరెవరో. చెడు సావాసగాళ్ల ప్రభావంతో పెడదారి పట్టిన తమ్ముడి మీద అవ్యాజానురాగంతో ఏదోనాటికి దారికి రాకపోతాడా అనుకుంటూ మౌనంగా ఓపిక పట్టీ పట్టీ, చివరికి మైకం ముదిరి సొంతింటికే నిప్పంటించబోయిన తోడబుట్టినవాణ్ని లాగి పెట్టి లెంపకాయ కొట్టి మత్తు వదలగొట్టిన అన్నలు ఆంధ్రా, సీమ ప్రజలు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సమర్ధనగా వేర్పాటువాదులు చెప్పేవి చీకిపోయిన చరిత్ర కథలు, చేసేది సంస్కృతి పేరిట స్వీయ భుజాల చరుపులు, వేసేవి దోపిడీదార్లంటూ తోటి తెలుగువారిపై నిందలు. ఎవరికి మాత్రం లేదు ఘన చరిత్ర? ఎవరికి లేవు సంస్కృతీ సంప్రదాయాల భుజకీర్తులు? ఎవడు దోపిడీదారు – అవసరం మేరా వాడుకుని అది తీరాక తూనాబొడ్డని తీసిపారేసేవాడా, లేక ఉమ్మడి రాజధానికి తమ శ్రమఫలాలన్నీ దోచి పెట్టేవాడా? ఎవరి వెనకబాటుదనానికి ఎవరు కారణం?  అయినా వెనకబాటుతనం తెలంగాణకే సొంతమా – రాష్ట్రంలో ఇంకెక్కడా లేదా? నాలుగొందలేళ్ల నత్తనడక చరిత్రలో ప్రజల్ని బానిసలు చేసి నిజాములూ దేశ్‌ముఖ్‌లూ పోగేసుకున్న సంపద చూపించి యాభయ్యేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు సాధించిన ప్రగతిని పూచికపుల్లలా తీసిపారేయటంలో ఔచిత్యమెంత? రజాకార్ల గొడవల్లో తమకే అవసరం లేకపోయినా తలదూర్చి భుజం భుజం కలిపి పోరు సాగించిన పొరుగు ప్రాంతం వారిని అవసరం తీరిపోయాక తీరిగ్గా కూర్చుని దొంగలుగా చిత్రీకరించటంలో నీతి ఎంత? ‘ఆంధ్రప్రదేశ్’గా ఆకట్టుకున్న పెట్టుబడుల్నీ, తెచ్చుకున్న నిధుల్నీ రాజధాని అభివృద్ధికి వాడేసుకున్నాక తీరా ఇప్పుడు ‘ఇదంతా నాదే, నీ ఖర్మకి నువ్వుపో’ అనటంలో నిజాయితీ ఎంత?

ఇవేవీ సమాధానం లేని ప్రశ్నలు కావు – వేర్పాటువాదులందరూ సమాధానం దాటేసే  ప్రశ్నలు. అది గ్రహించలేనివారు కారు తెలంగాణ ప్రజలు. అందుకే సమైక్యతకి సమర్ధనగా ఆంధ్రా/సీమ జిల్లాల్లో ఒక్క రోజులో ఒక్కుమ్మడిగా వెల్లడైన విస్తృత జనాభిప్రాయం ఇన్నేళ్ల తర్వాతా వేర్పాటుకి అనుకూలంగా తెలంగాణలో సాధ్యం కాకపోవటం. దానికి సాక్ష్యమే, వేర్పాటే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ ఏ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు సాధించకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవటం.  నలభయ్యేళ్ల పేరు గొప్ప చరిత్రలో ఒక్క నిఖార్సైన నాయకుడినీ పుట్టించలేని ఉద్యమం ఓ ఉద్యమం. ఉన్న పది జిల్లాల్లోనూ సగం జిల్లాల్లో ఉనికే లేని పార్టీ ఆ ఉద్యమానికి ఏకైక దిక్కు. సాక్షాత్తూ రాజధాని ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేని పక్షం తెలంగాణ గుండె చప్పుడుకి ప్రతినిధి – హతవిధీ!

ఆంధ్రా, సీమల్లో వెల్లువెత్తిన రాజీనామాల పరంపర రేపో మాపో నిమ్మళించొచ్చుగాక – రాష్ట్ర ప్రజానీకం అసలు గుండె చప్పుడు వినబడటం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఇదే నాంది. త్వరలో ఇది తెలంగాణకీ పాకుతుంది. ఇల్లన్నా అలక్కుండానే పండగ చేసుకోబోయిన వేర్పాటువాదులకి ముసళ్ల పండగే ముందుంది.

68 స్పందనలు to “సమైక్య నాదం”


  • 2 Manipal Reddy 4:58 ఉద. వద్ద జనవరి 16, 2010

   Telangana udyamam gurinchi entho vimarsisthu samykyandra udyamanni samarthinche meeku oka vinnapam. If you want people to be united you should publish things that makes every one feel united. But i dont see such commitment in you.You are always criticizing telangana movement. If you want some one to be cool down at the same time you should approach in the same way and make him understand that we are all same and we all are at same page. This can only be done through peace full discussions between two regions. Try to figure out the root cause for this movement. Please keep one thing in your mind that no movement cannot survive long with out people support. You are protesting at your place and demanding united. Does this make sence. As you said if the Govt spend so much money on telangana why don’t govt comes up and show those details to public for clarity. You know that state is not heading by KCR now. Why dont CM clarify these. If you and me want united, we both should sit and get the clear picture on both views. Thats the only solution. No one is trying in this way including you Mr Abrakadabra.

   • 3 Manipal Reddy 5:20 ఉద. వద్ద జనవరి 16, 2010

    And one more important thing i should mention. NO other party has mentioned against telangana before 2009 elections. Were you guys sleeping at that time. You always say that TRS lost. Even i didnt support TRS but not telangana.Yes it has lost elections but parties won in telangana are also supported telangana. Do you know TDP allied with TRS and won 39 seats. If people rejected TRS then how could TDP got these many seats. Even MR great YS supported telangana till the last minutes of poling in telangana. Who ever lost or won all are only from telangana this elections are from Seemandra. all these calculations are waste and making people fools. You said people developed HYD. Who developed…. did any one make roads or drinage in hyd. Who ever come is here only for thier bussiness and this is good. NO one should object this and cannot oppose as long as we are in India. Any person can live any where in india. If you think telangana movement is running by TRS …then United movement is running by Real estate owners from seemandra.

    Finally if you think we all should be united….. stop writing articles in this way. This telangana problem should be resolved at any cost by either developing all the parts of the state or clearing the all doubts of telangana people.

    Mr AbrakaDabra vangyam navvukovadaniki matrame…..not to play with people sentiments.

 1. 4 a2zdreams 6:16 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  1. హైదరాబాద్ తమకు కాకుండా పోతుందనే ఈ సమైక్య నినాదం తప్ప, ఈ సమైఖ్య వాదులకు అన్న మీదో తమ్ముడు మీదో ఉన్న ప్రేమ మాత్రం కాదు.

  2. ఎన్నికల ముందు ప్రత్యేక తెలంగానకు జై కొట్టిన నాయకులకు, వారిని సపోర్ట్ చేసిన ఆ పార్టీ సపోర్టర్స్ కు సిగ్గు, ఎగ్గు లేదని స్పష్టమవుతుంది.

  • 5 epraveenkumar 11:09 సా. వద్ద డిసెంబర్ 10, 2009

   హైదరాబాద్ ఎమీ పుట్టీ నప్పటీ నుంచి అలా లేదు గతి పదిహేను సంత్సరాలలోనే అభివృద్ది చెందింది.అది తప్ప్ ఆంధ్ర ప్రాంతంలో ఎమి అభివధ్దిచెందాయి.అదే 50 సంత్సరాల క్రితం కలవకుంటే ఇప్పటికీ అది నిజామాబాద్ లాగే ఉండేది.మొదట అది తెలిసుకొండి.

  • 7 Praveen Sarma 12:08 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

   హైదరాబాద్ మేడి పండుని చూసి ఒంగోలు దగ్గర ఎలుకలు పట్టుకుని తినే యానాదులూ, నల్లమల అడవుల్లో ఉడుములు పట్టుకుతినే చెంచులూ, పార్వతీపురం ఏజెన్సీలో దున్నపోతు మాంసం ఎండబెట్టుకుతినే సవరలూ, కోందులూ కూడా మురిసిపోవాలి కదా!

 2. 8 Brahmanandam Gorti 6:17 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  నలభైకి పైగా రాష్ట్రం నుండి ఎంపీలుంటే, ఒక్క కేబినెట్ హోదా ఉన్న కేంద్ర మంత్రి లేడు. నాలుగు పైగా కేంద్ర పదవల్లో తమిళతంబిలున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చింది ఆంధ్రా వల్లే! మొదట్నుంచీ కాంగ్రెస్ కి తెలుగువారంటే చిన్నచూపే! ఎంపీలందరూ రిజైన్ చేస్తే, లోక్ సభకి ఎన్నికలు ప్రకటిస్తే ఇటలీ అమ్మవారికి తెలిసొస్తుంది. ఈ దెబ్బతో ఆంధ్రాలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోడం ఖాయం.

 3. 9 a2zdreams 6:35 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  Brahmanandam Gorti, you are expecting too much from them.

  మన నాయకులకు అభివృద్ధికంటే సొంత ఆస్తులు పెంచుకొవడమే ముఖ్యం. వారికి హైదరాబాద్ లో వున్న ఆస్తులకు ఎక్కడ నష్టం కలుగుతుందనే బాదతో ఈ రాజీనామాలు తప్ప కలిసుందాం అని మాత్రం కాదు. ఈ నాయకులే ఎన్నికల ముందు ప్రత్యేక తెలంగానకు సమ్మతమే అని గంగిరెద్దుల్లా తలలు వూపారు.

 4. 10 vasu 7:47 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  బాధేస్తోంది. గుండెల్ని పిండేస్తుంది. కాని ఏం చెయ్యాలో, ఏం చెయ్యగలమో తెలియట్లేదు. మన రాష్ట్రాన్ని ముక్కలు చేసి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వడానికి వాళ్ళెవరు
  ఎవడబ్బ సొత్తని. మీడియా కూడా అవసరానికి మించిన కవరేజి ఇచ్చి కెసిఆర్ ని హీరో చేసేసింది. వాళ్ళకి ఒరిగేది ఏంటో దీని వాళ్ళ నాకర్థం కావట్లేదు.
  బస్సు లు తగలబెడితే, ౪ రోజులు అన్నం మాని సెలయిన్ ఎక్కించుకుని దీక్ష చేస్తే రాష్ట్రం ఇచ్చేడట్టైతే, వందల సంఖ్యలో సమైఖ్యాంద్ర కోసం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.
  తెలంగాణా లోనే తెలంగాణాని వ్యతిరేకించే వాళ్ళు కోకొల్లలు. ఎవరిని సంతోష పెట్టడానికి ఇది.

 5. 12 krishna 8:13 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  ఎన్నికల ముందు, రాదు అన్న నమ్మకంతో, తెలంగాణా కు సై అన్నారు కాని, ఇష్టపడి మాత్రం కాదు అన్నది అన్ని పార్టీలవాళ్ల విషయం లో నిజం.

  తెలంగాణాలో ఎన్నికలు అవగానే ysr అన్న మాటలు మర్చిపోయారా, TDP కోస్తా లో దెబ్బతినటానికి అది కొంత కారణం కాదా? మన ఇంట్లో బుఱ్ఱ ఎదగని ఓ పిలగాడు, నాకు చెందమామ కావాలి, చెందమామ కావాలి అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే, అలాగేలే అమ్మా, తెచ్చి ఇస్తాములే అన్నట్లు మాత్రమే అన్ని రాజకీయపార్టీలు తెలంగాణాకు ఒప్పుకొన్నాయి అన్న నిజం, అప్పుడు ఒప్పుకొన్నవాళ్లకు, వాళ్లను నమ్మి వోటేసిన పెజలకు కూడా తెలుసు. ఆ లెఖ తప్పినందుకే ఇప్పుడు రాజీనామాలు.

  ఇప్పుడు ప్రశ్న, kcr మళ్లీ బెడ్ ఎక్కుతాడా లేదా అన్నది, మొన్న అక్కడి జనాలు ఆయన జ్యూస్ తాగగానే ఇచ్చిన ట్విస్ట్ కు, మళ్లీ ఆ సాహసం మాత్రం చేయడని చెప్పవచ్చు.

 6. 13 M.RadhaKrishna 9:20 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  chala baaga chepparu,ninnati nundi emi cheyabuddeyaledu,samaikyadrane muddu.

 7. 14 Ali 9:45 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  అయ్యా తెలు-గోడు గారు

  మీరు చెబుతున్న సమక్యాంధ్రలొ తెలంగాణా వారికి జరుగుతున్న న్యాయం చెబుతా వినండి.Hyderabad లొ ఈనాడు పదకొండు Tv Channels ఒక Telugu News Paper పెట్టి సమాజాన్ని ఉద్ధరిస్తున్న ఒక పెద్ద మనషి organisation లొ నేను మూడు సంవత్సరాలు job చెసాను. year 2006 వరకు ఆయన Organisation లొ Hyd staff మొత్తం తొమ్మిది వేలు నా Department లొ Staff మూడు వందల ఇరువయ్యి.అందులొ తెలంగాణా ప్రాంతం వాల్లు ఎంతొ ఉహించగలరా???.అక్షరాల పద్దెనిమిది (18 members).మొత్తం organisation లొ తెలంగాణా ప్రాంతం వాల్లు మూడు వందల మంది కూడా మించరు.Year 2002 వరకు security guard నుండి Broadcast engineer వరకు Office boy నుండి Chief Editor వరకు ఎవరిని తెసుకోవలన్నా Walk-in-Interviews కేవలం Coastal areasలోని జిల్లా ఎడిషన్లొ మాత్రమె ఇచ్చెవారు.అయ్యా లక్షలు విలువ చెసే మా తాత తండ్రుల భూములు వేలల్లొ ఇస్తె,మాకు చెసే న్యాయం ఇది.మీరు చెప్పేఅన్నదమ్ముల మధ్య బందం ఇదా? సమక్యాంధ్రలొ మాకు జరిగే న్యాయం ఇదా???

  Ali

  • 15 epraveenkumar 11:13 సా. వద్ద డిసెంబర్ 10, 2009

   బాబు అలి ఏలా అవుతాయి అవి లక్షల భూములు అందరు పెట్టుబడులు పెట్టి కొమ్టే అవుతాయి.లేదంటే అవి వేలు కాదు కాదా రూపాయలు అవుతాయి.

  • 16 Venkat 12:39 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

   అసలు తప్పు నీ దగ్గర వుంది అలీ భాయ్… ఏ ప్రాంతం వాడు ఐతే ఏంటి.. ఎంత మంది కి.. పనికల్పించం అనేది … ముఖ్యం . నీ మనసులో ఆ భావన తో చూసావ్ కాబట్టే అల కనిపించింది … నువ్వు వాణ్ణి సాటి బారతీయుడు అని నువ్వు అనుకోలేదు . అది నీ తప్పు .. లోకల్ వాళ్ళకే పని కల్పించాలి అంటే మన తెలుగు వాళ్ళు విదేశాల్లో వున్నత స్థానం లో వుండరు…. మన తెలంగాణా లో తప్పితే … ఏ దక్షిణ రాష్ట్రము లో ఈ వేర్పాటు వాదం లేదు అంటే అవి అన్ని అభివ్రుది చెందినా రాష్ట్రాలని అర్ధమా… అర్ధం లేని ప్రాంతీయ బావం తప్పితే ఆలోచన లోనుండి పుట్టినది కాదు ఈ ఉద్యమం …

  • 17 sri 2:02 సా. వద్ద డిసెంబర్ 11, 2009

   if some business people exhibit this kind of mean mindedness, then deal with it accordingly and get your politicians to fight this kind of situations in a point blank manner on these specific issues. Don’t you think andhra area people got affected by meanmindedness of the telangana people at all?

   Problems like this can always be solved by working at point blank range or close range and solving it. Seperation is not the solution for everything. Infact, even seperation itself has its own problems.

   Don’t give silly reasons for the seperation. Above all, we cannot trust politicians like KCR and hand them over power. Who will be responsible if KCR after getting telangana and becoming C.M, misuses his power and loots peoples property? Will you take responsibility for this Misuse by KCR?

   Above all, KCR has not proven his caliber as a leader at all. Coming to the fast-unto-death issue by KCR, even a teen ager will go on fast unto death if the teenager doesnot get what he wants. So, apart from fast-unto-death drama (and there by sentimentalizing people of telangana) there is no other credible or major achievement by KCR in his entire political career. How can you trust this kind of leader and entrust the leading of telangana state?

  • 18 అబ్రకదబ్ర 8:59 సా. వద్ద డిసెంబర్ 11, 2009

   ఆలీ గారు,

   తొమ్మిదివేలమంది ఉద్యోగులున్న సంస్థలో ఏ ప్రాంతం వారు ఎందరనే జాబితా మీకెలా, ఎక్కడ లభించిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది 🙂

   అంత వివక్ష ఉన్న సంస్థలో మీరు అన్నేళ్లు మనగలిగారనేది నమ్మశక్యం కాని విషయం – అదీ, ఇంత పెద్ద ప్రత్యేకవాది అయ్యుండీ. తెలంగాణపై మీ ప్రేమ నిజమేనైతే ఆ ఉద్యోగం నుండి మీరు వెంటనే వైదొలగన్నా ఉండేవారు, లేదా మీరు ప్రత్యేకవాదైనందుకు వాళ్లన్నా మిమ్మల్ని గెంటేసుండేవారు. అవి రెండూ జరగలేదంటే ఎక్కడో తేడా ఉన్నట్లు. ప్రత్యేకవాదులందరికి మల్లే మీరూ గోరంతని కొండంతలు చేస్తున్నట్లు. అవునా?

   అయినా చర్చోపచర్చలకీ, వాదోపవాదాలకీ సమయం ఐపోయింది. ఇప్పుడు మిగిలింది ప్రత్యక్షంగా బలాబలాలు తేల్చుకోటమే. అది ఆల్రెడీ మొదలయింది. చూస్తుండండి – సమైక్య గొంతుకలు తెలంగాణలోనూ పెగలటానికీ, మార్మోగటానికీ మరీ ఎక్కువ కాలం పట్టదు.

 8. 19 kvrn 9:51 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  ఆంధ్రా అంటే చెరిపేస్తే చెరిగి పొయేది కాదు.

 9. 20 evadaite enti 10:16 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  తెల౦గాణ మొత్త౦(హైదరాబాదు తో సహా) కావాల౦టున్నది సమైఖ్యవాదులు(తెల౦గాణ,సీమ,కోస్తా౦ధ్ర).
  హైదరాబాదు లేకపోతే తెల౦గాణ వద్ద౦టున్నది తెల౦గాణ వేర్పాటువాదులు.

  ఎవరికి దుర్బుద్దో ఇట్లే అర్థమవుతో౦ది.

  “అన్నదమ్ముల్లా విడిపోదాం” – దీనితోనే ఆ నేతల స౦స్కృతి.

 10. 21 మంచు పల్లకీ 10:26 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  అలి గారు.. మీరు చెప్పిన అదే పెద్దమనిషి రేపు హైదరబాద్ నుంది దుకాణం ఎత్తేసి ఏ విజయవాడ లొనో పెట్టి ఉన్న 18 మంది తెలంగాణా మందిని పీకెస్తే మీకొచ్చేది ఎమిటి? అలాగే తెలంగాణా వచ్చినా ఆ పెద్దమనిషి హైదరాబద్ లొనే వుంటూ ఆ మంది తెలంగాణా మందిని పీకెస్తే మీరెమి చెయ్యగలరు.. ?? సొ తెలంగాణా రావడానికి దీనికి సంబందం లేదు.. మీతాతల పొలాలు లక్షల్లొకి ఇలా వచ్చాయి..

  • 22 epraveenkumar 11:14 సా. వద్ద డిసెంబర్ 10, 2009

   చాలా బాగా ఉన్న నిజం చెప్పారు.

  • 23 బుజ్జి 8:17 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

   ఎంత తెలివిగా మట్లాడుతున్నారండీ మంచుపల్లకీగారు..రేపటి సంగతి తర్వాత ఆలోచిద్దాం.. ఇవ్వాల్టి సంగతి ముందు మాట్లాడుదాం. మీరు ఆ 18 మంది గురించే మాట్లదుతున్నారు గానీ అసలు తెలంగాణా లో వాకిన్ పెట్టట్లేదు అన్న విషయం కన్వీనియంట్ గా మర్చీపోతున్నారు. మీ మాటల ప్రకారం మీరంతా సమైక్యవాదులు కదా.. తెలుగు వాళ్ళంతా ఒకటే కదా.. మరి తెలంగణా లో కూడా వాకిన్ పెట్టి ఇక్కడి వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా.. అందరిని ఆంధ్రా నుండే ఇంపోర్ట్ చేస్కోవటం ఎందుకు??
   అవును ఇది వివక్షే అని మీరు ఒక్క మాట అంటే నేను మీ సమైక్య వాదాన్ని నమ్మి ఉండేదాన్ని.. ప్రాంతీయతత్వం కొందరిలొ కొంచెం ఎక్కువ ఉంటుందిలే అని ఈ వివక్ష గురించి మర్చిపొయేదాన్ని.
   ఆ ఒక్కడికే ప్రాంతీయ తత్వం ఉంది, సమైక్య ఆంధ్ర గురించి మాట్లడే వీళ్ళు పాపం మంచి వాళ్ళే అనుకునేదాన్ని.. కానీ మీకా వివక్ష కనబడలేదు.. మీకు మేము కూడా తెలుగువాళ్ళమే అని అనిపించలేదు, అనిపించుంటే ఆ 18 ఎంత తక్కువో తెలిసి ఉండేది..

   ముందు మీరు సమైక్యాన్ని సరిగ్గా అర్థం చేస్కోండి, ఇలాంటి సమైక్యం మాకు వద్దు.. మీకు నిజమైన సమైక్యం గురించి తెలిసాక మాకు చెబ్దురు..

 11. 25 రవి చంద్ర 10:30 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  సమైక్య ఆంధ్ర కోసం మన నాయకులు చేపట్టిన ఉద్యమం ఆరంభ శూరత్వం కాకూడదని, వేర్పాటు వాదులు నోళ్ళు మూయించేదాకా కొనసాగాలాని మనసారా ప్రార్థిస్తున్నాను.ప్రత్యేక తెలంగాణా పేరుతో ఎలక్షన్లలో నిలిచి కనీసం యాభైశాతం సీట్లు కూడా గెలవలేక పోయిన తెరాస తెలంగాణా కోసం ప్రజల మద్ధతు ఉందంటే నమ్మడానికి ఇక్కడ ఎవరూ చెవిలో పూలు పెట్టుకోలేదు.

 12. 26 pedaraydu 10:36 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  Ali garu,

  కొ౦తమ౦ది తప్పుడు వారివల్ల మొత్త౦ జాతినే ని౦ది౦చడ౦ తగదు.

  ఉదాహరణకు కేసిఆర్ ని చూసి తెల౦గాణ వాళ్ళ౦తా తాగుబోతులు, తిరుగుబోతులు అనడ౦ ఎ౦తవరకు న్యాయ౦? అలాగే మీ యజమాని, అలా చేసినప్పుడు ప్రశ్ని౦చ౦డి. మీవ౦తు పాత్ర వచ్చినపుడు తగిన న్యాయ౦ చేయ౦డి. రాత్రికి రాత్రే అన్నీ మారిపోవు.

  కులాలు మతాలు ప్రా౦తాలవారీగా లెక్కలు వేసుకు౦టే కలిసి ఉ౦డలే౦. ఉదాహరణకు,మనకు ఒక ప్రధాని ఉన్నారు.25కు పైగా(కరెక్ట్గా లెక్కపెట్టలే౦) రాష్త్రాలున్నాయి. మొదట్లో చాలా వరకు ఉత్తర భారత౦ ను౦చే ప్రధాన మ౦త్రులయ్యారు. దానికి మన౦ దక్షిన భారత౦ వివక్షకు గురయి౦దని చెప్పవచ్చా? మన నేతలకూ సమయ౦ వచ్చి౦ది. ఇక ఉత్తరభారతానికే వస్తే ఉత్తరప్రదేశే ఎక్కువమ౦ది ప్రధానులను కలిగివు౦ది. దానికి ఏమిటి కారణ౦? మిగిలిన రాష్ట్రాలపై వివక్షా? అది వివక్ష కాదు. అవకాశ౦, అదృష్ట౦, సమర్థత.

  మీరన్నట్లు ఆ౦ధ్రా ఆధిక్యమే నిజమైతే, మన ముఖ్యమ౦త్రుల౦దరూ ఆ౦ధ్రా వాళ్ళే కావాలి. కాని అ౦దరికీ అవకాశ౦ వచ్చి౦ది కదా? అ౦తె౦దుకు తెల౦గాణ వాడికి ప్రధాని పదవే వచ్చి౦ది కదా? అప్పుడు మిగిలిన ఆ౦ధ్రులు కుతకుత ఉడికి పోలేదే? గర్వకారణ౦గానే భావి౦చామే?

  ప్రతిస౦ఘటనకూ విపరీతార్థాలు తీస్తూ పోతే, సమస్యలు పెరగడమే తప్ప తరగవు.

  అన్నదమ్ముల్లా విడిపోదా౦ అనే ఈ కొత్త నీతి, పిల్లల మనసులను ఎ౦తగా కలుషిత౦ చేస్తాయో ఊహి౦చలే౦. అన్నదమ్ములు విడిపోవాలి అనేది ఒక సహజ పరిణామమనే భావన వస్తే, ఆ కుటు౦బ౦ ఏమవుతు౦ది? రె౦డు మూడు తరాల్లో విచ్చిన్నమైపోతు౦ది.

 13. 28 pullayana 10:38 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  చాలా చక్కగా చెప్పారు. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

 14. 29 Surya 10:42 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  Looks like Center(Govt) has called KCR to Delhi to talk. Can you guess what it is for? With barely 10 MLAs from telangana, why would center call him to delhi to talk about details of telangana formation. My guess is KCR will get a full dress down. They will give him a big coating and warn him not to abuse people. They will also ask him how he will create separate andhra and rayalaseema, where will be their capitals etc.

 15. 30 పద్యాల విక్రమ్ 10:43 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  మీరన్నట్లు అ౦దరూ కలిసి ఉ౦టేనే మ౦చిది.

 16. 31 కత్తి మహేష్ కుమార్ 10:58 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  జై తెలంగాణా! జై గ్రేటర్ రాయలసీమ! జై ఉత్తరాంధ్రా! జై ఆంధ్రా!

  హాయిగా నాలుగు ముక్కలు చేసుకుందాం. ఎంతైనా హిందీతరువాత అంతసంఖ్యలో ఉండేది మన తెలుగు మాట్లాడేవాళ్ళే. మనమూ నాలుగు రాష్ట్రాలు మనవనుకుందాం.

 17. 34 వేణూ శ్రీకాంత్ 11:07 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  Well said అబ్రకదబ్ర గారు.
  పెదరాయుడు గారు మీ వివరణ కూడా చాలా బాగుంది.

 18. 35 రవి 11:19 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  ఎవడికి లేదు సంస్కృతి? నిజమే చెప్పారు. పేరుతో సహా, ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సీమ మాది. రాజస్థాన్ ఎడారిలోని బికనీర్ జిల్లా తర్వాత అత్యల్ప వర్షపాతం ఉన్న ఒకానొక జిల్లా ఇక్కడ ఉన్నది. తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక అలమటిస్తూ, నాయకుల చిన్న చూపుకూ, వెనుకబాటు తనానికి మారు పేరుగా నిలిచిన జిల్లా అనంతపురం ఈ సీమ లో ఉన్నది. అయితేనేం, ముగ్గురు రాష్ట్రపతులకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది. వారు రాష్ట్రపతులు కావడంలో ఈ నేల ప్రాధాన్యత తోసిపుచ్చలేనిది. వేర్పాటువాదమే అన్ని సమస్యలకు పరిష్కారం కాకూడదు.

  విద్యార్థులు కూడా సమైక్యాంధ్రకోసం ఉద్యమించడం ముదావహం.

 19. 36 Swapna 11:46 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  Chala baga chepparu…
  nijangane… ‘Anna dammula vidipovadam’ emito!!
  for those who support the division – this division is really a negetive thing… is it going to make any change in ur day to day life!!? konni selfish plotical leaders tappa… edo vidipoyam anna peru… taravata bollanni godavalu… tappa…

 20. 37 వెంకటరమణ 11:59 సా. వద్ద డిసెంబర్ 10, 2009

  కొందరు నీచ నాయకులు ఇక్కడి ప్రజలకు కోస్తా ప్రాంతంపై తమ స్వప్రయోజనాల కోసం ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఈ ద్వేషాన్ని ఎంత మొత్తుకున్నా మార్చటం మనవల్ల కాదని తెలిసినపుడు, వస్తే వచ్చిందిలే అని అప్పుడప్పుడు అనిపించేది. ఈ ద్వేషాన్ని ఎన్నిసార్లు పడాలి కోస్తా వాళ్ళు ?, ఒకవేళ తెలంగాణా వస్తే అప్పుడు ఎన్ని ముక్కలు చేయాలి.? ఒకవేళ నాలుగు ముక్కలు చేస్తే ఆ తర్వాత ఇతర జిల్లాల వాళ్ళు మా జిల్లా(రాజధాని) నుండి వెళ్ళిపొండి అంటే అప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఏంటి ? పైన టపాలో చెప్పినట్లు దేశంలో ఇతర రాష్ట్రాల సాధింపు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలు ఇస్తూ పోతారా ? ఏంటో కోస్తావాళ్ళకు సంస్కృతి లేనట్లు , అక్కడి ప్రజలు కష్టాలు పడనట్లు చెబుతారు. భూస్వాములకి, రాజకీయ నాయకులకి అప్పనంగా ఇచ్చిన భూములను తిరిగి పొందటానికి ఉద్యమించరు గానీ ప్రజలందరిపై ద్వేషాన్ని రగల్చటానికి ముందుంటారు ఈ నాయకులు.

 21. 38 Noojilla Srinivas 12:01 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  విశాలాంధ్ర మాతా! నమస్తే!
  విశ్వజన విజేతా!
  నిత్య సంపూజితా! నమస్తే!
  నిఖిల లోక వినుతా!

  శాతవాహనులు, గజపతులు,
  విజయనగర ఘన నరపతులు
  ఓరుగంటి కాకతి నుతులు
  నీ సేవలోనె మురిసేరమ్మా!

  గలగలా పారు గోదారీ
  కిలకిలమనేటి కృష్ణ సాగరీ
  మురిసి ఎగసేటి మంజీర ఝరి
  నీ పాదములనె కడిగేనమ్మా!

  నన్నయార్యుని తొలిపలుకులో
  అన్నమయ్య పద కవిత కులుకులో
  బమ్మెర పోతన భక్తి రచనలో
  నీ తెలుగు తేనెలొలికేనమ్మా!

  srinivas.noojilla@gmail.com

 22. 41 కత్తి మహేష్ కుమార్ 12:23 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, శాసనసభల్ని కేవలం శాసనాలు చెయ్యడానికి మాత్రం ఒదిలిపెట్టి పరిపాలనను వికేంద్రీకరణ చేసుంటే ఇన్ని ముక్కలు కావలసి వచ్చేవేకాదు. మూల సమస్యల్ని మనం పక్కనబెట్టి ఇంకా సెంటిమెంటుమీదే స్వారీ చేస్తున్నాం…కానిద్దాం ఇలాగే.

  • 42 జాతర్దామాల్ 10:27 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

   కరెక్ట్ గా చెప్పారండి . స్వయం పాలన అనేదే దీనికి సరైన మందు . కాని అధికార వికేంద్రికరణ జరిగితే … మేడం గారి చెప్పులు తుడవటానికి ఎవరు వుండరుగా …..

   ఎవరి అధికారం వారికిస్తే ఈ ఏడుపులు వుండవుగా … దీని అర్థం రాష్ట్రము ముక్కలుగా చేయటం కాదు , అధికారాన్ని ప్రతి గ్రామా స్థాయిలో కూడా వికేంద్రికరించటం .

   అది జరగాలంటే మందుకు , డబ్బుకు , నగ నట్రాలకు , కులం కోసం, మతం కోసం ఓట్లు వేసే ముండమోపి జనాలాలు కూడా అందరిని విమర్శించి ఆవేశం గా ఏదో హడావుడి తప్ప … అసలు మూల సమస్యకు మందు వేయటం లేదు …… 😦

 23. 43 ఏ రాయైతేనేమి 12:32 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  1) ఏ ప్రాంత ప్రజలైనా స్వార్ధపరులే. అందులోంచి వచ్చిన రాజకీయనాయకులు నీతిమంతులు కావలనుకోవడం అమాయకత్వం.
  2) తెలంగాణ వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకోసమే. వీధినపడి ధర్నాలు చేస్తున్న సమైక్యవాదులు చేసే పోరాటం కూడా, వారి స్వప్రయోజనాల కోసమే
  3) మా ప్రాంతం వెనకబడిందంటే, కాదు మాది మాదంటూ , ఇలా వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నామంటే, అసలు మనకు అభివృద్ధిని ఆకాంక్షించే అర్హత మనకుందా అసలు? (మాది విజయనగరం దగ్గర. ఎప్పుడూ మేము వేనకబడ్డాం అనే ఊహే రాలేదు. బయటికొచ్చిన తర్వాత వెనకబడిన ప్రాంతాల్లొ విజయనగరాన్ని కూడా చేర్చడం పరిపాటయిపోయింది. ఎందుకు ఈ పనికిరాని అభివృద్ధి.)
  4) “ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేది మా పార్టీ” అని ఈరోజు ప్రతీ పార్టీ చెప్తోంది. ఇలా ఆలోచించే వాళ్ళు అసలు లీడర్సు, పాలసీ మేకర్స్ ఎలా అవుతారు?
  5) ప్రజలు బద్దకస్థులు. ప్రస్తుత కాలంలో విద్య, రాజకీయాలు, ఈ రెండూ పనికిరాని కుళ్ళిపోయిన వ్యవస్థలు. ఉస్మానియా అయినా, ఆంధ్ర విశ్వవిద్యాలలయమైనా, మరేదైనా, అవినీతి పంకిలాలు. విద్యార్ధులతో సహా! ఎవడు సరిగ్గా చదివి పాసయ్యాడు? సరిగ్గా క్లాసులకి హాజరౌతాడు? హాస్టల్స్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అసలు లెక్కేదీ? ఈ వ్యవస్థలో ఎవెరు నీతిమంతులు, నిజాయితీపరులు? ఇందులోంచీ పుట్టిన ఉద్యమాలు ఎంత పవిత్రం. (అది ఓ.యూ తెలంగాణా అయినా, ఏ .యూ సమైక్యాంధ్రా అయినా).
  6) ప్రతీ మనిషి ప్రభుత్వాం మీదే ఆధారపడాలనే పరాధీన మనస్తత్వం. ఎవరో వస్తారని, ఎడో చేస్తారని, ఎదురు చూసి మోసపోవడమే ప్రస్తుత సమజ దుస్థితి.

  *** తెలంగాణా ఇవ్వకూడదనుకుంటే: ****
  నియంతృత్వ పద్ధతుల్లో (చైనా తియన్మాన్ స్క్వేర్ లాగ) దయా దాక్ష్యణ్యాలు లేకుండా ఉద్యమాన్ని అణచి వేయాలి. ఇలా ఏకాభిప్రాయాలూ, తోకాభిప్రాయాలు కుదిరేది కాదు. అసలు అసెంబ్లీలో బిల్లు ఎలా పాసవుతుంది? మెజారిటీ అంధ్రా, సీమ సభ్యులుంటే? ఇది తెలంగాణా ప్రజల్ని బహిరంగంగా మోసంచెయ్యడమే. అంతకన్నా, నిబద్ధమైన అభివృద్ధిహామీ తో ఈ విధానమే సరైనది.

  *** తెలంగాణా ఇవ్వలనుకుంటే ***
  తెలంగాణాతో పాటూ, మిగతా రాష్ట్రాలని కూడా ఇచ్చేయాలి. కాశ్మీరు కి కూడా స్వాతంత్ర్యం ప్రకటించాలి.

  *** మరి తెలంగాణా వస్తే? ***
  అభివృద్ధి చేసుకునే భారం ఇంక ప్రజలెన్నుకునే ప్రజలదే. తెలంగాణా ప్రజలు దీన్నొక సువర్ణావకాశం గా తీసుకొని, మాలాంటి భూకబ్జాకోరులని ఎన్నుకోకండి, మిమ్మల్ని పాలించే నాయకులని ఎన్నుకోండి. వనరులు లేవని బాధపడడంకాదు. వనరులని, ఉపాధి అవకాశాలని సృష్టించుకోవడానికి వినూత్నమార్గాలని ఎన్నుకోండి. మీతోటి తెలుగువారికి వీలైతే ఆదర్శంగా నిలవండి.

  అంధ్రా, సీమ ప్రజలు: తెలంగాణా వాళ్ళు మీరు మాకు అక్కర్లేదు మర్రో అంటూంటే, కాదు కూడదు అనడమే అసలు ఆత్మ వంచన. అసలు ఏ.పీ ముక్కలౌతోందంటే, నాకు మొదట చాలా బాధ కలిగింధి. పరిస్థితులని ఎదుర్కోలేమా. ఎవో కొన్ని అపోహలు, భయాలు, ముఖ్యంగా నీటి వనరుల సంగతి మీద ఉన్నాయి. గోదావరి, కృష్ణా జలాల్ని, తెలంగాణా వాల్లు బ్లాక్ చేసినా, సాగర జలాల్ని శుద్ధి చేసేంసుకు ఎందుకు ప్రయత్నించకూడాదు. విండ్, సోలార్ లాంటి ప్రాజెక్టులు కట్టి మనమే వాళ్ళఖి ఎగుమతి చేసే విధంగా, దీన్నే ఒక అవకాశంగా ఎందుకు భావించకూడాదు. తమ్ముడు, అన్నా ఎలాంటి సెంటీ భావనలనుంచి బయట పడండి. కానీ మానవ ధర్మాన్ని మరవకండి.

  ఇవి ఆశలు మాత్రమే. కానీ తెలంగాణా రావడం వలన పరిస్థితులలో (ఆశావహ) మార్పులేమి రాకపోవచ్చు. ఇప్పుడు ఏ.పీ మహరాష్ట్ర, కర్నాటకా తో నీళ్ళకోసం కొట్లాడుతుంది. తెలంగాణా వస్తే ఆ పని తెలంగాణా చేస్తుంది. అంధ్రా, రాయలసీమ, అదే పని తెలంగాణా తో చేస్తాయి. తెలంగాణాలో ఏమి అభివృద్ధి చెందినా చెందకపోయినా అవినీతి మాత్రం వృద్ధి చెందుతుంది.

  *** తెలంగాణా రాకపోతే? ***
  చిత్తశుద్ధితో, అన్ని వెనకబడిన ప్రాంతాల (ఒక్క తెలంగాణా మాత్రమే కాదు) కృషి చెయ్యాలి. భారీ ఎత్తున మంచి, సాగు నీటి వనరులని సృష్టించాలి. ఎడారి అరబ్ దేశాలు కూడా జీవనం సాగిస్తున్నాయి. మనకెందుకు సాధ్యం కాదూ. బానిస చదువులకి స్వస్థి చెప్పి, వృత్తి విద్యలల్ని ప్రోత్సహించాలి. పని కల్పించాలి. ఉద్యమ రూపు మారాలి. బస్సులు పగలగొట్టడం కాకుండా, శ్రమదానం చేసి ఒక పర్యాటక స్థలాన్ని అభివృద్ధి చెయ్యాండి (తాజ్ మహల్ ఎలా కట్టబడింది). ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటే అసలు కృత్తిమ వనరు అయిన డబ్బెందుకు? హైదరాబాదే సర్వస్వం అనుకోకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.

  పైన వ్యక్తపరచినవి ఆశలు మాత్రమే. వాస్తవం మాత్రం కలిసున్నా, విదిపోయినా, పెద్ద తేడా వుండదు. మనుషుల్లో మార్పు రానంత వరకూ, సంఘం, జీవనాల్లో మార్పు ఎలావస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ, అహాల్ని సంతృప్తి పరచుకోడానికి.

  ***
  ఏది ఏమైనా తిరోగమనానికి మరొకొన్ని కొత్త కారణల కోసం వెదుకులాట మొదలవుతుంది.
  ***

 24. 44 Ali 12:33 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  మంచు పల్లకీ Gaaru

  ఎ దుకాణుదారుడైనా తనకి లాభం ఉంటె ఉంటాడు లెదంటె వెల్లిపొతాడు,దాంట్లొ మీరు నేను ఏమి చెయ్యలెములెండి.నేను ఇక్కడ చెబుతున్నది వివక్ష గురించి.ఇన్నాల్లు ఈ వివక్ష గురించి ఏమి మాట్లాడకుండా.ఇప్పుడు వెర్పాటువాదం,ఉగ్రవాదం అంటే ఎలా?.You bow what you seed.మీతాతల పొలాలు లక్షల్లొకి ఇలా వచ్చాయి????????????సమజ్ గాలె

  Ali

 25. 45 Venkat 12:46 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  తెలుగోడు గారు ….
  బాగా రాసారు …….
  జై ఆంధ్ర ప్రదేశ్ …………….
  జై తెలుగు తల్లి …………..

 26. 46 మంచు పల్లకీ 12:59 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  ఎదొ రాద్దామని రాసి..మళ్ళి డిలీట్ చేసా..కానీ ఆ ముక్క వుండిపొయింది..చూసుకొలా.. never mind ali gaaru

 27. 47 Naresh 1:03 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  Hi guys,
  Now Every body shouting.. why did u support the those parties who are supporting the Telangana. Now same parties are telling they are against to Telangana. Why those leaders are resigning to their MLA post. How many will stand on resignation if their leaders ready to accept. What is your stand on those parties and Leaders. Still I am not talking discrimination of Telangana people on Telangana soil. First of all study about those problems of Telangana people. Then write big big posts ok.

 28. 48 Ali 1:14 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  Rayudu Gaaru

  కొ౦తమ౦ది తప్పుడు వారివల్ల మొత్త౦ జాతినే ని౦ది౦చడ౦ తగదు????.Sir నాకు ఆ ఉద్దేశం లేదు.నేను అంత పెద్ద మాట అనలేదు.ఆ౦ధ్రా ఆధిక్యమే నిజమైతే, మన ముఖ్యమ౦త్రుల౦దరూ ఆ౦ధ్రా వాళ్ళే కావాలి. కాని అ౦దరికీ అవకాశ౦ వచ్చి౦ది కదా????.ఆ౦ధ్రా ఆధిక్యతా?? ?నేను కేవలం ఉంద్యొగ కల్పనలొ వివక్ష గురించి ఒక చిన్నEx మాత్రమె చెప్పా.Raayudu గారు మీరు చాలా మంచి వారు అయూండొచ్చు కాని చాల మందికి హైదరాబాద్ తమకు కాకుండా పోతుందనే ఈ సమైక్య నినాదం తప్ప మరొటి కాదు
  Ali

  @ Mahesh Gaaru

  మీరు చెప్పింది correct.కాని అలా జరుగుతుంది అంటారా?

  Ali

 29. 50 Praveen Sarma 5:20 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  ప్రజలకి లేని సమైక్యవాదం రాజకీయ పార్టీల వాళ్ళకి ఉంది. మా పట్టణంలో ఒక్క వ్యాపారి కూడా స్వచ్చ్ఛందంగా షాపులు ముయ్యలేదు. కాంగ్రెస్, ABVP గూండాలు రోడ్ల మీదకి వచ్చిన తరువాతే షాపులు మూశారు. మేము హైదరాబాద్ కి 800 కిలో మీటర్లు దూరంలో బతుకుతున్నాం. హైదరాబాద్ మాకు చెందకుండాపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మాకు అవసరం లేని హైదరాబాద్ కోసం బంద్ పాటించమని మాకు బలవంతం చెయ్యడం ఆ రాజకీయ గూండాలకి ఏ రకం సంస్కారం?

  • 51 జాతర్దామాల్ 10:31 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

   మీకు ఎంత మంది చెప్పినా … అసలు రాసిన విషయానికి సంబంధం వుండే లా వ్యాఖ్య రాయటం ఎప్పుడు నేర్చుకొంటారు ?
   మీరు చెప్పేది ఏంటి ఇక్కడ చర్చ జరిగేది ఏంటి ?

   • 52 హైదరాబాదు - వద్దురాబాబు 12:44 సా. వద్ద డిసెంబర్ 11, 2009

    ప్రవీణ్ చెప్పిందాంట్లో తప్పేమీ లేదు. రాజీనామా మొదలెట్టిన లగడపాటి ఇత్యాదులు ఎన్ని ఆస్తులు సంపదించారో “హైడ్” లో. సగం సమస్య ఈ “హైడ్” దే. మా ఉత్తరాంధ్రా వాళ్ళకి, చీమ చిటుకూమన్నా, ప్రభుత్వపర మైన పనులకోసం, “హైడ్” చొట్టూ ప్రదక్షిణలు చెయ్యడం, తలకు మించిన భారం. ఈ హైదరాబాదు నస మాకొద్దు. కలిసుంటే, అధికార వికేంద్రీకరణ జరగాలి. ఈ హైదరాబాదు పిచ్చి తగ్గితే, అన్ని ప్రాంతాల వారికీ మంచిది.

   • 53 sri 1:30 సా. వద్ద డిసెంబర్ 11, 2009

    then lets ask for a seperate country as well since going to New Delhi all the way from south is a pain.

    Its a shame on how people show these silly issues and ask for the seperation instead of making the politicians accountable for their lootings and ignoring the developments.

    By the way, not just lagadapati, many telangana leaders including KCR have amassed crores. If you give telangana to KCR, then he will loot the Telangana similar to what YSR had done using the power. Remember. YSR also had initially in 2004 time before coming to power, during padayatra, had appeared sincere, but later he looted left and right and misused his power to the max. Same will repeat with KCR as well.

    Unless a person is truly spiritually enlightened and had realized the all pervading divinity or GOD, the person cannot be trusted blindly. If you trust, then, there is a high chance that they misuse their power by yielding to greed, lust and other negative aspects of life.

   • 54 ఏ రాయైతేనేమి 4:06 సా. వద్ద డిసెంబర్ 11, 2009

    @Sri: ah… very enlightened. You realize the difference between a state govt and the central govt. The very purpose of having a state-govt. is to ease administration & governing and give control to the locale related to the matters that affect them the most on a daily basis.

    You see how over-booked Godavari express is? Most of them travel to the capital, very routinely that too, for solving very simple issues. You know how pathetic GO’s response will be. It is a waste of time, energy and resources, all that can be used for other constructive purposed and can be avoided altogether, if the administration is decentralized.

    A new statehood achieves that (not without its own ramifications, of course). In this context, asking for local governance and asking for a separate country are not really the same. It is about how you want to set-up the governance hierarchy and how often a common man has to navigate thru this clutter. This clutter can be reduced with a separate state. And this is not the only solution. E-governance solves the issues. Our so-called IT gurus can help achieve that.

    By the way.. “Unless a person is truly spiritually …..blah… blah…..” I wrote similar moral shit above but they really dont work. The current educational & policy making institutions are like black-holes. They suck it all literally and figuratively. And whether Telangana is formed or not, things wont change a bit. We will fight for more reasons for newly created failures. That is the bottom line.
    That is the bottom line.

   • 55 sri 6:01 సా. వద్ద డిసెంబర్ 11, 2009

    I am not giving moral lecturs by saying “whom to trust”. All I was saying is that we have to be very careful when things related to the society are involved that are greater in the scope. wee cannot just go by some sentimental blackmailers like KCR or others and go by their words. After all, after may be after 20 years, KCR may die, but the ramification of the current division may be really bad especially considering the level of corruption prevailing in the govt functionary. Hence I said to not trust politicians blindly and only enlightened ones can be trusted blindly.

    Coming to the point of your example of godavari express getting overbooking, can we not have additional trains for godavari express? Can we not have an additional extensions setup that are extensions for the offices in the Hyderabad in those far places?

    Were all these options studied at all in the first place, were they got implemented at all?

    No. Nothing was done to alleviate the silly problems by our politicians so far and all that was done by politicians was to loot public money.

    Now, they want to loot with out any bounds like the way YS Jagan looted under his father YS Jagan. Rememb er, YSR also came with this sentimental blackmail like giving free current, doing padayatras and giving fake promises like I will give my life to common man etc. After that he and his son looted the state. We just do not want to give a blank check to incapable people like KCR to loot the divided states again.

   • 56 ఏ రాయైతేనేమి 7:48 సా. వద్ద డిసెంబర్ 11, 2009

    @Sri: I agree with you on all counts. If everyone thinks like you do, we wont have any problems at all. Do we?

    I am an andhrite as much as you are a telanganite. And I dont see any genuineness in the samaikyavadam in any of the protesters, excepting those little high-school kids who are just too happy to participate in these protests. {digression: I too shouted “nakka nadendla down down”, during Nadendla’s coup in 84, in my elementary school days. I know now that I knew nothing then.}

    All of them were shouting: “We want samaikya AP. It is a result of the sacrifices made by Sriramulu et al. etc..” but none of them made any mention of “telangana cause” or that they share their concerns. All those who are “moved” by the seema-kosta protests, I bet you soon will be disillusioned. You can call me a pessimist. I will be happy, if I am proved wrong.

    We, the debaters, take a stance on either side and argue, I mean debate. But what is the point. Will it actually matter to anyone. We often talk about ideals which dont reach the persons-on-ground anyway. More often than not, these debates distances hardliners on either side. They do more harm than what a muted-response could have done. So, I am looking at, from my own perspective, ways to yield to the other side.

    With these protests from both sides, we already lost “that” sense of togetherness. If possible, undo this damage.

 30. 57 T 5:38 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  pedaraydu gaaru..telangana vallu CM ayyindi telangana udyamam jariginappu…talking about PV and chenna reddy..inka eppudu telangana vallu avvaledu..also in Ali’s case why give advt in Andhra districts…one more example..we have Fluorine problem in our district…even though Nagarjunasagar dam is less than 100 KM and we dont get water from it for drinking or irrigation..why?…if you see first persion to resign is Lagadapati..why?..because he has investment in HYD..

 31. 58 sri 9:27 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  To all Telangana supporters,

  I have one simple question. On what basis can you trust KCR ang give him the state? He being the stale MP & Central Minister for 3 years, had done nothing to common man. Infact, he being an MP for so many years had not done anything to his credit.

  Tell me frankly if you trust KCR and his credibility. For that matter, can you trust any telangana politicians?

  I can show you that each MLA and MP in telengana had amassed more than 100 crores each but had done nothing major to their constituencies. How can you trust this kind of leaders and split the state.

  I WOULD SAY THAT AS A LEADER YOU FIRST DEMONSTRATE YOUR SINCERITY to serve people and then people will entrust you with the duty to rule you. Not by using the sentimental tactics like fast un to death.

  I am born and brought up in telangana and had not gone to any andhra area in my entire life for more than 2 times and each time I had only been in those andhra location for not more than 2 days. This tells that I am not talking due to my partiality to andhra area or andhra people.

  When you donot have the proper leader to lead you, then its better to maintain status-quo and try to get the things worked out smoothly.

  By the way, can KCR or for that matter, can any telangana supporter take oath in the name of GOD or write in bond paper and say that they will take responsibility and incur punishment if the telangana does not develop even after splitting? DO YOU HAVE GUTS?

  This issue is not a personal issue and is related to the national security issue. Naxalites and Terrorist issues will take over just like chattisgarh and other smaller states.

  It is tough to get co-ordination in govt agencies under one state govt machinery. Its very very tough to get co-ordination like police departments etc if the state gets split and this will encourage the anti social elements like terrorists and naxalites.

  Think properly before you even talk about this kind of issues since it is not just andhra or telangana or you or me. Its about the NATION of India.

  We donot again want to go under the foreigners rule like we had been under the muslima nd british occupiers in the past due to the petty fights of your kings out of jelousy and greed in the past.

  BE CAREFUL OF WHAT YOU TALK OR DO.

 32. 59 sri 10:48 ఉద. వద్ద డిసెంబర్ 11, 2009

  Dear T,

  Did anyone tell the telangana leaders not to solve the flourine problem? If you look at the telangana politicians of all parties, including KCR, they have amassed not less than Rs100 crores each.

  Did someone tell the telangana leaders to not solve the fluorine problem? Did someone tell the telangana leaders to amass their personal wealth of Rs100 crore each?

  The problem lies with the people like you and scores of others who blindly trust the politicians and listen to whatever they say and politicians make people a sentimental fool.

  Do you sincerely trust your politicians like KCR? Can you make a pledge in the name of GOD and take responsibility and say that you will be responsible if tomorrow after getting telangana and after 10 years from telangana formation, if the development doesnot happen, can you you take responsibility and do you accept whatever punishment you need to take for the failure of your politicians? Why do you need to take responsibility? Because, you are supporting the telangana state right?
  s, every one just talks and no one takes the responsibility.

  Look at the way even school children were dragged into the KCR fasting drama. Its a shame to drag students and children who donot have any family responsibilities or society responsibilities at all in to the KCR fast-unto-death drama.
  Oh. by the way, its the students and school children who are highly prone to sentimental and emotional blackmail. Hence KCR used them as his primary scape-goats in his drama.

 33. 60 Praveen Sarma 8:28 సా. వద్ద డిసెంబర్ 11, 2009

  రైతుల ఆత్మహత్యలూ, ఇరిగేషన్ ప్రోజెక్టులూ, రైల్వే ప్రోజెక్టులూ లాంటి విషయాలపై ఏకాభిప్రాయం లేని పార్టీలకి సమైక్యాంధ్ర పైనే ఏకాభిప్రాయం ఎందుకు కలిగింది? హైదరాబాద్ మీద మోజు వల్ల కాకపోతే మరేమిటి? రైల్వే ప్రోజెక్ట్ కోసం గానీ ఇరిగేషన్ ప్రోజెక్ట్ కోసం గానీ ఒక్క ఎమ్మెల్యే అయినా రాజీనామా చేశాడా? మరి సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు ఎందుకు చేసినట్టు?

 34. 61 DR.JD 4:04 ఉద. వద్ద డిసెంబర్ 14, 2009

  ప్రవీణ్ , మనవ సంబంధాలు ఎన్నో వుండగా నీకు వదిన మరిది సంబంధం మాత్రమె ఎందుకు రాసావ్ ?

 35. 62 మహేశ్వరి 6:02 సా. వద్ద డిసెంబర్ 17, 2009

  Very well said ! I came across these links and wanted to share with you. On what kind of leadership is our country going on ? Divide and rule was the motto of the british, is there any difference between them and our politicians, when the mass are tricked into dividing ourselves ?

  Please read these links below in your leisure and would like to read your opinion on it, as I admire your political analysis.

  http://docs.google.com/fileview?id=0B2B_N9wPxrujMmNlNDEwZTAtOTFlOS00MzRhLWFkNmEtZWRkZjE2ZTQ3MTVm&hl=en

  http://www.gurumurthy.net/articledisplay.pl?2008-04-29

  • 64 haridasarya 5:59 ఉద. వద్ద జనవరి 7, 2010

   talanganaki swatantram yeppudu vachindi?
   17 september 1948
   appudu andhra , rayalseema swatantra bharatlo unnai. variki swatantram 1947 august 15 naaadu vachindi.
   1948 mottam mana AP population 3 crores, now present population is 9 crores.
   JANAABHA LEKKANA CHOOSINAA 3 RASHTRAALU KAAVAALI.
   JAI RAYALSEEMA
   JAI ANDHRA
   JAI TELANGANA

 36. 66 Kishore .K 4:59 ఉద. వద్ద జనవరి 16, 2010

  Hi
  Article chaala bavundi.Rajakiya nayakula swardam chustunte gunde pagilipotundi.Nizam ga prajala ki emi kavalo cheppe vadu ledu.Nayakulu
  valla swardaniki himsani puttistaru prajala astulaki nashtam testaru.

  Evado oka naalugu rojulu nirahaaradeeksha cheste rashtrani ecche stitilo mana govt undi…siggu chetu …

 37. 67 telanganabidda 1:56 ఉద. వద్ద జనవరి 19, 2010

  @sri

  first tell me who is politian? and what is the meaning of politian?

 38. 68 రహంతుల్లా 9:56 సా. వద్ద జనవరి 22, 2010

  ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన ఈ తెలుగు ప్రాంతాలు ఇవిః
  ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
  కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
  మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
  చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
  తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
  పాండిచేరి -యానాం
  సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: