నాగరికథ

ఆరోప్రాణం టపాలో నా రెండో కథ ఎక్కడో పూడుకుపోయింది, వెలికి తీయటానికి తవ్వకాలు జరుగుతున్నాయి అని రాశాను. తాజా వార్త: తవ్వకాలు పూర్తయ్యాయి. రెండో కథ నాగరికథ ఈ రోజే వెలుగు చూసింది – ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో. ఆన్‌లైన్ చదవాలనుకునేవాళ్లు ఇక్కడ నొక్కండి; పిడిఫ్ డౌన్‌లోడ్ చేసుకుని చదవాలనుకునేవాళ్లు ఇక్కడ నొక్కండి. నా ఊహాత్మక కథా పరంపరలో ఇది ముచ్చటగా మూడోది. ఎలా ఉందో చెప్పండి. మీ స్పందనకి ముందస్తు ధన్యవాదాలు. నన్ను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎరగకపోయినా ఈ కథా ప్రచురణలో సాయపడ్డవారు కొందరున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు.

ఆసక్తిగల వారి కోసం – ఈ కథకి నేను రాసిన మొదటి డ్రాఫ్ట్ ఇక్కడుంది. అచ్చులో వేయటానికది మరీ పెద్దదైపోవటం వల్ల ప్రచురణకి అనువుగా 15% దాకా కుదించి తిరగరాయాల్సొచ్చింది. అంత తగ్గించినా కథనంలో గతుకులు రాకుండా, బిగి సడలకుండా చూడటం అసలు కథ రాయటం కన్నా కష్టమైపోయింది. ఫలితం బాగానే వచ్చిందని నా ఉద్దేశం. మీ ఉద్దేశమేంటో, చదివి చెప్పండి.

35 స్పందనలు to “నాగరికథ”


 1. 1 వేణు 9:26 సా. వద్ద నవంబర్ 21, 2009

  మీ నాగరి‘కథ’ చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి రాసిన మొదటి డ్రాఫ్ట్ కూడా చదివాను. ఎడిట్ చేసిన వెర్షన్ వల్ల పెద్దగా మిస్సయిందేమీ లేదనిపించింది. పైగా కథనానికి మరింత ‘బిగువు’ వచ్చింది.

  కథ చివరిదాకా ఉత్కంఠగా సాగింది. చివర్లో- ‘అది కాదు నేను ఆలోచిస్తుంది’ అనే వాక్యం వీరేంద్రనాథ్ శైలిని గుర్తు తెచ్చింది 🙂

 2. 2 Srava Vattikuti 11:05 సా. వద్ద నవంబర్ 21, 2009

  ఎంత వద్దనుకున్నా రికర్షన్, డెడ్లాక్ , రీడ్ ఓన్లీ అనే పదాలు గుర్తుకొచ్చాయి ఎందుకోమరి 🙂 కథ చాల బాగుంది మీ మొదటి రెండు (అంటే ఒకటి , మూడు కన్నా) ఇది చాల నచ్చింది నాకు !

 3. 3 సుజాత 12:29 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  అబ్రకదబ్ర,
  మీరేం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు?

  మీ మొదటి రెండు కథల కన్నా నిస్సందేహంగా ఇది బెటర్ గానూ, ఆసక్తి కరంగానూ, ఆలోచనలను రేపేదిగానూ ఉంది.

  మీరు చదివే సాహిత్యం కూడా ప్రత్యేకమైందనుకుంటాను!

 4. 4 రవి చంద్ర 1:19 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  కథ ఆద్యంతం ఆసక్తిగా చదివింపజేసేలా ఉంది. అభినందనలు. 🙂

 5. 5 వేణూశ్రీకాంత్ 2:13 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  కథ చదివాక సుజాత గారికి వచ్చిన అనుమానాలే నాకు కూడా వచ్చాయి అబ్రకదబ్ర గారు. ఇన్ని వివరాలతో సైన్సు హిస్టరీ పాఠాలు కలిపి చెబుతూ ఒక్క క్షణం కూడా బోరు కొట్టకుండా భలే నడిపించారు కథను. మిగిలిన రెండిటికంటే కూడా ఈ కథ చాలా బాగుంది.

  అన్నట్లు పత్రికలో ప్రచురింపబడినందుకు అభినందనలు.

 6. 6 కన్నగాడు 3:11 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  కథ సింప్లీ సూపర్బ్, మూడు కథల్లో రెండోదే విన్నర్, ఆంధ్రజ్యోతిలో బొమ్మ ఏవరు వేసారు? (అందులో ఆపిల్ టైమ్ మెషీన్ ఐకాన్ వాడారు). చివరగా పత్రికలో ప్రచురించబడ్డందుకు శుభాకాంక్షలు.

 7. 7 chinni 4:04 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  ఆద్యంతం చాల ఆసక్తికరంగా రాసారండీ కథ చదువుతున్నంతసేపు ఆ తాత గారితో ఉన్నట్లే అన్పించింది.చరిత్ర నాకిష్టం ఊహల్లో ఆరోజులను దర్శించే అలవాటు నాకుంది . మీ కథ చాల బాగుంది నడిపిన తీరు కూడా .

 8. 8 malathi 5:08 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  సైన్స్ ఫిక్షను నేనంతగా చదవను కానీ మీకథా, కథనం కూడా నాచేత చదివించేయి. మంచి ఊపుతో సాగింది కథ. అభినందనలు.

 9. 9 Deepam 5:45 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  Congratulations, you proved a point – Editing makes the story perfect. Our Telugu writers must understand it. You have a special style, pls do not go in the beaten track of Yendamoori or so called Sakshi Funday serial writers.

 10. 11 rmya 6:24 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  భలే భలే పారడాక్స్ 🙂 (గతం వర్తమానం భవిష్యత్తు అన్ని ఒకే సమయంలొ ఉన్నాయని కుడా అంటారు.)
  కథ కూడా భలే భలే గా ఉందండి. ఇంకా మరిన్ని సైన్స్ ఫిక్షన్ కథలు వ్రాయాలి మీరు.

  ఇంత మంచి కథ మాకిచ్చినందుకు మీకింకొ చిట్టికథ (పిట్ట కాదండి చిట్టి కథే!)
  టైమ్ ట్రావెల్ మన పెద్దాల సొమ్మేంకాదుగా అందుకే ఓ చిట్టికథన్నమాట.

  ఓ చిన్న కుర్రాడి(నోబితా) ఇంట్లో పాత సామాన్లు సర్దేటప్పుడు ఓ లెటర్ దొరుకు తుంది.(వాళ్ళ పూర్వీకుడు రాసింది) రాబోయే ఓ తారీఖున భూమిమీద ఏదో జరబోతోంది అప్పుడు దాన్నుండి మిమ్మల్ని రక్షించడానికి ఒకటి పెరట్లో పాతి పెట్టాను అని.
  ఆ కుర్రాడు తవ్వి చూద్దం అని ఉబలాట పడతాదు, వాళ్ళ అమ్మా నాన్నా చూడనివ్వరు. ఇప్పుడొద్దు ఆ టయాం కే చూద్దాం అని.
  ఆ కుర్రాడి దగ్గరో భవిష్యత్తు నుండి వచ్చిన రోబో క్యాట్ ఉంటుంది. దాన్నడుగుతాడు పూర్వికుల వాళ్ళ (తాత?) ఏం పాతి పెట్టాడొ చూపమని. ఓ టీవీ ముందు కూర్చోబెట్టి ఆ రోజు ఏం జరిగిందో చూస్తుంటారు.

  దాన్ని పాతిపెట్టిన ఆ వ్యక్తి అప్పుడు చిన్న పిల్లాడు భూమికి ఏదో జరగబోతుందని ఆసమయంలో గాలి ఉండదని అందరు అనుకోగా విని ట్యూబులో గాలి దాచి పెట్టాలనుకుంటాడు. అది తెలుసుకున్న అతని స్నేహితులు అన్ని ట్యూబులనూ కొనేసి అతడ్ని ఏదిపిస్తారు.
  అతడేడుస్తూ ఉంటే ఇక్కడ వర్తమానంలో టీవీ చూస్తున్న కుర్రాడు వూరుకోలేక ఓ స్విమ్మింగ్ ట్యూబ్ తీసుకుని పిల్లితోపాటుగా గతంలోకి వెళ్ళి ఆ పూర్వీకూడైన కుర్రాడికి అందేట్టు చేస్తాడు. ఆ తరువాత ఆ వచ్చేది హ్యేలీస్ కామెట్ అనేది తెలుసుకుని వర్తమానంలోకి వచ్చేస్తారు.

  అదేం ప్రమాదకరం కాదు కనుక అప్పుడు ఆ పూర్వీకుడు పాతిపెట్టింది తవ్వి చూస్తే పరవాలేదని పెరట్లోకి వచ్చి తవ్వి చూస్తారు..

  అప్పుడు బయట పడుతుంది వాళ్ళ పూర్వీకుడు పాతి పెట్టిన పాత పురాతనమైన ట్యూబ్… అది ఇందాక వీళ్ళిచ్చిన వీళ్ళ స్విమ్మ్మింగ్ ట్యూబే.

 11. 12 కొత్తపాళీ 9:07 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  పబ్లిక్ మీడియాలో ప్రచురణ అయినందుకు అభినందనలు.
  మనకి మనం బాగా రాస్తున్నామని ఎంత నమ్మకమున్నా, మన బ్లాగులో మిత్రులు ఎంత మెచ్చుకుంటున్నా, ఒక పబ్లిక్ మీడియం మన రచనకి వేదిక ఐనప్పుడూ ప్రత్యేకానందం కలుగుతుంది. తద్వారా వచ్చే కిక్కు మిమ్మల్ని మరిన్ని రచనలకి ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నా.
  రాయడం మాత్రం ఆపకండి.

 12. 13 ప్రవీణ్ గార్లపాటి 11:03 ఉద. వద్ద నవంబర్ 22, 2009

  చాలా బాగుంది కథ. ఇందులో ఉదహరించిన సంగతులు, థియరీలు మీరు కథ కోసంగా లేక సొంతంగా చేసిన రీసెర్చికి అద్దం పడుతున్నాయి. (ఒక కథకుడిలో నాకు బాగా నచ్చే విషయం)

  కథ అంతా రియలిస్టిగ్గా ఉండి ఒక్క విషయం మాత్రం ఎబ్బెట్టుగా అనిపించింది. తాత అతని స్నేహితుడు కాళ నాళికలో వెనక్కి తిరిగి వచ్చేస్తూ కూడా అక్కడ సింధు లోయలో జరుగుతున్న విషయాలను చూడడం. కాలంలో ప్రయాణిస్తూ అది చూడడం అనేది సాధ్యం కాని పని.

  అయితే ఇంత చక్కని కథనం వల్ల దానిని క్షమించెయ్యొచ్చు.

  మీరు మరిన్ని చక్కని కథలు వ్రాసి మాకు అందించాలి.

  అన్నట్టు కథ మొదటి వాక్యంలో టైమ్ మెషీన్ అని చూడగానే చివరగా ఇలాంటి ట్విస్టు ఉంటుందని అనిపించింది. నిజమయ్యింది 🙂

 13. 14 SRRao 1:43 సా. వద్ద నవంబర్ 22, 2009

  రచనకు శైలితో బాటు సామాజిక ప్రయోజనం కూడా ఉంటే ఎంత నిండుదనం వస్తుందో మీ కథ తెలియజేసింది. విజ్ఞాన విషయాలను ఆసక్తికరంగా మలిచిన మీ శైలి బావుంది. ప్రస్తుత సమాజానికి ఇలాంటి కథలు చాలా అవసరం. చాలా కాలానికి మంచి కథ చదివినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అభినందనలు.

 14. 16 నేస్తం 6:10 సా. వద్ద నవంబర్ 22, 2009

  అబ్బా ఏం రాసారండి.. చాలా బాగుంది.. సిందు లోయ నాగరికత గురించి కొంత తెలుసు..ఆ రోజుల్లో వారి డ్రైనేజ్ సిస్టేం ,స్నానల గది,అలాగే ఇళ్ళ నిర్మాణం ఈ రోజుల్లో వాళ్ళకు దీటుగా నిర్మించుకున్నారని చదివాను.. చాలా విషయాలు ఎంతో అద్బుతంగా కధలో వివరించారు ..భలే 🙂

 15. 17 sbmurali2007 11:26 సా. వద్ద నవంబర్ 22, 2009

  కథ చాలా బాగుంది.
  రామాయణంలొ పిడకల వేట-
  మీరెప్పుడైన బి.ఏ.ఆర్.సి. లో వున్నారా?
  (just a curious question)
  శారద

 16. 19 a2zdreams 2:40 సా. వద్ద నవంబర్ 23, 2009

  చివరి ట్విస్ట్ బాగుంది.

 17. 20 Srinivas 3:32 సా. వద్ద నవంబర్ 23, 2009

  మునుపటి కథల కంటే మెరుగ్గా ఉంది. లంకె బాగా కుదిరి కథనమూ చక్కగా కుదిరింది. అభినందనలు.
  ప్రవీణ్ లేవనెత్తిన అసంబద్ధత నాకూ గ్రహింపుకు వచ్చింది.

 18. 21 అబ్రకదబ్ర 4:56 సా. వద్ద నవంబర్ 23, 2009

  @శ్రావ్య,రవిచంద్ర,చిన్ని,మాలతి,దీపం,జ్యోతి,కొత్తపాళీ,ఎస్ఆర్‌రావు,తెరెసా,నేస్తం,తమిళన్,a2z:

  ధన్యవాదాలు.

  @వేణు:

  అనుకున్నాను, ఆ మాటెవరో ఒకరంటారని. నేనెక్కువగా చదివిన ఒకే తెలుగు రచయిత .. ప్రభావం తప్పేనా మరి?

  @సుజాత,వేణూశ్రీకాంత్:

  విద్యా నేపధ్యం – మద్రాసు లయోలా నుండి గణితంలో రెండు ‘గురు పట్టలు’, వాటికి ముందు కంప్యూటర్లలో ఓ ‘బ్రహ్మచారి పట్ట’.

  నేను చదివే సాహిత్యం .. అంత ప్రత్యేకమైనదేమీ కాదు నిజానికి. ఫిక్షన్ చదవటం తక్కువ. ఆత్మకథలూ, వేదాంతమూ, ‘విజయానికి తొంభయ్యారు మెట్లు’ తరహా సెల్ఫు హెల్పు బుక్సు జోలికి అస్సలు పోను. కవిత్వం అర్ధం చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి అదీ చదవను. చరిత్ర పఠనం మాత్రం చాలా ఎక్కువ. మత గ్రంధాలనైనా చరిత్ర కోణం నుండే అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తాను. అది కొందరికి నచ్చదనుకోండి – అది వాళ్ల సమస్య 🙂

  @కన్నగాడు:

  బొమ్మలో పొరపాటు పట్టేశారు 🙂 అయితే నేపధ్యంలో ‘ప్రీస్ట్ కింగ్’ వాడటం నాకు నచ్చింది.

  @rmya:

  ఏదో రష్యన్ కథలా ఉందే (కుర్రాడి పేరుని బట్టి).

  @ప్రవీణ్,శ్రీనివాస్:

  ఏమో నాకు తెలీదు, తాతయ్య అలాగే చెప్పాడు మరి 😉

  ఈ ప్రశ్న వస్తుందని ఊహించాను. ఎంత రియలిస్టిక్‌గా రాయాలనుకున్నా, కొన్ని లిబర్టీస్ తీసుకోక తప్పదు కదా.

  @sbmurali2007:

  బిఎఆర్‌సి పేరు వినటమే తప్ప ఎప్పుడూ చూసెరగనండీ.

 19. 22 Srinivas 6:06 సా. వద్ద నవంబర్ 23, 2009

  మర్చిపోయింది మరొకటి – తప్పు మీదో, ఎడిటర్ దో – causality క్యాజువాలిటీ గా రూపాంతరం చెందడం.
  ఈ కాలయాత్రతో ఇంకో పెద్ద చిక్కు ఉంది కానీ అది మిగతా పాఠకులకి అభ్యాసం కింద వదిలేద్దాం.
  ఇక చారిత్రాత్మక కథ ఒకటి మొదలెట్టండి.

  • 23 అబ్రకదబ్ర 6:12 సా. వద్ద నవంబర్ 23, 2009

   అది నా పొరపాటే – ఎడిటర్‌ది కాదు.

   నా మొదటి కథ ‘గడియారం’లో కూడా నేనీ cause & effect తోనే ప్రయోగం చేశాను. టైమ్ మెషీన్ ప్రస్తావన లేకపోయినా, ఆ కథలో అంతర్లీనంగా ఉన్నదీ కాజాలిటీ పారడాక్సే.

 20. 24 mohanrazz 10:31 సా. వద్ద నవంబర్ 23, 2009

  అబ్రకదబ్ర గారూ – ముందుగా మీకు రెండు కారణాలకి అభినందనలు. మొదటిది- మీ కథ ప్రచురించబడినందుకు.

  ఇక రెండోది- పేరెంట్స్ ని వృద్దాశ్రమం లో చేర్పించడం, కాన్వెంట్ చదువులవల్ల పిల్లలు కోల్పోతున్న బాల్యం, ఇంటివసారాలోని చెట్టు కొట్టేయడం, మంచివాళ్ళకి మంచే జరగడం- ఇవి కాకుండా వేరే ఇతివృత్తం తో తెలుగు పత్రిక లో ఒక తెలుగు కథ చదివి ఎన్నేళ్ళయిందో గుర్తు రావట్లేదు. ఆ మొనాటనీ ని బ్రేక్ చేసిన కథ వ్రాసినందు మీకు అభినందనలు.

  చిన్నపుడెపుడో మహీధర నళినీమోహన్ సైన్స్ కథలు చదివినప్పటి అనుభూతిని నాకు రి-క్రియేట్ చేసారు. keep up the good work

 21. 25 వెంకటరమణ 11:10 సా. వద్ద నవంబర్ 23, 2009

  కధనం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆసాంతం చదివింపచేసేట్లుగా సాగింది. కొత్తదనంతో కూడిన కధ.అభినందనలు. వ్రాస్తూ ఉండండి.

 22. 26 సుజాత 5:40 ఉద. వద్ద నవంబర్ 24, 2009

  అబ్రకదబ్ర,
  ఆత్మలూ, వేదాంతమూ, విజయానికి తొంభయ్యారు మెట్లు(ఎవరో కట్టినవి) వంటి వాటి జోలికిపోక పోవడం చాలా సంతోషాన్ని కల్గించే విషయం!మత గ్రంథాలను కూడా చరిత్ర కోణం నుంచి అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం కూడా అభినందనీయం! అది ఎవరికో ఎందుకు నచ్చాలసలు?

  మోహన్రాజ్,
  మీరు కోట్ చేసిన సబ్జెక్టులతో కథలు ప్రతి ఆదివారం ఈనాడు లో చదువుతాంగా! ఇంకా ఇక్కడ కూడా ఎందుకూ? 🙂

 23. 27 అబ్రకదబ్ర 7:15 సా. వద్ద నవంబర్ 24, 2009

  @వెంకటరమణ:

  ధన్యవాదాలు.

  @మోహన్రాజ్:

  >> “ఇంటివసారాలోని చెట్టు కొట్టేయడం”

  నేను కష్టపడి ఓ పేద్ద టపా ద్వారా చెప్పటానికి తిప్పలు పడ్డ విషయాన్ని ఒకే ముక్కలో తూటాలా పేల్చి తేల్చి పారేశావ్. ఆ చెప్పిన పద్ధతీ ఎవర్నీ నొప్పించకుండా, పైపెచ్చు నవ్వు తెప్పించేదిగా ఉంది. Dude .. I must admit, you’ve got style 🙂

  @సుజాత:

  మొన్న ఆదివారం ‘ఈనాడు’ కథ చదివారా?

 24. 28 కామేశ్వర రావు 12:27 సా. వద్ద నవంబర్ 25, 2009

  కథ బావుంది. ముఖ్యంగా అంత థియరీని దట్టించి కూడా కథ పట్టుగా సాగించడం కష్టమైన పని! ఇలా మీ రచనాశైలిని పదునుపెట్టుకుంటూ వెళితే మీనుంచి ఒక మాంచి సైఫై నవలని ఆశించవచ్చు.

 25. 29 Shiva 9:20 సా. వద్ద నవంబర్ 25, 2009

  Hi,
  I think you got influenced by Micheo Kaku and the latest program in NG. His lecture came to my mind as flashes as I was reading through your story. It is a fantastic Lecture and same can be said about his book. Please have a look at this
  http://forum-network.org/lecture/michio-kaku-physics-impossible

  Thanks,
  Shiva

 26. 31 saamaanyudu 7:39 ఉద. వద్ద నవంబర్ 27, 2009

  అబినందనలు..మంచి కథనందించినందుకు..

 27. 32 jaya 10:27 ఉద. వద్ద నవంబర్ 28, 2009

  ఈ కథ ఆంధ్రజ్యోతి లో వొచ్చినప్పుడే నేను చదివానండి. కాని ఈ రచయిత మీరని నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడే అనిపించింది. ఇవి సామాన్యమైన ఆలోచనలు కావు. మీరు ఒక శాస్త్రవేత్త అని మాత్రం నాకు తెలుసు. మీ తాతగారి పాత్ర నేను మీలో చూస్తున్నాను. మీరు 2012 గురించి రాస్తే చదవాలని ఉంది.

 28. 33 rayraj 3:12 ఉద. వద్ద నవంబర్ 30, 2009

  కథ సింప్లీ సూపర్బ్!ప్రింటడ్ వెర్షనే బాగా వచ్చింది.చెప్పాలనుకున్నవన్నీ కామెంట్లలో అందరూ టచ్ చేశారు.(ముఖ్యంగా మోహాన్రాజ్ “వసారాలో చెట్టుకొట్టేయడం” – బాగా నవ్వించింది)

  మీ ఊహాజనిత కథా పరంపరలో ఇదే ’ఫస్టు’ నిలుస్తుంది.దీన్నే మూడోదిగా మాకు పరిచయం చెయ్యటం మాత్రం చాలా బావుంది.ఇమేజ్‌‌కి బాగా తోడ్పడుతుంది :p ’ఇందు’లో కూడా మంచి టెంపో బిళ్డ్ చేస్తారే! :)(’కథ తవ్వకాల్లో ఉంది’ అని అనటం కూడా ..:))

  “ఊహాజనిత” అన్నప్పుడే సైన్స్ ఫిక్షన్‍‌ని ట్రై చేస్తారనుకున్నాను.ఐతే ’గడియారం’లో కూడా “cause & effect తోనే ప్రయోగం చేశారన్నది ఎక్స్‌ప్లిసిట్‌గా అనుకోలేకపోయాను.(మరో మాట, cause & effect, వేదాంతంలో భాగమేనే! ఎందుకలా తప్పించుకో జూస్తున్నారు? :))

  బైదవే, తాతగారు చెప్పిన “ఒకటి గుర్తుపెట్టుకో….అభివృద్ధికి ఆలోచనే విత్తనం” అన్న వాక్యం చాలా నచ్చిందండి. 🙂

  మరో పిడకల వేట: “..క్రేన్లూ ప్రొక్లైనర్లూ లాంటివి లేకుండా దాన్ని కడుతున్న వాళ్ళ నైపుణ్యానికి ఆశ్చర్యపోయాం” – ఒకే!అవి లేకుండా ఎలా కడుతున్నారో మనవడు అడిగి తెలుసుకోడే!?

  సైన్సు వివరాలు:
  నేను గమనిస్తూ వచ్చిన ఓ విషయం,మీ కథ విషయంలోనూ నిజమైంది. మీరు సింగ్యులారిటీలు,డార్క్ మాటర్లూ నిజానికి సరిగా వివరించలేదు. ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకపోవడం కూడా ఒకోసారి అవసరం.ఉదా: చాలా ఇంగ్లీషు సినిమాల్లో పాత్రలు,కొత్త కొత్త గాడ్జెట్స్ వాడేస్తుంటాయి.నిజానికి అలాంటి గాడ్జెట్స్ ఉన్నాయా, సాధ్యమా అనేవాటి గురించి చర్చలుండవు.అదే మన సినిమాల్లో ఏదైనా ఓ కొత్త విషయాన్ని చూపించదల్చుకుంటే,దాని గురించి చాలా “బోధన” మనం సినిమాలోనే చేస్తుంటాం. ప్రేక్షకుడికి ఈ విషయం తెలీదు కదా అనో ఏమో! అది అనవసరం. అలాగే ప్లాట్‌ని వివరించే ’మోర్టార్’ ఉదాహరణనీ,మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదేమో! ’కథకి అవసరమైన మెటీరియల్ వరకే బోధించాలి.మిగితావి ఊరికినే వాడెయ్యాలి’ అని అనుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో అదే కరెక్టనిపిస్తోంది.మీ కథలోనూ అదే రైటైయ్యిందని అనిపిస్తోంది.కావల్సిన “గ్రాండ్ ఫాదర్ పారడాక్స్”ని సరిగ్గా ఎత్తుకున్నారు.సూపర్బ్! అదే చాలు అనుకుంటున్నాను.(అఫ్‌కోర్సు నేను రాస్తే,బోళ్డు ’బోధిస్తే’ తప్పు పట్టకండి.ఉద్దేశ్యమే బోధనయినప్పుడు తప్పులేదుగా!)

  బొమ్మలు:ఈ బొమ్మలతో మీరు తృప్తిచెందారా? (పిడియఫ్ లో చూశాను)

  కాపీ : మీరేదన్నా చెయ్యండి.ఖచ్చితంగా అది ఏదో ఒక వెస్టర్న్ వర్క్ యొక్క కాపీ! మీరు సొంతగా రాయలేరు.మీకంటే ఎక్కువ చదివిన వారు,తెలివిగలవారు మీ సృజన ఒరిజినల్ కాదని ప్రూవ్ చెయ్యగలరు.ఆ ఆలోచన ఎక్కడ పుట్టిందో వాళ్ళకి తెలుసు.ముఖ్యంగా తెలుగువారిగా పుట్టినందుకు ఇది మీకు కొంచెం ఎక్కువ దౌర్భాగ్యం.(అర్ధం అయ్యిందనుకుంటాను)

  ఇంతకీ మన ప్రియతమ మితృలేరి!?

 29. 34 అబ్రకదబ్ర 12:49 సా. వద్ద నవంబర్ 30, 2009

  @కామేశ్వర్రావు,సామాన్యుడు,జయ:

  ధన్యవాదాలు.

  @రేరాజ్:

  చాలా పెద్ద వ్యాఖ్య. తీరిగ్గా సమాధానమియ్యాల్సిన ప్రశ్నలు కొన్నున్నాయి. ‘మనవడు అడిగి తెలుసుకోకపోవటం’ వరకూ ఇప్పుడే చెబుతా: మనవడు అడిగినా ఒక్క ముక్కలో సమాధానం చెప్పటం కుదరదు, ప్లస్ అవెలా కడుతున్నారనేది కథకి అనవసరం కూడా 🙂

  ‘కొన్నిట్ని అంత వివరంగా రాయటం అవసరమా’ అన్నది మంచి ప్రశ్న. సమాధానం, పైనే అన్నట్లు, వేరే టపాలో చెబుతా.

 30. 35 గీతాచార్య 10:13 ఉద. వద్ద డిసెంబర్ 4, 2009

  Nice and racy narration. Most of my doubts, and questions are asked by others. 😀

  One thing is sure.m hole concept is not established well. I’l write elaborately later.

  CONGRATS for this published material.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: